బిగ్ బాస్ షో పై రాజా రవీంద్ర కామెంట్స్
on Jul 2, 2025

కాకమ్మ కథలు షో ఫినాలే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి నవీన్ చంద్ర, రాజా రవీంద్ర వచ్చారు. ఇక వీళ్ళ మధ్య నడిచిన కాన్వర్జేషన్ మరీ డబుల్ మీనింగ్ గా సాగింది. "నవీన్ చంద్ర మీరు అనవసరంగా రాజా రవీంద్రతో రావాల్సి వచ్చినందుకు సో సారీ..సీజన్ 3 లో మళ్ళీ పిలుస్తాను" అని చెప్పింది. ఇక రాజా రవీంద్రతో ఎం అన్నదంటే "రాజా రవీంద్రను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ నాకు ఆయన షేడ్స్ అర్ధం కావడం లేదు. ఒక మనిషిని చూస్తే ఆయన ఈ రోల్ అయ్యుంటుంది అని మనం అనుకుంటాం. మీరు ఏ రోల్ చేసినా అలాగే ఉండదు" అంది తేజు. "జనాలు నన్ను ఒక ఇమేజ్ లో చూస్తారుగా క్యారెక్టర్ లో అది ఉండదు. "మనిద్దరం కలిసి ఒక సినిమా చేసాం ఐతే క్యారవాన్ లోంచి నువ్వు బయటకు రాలేదు." అని రాజా రవీంద్ర అనేసరికి "మీరు క్యారవాన్ రాలేదా ఐతే" అని కౌంటర్ వేసింది తేజు. "సోషల్ మీడియా లేక ముందు మీరే సోషల్ మీడియా మీకు గుర్తుందా " అని అడిగింది తేజు. దానికి రాజా రవీంద్ర పడీ పడీ నవ్వేసాడు.
"మీరు తెలియకుండా జనాలు మీ గురించి ముందే అనుకునే ఒక నిజమైన విషయం ఏంటి" అని అడిగింది. "అదే ఈడికి నోటి దూల అని" అన్నాడు. "అవును ఇది నిజమే" అంది తేజు. తర్వాత రాపిడ్ ఫైర్ అడిగేసరికి "నిజానికి మీరు లైఫ్ లో రాపిడ్ ఫైర్ ఆడుతున్నారు. కానీ అది ఎవరికీ తెలియడం లేదు" అంది తేజు. "ఒకవేళ మీరు బిగ్ బాస్ కి వెళ్లి ఉంటే మీరు సర్వైవ్ అయ్యేవాళ్ళా " అని అడిగింది. "వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు" అని చెప్పాడు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు, చేస్తున్నాడు. అలాగే మూవీస్ కి డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



