ఏపీలో ఆశావర్కర్ల శిక్షణ కార్యక్రమాల వివరాలు తెలపండి!
posted on Aug 4, 2024 6:32AM
ఆశావర్కర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లోక్ సభలో సంధించిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ బదులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లల్లో ఆశా కార్మికుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల వివరాలు తెలియజేయాలని, అలాగే ఎపిలో జిల్లాల వారీగా ఆశా వర్కర్స్ సంఖ్య తెలపాలని కేశినేని చిన్ని కోరారు. 2024 మార్చి 31నాటికి రాష్ట్రంలో మొత్తం 42,518 ఆశా వర్కర్స్ (జాతీయ ఆరోగ్య మిషన్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్టు ప్రకారం నియమితులైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఆశా వర్కర్స్ నియమాకానికి సంబంధించిన వివరాలు కేంద్రం వద్ద వుండవని చెప్పారు. ఇక గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఆశా వర్కర్లు కంటి,ఈ.ఎన్.టి., అత్యవసర సేవ వైద్య సేవలు, ప్యాలియేటివ్ కేర్ వంటి సేవల్లో శిక్షణ పొందినట్లు తెలియజేశారు.