మమ్ముట్టి ,మోహన్ లాల్ సినిమాలపై కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
on Jul 2, 2025
నాలుగున్నర దశాబ్దాల క్రితం నుంచే పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా చాటుతు వస్తున్నాడు మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టి'(Mammotty). కెరీర్ లో ఎక్కువ శాతం విజయాల్ని నమోదు చేసిన మమ్ముట్టి, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 'బజూక' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'కాలం కావల్' అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
రీసెంట్ గా కేరళ(Kerala)కి చెందిన మహారాజా కళాశాల యాజమాన్యం బిఏ హిస్టరీలో మమ్ముట్టి కెరీర్ పై పాఠ్యాంశం అందించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిఏ ద్వితీయ సంవత్సరం చదివే స్టూడెంట్స్ కి 'హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా' పేరుతో ఒక చాప్టర్ ని కూడా తీసుకొచ్చింది. ఇందులో మమ్ముట్టి తన సినీ కెరీర్ లో ఎదుర్కున్న సవాళ్లు, అందుకున్న పురస్కారాల గురించి పొందుపరచడం జరిగింది. మమ్ముట్టి 'మహారాజ' కాలేజి పూర్వ విద్యార్థి కావడం విశేషం. మోహన్ లాల్(MOhanlal)జయన్, షీలా, ప్రేమ్ నాజిర్ వంటి వారి గురించి కూడా 'హిస్టరీ ఆఫ్ మలయాళం' చాప్టర్ లో చర్చిండం జరిగింది
1971 లో సినీ రంగ ప్రవేశం చేసిన మమ్ముట్టి ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి సుమారు 430 చిత్రాలకి పైగానే చేసాడు. వీటిల్లో ఎక్కువ భాగం విజయాల్ని నమోదు చేసినవే. ఇటీవల మమ్మూట్టి అనారోగ్యం భారిన పడినట్టుగా వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. కానీ అవన్నీ ఒట్టి వదంతులే అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఈ టైంలో మమ్ముట్టి గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చడం అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. మమ్ముట్టి తనయుడు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
