తాప్సీ భర్త షాకింగ్ నిర్ణయం!
posted on Aug 3, 2024 @ 5:35PM
తాప్సీ భర్త మథియాస్ బో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్.లో బ్యాడ్మింటన్ డబుల్స్ పతకం తెస్తారని భావించిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీకి కోచ్ మరెవరో కాదు.. మథియాస్ బోనే. అయితే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఈ జోడీ అనూహ్య రీతిలో ఓడిపోయింది. దాంతో వీరిద్దరికీ కోచ్ అయిన మథియాస్ బో వైరాగ్యంలో పడిపోయారు. తన కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో తెలియజేస్తూ ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు. ‘‘కోచ్‌గా నా ప్రయాణం ముగిసింది. ఇక భారతదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడా కోచ్‌గా బాధ్యతలు తీసుకోను. నా జీవితంలో ఎక్కువ సమయాన్ని బ్యాడ్మింటన్ హాల్‌లో ఖర్చుపెట్టేశాను. కోచ్ బాధ్యత కొంత ఒత్తిడితో కూడుకున్నదే. నేను బాగా అలసిపోయాను. నాకు కోచ్‌గా అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కి ధన్యవాదాలు. సాత్విక్ - చిరాగ్‌లో ఇప్పుడు ఎంత బాధ వుందో నేను అర్థం చేసుకోగలను. జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో తీర్చిదిద్దుకోవడానికి ఎంత శ్రమించినప్పటికీ, ఒలింపిక్స్.లో ఫలితం దక్కలేదు. ఇండియాకి పతకం తీసుకెళ్ళాలని భావించారు. కానీ, ఈసారి అవకాశం రాలేదు. గాయాలు వున్నప్పటికీ అంకితభావంతో ఆడి ఇద్దరూ మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. దీనికి నేను గర్విస్తున్నాను’’ అని మథియాస్ బో తన పోస్టులో పేర్కొన్నారు. మథియాస్ బోతో తాప్సీ వివాహం ఈ ఏడాది మార్చిలో జరిగింది.