సీరియల్స్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆది
on Jul 3, 2025
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. "ఈ ఇంట వేడుక" పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. అందులో ఆది కోరికలు మాములుగా లేవు. సీరియల్ హీరోగా చేద్దామనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ షోకి సీరియల్స్ వాళ్ళను పిలిచారు. అందుకే పార్టీ అని చెప్పి సీరియల్స్ వాళ్ళను పిలిచి వాళ్ళ నుంచి ఎమోషన్స్ లాగేసి సీరియల్ హీరో ఐపోతా అని ప్లాన్ చేసుకున్నాడు. "వేయి శుభములు కలుగు నీకు, వసుంధర, మెరుపు కలలు, సంధ్య రాగం, అందాల రాక్షసి, జీవన తరంగాలు, ఆరో ప్రాణం" వంటి సీరియల్స్ వాళ్లంతా వచ్చారు. ఇక ఈ షోకి సీరియల్ సీనియర్ యాక్టర్ యమునా వచ్చింది. ఐతే రష్మీ ఆమె ఇలా చెప్పింది.
"ఆయన కూడా సీరియల్ లో హీరోగా లాంఛ్ అవుదామనుకుంటున్నాడు" అని చెప్పింది. దాంతో యమునా "నేను మిమ్మల్ని చూసి అంకుల్ క్యారెక్టర్ చేస్తారేమో" అనుకుంటున్నా అంటూ సెటైర్ వేసింది. దానికి ఆది వాయిస్ కట్ ఐపోయింది. ఫ్యాన్ ఆఫ్ సీరియల్స్ అనే స్కిట్ చేశారు ఫైమా, నూకరాజు. ఫైమా ఐతే శిల్ప చక్రవర్తిని పట్టుకుని తెగ తిట్టింది. అడ్డొచ్చిన నూకరాజును బాదింది. ఇక తర్వాత సింగర్స్ కె సింగర్స్ లా పోటీ ఇచ్చారు ఫైమా, ఆది, నూకరాజు, సుష్మ కిరణ్. వీళ్ళు మంచి మంచి సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేశారు. ఆది, నూకరాజు కలిసి పాడితే అదేదో మ్యాజిక్ ఉండండి అంటూ ఇంద్రజ కితాబిచ్చింది. అలాగే వీళ్ళందరికీ రకరకాల టాస్కులు ఇచ్చింది రష్మీ. ఇక లాస్ట్ లో కారాసాము చేసే కొంతమందిని తీసుకొచ్చారు. వాళ్ళు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రోమో ఫైనల్ లో శిల్ప చక్రవర్తి, సుష్మ కిరణ్ ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
