అవును.. మా ఇద్దరికీ సంబంధం వుంది... దువ్వాడ!

తనకు, దివ్వెల మాధురికి సంబంధం వుందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంలో చాలా స్పష్టత ఇచ్చారు. తనకు తన భార్య దగ్గర విలువ లేదని, ఆమె దివ్వెల మాధురికి, తనకు సంబంధం అంటగడుతూ ప్రచారం చేసిందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఒక హోటల్ రూమ్‌లో మాధురి ఈ విషయంలో బాధపడిందని, తనముందే ఆత్మహత్య చేసుకోబోయిందని, అప్పుడు ఆమెని కాపాడి, ధైర్యం చెప్పి అమెకి చేరువ అయ్యానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. తాను ఏ రంగంలో ఎదిగినా తన భార్యకు ఇష్టం వుండదని, తనను ఎప్పుడు చిన్నచూపు చూస్తుందని, చివరికి తన కూతుళ్ళని కూడా తనకు దూరం చేసిందని శ్రీనివాస్ చెప్పారు. భార్య నుంచి మానసిక వేదనను అనుభవించిన తాను దివ్వెల మాధురికి దగ్గరయ్యానని చెప్పారు. తమది అక్రమ సంబంధం కాదని, పెళ్లయిన పురుషులు, మహిళ ఇష్టపడితే కలసి జీవించవచ్చని చట్టమే చెబుతోందని ఆయన అన్నారు.

దువ్వాడ ఇంటి ముందు రచ్చ రంబోలా!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం వ్యవహారం రచ్చ రంబోలాగా మారుతోంది. శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్, ఆయనతో సహజీవనం లాంటి ‘అడల్ట్రీ’ జీవనం చేస్తున్న దివ్వెల మాధురి ఇంటి ముందుకు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు వెళ్ళారు. ఇంటి బయట వాళ్ళు ఎంతసేపు వేచి చూసినా లోపల నుంచి స్పందన లేదు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, దువ్వాడ కుమార్తెలు మీడియా ముందు తమ బాధను వెళ్ళబోసుకున్నారు. దివ్వెల మాధురి మాయలో దువ్వాడ శ్రీనివాస్ పడిపోయారని, తమని పట్టించుకోవడం మానేశారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం టెక్కలిలో దివ్వెల మాధురి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనకు, దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధం వుందని, ఇద్దరం కలసే వుంటున్నామని, భవిష్యత్తులో ఇద్దరం పెళ్ళి చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం ఏ వైసీపీ నాయకుల మీద ఇల్లీగల్ వ్యవహారాల ఆరోపణలు వచ్చినా, ‘నేను పత్తిత్తుని’ అని చెప్పడం మాత్రమే చూసి తరించిన జనం.. ‘అవును.. నాకు, దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధం వుంది’ అని ధైర్యంగా చెప్పిన దివ్వెల మాధురి ధైర్యాన్ని చూసి నోరు తెరిచారు.  ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు రచ్చ రంబోలా జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్, మాధురి వుంటున్న ఇంటికి వెళ్ళారు. పోలీసుల సాక్షిగా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళని లోపలకి రానివ్వకుండా బయటకి నెట్టేశారు. వీళ్ళని ఆవేశంగా దుర్బాషలాడారు. ఒకవైపు వీళ్ళని, మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ని ఆపలేక పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ విషయంలో జగన్ అర్జెంటుగా జోక్యం చేసుకుని దువ్వాడని దారిలో పెట్టాలని, లేకపోతే దువ్వాడని ఎమ్మెల్సీ పదవిలోంచి పీకేయాలని దువ్వాడ భార్య, కుమార్తెలు డిమాండ్ చేస్తున్నారు.

మళ్లీ ‘జన్మభూమి’.. గతం కంటే మెరుగ్గా!

చంద్రబాబు సర్కార్   మళ్లీ జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టాలని ప్రకటించింది. గతంలో జన్మభూమి పథకం కేవలం తెలుగుదేశం కార్యకర్తలకే లాభం చేకూరిందనే విమర్శలు వచ్చాయి. జన్మభూమి కమిటీలపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఈ కార్యక్రమం కొన్నాళ్లకు యాంత్రికంగా తయారైంది. నోడల్ అధికారుల వ్యవస్థపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సారి జన్మభూమి కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా,  పటిష్టంగా ప్రజా సమస్యల పరిష్కార సాధనకు ఉపయోగ పడేలా ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణతో మరింత సమర్ధవంతంగా అములు చేయాలన్న పట్టుదలను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు.  1995లో చంద్రబాబు సీఎం అయిన తరువాత జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికారయంత్రాంగాలను కలుపుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా పరిచయం చేసారు. ఇందులో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేసారు. ఒక ఊరిని,ప్రదేశాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి సహకరించే లా తీర్చిదిద్దారు. దీనిని అంశాల వారిగా మహిళా జన్మభూమి,  రైతు జన్మభూమి,కార్మిక జన్మభూమి గా విభజించి వారి సమస్యలు పరిష్కారానికి బాటలు వేసారు. జన్మభూమి పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పుడు దానిని మరింత మెరుగుపరచి రెండో జన్మభూమి గా పరిచయం చేయనున్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం.పేదరిక నిర్మూలన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం మరింత గొప్పగా ఉంది.   ఏదిఏమైనా జన్మభూమి కార్యక్రమంపై గతంలో వచ్చిన విమర్శలకు తావు లేకుండా ప్రజల కోసం చిత్తశుద్ధితో అమలు చేయాలి.మొక్కబడిగా కాకుండా నిర్మాణాత్మకంగా రూపొందిస్తే విజయం సాధించి ప్రజలు మన్ననలను పొందుతుందనగంలో ఎటువంటి సందేహం లేదు.

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చంద్రబాబు!

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (10-8-24) రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక  చంద్రబాబు ట్రస్ట్ భవన్‍కు  రావడం ఇది రెండో సారి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సాయంత్రం 4 గంటలకి ఆయన తెలంగాణ తెలుగుదేశం  నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణ తెలుగుదేశం నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. శుక్రవారం మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో  పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడి ఎంపిక, సభ్యత్వ నమోదు అంశం చర్చకు వచ్చాయి.  శనివారం (ఆగస్టు 10)  హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగే  తెలంగాణ తెలుగుదేశం ముఖ్య నేతల సమావేశంలో  పార్టీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడి నియామకం తరువాత పూర్తిస్థాయిలో తెలంగాణ  రాజకీయాలపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.

బంగ్లాలో హిందువులపై దాడులు... హైదరాబాద్ అలర్ట్ 

నిన్న రిజర్వేషన్లతో అట్టుడికి బంగ్లాదేశ్ నేడు హిందువులపై దాడులతో అట్టుడికుతోంది. పలు దేవాలయాల మీద బంగ్లా ముస్లింలు దాడులు చేస్తున్న నేపథ్యంలో హైద్రాబాద్ అలర్ట్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ మతకలహాలు జరిగినా ఆ ప్రభావం హైద్రాబాద్ పై పడుతుంది. ఇప్పటికే పాతబస్తీలో అదనపు పోలీస్ బలగాలు మొహరించాయి. బంగ్లాలో శాంతిభధ్రతలు అదుపు తప్పడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకున్నారు. అభధ్రతా భావంలో ఉన్న ప్రజలు బెంగాల్ గుండా హైద్రాబాద్ లోకి చొరబడుతున్నట్టు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ కు సమాచారమందింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం బంగ్లాలో అధికారంలో ఉంది. కేవలం 8 శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. ఎక్కువగా కృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కడ హిందువులు రోడ్డెక్కారు. మేమే ఈ దేశ ప్రజలమని నినదిస్తున్నారు. 170 మిలియన్లలో ఎనిమిది శాతం ఉన్న హిందువులు శాంతిని నెలకొల్పాలని నినదిస్తున్నారు. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు పలువురు ముస్లింలు రక్షణగా నిలిచారు. బంగ్లాదేశ్ నుంచి రోహ్యింగాలు ఎక్కువగా పాతబస్తీలో బస చేస్తున్నారు. వారికి ఆధార్ కార్డులు, వోటర్ కార్డులు కూడా వచ్చేశాయి. ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో రోహ్యింగాలు పాత బస్తీలో మకాం వేశారు.తాజాగా బంగ్లా నుంచి హిందువులు ఎక్కువగా హైద్రాబాద్ కు వచ్చే అవకాశాలున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ కు సమాచారమందింది. ‘‘హైదరాబాద్ లో అత్యంత పురాతన దేవాలయాలు ఉన్నాయి.  గంగా జమునా తెహజీబ్ కు హైదరాబాద్  ప్రతీక. లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో దేశానికే హైదరాబాద్  ఆదర్శం. మరీ ముఖ్యంగా ఇక్కడ  ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. హిందువుల పండుగల్లో ముస్లింలు.. ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. తాజాగాజరుగుతున్న అల్లర్లలో అక్కడ బంగ్లా ముస్లింలు హిందూ దేవాలయాలకు రక్షణ వలయంగా నిలిచారు. హైదరాబాద్ ముస్లింలు కూడా రక్షణగా నిలుస్తారు.  అల్లర్లు జరిగినప్పుడు  స్థానిక   ముస్లింలే వలయంగా నిల్చొని  గాజిబండ కామాక్షి దేవాలయాన్ని రక్షించిన విషయాన్ని  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, మానసిక నిపుణురాలు యమునాపాఠక్  గుర్తు చేశారు. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకురాలుగా కొనసాగుతున్న ఆమె హైద్రాబాద్ లో విద్వేషాలను రెచ్చగొట్టడం సరి కాదన్నారు. హిందువులు, ముస్లింలు కల్సి పండగలు చేసుకునే సాంప్రదాయం అనాదిగా  కొనసాగుతుందన్నారు. కష్ట సమయంలో హిందువులకు ముస్లింలు అండగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో అండగా నిలుస్థారని యమునాపాఠక్ విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో మొహరింపు ఎక్కువయ్యింది. 

ఒంగోలులో 19 నుంచి ఈవీఎంల పరిశీలన.. ఈసీ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.  ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 12 పోలింగ్ కేంద్రాలపై వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.   ఆయా కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలోని ఓట్లను రీకౌంటింగ్ చేయాలని కోరుతూ  ఇందుకోసం జూన్‌ 10న ఆయన రూ.5,66,400 ఫీజుగా చెల్లించారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈవీఎంల పరిశీలనకు అంగీకరించింది. నిబంధనల మేరకు భెల్ ఇంజినీర్లతో డమ్మీ బ్యాలెట్ లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదు దారుల సమక్షంలో ఈ నెల 19 నుంచి 24 వకరకూ ఒంగోలులో బాలినేని ఫిర్యాదు చేసిన 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తారు. 

కుప్పకూలిన విమానం.. బ్రెజిల్ లో 62 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో శుక్రవారం (ఆగస్టు 9) జరిగిన విమాన ప్రమాదంలో   62 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో  కుప్ప కూలి పోయింది.  కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే, స్థానికులెవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారం భించారు.   

రెజ్లింగ్ లో అమన్ కు కాంస్య పతకం

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. రెజ్లింగ్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ కాంస్యం సాధించారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఇది ఆరో పతకం. పురుషుల రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో శుక్రవారం జరిగిన పోరులో అమన్ షెరావత్ ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్ ను ఓడించి కాంస్య పతకం సాధించాడు.  పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించాడు. భారత్‌కు ఇది ఆరో పతకం. కాంస్య పతకం కోసం నిన్న 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్‌ను ఓడించి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు.  అంతకు ముందు గురువారం జరిగిన సెమీస్ పోరులో  జపాన్ రెజ్లర్ రీ హిగుచి చేతిలో పరాజయం పాలైన ఆమన్.. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో ఎలాంటి పొరపాటుకూ తావివ్వకుండా 13-5 తేడాతో విజయం సాధించాడు.  

ఇంకా పరారీలోనే భూం భూం వాసుదేవరెడ్డి

ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాసుదేవరెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం  సీఐడీకి బదిలీ చేస్తోంది. ప్రధానంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలను ప్రభుత్వ దుకాణాల ద్వారా పెద్ద ఎత్తున జరిపించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అవి ఎంత మేర జరిగాయన్న దానిపై విచారణ చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గడచిన ఐదేళ్లలో 99 వేల కోట్ల రూపాయల మేర నగదుగా మద్యం విక్రయాలు ఎందుకు జరిపారన్న అంశంపై వాసుదేవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. నకిలీ హోలోగ్రామ్​లు అంటించిన మద్యం బాటిళ్లను కూడా మద్యం దుకాణాల ద్వారా విక్రయించి ఆ సొమ్మును దారిమళ్లించారని ఇప్పటికే  ప్రాథమిక విచారణలో వెల్లడైంది.  అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, డిస్టిలరీల నుంచి అక్రమమార్గాల్లో వచ్చిన నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్ వ్యవహారం కూడా వాసుదేవరెడ్డి కనుసన్నల్లో జరిగినట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్దల  ఆదేశాలకు అనుగుణంగా   వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఇప్పటికే ఎక్సైజ్ శాఖలో గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు లేకుండానే టెండర్లు ఇచ్చినట్లు సమాచారం. హోలోగ్రామ్ కంపెనీలకు ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇష్టారీతిగా, నిబంధనలను తుంగలో తొక్కి మరీ టెండర్లు కట్టబెట్టినట్లు ఇప్పటికే విచారణలో వెల్లడైంది. మరోవైపు ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా వాసుదేవరెడ్డి ఇప్పటికీ  పరారీలోనే ఉన్నారు. సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసు ద్వారా విచారణకూ వాసుదేవరెడ్డి గైర్హాజరయ్యారు. దాదాపు రెండు నెలలుగా ఆయన పరారీలోనే ఉన్నారు.   జూన్   7న వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పటికే  వాసుదేవరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సీఐడీ బృందాలు ఆయన కోసం గాలిస్తూనే ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా సాగించిన మద్యం కుంభకోణంలో ఏపీఎస్‌బీసీఎల్‌  మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో  జరిగిన దోపిడీకి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను సైతం వాసుదేవరెడ్డి మాయం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇప్పటికే సీఐడీ గుర్తించింది.

ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ప్రవేశానికి నోటిఫికేషన్ త్వరలో

ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. కాగా  ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశం కోసం ఈ నెల 16 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అక్టోబరు 1 నాటికి వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామనీ, అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రం మొత్తమ్మీద 35 మెడికల్ కాలేజీల్లో 6,210 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఎంబీబీఎస్ 'ఏ' కేటగిరీ కింద 3,856 సీట్లు కేటాయించామని వివరించారు. సీట్ల భర్తీ కోసం మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎ అటు రాష్ట్రవ్యాప్తంగా 1,540 బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు.  

తెలంగాణలో ఇక ‘స్థానిక ’ పోరు

తెలంగాణలో స్థానిక పోరుకు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జోరందుకుంది. పంచాయతీ ఎన్నికలలో అత్యం కీలకమైన వార్డుల విభజనపై ప్రభుత్వం దృష్టి సారించింది.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి.  ఇందుకు సంబంధించి  జిల్లా ప్రాజెక్టు మేనేజరు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు హైదరాబాద్‌లో శిక్షణ కూడా నిర్వహించారు. శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్లతో జిల్లాలోని ఎంపీడీవో, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం (ఆగస్టు 8) ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా వార్డుల విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌ ఎన్నికల ఓటరు జాబితాను అందించాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికల సంఘం నుంచి నియోజకవర్గం, మండలాలు, గ్రామాల వారీగా ఓటరు జాబితా రాగానే వార్డుల వారీగా విభజన చేపట్టనుంది. వార్డుల విభజనకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాల పై మాస్టర్‌ ట్రైనర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఒకే కుటుంబం అంతా ఒకే వార్డు పరిధిలో ఉండేలా విభజన చేయాలని  ప్రభుత్వం ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఒక కుటుంబంలో ఓటర్లు రెండు, మూడు వార్డుల్లో ఉండడం, కొన్ని చోట్ల ఇతర గ్రామాల్లోనూ ఓటరుగా నమోదు అయి ఉండ డం లాంటివి గుర్తించిన నేపథ్యంలో ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను అంతా ఒక వార్డు పరిధిలోకే వచ్చేలా విభజన చేయనున్నారు. ఈ క్రమంలో గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకొని జాబితా తయారు చేయా లని సర్కార్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటరు లిస్ట్‌లో కుటుంబ సభ్యులం తా ఒకే వరుస క్రమంలో ఉం డేలా చూసుకో వాలని  కూడా ప్రభుత్వం సూచించింది. ఇందు కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను   సిద్ధం చేసింది. ఆ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వార్డుల విభజన చేయనున్నారు.  వార్డుల విభజనకు ప్రభుత్వం ఎలాంటి గడువు విధించలేదు.   గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పం చి ఎన్నికలను మూడు విడతలుగా ప్రభుత్వం నిర్వహిం చనుంది. ఒకే సారి ఎన్నికలు నిర్వహిం చేందుకు సిబ్బంది సరిపడకపోవ డంతో మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తుంటారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు, 2564 వార్డులకు ఎన్నికలు జరుగు తాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది కేటాయింపుపై ఎన్నికల సంఘం గతంలోనే మార్గద ర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ఒక్కో వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల ప్రాతిపదికన పోలింగ్‌ కేంద్రాలకు ప్రిసై డింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారులను కేటాయించనున్నారు. 200 ఓట్ల లోపు ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారి, 200-400 ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 650 పైన ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. 650 ఓట్లు పైన ఉన్న గ్రామాల్లో రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం గత ఏడాది డిసెంబరులో సూచించింది.   ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పదవీకాలం పూర్తి అయ్యే లోపే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది.  అయితే గత ఏడాది డిసెంబర్ లో  అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం  అధికారంలోకి రావడం, దీంతో సమయాభావం కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత జాప్యం అనివార్యం అయ్యింది.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 9) శ్రీవారిని మొత్తం 65 వేల 131 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది. ఇక శనివారం ఉదయం శ్రీవారి ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వారికి  శ్రీవారి దర్శనానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతోంది.  ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.  

ఇల్లీగల్ ఎఫైర్స్.. వెలుగులోకి వైసీపీ నేత‌ల బండారం

ఏపీలో ప్ర‌తిప‌క్ష వైసీపీ  పేరు త్వ‌ర‌లోనే ఇల్లీగ‌ల్ ఎఫైర్స్ పార్టీగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ పార్టీ నేత‌ల చీక‌టి కోణాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.  రాష్ట్ర ప్ర‌జ‌లను విస్మ‌యానికి గురి చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కొంద‌రు నేత‌ల రాస‌లీలల‌కు సంబంధించిన ఆడియోలు వెలుగులోకి వ‌చ్చాయి. అధికారం కోల్పోయిన త‌రువాత ఆ పార్టీ  నేత‌ల ఇల్లీగ‌ల్  ఎఫైర్స్ ఒక్కొక్క‌టీ వెలుగులోకి వ‌స్తున్నాయి. అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లు అవినీతి, అక్ర‌మాల‌తో ప్ర‌జా ధనాన్ని దోచుకున్న వైసీపీ నేత‌లు.. అదే త‌ర‌హాలో చీక‌టి వ్య‌వ‌హారాల‌ను న‌డిపారు. ఇప్ప‌టికే వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి, ఓ ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగికి ఉన్న సంబంధంపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ వ్య‌వ‌హారంపై ర‌చ్చ‌న‌డుస్తున్న నేప‌థ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ రాస‌లీల‌ల వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. అయితే వైసీపీలో ఇలాంటి ఘన కార్యాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, వారి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడియో టేపులు కూడా వస్తాయా అన్న చర్చ వైసీపీ వ‌ర్గాల్లో   జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై  వైసీపీ నేత‌లు ఇష్టారీతిలో విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ డ‌స్సులు మార్చిన‌ట్లు పెళ్లాల‌ను మార్చే్స్తారంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప‌లుసార్లు  అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అయిన మాట వాస్త‌వ‌మే. ప‌వ‌న్ నుంచి విడిపోయిన ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ప‌వ‌న్ వ‌ల్ల త‌మ‌కు ఇబ్బంది త‌లెత్తింద‌ని వారు ఏనాడూ అన‌లేదు. ప‌వ‌న్ సైతం మూడు పెళ్లిళ్ల వ్య‌వ‌హారంపై స్పందిస్తూ.. అదంతా నా త‌ల‌రాత అంటూ చెప్పుకొచ్చారు. అయినా ప‌వ‌న్  పెళ్లిళ్ల విష‌యంలో వైసీపీ నేత‌లు అడ‌పాద‌డ‌పా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ నేత‌లు ఏమైనా శ్రీ‌రామ‌చంద్రుడిలా ఏకపత్నీవ్రతులా అంటే అదీకాదు. ఏదైనా ప‌నికోసం వారి స‌హాయంకోరి వ‌చ్చిన మ‌హిళ‌ల‌ను ట్రాప్ చేసి లోబ‌ర్చుకొని ప‌లువురు వైసీపీ నేత‌లు వారి జీవితాల‌తో ఆడుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీలోని కొంద‌రు నేత‌ల వ్య‌వ‌హార‌శైలితో ప‌లువురు మ‌హిళ‌లు పార్టీ అధిష్టానానికి పిర్యాదులు కూడా చేశారు‌. అయితే. అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టంతో బాధిత మ‌హిళ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో కొంద‌రు వైసీపీ నేత‌ల అస‌భ్య‌క‌ర వ్య‌వ‌హారంపై ప‌లువురు మ‌హిళ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో దువ్వాడ శ్రీ‌నివాస్ సైతం ప‌వ‌న్ మూడ పెళ్లిళ్ల వ్య‌వ‌హారంపై విమ‌ర్శ‌లు చేసిన‌వారే. హిందూ మతాన్ని గౌర‌వించేవారు ఒకే స్త్రీని పెళ్లాడాల‌ని, కానీ, ఆ సంప్ర‌దాయాల‌కు తూట్లు పొడిచిన వ్య‌క్తి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ విమ‌ర్శ‌లు చేశాడు. దువ్వాడ‌ చెప్పిన హిందూమ‌తం సంప్ర‌దాయాలు ఎటుపోయాయి అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. నీతుల‌న్నీ ప‌క్క‌వారికి చెప్ప‌టానికేనా.. వాటిని వైసీపీ నేత‌లు పాటించ‌రా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ - వాణి దంప‌తుల‌కు పెళ్ల‌యిన‌, పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన వయసు కూడా అరవై ఏళ్లకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. అలా చేస్తూ.. సొంత కుటుంబానికి అన్యాయం చేస్తూండటంతో విషయం రోడ్డున పడింది. వైసీపీకి చెందిన మ‌హిళా నేత దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీ‌నివాస్‌ క‌లిసి ఉంటున్న‌ట్లు ఆయ‌న భార్య దువ్వాడ వాణి, వారి పిల్ల‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో దువ్వాడ ఇద్ద‌రు పిల్ల‌లు ఆయ‌న నివాసం ఉంటున్న ఇంటి వ‌ద్ద‌కు వెళ్లినా వారిని లోపలికి రానివ్వ‌లేదు. చాలాసేపు కారులో వేచిఉన్న దువ్వాడ కుమార్తెలు.. ఆ త‌రువాత తిరిగి వెళ్లిపోయారు. ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం కావ‌డంతో దివ్వెల మాధురి మీడియా ముందుకొచ్చారు.  మీడియా స‌మావేశంలో దువ్వాడ శ్రీ‌నివాస్ కు ఆమెకు ఉన్న సంబంధంపై మాధురి క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ శ్రీ‌నివాస్ భార్య వాణికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే తన భర్త దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి.. లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. కానీ, నా లైఫ్ ని మధ్యలో ఎందుకు లాగుతున్నారు అంటూ మాధ‌రి ప్ర‌శ్నించారు. తాను దువ్వాడ‌తోనే ఉంటున్నాననీ,  తనపై వచ్చిన ఈ మచ్చ లైఫ్ లో ఎప్పటికీ పోదనీ నిస్సిగ్గుగా చెప్పుకొచ్చారు. ఒక ఫ్రెండ్ గా దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటాను అంటూ మాధురి స్పష్టంగా చెప్పారు.  మొన్న విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం, తాజాగా దావ్వాడ శ్రీనివాస్ వ్య‌వ‌హారం చూసిన ఏపీ ప్ర‌జ‌లు.. అది  వైసీపీ కాదు.. ఇల్లీగ‌ల్ ఎఫైర్స్ పార్టీ అంటూ విమ‌ర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేత‌ల చీక‌టి వ్య‌వ‌హారాలు మ‌రిన్ని వెలుగులోకి వ‌స్తాయ‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది.

దువ్వాడ శ్రీనివాస్ మేటర్.. చాలా పెద్ద వ్యవహారం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వున్న విచిత్రమైన కేరెక్టర్లన్నీ కట్టకట్టుకుని వైసీపీలో ఆశ్రయం పొందినట్టు వున్నాయి. వాళ్ళలో ఒక ముఖ్యమైన కేరెక్టర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు ఆయన ఇంటి ముందు కారులో వెయిట్ చేయడం, వారిద్దరినీ ఆయన లోపలకి రానివ్వకపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కన్న కూతుళ్ళు రాత్రి వేళలో ఇంటి ముందుకు వచ్చినా, దువ్వాడ శ్రీనివాస్ లోపల వుండి కూడా స్పందించకపోవడంతో జనం దృష్టి ఈ మేటర్ మీద పడింది. శుక్రవారం నాడు ఈ మేటర్ మరింత రసకందాయంలో పడింది. మొదట దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిని తమ నుంచి దివ్వెల మాధురి అనే మహిళ దూరం చేసిందని, ఆమె వల్లే తమ కుటుంబంలో సమస్యలు తెలెత్తాయని చెప్పారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా దివ్వెల మాధురి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్తతో మాధురి అక్రమ సంబంధం పెట్టుకుని ఆయన్ని తమకు దూరం చేసిందని, ఇక తనకు దువ్వాడ శ్రీనివాస్‌తో ఎలాంటి సంబంధం, అవసరం లేదని చెప్పారు. కాకపోతే, ఆయన టెక్కలిలో తన రాసలీలలు జరపడం వల్ల తనకు, తన కుమార్తెకు సమస్యగా మారిందని, ఆయన టెక్కలి నుంచి వెళ్ళిపోతే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్తని లోబరుచుకున్న దివ్వెల మాధురి చాలామంది మహిళల అభ్యంతరకర వీడియోలు తీసి వాళ్లని బ్లాక్ మెయిల్ చేస్తోందని కూడా వాణి ఆరోపించారు. అయితే దివ్వెల మాధురి మీద వాణి చేసిన ఆరోపణలు వాస్తవాలా కాదా అనే విషయంలో చాలామందిలో సందిగ్ధం ఏర్పడింది. ఈ ముగ్గురూ వైసీపీ నాయకులే కాబట్టి, రాజకీయ కక్షలు ఏవైనా మనసులో పెట్టుకుని దివ్వెల మాధురి మీద వాణి ఆరోపణలు చేస్తున్నారన్న కోణంలో కూడా చాలామంది ఆలోచించారు. అయితే ఈ విషయంలో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని దివ్వెల మాధురి ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత క్లారిటీ వచ్చింది. దివ్వెల మాధురి చెబుతున్నదాని ప్రకారం, సమాజంలో ఎంతో ఉన్నత స్థానంలో వున్న తన మీద దువ్వాడ శ్రీనివాస్ భార్య రాజకీయాల కోసం దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. దువ్వాడ శ్రీనివాస్‌తో సంబంధం వుందని ప్రచారం చేశారు. దాంతో తనకు ఏం చేయాలో అర్థంకాక, ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, దువ్వాడ శ్రీనివాస్ తనకు ధైర్యం ఇచ్చారు. తన దగ్గరే ‘వుంచుకున్నారు’. దాంతో అప్పటి నుంచి తాను దువ్వాడ శ్రీనివాస్‌తోనే కలసి వుంటోంది. దువ్వాడ శ్రీనివాస్‌తో ఆమె చాలా ‘సన్నిహితంగా’ వుంటోంది. దువ్వాడ శ్రీనివాస్‌, తన మధ్య వున్నది అక్రమ సంబంధం కాదు.. సక్రమ సంబంధమే అనుకుంటున్నాను... అని మాధురి చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌తో తనకు సంబంధం వుందని ఆమె స్పష్టంగా చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పెళ్ళి చేసుకున్నా చేసుకోవచ్చని అంటున్నారు.  మొత్తమ్మీద ఆలోచిస్తే అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇది వైసీపీ రాజకీయాల బ్యా‌క్‌డ్రాప్‌లో జరుగుతున్న ‘ఆయనకిద్దరు’ సినిమా. ఒకపక్క దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఆయన కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్‌ని మాధురి లొంగదీసుకుందని బాధపడుతుంటే, మరోవైపు దివ్వెల మాధురి అవును.. నాకు, దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధం వుందని స్పష్టంగా చెబుతున్నారు. దీన్ని రాజకీయ సమస్య అనాలో, కుటుంబ సమస్య అనాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అవును.. నాకు, దువ్వాడ శ్రీనివాస్‌తో సంబంధం వుంది అని దివ్వెల మాధురి మీడియా ముందు ధైర్యంగా చెప్పడం చూసి చాలామంది బుర్ర తిరిగిపోయింది. ఇంత జరుగుతున్నా దువ్వాడ శ్రీనివాస్ బయటకి రావడం లేదు.

కరీంనగర్‌లో ఘనంగా ప్రారంభమైన 32వ సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్

తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ మార్కెట్ రోడ్, కరీంనగర్ లో ఆగష్టు 09వ తేదీన ఉ॥ 09:38 గం.కు భూంరెడ్డి హాస్పిటల్స్ డా॥ భూంరెడ్డి గారిచే ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ చలిమెడ లక్ష్మీ నరసింహరావు గారు చైర్మన్ చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డా॥ వి. సూర్యనారాయణ రెడ్డి గారు డా॥ భూంరెడ్డి హాస్పిటల్స్, డా॥ వి. రమాదేవి గారు డా॥ భూంరెడ్డి హాస్పిటల్స్, మొదటి కొనుగోలుదారు: శ్రీ చిదుర సురేష్ గారు ప్రెసిడెంట్ ఆర్యవైశ్య కేంద్రం - కరీంనగర్ తదితరులు పాల్గొన్నారు. సి.ఎం.ఆర్. ఫౌండర్ &  చైర్మన్ శ్రీ మావూరి వెంకటరమణ గారు మాట్లాడుతూ తమ సంస్థను గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ మాయొక్క 32వ షోరూమును కరీంనగర్లో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్.లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సి.ఎం.ఆర్. తగు విధంగా అన్ని మోడల్స్లో కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సి.ఎం.ఆర్. ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందన్నారు. సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ తన 32వ షోరూమును కరీంనగర్లో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్. అంటే ది వన్ స్టాప్ షాప్ అంటే ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో లక్షలలో డిజైన్లు వేలల్లో వెరైటీలు లభిస్తాయన్నారు. ప్రముఖ సినీతారలు కుమారి పాయల్ రాజ్‌పుత్ గారు మరియు కుమారి సంయుక్త మీనన్ గారు జ్యోతిప్రజ్వలన చేసి అన్ని సెక్షన్లు తిరుగుతూ షోరూములో ఉన్న అన్నిరకాల డిజైన్లు పరిశీలించారు, సి.ఎం.ఆర్. గత 40 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపార రంగంలో క్వాలిటీకి, డిజైన్స్కు ప్రత్యేకత నిస్తూ తెలుగురాష్ట్రాలలో అగ్రగామిగా నిలిచింది, సిఎంఆర్ అంటే కుటుంబమంతటికీ మెచ్చే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని కొనియాడారు, తమ ఫ్యాన్స్ను ఆటపాటలతో డ్యాన్సులతో ఉర్రూతలూగించారు.

హైదరాబాద్ లో  మరోసారి కాల్పుల కలకలం

పాత కక్ష్యల కారణంగా బాలాపూర్ లో రౌడీషీటర్ రియాజ్ హత్యకు గురయ్యాడు. బాబానగర్ లో ఉండే రౌడీషీటర్ రియాజ్ బైక్ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాళ్లతో దాడి చేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో మరికొందరు అతనిపై కాల్పులు జరిపారు. స్పాట్ లో బుల్లెట్ దొరికింది. రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు సంఘటనా ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రియాజ్ ను మెంటల్ రియాజ్ అని కూడా పిలుస్తుంటారు. రియాజ్ ను మెంటల్ రియాజ్ అని కూడా పిలుస్తుంటారు. రౌడీషీటర్ రియాజ్ పండ్ల వ్యాపారం చేసేవాడు. రియాజ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన దుండగులు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. మృత దేహం ఉస్మానియా మార్చురీలో ఉంది. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

రఘురామ హింస కేసు.. నిందితుడికి నో బెయిల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రాక్షస రాజ్యం నడిచినప్పుడు అప్పటి నర్సాపురం ఎంపీ, ఇప్పటి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్‌కి గురిచేసిన అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కి హైకోర్టులో ఎదురుగాలి వీచింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో గుంటూరులోని నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసుపై విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విజయ్‌పాల్‌కి బెయిల్ నిరాకరించింది. రఘురామకృష్ణంరాజుకు గాయాలు అయినట్టు సుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో విజయ్‌పాల్‌కి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని రఘురామ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టును కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జీవీఎస్ కిషోర్ కుమార్ వాదిస్తూ, నిబంధనల ప్రకారమే రఘురామ కృష్ణంరాజు విచారణ జరిగిందని, కస్టోడియల్ టార్చర్ జరగలేదని అన్నారు. అయినప్పటికీ విజయ్‌పాల్‌కి హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

చంద్రబాబు ఆదివాసీ నృత్యం!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆదివాసీ మహిళలతో  కలసి నృత్యం చేశారు. డప్పు వాయించారు. కొమ్ముల కిరీటం ధరించారు. అక్కడ వున్న అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు అరకు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాల మీద అక్కడ వున్న అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.