రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి
posted on Jul 3, 2025 10:36AM
.webp)
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ వివారు కాటేదాన్ లోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
దట్టమైన పొగ కమ్ముకుని జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు. పరిశ్రమలో పెద్ద ఎత్తున రబ్బరు, ఇతర ముడిసరుకు ఉండటం మంటలు వేగంగా వ్యాపింపిచ దట్టమైన పొగ అలుము కోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాద కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.