వయనాడ్‌లో ‘సీత సేతు’!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండె ధైర్యంతో పాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. రాముడి  సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఎత్తుకెళ్లి శ్రీలంకలో నిర్చంధించాడు అనేది రామాయణం కథ! సీతను కాపాడటం కోసం  రాముడు కట్టిన రామసేతు గురించి విన్నాం... కానీ, ఇప్పుడు సీతే.. ప్రజల్ని కాపాడేందుకు ఉరకలెత్తుతున్న వరద మీద వారధి కట్టింది! అలాగని ఇదేమీ రామాయణ గాథ కాదు. .. కేరళ కొండచరియల బాధితులను రక్షించేందుకు భారత సైన్యాధికారిణి మేజర్ సీతా షెల్కే చేసిన కృషి. అందుకే, ఆమె పేరు మారుమోగుతోంది. ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శిథిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసిన ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత. ఈ పనిలో కీలకంగా వ్యవహరిస్తోన్న మద్రాస్ ఇంజినీర్ గ్రూప్‌కి నాయకత్వం వహించిన ఏకైక మహిళా అధికారిణిగా జనమంతా ఆమెకు జేజేలు పలుకుతున్నారు.  పశ్చిమ కనుమల్లో పుట్టిన ప్రళయానికి కేరళలోని వయనాడ్... అల్లకల్లోలమైంది. పెద్ద ఎత్తున పేరుకున్న బురద, పొంగిపొర్లుతోన్న వాగులూ, కొట్టుకుపోయిన వంతెనలు... రెస్క్యూ టీమ్‌లు బాధితుల్ని చేరుకునే వీలు లేకుండా చేస్తున్నాయి.. అప్పుడే సీతా షెల్కే సివంగిలా దూసుకొచ్చారు.  పరిస్థితులను అంచనా వేశారు. తాత్కాలిక వంతెనలు (బెయిలీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిని నిర్మించేందుకు సీత ఆధ్వర్యంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ పనిలోకి దిగింది. చిమ్మ చీకటి, జోరువాన మధ్యనే వంతెన నిర్మాణం చేపట్టి నిర్విరామంగా పనిచేశారు. జూలై 31 రాత్రి 9 గంటలకు ప్రారంభించి... మర్నాడు సాయంత్ర 5.30 గంటలకల్లా వంతెన పూర్తి చేసేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను అంత త్వరగా నిర్మించడం అంత సులువేం కాదు. పైగా ప్రతికూల వాతావరణం. ఈ సమయంలో సీత అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. అందుకే ఆమెను సోషల్ మీడియా సూపర్ హీరోగా కీర్తిస్తోంది. ఈ బెయిలీ వంతెన నిర్మాణం... ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కార్యకలాపాల్లో కీలకమైన అడుగులు వేయడానికి సాయపడుతుంది. జాడలేని బాధితులను గుర్తించే వీలు కలుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో తనదైన సమయస్ఫూర్తి చూపించిన మేజర్ సీత మాత్రం... 'నన్ను మహిళగా చూడొద్దు. నేనో సైనికురాల్ని, భారతసైన్యం ప్రతినిధిగా నా విధులు నిర్వర్తిస్తున్నా' అని చెప్పడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం .  బెంగళూరులోని మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళాధికారి. ఈ బృందాన్నే మద్రాస్ సాపర్స్.గా పిలుస్తారు. ఈ ఇంజినీరింగ్ యూనిట్... సైన్యంకోసం మార్గాలను క్లియర్ చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధ సమయంలో ల్యాండ్‌ మైన్లను గుర్తించడం వంటివి చేస్తుంది. అంతే కాదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ ఆపరేష న్లలోనూ భాగమవుతారు. సీతది మహారాష్ట్రలోని గాడిల్ గావ్. తండ్రి అశోక్ బిఖాజీ షెల్కే న్యాయవాది. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సీత ఐపీఎస్ కావాలనుకున్నారు. సరైన మార్గదర్శకత్వం లేక ఆ లక్ష్యం చేరలేకపోయారు. దాంతో భారత సైన్యంలో చేరడంపై దృష్టి సారించారు. రెండుసార్లు సశస్త్ర సీమాబల్ పరీక్షలో విఫలమయ్యారు. అయినా, నిరుత్సాహపడకుండా పట్టుదలతో మూడో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. ఆపై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 2012లో సైన్యంలో చేరారు. శారీరక బలహీనతలు, మానసిక ఉద్వేగాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, మగవారికి దీటుగా మహిళలూ రాణించగలరనడానికి మేజర్ సీతా షెల్కే సరైన ఉదాహరణ. ‘మహిళ కదా... ఇది రిస్క్ జాబ్ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు. ‘రిస్క్ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట. రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా పాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పని చేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు. వాయనాడ్‌లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్-స్టాప్‌గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు.... రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది.

డల్లాస్‌లో వల్లభనేని వంశీ దొంగబతుకు!

ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుగా తయారైంది వల్లభనేని వంశీ పరిస్థితి. ప్రొడ్యూసర్‌గా హిట్ సినిమా తీసి, ఎమ్మెల్యేగా హవా నడిపి, అధికార పార్టీ నాయకుడిగా మకుటం లేని మహారాజులా చెలామణి అయి, అధికారం తెచ్చిన అహకారంతో అడ్డమైన వాగుడు వాగిన వల్లభనేని వంశీ బతుకు చివరికి దొంగ బతుకైపోయింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అయ్యేసరికి వల్లభనేని వంశీ అమెరికాలోని డల్లాస్‌కి పారిపోయినట్టు తెలుస్తోంది. డల్లాస్‌లో దొంగలాగా నక్కినక్కి తిరుగుతున్న వల్లభనేని వంశీ కొంతమంది తెలుగువాళ్ళ కళ్ళలో పడ్డాడని, సాటి తెలుగువాడు కదా అని వాళ్ళు పలకరించే ప్రయత్నం చేస్తే, అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ పనికిమాలిన వాడు అని ఆల్రెడీ అందరికీ తెలుసు... పిరికివాడు కూడా అనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ‘‘స్థానబలిమే కాని తనబలిమి కాదయా.. విశ్వదాభిరామ వినుర వేమ’’ అని వేమన చెప్పినట్టు, ఈ వైసీపీ చెత్తగ్యాంగ్‌కి అధికారంలో వున్నప్పుడే ధైర్యం వుంది తప్ప, అధికారం పోగానే అందరూ పిరికి సన్నాసులు అయిపోయారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ‘చంద్రబాబు ఏమీ పీకలేడు’ అనే స్థాయి డైలాగులు, సవాళ్ళు విసిరిన వల్లభనేని వంశీకి, అధికారం పోగానే తనది బలుపు కాదని అర్థమైంది. తాను నిజమైన శక్తివంతుడు కాదని, స్థానబలంతో అరిచే ఊరకుక్కకి, తనకి ఎంతమాత్రం తేడా లేదనే విషయం అవగతం అయింది. అందుకే, ఒక చిన్న కేసుకు భయపడి పారిపోయాడు. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిన కేసులో మహా అయితే ఏం చేస్తారు? పడితే కొద్ది నెలలపాటు జైలు శిక్ష పడుతుంది. అంతేతప్ప తల తీసి మొలేయరు కదా? వల్లభనేని వంశీకి బాస్ జగన్ 16 నెలలో జైల్లో గడిపి, హ్యాపీగా నవ్వుకుంటూ బయటకి వచ్చాడు. ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కొద్ది నెలలపాటు జైల్లో వుండలేనంత పిరికిసన్నాసి వల్లభనేని వంశీ. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిప్పుడు చూపించిన తెగువలో వన్ పర్సెంట్ కూడా లేకుండా పోయింది ఈ పిరికి పిల్లికి!

హీరో రాజ్ తరుణ్ ఫ్రెండ్ పై  నటి లావణ్య ఫిర్యాదు 

టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్-నటి లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్‌తరుణ్ స్నేహితుడు ఆర్‌జే శేఖర్‌బాషా, లావణ్య పరస్పరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శేఖర్ తనపై దాడి చేశాడని లావణ్య ఫిర్యాదు చేయగా  లావణ్యే తనపై దాడికి యత్నించిందని శేఖర్ తన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అసలు విషయానికి వస్తే . శేఖర్‌బాషా ఓ యూట్యూబ్ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. చర్చ సందర్భంగా ఆయన పదేపదే లావణ్యపై ఆరోపణలు చేస్తుండడంతో ప్రశ్నించేందుకు లావణ్య అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేస్తూ బాషా తనపై దాడికి పాల్పడడమే కాకుండా అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపించింది. బాషా కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తూ తనపై దాడికి యత్నించిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కాగా, రాజ్‌తరుణ్, తాను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని, ఓ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

ఎలాంటి షరతులకైనా ఓకే.. బెయిలివ్వండి చాలు!.. హైకోర్టులో పిన్నెల్లి బెయిలు పిటిషన్

అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా చెలరేగిపోయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో, డిప్రషన్ లో కూరుకుపోయారు. పల్నాడు పులిని అంటూ విర్రవీగిన ఆయన ఇప్పుడు పిల్లిలా మారిపోయారు. నెల రోజులకు పైగా నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి.. ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను బెయిలు మంజూరు చేయండి చాలు అంటూ హైకోర్టును ఆశ్రయించారు.  బెయిలు కోసం ఇప్పటికే రెండు సార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే  రెండు సార్లూ ఆయన బెయిలు పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.  దీంతో ఇప్పుడు  ఏ షరతులైనా విధించండి.. బెయిలవ్వండి చాలు అంటై హైకోర్టును వేడుకున్నారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ సోమవారం (ఆగస్టు 5) ఏపీ హైకోర్టు విచారించనుంది.  అదలా ఉంచితే.. జగన్ ఐదేళ్ల పాలనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. అధికారం చేతిలో ఉంది.. తనను అడ్డుకునేవాడెవరన్న రీతిలో ఇష్టారీతిగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో పాల్వాయి గే ట్ పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుపడిన తెలుగుదేశం ఏజెంట్ పై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ ముగిసిన మరునాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో కలిసి కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. అనుచరులతో కలిసి సోదరులిద్దరూ కారంపూడిలో స్వైర విహారం చేశారు. మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతూ తెలుగుదేశం శ్రేణులపై విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు కొట్టారు. ఏకంగా సీఐపైనే దాడికి పాల్పడ్డారు. ఈ రెండు సంఘటనలపై కారంపూడి పోలీసులు పిన్నెల్లి సోదరులపై హత్యా యత్నం కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 26న అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు తరలించారు. అప్పటి నుంచి పిన్నెల్లి నెల్లూరు జైలులోనే ఉన్నారు. బెయిలు కోసం రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. రెండు సార్లూ కోర్టు పిన్నెల్లికి బెయిలు నిరాకరించింది. దీంతో తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పిన్నెల్లి ఎటువంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను బెయిలు మంజూరు చేయండంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిలు పిటిషన్ సోమవారం (ఆగస్టు5) విచారణకు రానుంది.  

వెయ్యేళ్ల జైన శిల్పాన్ని కాపాడుకోవాలి

ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి    కర్నూలుకు పాతిక   కిలోమీటర్ల దూరంలో, కల్లూరు మండలం, నాయకల్లు గ్రామం శివారులో నిర్లక్ష్యంగా పడి ఉన్న వెయ్యేళ్ల నాటి వర్థమాన మహావీరుని శిల్పాన్ని కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్  సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.  ఊరు, వాడా, మారుమూల పల్లెల్లో అస్తవ్యస్తంగా పడి ఉన్న శిల్పాలు, శాసనాలు, శిథిలాలపై స్థానికులకు అవగాహన కల్పించే "ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పొస్టేరిటి" కార్యక్రమంలో భాగంగా, ప్లీచ్ ఇండియా బృందం నాయకల్లు గ్రామం లో  బయట నిర్లక్ష్యంగా పడి ఉన్న శిల్పాలను ఆదివారం నాడు క్షుణ్ణంగా పరిశీలించింది.  గ్రామానికి ఉత్తరంగా రోడ్డు పక్క పొదల్లో ఉన్న 24వ జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి శిల్పం, ఒక స్తంభం, పీఠాలను గ్రామానికి తరలించి, భద్రపరిచి, చారిత్రక వివరాలతో ఒక పేరు పలకను ఏర్పాటు చేయాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.  మహావీరుని శిల్పం, ఆలయ విడి భాగాలు క్రీ. శ. 10వ శతాబ్దం నాటి రాష్ట్ర కూటలకు చెందినవని, పద్మాసనంలో ధ్యానముద్రంలో కూర్చొని ఉండగా, ఎడమ కాలు తల వెనక ప్రభా మండలం భిన్నమైనాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ అధికారి, మహేంద్ర నాయుడు ప్లీచ్ ఇండియాకు చెందిన జితేంద్ర, చరణ్, శ్రీహరి, హరీష్, ఉదయ్ కిరణ్, దుర్గ, మైత్రేయి, కౌస్తుభ్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు. 

జగన్ ఢిల్లీ ధర్నా... వ్రతమూ చెడింది.. ఫలమూ దక్కలేదు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా అట్టర్ ప్లాప్ అయ్యింది. జనమూ పట్టించుకోలేదు. మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అది పక్కన పెడితే జగన్ హస్తిన ధర్నా వెనుక పెద్ద వ్యూహమే ఉందని వైసీపీ నేతలు అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. రాజ్యసభలో తన బలం చూపి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దారిలోకి తెచ్చుకోవడం, అదే సమయంలో అదే బలాన్ని చూపి కాంగ్రెస్ కు దగ్గర కావడం అన్న రెండంచల వ్యూహంతో ఆయన ఏపీలో శాంతి భద్రతల సాకు చూపి హస్తిన వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చారు.  అయితే ఆ రెండంచల వ్యూహం ఘోరంగా విఫలమైంది. అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ జగన్ ను నమ్మి దగ్గరకు రావడానికి ఇసుమంతైనా ఆసక్తి చూపలేదు.  వాస్తవానికి నిజంగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించి ఉంటే జగన్ హస్తినలో ధర్నా చేసి ఏపీకి తిరిగి వచ్చేసి ప్యాలెస్ కు పరిమితం కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఊరూ వాడా ఏకం చేస్తూ రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టి ఉండేవారు. లేదా ఆయన హస్తిన ధర్నాలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టి మరీ తెలుగుదేశం దౌర్జన్యకాండలో 36 మంది వైసీపీ కార్యకర్తలు మరణించారని చెప్పుకున్నారుగా, వారందరినీ పరామర్శించడానికి పర్యటనలు చేపట్టేవారు. అవేమీ లేకుండా ఆయన అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ప్యాలెస్ అంటూ ఇంకా అంత: పురానికే పరిమితమయ్యారు.   దీంతో ఆయన హస్తిన ధర్నా లక్ష్యం ఏమిటి అన్న దానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ ఆందోళన, హస్తిన ధర్నా అంతా ఒక సాకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హస్తిన ధర్నా తరువాత జగన్ తాడేపట్టి, బెంగళూరు ప్యాలెస్ ల మధ్య షటిల్ సర్వీస్ కే పరిమితమయ్యారంటే... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని ఆయన అంగీకరించేసినట్లే కదా అంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన హస్తిన ధర్నా వెనుక ఉద్దేశాలేమిటన్న దానిపై విశ్లేషణలు చేస్తున్నారు.   జగన్‌ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు వచ్చి సంఘీభావం చెప్పారు. దాంతో జగన్ కాంగ్రెస్ కు చేరువకావడానికి ధర్నా ద్వారా మార్గం సుగమం చేసుకున్నారని అంతా భావించారు. అయితే ధర్నా తరువాత స్వల్ప వ్యవథిలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రెండు సార్లు బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ లతో సయోధ్య కోసం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు, తన సొంత సోదరి షర్మిల విమర్శల దాడిని నియంత్రించడం కోసం కాంగ్రెస్ తో సయోధ్య, కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తనపై అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకోకుండా నిరోధించడం కోసం బీజేపీతో మైత్రి అన్న వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే  కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా జగన్ ను దగ్గరకు రానీయడానికి అంగీకరించలేదని అంటున్నారు.  

పారిస్ ఒలింపిక్స్.. సెమీస్ కు చేరిన భారత్ హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం బ్రిటన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో హాకీ ఇండియా విజృంభించింది. అగ్రశ్రేణి జట్టు అన్న బెదురు లేకుండా బ్రిటన్ లో హోరాహోదీ తలపడింది. చివరికి 4-2 తేడాతో విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లారు. తొలుత నిర్ణీత 60 నిముషాలలో ఇండియా, బ్రిటన్ జట్లు 1-1 స్కోరుతో సమానంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని షూట్ ఔట్ తో నిర్ణయించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన షూట్ ఔట్ లో భారత ఆటగాళ్లు నలుగురు గోల్స్ చేయగా, బ్రిటన్ ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే చేయగలిగారు. దీంతో విజయం భారత్ ను వరించింది.   మ్యాచ్ మొదలైన 17వ నిముషంలోనే భారత స్టార్ డిఫెండర్   అమిత్‌ రోహిదాస్‌కు రిఫరీ రెడ్‌ కార్డ్‌ ఇవ్వటంతో..   భారత్‌ పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.  దీంతో  గ్రేట్‌ బ్రిటన్‌ ఎదురుదాడిలో పస పెంచింది. ఈ సమయంలో భారత్‌ ఎటాకింగ్‌ను వదిలేసి పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. అయినా పట్టుదలతో ఆడి విజయాన్ని దక్కించుకుంది. 

పారిస్ ఓలింపిక్స్ సెమీస్ లో భారత్ షట్లర్ లక్ష్యసేన్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణంపై గురి పెట్టిన భారత ఏస్ షట్లర్ లక్ష్యసేన్ సెమీల్ లో పరాజయం పాలైయ్యాడు. అయితే లక్ష్యసేన్ కాంస్య పతకం సాధించే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి.  ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్(డెన్మార్క్) చేతిలో 22-20, 21-14 తేడాతో లక్ష్యసేన్ వరుస సెట్లలో పరాజయం పాలై ఫెనల్స్ చేరే అవకాశం చేజార్చుకున్నాడు. సెమీస్ లో పరాజయం పాలైనా కాంస్యం కోసం జరిగే పోరులో విజయం సాధిస్తే పతకం గెలుచుకునే అవకాశాలు మిగిలే ఉన్నాయి.   భారీ అంచనాలతో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచినా లక్ష్యసేన్ వినా మిగిలిన వారంతా రిక్తహస్తాలతోనే వెనుదిరిగారు.    హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టిన పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వెనుదిరగ్గా… గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెస్తారని అనుకున్న డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ సాత్విక్ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిరాగ్ షెట్టి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్ దాటలేకపోయారు. కానీ, అరంగేట్రం ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే సంచలన ఆట తీరుతో ముందుకెళ్తున్న యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ లక్ష్యసేన్ సెమీఫైనల్ చేరి పతక ఆశలు సజీవంగా నిలిపాడు. సెమీస్  తొలుత రెండు గేమ్‍ల్లోనూ ముందుగా ఆధిక్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‍లో ఓ దశలో 11-9తో ముందుకు వెళ్లిన లక్ష్య సేన్ చివరికి చివరికి 20-22తో తొలి గేమ్ లో పరాజయం పాలయ్యాడు. రెండో గేమ్ లో కూడా తొలుత ఆధిక్యత ప్రదర్శించిన లక్ష్య సేన్ చివరికి 14-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.   

వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్ రూమ‌ర్ల వెనుక పోలీసుల హైడ్రామా!?

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ పేరు మారుమోగుతోంది. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వంశీ పేరును రోజూ త‌లుచుకుంటారో లేదోకానీ... తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గంట‌ గంట‌కు త‌ల‌చుకుంటున్నారు. వంశీ ఎప్పుడు అరెస్టు అవుతారు?.. చేసిన తప్పులకు శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడా అని  చూస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు ఇంత‌లా వంశీపై ఆగ్ర‌హంతో ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణమే ఉంది. వైసీపీ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కొంద‌రు నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. హ‌ద్దులు దాటి అస‌భ్య‌క‌ర ప‌దజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి ర‌మేష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీలు ఉన్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, వ‌ల్ల‌భ‌నేని వంశీ ముగ్గురూ తెలుగుదేశం నుంచి వైసీపీకిలోకి వెళ్లిన‌ వారే. అధికార మదంతో చంద్ర‌బాబుపై ఇష్టారీతిలో వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో అవ‌మానించారు. ఇక వ‌ల్ల‌భ‌నేని వంశీ  ఏకంగా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపైనే నోరు పారేసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులే కాదు.. ఏపీ ప్ర‌జలు మొత్తం   వంశీపై ఆగ్ర‌హంతో ఉన్నారు. అంతేకాదు.. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌మేయం కూడా ఉంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ దాడి కేసుకు సంబంధించి పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ క్ర‌మంలో కార్యాల‌యంపై దాడిలో ప్ర‌మేయం ఉన్నవంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో యూసుఫ్ ది కీలక పాత్ర ఉందని  పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కేసులో వంశీ మరో అనుచరుడు రమేశ్ ను అంతకు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాల‌యం పై దాడికేసులో వ‌ల్ల‌భ‌నేని వంశీ పైన కేసు న‌మోదు కావ‌డంతో  అత‌నికోసం కూడా పోలీసులు  గాలిస్తున్నారు. వంశీ అమెరికా పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయ‌న హైద‌రాబాద్ లోనే ఉంటున్నార‌ని కొంద‌రు తెలుగుదేశం నేత‌లు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీని గన్నవరంలోని ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేశారనే వార్తలు గుప్పుమ‌న్నాయి. పోలీసులు వంశీని అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు కొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, కొద్దిసేప‌టికి అరెస్ట చేసింది వంశీని కాదు.. ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడిని పోలీసులు తెలిపారు. వంశీని అరెస్టు చేసిన‌ట్లు వార్త‌లు రావ‌డం పెద్ద‌క‌థే న‌డిచిన‌ట్లు తెలుస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడికేసులో విచార‌ణ వేగంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వంశీ ఏ71వ నిందితుడుగా ఉన్నాడు. చాలా మంది ప‌రారీలో ఉన్నారు. వాళ్లు ప‌రార‌వ్వ‌డానికి కొంత మంది వైసీపీ భ‌క్త పోలీసులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు చాలా సీరియ‌స్ అవుతాయి..  మీరు పారిపోండి అంటూ ముందుగానే వైసీపీ భ‌క్త పోలీసులు నిందితులకు సూచించిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వంశీ ప‌రారీలో ఉన్నారు. ఆయన చివ‌రిసారిగా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజు క‌నిపించారు. ఓట్ల లెక్కింపు రోజు మూడు నాలుగు రౌండ్ల‌లోనే టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంద‌ని అర్థ‌మ‌వ్వ‌డంతో.. కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వెళ్లిపోవ‌టం క‌నిపించింది. ఆ త‌రువాత‌ వ‌ల్ల‌భనేని నేరుగా అమెరికాలోని డ‌ల్లాస్ వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు తీరిగ్గా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నామ‌ని పోలీసులు చెబుతుండ‌టం తెలుగుదేశం శ్రేణుల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది.  వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబు నాయుడుపైన వైసీపీ కార్య‌క‌ర్త‌లు అంగ‌ళ్ళలో దాడి చేశారు. అయినా, పోలీసులు చంద్ర‌బాబు నాయుడుపైన‌, టీడీపీ నేత‌ల‌పైన కేసులు పెట్టారు. అప్పుడు అన్న‌మ‌య్య జిల్లా ఎస్పీ గంగాధ‌ర్ రావు ఉన్నారు. ఆయ‌న ప్ర‌మేయంతోనే స్థానిక పోలీసులు  చంద్ర‌బాబు, తెలుగుదేశం నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అలాంటి ఎస్పీల‌ను ప‌క్క‌న పెట్ట‌కుండా చంద్ర‌బాబు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ క్ర‌మంలో గంగాధ‌ర్ రావును కృష్ణా జిల్లా ఎస్పీగా ప్ర‌భుత్వం నియ‌మించింది. గంగాధ‌ర్ రావును కృష్ణా  జిల్లాకు పంపించ‌డంప‌ట్ల తెలుగుదేశం నేతలు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రం తెలుగుదేశం కార్యాల‌యం ద‌గ్దం కేసులో వ‌ల్ల‌భ‌నేని అనుచ‌రులు పారిపోవ‌డానికి ఎస్పీ గంగాధ‌ర్ రావు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుగుదేశం నేత‌లు భావిస్తున్నారు.  వంశీని సైతం ముంద‌స్తుగా విదేశాల‌కు పంపించింది కూడా కొంద‌రు వైసీపీ భ‌క్త పోలీసులేన‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. కార్యాల‌యంపై దాడి కేసులో నిందితులు ఎక్క‌డ ఉన్నార‌నే స‌మాచారం ఉన్నా పోలీసులు వారిని అరెస్టు చేయ‌డం లేద‌ని, ఇంకా వైసీపీకి అనుకూలంగానే పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుగుదేశం శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అన్నట్లుగా ఒక‌రిద్ద‌రు వైసీపీ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వంశీని అరెస్టు చేశామ‌ని మీడియాకు లీకులు వెళ్ల‌డానికికూడా పోలీసులే కార‌ణంగా తెలుస్తోంది. త‌ద్వారా గ‌న్న‌వ‌రం కార్యాల‌యంపై దాడికేసులో నిందితుల‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నార‌ని ప్ర‌భుత్వాన్ని, ప్రజలను న‌మ్మించేందుకు కొంద‌రు వైసీపీ భ‌క్త పోలీసులు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న అనుమానాలు తెలుగుదేశం శ్రేణులు  వ్య‌క్తం చేస్తున్నాయి. మొత్తానికి వైసీపీ భ‌క్త పోలీసులు వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు కాకుండా చూడ‌డంకోసం తెర‌వెనుక పెద్ద‌ డ్రామానే న‌డుపుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు.. వైసీపీ నేతలకు బిగిసిన ఉచ్చు!

అన్నమయ్య జిల్లా, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి  నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. వీరంతా వైసీపీ నేతలే కావడం గమనార్హం. మదలపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని తొలి నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో ఆ ఆరోపణలలో బలం ఉందని తేలిపోయింది.  వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్‌ ఛైర్మన్‌ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. . కేసు వివరాలను మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు. మొత్తం8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ   కోయ ప్రవీణ్ ప్రకటించిన సంగతిత  తెలిసిందే. ఇప్పుడు  తాజాగా ఈ నాలుగురిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.    నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా వారి దగ్గర  భూముల పత్రాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా ఇంటి నుంచి 8 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో  కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 10 దస్త్రాల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్‌ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్‌ లు లభ్యమయ్యాయి. మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిందితులపై ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల  ట్యాంపరింగ్, దొంగతనం, చోరీ సొత్తు కలిగి ఉండటంతో పాటు సాక్ష్యాలు మాయం చేయడం, నిందితులకు సహకరించడం వంటి ఆరోపణలపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు  చేశారు. ఇలా ఉండగా  నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన వైసీపీ నేతలు యాంటిసిపేటరీ బెయిలు కోసం కర్నూలు కోర్టును ఆశ్రయించారు.  తమపై నమోదు చేసిన కేసుల వివరాలను తెలపాలని, అలాగే  తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వీరు కర్నూలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా ఉండగా ఈ వైసీపీ నేతల నివాసాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లే సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్ధం కేసులో కీలకమని పోలీసులు చెబుతున్నారు.   

వైసీపీకి షాక్?..ఏంపీలు గోడ దూకేస్తున్నారా?

వైసీపీకి త్వరలో ఆ పార్టీ ఎంపీలు ఝలక్ ఇవ్వనున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. రానున్న రోజులలో జగన్ కు భారీ షాక్ తప్పదని అంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. మెజారిటీ రాజ్యసభ సభ్యులు   పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో అవసరమైన బలంలేరు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులు రాజ్యసభ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే బయట నుంచి మద్దతు అవసరం. అయితే అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే.. ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే మేలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే వారు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లింది, ఆ పార్టీలో చేరడానికి కాదు, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చేరేందుకు వారు బీజేపీ సహాయం కోరుతున్నారు.  వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చకోక, అహంకారంతో వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీలో ఎంపీలు ఇమడ లేకపోతున్నారు.  అన్నిటికీ మించి రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్వానం అంటూ జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా అట్టర్ ప్లాప్ కావడం,  గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకున్నట్లు రోజుకోక కుంభకోణం బయటపడుతుండటంతో వైసీపీ నేతలలో భయం ఏర్పడంది. అన్నిటికీ మించి ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కేవలం జగన్ అన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా వైసీపీతో, జగన్ తో అంటకాగితే రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. దీంతో వారు పార్టీకి దూరం జరుగుతున్నారు. బీజేపీలో చేరడం కంటే.. తప్పులు ఒప్పుకుని చెంపలేసుకుని తెలుగుదేశం గూటికి చేరడమే మేలని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. అయితే నేరుగా తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్లేందుకు దారులన్నీ మూసుకుపోవడంతో.. బీజేపీ ద్వారా తెలుగుదేశంకు దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. అయితే   ఎంత మంది వైసీపీ ఎంపీలు పార్టీ మారతారన్న కచ్చితమైన సమాచారం లేదు. విశ్వసనీయ వర్గాలు, వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కనీసం ఐదుగురు ఎంపీలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.   ఏదిఏమైనా ఐదారుగురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు.  

జగన్ మారడు.. వైసీపీ మిగలదు!

వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో సీఎం  వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌ల‌వాలంటే వైసీపీ నేత‌ల‌కే సాధ్యం కాక‌పోయేది. కేవ‌లం ఐదారుగురు నేత‌ల‌కు మాత్రమే జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్‌లోకి అడుగుపెట్టే యాక్సెస్ ఉండేది. వారు మిన‌హా పార్టీలో ముఖ్య‌ నేత‌లు జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌న్నా.. నెల‌ల త‌ర‌బ‌డి వేచి ఉండాల్సి వ‌చ్చేంది. ఇదంతా ఒకెత్తు.. జ‌గ‌న్ ఎక్క‌డైనా బ‌హిరంగ స‌భ‌ల‌కు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారంటే.. ఆ ప్రాంతంలో అధికారులు చుట్టూ ప‌ర‌దాలను క‌ట్టేవారు. పోలీసులు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లను హౌస్ అరెస్టులు చేసేవారు.. చెట్లను న‌రికేసేవారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా జగన్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కుండా పోలీసులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టేవారు. రాజ‌కీయ నాయ‌కుడు అంటే ఆయన ఏ ప‌ద‌విలో ఉన్నా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వాటిని ప‌రిష్క‌రించేవాడు అని అర్ధం. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ అర్ధాన్నే మార్చేశారు. రాజ‌కీయ నాయ‌కుడు అంటే ఓ రాజ్యానికి రాజులా.. ప్ర‌జ‌ల‌ను అంట‌రానివారిగా చూడాల‌న్న‌ట్లుగా ఐదేళ్లు సీఎం హోదాలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఆయ‌న‌ వ్య‌వ‌హార‌శైలిపై ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. అయినా మార్పురాక‌పోవ‌డంతో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కేవ‌లం 11 సీట్ల‌కే వైసీపీని ప‌రిమితం చేసి ప్ర‌తిప‌క్ష హోదాకు కూడా జగన్, ఆయన పార్టీ తగదని తీర్పిచ్చారు. అంత దారుణ ఓట‌మి త‌రువాత కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అహంకార‌ం ఇసుమంతైనా తగ్గలేదు. ఆయన తీరు ఏ మాత్రం మారలేదు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత కొంద‌రు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఒకింత సంతోషం వ్య‌క్తం చేశారు. ఎందుకంటే.. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధినేత‌ను క‌లిసే అవ‌కాశం రాలేదు. ప్ర‌తిప‌క్షంలో ఉంటే అయినా అప్పుడ‌ప్పుడు జ‌గ‌న్ ప్ర‌జల్లోకి వ‌స్తారు, త‌ద్వారా ఆయ‌న్ను క‌లిసే అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. అంతేకాదు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసేందుకు తాడేప‌ల్లి ప్యాలెస్ కు వెళ్లినా ఈజీగా అపాయింట్‌మెంట్ దొరుకుతుంద‌ని భావించారు. కానీ, అధికారం కోల్పోయినా  జ‌గ‌న్ తీరులో మార్పురాలేదు. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టాలంటే అభిమ‌న్యుడు ప‌ద్మ‌వ్యూహం చేధించుకొని వ‌చ్చినట్లే‌..  సుమారు వంద మంది సెక్యూరిటీని దాటుకొని జ‌గ‌న్ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టాలి. అది సాధ్యం కాని ప‌ని. ప‌లు జిల్లాల నుంచి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ద్ద‌కు వ‌చ్చి సెక్యురిటీ సిబ్బందితో తిట్లుతిని వెనుదిరిగి వెళ్లాల్సిన ప‌రిస్థితి. తాజాగా అలాంటి ఘ‌ట‌న ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌తిప‌క్షంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఈజీగా క‌ల‌వొచ్చు.. మ‌న స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌చ్చ‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తాడేప‌ల్లి ప్యాల‌స్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. అక్క‌డి వ‌చ్చిన వారికి అస‌లు విష‌యం అర్థ‌మైంది. ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌రువాత కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అహంకారం త‌గ్గ‌లేద‌ని.   జ‌గ‌న్ ను క‌లిసేందుకు దాదాపు   వైసీపీ కార్య‌క‌ర్త‌లు తాడేప‌ల్లి నివాసం వ‌ద్దకు వ‌చ్చారు. జ‌గ‌న్ ను క‌లిసే అవ‌కాశం ఇవ్వాల‌ని అక్క‌డ సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్నారు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది స‌సేమిరా అన్నారు. మేమంతా వైసీపీ కార్య‌క‌ర్త‌లం. పార్టీ కోసం గ‌త ప‌దేళ్లుగా ప‌నిచేస్తున్నాం. మాకు కూడా ఆయ‌న్ను క‌లిసే అవ‌కాశం లేదా అంటూ ప్ర‌శ్నించారు. అయినా సెక్యురిటీ సిబ్బంది నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. దీంతో జై జ‌గ‌న్‌.. జైజై జ‌గ‌న్ అంటూ నినాదాలు చేశారు. ఈ స‌మ‌యంలో ఓ జిల్లా స్థాయి వైసీపీ నేత ఎవ‌రితోనూ ఫోన్లో మాట్లాడాడు. ఆ త‌రువాత ఫోన్ లో వ్య‌క్తితో మాట్లాడండి అంటూ సెక్యురిటీ సిబ్బందికి ఫోన్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ ఫోన్‌ను తీసుకున్న సెక్యురిటీ సిబ్బందిలోని ఓవ్య‌క్తి ఫోన్‌ను ప‌క్క‌నే ఉన్న గార్డెన్‌లో విసిరేశాడు. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఇలా చేయ‌ బ‌ట్టే 11 సీట్లకు వైసీపీ ప‌రిమిత‌మైంది. ఇంకా మార్పు రాక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ మాత్రం సీట్లు గెలిచే ప‌రిస్థితి కూడా ఉండ‌దు అంటూ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో సెక్యురిటీ సిబ్బంది  కార్య‌క‌ర్త‌లను దాదాపు మెడపట్టి తోసేసినంత పని చేశారు. దీంతో  వైసీపీ కార్య‌క‌ర్త‌లు  జగన్ ను తిట్టుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.  అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని ప‌రిష్క‌రించే నేత‌కే ప్ర‌జ‌ల్లో   ఆద‌ర‌ణ ఉంటుంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలా ఆయ‌న‌కు అవ‌స‌రం ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే ప్ర‌జ‌లు స‌రియైన స‌మ‌యంలో స‌రైన రీతిలో గ‌ట్టి గుణ‌పాఠం చెబుతారు. జగన్ కు అలాగే చెప్పారు కూడా. ప్ర‌స్తుతం జ‌గ‌న్ తాడేప‌ల్లి క్యాంప‌స్ వ‌ద్ద వైసీపీ నేత‌ల‌కు జ‌రిగిన అవ‌మానానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ ప్ర‌జ‌ల మ‌ధ్యనే ఎక్కువ‌గా ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. వారిని చూసి నేర్చుకో జ‌గ‌న్ అంటూ సూచ‌న‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో మార్పు రాకుంటే రాబోయే కాలంలో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లంతా మూకుమ్మ‌డిగా పార్టీకి రాజీనామా చేసే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉంటాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. జగన్ అహంకారం వైసీపీని ఖాళీ అయ్యేలా చేస్తుందని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

ఏపీలో ఆశావర్కర్ల శిక్షణ కార్యక్రమాల వివరాలు తెలపండి!

ఆశావర్కర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లోక్ సభలో సంధించిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స‌హాయ మంత్రి అనుప్రియ ప‌టేల్ బ‌దులిచ్చారు. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల‌ల్లో ఆశా కార్మికుల కోసం నిర్వ‌హించిన శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల వివ‌రాలు తెలియ‌జేయాల‌ని, అలాగే  ఎపిలో జిల్లాల వారీగా ఆశా వ‌ర్క‌ర్స్ సంఖ్య   తెల‌పాలని కేశినేని చిన్ని కోరారు.  2024 మార్చి 31నాటికి రాష్ట్రంలో మొత్తం 42,518 ఆశా వ‌ర్క‌ర్స్ (జాతీయ ఆరోగ్య మిషన్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్టు ప్రకారం నియమితులైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు.    ఆశా వ‌ర్కర్స్ నియ‌మాకానికి సంబంధించిన వివ‌రాలు కేంద్రం వ‌ద్ద వుండ‌వ‌ని చెప్పారు. ఇక గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన స‌మాచారం మేర‌కు  ఆశా వ‌ర్క‌ర్లు కంటి,ఈ.ఎన్.టి., అత్య‌వ‌స‌ర సేవ వైద్య సేవ‌లు, ప్యాలియేటివ్ కేర్ వంటి సేవ‌ల్లో శిక్ష‌ణ పొందిన‌ట్లు తెలియ‌జేశారు.

జగన్ పార్టీ పాలెగాళ్ళు పరార్!

జగన్ పార్టీ అధికారంలో వున్నప్పుడు తొడలు కొట్టిన, వెంట్రుక కూడా పీకలేరు అన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రస్తుతం రాష్ట్రంలో కనపడటం లేదు. అధికారంలో వున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తాము అధికారంలో వున్నా, అధికారంలో లేకపోయినా ప్రజలతోనే వుంటామని బిల్డప్పులు ఇచ్చారు. ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ దాదాపు ఒక నెల రోజులపాటు బయటకి వచ్చి జనానికి ముఖాలు కూడా చూపించలేదు. సర్లే, నెల రోజులు బయటకి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, రెండు నెలలు గడుస్తోన్నప్పటికీ చాలామంది మాజీ ఎమ్మెల్యేలు బయట కనిపించడం లేదు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాలలో కార్యకర్తలకు అండగా వుండాల్సిన మాజీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం వున్న ఒక నియోజకవర్గ మాజీ  వైసీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని వదిలి కుటుంబంతో సహా ఎటో వెళ్ళిపోయాడు. అనంతపురం జిల్లాలో ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కార్యకర్తలకు అందుబాటులో ఉంటన్నారు. చాలా మంది మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కుటుంబంతో సహా ఆంధ్రప్రదేశ్‌ని వదిలి వెళ్లిపోయారు, కార్యకర్త లకు ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదు. 

రేషన్ బియ్యం వాహనాలు పరమవేస్టు!

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సివిల్ సప్లైస్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలో రేషన్ బియ్యం పంపిణీ వాహనాలు- ఎండీయీలపై కీలక చర్చ జరిగింది. ఎండీయూ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎండీయు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే  ఛాన్స్ ఉందన్నారు. ఎండీయు వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని మంత్రి అన్నారు. వీధి చివర వాహనం పెట్టి మాత్రమే బియ్యం పంపిణీ చేశారని, రేషన్ డోర్ డెలివరీ పేరుతో 1,844 కోట్ల రూపాయలతో తో 9260 వాహనాలు గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు వెల్లడించారు.  రేషన్ బియ్యం తరలింపు వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్‌కు వాడుకున్నారన్న అంశాన్ని సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావన తీసుకొచ్చారు. రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులకు నిర్ణయం తీసుకున్నారు. పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉంచాలని మంత్రులతో పాటు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 2019 ముందు వరకు సివిల్ సప్లైస్ శాఖ అప్పులు 21,622 కోట్ల రూపాయలు కాగా.. ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను  41550 కోట్ల రూపాయలకు తీసుకు వెళ్లిందని ముఖ్యమంత్రి అన్నారు. రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

తాప్సీ భర్త షాకింగ్ నిర్ణయం!

తాప్సీ భర్త మథియాస్ బో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్.లో బ్యాడ్మింటన్ డబుల్స్ పతకం తెస్తారని భావించిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీకి కోచ్ మరెవరో కాదు.. మథియాస్ బోనే. అయితే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఈ జోడీ అనూహ్య రీతిలో ఓడిపోయింది. దాంతో వీరిద్దరికీ కోచ్ అయిన మథియాస్ బో వైరాగ్యంలో పడిపోయారు. తన కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో తెలియజేస్తూ ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు. ‘‘కోచ్‌గా నా ప్రయాణం ముగిసింది. ఇక భారతదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడా కోచ్‌గా బాధ్యతలు తీసుకోను. నా జీవితంలో ఎక్కువ సమయాన్ని బ్యాడ్మింటన్ హాల్‌లో ఖర్చుపెట్టేశాను. కోచ్ బాధ్యత కొంత ఒత్తిడితో కూడుకున్నదే. నేను బాగా అలసిపోయాను. నాకు కోచ్‌గా అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కి ధన్యవాదాలు. సాత్విక్ - చిరాగ్‌లో ఇప్పుడు ఎంత బాధ వుందో నేను అర్థం చేసుకోగలను. జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో తీర్చిదిద్దుకోవడానికి ఎంత శ్రమించినప్పటికీ, ఒలింపిక్స్.లో ఫలితం దక్కలేదు. ఇండియాకి పతకం తీసుకెళ్ళాలని భావించారు. కానీ, ఈసారి అవకాశం రాలేదు. గాయాలు వున్నప్పటికీ అంకితభావంతో ఆడి ఇద్దరూ మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. దీనికి నేను గర్విస్తున్నాను’’ అని మథియాస్ బో తన పోస్టులో పేర్కొన్నారు. మథియాస్ బోతో తాప్సీ వివాహం ఈ ఏడాది మార్చిలో జరిగింది.