పారిస్ ఓలింపిక్స్ సెమీస్ లో భారత్ షట్లర్ లక్ష్యసేన్ ఓటమి
posted on Aug 5, 2024 7:06AM
పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణంపై గురి పెట్టిన భారత ఏస్ షట్లర్ లక్ష్యసేన్ సెమీల్ లో పరాజయం పాలైయ్యాడు. అయితే లక్ష్యసేన్ కాంస్య పతకం సాధించే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్(డెన్మార్క్) చేతిలో 22-20, 21-14 తేడాతో లక్ష్యసేన్ వరుస సెట్లలో పరాజయం పాలై ఫెనల్స్ చేరే అవకాశం చేజార్చుకున్నాడు. సెమీస్ లో పరాజయం పాలైనా కాంస్యం కోసం జరిగే పోరులో విజయం సాధిస్తే పతకం గెలుచుకునే అవకాశాలు మిగిలే ఉన్నాయి.
భారీ అంచనాలతో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచినా లక్ష్యసేన్ వినా మిగిలిన వారంతా రిక్తహస్తాలతోనే వెనుదిరిగారు. హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్‌పై గురి పెట్టిన పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరగ్గా… గోల్డ్ తెస్తారని అనుకున్న డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. కానీ, అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే సంచలన ఆట తీరుతో ముందుకెళ్తున్న యంగ్‌స్టర్ లక్ష్యసేన్ సెమీఫైనల్ చేరి పతక ఆశలు సజీవంగా నిలిపాడు. సెమీస్ తొలుత రెండు గేమ్‍ల్లోనూ ముందుగా ఆధిక్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‍లో ఓ దశలో 11-9తో ముందుకు వెళ్లిన లక్ష్య సేన్ చివరికి చివరికి 20-22తో తొలి గేమ్ లో పరాజయం పాలయ్యాడు. రెండో గేమ్ లో కూడా తొలుత ఆధిక్యత ప్రదర్శించిన లక్ష్య సేన్ చివరికి 14-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.