ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చిన సైనికుడికి గ్రామస్థులు ఘన స్వాగతం

 

శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 

28ఏళ్లుగా దేశ రక్షణలో విధులు నిర్వహించి, సుబేధర్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన సందర్బంగా  బాజా భజంత్రీలు, శ్రీ శివరామ డోలు సన్నాయి కళాకారులు, శ్రీ ఆసిరిపోలమ్మ కోలాట బృందం, శ్రీ కళ్యాణవెంకటేశ్వర కోలాట బృందం, శ్రీ దుర్గా పాండు రంగ స్వామి కోలాట బృందం కళాకారులచే కోలాట ప్రదర్శన నిర్వహించి ఘన సన్మానసభ నిర్వహించారు.