రూమర్లకు చెక్.. చిరంజీవితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.!
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్లారిటీతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Aug 22, 2026 6:37PMతమిళ ఇండస్ట్రీలో సంక్షోభం.. సెప్టెంబరు 1 నుంచి కొత్త సినిమాల రిలీజ్ బంద్.!
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి సంక్షోభ వాతావరణం నెలకొంది. ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతల మండలికి నడుమ వివాదం చెలరేగడంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా సంచలన ప్రకటన చేశాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ల మధ్య ఉండాల్సిన కాలపరిమితి అని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ప్రతీ చిత్రం కనీసం 8 వారాల (రెండు నెలలు) వ్యవధి తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కావాలని, ఈ మేరకు హామీ పత్రం ఇస్తేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య ఏకపక్షంగా కండిషన్ విధించాయి. ఈ నిబంధనను తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. పొరుగున ఉన్న తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో లేని కొత్త నిబంధనలను కేవలం కోలీవుడ్‌లోనే రుద్దడం ఏమాత్రం తగదని స్పష్టం చేసింది. అన్ని వర్గాల భాగస్వాములతో చర్చించకుండా థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు. థియేటర్ యజమానుల మొండి వైఖరికి నిరసనగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త సినిమాల విడుదలలతో పాటు, చిత్రాల షూటింగ్‌లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాణాలు, విడుదలలు అన్నీ ఒకేసారి స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. గత కొద్దికాలంగా చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గుతోందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం సినిమాల నిర్మాణ వ్యయానికి కీలక ఆధారంగా మారిందని నిర్మాతలు భావిస్తుండటంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం లేదా ఇరు వర్గాల ప్రతినిధులు చర్చలు జరిపి ఒక సయోధ్యకు రాకపోతే, సెప్టెంబర్ నెలలో విడుదల కావలసిన పలు క్రేజీ తమిళ సినిమాలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది.
Aug 22, 2026 6:23PMఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ రివర్స్ కేసు.. లీగల్ వార్‌లో ఊహించని ట్విస్ట్!
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు.
Aug 22, 2026 6:01PM.webp)
మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా
మైత్రీ మూవీ మేకర్స్.. స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించి పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుంది. అసలు సిసలు కళామ తల్లి ముద్దుబిడ్డల్లా ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా గురించి ఆలోచించడంతో పాటు ఎలాంటి సబ్జెట్ తో కూడిన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో అని నిరంతరం ఆలోచిస్తూ ఉండటం మైత్రి స్పెషాలిటీ. అందుకే కష్టే ఫలి అనే రీతిలో పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. ఇప్పుడు 'ఇరుముడి'తో బాక్సాఫీస్ వద్ద విజిల్ వేస్తుంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ వెనుక మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న ఒక పెద్ద రిస్క్, ఓటీటీ వ్యాపారంలో నడిచిన ఆసక్తికర నాటకం ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన సమయంలో మైత్రీ మేకర్స్ చాలా నమ్మకంతో ముందడుగు వేసినప్పటికీ, వ్యాపార పరంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. 'ధమాకా' తర్వాత రవితేజకి సరైన హిట్ పడకపోవడం, వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లు రావడం వల్ల ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల పట్ల డిజిటల్ దిగ్గజాలు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఉత్సాహం చూపించలేదు. అయినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ తమ కంటెంట్‌పై ఉన్న అమితమైన నమ్మకంతో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. శివ నిర్వాణ సిద్ధం చేసిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథాంశం, రవితేజను గతంలో ఎన్నడూ చూడని కొత్త తరహా మేకోవర్‌లో చూపించే విధానం కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నిర్మాతలు నమ్మారు. ఎటువంటి రాజీ పడకుండా సుమారు 14 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, మరియు 'ఇరుముడి' టైటిల్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. Also Read: డిసి తర్వాత లోకేష్ కనగరాజ్ హీరోగా చేసేది ఈ డైరెక్టర్ తోనే! ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై పెరిగిన ఈ రకమైన హైప్‌ను గమనించిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో చర్చలు జరిపి, చివరకి భారీ ఫ్యాన్సీ ధరకు డిజిటల్ హక్కులను చేజిక్కించుకుంది. ఇక ఇరుముడి తొలి రోజు 24 కోట్లని సాధించగా ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ పక్కా అనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే రేపట్నుంచి ఐదో షో కూడా ప్రదర్శితమవుతోంది. పూర్తి రన్ లో 200 కోట్లు అనే మాటలు సినీ సర్కిల్స్ లో తాజా న్యూస్ హోదాలో చక్కర్లు కొడుతున్నాయి. Irumudi, Raviteja, Mythri Movie Makers
Aug 22, 2026 5:58PMకూతురి కోసం తల్లి ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటం.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.!
కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి తాప్సీ పన్ను, మరోసారి పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథతో డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' ప్రత్యక్షంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో సందడి చేయనుంది. ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 3 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌తో పంచుకోవడంతో ఓటీటీ ప్రేక్షకుల్లో మరియు తాప్సీ అభిమానుల్లో విశేష ఆసక్తి నెలకొంది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ కథను అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. ఒక జాయ్పురా అనే ఊహాజనిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ కథలో.. కష్టాల్లో ఉన్న తన కుమార్తెను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొందనేది ప్రధానాంశంగా చూపించనున్నారు. 'గాంధారి' పాత్ర కోసం తాప్సీ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారట. ఈ సినిమాలో బాణి అనే పాత్రలో ఆమె కనిపించనుండగా, ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్ మరియు జతిన్ సర్నా కీలక పాత్రల్లో నటించారు. భావోద్వేగాలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే సీన్లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. గతంలో తాప్సీ, కనికా ధిల్లాన్ మరియు నెట్‌ఫ్లిక్స్ కలయికలో వచ్చిన 'హసీన్ దిల్రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' చిత్రాలు ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అదే సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో 'గాంధారి'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విభిన్నమైన యాక్షన్ ప్రయాణం డిజిటల్ వ్యూవర్స్‌ను ఎంతగా మెప్పిస్తుందో మరియు నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే సెప్టెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.
Aug 22, 2026 5:25PM
డిసి తర్వాత లోకేష్ కనగరాజ్ హీరోగా చేసేది ఈ డైరెక్టర్ తోనే!
'డిసి'తో సోలో హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సృష్టిస్తున్న ప్రభంజనం తెలిసిందే. 'కెప్టెన్ మిల్లర్' ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన 'డీసీ' త్వరలోనే వంద కోట్ల మార్క్ చేరుకోబోతుంది. రీసెంట్ గా సినీ వర్గాల్లోనూ, నెటిజన్లలోనూ ఓ ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. 'డీసీ' చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ హీరోగా మరొక భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారనే రూమర్లు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం, 'డీసీ' చిత్ర విజయం మరియు ఆ సినిమాకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసిన తర్వాత, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మరియు హీరోగా మారిన లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కింగ్ సైజ్ కాన్సెప్ట్‌తో 2027 చివర్లో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈసారి మరింత డార్క్, వయలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా అరుణ్ మాథేశ్వరన్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా లోకేష్‌తో క్లోజ్ బాండింగ్ ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌కి కూడా స్వరాన్ని, సంచలన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించనున్నారని బజ్ వినిపిస్తోంది. Also Read: టాలీవుడ్ హీరోయిన్ తో బాలయ్య విలన్ పెళ్లి..7 ఏళ్లుగా సహ జీవనం, ఇద్దరు పిల్లలు అయితే, లోకేష్ కనగరాజ్ మళ్లీ హీరోగా సెట్స్ పైకి వెళ్లేముందు తన దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సి ఉంది. ఆయన ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో 'AA23' ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో అనిరుధ్ సంగీతంలో తెరకెక్కనున్న ఈ చిత్రం 2026-2027 మధ్యకాలంలో భారీ స్థాయిలో రూపొందనుంది. అంతేకాకుండా తన డ్రీమ్ ఫ్రాంచైజీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో 'ఖైదీ 2', 'రోలెక్స్' స్టాండ్ అలోన్ ప్రాజెక్టులతో పాటు 'విక్రమ్ 2' చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు 1000 కోట్ల పైగా వసూళ్లు సాధించిన ఎల్సీయూ ఫ్రాంచైజీకి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, లోకేష్ ముందుగా ఈ భారీ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్‌లనే ప్రాధాన్యతగా పూర్తి చేయనున్నారు. అందుకే అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రాబోయే ఈ రెండవ హీరో ప్రాజెక్ట్ 'AA23' షూటింగ్ ముగిసిన తర్వాతే, అంటే 2027 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. Dc, Lokesh kanagaraj, Wamiqa Gabbi
Aug 22, 2026 5:25PM
టాలీవుడ్ హీరోయిన్ తో బాలయ్య విలన్ పెళ్లి..7 ఏళ్లుగా సహ జీవనం, ఇద్దరు పిల్లలు
ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 లో మేజర్ ఇక్బాల్ గా నెగిటివ్ రోల్ లో అత్యద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచిన నటుడు అర్జున్ రామ్ పాల్. పార్ట్ 2 లో అయితే తనదే కీలక రోల్ ఒకప్పటి హీరో కూడా అయిన అర్జున్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరిలో విలన్ గా చేసి మెప్పించిన విషయం తెలిసిందే. గత 8 ఏళ్లుగా డేటింగ్ చేస్తూ, సహజీవనం సాగిస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్, సౌత్ ఆఫ్రికన్ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ 'గ్యాబ్రియెల్లా డెమెట్రియాడేస్'ని గోవాలోని మపుసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా వివాహం చేసుకున్నాడు. గోవా తీరంలో అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆప్తమిత్రుల సమక్షంలో వివాహ వేడుక ప్రశాంతమైన వాతావరణంలో, సింపుల్‌గా జరిగింది. సాధారణంగా గోవా చట్టాల ప్రకారం మొదటి సంతకానికి, రెండో సంతకానికి మధ్య 15 రోజుల సుదీర్ఘ నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్) ఉంటుంది. అయితే, వీరు స్థానిక కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ప్రత్యేక అనుమతి పొంది ఈ 15 రోజుల నిరీక్షణ సమయాన్ని మినహాయించుకుని వేగంగా ప్రక్రియని పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ జంట ఎంతో క్యాజువల్ దుస్తుల్లో రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకుని సంతకాలు చేయగా, సబ్ రిజిస్ట్రార్ సూరజ్ వర్ణేకర్ ఈ వివాహాన్ని నమోదు చేశారు. అర్జున్ రాంపాల్, గ్యాబ్రియెల్లా లవ్ స్టోరీ 2018 లో ప్రారంభమైంది. మొదటి భార్య, మాజీ సూపర్ మోడల్ మెహర్ జెస్సియాతో విడిపోయిన తర్వాత అర్జున్ జీవితంలోకి గ్యాబ్రియెల్లా అడుగుపెట్టింది. 1998లో మెహర్ జెస్సియాను వివాహం చేసుకున్న అర్జున్‌కు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధం తర్వాత 2018లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించగా, 2019 నవంబరులో వీరికి అధికారికంగా విడాకులు వచ్చాయి. అదే 2018 సమయంలోనే అర్జున్, గ్యాబ్రియెల్లా ప్రేమలో పడ్డారు.సహజీవనంలో ఉన్న ఈ జంటకు 2019 లో మొదటి కుమారుడు అరిక్ (Arik) జన్మించాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు రెండో కుమారుడు అరవ్ (Arav) జన్మించాడు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన ఈ జంట సమాజంలో ఎలాంటి దాపరికం లేకుండా తమ బంధాన్ని కొనసాగించారు. గతంలో ఓ టాక్ షో లో అర్జున్ మాట్లాడుతూ "పెళ్లి అనేది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే, మేమిద్దరం మనస్ఫూర్తిగా ఎప్పుడో భార్యాభర్తల్లాగే కలిసి జీవిస్తున్నాం" అని పేర్కొనడం విశేషం. Also Read: షూటింగ్ లో గుండెపోటు.. డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్ అయితే 2025 లో ఈ జంట అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు సరిగ్గా 8 సంవత్సరాల సహజీవనం తర్వాత, ఇద్దరు పిల్లలు సాక్షిగా గోవాలో చట్టబద్ధమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకప్పుడు బాలీవుడ్లో లవర్ బాయ్‌గా మెరిసిన అర్జున్ రాంపాల్, ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ కింగ్ నాగార్జున, కార్తీ నుంచి వచ్చిన ‘ఊపిరి’ సినిమాలో గాబ్రియెల్లా కీ రోల్ లో కనిపించింది. Arjun Rampal, Gabriella Demetriades, Balakrishna
Aug 22, 2026 4:58PM
షూటింగ్ లో హార్ట్ ఎటాక్.. డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ కి భారతీయ సినిమా రుణపడి ఉందో, లేక భారతీయ సినిమాకి సల్మాన్ రుణపడి ఉన్నాడో తెలియదు గాని, మూడున్నర దశాబ్దాల నుంచి తనదైన ఛరిష్మాతో దూసుకుపోతున్నాడు. ఇక సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో లేదా ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోలు తమ బాడీ డబుల్ లేదా డూప్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో, నేషనల్ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ చేస్తున్నభారీ పాన్ ఇండియా చిత్రం 'మాన్స్టర్' (ఆ టైటిల్ ఫిక్స్ అని సమాచారం) విషయంలో ఒక ఊహించని ఘటన ఎదురైంది. ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ బాడీ డబుల్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వార్త చిత్ర బృందాన్ని తీవ్రంగా కలచివేసింది. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా పడటం లేదా డూప్ కోలుకునే వరకు ఆగిపోవడం సహజం. కానీ,యూనిట్ కి ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తకూడదని గ్రహించిన సల్మాన్, డూప్ లేకపోయినా పర్వాలేదు, సినిమా ఆగకూడదు అనే ఏకైక లక్ష్యంతో రిస్కీ యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్ ని సల్మాన్ స్వయంగా చేస్తున్నాడు. Also Read: అల్లు అర్జున్ చేసిన KKAVCF ట్వీట్ కి చిరు బర్త్ డే కి ఏంటి సంబంధం! ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా జరుపుకుంటున్న ఈ షూటింగ్లో కొరియన్ ప్రసిద్ధ యాక్షన్ డైరెక్టర్ సీ యంగ్ ఓ (Mr. Oh) పర్యవేక్షణలో అత్యంత భారీ స్టంట్ సీక్వెన్సులు ప్లాన్ చేశారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సల్మాన్‌తో కలిసి 4 నుండి 5 ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా పాల్గొంటోంది. 50 ఏళ్లు పైబడిన వయసులో కూడా సల్మాన్ ఖాన్ చూపుతున్న ఈ విధమైన క్రమశిక్షణ, అంకితభావం చూసి యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Salman Khan, Vamsi paidipally, DIl Raju, Tollywood
Aug 22, 2026 4:20PM
అల్లు అర్జున్ చేసిన KKAVCF ట్వీట్ కి చిరు బర్త్ డే కి ఏంటి సంబంధం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సిరీస్ తో పాన్ ఇండియాని షేక్ చేసి అదే ఆనవాయితీని కంటిన్యూ చేయడానికి 'రాకా' ని ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను 'రాకా' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు తన మావయ్య మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా 'మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మా అందరికీ ఎంతో అండగా నిలిచారు. మాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపించారు” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.అయితే ఈ ట్వీట్ చివరలో చేసిన #KKAVCF (IYKYK) అనే పదాలే ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. అల్లు అర్జున్ ఈ హ్యాష్‌ట్యాగ్‌కు నేరుగా అర్థం చెప్పకుండా IYKYK అని పేర్కొన్నారు. దీని అర్థం “If You Know, You Know”. అంటే.. విషయం తెలిసిన వారికి దాని వెనుక ఉన్న అసలు అర్థం అర్థమవుతుందన్నట్లుగా ట్వీట్ లో పేర్కొన్నాడు. Also Read: చిరంజీవిపై సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్..రక్తనిధి, నేత్రనిధితో మానవత్వాన్ని చాటుకున్నారు అయితే అల్లు అర్జున్ గతంలో ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుంటే ఈ హ్యాష్‌ట్యాగ్ వెనుక మ్యాటర్ అర్థమవుతోంది. “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అంటూ గతంలో చెప్పిన మాట అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే మాటను షార్ట్ ఫార్మ్‌లో #KKAVCFగా ఉపయోగిస్తూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. Chiranjeevi, Allu Arjun, Tollywood
Aug 22, 2026 3:43PM
చిరంజీవిపై సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్..రక్తనిధి, నేత్రనిధితో మానవత్వాన్ని చాటుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య ఉన్న అనుబంధం యొక్క వయసుకి చాలా హిస్టరీ ఉంది.ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన ట్వీట్ నెట్టింట స్పెషల్ కేటగిరి హోదాలో వైరల్ గా మారింది. 1978లో తెలుగు చిత్రసీమలో సాధారణ నటుడిగా అడుగుపెట్టిన చిరంజీవి, అంకితభావం కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తిప్రతిష్టలను సొంతం చేసుకున్నా రు. దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాలలో నటించి, వెండితెరపై నటన, డాన్సులు, ఫైట్లతో సరికొత్త శకాన్ని సృష్టించడమే కాకుండా, తెలుగు సినీ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీ రారాజుగా మారిన ఆయన ప్రయాణం ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకం. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా సామాజిక సేవా రంగంలోనూ సమాజం పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూ చిరంజీవి స్థాపించిన 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' (రక్తనిధి) మరియు 'నేత్ర నిధి' ద్వారా ఎంతోమంది బాధితులకి ఉచితంగా రక్తాన్ని, అంధులకు చూపును ప్రసాదిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వేలాదిమంది ప్రాణాలను కాపాడటంలో ఈ రక్త నిధి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. Also Read: కర్మ ఎవరని వదిలి పెట్టదు.. వైరల్ గా మారిన ఇష్యు ఈ విధంగా వెండితెరపైన మాత్రమే కాక, నిజ జీవితంలోనూ ఎంతోమందికి సేవ చేస్తూ రియల్ హీరోగా నిలిచారు. కేంద్ర మాజీ మంత్రిగా, పద్మభూషణ్ గ్రహీతగా ఆయన పొందిన గౌరవాలు తెలుగువారికి గర్వకారణం. చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసారు. Chiranjeevi, chandrababu Naidu, Tollywood
Aug 22, 2026 3:09PMబాక్సాఫీస్ వద్ద మెగా సునామీ ఖాయం: 'విశ్వంభర' ప్రాజెక్ట్‌పై వశిష్ఠ సంచలన కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర'పై టాలీవుడ్లో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. 'బింబిసార' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సోషియో ఫాంటసీ మూవీ బాక్సాఫీస్ పొటెన్షియల్ గురించి దర్శకుడు ఇచ్చిన హామీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్న వశిష్ఠ, బాక్సాఫీస్ వద్ద 'విశ్వంభర' సృష్టించబోయే అలజడి ఏ రేంజ్లో ఉంటుందో చాలా నమ్మకంగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు, ఆయనలోని మాస్ మరియు విజువల్ గ్రాండియర్‌కు పర్ఫెక్ట్గా సరిపోయేలా ఈ కథను సిద్ధం చేసినట్లు, థియేటర్లలో ప్రేక్షకులు ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతికి లోనవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు వీఎఫ్ఎక్స్ (VFX) పనులు అత్యంత నాణ్యతతో రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి సన్నివేశం కూడా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశామని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని చిత్రబృందం ఎంతో నమ్మకంతో ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ మరియు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకోగా, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్ పై భారీ బిజినెస్ కాంబినేషన్ నడుస్తోంది. వసిష్ఠ ఇస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే మెగాస్టార్ ఖాతాలో మరో ఆల్ టైమ్ రికార్డ్ హిట్ పడటం ఖాయమని మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ విశ్వరూప విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Aug 22, 2026 2:37PM
కర్మ ఎవరని వదిలి పెట్టదు
అనసూయ,హేమ.. ఈ ఇద్దరు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితులే. ఇప్పుడు ఈ ఇద్దరికీ సంబంధించిన న్యూస్ టాలీవుడ్ సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అనసూయ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతు 'సనాతన ధర్మం 'జై శ్రీరామ్' అనే నినాదం ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే మనుషుల ప్రవర్తన ముఖ్యమనే వ్యాఖ్యలు చేసింది. దీంతో హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వడంతో పాటు సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రచ్చ మరింత ముదరడంతో తన మాటలను కొందరు కావాలని వక్రీకరించారని, తాను కూడా హనుమంతుడి భక్తురాలినేనని అనసూయ రెండవ వీడియోలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై సీనియర్ నటి హేమ మాట్లాడుతు 'కోట్లాది మంది ప్రజల పవిత్ర విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే మాటలకి, చేసే పనులకి తేడా ఉంటే ప్రజలు వెంటనే పసిగట్టేస్తారు. 'జై శ్రీరామ్' అనేది కేవలం ఒక సాధారణ స్లోగన్ కాదు.అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన మంత్రం. అది ఒక అపారమైన దివ్య శక్తి. Also Read: విశ్వనాథ్ అండ్ సన్స్ ని దెబ్బ కొట్టిన ఇరుముడి! అనసూయ మొదట ఒక వీడియో పెట్టి వివాదం రాజేశాక, రెండవ వీడియోలో 'నేను అందరినీ అనలేదు, ఎవరినో కొందరిని ఉద్దేశించి అన్నానంటే కుదరదు. నిజంగా ధైర్యం, దమ్ము ఉంటే తప్పు చేసిన వ్యక్తుల పేర్లని బహిరంగంగా చెప్పాలి తప్ప, ఇలా మొత్తం వ్యవస్థను, భక్తుల నమ్మకాన్ని లేదా 'జై శ్రీరామ్' అనే నినాదాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం తీవ్రమైన పొరపాటు. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా ఈ విషయంలో హెచ్చరిస్తున్నాను.మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, పవిత్రమైన నమ్మకాలను కించపరిచేలా మాట్లాడితే ఆ కర్మ పదింతలై తిరిగి మనకే వస్తుందని చెప్పారు. Anasuya, Hema, Tollywood
Aug 22, 2026 2:35PMమెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కోకాపేటలో మొక్కలు నాటిన నాగబాబు.!
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుండి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ: అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి. కుటుంబ సంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితర కుటుంబ సభ్యుల పేర్లతో దాదాపు 120కి పైగా మొక్కలు నాటినట్లు నాగబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి, ప్రియమైన వారి ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
Aug 22, 2026 2:07PM
విశ్వనాథ్ అండ్ సన్స్ ని దెబ్బ కొట్టిన ఇరుముడి!
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఎనామనస్ హిట్ తో దూసుకుపోతుంది. సండే వరకు అడ్వాన్స్ బుకింగ్ మొత్తం ఫుల్ అయిపోవడంతో రాబోయే రోజుల్లో ఇరుముడి సునామీ ఒక రేంజ్ లోనే ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇరుముడి ఎఫెక్ట్ ఆల్రెడీ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ పై పడే అవకాశం ఉందనే మాటలు కూడా ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్ల సంఖ్య తగ్గడం వల్ల '' రోజువారీ కలెక్షన్లలో భారీ కొత్త ఏర్పడింది. కొన్ని చోట్ల థియేటర్స్ ల్లో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువయ్యింది. మరి వీకెండ్ లో ఇలాగే పరిస్థితి ఉంటే విశ్వనాధ్ అండ్ సన్స్ కి కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉన్నాయి. ఇరుముడి కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ లాగా ఫ్యామిలీ సినిమా కావడం, పైగా తండ్రి కూతురుతో కూడిన ఎమోషనల్ మూవీ కావడం ఇరుముడి కి ప్లస్ పాయింట్. ఏది ఏమైనా రెండు సినిమాలు ప్రేక్షకులతో కళకళలాడాలని, ప్రేక్షకులు కూడా రెండు చిత్రాలని సమాన దృష్టితో చూడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతు కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తొలి వీకెండ్ ముగిసేసరికి అంటే కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సూర్య కెరీర్లోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. మరో పక్క ఇరుముడి కూడా అదే పనిలో ఉంది. Also read: బాలయ్య సంక్రాంతికి వస్తున్నాడా!.. చిరు, వెంకీ బెర్త్ కన్ఫార్మ్ కదా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతు కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తొలి వీకెండ్ ముగిసేసరికి అంటే కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సూర్య కెరీర్లోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. మరో పక్క ఇరుముడి కూడా అదే పనిలో ఉంది. Irumudi, Vishwanath and Sons, Suriya, Raviteja
Aug 22, 2026 1:09PMఅడ్వాన్స్ బుకింగ్స్‌లో 'టాక్సిక్' రికార్డు.. 24 గంటల్లో ఎన్ని లక్షల టికెట్స్ అంటే..?
కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్, చాలా గ్యాప్ తర్వాత తన కొత్త ప్రాజెక్ట్ 'టాక్సిక్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద అప్పుడే విధ్వంసం సృష్టిస్తోంది. టిక్కెట్ సేల్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే 3 లక్షల 35 వేల టిక్కెట్లు అమ్ముడై ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా యష్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలోనూ, నార్త్ ఇండియా బెల్ట్‌లోనూ 'టాక్సిక్' క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మల్టీప్లెక్స్‌లు, బుకింగ్ యాప్‌లలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన మొదటి రోజు నుంచే కనబరుస్తున్న ఈ అపారమైన స్పీడ్ చూస్తుంటే, మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రధాన నగరాల్లో షోలు క్షణాల్లో ఫుల్ అయిపోతుండగా, థియేటర్ల యజమానులు సైతం డిమాండ్‌కు తగినట్లుగా షోల సంఖ్యను పెంచే పనిలో పడ్డారు. ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని యష్ వస్తున్న చిత్రం కావడంతో ఆయన అభిమానులు ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ నడుస్తోంది. విడుదల రోజు భారీ ఓపెనింగ్స్ సాధించడం మాత్రమే కాకుండా, సౌత్ తో పాటు నార్త్ మార్కెట్లోనూ భారీ ఓపెనింగ్ రికార్డులను యష్ తిరగరాయబోతున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, అడ్వాన్స్ సేల్స్ ఇచ్చే ఈ పాజిటివ్ వైబ్స్‌తో రాబోయే రోజుల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు వసూళ్ల గణాంకాలు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.
Aug 22, 2026 1:08PM
చిరు, వెంకీ బెర్త్ కన్ఫార్మ్ కదా
సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ' సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. వానపడుతున్నప్పుడు వేడి వేడి బజ్జిలు తింటే ఎంత మజా వస్తుందో అంతకి మించిన మజా బాలయ్య మూవీ సంక్రాంతికి రిలీజ్ అయితే ఉంటుందని అభిమానులు భావిస్తు ఉంటారు. అసలు బాలయ్య సినిమా వస్తేనే సంక్రాంతి పండుగ పరిపూర్ణం అయినట్లని భావించే అభిమానులు సైతం లెక్కకి మించి ఉన్నారు. వాళ్ళు అనుకోవడమే కాదు కొన్ని దశాబ్దాల నుంచి బాలయ్య ట్రాక్ రికార్డు అలాగే ఉంది. 2027 సంక్రాంతి రేసుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'కాకా'తో జనవరి 13 న,విక్టరీ వెంకటేష్ జనవరి 12 విడుదల అనే టాగ్ లైన్ తో జనవరి 12 న వస్తున్నారు.దీంతో సంక్రాంతి మొనగాడిగా పేరుగాంచిన బాలయ్య కూడా ఈ రేసులోకి వస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని మూవీ ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కాకపోతే కొన్ని రోజుల క్రితం యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య కాలికి గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. NBK 111 గా ఆ సెట్స్ పై ఉన్న ఈ మూవీ సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతుంది. టాలీవుడ్లో సంక్రాంతి బరిలో అత్యధిక విజయాలు నమోదు చేసిన చరిత్ర బాలయ్య సొంతం. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు నుండి ఇటీవల వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరకు బాలకృష్ణ సంక్రాంతికి వస్తే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం నెలకొంటుంది. Also Read: మెగాస్టార్ లీక్ వల్లనే టైటిల్ మారిపోయిందా?.. కాకా వర్సెస్ కదిరి ప్రస్తుతం బాలయ్య తన వరుస సినిమాలతో ఊపు మీదున్నారు. గత నాలుగైదు ఏళ్లలో ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల నుండి 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సునాయాసంగా రాబట్టాయి. బాలకృష్ణ ట్రాక్ రికార్డ్ చూస్తే, ఆయన పండుగ రేసును ఎప్పుడూ మిస్ అవ్వడానికి ఇష్టపడరు. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, 2027 సంక్రాంతి నాటికి బాలకృష్ణ సెట్స్‌పై ఉన్న ప్రాజెక్ట్ సరైన సమయానికి పూర్తయితే, ఆయన కచ్చితంగా బరిలో నిలుస్తారు. ఒకవేళ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ముగ్గురూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగితే, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ సంక్రాంతి పోరుగా ఇది నిలిచిపోతుంది. Balakrishna, Chiranjeevi, Venkatesh, NBK111, Kaaka, Janauary 12 Vidudhala
Aug 22, 2026 12:36PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com











