నెక్స్ట్ రెడ్ బుక్ టార్గెట్ ఎవరు?

 

 

ఎట్టకేలకు వల్లభనేని వంశీకి  బెయిల్ దొరికింది ...140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది ...అయితే ఇప్పుడే  వంశీని జైలు జీవితం విడిపోతుందా!  లేక ఇంకేమైనా ఈ కథలో టెస్టులు ఉంటాయా?  అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే అనవసరంగా నోరు పారేసుకుని,  రెడ్ బుక్ బాధితులుగా మారిన అనేక మంది ,ఇప్పటికే కారాగారంలో ఊసలు లెక్కపెట్టి వచ్చారు.... అందులో సినిమా రంగానికి చెందినవారు, పత్రికారంగానికి చెందినవారు, రాజకీయ రంగానికి చెందినవారు అన్న తేడా లేకుండా, ఎవరీ లెక్కలు వాళ్ళకి అప్పజెప్తుంది రెడ్బుక్ ....అయితే అందరికన్నా అగ్ర తాంబూలం ఈ రెడ్ బుక్కులో ఎవరికి అందబోతుంది ....ఇప్పటికీ రేట్ బుక్ లో మొదటి పేజీ మాత్రమే చూస్తున్నారని చెబుతున్న టిడిపి కార్యకర్తల మాటల్లో ఆంతర్యం ఏంటి ? రెడ్ బుక్ లో తదుపరి పేజీల్లో ఎవరెవరి పేర్లు పొందుపరిచి ఉన్నాయి.  

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ...అనే సామెత ఉంది ....పెద్దవాళ్లు ఊరికే అనలేదా మాట ...ఎక్కడైతే అనవసరంగా నోరు పారేసుకుంటామమో ,అక్కడ మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది... అని పెద్దలు ముందే గమనించబట్టి ఈ సామెతలు కనిపెట్టి ఉంటారు.... అయితే ఇటీవల రాజకీయాల్లో ఈ మాటను ఎవరు వినడం లేదు  సరి కదా, పెడ చెవిన పెడుతున్నారు ... దీంతో వాళ్లు వీళ్ళు అని తేడా లేకుండా, ప్రతి ఒక్కరు సమస్యల్లో ఇరుకుంటున్నారు ..  అలాంటి బాపతే గడిచిన కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జైలలో కాలక్షేపం చేస్తున్న నాయకులు... మాజీ ఎంపీ నందిగం సురేష్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, ఇప్పుడు తాజాగా 140 రోజులు జైలు జీవితానికి బెయిల్ తీసుకున్న వల్లభనేని వంశీ,,, వీరంతా వేరే వేరే కేసుల్లో జైలు జీవితం అనుభవించిన దీనంతటి సారాంశం అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్నారు అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియంది కాదు.... అయితే ఇప్పటికీ వల్లభనేని వంశీ జైలు జీవితం కథకు పుల్ స్టాప్ పడినట్లేనా లేక ఇతర వ్యవహారాల్లో మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం వల్లభనేని వంశీని వెంటాడుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది.

ఒక్క వల్లభనేని వంశీ నే కాదు,... ఎవరైతే గతంలో నోరు పారేసుకున్నారు వాళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం రుచి చూపించాలని ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతుంది ....అలాంటప్పుడు ఒళ్ళు ,నోళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలన్న హెచ్చరికలు కూడా వినపడుతున్నాయి... ఈ హెచ్చరికలు విషయం పక్కనపెడితే, ఇప్పుడు రెడ్ బుక్ లోని మొదటి పేజీ నడుస్తుంది ....ఈ రెడ్బుక్ లోని మొదటి పేజీలో ఇంకెన్ని పేర్లు ఉన్నాయి? చివరి పేజీకి వచ్చేసరికి ఎంతమంది నాయకులు జైల్లో మగ్గాల్సి వస్తుంది అన్న చర్చ కూడా జరుగుతుంది ....ఇక తాజాగా వినిపిస్తున్న పేర్లు టిడిపి వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది... టిడిపి సోషల్ మీడియాలో కొందరి వైసీపీ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి....సీదిరి అప్పలరాజు నుండి ,కొడాలి నాని వరకు ఆ లిస్టులో పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు, సీదిరి అప్పలరాజు , రాంగోపాల్ వర్మ ,శ్రీరెడ్డి మాజీ మంత్రులు,పేర్ని నాని , జోగి రమేష్,  అంబటి రాంబాబు విడదల రజిని , మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ప్రముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.... అయితే ఇందులో ఇప్పటికే కొంతమందికి,కొన్ని  కేసులలో నోటీసులు వచ్చిన, తమకున్న టాలెంట్ ఉపయోగించి కోర్టులకు వెళ్లి కొంత ఉపశమనం పొందారు ...అయితే రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ మరోసారి రెడ్బుక్ వ్యవహారాన్ని పరిచయం చేపించాలని టిడిపి శ్రేణులు ఉవ్విల్లు ఊరుతున్నట్లు తెలుస్తోంది.. . చంద్రబాబుకు మైండ్ పోయిందని ట్రీట్మెంట్ చేయించాలని, వయసును కూడా గౌరవించకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడిన మాజీ మంత్రి అప్పలరాజు, ఇప్పుడు రెడ్ బుక్ లోని మరో పేజీలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది 

అంతేకాదు వల్లభనేని వంశీకి ఆత్మీయ మిత్రుడు, టిడిపికి గతంలో కొరకరాని కొయ్యగా మారి ఇప్పుడు చడిచప్పుడు లేకుండా అనారోగ్య సమస్యలతో హైదరాబాదులో మకం వేసి ఉంటున్న కొడాలి నాని కి , రెడ్ బుక్కు లో ప్రముఖ పేజీ ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది .... దీంతోపాటు టిడిపిపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు తో పాటు ఇటీవల పోలీసులపై కూడా దూకుడు ప్రదర్శించిన, మాజీ మంత్రి అంబటి రాంబాబు, జగన్ పర్యటనలో ఇద్దరు వ్యక్తుల మరణాలకు కారణమైన నాయకులకు త్వరలోనే కేసుల చిట్టా పరిచయం కాబోతుందని ప్రచారం జరుగుతుంది

మరి రాబోయే రోజుల్లో కారాగారంలో కాలక్షేపం చేసే నాయకులు వీళ్లేనా?  టిడిపి క్యాడర్ చేసుకుంటున్న,చర్చలో నిజం ఎంతో అబద్ధం ఎంతో టిడిపి నేతలకే తెలియాలి ....అయితే టిడిపి కార్యకర్తలు మాత్రం చేసిన తప్పుకే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కానీ,  టిడిపి వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదనేది చెబుతున్న మాట .... సరే ఎవరి మాట ఎలా ఉన్నా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే,  ఒక పద్ధతి ప్రకారం రెడ్ బుక్ లో పేజీల్లో ఉన్న నాయకులకు ట్రీట్మెంట్ జరుగుతుందనేది వాస్తవం. మరి ఈ తదుపరి పేజీల్లో ఉండే తదుపరి నాయకులు ఎవరో కాలమే నిర్ణయించాలి