డల్లాస్‌లో వల్లభనేని వంశీ దొంగబతుకు!
posted on Aug 5, 2024 @ 12:08PM
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుగా తయారైంది వల్లభనేని వంశీ పరిస్థితి. ప్రొడ్యూసర్‌గా హిట్ సినిమా తీసి, ఎమ్మెల్యేగా హవా నడిపి, అధికార పార్టీ నాయకుడిగా మకుటం లేని మహారాజులా చెలామణి అయి, అధికారం తెచ్చిన అహకారంతో అడ్డమైన వాగుడు వాగిన వల్లభనేని వంశీ బతుకు చివరికి దొంగ బతుకైపోయింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అయ్యేసరికి వల్లభనేని వంశీ అమెరికాలోని డల్లాస్‌కి పారిపోయినట్టు తెలుస్తోంది. డల్లాస్‌లో దొంగలాగా నక్కినక్కి తిరుగుతున్న వల్లభనేని వంశీ కొంతమంది తెలుగువాళ్ళ కళ్ళలో పడ్డాడని, సాటి తెలుగువాడు కదా అని వాళ్ళు పలకరించే ప్రయత్నం చేస్తే, అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ పనికిమాలిన వాడు అని ఆల్రెడీ అందరికీ తెలుసు... పిరికివాడు కూడా అనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
‘‘స్థానబలిమే కాని తనబలిమి కాదయా.. విశ్వదాభిరామ వినుర వేమ’’ అని వేమన చెప్పినట్టు, ఈ వైసీపీ చెత్తగ్యాంగ్‌కి అధికారంలో వున్నప్పుడే ధైర్యం వుంది తప్ప, అధికారం పోగానే అందరూ పిరికి సన్నాసులు అయిపోయారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ‘చంద్రబాబు ఏమీ పీకలేడు’ అనే స్థాయి డైలాగులు, సవాళ్ళు విసిరిన వల్లభనేని వంశీకి, అధికారం పోగానే తనది బలుపు కాదని అర్థమైంది. తాను నిజమైన శక్తివంతుడు కాదని, స్థానబలంతో అరిచే ఊరకుక్కకి, తనకి ఎంతమాత్రం తేడా లేదనే విషయం అవగతం అయింది. అందుకే, ఒక చిన్న కేసుకు భయపడి పారిపోయాడు. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిన కేసులో మహా అయితే ఏం చేస్తారు? పడితే కొద్ది నెలలపాటు జైలు శిక్ష పడుతుంది. అంతేతప్ప తల తీసి మొలేయరు కదా? వల్లభనేని వంశీకి బాస్ జగన్ 16 నెలలో జైల్లో గడిపి, హ్యాపీగా నవ్వుకుంటూ బయటకి వచ్చాడు. ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కొద్ది నెలలపాటు జైల్లో వుండలేనంత పిరికిసన్నాసి వల్లభనేని వంశీ. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిప్పుడు చూపించిన తెగువలో వన్ పర్సెంట్ కూడా లేకుండా పోయింది ఈ పిరికి పిల్లికి!