కృష్ణ కాంత్ పార్కులో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత జరిగింది ఇది.. 

నేటి యువతకి బాధ్యత లేకుండా పోయింది. ఏవేవో అనుకుని అడ్డదారి తొక్కుతున్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో కొందరు యువకులు పెడతోవ పడుతున్నారు. ప్రేమ పేరుతో జీవితాలను చిక్కుల్లోకి నెట్టుకుంటున్నారు. అమ్మాయిల వెంట పడుతూ ఆకతాయిల్లా మారుతున్నారు. గల్లీలో, బస్తీల్లో పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతూ చిల్లరగాళ్లనే ముద్ర వేసుకుంటున్నారు. పొద్దున్న లేస్తే ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట బొంగరంల తిరుగుతూ. అమ్మాయిలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా  ఓ అమ్మాయిని లవ్ పేరుతో ముప్పుతిప్పలు పెట్టి.. చివరకు ఆమె సరే అనడంతో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లడం హీరోయిజంగా భావించిన ఓ యువకుడు చివరకు పోలీస్ స్టేషన్‌లో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. అది హైదరాబాద్. యూసఫ్‌గూడ ప్రాంతానికి చెందిన రమేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. సినిమాల్లో ప్రేమ పేరుతో ఓ యువతి తిరిగాడు. ఆ తర్వాత ఆమెతో ‘ఐ లవ్ యూ’ చెప్పించుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. అతనికి ఏ పనీపాటా లేకపోవడం, ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోకపోవడంతో ఆ బాలిక ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడమే పనిగా పెట్టుకున్నాడు. సినిమాలో హీరోలా ఆమె ముందు ఫోజులు కొట్టాడు. ఆమెను తన పిచ్చి ప్రేమలో దింపాలని ఫిక్సయిపోయాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. రమేష్ పిచ్చి మాటలకు, వెకిలి చేష్టలకు, పొగడ్తలకు ఆ అమ్మాయి  ఇంప్రెస్ అయింది. ఆమె కూడా ‘నువ్వంటే నాకిష్టం’  నువ్వు లేక నేనులేను అని చెపింది అని చెప్పింది. ఇంకేముంది.. కట్ చేస్తే రమేష్‌తో కలిసి ఆ బాలిక చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించింది. ఇద్దరూ కలిసి సినిమాలకు, షికార్లకు తిరిగారు. యూసఫ్‌గూడకు దగ్గర్లో ఉన్న కృష్ణకాంత్ పార్కుకు పలుమార్లు వెళ్లి సరదగా గడిపేవారు. మే 5న బాలికను కృష్ణకాంత్ పార్క్‌కు తీసుకెళ్లిన రమేష్ ఆమె ఊహించని పని చేశాడు. పార్క్‌కు తీసుకెళ్లి ఎవరూ చూడకుండా ఆమె వద్దంటున్నా వినకుండా బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. అనంతరం.. పెళ్లయిందని.. ఇక ఏం చేసినా తప్పు లేదని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అంతేకాదు.. అదే రోజు ఆమెను రమేష్ పార్క్‌కు దగ్గర్లో ఉన్న మేనత్త ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టినట్టు చెప్పాడు. దీంతో.. రమేష్ మేనత్త అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి వచ్చిన రమేష్ తల్లి యేసమ్మ ‘ఇదేం పనిరా’ అని కొడుకుకు చీవాట్లు పెట్టింది. ఆ బాలికను కూడా తిట్టికొట్టి అక్కడ నుంచి పంపించేశారు. మళ్లీ రమేష్‌ను కలిసేందుకు ఈవైపుకు వస్తే మర్యాదగా ఉండదని బాలికను హెచ్చరించారు. ఏడుస్తూ ఆ బాలిక అక్కడ నుంచి వెళ్లిపోయింది. జరిగింది ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని భావించిన బాలిక తన మెడలో తాళిని కనిపించకుండా కవర్ చేసి.. ఏం తెలియనట్టుగా ఇంట్లో వాళ్ల ముందు ప్రవర్తించింది. అయితే.. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తనలో తాను కుమిలిపోయింది. మే 17న ఇంట్లో ఒంటరిగా ఉండి ఏడుస్తున్న ఆ బాలికను తల్లి గమనించింది. ఏం జరిగిందని, ఎందుకు ఏడుస్తున్నావని తల్లి ప్రశ్నించగా జరిగిందంతా చెప్పి ఆ బాలిక కన్నీటిపర్యంతమైంది. దీంతో.. బాలిక తల్లి రమేష్ ఇంటికి వెళ్లి నిలదీయగా ఆమెపై దాడి చేశారు. బాలిక తల్లి రమేష్, అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని, తన కూతురి జీవితాన్ని రమేష్ నాశనం చేశాడని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ సర్కార్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై ఫిర్యాదు అందింది. రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు కుటుంబ సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఎంపీ రఘురామ  భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని కలిసారు. రాఘురామపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. ఏపీ సీఐడీ చర్యలను, కోర్టు ధిక్కారాన్ని ఓం బిర్లాకు వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారని ఓం బిర్లాకు వివరించారు.  సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురిచేశారని  రఘురామ కుటుంబసభ్యులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాఘురామకు ప్రాణహాని ఉందని, ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని కోరారు. రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై ఓం బిర్లా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుమార్తె ఇందూ ప్రియదర్శిని, కుమారుడు భరత్‌ బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తమ తండ్రిని వేధిస్తున్నారని, కక్ష సాధించేందుకే అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో సీఐడీ పోలీసులు తమ తండ్రిని హింసించారని వాళ్లు అమిత్ షాకు చెప్పారని తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేస్తూ జైలుకు పంపారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ బెయిలు రద్దు చే యాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతోపాటు... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ముఖ్యమంత్రి కక్ష కట్టి తమ తండ్రిపై కుట్రపూరితంగా రాజద్రోహం కేసు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. రఘురామ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలన్నీ సావధానంగా విన్నఅమిత్‌షా... అసలేం జరిగిందో, ఎందుకు ఇలా చేస్తున్నారో రాష్ట్రం నుంచి వివరణ కోరుతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

మాస్క్ లేకుండానే అసెంబ్లీకి జగన్.. జనానికిదేనా సంకేతం! 

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి మరణ మృందగం మోగిస్తోంది. దేశంలో ఎక్కువ పాజిటివిటి రేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లోనే ఉంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో ఏపీ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఏపీలో గుర్తించిన వైరస్ వేరియెంట్ ప్రమాదకరమనే ప్రచారం జరుగుతోంది. కరోనా కట్టడికి మాస్క్ అత్యంత కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఏపీలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు. కొవిడ్ రూల్స్ పాటిస్తూ ప్రభుత్వ అధినేతగా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగనే వాటిని అతిక్రమిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్క్ ధరించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనే మాస్క్ లేకుండానే పాల్గొన్నారు సీఎం జగన్. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. బడ్జెట్ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. టీడీపీ బహిష్కరించగా.. వైసీపీ సభ్యులే సభకు హాజరయ్యారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అసెంబ్లీకి మెజార్టీ సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీకి వచ్చిన జగన్.. మాస్క్ లేకుండానే కూర్చున్నారు. సభ జరిగినంత సేపు మాస్క్ ధరించలేదు ముఖ్యమంత్రి. మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. మాస్క్ లేకుండా బయటికి వచ్చిన వారికి పోలీసులు ఫైన్ కూడా వేస్తున్నారు. సీఎం జగన్‌ తో పాటు పలువురు మంత్రులు మాస్క్‌లు లేకుండానే వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పే ముఖ్యమంత్రి, మంత్రులు.. మాస్కులు ధరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాని సీఎం జగన్ మాత్రం వందలాది మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీ హాల్ లో మాస్క్ లేకుండానే సంచరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  మాస్క్ నిబంధనలు ప్రజలకేనా..? సీఎం జగన్, మంత్రులకు వర్తించవా? అంటూ చర్చ జరుగుతోంది. మాస్క్‌లు ధరించాలంటూ అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో చెవిరెడ్డితో పాటు సీఎం జగన్‌కు మాస్క్‌లు లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మాస్క్ లేకుండా సభలో పాల్గొన్న సీఎం  జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ మాస్కు పెట్టుకోవ‌ట్లేద‌ని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 'ముఖ్య‌మంత్రి గారూ! మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన మీరు మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్య‌మంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారు?' అని లోకేశ్ ప్ర‌శ్నించారు.   'తొలి విడ‌త‌లో కొవిడ్ వైర‌స్ చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదేన‌ని, పారాసెట‌మాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చ‌ల్లితే చ‌స్తుంది.. ఇట్ క‌మ్స్ ఇట్ గోస్.. ఇట్ షుడ్‌బీ నిరంత‌ర ప్ర‌క్రియ‌, స‌హ‌జీవ‌నం అంటూ ఫేక్ మాట‌ల‌తో వేలాది మందిని బ‌లిచ్చారు' అని లోకేశ్ విమ‌ర్శించారు. 'సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మ‌శానంగా మారుతుంటే చిరున‌వ్వులు చిందిస్తూ, మీరే మాస్క్ ధ‌రించ‌కుండా ఇంకెన్ని వేల‌మంది ప్రాణాలు ప‌ణంగా పెడ‌తారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మ‌నిషిన‌ని నిరూపించుకుంటారో మీ ఇష్టం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.  

ముదిరాజులకు కీలక పదవులు.. ఈటలకు కేసీఆర్ అలా చెక్? 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనను అవమానకరంగా తొలగించారనే కసిలో ఉన్నారు రాజేందర్. బీసీ నేతగా రాజకీయాల్లో ఎదిగిన ఈటల బర్తరఫ్ తో .. బీసీ సామాజిక వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈటల సొంత సామాజికవర్గమైన ముదిరాజులయితే కేసీఆర్ పై రగిలిపోతున్నారు. తమ నాయకుడిని అవమానించారంటూ  రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగానూ సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈటలను అవమానిస్తే... మొత్తం తమ సామాజికవర్గాన్నే అవమానించారంటూ ముదిరాజులు మండిపడితున్నారు. ఈటల ఎపిసోడ్ తో సీన్ ఇలా ఉంటే... ఇప్పుడు మాత్రం మరోలా మారింది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించిన కేసీఆర్... ఇప్పుడు ఈ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారు.   ఇటీవల జరిగిన కీలక పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈటల బర్తరఫ్ తో తనపై వస్తున్న బీసీ  వ్యతిరేకి ముద్రతో పాటు ముదిరాజులను కూల్ చేసేలా ఆయన ఎత్తుగడులు ఉంటున్నాయి. తాజాగా నియమించిన రెండు కీలక నామినేటెడ్ పోస్టుల్లో ముదిరాజులకు ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. చాలా కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త పాలక మండలి ఏర్పాటైంది.  సీనియర్ ఐఏఎస్ జనార్ధన్ రెడ్డి చైర్మెన్ గా మరో ఏడుగురు సభ్యులతో కమిటి నియమించారు. ఇందులో  ముగ్గురు రెడ్డలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్టీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బీసీల నుంచి ఎప్పుడు ఉండే వర్గాలకు కాకుండా ముదిరాజ్ మహిళను అపాయింట్ చేశారు సీఎం కేసీఆర్. స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ గా పని చేస్తున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కోట్ల అరుణ కుమారిని టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా నియమించారు. ప్రస్తుతం వికారాబాద్ లో భూ భారతి జాయింట్ డైరెక్టర్ గా, జాయింట్ క లెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు అరుణ కుమారి. బీసీల్లో బలమైన వర్గంగా ఉన్న మున్నురుకాపు, యాదవ, గౌడ వర్గాల నుంచి కాకుండా ముదిరాజుకు చోటు కల్పించడానికి ఈటల రాజేందర్ ఎఫెక్టే కారణమంటున్నారు.  గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉండి.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి కొత్త పాలక మండలి నియమించారు. మల్లన్న స్వామిని యాదవులు తమ కుల దైవంగా భావిస్తారు. అందుకే కొమురవెల్లి టెంపుల్ చైర్మెన్ పదవి యాదవులకే ఇవ్వాలనే డిమాండ్ ఉంది. గతంలోనూ ఎక్కువ సార్లు యాదవులకే ఇచ్చారు. సీఎం కేసీఆర్ మాత్రం కొమురవెల్లి మల్లన్న టెంపుల్ కమిటీ చైర్మెన్ గా గీస భిక్షపతి ముదిరాజ్ ను నియమించారు.  యాదవుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నా పట్టించుకోకుండా ముదిరాజును ముఖ్యమంత్రి ఖరారు చేయడానికి ఈటల రాజేందరే కారణమనే చర్చ జరుగుతోంది. ఈటల బర్తరఫ్ తో రగిలిపోతున్న ముదిరాజులను మళ్లీ దగ్గరకు చేసుకునేందుకే కీలక పదవుల్లో కేసీఆర్.. ఆ వర్గం వారికి కట్టబెడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  ఇప్పటికే ముదిరాజు వర్గానికి చెందిన బండా ప్రకాష్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న కేసీఆర్.. వ్యూహాత్మకంగానే బండా ప్రకాష్ కు రాజ్యసభ సీటు ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. ఈటలకు పోటీగానే బండాను తెరపైకి తెచ్చారని అంటున్నారు. ప్రకాష్ ను పెద్దల సభకు పంపినపుడే.. తనకు చెక్ పెట్టబోతున్నారనే విషయాన్ని గ్రహించిన రాజేందర్.. తన దారి చూసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారని కూడా చెబతున్నారు. ఇకపై జరగబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ముదిరాజులకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లోనే జరుగుతోంది. అంతేకాదు జూన్ లో ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ ఖాళీ కాబోతోంది. కొవిడ్ కారణంగా ప్రస్తుతానికి ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఒక ముదిరాజుకు చోటు ఖాయమంటున్నారు.  ఈటల రాజేందర్ ముదిరాజు అయినా... ఆయన ఎక్కువగా ఆ కుల రాజకీయాల్లో పాల్గొనలేదు. బీసీ నేతగానే అడుగులు వేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం ముదిరాజు సంఘం పేరుతో ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించేవారు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. ఈటల రాజేందర్ ను అన్ని విధాలా అణగదొక్కాలనే ప్రయత్నాల్లో ఉన్న సీఎం కేసీఆర్.. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఎమ్మెల్సీ ఇవ్వవొచ్చనే ప్రచారం జరుగుతోంది. కాసాని ద్వారా ఈటల ముదిరాజ్ అస్త్రానికి చెక్ పెట్టాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా ఈటల రాజేందర్ రాజకీయ వ్యూహాలతో.. ఆయన సామాజిక వర్గ నేతలకు ప్రభుత్వంలో మంచి అవకాశాలు వస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాలు, టీఆర్ఎస్ నేతల్లోనూ జరుగుతోంది.   

చికెన్ కోసం మ‌ర్డ‌ర్‌.. న‌లుగురు అరెస్ట్‌..

ఆక‌లేస్తోంద‌ని హోట‌ల్‌కి వెళ్లారు. చికెన్ మీల్స్ ఆర్డ‌ర్ ఇచ్చారు. చికెన్ లేద‌నేది స‌ర్వ‌ర్ ఆన్స‌ర్‌. కావాలంటే బోటీ ఉంది అన్నాడు. బోటీ వ‌ద్దు.. చికెనే కావాల‌న్నారు వాళ్లు. అయితే, చికెన్ క‌ర్రీ లేదంటూ స‌ర్వ‌ర్ కిచెన్‌లోకి వెళ్లిపోయాడు. క‌ట్ చేస్తే.. అదే రోజు రాత్రి హోటల్ ముందు స‌ర్వ‌ర్ డెడ్‌బాడీ. ఇంత‌కీ, స‌ర్వ‌ర్‌ను ఎవ‌రు చంపారు? హంత‌కులు వాళ్లేనా?  హైద‌రాబాద్‌లో జ‌రిగిందీ హ‌త్య‌. కర్ణాటకలోని బీదర్‌ జిల్లా మొర్కందివాడి గ్రామానికి చెందిన మ‌హేష్‌(20), విజయ్‌(24)లు అన్నదమ్ములు. కొత్తపేట పండ్ల మార్కెట్‌లోని ఓ పండ్ల దుకాణంలో హమాలీలుగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. లాక్‌డైన్‌కు ముందు మహేష్‌, విజయ్‌ మరో ఇద్దరు మైన‌ర్ బాలురు కొత్తపేట పండ్ల మార్కెట్‌ ఎదురుగా ఉన్న శ్రీ దుర్గా భవానీ హోటల్‌కు వెళ్లి భోజనంతో పాటు చికెన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. సర్వర్‌ బాలాజీ వచ్చి చికెన్‌ లేదని కావాలంటే బోటి తీసుకోవాలని చెప్పి లోపలికి వెళ్లాడు. మహేష్‌ అతని వెనకాలే కిచెన్‌లోకి వెళ్లగా, అక్కడ కొద్దిగా చికెన్‌ కనిపించింది. దీంతో చికెన్‌ ఉన్నా మాకు ఇవ్వవా? అంటూ గొడవకు దిగాడు. ఈలోగా హోటల్‌ యజమాని సుధాకర్‌ వచ్చి సర్దిచెప్పడంతో, వారు నలుగురు భోజనం చేసి బిల్లుకట్టకుండా వెళ్లిపోయారు.  చికెన్‌ ఉన్నా తమకు ఇవ్వలేదని కోపం పెంచుకున్న ఆ నలుగురు.. సర్వర్‌ బాలాజీపై దాడి చేయాల‌ని డిసైడ్ అయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో నలుగురు మరోసారి హోటల్‌కు వచ్చారు. ముగ్గురు హోటల్‌ బయట ఉండగా, మహేష్‌ లోపలకు వెళ్లి బాలాజీని బయటకు తీసుకుని వచ్చాడు. బాలాజీ పై నలుగురు దాడి చేశారు. మహేష్ ఆవేశంతో బండరాయి తీసుకొచ్చి బాలాజీ తలపై మోదాడు. త‌ల ప‌గిలి తీవ్రంగా ర‌క్తం కార‌డంతో ఆ న‌లుగురు అక్క‌డి నుంచి పారిపోయారు.  తీవ్రగాయాలపాలైన బాలాజీని కొత్తపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 15న బీదర్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ 17న మృతి చెందాడు. ఫిర్యాదు అంద‌టంతో.. సరూర్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాలను ప‌రిశీలించ‌గా విష‌యం వెలుగు చూసింది. ఆ న‌లుగురుపై కేసు న‌మోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. నిందితుల్లో ఇద్ద‌రు మైన‌ర్లు.  జ‌స్ట్.. చికెన్ క‌ర్రీ కోసం స‌ర్వ‌ర్‌ను హ‌త్య చేసిన ఆ న‌లుగురుకి.. ఇప్పుడు జైల్లో చికెన్ క‌ర్రీ దొరుకుతుందా? చిప్ప‌కూడేగా తినాల్సింది.. ఈ మాత్రం బుద్ధి అప్పుడే ఉంటే.. ఇప్పుడు చిప్ప‌కూడు కాకుండా.. ఎంచ‌క్కా చికెన్ క‌ర్రీనే తినేవాళ్లుగా..!

ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్.. ఇలా చేస్తే ఫినిష్.. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ 

కరోనా టెస్టుల కోసం ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారా? హాస్పిటల్స్ దగ్గర రద్దీతో అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారా? కొవిడ్ టెస్టు సెంటర్లే వైరస్ హాట్ స్పాట్లుగా మారిపోయానని ఆందోళన చెందుతున్నారా? టెస్టులకని పోతే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోననే భయంగా ఉన్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్..  ఆ తిప్పలు పోగొట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇంట్లోనే.. మనకు మనమే టెస్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మహారాష్ట్రలోని మైల్యాబ్ అనే సంస్థ తయారు చేసిన ‘కొవిసెల్ఫ్’ అనే స్వీయ ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతులను ఇచ్చింది. ఇంట్లోనే కరోనా టెస్టుకు ఇవే ఐసీఎంఆర్ మార్గదర్శకాలు... లక్షణాలున్న వారు లేదా కరోనా సోకిన వారిని కలిసిన వారు మాత్రమే టెస్ట్ చేసుకోవాలి.. టెస్టులను ఇష్టమొచ్చినట్టు చేయొద్దు..  సంస్థ టెస్ట్ కిట్ లోని యూజర్ మాన్యువల్ లో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్ష చేసుకోవాలి..  టెస్టులు చేసుకునేవారంతా గూగుల్ ప్లే స్టోర్ నుంచి హోం టెస్టింగ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి..  పరీక్షా పద్ధతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్ లో ఉంటాయి. అంతేగాకుండా పరీక్ష ఫలితాలు (నెగెటివ్/పాజిటివ్) అందులోనే తెలుసుకోవచ్చు.. టెస్ట్ పూర్తయిన తర్వాత.. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న, టెస్ట్ చేసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ లోనే ఆ టెస్ట్ పేపర్ ను ఒక ఫొటో తీసుకోవాలి.. టెస్ట్ లో పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు.. ఒకవేళ లక్షణాలుండి నెగెటివ్ వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.. పాజిటివ్ వచ్చి.. లక్షణాలు తక్కువగా ఉన్నవారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గనిర్దేశాల ప్రకారం ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలి.. లక్షణాలుండి యాంటీ జెన్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చిన వారిని కరోనా అనుమానిత పేషెంట్ గానే భావించాలి. అలాంటి వారు ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి.. యాప్ లోని యూజర్ వివరాలు ఐసీఎంఆర్ కొవిడ్ 19 టెస్టింగ్ పోర్టల్ లో భద్రంగా దాస్తారు.. టెస్ట్ అయిపోయిన తర్వాత సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కిట్ ను భద్రంగా పారేయాలి..   

తీర్పు తీరానికి తుపాను గండం.. ఏపీపైనా ప్రభావం!

కరోనాతో అల్లాడుతున్న భారతదేశానికి వరుస గండాలు వస్తున్నాయి. అరేబియా సముద్రం ఏర్పడిన తౌక్టే తుపాను పశ్చిమ తీరంలో అల్లకల్లోలం సృష్టించింది. మహారాష్ట్ర, గుజరాత్‌లో ఊహకందని విధ్వంసం జరిగింది. అరేబియాలో సముద్రంలో భారీ నౌకలే కొట్టుకుపోయాయి. సముద్రంలో కొట్టుకుపోయిన ఓ నౌక నుంచి ఇవాళ 22 మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. ఇక గుజరాత్, మహారాష్ట్రలో తుపాను ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ముఖ్యంగా గుజరాత్‌లో భారీ నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు తౌక్టే విలయం నుంచి కోలుకోకముందే దేశానికి మరో తుపాను గండం ముంచుకొస్తోంది. ఇప్పుడు తూర్పు తీరాన్ని ముంచెత్తేందుకు మరో తుపాను వస్తోంది. మే 26, 27 తేదీల్లో తూర్పు తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణశాఖ అంచనావేసింది. ఐఎండీ అంచనాల ప్రకారమే.. అల్పపీడనం తుపాను‌గా మారితే దానిని యాస్‌ (YAAS)గా పిలుస్తారు. ఒమన్ దేశం ఆ పేరును సూచించింది. భాతర వాతావరణశాఖ చెప్పిన వివరాల ప్రకారం.. మే 22న ఉత్తర అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడనుంది. దాని ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ అల్పపీడనం ఏర్పడిన 72 గంటల తర్వాత తుపానుగా బలపడనుంది. అది వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ వైపు వెళ్తుంది. మే 26 లేదా 27న తీరం దాటే అవకాశముంది. యాస్ తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ పైనా యాస్ తుపాను ప్రభావం ఉండనుందని చెబుతున్నారు. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే కాస్త ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 21 తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని దక్షిణ అండమాన్ సముద్రాన్ని రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.   

ఏపీ బడ్జెట్ 2021-22 కేటాయింపులు ఇవే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. అంతకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.  ఏపీ బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు.. 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779 కోట్లు గత బడ్జెట్ అంచనా రూ.2,24,789 కోట్లు వెనుకబడిన కులాలకు బడ్జెట్‌లో 32శాతం అధిక కేటాయింపులు బీసీ సబ్‌ ప్లాన్‌కు రూ.28,237 కోట్లు  కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ.3,840 కోట్లు మైనార్టీ సబ్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు పిల్లల కోసం రూ.16,748 కోట్లు, మహిళాభివృద్ధికి రూ.47,283 కోట్లు వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు జగనన్న వసతి దీవెనకు రూ.2,223.15 కోట్లు వైఎస్సార్– పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1,802 కోట్లు రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపుల కోసం రూ.500 కోట్లు డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ.1,112 కోట్లు కాపు నేస్తం కోసం రూ. 500 కోట్లు, ఈబీసీ నేస్తం కోసం రూ. 500 కోట్లు వైఎస్సార్ జగనన్న చేదోడు పథకం కోసం రూ.300 కోట్లు వైఎస్సార్ వాహన మిత్ర పథకం కోసం రూ. 285 కోట్లు వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు వైఎస్సార్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.20 కోట్లు లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు వైఎస్సార్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు వైఎస్సార్ చేయూత కోసం రూ.4,455 కోట్లు రైతుల పథకాలకు రూ.11,210.80 కోట్లు వైఎస్సార్ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.88.57 కోట్లు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ.1802.82 కోట్లు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు వైఎస్సార్ పశువుల నష్టపరిహార పథకానికి రూ.50 కోట్లు విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు దీంట్లో స్కూళ్లలో నాడు–నేడుకు రూ.3,500 కోట్లు జగనన్న గోరుముద్ద కోసం రూ.1,200కోట్లు జగనన్న విద్యాకానుక కోసం రూ. 750 కోట్లు ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు వైద్యారోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94 కోట్లు ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ. 1,535 కోట్లు కొవిడ్‌పై పోరాటానికి రూ.వెయ్యి కోట్లు, పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌ కోసం రూ.100 కోట్లు

సవతి కొడుకు తో.. గర్భం దాలిచిన తల్లి..

భూమిమీద అరాచకాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వరసలు లేవు..ఏం లేవు అవసరం తీరిందా లేదా అనేది చూస్తున్నారు జనాలు. మరి రోజు రోజుకి దిగజారిపోతున్నారు. అయినా వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలం లో ఇలాంటి వార్తలు చాలానే వింటున్నాం.. కానీ వరసకు కొడుకు అయ్యే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక నీచురాలు. అయితే ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పదండి మరి..  ఆ దంపతుల పేరు  మన్విందర్, రూపవతి  వారికి ఇద్దరు కుమారులు. వారి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో రూపవతి మృతి చెందింది. రూపవతి చనిపోవడంతో మన్విందర్, రేచల్ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మన్విందర్, రూపవతి ల సంతానమైన  పెద్ద కుమారుడు దేవేందర్ ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడు. చిన్న కుమారుడు  ధన్విందర్,  మన్విందర్, రేచల్ తోనే ఉండే వాడు. అయితే రేచల్  స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో రేచల్ పనిచేసేది. అయితే ఆమెను మన్విందర్ రెండో కుమారుడు ధన్విందర్ రోజు బైక్ పై దింపి వస్తుండేవాడు. అయితే రేచల్ వయస్సు రీత్యా కేవలం 30 పదులు దాటింది. దీంతో ఆమెలో ఇంకా యవ్వనం కోరికలు తీర్చుకునేందుకు సవతి కుమారుడు ధన్విందర్ ను తన ముగ్గులో దించాలని ప్రయత్నించింది. అంతే టీనేజీ కుర్రాడైన ధన్విందర్ వావీ వరుసలు మరిచి సవతి తల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.రేచల్ కూడా శారీరక సుఖాన్ని అందిస్తున్న సవతి కొడుకుతో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇలా కొన్ని నెలలుగా వీరి వివాహేతర సంబంధం కొనసాగింది. క్రమంగా రేచల్ పై ధన్విందర్ కు అనుమానం పెరిగింది. తన తండ్రికి అసలు విషయం తెలిస్తే తనకు ప్రమాదమని భావించాడు. అంతేకాదు రేచల్ గర్భవతి కావడంతో ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేశాడు. తన ద్వారా గర్భవతి అయిన రేచల్ కు పార్టీ చేసుకుందామని ధన్విందర్ ఆహ్వానించాడు. సవతి తల్లికి ఫుల్లుగా మద్యం తాగించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఆమెను చెరువులోకి తోసేసి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేసి, ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేశాడు. ఏమీ ఎరుగని వాడిలా తన సవతి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆధారాల కోసం వెతకగా, సవతి కుమారుడు ధన్వందర్ బాగోతం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ  ఘటన హర్యానాలోని కర్నాల్ జిల్లాలో వెలుగు చూసింది.

బ‌య‌టికొస్తే బండి సీజ్‌.. పోలీస్ యాక్ష‌న్ షురూ..

తెలంగాణ‌లో రోజుకు సుమారు 4వేల కేసులు. గ‌త కొన్ని వారాలుగా ఇదే సంఖ్య‌. లాక్‌డౌన్‌కు ముందు ఇన్నే కేసులు వ‌చ్చేవి. లాక్‌డౌన్ టైమ్‌లోనూ అవే కేసులు. ఎందుకిలా? రోజులో 20 గంట‌లు లాక్‌డౌన్ అమ‌లు అవుతుండ‌గా.. జ‌న‌మంతా ఇళ్ల‌లోనే ఉండ‌గా.. మ‌రి కేసులెందుకు త‌గ్గ‌ట్లేదు? లాక్‌డౌన్ స‌రిగా అమ‌లు అవ‌డం లేదా? ప్ర‌జ‌లు ఇంకా విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారా? త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదా? లాక్‌డౌన్ అమ‌లులో పోలీసులు ఫెయిల్ అయ్యారా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  తెలంగాణ‌లో ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఉంది. ఆ నాలుగు గంట‌లు అన్ని ర‌కాల షాపులు తెరిచే ఉంటాయి. ఎలాంటి నిబంధ‌న‌లు, ఆంక్ష‌లు ఉండ‌వు. అంటే, ఆ నాలుగు గంట‌లు ఇష్టారాజ్యం. ఎప్ప‌టిలానే బ‌య‌ట తిర‌గొచ్చు. షాపుల‌కు వెళ్లొచ్చు. కావ‌ల‌సిన ప‌నులు చేసుకోవ‌చ్చు. ఇదే ఇప్పుడు కొంప ముంచుతోంద‌ని అంటున్నారు. న‌గ‌రాల్లో ఉద‌యం 6 గంట‌ల‌కు లేచేవాళ్లు త‌క్కువే ఉంటారు. 8 అయితే గానీ బ‌య‌ట‌కు రారు. అందుకే, ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల మ‌ధ్య రోడ్లు, షాపుల్లో జ‌నాలు ఫుల్‌గా ఉంటున్నారు. ఇదివ‌ర‌కు రోజంతా జ‌రిగే వ్యాపారం ఇప్పుడు ఆ రెండు గంట‌ల్లోనే జ‌రుగుతోంది. టైమ్ త‌క్కువ‌గా ఉండ‌టంతో.. ర‌ద్దీ ఎక్కువ‌వుతోంది. ఇక ఆదివారం వ‌చ్చిందంటే అంతే సంగ‌తి. నాన్‌వెజ్ మార్కెట్లు, కూర‌గాయ‌ల షాపులు కిక్కిరిసిపోతున్నాయి. న‌డ‌వ‌డానికే ప్లేస్ లేనంత జ‌నం. హైద‌రాబాద్‌లోని ఓ మ‌ట‌న్ షాపులో ఆదివారం వస్తే రోజంతా క‌లిసి దాదాపు 150 కిలోల మ‌ట‌న్ అమ్మేవాళ్లు. ఇప్పుడు అదే షాపులో ఉద‌యం 10 లోపే ఆ 150 కిలోల మ‌ట‌న్ అమ్మేస్తున్నారట‌. అంటే, ఆ నాలుగు గంట‌ల్లో ఎంత ర‌ద్దీ ఉంటుందో.. జ‌నాలు ఎంత‌గా కిక్కిరిసి క‌నిపిస్తారో ఊహించుకోవ‌చ్చు. ఇలా.. ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల స‌మ‌యం ర‌ద్దీతో వైర‌స్ ముప్పు మ‌రింత పెరుగుతోంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  అందుకే.. తాజాగా ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి పోలీస్ శాఖ ఉన్న‌తాధికారుల‌తో లాక్‌డౌన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌పై రివ్యూ నిర్వ‌హించారు. ఇక‌పై మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు.  ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయట తిరిగే వాహనదారుల్ని గుర్తించి వారి వాహనాల్ని తాత్కాలికంగా జప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కాలనీలు, అంతర్గత రహదారుల్లో పోలీసు నిఘా విస్తృతం చేయాలని సూచించారు. కమిషనర్లు, ఏసీపీలు ఉదయం 9.45 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టంచేశారు. 10 గంటలకు అన్ని గస్తీ వాహనాలు సైరన్‌ మోగించాలని తెలిపారు.  క‌ఠిన చ‌ర్య‌ల‌తో పాటు పోలీస్ శాఖ త‌ర‌ఫున‌ కొన్ని అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలూ చేప‌ట్ట‌నున్నారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచే బయటకువచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చైతన్యపరిచే అంశంపై దృష్టి సారించాలన్నారు. కరోనా వ్యాప్తికి అవకాశమున్న చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు ఆయా శాఖల అధికారులతో కలిసి వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కాల‌నీల వారీగా ఎక్క‌డిక‌క్క‌డ సండే మార్కెట్లు ఏర్పాటు చేస్తే జ‌న‌మంతా ఒకే చోట చేరే ముప్పు త‌ప్పుతుంద‌న్నారు డీజీపీ.  ఇప్ప‌టి వ‌ర‌కూ 10 త‌ర్వాత లాక్‌డౌన్ స్టార్ట్ కాగానే.. ప్ర‌జ‌లంతా ఎవ‌రి ఇళ్ల‌కు వాళ్లు వెళ్లిపోయేవారు. పోలీసులు సైతం.. లాక్‌డౌన్ మొద‌లైంది.. వీధుల్లో జ‌నం లేరంటూ.. కాస్త రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయేవారు. అస‌లే ఎండాకాలం కావ‌డంతో.. ఈ వేడిలో రోడ్ల‌పై ఏం తిరుగుతామ‌నే ఉద్దేశ్యంతో లాక్‌డౌన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌పై కాస్త ఉదాసీనంగా ఉండేవారు ఖాకీలు. ఎక్క‌డో జంక్ష‌న్‌లో నీడ ప‌ట్టున కూర్చొని  క‌నిపించేవారు. గల్లీల్లో గ‌స్తీని పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. దీంతో.. ప్ర‌జ‌లు అవ‌స‌రం లేక‌పోయినా.. ఇంట్లో బోర్ కొడుతోంద‌ని వీధుల్లో తిర‌గ‌డం మొద‌లుపెడుతున్నారు. ఫ్రెండ్స్‌, చుట్టాలింటికి అంటూ పోలీసుల కంటికి క‌నిపించ‌కుండా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. దీంతో, లాక్‌డౌన్ పెట్టినా ఉప‌యోగం లేకుండా పోతోంది.  లాక్‌డౌన్‌లోనూ కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో స‌ర్కారు సీరియ‌స్‌గా ఉంది. పోలీసుల‌పై ప్ర‌భుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో.. స్వ‌యంగా డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డినే రంగంలోకి దిగారు. ఐటీ స్థాయి నుంచి ఎస్పీల వ‌ర‌కు అంద‌రితో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి.. ఇక‌పై లాక్‌డౌన్ విష‌యంలో క‌ఠినంగా ఉండాల‌ని ఆదేశించారు. దీంతో.. ఫైన్ల మీద ఫైన్లు వేసి పైసా వ‌సూల్ కార్య‌క్ర‌మం మ‌రింత ముమ్మ‌రం చేయ‌నున్నారు. అక్క‌డితో ఆగ‌క‌.. ఉద‌యం 10 త‌ర్వాత అన‌వ‌స‌రంగా బండిపై బ‌య‌ట‌కు వ‌స్తే.. ఏకంగా మీ వాహ‌నం సీజ్ చేస్తారు పోలీసులు.. అప్ప‌టికీ కేసులు కంట్రోల్ కాక‌పోతే.. తెలుసుగా ఇక చివ‌రాఖ‌రికి పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.. గుర్తుందిగా.. గ‌తేడాది లాక్‌డౌన్ లాఠీ దెబ్బ ఎలా ఉందో.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. 

ఐదు రోజులు ఇంజక్షన్ ఇస్తే కరోనా ఖతం.. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో మరో కీలక ముందడుగు పడింది. కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప పరిణామం చోటు చేసుకుంది. కేవలం ఒకే ఒక్క ఔషధంతో కరోనాను ఖతం చేసేందుకు ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన మెంజీస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ తన సంతతిని వృద్ధి చేసుకోకుండా ఈ ఔషధం నిలువరిస్తున్నట్టు తేలింది. ఎలుకల్లో వైరస్ కణాలు 99.9శాతం మేర క్షీణించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల్లో వచ్చిన ఫలితాలే మనుషుల్లోనూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా బాధితులకు ఐదు రోజులపాటు ప్రతి రోజూ దీనిని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా కరోనాకు అడ్డుకోవచ్చని ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అయితే మనుషులపై ప్రయోగ పరీక్షలు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అవన్ని కరోనా వైరస్ నిలువరించేలా శరీరంలో ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడేవే ఎక్కువగా ఉన్నాయి. కరోనా వచ్చిన రోగుల కోసం ఇచ్చే వ్యాక్సిన్లు లేవు. తాజాగా ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలతో వైరస్ మందుకు ఊరట లభించిందని చెబుతున్నారు.

జూలై వరకు సెకండ్ వేవ్.. మరి థర్డ్ వేవ్ ఎప్పుడంటే..?

కరోనా ప్రచంచానికి నేర్పిన గుణపాఠం అంత ఇంత కాదు. వచ్చే తప్పుడు ఒంటరిగా వచ్చాము .. పోయే తప్పుడు కూడా ఒంటరిగా పోతాం అనే వేదంతం చెప్పింది కరోనా. బంధాలు బంధుత్వాలు వల్లకాటి వారికే అని తెలిపింది. మరి ఈ కరోనా కు ఎండ్ అనేది లేదా అంటే ఎండ్ ఉంటుందో లేదో తెలియదు గానీ కొంత ఉపశమనం మాత్రం ఉంటుంది అంటున్నారు కొంత మంది శాస్త్రవేత్తలు.  మరింకెందుకు ఆలస్యం  చూడండి ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్పారో..  దేశం లో కరోనా కారణంగా ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు పోయాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జూలై వరకే ఈ సెకండ్ వేవ్ ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొవిడ్‌ మహమ్మారి రెండో ఉద్ధృతి  కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సమాచారం ఆడించింది. జూలై వరకు కొంత ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో కరోనా సెకండ్ వేవ్ కి తెర పడే అవకాశాలున్నట్లు ఆ శాస్త్రవేత్తల  వెల్లడించింది. ఇది ఇలా ఉండగా జూలై తరువాత  6-8 నెలల వైరస్‌ మూడో ఉద్ధృతి (థర్డ్‌ వేవ్‌) ఉండొచ్చని.. కూడా ఈ సందర్బంగా వారు తెలిపారు. అయితే రెండో వేవ్‌ లాగ మరి ఇంత  తీవ్ర ప్రభావం థర్డ్ వేవ్ తో ముప్పు ఉండక పోవచ్చు అని అంచనా వేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్‌, టెక్నాలజీ విభాగం ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్‌, అన్‌డిటెక్టెడ్‌, టెస్టెడ్‌ (పాజిటివ్‌) అండ్‌ రిమూవ్డ్‌ అప్రోచ్‌) అనే మోడల్‌ ద్వారా శాస్త్రవేత్తల బృందం పలు అంచనాలకు వచ్చింది. ఈమేరకు బృందంలో ఒకరైన ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ వివరాలను వెల్లడించారు. దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని, జూన్‌ ఆఖరు నాటికి ఇది 20,000కు తగ్గుతుందని బృందం అంచనా వేసింది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హరియాణా, దిల్లీ, గోవాల్లో ఇప్పటికే మహమ్మారి అత్యంత తీవ్రదశ (పీక్‌)కు చేరినట్లు అగర్వాల్‌ తెలిపారు. తమిళనాడు, పంజాబ్‌, పుదుచ్ఛేరి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్‌లు ఈనెల 19 నుంచి 31 మధ్య అత్యంత తీవ్రదశకు చేరుతాయని అంచనా వేశారు.  మూడో ఉద్ధృతి.. ‘ సూత్ర’ ప్రకారం దేశంలో అక్టోబరు వరకు కరోనా మూడో ఉద్ధృతి ఉండకపోవచ్చని అగర్వాల్‌ తెలిపారు. ‘‘మూడో ఉద్ధృతి స్థానికంగానే ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కారణంగా ఎక్కువమంది దీనికి ప్రభావితం కాకపోవచ్చు..’’ అని పేర్కొన్నారు. ఏమిటీ సూత్ర మోడల్‌? మహమ్మారుల తీవ్రత, విధాన నిర్ణయాల ప్రభావం వంటి వాటిని అంచనా వేసేందుకు గణితశాస్త్ర విధానాల్లో ఒకటి సూత్ర. కొవిడ్‌పై అధ్యయనానికి గతేడాది ఈ మోడల్‌ను అనుసరించడం ప్రారంభించారు. ఈ ‘జాతీయ కొవిడ్‌-19 సూపర్‌మోడల్‌ కమిటీ’ దీని ఆధారంగానే భారత్‌లో కొవిడ్‌ వ్యాప్తిపై అంచనాలను రూపొందించింది. దేశంలో రెండో ఉద్ధృతి తీరును ముందుగా అంచనా వేయలేకపోయినట్లు కమిటీ అంగీకరించింది.      

సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 47 మంది తెలుగు వైద్యుల లేఖ

తెలుగు రాష్ట్రాలకు చెందిన 47 మంది వైద్యులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తమ అభిప్రాయాలను  అందులో పొందు పరిచారు. దేశంలో కరోనా సంక్షోభం మీద తెలుగు ప్రగతిశీల వైద్యుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాసింది. దేశంలో నానాటికీ కరోనా విజృంభణ పెరిగిపోవడానికి.. సెకండ్ వేవ్ కు అధికారులు, నాయకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని చెబుతూ.. దీని నివారణకు, కట్టడికి తీసుకోవాల్సిన కొన్ని సలహాలు, సూచనలు పొందుపరిచారు. ఆ లేఖ.. ఈ క్రింత యధాతథంగా మీ కోసం... శ్రీయుత గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ , సుప్రీంకోర్టు , ఇండియా గారికి, విషయం : ఇండియాలో కరోనా వైరస్ సంక్షోభం గురించి.... సర్, మేము ప్రగతిశీల డాక్టర్లుగా మన దేశంలో కోవిద్-19 వల్ల తలెత్తిన పరిస్థితి మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.  మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిద్ -19 రెండో ప్రళయాన్ని అధిగమించడంలో విఫలం అయ్యాయి. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన మూలంగా దేశంలో కోవిద్ కేసులు విపరీతంగా పెరిగాయి. కోవిద్-19 మొదటి వేవ్ అదుపులోకి రాకముందే ప్రభుత్వాలు మత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే కూడా సిబ్బంది నియామకం, ఆక్సిజన్ సరఫరా, బెడ్ల పెంపుదల, మెడిసిన్ అందుబాటులోకి తేవడం లాంటి వాటి గురించి ప్రభుత్వాల దగ్గర కనీస కార్యక్రమం లేదు. కోవిద్-19 రెండవ వేవ్ వస్తుందని ఊహాగానాలు ఉన్నప్పటికీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వేవ్ ని ఎదుర్కోడానికి సిద్ధం కావడంలో పూర్తిగా విఫలమయ్యాయి.ఈ మహమ్మారి భయంకరమైన ప్రభావంతో రోజుకి 1500 నుండి 3000 మరణాలు సంభవించాయి. దేశంలో ఏప్రిల్ 15 నుండి ప్రతి రోజు 2 లక్షల కేసులు నమోదు అవుతూ ఏప్రిల్ 27 నాడు 3 లక్షల 60 వేల 960 తో ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదైన దేశంగా ఘనతకెక్కింది. దేశంలో కోవిద్-19 కేసుల సంఖ్య వరుసగా ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, ఇది సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు , డిసెంబర్ 19న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4న భారత్ 2కోట్ల మైలు రాయిని దాటింది.తప్పుడు లెక్కలు చూపించడానికి ఉత్తరప్రదేశ్ లో శవాలను నదుల్లోకి విసిరివేస్తున్నారు. మేము మీడియాలో చూసిన దాని ప్రకారం గంగా , యమునా నదుల్లో శవాలు తేలుతున్నాయి.చాలా తక్కువ సంఖ్యలో కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ అనే రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కూడా కొరత ఉన్నాయి. కోవిన్ అప్లికేషన్లో టీకా వేపించుకోటానికి సమయం కేటాయించబడటం లేదు. మొదటి డోసు ఇచ్చిన వారికి రెండో డోసు దొరకని పరిస్థితి ఉన్నది. వ్యాక్సిన్ల కొరకు వెళ్లి కోవిద్ బాధితులుగా తిరిగివస్తున్న వైనం కనిపిస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు, టీకా ఇచ్చే కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటం ప్రధాన కారణం. ప్రభుత్వాలు ప్రజల పట్ల తమ ప్రాథమిక బాధ్యతలను , విధులను గాలికి వదిలేసి ప్రజల బాధలను తగ్గించడానికి ఏ మాత్రం కూడా కృషి చెయ్యట్లేదు.మరణాల రేటు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కోవిద్-19 లింకును అడ్డుకోటానికి సిద్ధంగా లేవు. గణాంకాల ప్రకారం వైద్య సిబ్బంది సరిపడినంత లేరు, ఇప్పుడున్న వారితో రోగులకు చికిత్స చేయటం కష్టంతో కూడుకున్నది. తక్షణమే వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలి. కోవిద్-19 మహమ్మారి తీవ్రతరం కావటానికి ప్రధాన కారణం పాలకులు వైఫల్యమే. ఆ వైఫల్యాలను అధిగమిస్తూ సమస్యకు పరిష్కార మార్గాలు చేపట్టాలి. దేశంలోని ప్రజలకు పెద్ద సంఖ్యలో వైరస్ సంక్రమిస్తుంది తత్ఫలితంగా మరణాలు కూడా తీవ్ర స్థాయిలో సంభవిస్తున్నాయి. తగిన సమయంలో ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు ఇవ్వటానికి నిర్ణిత సమయంలో కొనుగోలు చేయడంలో/ ఆర్డర్ ఇవ్వడంలో విఫలం అయింది. ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తూ చానా కాన్షస్ గా ప్రజోపయోగం లేని ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తోంది. ఆ సంక్షోభంలో కూడా మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల ప్రతినిధులు ఎం.పి , ఎం.ఎల్.ఏ, మంత్రులు అశాస్త్రీయ భావజాలాన్ని ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. కోవిద్-19 సంక్రమించకుండా, బాధితులు ఉపశమనం పొందాలంటే ఆవు మూత్రం త్రాగాలని , ఆవు పేడ మర్దన చేయాలని బహిరంగంగా ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A[h] లో ప్రతి పౌరుడిలో సైంటిఫిక్ టెంపర్ అభివృద్ధి చేయడం కర్తవ్యంగా పేర్కొంటుంది. లౌకిక వాదం, మానవతా వాదం, విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి సైంటిఫిక్ టెంపర్ సహాయ పడుతుంది. దీని ప్రకారం అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నవారిని చట్ట ప్రకారం శిక్షించాలి.ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఫెడరల్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని, ఈ క్రింది అవసరాలు నెరవేర్చేలా చేయాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. 1.ఈ సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించాలి. 2. యుద్ధ ప్రాతిపాదికన అన్ని ఆసుపత్రులను జాతీయం చేయాలి. 3. కార్పొరేట్ మాఫియాను అరికట్టాలి. 4. ప్రతి మండలానికి 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. 5. ప్రభుత్వ ఖర్చులతోనే అంబులెన్సు సర్వీసులను కొనసాగించాలి. 6. పూర్తీ స్థాయిలో వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాలి. 7. కరోనా బాధితులతో పాటుగా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలి. 8. పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి. 9. కోవిద్-19 పరీక్షా కేంద్రాలు మరియు వ్యాక్సిన్ కేంద్రాలు వేర్వేరు చోట్ల నిర్వహించాలి. 10. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలి. 11. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. 12. కోవిద్-19 రెండవ వేవ్ ని నియంత్రిస్తూ ,దేశాన్ని మూడో వేవ్ లోకి వెళ్లకుండా శాస్త్రీయ నిర్ణయాలు చేయాలి. ప్రజల ప్రాణాలు రక్షించాలి. 13. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కనీసం 10 శాతం వైద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించాలి. కోవిడ్ పా౦డేమిక్ లాంటి విపత్తులకు ప్రత్యేక౦గా అవసరమైన నిధులను తక్షణం విడుదల చేయాలి. ధన్యవాదాలతో, ప్రోగ్రెసివ్ డాక్టర్స్ .

ప్రధాని మోడీకి గడ్డు కాలం.. దారుణంగా పడిపోయిన గ్రాఫ్ 

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోడీ.  ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీలో ఆయనే టాప్. సోషల్ మీడియాలోనే మోడీనే కింగ్. ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నది నరేంద్ర మోడీకే. కాని ఇదంతా ఇప్పుడు ఘనం. ప్రస్తుతం సీన్ మారిపోయింది. రెండోసారి సూపర్ మెజార్టీ విజయం సాధించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పాపులారిటీ వేగంగా పతనమవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఆయన క్రేజ్ దారుణంగా పడిపోయింది. ఇంకా పోతూనే ఉంది. ఇంకొన్ని రోజుల్లో మరింతగా దిగజారే పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.  దేశంపై విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ ప్రధాని మోడీ పేరుప్రతిష్ఠలను దారుణంగా దిగజార్చింది. అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్స్ చేసిన సర్వేలో మోదీ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి పడిపోయినట్టు తేలింది. మార్నింగ్స్ కన్సల్ట్స్ అనేది ప్రపంచస్థాయి నేతల పాప్యులారిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ నివేదికలు ఇస్తుంటుంది. తాజాగా అది వెల్లడించిన నివేదికలో ఈ వారం మోడీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ఆగస్టు 2019లో తాము మోడీ పాప్యులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు వచ్చిన అత్యంత కనిష్ఠ రేటింగ్ ఇదేనని ఆ సంస్థ తెలిపింది.  దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడం నరేంద్ర మోడీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ విరుచుకుపడడానికి మోడీయే కారణమంటూ ఇటీవల గ్లోబల్ మీడియా కూడా దుమ్మెత్తి పోసింది. దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ లేక కొవిడ్ రోగులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుండడం, ఆసుపత్రుల్లో బెడ్ల కోసం వేసి చూసి పార్కింగ్ ప్రదేశాల్లోనే చనిపోతుండడం, శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు క్యూలు.. వంటివన్నీ సోషల్ మీడియాలో మోడీపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. దీంతో గత మూడు దశాబ్దాల్లో ఏ భారత నాయకుడికి సాధ్యం కాని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మోడీ.. ప్రతిష్ఠ కరోనా దెబ్బకు అమాంతం మసకబారింది.   

క‌రోనా కాల‌పు దేవుడు.. సోనూసూద్‌ నెట్‌వ‌ర్క్ ఎలాంటిదో తెలుసా..?

వ‌ద‌ల బొమ్మాళీ అన్న‌ట్టు.. కొవిడ్ సేవ‌ల‌ను వ‌ద‌ల‌కుండా కొన‌సాగిస్తున్నారు సోనూ సూద్‌. రీల్ లైఫ్‌లో విల‌న్ అయినా.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం సూప‌ర్‌ హీరో. క్రికెట్ అభిమానుల‌కు స‌చిన్ దేవుడైతే.. క‌రోనా బాధితుల‌కు, వ‌ల‌స కూలీల‌కు, ఆప‌ద‌లో ఉన్న వారికి.. సోనూసూద్ సైతం దేవుడే. క‌రోనా కాలంలో.. ఆ క‌నిపించ‌ని దేవుడి అవ‌తార‌మే.. ఈ క‌నిపించే సోనూసూద్ అంటున్నారు. వారిది అభిమాన‌మో.. వెర్రిత‌న‌మో కాదు.. సోనూసూద్ చేసిన‌, చేస్తున్న సేవ‌ల‌కు ప్ర‌తిఫ‌లం ఈ ఖ్యాతి. సోనూసూద్‌. ఇప్పుడిది పేరు కాదు.. ఓ ధైర్యం. ఓ న‌మ్మ‌కం. ఏ ఆప‌ద వ‌చ్చినా.. నేనున్నానంటూ.. సాయం చేస్తారనే ధైర్యం. ఏ క‌ష్టం వ‌చ్చినా.. తను ఆదుకుంటాడనే న‌మ్మ‌కం. అందుకే ప్ర‌స్తుత కొవిడ్ కాలంతో.. క‌ష్టం వ‌స్తే ప్ర‌భుత్వాల వైపు చూడ‌ట లేదు.. పాల‌కుల‌ను వేడుకోవ‌డం లేదు.. సోనూసూద్‌నే త‌లుచుకుంటున్నారు.. ఫోన్ చేసినా.. మెసేజ్ పెట్టినా.. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టినా.. అంబులెన్స్ కంటే వేగంగా సోనూసూద్ నుంచి సాయం అందుతోంది. అది ఎంత పెద్ద క‌ష్ట‌మైనా కానీ.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్, రెమ్‌డెసివ‌ర్ ఇంజెక్ష‌న్‌.. హాస్పిట‌ల్‌లో బెడ్‌.. సాయం ఏదైనా.. క్ష‌ణాల్లో స్పందించ‌డం సోనూ స్పెషాలిటీ. ఏంతో పెద్ద నెట్‌వ‌ర్క్ ఉన్న ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థల వ‌ల్ల కానిది కూడా.. సోనూసూద్ వ‌ల్ల అవుతుండ‌టం మామూలు విష‌య‌మేమీ కాదు. అది ఆయ‌న‌కే సాధ్యం.   మొద‌ట్లో సోష‌ల్‌మీడియా పోస్టుల‌కే స్పందించిన సోనూసూద్‌.. ఇప్పుడు ప్రజాసేవ‌ను మ‌రింత విస్తృతం చేశారు. ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌నే ప్ర‌క‌టించారు. 24/7.. స‌దా మీ సేవ‌లో ఉంటానంటున్నాడు. హెల్ప్‌లైన్ కోసం సొంతంగా ఓ డ్యాష్ బోర్డునే ఏర్పాటు చేసుకున్నారు. 400 మంది సిబ్బందిని నియ‌మించి.. ఎనీ టైమ్ రెస్పాండ్ అయ్యేలా నెట్‌వ‌ర్క్ డెవ‌ల‌ప్ చేశారు. అందుకే, క్రికెట‌ర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు సైతం సాయం కావాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెడితే.. ఆ సాయం సోనూసూద్ నుంచే అంద‌టం ఆశ్చ‌ర్య‌మేమీ కాదు. సోనూసూద్‌కు వ‌స్తున్న రిక్వెస్టుల్లో.. 40శాతం ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కోసం ఉంటుండ‌గా.. 30 శాతం వ‌ర‌కూ ఐసీయూ బెడ్స్ కోసం.. ఆ త‌ర్వాత రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల కోసం భారీగా విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. చిన్న చిన్న సాయాల నుంచి.. ఆక్సిజ‌న్ ప్లాంట్స్ నెల‌కొప్ప‌డం లాంటి పెద్ద పెద్ద కార్య‌క్ర‌మాల వ‌ర‌కూ సోనూసూద్ సేవ‌లు విస్త‌రించాయి. 4 రాష్ట్రాల్లో.. 5 ఆక్సిజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటుకు సన్నాహాలు మొద‌ల‌య్యాయి. ఫ్రాన్స్‌, చైనా, తైవాన్ నుంచి ఆక్సిజ‌న్ ప్లాంట్‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి తెప్పిస్తున్నారు. క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి మేర‌కు నెల్లూరు జిల్లాలోనూ ఒక ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు సోనూసూద్‌. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లోనే వెలుగులోకి వ‌చ్చాడు ఈ రియ‌ల్ లైఫ్ హీరో. కేంద్రం స‌డెన్‌గా ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌తో వ‌ల‌స కూలీలు సొంతూళ్ల‌కు వెళ్ల‌లేక నానాక‌ష్టాలు ప‌డ్డారు. వారి క‌ష్టాన్ని చూడ‌లేక‌.. సొంతంగా బస్సులు ఏర్పాటు చేసి.. దాదాపు ఏడున్న‌ర ల‌క్ష‌ల మంది పేద కూలీల‌ను స్వ‌గ్రామాల‌కు చేర్చిన ఘ‌న‌త సోనూది. విదేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది స్టూడెంట్స్‌ను.. స్పెష‌ల్‌గా చార్టెడ్ ఫ్లైట్స్‌లో స్వ‌దేశానికి తీసుకొచ్చిన ఘ‌నుడు. ఇలా, ప్ర‌భుత్వాలు సైతం చేత‌గాక చేతులెత్తేసిన అనేక క‌ష్ట‌మైన‌ ప‌నుల‌ను సోనూసూద్ చాలా ఇష్టంగా చేసి చూపించాడు. అందుకే, ఆయ‌న క‌రోనా కాలంలో వెల‌సిన దేవుడు. ఆయ‌న కేవ‌లం తెలుగు వారికి మాత్ర‌మే కాదు.. యావ‌త్ దేశానికి హీరో ఇప్పుడు. త‌న సేవ‌ల‌ను మ‌రో మెట్టు తీసుకెళ్ల‌డానికి.. మ‌రింత మందికి సాయం చేయ‌డానికి.. సూద్ ఛారిటీ ఫౌండేష‌న్ స్థాపించారు. ఈ ఫౌండేష‌న్‌కు అన్ని వ‌ర్గాల నుంచి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. ఏపీకి చెందిన ఓ అంధురాలు సైతం త‌న నాలుగు నెల‌ల పెన్ష‌న్‌ను సూద్ ఫౌండేష‌న్‌కు డొనేట్ చేసిందంటే ప్ర‌జ‌ల్లో సోనూపై ఉన్న న‌మ్మ‌కం అలాంటిది మ‌రి. గ‌తంలో ఆయ‌న నుంచి సాయం పొందిన వాళ్లే ఇప్పుడు తిరిగి సాయం చేస్తున్నారు. ప్ర‌వాసీ రోజ్‌గార్ పేరుతో వ‌ల‌స కూలీల‌కు ఉపాధి క‌ల్పించేందుకు వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌తో పాటు.. ఇలాజ్ ఇండియా పేరుతో అవ‌స‌ర‌మైన వారికి హెల్త్‌కేర్ స‌ర్వీసులు అంద‌జేస్తున్నారు. కేవ‌లం క‌రోనా విష‌యంలోనే కాదు.. ఎవ‌రికి ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా ఆదుకుంటున్నాడు. గ‌తేడాది ల‌క్షలాది మందికి విద్య‌, వైద్యం, ఇత‌ర స‌హ‌కారం అందించారు. ఏపీలో ఓ రైతు ఎడ్లు లేక‌.. కాడికి త‌న ఇద్ద‌రు కూతుర్ల‌ను ఉంచి.. పొలాన్ని దున్నుతున్న వీడియో చూసి.. సోను చ‌లించిపోయారు. ఎవ‌రూ అడ‌క్క‌పోయినా.. వాళ్ల‌కు ట్రాక్ట‌ర్ కొనిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇలా ఆయ‌న చేసిన సేవ‌లు ఎన్నో.. ఎన్నెన్నో. ఇప్ప‌టికీ ఆయ‌న ఇంటికి నిత్యం వంద‌లాది మంది సాయం కోసం వ‌స్తున్నారు. సోష‌ల్ మీడియా, టోల్‌ఫ్రీ నెంబ‌ర్ల‌లో ప్ర‌తీరోజు వేలాదిగా రిక్వెస్టులు. అన్నిటికీ కార‌ణం.. సోనుసూద్‌తో చెప్పుకుంటే సాయం అందుతుంద‌నే ధీమా. త‌మ క‌ష్టం గురించి తెలిస్తే.. త‌ప్ప‌కుండా సాయం చేస్తార‌నే న‌మ్మ‌కం. అందుకే, ఆయ‌న.. క‌రోనా కాలంలో వెలిసిన దేవుడు. ప్ర‌భుత్వాలు సైతం సిగ్గుప‌డేలా సేవ చేస్తున్న క‌లియుగ క‌ర్ణుడు. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌ద్బాంద‌వుడు. అందుకే ఇప్పుడు ఆయ‌న సేవ‌లు కీర్తిస్తూ ప్ర‌త్యేక పాట‌లు.. వాట్స‌ప్ స్టేట‌స్‌లు.. సోష‌ల్ మీడియా పోస్టులు.. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ఇప్పుడు దేశంలో ప్ర‌ధాని మోదీ కంటే సోనూసూద్‌కే ఎక్కువ క్రేజ్‌.

కుల‌పిచ్చి ఉంటే.. ఖాకీ డ్రెస్ తీసేయ్! ఎస్పీపై లోకేష్ ఫైర్ 

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేశారంటూ ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎస్పీ అమ్మిరెడ్డి గారూ.. ప్రజ‌ల సొమ్ము జీతంగా తీసుకుని, తాడేప‌ల్లి కొంప‌కి చాకిరీ చేయ‌డానికి సిగ్గులేదా?. సోష‌ల్‌ మీడియాలో వీడియో పెట్టిన‌ వాళ్లని.. అంత‌ర్జాతీయ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన‌ట్టు ఏంటా ఓవ‌రాక్షన్‌?. ఇవే వీడియోలు టీడీపీపై పెట్టిన వారిపై మేం పెట్టిన కేసుల్లో ఇప్పటి వ‌ర‌కూ ఎన్నింట్లో అరెస్ట్‌లు చేశారు?. మంత్రి సీదిరి అప్పల‌రాజుపై కేసు పెట్టడానికి వ‌చ్చిన‌ వారిపైనే రివ‌ర్స్ కేసు బ‌నాయించారంటూ ట్వీట్టర్‌లో లోకేష్‌ ధ్వజమెత్తారు "అమ్మిరెడ్డి గారూ, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ తాడేపల్లి కొంపకు చాకిరీ చేయడానికి సిగ్గులేదా? జగన్ వద్ద పనిచేయాలని అంత ఉత్సాహం, కులపిచ్చి ఉంటే... పవిత్ర ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోండి" అని లోకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పక్షపాతం ప్రదర్శించారు. ప్రెస్‌మీట్‌లో కొన్ని చానల్స్‌కే సమాధానం చెబుతానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కొన్ని చానల్స్ అడిగే ప్రశ్నలు తనకు వినబడవని, ఆ మీడియాలు తనకు కనబడవని చెప్పారు. మంత్రి అప్పలరాజుపై ఇచ్చిన ఫిర్యాదుపై మీడియా ప్రతినిధులు ఎస్పీని అడిగారు. ‘మీరు అడిగే ప్రశ్నలు నాకు వినబడవు, నాకు కనబడవు’ అని అమ్మిరెడ్డి సమాధానమిచ్చారు. సీబీఎన్‌ ఆర్మీ కో-ఆర్డినేటర్లపై ఓ చానల్ ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. అమ్మిరెడ్డి తీరుతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.

థర్డ్ వేవ్‌.. మ‌రింత టెరిఫిక్‌.. 2 రోజుల్లోనే ఫ‌స‌క్‌..!

ఫ‌స్ట్ వేవ్ హ‌డ‌లెత్తించింది. ఆ త‌ర్వాత కాస్త రెస్ట్ ఇచ్చింది. వైర‌స్ మ‌రింత బ‌లం పుంజుకుంది. రూపాంత‌ర‌మూ చెందింది. సెకండ్ వేవ్ రూపంలో భార‌త్‌ను కుమ్మేస్తోంది. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకండ్ వేవ్ భ‌యాన‌కంగా ఉంది. కొంద‌రికి పైపైనే దెబ్బ కొట్టి వెళ్లిపోతోంది. చాలామందిలో అవ‌య‌వాల‌ను దెబ్బ తీస్తోంది. అందుకే, వైర‌స్ దాటికి ఆసుప‌త్రుల్లో బెడ్లు క‌రువు. ట‌న్నుల‌కు ట‌న్నులు ఆక్సిజ‌న్ తెప్పిస్తున్నా.. స‌రిపోవ‌డం లేదు. జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. రోజుల వ్య‌వ‌ధిలోనే ప్రాణాలు విడుస్తున్నారు. దేశంలో ఎటు చూసినా కరోనా పేషెంట్ల శవాల దిబ్బలే. అంత్యక్రియల కోసం స్మశానాల ద‌గ్గ‌ర పెద్ద పెద్ద క్యూలు.. దేశంలో మునుపెన్న‌డూ చూడ‌ని దారుణం.  సెకండ్ వేవ్‌లో ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ముందుముందు మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉంద‌నే హెచ్చ‌రిక‌లు మ‌రింత భ‌య పెడుతున్నాయి. థర్డ్ వేవ్‌లో వైర‌స్ మ‌రింత మ్యూటేష‌న్ చెందుతుంద‌ట‌. ఈసారి చిన్న‌పిల్ల‌ల‌నూ వ‌దిలిపెట్టద‌ట‌. అదే జ‌రిగితే.. ఇక దారుణ ప‌రిస్థితే. పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే.. ఇక పెద్ద‌లు బేజారే. మూడో వేవ్‌లో క‌రోనా బారిన ప‌డితే ఇక అంతే సంగ‌తుల‌ను వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. కొవిడ్ సోకిన రెండు రోజుల్లోనే ప‌రిస్థితి విష‌మించే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. సెకండ్ వేవ్ కంటే.. థర్డ్ వేవ్‌లో మ‌ర‌ణాల సంఖ్య భారీగా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న విధానం చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పేలా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఈ మూడో వేవ్ ఎప్పుడు వస్తుంది? ఎంతకాలం కొనసాగుతుంది? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌లో చాలా కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది డబుల్ మ్యూటెంట్. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు బి.1.617. ఇది కేవలం భారత్‌లో మాత్రమే కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా, అమెరికా దేశాల్లో కూడా ఈ వైరస్ వేరియంట్లు వెలుగుచూశాయి.  మన దేశంలో పలు రాష్ట్రాల్లో వేరు వేరు వేరియంట్లు దాడి చేస్తున్నాయి. వీటిలో బాగా చర్చకు వచ్చిన వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో కనిపించి కరోనా వేరియంట్. ఇది మామూలు వైరస్ కన్నా 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, ప్రస్తుతానికి ఇది చాలా తక్కువ ప్రాంతాల్లోనే పరిమితమైంది. ఈ వేరియంట్లు కరోనా కొత్త స్ట్రెయిన్లను సృష్టిస్తున్నాయని వైద్యులు చేసిన పరిశోధనలో తేలింది. ఇలా జరగడం వల్ల రకరకాల విధానాల్లో మానవులను ఈ వైరస్ ఎటాక్ చేస్తోందని వైద్యులు చెప్పారు. ఇన్ని వేరియంట్లు ఉండటం వల్ల కరోనా థర్డ్ వేవ్ తప్పదని అంటున్నారు. మొదటి వేవ్‌లో మనుషుల ఊపిరితిత్తులను నాశనం చేయడానికి క‌రోనా వైరస్ 10 రోజుల సమయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో ఈ కాలం 5-7రోజులకు తగ్గిపోయింది. మూడో వేవ్ కనుక వస్తే 2 నుంచి 3 రోజుల్లోనే ఊపిరితిత్తులను వైరస్ నాశనం చేసి, బాధితులను ఐసీయూలో పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న వేరియంట్ ఇదే పని చేస్తోందని అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారు 2-3 రోజుల్లోనే ఐసీయూలో చేరాల్సి వ‌స్తోంది. ఆ తర్వాత పరిస్థితులు విషమించి చనిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం, కరోనా వేవ్స్‌పై అధ్యయనం చేస్తున్న కొంత మంది శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయం వెల్లడించారు. కరోనా మొదటి వేవ్‌లో వృద్ధులపై వైరస్ దాడి చేసింది. సెకండ్ వేవ్‌లో యువకులపై ఎక్కువ ప్రభావం పడింది. మూడో వేవ్ గనుక వస్తే ఇది పిల్లలను టార్గెట్ చేస్తుందనేది శాస్త్రవేత్తల వాదన. అందుకే, మూడో వేవ్‌పై ఇంత‌టి ఆందోళ‌న.  భారతదేశ జనాభాలో 18 ఏళ్లలోపు వారే 30 శాతంపైగా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి వీరికి కూడా వ్యాక్సిన్ తీసుకొస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చెప్తోంది.  కోవ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ కూడా ఈ పనిలోనే ఉంది. వారి వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఫైజర్ కంపెనీ మాత్రమే 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ తయారు చేసింది. 12 ఏళ్లపైబడిన వారికి ఇవ్వొచ్చంటూ ఒక వ్యాక్సిన్ విడుదల చేసింది. దీనికి కెనడాలో అనుమతులు లభించాయి కూడా. అమెరికాలో కూడా దీనికి త్వరలోనే అనుమతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా మనదేశంలో కూడా చిన్నారుల కోసం వ్యాక్సిన్ తయారు చేయకపోతే కరోనా మూడో వేవ్‌ను తట్టుకోవడం కష్టమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

చేతులు కాలినాక.. ఆకులు పట్టుకున్న ఇండియా.. 

ఇక కరోనా పేషేంట్స్ కు రెమ్‌డెసివిర్  లేనట్లేనా.. ఇప్పడికే దేశం లో చాలా మంది మేధావులు రెమ్‌డెసివిర్ గురించి మాట్లాడుతున్నారు. అది కరోనా పై  అంతగా ప్రభావం చూపదని. కానీ మన దేశంలో ఎప్పటికి కరోనా వ్యాక్సిన్ల కంటే... ఈ రెమ్‌డెసివిర్ సమస్య ఎక్కువైపోయింది. కరోనా వస్తే చాలు...చాలా మంది డాక్టర్లు రెమ్‌డెసివిర్ రాసేస్తున్నారు. పేషెంట్ల బంధువులు కూడా అది ఉంటే ప్రాణాలు దక్కుతాయి అని అనుకుంటున్నారు. కానీ... ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఏం చెప్పింది...రెమ్‌డెసివిర్ ప్రాణాలను కాపాడగలదు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు అని తేల్చేసింది. కానీ నిజాలు నమ్మే స్థితిలో భారతీయులు రెడీ గా  లేరు. దాంతో... రెమ్‌డెసివిర్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగింది. చివరకు బ్లాక్‌మార్కెట్‌లో రెమ్‌డెసివిర్ కు అద్దుఅదుపు లేకుండా పోయింది. దాదాపు లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై తాజాగా ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ DS రానా... తన గళం విప్పారు.  "కరోనా ట్రీట్‌మెంట్ నుంచి రెమ్‌డెసివిర్‌ను కూడా తొలగించే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఎందుకంటే...రెమ్‌డెసివిర్ కు కరోనా ను ఖతం చేస్తాడని ఎలాంటి ఆధారాలు లేవని ఆయన ANI వార్తా సంస్థకు తెలిపారు. "ఏ మందులైనా, ఫలానా వ్యాధి నయం అవ్వడానికి పని చెయ్యవు అని తేలినప్పుడు వాటిని ఆ వ్యాధికి వాడకుండా, రద్దు చేస్తారు" అని తెలిపారు. కరోనాకి సంబంధించి ఏ ట్రీట్‌మెంట్ పనిచేస్తుంది. అనే అంశంపై రోజూ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. పనిచేయని వాటిని తొలగిస్తున్నారు. తాజాగా ప్లాస్మా థెరపీ కరోనా పేషెంట్లను కాపాడగలదు అనేందుకు ఆధారాలు లేకపోవడంతో. దాన్ని తొలగించారు. రెమ్‌డెసివిర్ కూడా అంతే. పనిచేయట్లేదు కాబట్టి త్వరలోనే తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు మందులు మాత్రమే పనిచేస్తున్నాయి" అని డాక్టర్ రానా చెప్పినట్లుగా ANI కోట్ చేసింది. మీకు తెలుసు తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ICMR) కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్ కోసం ప్లాస్మా థెరపీ వాడొద్దని తేల్చి  చెప్పింది. ఆ థెరపీ కోసం కరోనా నుంచి కోలుకున్న వారి దగ్గర ప్లాస్మా తీసుకుంటే. వారు మరింత బలహీనం అవుతున్నారు. దానికి తోడు ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. అందువల్ల దాన్ని ట్రీట్‌మెంట్ లిస్టులోంచి తొలగిస్తూ. ICMR తాజాగా  గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఇక రెమ్‌డెసివిర్‌ను కూడా లిస్టు నుంచి తొలగిస్తే, ఇక దేశంలోని ఏ డాక్టరూ దాన్ని ప్రిస్క్రిప్షన్‌లో రాయరు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత ఎవరూ ఎక్కడా కరోనా పేషెంట్లకు దాన్ని వాడరు. దీనిపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఏం జరుగుతుందో చూడాలి.  ఇండియాలో ఏడు ఫార్మా కంపెనీలు రెమ్‌డెసివిర్‌ను వేర్వేరు పేర్లతో తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక సహా పది రాష్ట్రాల్లో రెమ్‌డెసివిర్ వాడకం బాగా పెరిగిపోయింది. ఉత్పత్తి అయినవి అయినట్లు అమ్ముడైపోతున్నాయి. అందువల్లే బ్లాక్ మార్కెట్ ఎక్కువైంది. మరి దీనికి కేంద్రం ఎలా చెక్ పెడుతుందో త్వరలో తెలుస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న భారత దేశం. అయితే ముందు నుండే డాక్టర్స్ కి ఈ రెమ్‌డెసివిర్ గురించి తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు. కొంత మంది డాక్టర్స్ మరి కొంత మంది స్వార్ధ ప్రయెజనాల కోసం ఎందుకు ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రజలకు. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ  రెమ్‌డెసివిర్ గురించి  ఎప్పుడో చెపితే మన వాళ్ళు ఎప్పుడు ఆలోచించడమే ఏంటి..? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు..వారి ప్రాణాలు తీసింది.. ప్రభుత్వమేనా.. లేక కార్పొరేట్ హాస్పిటల్ అనాలా.. ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వాలకు ఎంత చిత్త శుద్ధి ఉందొ ఈ పరిస్థిని చుస్తే అర్థం అయితుంది..ఇప్పటికైనా ప్రజలు గుడ్డిగా ఎవరు చెపితే అది నమ్మకండి.. ఆలోచించండి.. 

గాంధీలో కేసీఆర్‌.. ప్యాలెస్‌లో జ‌గ‌న్‌! అభినవ నీరో చ‌క్ర‌వ‌ర్తా? 

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వయసు 74 ఏండ్లు.. అయినా ఆయన కొవిడ్ కట్టడి చర్యల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భువనేశ్వర్ లోని కొవిడ్ హాస్పిటల్ ను విజిట్ చేసి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు..  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వయసు 67 ఏండ్లు. ఆయన ఇటీవలే కరోనాను జయించారు. మాములుగానే కేసీఆర్ ఎక్కువగా బయటకి రారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఎక్కువగా ఉంటారని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అలాంటి కేసీఆర్ కూడా కొవిడ్ నియంత్రణ చర్యల్లో దూకుడుగా వ్యవరిస్తున్నారు. కొవిడ్ హాస్పిటల్ గా ఉన్న గాంధీకి హాస్పిటల్ ను సందర్శించి అందరని ఆశ్చర్యపరిచారు. పీపీఈ కిట్టు కూడా వేసుకోకుండానే ఏకంగా కోవిండ్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారు కేసీఆర్. కోవిడ్ రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల‌తో చ‌ర్చించారు. వారి సేవ‌లు కొనియాడారు. వ‌స‌తులు, చికిత్స‌ల‌పై ఆరా తీశారు. ఆక్సిజ‌న్ కొర‌త‌, మందులకు ఇబ్బంది లేకుండా చూడాల‌ని ఆదేశించారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రే త‌ర‌లిరావ‌డంతో కొవిడ్ బాధితుల్లో ధైర్యం.. వైద్య సిబ్బందిలో మ‌రింత బాధ్య‌త‌, ఉత్సాహం పెరిగింది. 65 ఏండ్ల వయసుకు పైబడి ఉన్న ముఖ్యమంత్రులు కూడా కొవిడ్ రోగులను నేరుగా పరామర్శిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీన్ మరోలా ఉంది. ఏపీకి 48 ఏండ్ల యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫలితం లేకుండా పోయింది. కరోనా పై జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ప్యాలెస్ ను విడిచి రావడం లేదు..  అక్కడే కూర్చొని సమీక్షల పేరుతో చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లి.. కొవిడ్ రోగులతో స్వయంగా మాట్లాడటంతో .. ఏపీ సీఎం జగన్ వ్యవహారశైలిపై జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో కంటే ఏపీలో డ‌బుల్‌, త్రిబుల్ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు వ‌స్తున్నాయి. మ‌ర‌ణాలూ పెద్ద సంఖ్య‌లో ఉంటున్నాయి. హాస్పిట‌ల్ బెడ్స్, ఆక్సిజ‌న్‌, మందులు.. స‌రిగ్గా అందుబాటులో లేవ‌నేది పేషెంట్స్ మాట‌. విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం, తిరుప‌తి ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ నిలిచి క‌రోనా బాధితులు చ‌నిపోవ‌డం.. ఏపీకి త‌ల‌వొంపులు తీసుకొచ్చింది. కృష్ణా, ప్ర‌కాశం జిల్లాల్లో ఆసుప‌త్రుల ముందు క‌రోనా రోగుల ప‌డిగాపులు, అంత్య‌క్రియ‌ల‌కూ దిక్కులేని ప‌రిస్థితులు  భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంత దారుణ ప‌రిస్థితులు ఉన్నా.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి తాడెప‌ల్లి ప్యాలెస్ వీడి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని అంటున్నారు విపక్ష నేతలు. క‌రోనా ఏపీని అల్ల‌క‌ల్లోలంగా మారిస్తే.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు చేత‌గాక చేతులెత్తేసింద‌ని విమ‌ర్శిస్తున్నారు.క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించేసి.. ఇక ప్ర‌భుత్వం చేసేది ఏమీ లేదు.. మీ చావు మీరు చావండన్న‌ట్టు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌ర‌ణిస్తే.. అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం ముఖ్య‌మా? అస‌లు చనిపోయే ప‌రిస్థితే రాకుండా మెరుగైన వైద్యం అందించ‌డం ప్ర‌ధాన‌మా? జ‌గ‌న్‌రెడ్డికే తెలియాలి అంటున్నారు.   ఏపీలో క‌రోనా చికిత్స‌కు అస‌లేమాత్రం అనుకూల ప‌రిస్థితులు లేవు కాబ‌ట్టే.. అంబులెన్సుల్లో పెద్ద సంఖ్య‌లో కొవిడ్ బాధితులు హైద‌రాబాద్‌కు క్యూ క‌డుతున్నారు. అలాంటి వారిని స‌రిహ‌ద్దుల్లోనే తెలంగాణ పోలీసులు అడ్డుకోవ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఆ స‌మ‌యంలోనూ జ‌గ‌న్‌రెడ్డి నోరు మెద‌ప‌లేదు. ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఏపీలో బెడ్లు, వెంటిలేట‌ర్లు, ఆక్సిజ‌న్‌, మెడిసిన్ లేక‌నే.. తాము హైద‌రాబాద్ వెళుతున్నామ‌ని బాధితులే స్వ‌యంగా మీడియా ముఖంగా ప్ర‌క‌టించ‌డం రాష్ట్రంలో నెల‌కొన్న దారుణ ప‌రిస్థితుల‌కు నిద‌ర్శ‌నం.కొవిడ్ వైఫ‌ల్యం నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే క‌క్ష సాధింపు కేసులంటోంది విప‌క్షం. ఒక ముఖ్య‌మంత్రిగా చేయాల్సిన ప‌ని చేశారు కేసీఆర్. మ‌రి, జ‌గ‌న్‌రెడ్డి ఏం చేస్తున్న‌ట్టు?  తాడేప‌ల్లి ప్యాలెస్ వీడి ప్ర‌జాక్షేత్రంలోకి ఎందుకు రావ‌డం లేదు? తిరుప‌తి రుయా హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ నిలిచి అంత‌మంది చ‌నిపోతే జ‌గ‌న్ ఎందుకు రుయా ఆసుప‌త్రిని ప‌రిశీలించ‌లేదు?  తెలంగాణ స‌ర్కారు ఏపీ అంబులెన్సుల‌ను ఆపుతుంటే ఆలా మౌనంగా ఉండ‌టమేంటి? ఏపీ వ్యాప్తంగా హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్ల కొర‌త వేధిస్తుంటే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు?  తెలంగాణ‌లోకంటే ఏపీలో దారుణ ప‌రిస్థితులు ఉన్నా.. కేసీఆర్‌లా సీఎం జ‌గ‌న్ క‌నీసం ఒక్క ప్ర‌భుత్వ ఆసుప‌త్రినైనా ప‌రిశీలించారా? క్షేత్ర‌స్థాయిలో అస‌లేం జ‌రుగుతోందో స్వ‌యంగా తెలుసుకునే ప్ర‌యత్నం చేశారా? ఇప్ప‌టికే మొద‌టి డోసు టీకా వేసుకున్నారుగా?  క‌రోనా సోకే ప్ర‌మాదం త‌క్కువేగా? అయినా, ఎందుకంత భ‌యం? అది భ‌య‌మా?  లేక‌, బాధ్య‌తా రాహిత్య‌మా? అని ప్ర‌శ్నిస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు. రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌బ‌డుతుంటే.. ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చ‌క్ర‌వ‌ర్తిలా జ‌గ‌న్‌రెడ్డి వ్య‌వ‌హ‌రం ఉందంటూ మండిప‌డుతున్నాయి. క‌నీసం మీ మిత్రుడు కేసీఆర్‌ను చూసైనా నేర్చుకోవాల‌ని.. ఇప్ప‌టికైనా ప్యాలెస్ వీడి కొవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల కోసం ప్ర‌జాక్షేత్రంలో అడుగుపెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. మ‌రి, ముఖ్య‌మంత్రిగారు మెట్టు దిగి.. దిగొస్తారా?  ప్ర‌జ‌ల వేద‌న వింటారా? క‌రోనా క‌ట్టడికి మెరుగైన చ‌ర్య‌లు చేప‌డ‌తారా? ఏమో.. డౌటే.. అంటున్నారు.