పేదలకు ఇళ్ళు.. కేంద్రం ఓకే!

పేద ప్రజలకు శుభవార్త. దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని  చంద్రశేఖర్ తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్లే పేదల ఇళ్ళ నిర్మాణంలో రాష్ట్రం వెనుకబడిందని ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకుని వుంటే, ఇప్పటికి రాష్ట్రంలో పేదలకు 5 నుంచి 6 లక్షల ఇళ్ళు కట్టి వుండవచ్చని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం పరిమితులు లేకుండా నిధులు మంజూరు చేస్తోందని వివరించారు. నరేగా నిధుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకుని జల్ జీవన్ మిషన్‌ని పూర్తి చేసుకోవాల్సిన వుందని ఆయన వివరించారు.

మను బాకర్‌కి మూడో పతకం మిస్!

పారిస్ ఒలింపిక్స్.లో ఇప్పటి వరకు 2 కాంస్యాలు గెలుచుకుని, మూడో పతకం కూడా గెలుచుకుంటుందన్న ఆశలు రేకెత్తించిన భారత యువ షూటర్ మను బాకర్‌కి నిరాశపరిచింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకం జస్ట్ మిస్ అయి, నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మను బాకర్‌పై ఏర్పడిన అంచనాల వల్ల కావచ్చు, ఒత్తిడి వల్ల కావచ్చు 25 మీటర్ల పిస్టర్ విభాగం ఫైనల్లో స్టేజ్‌ వన్‌ని బాకర్ నెమ్మదిగా ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత పుంజుకుని రెండో స్థానానికి ఎగబాకింది. అయితే హంగేరీ దేశానికి  చెందిన మేజర్ వెరోనికా అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో ఆమె మూడో స్థానానికి చేరుకుని, మను బాకర్ నాలుగో స్థానానికి జారిపోయింది. దాంతో మను బాకర్ మూడో పతకం చేజారిపోయింది.

అవమాన భారంతో బెంగళూరు యెలహంక ప్యాలెస్ కు జగన్ షిప్ట్

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకు వెళ్లడం ఇది నాలుగోసారి. మాజీ సీఎం గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. ఐదు రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లారు. ఈ నెల 5న లేదా 6న ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు హాజరయ్యారు. ఇప్పటివరకూ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు.ఎపిలో  వైకాపా ఘోర పరాజయం తర్వాత తెలుగు దేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలో వచ్చింది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైకాపా అవమానభారంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ చేరుకుంటారని ప్రచారం అయితే జరిగింది కానీ జగన్  హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్   గడపదొక్కలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ మాజీ సిఎం కెసీఆర్ తుంటి ఎముక విరిగి యశోదాహస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో జగన్ హైదరాబాద్ కు వచ్చారు. అప్పట్లో లోటస్ పాండ్ వెళతారని అందరు అనుకున్నారు. కానీ జగన్ అప్పుడు కూడా లోటస్ పాండ్ వెళ్లలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుంది. హైదరాబాద్  సేప్ జోన్ కాదని జగన్ డిసైడైపోయారు. ఈ కారణంగానే బెంగుళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన డికె శివకుమార్ కర్ణాటక డిప్యూటి సీఎం పదవిలో కొనసాగుతున్నారు.కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చని జగన్ భావిస్తున్నారు.  కాబట్టే బెంగుళూరుకు షిప్ట్ అయ్యే ఆలోచనలో  ఉన్నారు. వైకాపా తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని జగన్ కు తెలిసి పోయింది. దీంతో ఆయన ఎక్కువగా బెంగుళూరులోని యెలహంక ప్యాలెస్ కు పరిమితమయ్యారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కట్టిన  తాడేపల్లిలోని వైకాపా కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చి వేసింది. ప్రస్తుతం తాడేపల్లిలో ఆయన నివాసానికి తాళం వేసే ఆలోచనలో ఉన్నారు. రాజకీయంగా అధోపాతాళానికి పడిపోయిన జగన్ మళ్లీ కోలుకునే అవకాశం లేదు. అవమానభారంతో కుమిలిపోతున్న  జగన్  మొహం చాటేయాలని డిసైడ్ అయ్యారు. తాను గత 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న యెలహంక ప్యాలెస్ కు గత పదేళ్లుగా దూరంగా ఉన్నారు.  బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు ఆనుకుని 30 ఎకరాల్లో యెలహంక ప్యాలెస్ ఉంది. వైకాపా పెట్టిన తర్వాత ఆయన తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యారు. వైకాపా పెట్టిన తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు. ఎపిలో వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా తాడేపల్లి నివాసానికి పరిమితమయ్యారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత జగన్ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. తెలుగు దేశం ప్రభుత్వాన్ని నిలువరించే సత్తా జగన్ కు లేకపోవడంతో బిస్తర్ ఎత్తేశాడని ప్రచారం  జరుగుతుంది.

రేవంత్ విదేశ యాత్ర.. బీఆర్ఎస్‌లో లేనిపోని ఆత్రుత!

తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగు రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటనకు బయల్దేరారు. ఆగస్టు 14 వరకూ సీఎం పర్యటన కొనసాగనుంది. ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా విదేశాలకు వెళ్ళారు. ఆగస్టు 5వ తేదీన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా వెళ్తారు. శనివారం (03-8-24) నుండి 9 వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్ , శాన్ ప్రాన్సిస్కో నగరాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అమెరికాలోని పలువురు వ్యాపారవేత్తలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం బృందం శనివారం నేరుగా న్యూయార్క్ వెళ్లనుంది. 4వ తేదీన న్యూజెర్సీలో ఒక కార్యక్రమం జరగనుంది. 5వ తేదీన న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ కానున్నారు. 10న అమెరికాలో బయల్దేరి రేవంత్‌రెడ్డి బృందం దక్షిణ కొరియాకి వెళ్ళనుంది. దక్షిణ కొరియాలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డి బృందం ఈనెల 14న తిరిగి వస్తుంది. ఈ  పర్యటన సంగతి ఇలా వుంటే, రేవంత్ రెడ్డి విదేశాల్లో వున్న కాలంలో రాజకీయంగా ఏదైనా హడావిడి చేసి రేవంత్ రెడ్డి సీటు కిందకి నీళ్ళు వచ్చేలా చేసే అవకాశం ఏదైనా వుందా అని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్.ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసింది. * ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా వున్న టి.కె. శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా బదిలీ చేశారు. * వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. * డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీష్‌కి రవాణా, ఆర్ అండ్ బి సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. * మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్‌కి అదనపు బాధ్యతలు కేటాయించారు. * పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంకని నియమించారు. * హాకా మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. • మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. • రవాణా, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ అయ్యారు.

ఫ్యాన్సీ ఫోన్ నంబర్ కావాలా? వెరీ సింపుల్!

మీకు ఫ్యాన్సీ మొబైల్ నంబర్ కావాలని వుందా? అయితే వెరీ సింపుల్. బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్యాన్సీ నంబర్లను చాలా సులభమైన పద్ధతిలో అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి సర్వీసు అంత బాగోదని అపోహపడకండి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లతో పోటీ పడుతోంది. సరే, ఇంతకీ బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఫ్యాన్సీ నంబర్ ఎలా తీసుకోవాలంటే..... 1. సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి 'BSNL choose your mobile number' అని సెర్చ్ చేయాలి. 2. ఇక్కడ కనిపించే వెబ్‌పేసెజ్‌లో 'cymn' మీద క్లిక్ చేసి మీ జోన్‌ని, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. 3. ఇప్పుడు కనిపించిన రకరకాల ఆప్షన్ల ద్వారా మీకు నచ్చిన నంబర్ని ఎంపిక చేసుకోవాలి. 'Reserve Number' ట్యాబ్ మీద క్లిక్ చేసి, మీ ప్రస్తుత ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీరు ఎంపిక చేసుకున్న నంబర్ మీకు రిజర్వ్ అవుతుంది. ఈ తతంగం అంతా పూర్తయిన వెంటనే దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ కేంద్రానికి వెళ్తే, అక్కడ నిర్ణీత రుసుము తీసుకుని సిమ్ కార్డు ఇస్తారు.. అంతే.. సింపుల్!

శభాష్ బాబూ.. రఘువీరా ప్రశంస!

చంద్రబాబు పాలనను చూసి ఇతర పార్టీల వాళ్ళలో ఏడ్చి చచ్చేవాళ్ళు వున్నట్టే, మనస్పూర్తిగా అభినందించేవాళ్లూ వుంటారు. అలాంటి వారే ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. జగన్ హయాంలో జరిగిన ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం లాంటివేవీ లేకుండా మడకశిర మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నిరాడంబరంగా నిర్వహించడం చాలా బాగుందని రఘువీరా అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. మడకశిర నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబు స్పష్టమైన హామీలు ఇవ్వడం పట్ల రఘువీరా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఎపి మెట్రోరైల్ కార్పోరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైలు కార్పొరేషన్‌  ఎండీ గా రామకృష్ణారెడ్డి  మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మూడేళ్లపాటు ఎంఆర్‌సీఎండీగా కొనసాగనున్నారు. రామకృష్ణా రెడ్డి గతంలోనూ ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ఎండీగా పనిచేస్తున్న జయమన్మథరావును ఆ పోస్టు నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. రామకృష్ణారెడ్డి మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. టీడీపీ గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన అమరావతి మెట్రో రైల్ ఎండీగా పనిచేశారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు నివేదికల తయారీ, వాటిని కేంద్ర పరిశీలనకు పంపడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రాజెక్టు దాదాపు పట్టాలెక్కే సమయంలో టీడీపీ అధికారం కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో 31 మే 2021న రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా, మరోమారు ఆయనను అదే పదవిలో నియమించింది. కాగా, ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేఎం రావును ప్రభుత్వం రిలీవ్ చేసింది.

జెఫ్ బెజోస్‌కి బ్యాండ్ పడింది!

పేరుకే అమెరికా... నిజానికి ఏ విషయంలో అయినా అమెరికన్లకి క్షణం క్షణం భయం.. భయం. అలాంటి భయం వల్లే ఈ-కామర్స్ దిగ్గజం జెఫ్ బెజో్స్ తీవ్రంగా నష్టపోయారు. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల మాంద్యం భయాలు అమెరికా స్టాక్ మార్కెట్లను ముంచెత్తడంతో అమెజాన్ షేర్లు పడిపోయాయి. దాంతో శుక్రవారం ఒక్కరోజే జెఫ్ బెజోస్‌కి 15.2 మిలియన్ డాలర్లు నష్టం వచ్చింది. అంటే, మన ఇండియా కరెన్సీలో 1.25 లక్షల కోట్లు. శుక్రవారం నాడు జరిగిన ట్రేడింగ్‌లో అమెజాన్ షేరు 8.8 శాతం తగ్గిపోయింది. జెఫ్ బెజోస్‌కి ఈ రేంజ్‌లో లాస్ రావడం ఇది మూడోసారి. 2019లో ఆయన తన విడాకుల ప్రకటన చేసినప్పుడు అమెజాన్ షేర్ పడిపోయింది. 36 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో కూడా అమెజాన్ షేర్ 14 శాతం పడిపోయి భారీగా నష్టం జరిగింది. జెఫ్ బెజోస్ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో వున్నారు.

మళ్ళీ బెంగళూరుకి జగన్.. ఖర్మరా బాబు!

ఈ మహానుభావుడు జగన్ పర్మినెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌ని విడిచిపెట్టేసి బెంగళూరులో సెటిలైపోతే ఒక దరిద్రం వదిలిపోతుందిగా.. అలా చేయడు.. తాడేపల్లిలో ఒక కాలు.. బెంగళూరులో ఒక కాలు.. ఇలా తాడేపల్లి వచ్చినట్టే వస్తాడు.. కొద్దిగా హడావిడి చేస్తాడు.. మళ్ళీ బెంగళూరుకు జంప్. చాలారోజులు బెంగళూరులోనే మకాం వేసి నిన్నగాక మొన్నే కదా తాడేపల్లికి వచ్చాడు... ప్యాలెస్ గేట్లు తెరిచి జనాన్ని కలిసే మహత్ కార్యాన్ని నిర్వహించాడు. ఇంతలోనే బెంగళూరు మీద బెంగపడ్డటున్నాడు... శుక్రవారం నాడు మళ్ళీ రయ్యిమని ఎగిరిపోయాడు. 40 రోజుల వ్యవధిలో జగన్ సార్ బెంగళూరుకు వెళ్ళడం ఇది నాలుగోసారి. రాజకోట రహస్యం మాదిరిగా బెంగళూరులో ఏం రహస్యం వుందో ఏంటో.. ఈయన బెంగళూరుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు భద్రత, హడావిడి, అనవసరపు ఖర్చులు మామూలేగా.. అయ్యగారు మళ్ళీ తాడేపల్లికి ఎప్పుడు వస్తాడో ఏమో.. దేవుడి దయ వల్ల అయ్యగారు తాడేపల్లికి రాకుండా అటు నుంచి అటే జైలుకు వెళ్ళిపోతే బాగుంటుందని జనం కోరుకుంటున్నారు. 

వల్లభనేని వంశీ... ఉతుకుడు మొదలైందా?

నోట్లో నాలుకలకు బదులు దురదగుంట ఆకులు వున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, బందరు పిచ్చోడు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు.... ఇలాంటి రాక్షస పార్టీ నాయకులంటే జనానికి ఎందుకో చెప్పలేనంత కసి. వాళ్ళని అర్జెంటుగా అరెస్టు చేసి కుళ్ళబొడిచేయాలని కోరుకుంటూ వుంటారు. ఇలాంటి కోరిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి వుంటే ఒకరకంగా అదొకరకం న్యాయం. కానీ, ఏ పార్టీకి చెందని సాధారణ జనబాహుళ్యం ఇలా కోరుకుంటున్నారు అదీ వెరైటీ!  ఇంతకీ ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, విధ్వంసం సృష్టించిన కేసులో అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నిందితుడిగా వున్నారు. ఆయన ప్రత్యక్షంగా ఈ దాడిలో పాల్గొనకపోయినప్పటికీ, పర్‌ఫెక్ట్ స్కెచ్ వేసి, ఆయన అనుచరులను పురమాయించి దాడి జరిపించారు. రాక్షస పార్టీ అధికారంలో వుండగా వీళ్ళని పోలీసులు అరెస్టు చేయాలేదు. ఇప్పుడు అరెస్టు చేయడానికి రెడీ అయితే, అయ్యగారు జంప్! పోలీసులు వల్లభనేని వంశీని వెతికేపనిలో బిజీగా వున్న నేపథ్యంలో సార్ అమెరికా పారిపోయాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అంటే, శుక్రవారం నాడు వల్లభనేని వంశీ అరెస్టు అయ్యాడన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో అదేంటో, జనం హ్యాపీగా ఫీలయ్యారు. ఒక వికెట్ పడింది.. ఇక మిగతా వికెట్లు కూడా పడాలి అనుకున్నారు. అయితే వాళ్ళు అలా ఆనందిస్తూ వుండగానే, మరో న్యూస్ బయటకి వచ్చింది. వల్లభనేని వంశీ అరెస్టు కాలేదు. అరెస్టు అయింది అతని ప్రధాన అనుచరుడు అని. సాధారణంగా ఈ న్యూస్ వినగానే జనం నిరాశపడిపోవాలి. అడ్డెడ్డే.. అనవసరంగా హ్యాపీగా ఫీలయ్యామే అనుకోవాలి. కానీ, జనం అలా అనుకోవడం లేదు. వల్లభనేని వంశీ నిజంగానే అరెస్టు అయ్యాడు. పోలీసులు అతని అరెస్టు విషయాన్ని బయటపెట్టడం లేదు. ఓ వారం పదిరోజులు వీరబాదుడు బాది, ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే అరెస్టు చేశాం అని చెబుతారు. వల్లభనేని వంశీని రాష్ట్రంలో ఏ మారుమూల పోలీస్ స్టేషన్లోనే ఇప్పటికే ఉతకడం ప్రారంభించేసే వుంటారు... అనుకుంటున్నారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ మీద జనానికి ఎంత కసి పెరిగిపోయి వుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దేశంలో జనం వ్యతిరేకత పొందిన రాజకీయ నాయకులు చాలామంది వున్నారు. కానీ, ఈ రాక్షస జగన్ పార్టీ నాయకులంత వ్యతిరేకత ఇంతవరకు ఎవరూ పొందలేదని అనిపిస్తూ వుంటుంది. 

అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి కొండంత అండ అడ్వ‌కేట్‌ ముర‌ళీధ‌ర్‌రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? అన్నది 2019 సంవ‌త్స‌రం నుంచి నిన్న‌మొన్నటి వ‌ర‌కు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. కానీ ఇప్పుడు ఆ ప్ర‌శ్న‌కు సమాధానం దొరికింది. అమ‌రావ‌తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇటీవ‌ల‌ బ‌డ్జెట్ లో అమ‌రావ‌తి రాజ‌ధానికి రూ. 15000 కోట్ల నిధుల‌ను  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వీరి సంతోషం వెన‌క ఐదేళ్ల‌లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. క‌న్నీటి గాధ‌లు ఉన్నాయి. కంటి నిండా స‌రిగా నిద్ర‌పోయిన రోజులు త‌క్క‌ువ‌నే చెప్పొచ్చు. ఇందుకు కార‌ణం మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 2019లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాద‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తెర‌పైకి తీసుకొచ్చాడు. అప్ప‌టి నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమించారు. ఈ క్ర‌మంలో రైతులు పోలీసుల లాఠీ దెబ్బ‌లు తిన్నారు.. వైసీపీ మూకల రాళ్ల దెబ్బ‌లు తిన్నారు. అయినా వెన‌క్కు త‌గ్గ‌లేదు. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు రైతులు కోర్టుల‌ను   ఆశ్ర‌యించారు. రైతుల త‌రుపున కోర్టుల్లో వాద‌న‌లు వినిపించి వారికి అండ‌గా నిలిచారు హైకోర్ట్ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీధ‌ర్ రావు. కోర్టుల్లో వైసీపీ ప్ర‌భుత్వ మూడు రాజధానుల నిర్ణ‌యంపై ఆయ‌న సాగించిన పోరాటం అమ‌రావ‌తి ఉద్య‌మ ఘ‌ట్టంలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న న్యాయ‌వాది ఉన్నం ముర‌ళీధ‌ర్ రావు. హైకోర్టులో కేసులు వాదించ‌డంకోసం రోజుకు ల‌క్ష‌ల్లో ఫీజు వ‌సూళ్లు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగిన లాయ‌ర్ ఆయ‌న‌. అయితే, అమ‌రావ‌తి రైతులు చేస్తున్న న్యాయ‌మైన పోరాటంలో ముర‌ళీధ‌ర్ రావు వారికి అండ‌గా నిల‌బ‌డ్డారు. అమ‌రావ‌తే ఏపీకి ఏకైక రాజ‌ధాని అంటూ రైతుల త‌ర‌పున‌ హైకోర్టులో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వాదించారు. హైకోర్టులో రైతుల త‌ర‌పున వాద‌న‌లు వినిపించినందుకు ఆయ‌న ఒక్క‌రూపాయి కూడా తీసుకోలేదు. కోర్టుల్లో ప్ర‌భుత్వం కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ రైతులు త‌మ‌ పోరాటంలో విజ‌యం సాధించ‌డంలో త‌న‌వంతు పాత్ర‌ను ముర‌ళీధ‌ర్ రావు స‌మ‌ర్థ‌వంతంగా పోషించారు. స‌త్యం, న్యాయం, ధ‌ర్మం రైతుల వైపు ఉన్నాయి.. చివ‌రికి అవే గెలుస్తాయ‌ని ముర‌ళీధ‌ర్ రావు మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నారు. ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో విశాఖ ప‌ట్ట‌ణానికి రాజ‌ధాని త‌ర‌లిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుల ద్వారా స్టేలు తీసుకొస్తూ ప్ర‌భుత్వం దూకుడుకు ముర‌ళీధ‌ర్‌రావు బ్రేక్ లు వేశారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి భూములిచ్చిన‌ రైతుల‌కు అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం  ప్ర‌తీయేటా కౌలు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆ కౌలును కూడా చెల్లించ‌లేదు. దీంతో  రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున దాఖ‌లైన పిటీష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగిన సంద‌ర్భంలో.. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వాదనలపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో రైతులకు కౌలు చెల్లించాలని వేసిన పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని కోర్టు స్ప‌ష్టం చేయ‌డంతో ప్ర‌భ‌త్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో.. సీఎం చంద్ర‌బాబు రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగించాలని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఎలాగూ వచ్చే ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణం కొనసాగడం ఖాయం కాబట్టి ఈ ఐదేళ్లలో వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కౌలు గడువును మరో ఐదేళ్ల పాటు ప్ర‌భుత్వం పెంచ‌నుంది.  అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు రైతులు పాద‌యాత్ర ద్వారా పోలీసుల లాఠీల‌కు ఎదురెళ్లి  వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తే.. అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీద‌ర్‌రావు ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుల ద్వారా ప్ర‌భుత్వం కుట్ర‌ల‌ను అడ్డుకుంటూ  రైతుల పోరాటానికి కొండంత అండ‌గా నిలిచారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కుట్ర‌ల నుంచి అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకోవ‌టంలో రైతుల పోరాటాన్ని ప్ర‌జ‌లు ఏ విధంగా గుర్తుచేసుకుంటున్నారో.. కోర్టుల ద్వారా ముర‌ళీధ‌ర్ రావు పోరాటంపైనా అదేస్థాయిలో ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. ఇటీవ‌ల‌ అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీధ‌ర‌రావుకు అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గా.. వాషింగ్ట‌న్ డీసీలో ప్ర‌వాసులు ఘ‌నంగా స‌త్క‌రించారు. అమ‌రావ‌తి రైతుల పోరాటాన్ని, వారికి అండ‌గా నిలుస్తూ కోర్టుల్లో ముర‌ళీధ‌ర్ రావు సాగించిన పోరాటాన్ని ప్ర‌వాసులు కొనియాడారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి రైతులు ముర‌ళీధ‌ర్ రావుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఉద్య‌మంలో అండ‌గా నిలిచినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

హైద్రాబాద్ లో ఆగని రేప్ కేసులు .. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అఘాయిత్యం 

హైద్రాబాద్ నగరం రేప్ ల అడ్డాగా మారింది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగు అత్యాచారాలు జరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉప్పల్ లోని లిటిల్ ప్లవర్ స్కూల్ ఎదుట బాధిత బాలిక ఎదుట ధర్నా చేయడంతో విషయం వెలుగు చూసింది. గత వారం ఇదే స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థి అత్యాచారం చేశాడు. విషయం ఆలస్యంగా పొక్కడంతో తల్లిదండ్రులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. నిందితుడిని స్కూల్ యాజమాన్యం రక్షించే ప్రయత్నం చేస్తోంది. 

అంతా బీఆర్ఎస్ బుస!

అబ్బో.. కేసీఆర్ అండ్ కో దగ్గర ఇలాంటి అప్పడం తెలివితేటలు కూడా వున్నాయన్నమాట! తెలంగాణ ప్రజల నుంచి భారీ స్థాయిలో తిరస్కారానికి గురైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపో, బీజేపీ వైపో చూస్తున్నారు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది కూడా త్వరలోనే ‘జై కాంగ్రెస్’ అనేసి కండువాలు మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా బీఆర్ఎస్ శాసనసభా పక్షం కాంగ్రెస్‌లో విలీనం అయ్యే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండ్రోజుల క్రితం ఒక వెరైటీ హడావిడి చేసింది. తెలంగాణ ప్రజల దృష్టిలో మరోసారి నవ్వులపాలైంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఏదో సందర్భంలో కేటీఆర్‌ని  కలిశారు. వెంటనే బీఆర్ఎస్‌ వాళ్ళు ఇదిగో బండ్ల కృష్ణమోహన్ మళ్ళీ బీఆర్ఎస్‌లో చేరిపోయాడు అంటూ ప్రచారం చేసేశారు. అక్కడితో ఆగకుండా అప్పటికే బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందిన మరికొందరు ఎమ్మెల్యేల పేర్లను కూడా ప్రస్తావించి వీళ్ళు కూడా తిరిగి రాబోతున్నారు అని ఊదరగొట్టేశారు. తమ సొంత మీడియాలో కేసీఆర్ చాణక్యం తోటకూర కట్ట అంటూ స్పెషల్ స్టోరీలు కూడా ప్రసారం చేశారు. టోటల్‌గా ఏంటంటే, కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలెవరూ తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్ళలేదు. అందంతా ఒట్టి బుస అని తర్వాత తేలిపోయింది. ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం కలిశారు. తాను కాంగ్రెస్ పార్టీని విడిచి పోలేదని స్పష్టం చేశారు. 

మల్లవల్లి అశోక్ లేలాండ్ ప్లాంట్ పునఃప్రారంభం.. ఫలించిన కేశినేని చిన్ని కృషి

జగన్ నిరంకుశ  పాల‌నతో  విసిగిపోయి, వారి విధానాల‌తో  ఫ్యాక్ట‌రీ న‌డ‌ప‌లేక మూసివేసిన అశోక్ లేలాండ్ సంస్థ కృష్ణ‌జిల్లా బాపులపాడు మండలంలోని మ‌ల్ల‌వ‌ల్లిలో  తయారీ ప్లాంట్ ను  పునః ప్రారంభించేందుకు సిద్దమ‌వుతుంది.  2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూసివేసిన ఈ ఫ్యాక్ట‌రీని తిరిగి ప్రారంభించాల‌ని కోరుతూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, 2024 జూలై 29న  అశోక్ లేలాండ్ కంపెనీ చైర్మ‌న్   ధీర‌జ్ జి. హిందూజ కి లేఖ రాశారు.  రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైందనీ, ముఖ్యమంత్రిగా  చంద్ర‌బాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారనీ, ఆయన హయాంలో  ఎపి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందనీ వివరిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ఆ లేఖలో వివరించారు.  మల్లేపల్లి ప్లాంట్ ప్రారంభిస్తే దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవ‌కాశం దొరుకుతుంద‌ని వివ‌రించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ లేఖ‌కు ఆ కంపెనీ చైర్మ‌న్ ధీర‌జ్ జి. హిందూజ  సానుకూలంగా  స్పందించారు.   మ‌ల్ల‌వ‌ల్లి ప్లాంట్ లో త‌మ‌ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త‌యారు చేయ‌డం ల‌క్ష్యమ‌ని తెలియ‌జేశారు. ప్లాంట్ లో కార్యక‌ల‌పాలు మొద‌లుపెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంద‌న్నారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ను కోరారు. ఈ విష‌యం పై రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టి.జి.భ‌ర‌త్ తో సంస్థ మేనేజ్మెంట్ టీమ్ క‌లుస్తుంద‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో  ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మద్దతు ఇవ్వడానికి  ఆసక్తి గా వున్న‌ట్లు తెలిపారు.