సంజయ్, పొన్నవోలుకి హైకోర్టు నోటీసులు!

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయం మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసుపై మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. మీడియా సమావేశం పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిల్‌లో పేర్కొన్నారు. పిల్‌ని పరిశీలించిన పరిశీలించి హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైకోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో 96 మంది డీఎస్పీల బదిలీ!

ఆంధ్రప్రదేశ్‌లో 96 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 96 మంది ఎవరు? వారు బదిలీ అయిన స్థానం ఏది అనే వివరాలు ఇవిగో.... 1. వై.శ్రుతి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 2. జి.నాగేశ్వరరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 3. పత్రిని శ్రీనివాసరావు (ఎస్డీపీవో, కాశీబుగ్గ). 4. డి.బాలచంద్రారెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 5. బి.విజయ్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 6. ఎ.ఎస్.చక్రవర్తి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 7. డాక్టర్ కె.హనుమంతరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 8. కె.విజయపాల్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 9. కె.రమేష్ బాబు (ఎస్డీపీవో, సెంట్రల్ జోన్, రాజమండ్రి). 10. ఎన్.బి.ఎం.మురళీకృష్ణ (ఎస్డీపీవో, నర్సాపూర్). 11. జి.శ్రీనివాసరావు (డీఎస్పీ, డీటీసీ, కృష్ణా). 12. ఎం.కిషోర్ కుమార్ (డీఎస్పీ, ఏసీబీ). 13. ఎం.అంబికాప్రసాద్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 14. కె.శ్రీనివాసమూర్తి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 15. బి.ఆదినారాయణ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 16. కడలి వెంకటేశ్వరరావు (దిశ ఉమన్ పోలీస్ స్టేషన్, తూర్పు గోదావరి). 17. జి.లక్ష్మయ్య (డీఎస్పీ, సీఐడీ). 18. పి.శ్రీకాంత్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 19. ఆర్.జి.జయసూర్య (ఎస్డీపీవో, భీమవరి). 20. వి.నారాయణస్వామి రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 21. యు.నాగరాజు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 22. పి.భాస్కరరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 23. కె.దామోదర్ రావు (ఏసీపీ, సెంట్రల్, విజయవాడ) 24. డీఎన్వీ ప్రసాద్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 25. ఎం.రాజారావు (ఏసీపీ, నార్త్, విజయవాడ). 26. జి.రత్నరాజు (డీఎస్ఆర్‌పీ, విజయవాడ). 27. బి.వి.ఎస్.నాగేశ్వరరావు (డీఎస్పీ, ఏసీబీ). 28. పి.మురళీక‌ష్ణారెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 29. వి.వి.నాయుడు (ఏసీపీ, ట్రాఫిక్ డివిజన్-1, విజయవాడ). 30. బి.జనార్దనరావు (ఎస్డీపీఓ, తెనాలి). 31. ఎం.రమేష్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 32. బి.పార్థసారథి, (ఎస్డీపీవో, కుప్పం) 33. కె.ప్రకాష్ బాబు (ఎస్డీపీవో, రాజంపేట్) 34. పి.మల్లికార్జునరావు (దిశ, విజయవాడ) 35. సిహెచ్.రవికాంత్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 36. మహ్మద్ మహబూబ్ బాషా (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 37. సిహెచ్.శ్రీనివాసరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 38. బి.ప్రసాద్ (దిశ ఉమన్ పోలీస్ స్టేషన్, విజయవాడ) 39. ఎం.కృష్ణబాబు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 40. బి.లక్ష్మీనారాయణ (ఎస్డీపీఓ, దర్శి) 41. టి.అశోక్ వర్ధన్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 42. ఎం.బాలసుందరరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 43. ఘట్టమనేని శ్రీనివాసరావు (ఎస్డీపీఓ, నెల్లూరు రూరల్) 44. పి.వీరాంజనేయరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 45. అర్ల శ్రీనివాసులు (ఎస్డీపీవో, పెనుకొండ). 46. షేక్ బాజీజాన్ సైదా (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 47. ఎం.సూర్యనారాయణరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 48. వి.శ్రీనివాసరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 49. బి.ఉమామహేశ్వరరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 50. సి.శరత్ రాజ్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 51. కె.రవి మనోహరాచారి (డీఎస్పీ, సీఐడీ) 52. పి.శ్రీనివాసులు (ఎస్డీపీవో, డోన్) 53. వై.శ్రీనివాసరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 54. పి.రామకృష్ణాచారి (డీఎస్పీ, ట్రాఫిక్, తిరుపతి). 55. డి.శ్రవణ్ కుమార్ (ఎస్డీపీవో, ఏలూరు పట్టణం). 56. ఇ.శ్రీనివాసులు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 57. దర్బార్ కొండయ్య నాయుడు (ఎస్డీపీవో, మదనపల్లి). 58. జి.ప్రసాదరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 59. జి.హుస్సేన్ పీరా (ఎస్డీపీవో, జమ్మలమడుగు) 60. బుక్కే మురళి (ఎస్డీపీవో, పులివెందుల) 61. కె.ఎస్.వినోద్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 62. ఎం.భక్తవత్సలం (ఎస్డీపీవో, ప్రొద్దుటూరు). 63. డి.మురళీధర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 64. కె.రవికుమార్ (ఎస్డీపీవో, ఆళ్ళగడ్డ). 65. షేక్ షర్ఫుద్దీన్ (డీఎస్పీ / ఏసీ, సెకండ్ బెటాలియన్, ఏపీఎస్పీ). 66. జి.శివభాస్కర్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 67. బుక్కాపురం శ్రీనివాసులు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 68. ఆర్.వాసుదేవన్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 69. కె.శ్రీనివాసాచారి (డీఎస్పీ, దిశ, కర్నూలు). 70. కె.బాబుప్రసాద్ (ఎస్డీపీవో, కర్నూలు). 71. కె.విజయ్ శేఖర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 72. ఎన్.రవీంద్రనాథ్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 73. ఆర్.రామాంజీనాయక్ (ఎస్డీపీవో, ఆత్మకూరు). 74. అతిన శ్రీనివాసరావు (డీఎస్పీ, ఎస్బీ, నెల్లూరు). 75. ఎస్.ఆర్.హర్షిత (డీఎస్ఆర్‌పి, తిరుపతి) 76. శ్రీమతి షాను షేక్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 77. ఎస్.బాపూజీ (డీఎస్పీ / ఏసీ, ఫిఫ్త్ బెటాలియన్, ఎపీఎస్పీ). 78. వల్లూరి శ్రీనివాసరావు (డీఎస్పీ, సీఐడీ). 79. డి.విశ్వనాథ్ (డీఎస్పీ, సీఐడీ). 80. జి.దేవకుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 81. పి.విజయ్ కుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 82. డి.లక్ష్మణరావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 83. ఎస్.సూర్యభాస్కర్ రావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 84. సిహెచ్.వెంకటేశ్వర్లు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 85. కె.రసూల్ సాహెబ్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 86. వి.వి.అప్పారావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 87. షేక్ అబ్దుల్ కరీమ్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 88. బి.రాజశేఖర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 89. సిహెచ్. విజయభాస్కర్ రావు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 90. పి.రవీంద్రనాథ్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 91. టి.బ్రహ్మయ్య (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 92. వి.వేణుగోపాలరెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 93. జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 94. జె.రాంబాబు (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 95. సిహెచ్.రవికుమార్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి). 96. ఎస్.బాలవీర శుభకర్ (పోలీస్ హెడ్ క్వార్టర్స్.లో రిపోర్టు చేయాలి).

‘శాంతి’కాముకుడినికాదు... సాయిరెడ్డి!

వైఎస్ జగన్- ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య ‘శాంతి’ ఇష్యూ మీద  పెద్ద చర్చే జరిగినట్టు సమాచారం. శాంతి విషయంలో మీడియాలో ఎందుకింత రాద్ధాంత జరుగుతోందని సాయిరెడ్డిని జగన్ ప్రశ్నించడంతో తనకు ఏ పాపమూ తెలియదని విజయసాయిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ‘కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకొని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి. 2020లో అసిస్టెంట్ కమీషనర్ ఎండోమెంట్స్‌ ఆఫీసర్‌గా శాంతిని సీతమ్మదారి ఆఫీసులో కలిశాను. అప్పటి నుంచి ఆమెను కూతురుగా భావిస్తున్నాను. ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశాను. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి మాట్లాడాను. నా ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించాను. అంతే ఇంతకుమించి ఏమీ లేదు’ అని జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు రాష్ట్రాన్ని నాశనం చేశాయి

తల్లి - పిల్ల కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్  విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ దుమ్మెత్తి పోశారు. బీజేపీ ప్రస్తుతం ఏపీని ఆదుకుంటోందని.. అమరావతితో పాటు రైల్వే లైన్ కోసం నిధులు కేటాయించిందని ప్రశంసలు కురిపించారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని లంకా దినకర్ అన్నారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగిందని పేర్కొన్నారు. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయన్నారు.

100 రోజుల్లో 5 కొత్త పాలసీలు.. చంద్రబాబు స్పీడ్ మామూలుగా లేదుగా!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ  రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో పరుగులెత్తించేందుకు అవసరమైన కొత్త పాలసీల రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నారు.  తాను స్వయంగా రోజుకు 18 గంటలు పని చేస్తూ వరుస సమీక్షలతో , విస్పష్ట ఆదేశాలతో దిశా నిర్దేశం చేస్తూ అధికారులను పరుగులెత్తిస్తున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కొత్త పాలసీల రూపకల్పనపై బుధవారం (జులై 31) అధికారులతో సమీక్ష నిర్వహించారు.   గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ సందర్భాలలో వివిధ సంస్థలతో పెట్టుబడుల కోసం చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత స్థితిపై చర్చించారు.  తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా...తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగా అప్పట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయి.  జగన్ సర్కార్  పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులకు గురి చేయడం, రాజకీయ వేధింపులకు పాల్పడటంతో   చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.  అదే సమయంలో జగన్ విధానాల కారణంగా కొత్త పరిశ్రమలేవీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు.  ఈ విషయాలన్నీ కూలంకుశంగా చర్చించిన చంద్రబాబు  మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అసవరం ఉందని, అందుకు అనుగునంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.   వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం జగన్ సర్కార్ వెనక్కు తీసుకున్న విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.  పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అసవరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా...అందుకు భిన్నంగా పరిశ్రమలకు కేటాయించే స్థలాలు ఇచ్చారన్నారు.  పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే....వైసీపీ ప్రభుత్వంలో 34 శాతం మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు  పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామన్నారు.  2014 -2019 కాలంలో 64 ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా 14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే....2019 -2024 మధ్య కేవలం 31 పార్కులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రమిక వేత్తలు, పెట్టుబడి దారులు నమ్మకం కోల్పోయారని సీఎం అన్నారు. నాడు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరం అయితే తాను కూడా వారితో మాట్లాడుతానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు.  ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. తద్వారా ఏడాది కాలంలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి...పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని సీఎం అదేశించారు.    వచ్చే 100 రోజుల్లో కొత్తగా 5 పాలసీలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ఇండస్ట్రీయల్ పాలసీ, ఎంఎస్ఎంఇ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్  క్లౌడ్ పాలసీ, టెక్స్ టైల్ పాలసీలు  తీసుకురావాలని అన్నారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతారవణం కల్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా చెయ్యాలనే లక్ష్యంతో విధానాల రూపకల్పన జరగాలన్నారు.  అదే విధంగా కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లష్టర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని సీఎం అన్నారు. కుప్పం, మూలపేట, చిలమత్తూరు,  దొనకొండ లేదా పామూరులో కొత్త క్లష్టర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా క్లష్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని సిఎం అన్నారు.  అలాగే కృష్ణపట్నం, నక్కపల్లి, ఒర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ పురోగతిపై చర్చించారు. నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్, రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు అయ్యే ఎన్టీపీఎస్ గ్రీన్ హైడ్రొజన్ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బిపిసిఎల్ ప్రాజెక్టుల స్థితిగతులపై చంద్రబాబు అధికారులతో   సమీక్షించారు.

పారిస్ ఒలింపిక్స్.. సత్తా చాటుతున్న భారత షట్లర్లు

పారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో పతకాల దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పురుషుల డబుల్స్ విభాగంలో రంకిరెడ్డి సాత్విక్, చిరాగ్ జోడీ క్వార్టర్స్ కు చేరుకోగా, తెలుగు తేజం, ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధూ మహిళల సింగిల్స్ లో వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ కు చేరింది. గ్రూపులో తొలి మ్యాచ్ లో మాల్దీవులపై సునాయాస విజయం సాధించిన సింధు బుధవారం (జులై 31) న ఎస్తోనియాకు చెందిన కుబా క్రిస్టిన్ పై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది.  ఈ మ్యాచ్ లో కుబా క్రిస్టిన్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-5, 21-10  తేడాతో విజయం సాధించింది.  టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు.. ఈసారి పసిడి పతకంపై గురిపెట్టింది.  ఆ లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తున్నది.   అలాగే పురుషుల సింగిల్స్ లో ఇండియన్ షట్లర్ లక్ష్యసేన్ కూడా వరుసగా మూడు విజయాలతో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు బుధవారం (జులై 31) జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా క్రీడాకారుడు జోనాటన్ క్రిస్టీపై  లక్ష్యసేన్ 21-18, 21-12 తేడాతో వరుస విజయాలు సాధించాడు. 

ఓలమ్మో.. అందరి ముందే ‘ఫ్రెంచ్’ కిస్ పెట్టేసింది!

మొన్నామధ్య ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక ప్రపంచం మొత్తాన్నీ తనవైపు తిప్పుకుంది. ఈ ఒలింపిక్స్ వేడుక మాత్రమే కాదు.. మరో విషయం కూడా ప్రపంచ వ్యాప్తంగా ‘హాట్’ పాయింట్‌గా మారింది. అదేంటంటే, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ని ఫ్రాన్స్ స్పోర్ట్స్ మంత్రి ఎమీలా కాస్టెరా అందరి ముందు ముద్దుపెట్టుకోవడం. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి వేడుకకి ఆతిథ్యం ఇస్తున్న ఆనందంలో ఫ్రెంచ్ ప్రభుత్వం వుంది. ప్రారంభ వేడుకల సందర్భంలో ఆ ఆనందం ప్రభుత్వానికి సంబంధించిన అందర్లోనూ వుంది. వేడుక ప్రారంభం కాగానే అందరూ ఒకర్నొకరు అభినందించుకుంటూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. అయితే, ఎగ్జయిట్మెంట్ కాస్త ఎక్కువైపోయిన క్రీడా మంత్రిణి ఎమీలా కాస్టెరా మాత్రం ఆనందం పట్టలేక తన ఎదురుగానే వున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కి లటుక్కుమని ముద్దు పెట్టేసింది. దాంతో అక్కడున్నవాళ్ళందరూ షాకైపోయారు. కొంతమంది, ఇదేంట్రా బాబూ అనుకుంటే, మరికొంతమంది మరీ ఇంత పబ్లిగ్గానా అనుకున్నారు. ఇంకొంతమంది అయితే, ఆ ముద్దేదో నాకు పెడితే ఎంత బాగుండేదో అనుకున్నారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ, ఇలా ముద్దు పెట్టుకున్న పాయింట్ సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటో బయటకి రావడంతో ఆ సంచలనం మరింత పెరిగింది. దేశ అధ్యక్షుణ్ణి మినిస్టరమ్మ ఏదో ఎగ్జయిట్‌మెంట్లో ముద్దు పెట్టుకుని వుంటుందిలే అని కొందరు అంటుంటే, అదేం కాదు.. వీళ్ళిద్దరి మధ్య అంతకుముందు నుంచే ఏదో వుంది అని కొందరు అంటున్నారు. 

కేతిరెడ్డి రాజకీయ సన్యాసం?

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు, రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా వుండగా ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ అంటూ ప్రజల్లో తిరిగేవారు. ఈసారి ఎన్నికలలో కేతిరెడ్డి ఓడిపోవాల్సిన వ్యక్తి కాదన్న అభిప్రాయాలు వున్నప్పటికీ, ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా అదే స్థాయిలో వున్నాయి. మొత్తానికి ధర్మవరంలో ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి పూర్తిగా డిప్రెషన్‌లో కూరుకుపోయారు. చాలాకాలం మనిషి బయటకి కూడా రాలేదు. కొంతకాలం తర్వాత తేరుకుని ఆయన బయటకి వచ్చినప్పటికీ ఆయన వైసీపీకి దూరంగానే వుంటూ వస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. ఒక సందర్భంలో కేతిరెడ్డిని జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కి పిలిచినప్పటికీ ఆయన వెళ్ళలేదు. కేతిరెడ్డి తన ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోనట్టే కనిపిస్తోంది. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో, కోరమీసంతో కనిపించే ఆయన గడ్డం పెంచేసుకుని కనిపిస్తున్నారు. కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా వుండాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయన ఏ రాజకీయ పార్టీలో వుండకూడదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా రాజకీయ నాయకుల దగ్గరకి జనం వెళ్తారు. కానీ, తానే జనం దగ్గరకి వెళ్ళినప్పటికీ తనకు నిందలు, ఓటమి తప్ప ఏమీ మిగల్లేదని ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే, రాజకీయాలకు దూరంగా వుండే ఉద్దేశంతో ఆయన వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో వైసీపీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపనున్నట్టు తెలుస్తోంది.

కవితకు మళ్లీ బెయిల్ నిరారణ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోమారు నిరాశే ఎదురైంది.  గత నాలుగు నెలల నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉండిపోయింది. ఈడీ అధికారులు కవితను హైద్రాబాద్ లోని స్వ గ‌ృహంలో అరెస్ట్ చేశారు. ఇది పొలిటికల్ అరెస్ట్ అని కవితతో బాటు బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.  కవితకు బెయిల్ లభించకపోవడంతో కెటీఆర్ , హరీష్ రావులు డిల్లీలోని బిజెపి పెద్దలను కలిసారు. ప్రధాని అయితే వారికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. బిజెపితో కల్సి పని చేస్తామని బిఆర్ఎస్ నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి కలిసి పని చేద్దామని కెటీఆర్, హరీష్ రావు ప్రతిపాదనను బిజెపి నేతలు ఖరాఖండిగా నో అని చెప్పేశారు. పార్లమెంటు ఎన్నికల్లో జిరోకి పడిపోయిన బిఆర్ఎస్ తో కలిసి పని చేయడం కుదరదన్నారు.  బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయాలని షరతు విధించడంతో కెసీఆర్ ఆలోచనలో పడ్డారు. బిఆర్ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం ఇష్టం లేక  కెసీఆర్ ఈ షరతుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి 16న అరెస్టయ్యారు. అప్పటి నుంచీ ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు.  పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, కాబ్టటి కవిత రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

పవన్ కల్యాణ్ కు హైకోర్టులో ఊరట!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత   పవన్ కళ్యాణ్ కు హైర్టులో  ఊరట లభించింది. గతంలో పవన్  కల్యాణ్  వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ హయాంలో కేసు నమోదైంది.    వైసీపీ ప్రభుత్వ హయాంలో  రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారని, వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేకరించిన డేటాయే ఇందుకు కారణమని పవన్ ఆరోపించారు. దీనిపై వాలంటీర్లు చేసిన ఫిర్యాదుపై  పోలీసులు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన  కేసును క్వాష్ చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు బుధవారం (జులై 31)  విచారించింది. అనంతరం కేసును నాలుగు వారాలు వాయిదా వేస్తూ పవన్ కల్యాణ్ పై కేసు గుంటూరులో కేసు విచారణపై స్టే విధించింది.   కాగా ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ పవన్ కల్యాణ్ పై కేసు సహా పలు కేసుల నమోదుకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రస్తుత సర్కార్ వెనక్కు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా నమోదు చేసిన పలు కేసులను రివైజ్ చేయాలని ప్రస్తుత సర్కార్ భావిస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు. 

అతితెలివికి ఆకారం కేటీఆర్!

అతి తెలివితేటలకి ఆకారం ఇస్తే ఎలా వుంటుందంటే, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌లాగా వుంటుంది. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు.. ఆయన ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా ఆ మాటల్లో అతి తెలివితేటలు స్టీరియో ఫోనిక్ సౌండ్ డీటీఎస్‌లో వినిపిస్తూ వుంటాయి. తమ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్ కుటుంబం భరించలేకపోతోంది. ఆ కడుపులో మంట కేటీఆర్‌ నోట్లోంచి బయటపడుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య పుల్లలు పెట్టే మాటలను అతి తెలివిగా మాట్లాడుతున్నారు. ఆ అతితెలివి మాటలను కేటీఆర్ తాను చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటూ వుండొచ్చు.. అది వేరే విషయం! మొదట్నుంచీ కేటీఆర్ అనే మాట ఏమిటంటే, ఉప ముఖ్యమంత్రిగా వున్న మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ డైలాగు కేటీఆర్ వీలున్నప్పుడల్లా వాడుతున్నారు. పైకి మాత్రం రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న బిల్డప్పు, కానీ మనసులో వున్న పాయింట్ మాత్రం వేరే. మల్లు భట్టి విక్రమార్క మనసులో ‘ముఖ్యమంత్రి’ అనే బీజాన్ని నాటడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు సృష్టించాలన్నది కేటీఆర్ ప్లాన్. అందుకే భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈరకంగా పదకొండో శతాబ్దం రాజకీయ తెలివితేటలను కేటీఆర్ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉపయోగిస్తున్నారు. ఈయన మాటలను మనసులో పెట్టేసుకునేంత అమాయకుడు కాదు భట్టి విక్రమార్క. అయినా దళితుడైన భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు తెగ ఫీలైపోతున్న కేటీఆర్ తన తండ్రికి ఈ ఉపదేశం ఎందుకు చేయలేదో! తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. రెండుసార్లూ తానే ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి కూడా తానే ముఖ్యమంత్రి అయి, నాలుగోసారి కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క విషయంలో చేస్తున్న కామెంట్లు, కేటీఆర్ తన తండ్రి దగ్గరే చేసి వుంటే బాగుండేది కదా? అందుకే ఆచార్య ఆత్రేయ, ‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ అని ఏనాడో చెప్పారు. కేటీఆర్ లాంటివాళ్ళు ఆ నీతులను ఈనాడూ అమలు చేస్తున్నారు. 

ఎర్రచందనం స్మగ్లర్.. వైసీపీ ఎంపీపీ బాబుల్‌రెడ్డి అరెస్టు

అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందినవైసీపీ నేత బాబుల్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పుల్లంపేట ఎంపీపీగా ఉన్న బాబుల్ రెడ్డిని అరెస్టు చేసి చాపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో అనేక సార్లు ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన బాబుల్ రెడ్డి వైసీపీ హయాంలో మాత్రం స్వేచ్ఛగా బయట తిరిగాడు. గతంలో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న బాబుల్ రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈయన పుల్లంపేటకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి సమీప బంధువు. గత ఐదేళ్లు భారీగా ఎర్రచందనాన్ని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు బాబుల్ రెడ్డిపైన ఆరోపణలు ఉన్నాయి.