చేతులు కాలినాక.. ఆకులు పట్టుకున్న ఇండియా..
posted on May 19, 2021 @ 3:51PM
ఇక కరోనా పేషేంట్స్ కు రెమ్‌డెసివిర్ లేనట్లేనా.. ఇప్పడికే దేశం లో చాలా మంది మేధావులు రెమ్‌డెసివిర్ గురించి మాట్లాడుతున్నారు. అది కరోనా పై అంతగా ప్రభావం చూపదని. కానీ మన దేశంలో ఎప్పటికి కరోనా వ్యాక్సిన్ల కంటే... ఈ రెమ్‌డెసివిర్ సమస్య ఎక్కువైపోయింది. కరోనా వస్తే చాలు...చాలా మంది డాక్టర్లు రెమ్‌డెసివిర్ రాసేస్తున్నారు. పేషెంట్ల బంధువులు కూడా అది ఉంటే ప్రాణాలు దక్కుతాయి అని అనుకుంటున్నారు. కానీ... ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఏం చెప్పింది...రెమ్‌డెసివిర్ ప్రాణాలను కాపాడగలదు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు అని తేల్చేసింది. కానీ నిజాలు నమ్మే స్థితిలో భారతీయులు రెడీ గా లేరు. దాంతో... రెమ్‌డెసివిర్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగింది. చివరకు బ్లాక్‌మార్కెట్‌లో రెమ్‌డెసివిర్ కు అద్దుఅదుపు లేకుండా పోయింది. దాదాపు లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై తాజాగా ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ DS రానా... తన గళం విప్పారు. "కరోనా ట్రీట్‌మెంట్ నుంచి రెమ్‌డెసివిర్‌ను కూడా తొలగించే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఎందుకంటే...రెమ్‌డెసివిర్ కు కరోనా ను ఖతం చేస్తాడని ఎలాంటి ఆధారాలు లేవని ఆయన ANI వార్తా సంస్థకు తెలిపారు. "ఏ మందులైనా, ఫలానా వ్యాధి నయం అవ్వడానికి పని చెయ్యవు అని తేలినప్పుడు వాటిని ఆ వ్యాధికి వాడకుండా, రద్దు చేస్తారు" అని తెలిపారు.
కరోనాకి సంబంధించి ఏ ట్రీట్‌మెంట్ పనిచేస్తుంది. అనే అంశంపై రోజూ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. పనిచేయని వాటిని తొలగిస్తున్నారు. తాజాగా ప్లాస్మా థెరపీ కరోనా పేషెంట్లను కాపాడగలదు అనేందుకు ఆధారాలు లేకపోవడంతో. దాన్ని తొలగించారు. రెమ్‌డెసివిర్ కూడా అంతే. పనిచేయట్లేదు కాబట్టి త్వరలోనే తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు మందులు మాత్రమే పనిచేస్తున్నాయి" అని డాక్టర్ రానా చెప్పినట్లుగా ANI కోట్ చేసింది.
మీకు తెలుసు తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ICMR) కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్ కోసం ప్లాస్మా థెరపీ వాడొద్దని తేల్చి చెప్పింది. ఆ థెరపీ కోసం కరోనా నుంచి కోలుకున్న వారి దగ్గర ప్లాస్మా తీసుకుంటే. వారు మరింత బలహీనం అవుతున్నారు. దానికి తోడు ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. అందువల్ల దాన్ని ట్రీట్‌మెంట్ లిస్టులోంచి తొలగిస్తూ. ICMR తాజాగా గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఇక రెమ్‌డెసివిర్‌ను కూడా లిస్టు నుంచి తొలగిస్తే, ఇక దేశంలోని ఏ డాక్టరూ దాన్ని ప్రిస్క్రిప్షన్‌లో రాయరు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత ఎవరూ ఎక్కడా కరోనా పేషెంట్లకు దాన్ని వాడరు. దీనిపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఏం జరుగుతుందో చూడాలి.
ఇండియాలో ఏడు ఫార్మా కంపెనీలు రెమ్‌డెసివిర్‌ను వేర్వేరు పేర్లతో తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక సహా పది రాష్ట్రాల్లో రెమ్‌డెసివిర్ వాడకం బాగా పెరిగిపోయింది. ఉత్పత్తి అయినవి అయినట్లు అమ్ముడైపోతున్నాయి. అందువల్లే బ్లాక్ మార్కెట్ ఎక్కువైంది. మరి దీనికి కేంద్రం ఎలా చెక్ పెడుతుందో త్వరలో తెలుస్తుంది.
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న భారత దేశం. అయితే ముందు నుండే డాక్టర్స్ కి ఈ రెమ్‌డెసివిర్ గురించి తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు. కొంత మంది డాక్టర్స్ మరి కొంత మంది స్వార్ధ ప్రయెజనాల కోసం ఎందుకు ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రజలకు. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెమ్‌డెసివిర్ గురించి ఎప్పుడో చెపితే మన వాళ్ళు ఎప్పుడు ఆలోచించడమే ఏంటి..? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు..వారి ప్రాణాలు తీసింది.. ప్రభుత్వమేనా.. లేక కార్పొరేట్ హాస్పిటల్ అనాలా.. ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వాలకు ఎంత చిత్త శుద్ధి ఉందొ ఈ పరిస్థిని చుస్తే అర్థం అయితుంది..ఇప్పటికైనా ప్రజలు గుడ్డిగా ఎవరు చెపితే అది నమ్మకండి.. ఆలోచించండి..