
`ఖిలాడి`తో హ్యాట్రిక్ దక్కేనా?
`జనతా గ్యారేజ్`(2016)తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. యంగ్ టైగర్ యన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సదరు యాక్షన్ డ్రామాలో మోహన్ లాల్ కి కొడుకు పాత్రలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో కనిపించాడు ఉన్ని. ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో ఆపై లేడీ సూపర్ స్టార్ అనుష్క టైటిల్ రోల్ లో నటించిన `భాగమతి`(2018)లో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసే అవకాశం అందిపుచ్చుకున్నాడు ఉన్ని ముకుందన్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. టాలీవుడ్ లో ఉన్నికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.

`థాంక్ యూ`లో సామ్ స్పెషల్ రోల్?
`మనం` తరువాత వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో యువ సామ్రాట్ నాగచైతన్య చేస్తున్న చిత్రం `థాంక్ యూ`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది...

`ప్రేమమ్` హీరోతో `లవ్ లీ` భామ
`లవ్ లీ` (2012) చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ శాన్వి శ్రీవాస్తవ. ఆపై `అడ్డా`, `రౌడీ`, `ప్యార్ మే పడిపోయానే` వంటి తెలుగు సినిమాల్లో కనిపించిన శాన్వి.. క్రమంగా కన్నడ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. పలు క్రేజీ ప్రాజెక్టులలో నటించి శాండల్ వుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

చరణ్, రకుల్.. ముచ్చటగా మూడోసారి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కనువిందు చేసిన నాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. `బ్రూస్ లీ`, `ధ్రువ`.. ఇలా చరణ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటించింది. వీటిలో `బ్రూస్ లీ` నిరాశపరచగా.. `ధ్రువ` ఓకే అనిపించుకుంది. కట్ చేస్తే.. దాదాపు ఐదేళ్ళ విరామం అనంతరం ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారని టాక్.

'అరణ్య' నన్ను పూర్తి మనిషిగా మార్చింది: రానా
"నేను చేసిన ప్రతి సినిమా నుంచీ ఏదోక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది. అడవిలో ఉండటం.. ఏనుగులతో గడపడం వల్ల మనుషులతో నా రిలేషన్ మరింత బలపడింది." అని చెప్పారు రానా దగ్గుబాటి. ఆయన టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'అరణ్య'. విష్ణు విశాల్, శ్రియ పిల్గావోంకర్, జోయా హుస్సేన్ ముఖ్య పాత్రదారులు.

విజయ్ చిత్రానికి శివకార్తికేయన్ సాహిత్యం
కోలీవుడ్ స్టార్ విజయ్ - టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జంటగా పూజా హెగ్డే దర్శనమివ్వనుందని టాక్.

`హిట్ ` సీక్వెల్ లో రవితేజ హీరోయిన్?
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన `హిట్` చిత్రం.. గత ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలై సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ద్వారా శైలేశ్ కొలను దర్శకుడిగా పరిచయమయ్యాడు.

స్ట్రెస్ నుంచి బయటపడేసే టానిక్.. సాటిలేని 'ఫన్ బకెట్'!
'ఫన్ బకెట్' ఒక బ్రాండ్.. తెలుగు యూట్యూబ్ చానళ్లకు పయనీర్ అయిన తెలుగువన్‌లో అర్ధ దశాబ్దం పై నుంచీ వ్యూయర్స్‌ను అలరిస్తూ వస్తోన్న నవ్వుల టానిక్! టీవీ చానళ్లలో ఎన్ని కామెడీ షోలు వచ్చినా, వస్తున్నా వాటన్నింటికీ పయనీర్ అయిన ఫన్ బకెట్ ఫన్ బకెట్టే! వారానికి ఒకటి చొప్పున ఇప్పటికి 278 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న బ్లాక్‌బస్టర్ కామెడీ సిరీస్ మొత్త రన్ టైమ్ కలిపితే 40 గంటలు దాటింది.

ఉగాదికి ఫిక్సైన మాస్ మహారాజా?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం `ఖిలాడి` చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని మే 28న విడుదల చేయనున్నారు.

ఉత్తరాంధ్రలో 'అరవింద సమేత'ను దాటేసిన 'ఉప్పెన'!
పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోటే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఏ స్టార్ ఫస్ట్ ఫిల్మ్‌కూ రాని కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆఖరుకి ఇప్పటికీ పలువురు స్టార్లకు సాధ్యంకాని రూ. 50 కోట్ల షేర్ మార్క్‌కు అంగుళం దూరంలో ఉన్నాడు. మూడో వారంలోనూ 'ఉప్పెన' కలెక్షన్లు స్టడీగా ఉండటం, రంగంలో ఉన్న మిగతా అన్ని సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు వస్తుండటం విశేషం.

ఆ రీమేక్ పైనే ఆశలు పెట్టుకున్న `తార`
`స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2`తో బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది తారా సుతారియా. 2012 బ్లాక్ బస్టర్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తరువాత వచ్చిన `మార్జావాన్` కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేసింది. దీంతో.. తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది తార. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి `తడప్` కాగా.. మరొకటి `ఏక్ విలన్ రిటర్న్స్`. వీటిలో `తడప్` కోసం కెరీర్ లో ఫస్ట్ టైమ్ సోలో హీరోయిన్ గా నటించింది తార.

బాబా భాస్కర్ని ఉతికేసిన యానీ మాస్టర్!
ఈ ఆదివారం స్టార్ మా వినోదాల విందుతో వీక్షకుల్ని అలరించబోతోంది. నవ్వుల వర్షం కురిపిస్తూ ఆద్యంతం ఎంటర్టైన్ చేయబోతోంది. సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'స్టార్ట్ మ్యూజిక్'. ఇటీవలే సుమతో పునః ప్రారంభం అయిన ఈ షో ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఆకట్టుకుంటోంది. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారం అవుతోంది.

ఇటలీ నుంచి స్పోర్ట్స్ కారు తెప్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్!
టాలీవుడ్ స్టార్లలో చాలామంది ఖరీదైన లగ్జరీ కార్లపై ఆసక్తి చూపిస్తుంటారు. మామూలు కార్లలో లేని సౌకర్యాలు ఉన్న కార్లు వాళ్ల గ్యారేజీలలో కనిపిస్తుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ సైతం అందుకు మినహాయింపు కాదు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లగ్జరీ కార్లను ఓ చూపు చూస్తుంటాడు తారక్. లేటెస్ట్గా ఆయన దృష్టి 'లంబోర్గిని ఉరుస్' మోడల్‌పై పడింది.

రాజశేఖర్ తో `జార్జి రెడ్డి` భామ?
`జార్జి రెడ్డి` చిత్రంతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముస్కాన్ ఖుబ్ చాందిని. మరీ ముఖ్యంగా.. ఆమె నర్తించిన `బుల్లెట్` సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. `జార్జి రెడ్డి` తరువాత అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ `లక్ష్మి`లో కీలక పాత్రలో మెరిసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

'సీటీమార్' టైటిల్ సాంగ్‌కు ఫస్ట్ విజిల్ వేసిన సమంత!
గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న 'సీటీమార్' టైటిల్ సాంగ్ రిలీజైంది. తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. టైటిల్ సాంగ్‌ను బుధవారం ఉదయం సమంత అక్కినేని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ చేశారు. దాంతో పాటు, "#SeetimaarrTitleSong Woo hoo.. first whistle for this awesome song.. wishing the team the very best." అంటూ ట్వీట్ చేశారు.

నా కెరీర్లో 'బ్యాక్ డోర్' ఓ మైల్ స్టోన్ మూవీ అవుతుంది: పూర్ణ
పూర్ణ నాయికగా నటించిన చిత్రం 'బ్యాక్ డోర్' టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్‌లో కన్నుల పండుగగా జరిగింది. కర్రి బాలాజీ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఆర్కిడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ త్రిపురాన చిత్ర కథానాయకుడు.

అప్పుడు `గోపాల గోపాల`.. ఇప్పుడు `దృశ్యం 2`..
యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. మాలీవుడ్ సెన్సేషన్ `దృశ్యం 2`కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రం రూపంలో ఆ అవకాశం దక్కింది. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో తనకు ఇది రెండో సినిమా కావడం విశేషం.

బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ మారుతున్నారా?
బిగ్ బాస్ సీజన్ 4 కోవిడ్ కారణంగా ఆలస్యం కావడంతో సీజన్ 5ని ముందుగానే స్టార్ట్ చేయాలని స్టార్ మా చానల్ నిర్వాహకులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. సీజన్ 4 కోవిడ్ తీవ్రత కొంత తగ్గిన తరువాత ప్రారంభించినా వీక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో సీజన్ 5ని మరిన్ని ప్రత్యేకతలతో ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

ఫస్ట్ వీక్ నితిన్ 'చెక్' కలెక్షన్లు చాలా వీక్!
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' సినిమా ఫిబ్రవరి 26న విడుదలై, తొలిరోజే బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు కలిగించడం దాదాపు ఖాయమైంది. రూ. 14.50 కోట్లు వస్తే బ్రేకీవన్ అవుతుందనంగా, తొలివారం ఈ సినిమాకు వచ్చిన షేర్ రూ. 8 కోట్లు మాత్రమే! అంటే 55 శాతమే రికవర్ అయ్యింది.

బన్నీ చిత్రంలో టొవినో థామస్?
వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న మలయాళ కథానాయకుల్లో టొవినో థామస్ ఒకరు. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయిన `ఫోరెన్సిక్`, `మాయానది`, `వ్యూహం`, `లూకా` వంటి మలయాళ సినిమాల అనువాదాలతో ఇక్కడివారికి కూడా చేరువయ్యారు టొవినో.

మోహన్ లాల్ వర్సెస్ ఫాహద్ ఫాజిల్
2021 మే 13.. మలయాళ చిత్ర సీమలో ఆసక్తికరమైన పోటీకి వేదిక కానుంది. ఆ రోజు.. వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు స్టార్స్ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, వెర్సటైల్ స్టార్ ఫాహద్ ఫాజిల్.

'క్లైమాక్స్' మూవీ రివ్యూ
రాజేంద్రప్రసాద్‌తో ఇదివరకు 'డ్రీమ్' (2012) అనే అవార్డులు పొందిన చిత్రాన్ని డైరెక్ట్ చేసిన భవానీ శంకర్ మళ్లీ ఇన్నాళ్లకు ఆయనతోటే తీసిన సినిమా 'క్లైమాక్స్'. కామెడీ హీరోగా లబ్ధప్రతిష్ఠుడైన రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక చాలా బిజీ అయ్యారు. ఆయన 'క్లైమాక్స్'లో మరో విలక్షణ పాత్రతో మనముందుకు వచ్చారు. టీజర్, ట్రైలర్లో కనిపించిన రాజేంద్రప్రసాద్ రూపం ఇప్పటికే సినీ ప్రియుల్ని ఆకర్షించింది.

ప్రశాంత్ నీల్.. ఈ సారి తొమ్మిది నెలలే!
రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే దర్శకుల్లో శాండిల్ వుడ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ ఒకరు. అప్పుడెప్పుడో 2014లో `ఉగ్రం` చిత్రాన్ని తన ఫస్ట్ వెంచర్ గా తెరకెక్కించిన ప్రశాంత్.. ఆపై నాలుగున్నరేళ్ళకు పైగా గ్యాప్ తో 2018లో `కేజీఎఫ్ ఛాప్టర్ 1`తో పలకరించారు. భారీ విరామంతో వచ్చినప్పటికీ.. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ సెన్సేషన్స్ గా నిలిచాయి.

యశ్.. వన్ మోర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్
`కేజీఎఫ్`తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కన్నడ కథానాయకుడు యశ్. నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాలూకు రెండో భాగం `కేజీఎఫ్ ఛాప్టర్ 2` జూలై 16న థియేటర్స్ లో సందడి చేయనుంది. `ఛాప్టర్ 1`కి మించిన హీరోయిజం `ఛాప్టర్ 2`లో ఉండబోతుందంటూ టీజర్ లో స్పష్టం కావడంతో.. యశ్ పై మరింత అంచనాలు పెరిగాయి.

లక్కీ స్టార్స్ తోనే జట్టుకడుతున్న మీనా
90ల్లో తెలుగునాట తిరుగులేని కథానాయికగా రాణించారు అభినేత్రి మీనా. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ అదే హవాను సాగించారు. కట్ చేస్తే.. పెళ్ళయ్యాక సినిమాలను తగ్గించుకున్న మీనా.. అడపాదడపా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తున్నారు. వయసుకు తగ్గ వేషాల్లో అలరిస్తున్నారు.

వేసవిలో విజయ్ సేతుపతి హవా
తమిళనాట తిరుగులేని నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఒకవైపు హీరోగానూ.. మరోవైపు విలన్ గానూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నారాయన. తెలుగులోనూ తనదైన ముద్ర వేస్తున్న విజయ్ సేతుపతి.. ఈ ఏడాది వేసవిలో ఏకంగా నాలుగు కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు.

రాఖీపై ఫ్రాడ్ కేస్.. ఖండించిన ఐటమ్ గాళ్!
ఐటమ్ గాళ్, బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్, ఆమె బ్రదర్ రాకేశ్ రూ. 6 లక్షల ఫ్రాడ్ కేసులో కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తాజాగా రాఖీ ఖండించింది. బిగ్ బాస్ 14 నుంచి బయటకు వచ్చిందో లేదో సోదరుడు రాకేశ్‌తో కలిసి ఓ ఫ్రాడ్ కేసులో వార్తల్లో నిలిచింది.

సొహేల్-అరియానా రొమాన్స్.. చూడాలి అవినాష్ ఫేస్!
జబర్దస్త్ మాజీ కమెడియన్ ముక్కు అవినాష్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్నవరుస షోలల్లో కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు. అయితే అవినాష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుంన్న కామెడీ షో 'కామెడీ స్టార్స్'. ఈ షోకి వర్షిణి సౌందరరాజన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, జడ్జెస్‌గా శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి వ్యవహరిస్తున్నారు.

బన్నీ, కొరటాల.. అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్సయ్యారా?
గత ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు.. సదరు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో.. బన్నీ రాబోయే చిత్రాలపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

నదియా.. మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేనా?
తెలుగునాట `బజారు రౌడీ`, `వింత దొంగలు`, `ఓ తండ్రి ఓ కొడుకు` వంటి సినిమాల్లో కథానాయికగా నటించినా రాని స్టార్ డమ్.. `మిర్చి`, `అత్తారింటికి దారేది`, `దృశ్యం`, `అ ఆ` వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పుడు దక్కించుకుంది నదియా. అయితే.. `అ ఆ` తరువాత ఆమె ముఖ్య పాత్రల్లో నటించిన `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా`, నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది రిలీజైన `మిస్ ఇండియా`.. తన కెరీర్ కి ఏ మాత్రం ప్లస్ కాలేకపోయాయి.
.jpg)
`యన్టీఆర్ 30`.. సీజన్ ఛేంజ్?
`అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.

హీరోగా మారుతూ 'గుండె కథ వింటారా' అనడుగుతున్న కమెడియన్!
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, గీతాంజలి, ఒక లైలా కోసం, టాక్సీవాలా తదితర సక్సెస్ఫుల్ ఫిలిమ్స్‌లో నటించిన పాపులర్ కమెడియన్ మధునందన్ 'గుండె కథ వింటారా' అతనే విలక్షణ థ్రిల్లర్‌తో హీరోగా పరిచయమవుతున్నారు. వంశీధర్ రచన చేస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్‌పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హిందీ 'పరుగు' సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సర్ప్రైజ్! టైగర్ ష్రాఫ్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం నదియడ్‌వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'హీరోపంతి 2' రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదలచేసి, ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచేసింది. టైగర్ ష్రాఫ్ నుంచి రానున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'హీరోపంతి 2' ఒకటి. 2014లో 'హీరోపంతి' మూవీ ద్వారానే హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు టైగర్.

మూడోసారి ప్రెగ్నెంట్ అయిన 'వండర్ వుమన్'
'వండర్ వుమన్' మూవీతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆరాధ్య తారగా మారింది గల్ గదోత్. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కు ఇన్స్పైర్ అయిన అమ్మాయిలు, ఆమె బ్యూటీతో లవ్‌లో పడిపోయారు. ఒకవైపు ప్రొఫెషనల్ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతుంటే, మరోవైపు ఆమె వైవాహిక జీవితం రోజురోజుకూ మరింత ఆనందకరంగా మారుతోంది.

టైగర్-దిశ వెడ్డింగ్ రూమర్స్.. జాకీ ష్రాఫ్ రియాక్షన్!
బాలీవుడ్ యూత్ ఐకాన్ టైగర్ ష్రాఫ్ నేడు 31వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అతడిని శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంలో గాళ్‌ఫ్రెండ్ దిశా పటానీని త్వరలోనే టైగర్ పెళ్లాడబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై టైగర్ ఫాదర్, నిన్నటి తరం టాప్ హీరో జాకీ ష్రాఫ్ రియాక్టయ్యారు.

నన్నెందుకు వేధిస్తున్నారు?.. ఫైర్ అయిన సుశాంత్ ఎక్స్ గాళ్‌ఫ్రెండ్!
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతితో గుండెలు పగిలిన ఎంతోమంది ఫ్యాన్స్‌లో నటి అంకితా లోఖండే ఒకరు. సుశాంత్ మాజీ ప్రేయసిగా ఆమె వార్తలో నిలిచింది. ఆయన మృతి కేసులో తనకు తెలిసిన వివరాలన్నింటినీ అందించడమే కాకుండా, ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచిందామె.
Short Films
Movie Reviews

2.50

2.25

2.50
Latest News
Video-Gossips
Gallery

ఫొటో ఫీచర్: బేబీ బంప్‌తో బిగ్ బాస్ బ్యూటీ!
ఈ మధ్య బేబీ బంప్‌తో ఫొటో షూట్లు చేసుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ల నుంచి రియాలిటీ షో కంటెస్టెంట్ల వరకు బేబీ బంప్ తో ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిచ్చేస్తున్నారు. ఇప్పుడిదొక ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఈ జాబితాలో నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హరితేజ కూడా చేరిపోయింది.

ఒకే రోజు ముగ్గురు...
దాదాపు ఐదేళ్ళ క్రితం విడుదలైన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ `ఊపిరి`(2016)లో కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అన్నీ ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత ఈ ముగ్గురు ఒకే తేదిన వేర్వేరు సినిమాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు.

'A1 ఎక్స్‌ప్రెస్' మూవీ రివ్యూ
శానా కాలంగా ఒక జబర్దస్త్ హిట్టు కోసం తపిస్తోన్న సందీప్ కిషన్ తను ఓ ప్రొడక్షన్ పార్టనర్‌గా ఉండి, మరో మూడు ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి ప్రొడ్యూస్ చేసిన సిన్మా 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. తమిళ్లో మంచిగ ఆడిన 'నట్పే తునై' అనే మూవీని నమ్ముకొని, దాన్ని తెలుగులో రీమేక్ చేసిన్రన్న మాట. ఈ సిన్మాతోని డెన్నిస్ జీవన్ కానుకొలను అనే డైరెక్టర్ పరిచయమయ్యిండు.

'జాతిరత్నాలు' ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉందన్న ప్రభాస్!
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిరత్నాలు'. కామెడీ క్యాపర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. దర్శకుడు. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. గురువారం 'జాతిరత్నాలు' ట్రైలర్‌ను ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముంబైలో లాంచ్ చేశారు.

సిస్టర్ మహేశ్వరి అని నీతో చెప్పానా.. జేడీ ఫైర్!
రామ్ గోపాల్‌వర్మ స్కూల్ నుంచి వచ్చిన వాళ్లలో అత్యధిక శాతం మంది ఓ పట్టాన కాంప్రమైజ్ కారు. అక్కడ ఎవరున్నా సరే వారి బ్రెయిన్ వాష్ చేసేస్తుంటారు. ఇక అదే స్కూల్ నుంచి వచ్చిన జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ తనదైన పంథాని అనుసరిస్తూ సినిమాలు చేస్తున్నారాయన. ఇటవల '70 ఎం.ఎం.' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

తొలిసారి తల్లవుతున్న టాప్ సింగర్!
దేశంలోని టాప్ సింగర్స్‌లో ఒకరైన శ్రేయా ఘోషల్ తొలిసారి తల్లి కాబోతున్నారు. తన భర్త శిలాదిత్యతో కలిసి ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన ఫొటోలో ఆమె తన పెరిగిన పొట్టను చూపించారు. బ్లూ డ్రస్ ధరించిన ఆమె బాల్కనీలో నవ్వుతూ కెమెరాకు పోజిచ్చారు.
.jpg)
నమ్మించి 4 కోట్లు మోసం చేశాడు.. భోరుమన్న జయలలిత
'లారీడ్రైవర్' చిత్రంలో బోరింగు పాప పాత్రలో నటించి పాపులర్ అయ్యారు నటి జయలలిత. అంతకు ముందు వంశీ 'ఏప్రిల్ 1 విడుదల' చిత్రంలో భాగ్యంగానూ కనిపించి ఆకట్టుకున్న ఆమె ఆ తరువాత వ్యాంప్ తరహా పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో అరకొరగా కనిపిస్తున్న జయలలిత బుల్లితెర సీరియల్స్‌లో ఆకట్టుకుంటున్నారు.

`సిద్ధ` కోసం బుట్టబొమ్మ సిద్ధం
వరుస అవకాశాలతో, విజయాలతో ముందుకు సాగుతున్న కథానాయిక పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ చేతిలో `రాధేశ్యామ్`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` చిత్రాలు ఉన్నాయి. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టిస్టారర్ మూవీ `ఆచార్య` లోనూ 20 నిమిషాల పాత్రలో ఈ స్టన్నింగ్ బ్యూటీ సందడి చేయనుందని టాక్.

'వకీల్ సాబ్'లో "సత్యమేవ జయతే" సాంగ్ ఎలా ఉందంటే...
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తున్న 'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న విడుదలకు రెడీ అవుతోంది. లైంగిక హింసను ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిల తరపున వాదించి వారిని కాపాడే ఓ లాయర్ కథతో హిందీలో వచ్చి విజయం సాధించిన 'పింక్' మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాలోని "సత్యమేవ జయతే" అనే పాటను ఈరోజు విడుదల చేశారు.

కొత్త బాయ్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన ఇలియానా!
గోవా బ్యూటీ ఇలియానా లవ్, లైఫ్‌తో పాటు హిందీ సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా చేసిన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. పూరి జగన్నాథ్‌తో మూడు సినిమాలు ఎలా చేసిందనే విషయం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్లో తెలిపింది.

ఆమెకు 60, అతడికి 25.. శ్రీలక్ష్మి, పార్వతీశం జంట అంట!
'కేరింత' ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో భార్య పాత్రలో సీనియర్ నటి శ్రీలక్ష్మి నటిస్తున్నారు.

4 వారాలు.. 3 సినిమాలు.. పరిణీతి చోప్రా లెక్కే వేరప్ప!
హిందీనాట దాదాపు పదేళ్ళుగా కథానాయికగా అలరిస్తోంది టాలెంటెడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కజిన్ గా బాలీవుడ్ కి పరిచయమైనా.. నటిగా తనదైన ముద్ర వేసింది పరిణీతి. కెరీర్ ఆరంభంలో బాగా దూకుడు చూపించిన ఈ అమ్మడు.. క్రమంగా నెమ్మదించింది. అయితే, ఈ మధ్య మళ్ళీ వరుస సినిమాలతో సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

`కప్పేళ` రీమేక్ లో శివాత్మిక?
`కప్పేళ`.. సరిగ్గా ఏడాది క్రితం కేరళ ప్రజల మనసు దోచుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. అన్నా బెన్, శ్రీనాథ్ భసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో మహ్మద్ ముస్తాఫా రూపొందించిన ఈ మలయాళ సినిమా.. అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను మెప్పించింది. నెట్ ఫ్లిక్స్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన `కప్పేళ`.. తెలుగులో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే.

పొలిటికల్ థ్రిల్లర్ గా `విజయ్ 65`?
సంక్రాంతికి రిలీజైన `మాస్టర్`తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్. ఈ నేపథ్యంలో.. రెట్టించిన ఉత్సాహంతో తన నెక్స్ట్ వెంచర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. `కొలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఏకాంతంలో కార్తీక్.. నిజం చెప్పడానికి వంటలక్క ఎంట్రీ!
స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్ 'కార్తీక దీపం'. ఈ మంగళవారం తాజా ఎపిసోడ్ కీలక మలుపు తిరగబోతోంది. అసలు విషయం తెలుసోవాలని తులసి ఇంటికి వెళ్లిన కార్తీక్‌కి అక్కడ తులసి లేకపోవడంతో చిరాకొస్తుంది. ఇది కూడా దీప పార్టీనే కదా కావాలనే ఇలా చేసిందని విసుక్కుంటాడు.
TeluguOne Service
Customer Service
