జగన్ పార్టీ పాలెగాళ్ళు పరార్!
posted on Aug 3, 2024 @ 6:27PM
జగన్ పార్టీ అధికారంలో వున్నప్పుడు తొడలు కొట్టిన, వెంట్రుక కూడా పీకలేరు అన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రస్తుతం రాష్ట్రంలో కనపడటం లేదు. అధికారంలో వున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తాము అధికారంలో వున్నా, అధికారంలో లేకపోయినా ప్రజలతోనే వుంటామని బిల్డప్పులు ఇచ్చారు. ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ దాదాపు ఒక నెల రోజులపాటు బయటకి వచ్చి జనానికి ముఖాలు కూడా చూపించలేదు. సర్లే, నెల రోజులు బయటకి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, రెండు నెలలు గడుస్తోన్నప్పటికీ చాలామంది మాజీ ఎమ్మెల్యేలు బయట కనిపించడం లేదు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాలలో కార్యకర్తలకు అండగా వుండాల్సిన మాజీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం వున్న ఒక నియోజకవర్గ మాజీ వైసీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని వదిలి కుటుంబంతో సహా ఎటో వెళ్ళిపోయాడు. అనంతపురం జిల్లాలో ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కార్యకర్తలకు అందుబాటులో ఉంటన్నారు. చాలా మంది మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కుటుంబంతో సహా ఆంధ్రప్రదేశ్‌ని వదిలి వెళ్లిపోయారు, కార్యకర్త లకు ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదు.