ఎంత వారుగానీ.. కాంత దాసులే.. బిల్.. జిల్ జిల్ జిగేట్స్‌

ప్ర‌పంచ కుబేరుడు. చూట్టానికి సింపుల్‌గా.. స్మార్ట్‌గా ఉంటారు. అమాయ‌కంగా, న‌వ్వుతూ క‌నిపిస్తారు. హుందాగా, ద‌ర్పంగా వెలిగిపోతారు. మైక్రోసాఫ్ట్ అధినేత‌గా బిల్ గేట్స్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ. మిలిండాతో విడాకుల వ్య‌వ‌హారంతో గేట్స్‌.. పాపులారిటీ ఒక్క‌సారిగా మ‌స‌క‌బారింది. వాళ్లు అందుకే విడిపోతున్నారంటూ.. ప‌లు క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. తాజాగా, వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించిన ఓ స్టోరీతో బిల్ గేట్స్ య‌వ్వారం మ‌రింత ర‌స‌కందాయంలో ప‌డింది. ఆయ‌నా.. ఆ టైపేనంటూ.. ఎంత వారుగానీ కాంత దాసులే అంటూ వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ ఓ పాత ఎఫైర్‌ను కొత్త బ్రేకింగ్ న్యూస్‌గా మార్చివేసింది.  20 ఏళ్ల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్‌ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాం శమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్ క‌థనం  ప్రచురించింది.  2019 ద్వితీయార్ధంలో మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు ఓ లేఖ అందింది. బిల్‌గేట్స్‌ కొన్నేళ్ల పాటు తనతో శారీరక సంబంధం నెరిపారంటూ మైక్రోసాఫ్ట్‌ మహిళా ఇంజనీరు ఒకరు ఆ లేఖలో ఆరోపణలు చేశారు. దాంతో కంపెనీ బోర్డు ఓ న్యాయవాద సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించింది. రాసలీలల ఆరోపణల నేపథ్యంలో బిల్‌గేట్స్‌ బోర్డులో కొనసాగడం తగదని కొందరు డైరెక్టర్లు భావించారు. అయితే దర్యాప్తు పూర్తి చేసి, తుది నిర్ణయం తీసుకునే లోపే గేట్స్‌ బోర్డు నుంచి తప్పుకున్నారనేది ఆ స్టోరీ సారాంశం.   వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నంపై మైక్రోసాఫ్ట్ సైతం స్పందించింది. ఇరవై ఏళ్ల నాటి ఆ వ్యవహారం సామరస్యపూర్వ‌కంగానే పరిష్కారమైందని తెలిపింది. బోర్డు నుంచి వైదొలగడానికి దానితో ఎలాంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి చెప్పారు. దర్యాప్తులో ఏం తేలిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దాతృత్వ కార్యక్రమాల కోసం మరింత సమయం వెచ్చించేందుకు మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు 2020 మార్చిలో బిల్‌గేట్స్‌ ప్రకటించారు.  తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్‌, మిలిండా ఈ మ‌ధ్య‌నే ప్ర‌క‌టించారు. ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్ప‌టి నుంచి బిల్ గేట్స్ జీవితంపై పలుర‌కాల క‌థ‌నాలు.. ప‌లు కోణాలు.. వెలుగు చూస్తున్నాయి. 

షర్మిల పార్టీకి తాళం వెనుక పీకే? షాక్ మాములుగా లేదుగా.. 

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ దూసుకొచ్చింది వైఎస్ షర్మిల. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడమే కాదు... వరుస సమావేశాలతో హడావుడి చేసింది జగనన్న బాణం. జిల్లాల వారీగా నేతలతో చర్చలతో పాటు ఖమ్మంలో సంకల్ప సభ కూడా నిర్వహించింది. వైఎస్సార్ జయంతి అయిన జూలై8న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపింది షర్మిల. అంతేకాదు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగి హంగామా చేసింది. దీక్షను పోలీసులు అడ్డుకోవడం, అయినా ఆమె పాదయాత్ర చేయడం.. పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకోవడం.. అంతా రచ్చరచ్చైంది. ట్విట్టర్ వేదికగానూ కేసీఆర్ పని తీరుపై ఘాటుగానే విమర్శలు చేస్తోంది షర్మిల. కొంత మంది నేతలు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో .. కొత్త పార్టీపై జనాల్లోనూ జోరుగా చర్చ జరిగింది.  షర్మిల పార్టీ దూకుడు పెరుగుతుండగానే సడెన్ గా సీన్ మారిపోయింది. లోటస్ పాండ్ లోని షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడింది. కార్యకర్తలెవరు రావొద్దని షర్మిల పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. పార్టీ కార్యాలయానికి తాళం పడటంతో అంతా షాక్. కొవిడ్ కారణంతో మూసివేస్తున్నామని షర్మిల అనుచరులు చెబుతున్నా.. ఏదో జరిగిందనే చర్చే జరుగుతోంది. ఎందుకంటే కొవిడ్ పరిస్థితుల్లోనూ అన్ని పార్టీల కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూనే వివిధ పార్టీల నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల.. కార్యాలయానికి సడెన్ గా లాక్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయానికి పడిన తాళం తాత్కాలికమా... సంపూర్ణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల పార్టీకి తాళం పడటంపై మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  పీకే వల్లే షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడిందనే ప్రచారం జరుగుతోంది. పీకే... అంటే ప్రశాంత్ కిశోర్. దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా ఆయన ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేను ఆయన పని చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నిఎత్తులు వేసినా.. పీకే ముందు పారలేదు. బెంగాల్ లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. పీకే టీమ్ వర్క్ వల్లే జగన్ పార్టీకి ఘన విజయం దక్కిందని అంటారు. అంతటి పీకే... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వ్యూహకర్తగా ఏ పార్టీకి ఎక్కడా పనిచేయబోనని ప్రకటించారు. ఇదే షర్మిల పార్టీ కార్యాలయం తాళానికి కారణమంటున్నారు.  తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిలకు.. ఎన్నికల వ్యూహకర్తగా పీకే ఉంటున్నారనే ప్రచారం జరిగింది. షర్మిల పార్టీ తెరపైకి రాగానే.. పీకే తెరపైకి వచ్చారు. కొత్త పార్టీ కార్యాచరణపై ప్రశాంత్ కిషోర్ తో షర్మిల చర్చించారని, జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే ప్రచారం జరిగింది. తెలంగాణలో షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ఉండేలా పీకేను జగన్ ఒప్పించారని కొందరు వాదించారు. త్వరలోనే పీకే టీమ్ షర్మిల కోసం పని చేస్తుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పీకే జెండా ఎత్తేయడంతో షర్మిల షాకైందని అంటున్నారు. పీకే సహకారం లేకుండా ముందుకు వెళ్లలేమని భావిస్తున్న షర్మిల... కొత్త పార్టీపై కొంత సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఆమెకు ఇబ్బందిగా మారాయంటున్నారు.  టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న రాజేందర్.. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలు, తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈటల. కొంత ఆలస్యమైనా రాజేందర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు ఈటలకు సపోర్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు కూడా రాజేందర్ తో చర్చలు జరిపారు. కొండా దంపతులను తన పార్టీకి రమ్మని గతంలో షర్మిల ఆహ్వానించినా వారు నిరాకరించారు. ఇప్పుడు వాళ్లు రాజేందర్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీ పెడితే.. తమకు తెలంగాణ పాలిటిక్స్ లో ఏ మాత్రం స్పెస్ ఉండదనే ఆందోళనలో షర్మిల ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ వ్యతిరేకులు కొందరు తమతో కలిసి వస్తారని గతంలో షర్మిల భావించారు. కాని రాజేందర్ ఎంట్రీతో అటువంటి వాళ్లంతా ఆయనతోనే వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడటానికి కారణమని చెప్పుకుంటున్నారు .

షర్మిల పార్టీకి తాళం వెనుక పీకే? షాక్ మాములుగా లేదుగా..

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ దూసుకొచ్చింది వైఎస్ షర్మిల. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడమే కాదు... వరుస సమావేశాలతో హడావుడి చేసింది జగనన్న బాణం. జిల్లాల వారీగా నేతలతో చర్చలతో పాటు ఖమ్మంలో సంకల్ప సభ కూడా నిర్వహించింది. వైఎస్సార్ జయంతి అయిన జూలై8న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపింది షర్మిల. అంతేకాదు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగి హంగామా చేసింది. దీక్షను పోలీసులు అడ్డుకోవడం, అయినా ఆమె పాదయాత్ర చేయడం.. పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకోవడం.. అంతా రచ్చరచ్చైంది. ట్విట్టర్ వేదికగానూ కేసీఆర్ పని తీరుపై ఘాటుగానే విమర్శలు చేస్తోంది షర్మిల. కొంత మంది నేతలు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో .. కొత్త పార్టీపై జనాల్లోనూ జోరుగా చర్చ జరిగింది.  షర్మిల పార్టీ దూకుడు పెరుగుతుండగానే సడెన్ గా సీన్ మారిపోయింది. లోటస్ పాండ్ లోని షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడింది. కార్యకర్తలెవరు రావొద్దని షర్మిల పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. పార్టీ కార్యాలయానికి తాళం పడటంతో అంతా షాక్. కొవిడ్ కారణంతో మూసివేస్తున్నామని షర్మిల అనుచరులు చెబుతున్నా.. ఏదో జరిగిందనే చర్చే జరుగుతోంది. ఎందుకంటే కొవిడ్ పరిస్థితుల్లోనూ అన్ని పార్టీల కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూనే వివిధ పార్టీల నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల.. కార్యాలయానికి సడెన్ గా లాక్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయానికి పడిన తాళం తాత్కాలికమా... సంపూర్ణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల పార్టీకి తాళం పడటంపై మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  పీకే వల్లే షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడిందనే ప్రచారం జరుగుతోంది. పీకే... అంటే ప్రశాంత్ కిశోర్. దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా ఆయన ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేను ఆయన పని చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నిఎత్తులు వేసినా.. పీకే ముందు పారలేదు. బెంగాల్ లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. పీకే టీమ్ వర్క్ వల్లే జగన్ పార్టీకి ఘన విజయం దక్కిందని అంటారు. అంతటి పీకే... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వ్యూహకర్తగా ఏ పార్టీకి ఎక్కడా పనిచేయబోనని ప్రకటించారు. ఇదే షర్మిల పార్టీ కార్యాలయం తాళానికి కారణమంటున్నారు.  తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిలకు.. ఎన్నికల వ్యూహకర్తగా పీకే ఉంటున్నారనే ప్రచారం జరిగింది. షర్మిల పార్టీ తెరపైకి రాగానే.. పీకే తెరపైకి వచ్చారు. కొత్త పార్టీ కార్యాచరణపై ప్రశాంత్ కిషోర్ తో షర్మిల చర్చించారని, జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే ప్రచారం జరిగింది. తెలంగాణలో షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ఉండేలా పీకేను జగన్ ఒప్పించారని కొందరు వాదించారు. త్వరలోనే పీకే టీమ్ షర్మిల కోసం పని చేస్తుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పీకే జెండా ఎత్తేయడంతో షర్మిల షాకైందని అంటున్నారు. పీకే సహకారం లేకుండా ముందుకు వెళ్లలేమని భావిస్తున్న షర్మిల... కొత్త పార్టీపై కొంత సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఆమెకు ఇబ్బందిగా మారాయంటున్నారు.  టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న రాజేందర్.. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలు, తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈటల. కొంత ఆలస్యమైనా రాజేందర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు ఈటలకు సపోర్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు కూడా రాజేందర్ తో చర్చలు జరిపారు. కొండా దంపతులను తన పార్టీకి రమ్మని గతంలో షర్మిల ఆహ్వానించినా వారు నిరాకరించారు. ఇప్పుడు వాళ్లు రాజేందర్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీ పెడితే.. తమకు తెలంగాణ పాలిటిక్స్ లో ఏ మాత్రం స్పెస్ ఉండదనే ఆందోళనలో షర్మిల ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ వ్యతిరేకులు కొందరు తమతో కలిసి వస్తారని గతంలో షర్మిల భావించారు. కాని రాజేందర్ ఎంట్రీతో అటువంటి వాళ్లంతా ఆయనతోనే వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడటానికి కారణమని చెప్పుకుంటున్నారు .

హుజురాబాద్ నుంచి  ఈటల సమర శంఖం ?

రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్’ అయిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, భవిష్యత్ వ్యూహం ఏమిటి? ఈ ప్రశ్నకు ఆయన ఇంతవరకు ఎక్కడా, స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. కానీ, ఈ రోజు సొంత గడ్డ హుజురాబాద్ ‘ వేదికగా, ఈటల స్పష్టత ఇవ్వడమే కాదు, తెరాస లక్ష్యంగా శంఖారావం పూరించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆయన మీడియా మీట్ నిర్వహించారు. తెరాస నాయకులు, మంత్రులు, ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ తనపై ఎంతగా విమర్శలు చేసినా, ఇంతవరకు, ఎక్కడా పరుషంగా ఎవరినీ ఒక్క మాటైనా అనని ఈటల ఈరోజు, మంత్రి గంగుల పై విరుచుపడ్డారు. ‘బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు, హుజురాబాద్ ప్రజలను వేధిస్తే వదిలేది లేదని అన్నారు. గంగుల గుట్టురట్లు అన్నీ బయట పెడతానని హెచ్చరించారు. ‘నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు’ అంటూ గంగులపై వరస అస్త్రాలను సంధించారు.  అంతే కాదు, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే, వ్యూహంతో తెరాస టికెట్ పై గెలిచిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి, అక్కడి నుంచే కొత్త భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టే వ్యూహాన్ని ఈటల ఈ రోజు అవిష్కరించారు. నాగర్జున సాగర్’లో చేసినట్లు ఇక్కడ చేద్దామంటే, ప్రజలు పాతరేస్తారని తెరాస నాయకులకు గట్టి హెచ్చరిక చేయడం ద్వారా, ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీకి ఈటల సిద్దమవుతున్నారు. అలాగే, అయన మొదటి నుంచి వినిపితున్న ఆత్మ గౌరవం నినాదమే, ప్రధాన అస్త్రంగా యుద్దానికి సిద్దమవుతున్న సంకేతాలు  కూడా, ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటల  2006లో కరీంనగర్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా.. ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా అదే జరుగుతుందని, అంటూ, ప్రస్తుత తెరాసను అప్పటి కాంగ్రెస్’తో పోల్చారు.అలాగే, ఆత్మగౌరవ బావుటా ఎగరేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నరని పేర్కొన్నారు.అలాగే, గంగుఅల్ సహా తనపై విమర్శలు చేస్తున్న నాయకులకు కూడా అయన గట్టి వార్నింగ్ ఇచ్చారు, తను సహనం పాటిస్తున్నానని, అదే  కోల్పోతే మాడి మసి అయిపోతారు’ అంటూ ఈటల మాజీ సహచరునిపై మిస్సైల్స్ ఫైర్ చేశారు. ఇంతవరకు వన్ సైడెడ్’గా సాగిన కేసీఆర్ వెర్సెస్ ఈటల వార్, ఇక ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ... చూడవలసి వుంది.

2.4 కిలోల బంగారం స్వాధీనం.. 

బంగారం ఆ పేరు వింటే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని  ఉత్సహం, ఎందుకంటే ఆ బంగారు మేడలో వేసుకుంటే అందం తో పాటు ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఆ విషయం అందరికి తెలిసిందే.. ఆ బంగారాన్ని ఈ మధ్య కాలంలో బాగా సరఫరా చేస్తున్నారు. తాజాగా  దుబాయ్‌ నుంచి ఇద్దరు ప్రయాణికులు రహస్యంగా తీసుకొస్తున్న బంగారాన్ని సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 2.4 కిలోల బరువు గల బంగారం బిస్కెట్లను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్యాంట్ల లోపలి భాగంలో పెట్టుకున్నారు. వారి తీరుపై అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోదా చేయగా బంగారం గుట్టురట్టయింది. సుమారు రూ.1.2 కోట్ల విలువ చేసే బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.     విశాఖ లో గంజాయి ముఠా అరెస్ట్..  గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠా విశాఖ జిల్లాలో బీభత్సం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఎలమంచిలి వైపు నుంచి అనకాపల్లి వైపునకు వేగంగా వచ్చిన ఓ కారు కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్ద మహిళను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అదే వేగంతో ముందుకు వెళ్లిన కారు ‘యు’ టర్న్‌ తీసుకొనే క్రమంలో డివైడరుపైకి దూసుకెళ్లడంతో టైర్లు పేలిపోయాయి. వాహనంలో ఉన్న ఇద్దరు నిందితులు కిందకు దిగి అటుగా వస్తున్న లారీని నిలిపి కత్తులతో బెదిరించి ఎక్కడానికి ప్రయత్నించారు. క్లీనర్‌ వారిని నెట్టేయడంతో లారీ ముందుకు వెళ్లిపోయింది. అనంతరం ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని కత్తితో బెదిరించి, గాయపరిచి అతని వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. జాతీయ రహదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును పరిశీలించగా అందులో సుమారు వంద కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. కారు ఢీకొని అపస్మారక స్థితికి చేరుకున్న గ్రామానికి చెందిన కలిగట్ల లక్ష్మి (35)ని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.    

పెండింగ్’లో పీఅర్సీ  ఉద్యోగులకు పాత జీతాలే 

పీఅర్సీ సవరణతో పెరిగిన జీతాలు అందుకునేందుకు, ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం మరో మారు నీళ్ళు చల్లింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మరీ ముఖ్యమంత్రి, చంద్రశేఖర రావు, గత మార్చిలో జరిగిన శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో పీఅర్సీ ప్రకటన చేశారు.  30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి సవరించిన పీఆర్సీ అమలులోకి వస్తుందని ముఖ్యంత్రి శవంగా సభలో ప్రకటించారు. అయితే, మే నెలలలో పెరిగిన జీతాలపై ఆశలు పెంచుకున్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. గతంలోలోనూ పీఆర్సీ ఇలా ఒక నెల లేటుగా అమలైన సందర్భాలు ఉన్ననేపధ్యంలో, కనీసం జూన్ నెలలో అయినా ఎరియర్స్’తో సహా పెరిగిన జీతాలు వస్తాయని అనుకుంటే, తాజా సమాచారం ప్రకారం, ఇంత  వరకు పీఆర్సీ ఫైల్ మీద ముఖ్యమంత్రి సంతకమే కాలేదు. జీవోలు జారీకాలేదు. అంటే, జూన్ నేలలోనూ పాత జీతాలే, వస్తాయని, ఉద్యోగులు ఉసూరు మంటున్నారు.    అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’కు కోవిడ్ సోకడంతో  ఆయన 20 రోజులకు పైగా, ఫార్మ్ హౌస్ ‘కే పరిమితం అయ్యారు. ఈ కారణంగా పీఅర్సీ   ఫైల్ పెండింగ్’లో పడిందని, ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఉద్దేశ పూర్వకంగానే ముఖ్యమంత్రి ఫైల్’ ను పెండింగ్’లో పెట్టారని ఉద్యోగులు అనుమానిస్తున్నారు.మరోవైపు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పెరిగిన వేతనాలను ప్రస్తుతానికి ఇచ్చే ఇచ్చే పరిస్థితి లేదని,  పాత వేతనాల ప్రకారమే బిల్లులు రెడీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు మౌఖిత ఆదేశాలు అందినట్లు ఉద్యోగ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో, పీఆర్సీ కి మోక్షం ఎప్పుడో ... అసలు వస్తుందో, రాదో అని కూడా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్ర  రాబడికి  కరోనా కాటు.. 

తెలంగాణ ప్రభుత్వం లెక్క తప్పింది. రాష్ట్రం ఆశించిన ఆదాయానికి కరోనా భారీగా గండి కొట్టింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) రాష్ట్ర ప్రభుత్వం భారీ  ఆశలు, అంచనాలతో రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అయితే, ఆతర్వాత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం  బడ్జెట్ అంచనాలను రూ. 1.76 లక్షల కోట్లకు సవరించింది. చివరాఖరుకు, తాజాగా కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వార్షిక ఆదాయం రూ.1.45 లక్షల కోట్ల వద్దే ఆగిపోయింది. అందులోనూ,రూ. 45,638 కోట్లు ఆదాయం పద్దులో చూపిన అప్పులే ఉన్నాయి.అంటే, రాష్ట్ర వాస్తవ ఆదాయం లక్ష కోట్ల ((రూ.99,903కోట్లు)లోపే ఉంది. అయితే, కరోనా మహమ్మారి, సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో, అంచనాలు తప్పు కావడం, తల్ల కిందులు కావడం తప్పు కాదు. ప్రభుత్వం చేతకాని తనమో, వైఫల్యమో కానే, కాదు. ఒక విధంగా కరోనా మహామ్మారి పుణ్యాన,ఇంచుమించుగా  ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నాయి. అందుకు మన దేశం, మన రాష్ట్రం మినహాయింపు కాదు. అయితే, వాస్తవాలను ప్రజల నుంచి  దాచే ప్రయత్నం చేయడం మాత్రం సరి కాదు. సరే, అదలా, ఉంటే  కాగ్’ చూపిన వివరాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో రెండే రెండు పద్దుల కింద మాత్రమే ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. అందులో మొదటిది, రాష్ట్రానికి కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో వచ్చిన ఆదాయం అయితే, రెండవది అప్పులు రూపంలో వచ్చిన ఆదాయం.కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రూ.10,525 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అయితే అంచనాను మించి కేంద్రం నుంచి  రూ.15,471 కోట్ల రాబడి వచ్చింది. అలాగే, అప్పుల ద్వారా రూ.33,191 కోట్లు రాబడి వస్తుందని అంచవేస్తే, అది రూ.45,638 కోట్లకు పెరిగింది.  ఇక ఇతర పద్దుల విషయానికి వస్తే, జీఎస్టీ ద్వారా రూ. 32,671 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, వాస్తవానికి వచ్చిన ఆదాయం రూ.25, 905 కోట్లు మాత్రమే. అలాగే స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ. 5,243 కోట్ల ఆదాయం వచ్చింది.అలాగే సేల్స్‌ ట్యాక్సు నుంచి రూ.20 ,903 కోట్లు, స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీస్‌ నుంచి రూ.14,369 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ద్వారా రూ.8,976 కోట్ల ఆదాయం సమకూరింది. ఇతర పన్నుల ద్వారా రూ. 3,940 కోట్ల రాబడి వచ్చింది.  కాగా, గత ఏడాది కరోనా కారణంగా ఆదాయంతో పాటుగా వ్యయం కూడా రూ.1.34 లక్షల కోట్లకు దిగివచ్చింది. కాగా, గత సంవత్సరంలానే ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ,ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపధ్యంలో అంచనా వేసిన మేర ఆదాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే, కరోనా విరామ సమయంలో పరిస్థితి కొంత ఆశాజనకంగా కనిపించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మరింతగా పెంచి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  రాష్ట్ర బడ్జెట్‌ను ఏకంగా రూ.2.30 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ అంచనాలను చేరుకోవాలంటే ప్రతి నెలలో సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉంటుంది. అయితే, ఆదాయం సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రెండు విడతల్లో రూ.3000 కోట్లు అప్పును పెంచుకుంది. మరో రూ.2,000 కోట్ల అప్పు కోసం బాండ్ల వేలానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యంగా, కరోనా మహమ్మారి ఇంకెంతకాలం ఉంటుందో, ఇంకెన్ని విడతల్లో కాటేస్తుందో అంతు చిక్కని పరిస్థితిలో పభుత్వాలు, అయినా ప్రజలు అయినా పరిమితులు దాటి, పెద్ద ఎత్తులకి పోవడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిడ్డా, గంగుల గుర్తుపెట్టుకో.. ద‌మ్ముంటే రాజీనామా చేయ్‌..

టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల ఎపిసోడ్ కాస్తా.. గంగుల వ‌ర్సెస్ ఈట‌ల‌గా మారింది. ఆ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు.. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల వ‌ర‌కూ మేట‌ర్ ముదిరింది. క‌రీంన‌గ‌ర్‌, హుజురాబాద్ కేంద్రంగా రాజ‌కీయ ర‌చ్చ రాజుకుంది.  "బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో.. అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్‌ను బొందల గడ్డగా మర్చినావ్. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. నువ్వు ఎన్ని టాక్స్‌లు ఎగ్గొట్టినవో తెలవదు అనుకుంటున్నావా?. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. 2023 తరువాత నువ్వు ఉండవు. నీ అధికారం ఉండదు".. అంటూ మాజీ మంత్రి ఈట‌ల.. గంగుల‌కు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ద‌మ్ముంటే త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లు నిరూపించాల‌ని.. అసైన్డ్ భూములు ప్ర‌భుత్వానికి స్వాధీనం చేయాలని.. ఆత్మ‌గౌర‌వ‌ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ గంగుల సైతం అదే రేంజ్‌లో ఈట‌ల‌కు ప్ర‌తిస‌వాల్ విస‌ర‌డంతో టీఆర్ఎస్‌లో ఈట‌ల ఎపిసోడ్ మ‌రింత‌ కాక రేపుతోంది.   ఈటల రాజేందర్‌పై భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్ప‌టి నుంచీ ఆయ‌న్ను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వారిలో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అంద‌రిక‌న్నా ముందున్నారు. హుజురాబాద్ టీఆర్ఎస్ కేడ‌ర్‌ను ఈట‌ల నుంచి వేరు చేసే బాధ్య‌త‌ను ఆయ‌నే తీసుకున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ.. గులాబీ కేడ‌ర్‌ ఈట‌ల వైపు నిల‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. దీంతో.. రాజేంద‌ర్ రోషం వ‌చ్చింది. గంగుల‌పై ఫుల్ గుస్సా అయ్యారు. ‘చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రావని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరు కొనలేరు. ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తాను’ అంటూ ఈట‌ల గంగుల‌పై మండిప‌డ్డారు.  ఈట‌ల వార్నింగ్‌కు మంత్రి గంగుల సైతం కౌంట‌ర్ ఇచ్చారు. ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల.. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసినా పదవి పట్టుకుని ఊగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ఆత్మ గౌరవమా? ఆత్మ వంచనా? అని ప్ర‌శ్నించారు. ప్రజలంతా ఈట‌ల‌ వెంటే ఉన్నపుడు రాజీనామా ఎందుకు చేయడం లేదని నిలదీశారు గంగుల‌. తాను క‌రీంన‌గ‌ర్‌ను బొంద‌ల గ‌డ్డ‌గా మారుస్తుంటే.. నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావ‌ని ప్ర‌శ్నించారు. ట్యాక్సులు క‌ట్ట‌కుండా మైనింగ్ వ్యాపారం చేస్తున్నాన‌నే ఆరోప‌ణ‌ను నిరూపించాలంటూ ఈట‌లకు ప్ర‌తిస‌వాల్ విసిరారు గంగుల‌. 

అవునా  కుట్ర జరుగుతోందా ?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపధ్యంలో, లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిదున్ రెడ్డి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే, రఘురామ కృష్ణం రాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారని,ఆయన చెప్పినట్లు పనిచేస్తున్నారని మిదున్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు, బోడి గుండుకు మోకాలుకు ముడి వేసినట్లుగా, గతంలో తెలుగు దేశం పార్టీ నాయకులు అరెస్ట్ అయిన సందర్భంలో  చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్రపతికి లేఖ రాయలేదని, తమ పార్టీ (వైసీపీ) ఎంపీ కృష్ణం రాజు అరెస్ట్ విషయంలో మాత్రం చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారని, అదేదో మహా నేరం అయినట్లుగా మిదున్ రెడ్డి , అలాగే ఇతర  వైసీపీ నాయకులు కొత్త కోణాన్ని వెలికి తీశారు. చంద్రబాబు నాయుడు,  జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రతోనే ఆయన ఈ లేఖ రాశారని ఆరోపించారు.  ఇతర విషయాలు ఎలా ఉన్నా, చంద్రబాబు నాయుడు, మరీ అంత రాజకీయ ఎత్తు పల్లాలు, ఎత్తులు పై ఎత్తులు తెలియని అమాయకుడు కాదు. అయన రాజకీయ అనుభవం మిధున్ రెడ్డి వయసు కంటే కూడా ఎక్కువ ఉండవచ్చును. అంత అనుభవం  ఉన్న నాయకుడు, మూడింట రెండువంతుల కంటే ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కుల్చేందుకు కుట్ర చేస్తున్నారు అనుకోవడం అయితే రాజకీయ అజ్ఞానం, కాదంటే, అమాయకత్వం అనిపించుకుంటుంది. అదే కాదంటే, పగ, ప్రతీకరాలే  శ్వాసగా జీవిస్తూ,స్వీయాపరాధంతో చిక్కులు కొనితెచ్చుకున్న జగన్ రెడ్డి బృందం టం నీడను చూసి తామే భయపడుతుండ వచ్చును. ఆ భయం నుంచి, ఇలాంటి ప్రేలాపనలు వస్తున్నాయో, ఏమో ..సరే, అదలా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరో కుట్రలు చేస్తే కూలి పోయేంత బలహీనంగా వుందా లేక అటూ ఇటూ అవుతున్న అస్మదీయులు జగన్ ప్రభుత్వం కూలి కూలిపోవాలని కోరుకుంటున్నారా? రాజకీయ ఓనమాలు తెలియని అమాయకులు కూడా, జగన్ రెడ్డి ప్రభుత్వం అంత బలహీనంగా ఉందని అనుకోరు. ప్రశాంత్ కిషోర్ మాయలే పనిచేశాయో, ‘ఒక్క ఛాన్స్’ అంటూ జగన్ రెడ్డి అమాయకంగా ముఖం పెట్టి చేసిన అభ్యర్ధనలే మోసం చేశాయో లేక ఆయన చేసిన మోసపూరిత వాగ్దనాలే పనిచేశాయో గానీ,గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అనూహ్య విజయాన్ని కట్ట బెట్టారు. ఏకంగా 151 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులను గెలిపించారు. ఒక విధంగా ఆ మంద బలాన్ని చూసుకునే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అరాచక పాలన యధేచ్చగా సాగిస్తున్నారని ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా బావిస్తున్నారు. మరి మిదున్ రెడ్డి, జగన్ సర్కార్, అస్థిరపు అంచుల్లో ఉందని ఎలా అనుకుంటున్నారు? అదొకటి అయితే, రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో, రాష్ట్రంలో జరుగతున్నవ్యవహారాన్ని, ముఖ్యంగా ఆయన ప్రాణాలకు హని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో అదే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడే కాదు, గతంలో టీడీపీ నాయకులు  అచ్చెన్నాయుడు,  కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా అరెస్టులు, టీడీపీ కార్యకర్తల అరెస్టులు,  హత్యలపై చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు. అయినా, రాష్ట్రపతికి లేకః రాసినందుకే ఇంతలా ఉలిక్కి పడుతున్నారంటే, అసలు భయానికి ఇంకేదో కారణం ఉంటుందని,రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి లేఖను, ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రలో భాగం అనుకోవడం, అంటే మిదున్ రెడ్డి ఎవరిని అనుమానిస్తున్నారు? రాష్ట్రపతిని అనుమానించడం, అవమానించడం, రాజద్రోహాన్ని, దేశ ద్రోహాన్ని మించిన ద్రోహం కాదా... జగన్ రెడ్డికి ఇలాంటి సలహాలు ఇస్తున్న మేథావులు చెపితే బాగుటుంది ...

2023లో మీ ప‌ని ప‌డ‌తా.. ఈట‌ల వార్నింగ్ వెనుక వ్యూహ‌మేంటి?

ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ఎస్‌. హుజురాబాద్ కేంద్రంగా రాజ‌కీయం ముదురుతోంది. రాజేంద‌ర్‌ను రౌండ‌ప్ చేసేందుకు గులాబీ నేత‌లు ఫుల్‌గా ఫోక‌స్ పెట్టారు. ఈట‌ల వ‌ర్గం అనే ముద్ర ఉన్న ప్ర‌తీ ఒక్క ప్ర‌జాప్ర‌తినిధిని పార్టీ లైన్‌లోకి తీసుకొస్తున్నారు. న‌యానో, భ‌యానో వారంద‌రి చేత‌.. టీఆర్ఎస్‌కు జై కొట్టిస్తున్నారు. కేసీఆరే త‌మ బాస్ అని చెప్పిస్తున్నారు. స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీ, ఎంపీపీల‌ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్వ‌యంగా డీల్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క‌రినీ త‌న‌కు దూరం చేస్తుండ‌టంపై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డుతున్నారు. త‌న వ‌ర్గాన్ని వేధించే ప‌నులు మానుకోవాలంటూ హెచ్చ‌రించారు. ప‌నిలో ప‌నిగా టీఆర్ఎస్ పార్టీకీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  "అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అలా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్లే. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు పనికిరావు. 2023 తర్వాత టీఆర్ఎస్‌కు అధికారం ఉండదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో.. ఆ తర్వాత మేమూ ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. మర్యాదగా నడుచుకోండి. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. దాదాగిరి పద్ధతి, హెచ్చరికలను ఆపుకోకపోతే కరీంనగర్‌ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి ఉంటుంది’’  అంటూ టీఆర్ఎస్‌కు ఖత‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు ఈట‌ల‌.      అక్క‌డితో ఆగ‌లేదు ఈట‌ల‌. మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్టు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని గులాబీ నేతలకు హెచ్చ‌రిక జారీ చేశారు. తన బొందిలో ప్రాణమున్నంత వరకూ హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానన్నారు. స్థానిక నేతలను బ్లాక్‌ మెయిల్‌ చేసే పద్ధతి మానుకోవాలని.. ఆత్మగౌరవ బావుటా ఎగురవేయడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.  ‘‘నాపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు.. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా వస్తున్నవారు ఏనాడైనా ఆపదలో ఆదుకున్నారా? సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీల గెలుపులో తోడ్పాటు అందించారా? స్కూళ్లు ఉన్న వాళ్లతో పాటు కాంట్రాక్ట్‌లు, సర్పంచ్‌లను బిల్లులు రావని బెదిరిస్తున్నారు. గ్రామాలకు రూ.50లక్షలు, రూ.కోటి నిధులు రావాలంటే తమతో ఉండాలని చెబుతున్నారు. స్థానిక నేతలపై ఒత్తిడితో రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని హుజూరాబాద్‌, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత అన్యాయం.. అక్రమమా? ఇదేం రాజకీయమని అసహ్యించుకుంటున్నారు.    మా ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెళ్లో పెట్టుకున్నారు. తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం చెల్లదు. స్థానిక నేతలను ప్రలోభపెడితే తాత్కాలికంగా మీకు జై కొట్టొచ్చు.. కానీ వారి హృదయాలు ఘోషిస్తున్నాయి. హుజూరాబాద్‌ ప్రజల్ని ఎవరూ కొనలేరు. ఇక్కడి ప్రజలు అనామకులు కాదు అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.  ఇన్నాళ్లూ కాస్త మౌనంగా క‌నిపించిన ఈట‌ల‌.. ఇలా ఒక్క‌సారిగా టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డ‌టంతో గులాబా పార్టీ రాజ‌కీయం రంజుగా మారింది. ఈట‌ల పార్టీలోనే ఉంటూ ఇలానే చిట‌ప‌ట పేలుతూ ఉంటారా?  ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. మ‌ళ్లీ ప్రజాతీర్పు కోరుతారా?  సొంత పార్టీ పెడ‌తారా?  కాంగ్రెస్ కానీ, బీజేపీలో కానీ చేరుతారా? ఇలా ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. 2023 త‌ర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండ‌దు.. అప్పుడు మీ ప‌ని ప‌డ‌తా.. అంటూ హెచ్చ‌రించ‌డం వెనుక ఈట‌ల రాజ‌కీయ వ్యూహం ఏమై ఉంటుందనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ట్రీ ఐసోలేషన్  సక్సెస్.. శివకు నెగిటివ్.. 

ఈ ప్రపంచం లో దైర్యం కంటే గొప్ప మందు ఇంకోటి లేదు. ఎందుకంటే ఏదో జరోగుతుందని ప్యానిక్ అవ్వడం వల్ల ఇంకా ప్రాబ్లమ్ వచ్చి పడుతుంది. కానీ, దాని వల్ల ఎలాంటి లాభం ఉండదు. తాజాగా నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ గతంలో ట్రీ ఐసోలేషన్‌ పాటించిన సంగతి విదితమే. అతడికి 12 రోజులకే కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కుటుంబంలో నలుగురు సభ్యులు, ఇంట్లో ఒక్కటే గది ఉండడం, కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో చెట్టుపై ఆవాసం ఏర్పరచుకున్న శివ అనే యువకుడు కరోనాను జయించాడు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామానికి వచ్చేసిన అతడు కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లగా కరోనా సోకింది. ఇంట్లో నలుగురు కుటుంసభ్యులు ఉంటుండటంతో తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని ఆలోచించిన శివ ఇంటి ముందున్న గానుగ చెట్టును ఐసోలేషన్‌కు వినియోగించుకున్నాడు. నులక మంచాన్ని చెట్టుపై ఏర్పాటుచేసుకుని భోజనం, నిద్ర అన్నీ అక్కడే కానిచ్చేశాడు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అతడిని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హోం ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. తాజాగా శివకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంపీపీ బాలాజీ, సర్పంచి కొత్త మరెడ్డి, ఎస్సై వీరశేఖర్‌, మండల వైద్యాధికారి డాక్టర్‌ ఉపేందర్‌, వైస్‌ఎంపీపీ కూరాకుల మల్లేశ్వరి గోపీనాధ్‌ తదితరులు సోమవారం అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ట్రీ ఐసోలేషన్‌‌తో కరోనాను జయించిన శివ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కోవిద్ ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కొంచం దారుణంగా ఉన్నా కూడా ప్రజల్లో అవగాహనా రావడం.. మొదటి విడతో లాగ ఊర్లోకి రానివ్వకపోవడం వంటి పనులు చేయడం లేడు.  కానీ ఈ టైం లో అందరూ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కరోనా వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మనుషులు ఎఫెక్ట్ అవుతున్నారు. అందరూ శివ ని ఆదర్శనంగా తీసుకుని దైర్యంగా ఉండాలి.  కంగారు పడకుండా డాక్టర్స్ పరివేక్షణలో చికిత్స తీసుకుంటే కరోనా భారీ నుండి మనం తప్పించుకోవచ్చు.   

ప్ర‌జ‌ల‌పై పోలీసుల కాల్పులు.. ముగ్గురి మృతి.. 15మందికి గాయాలు..

అది మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతం. అందుకే అక్క‌డ క్యాంపు ఏర్పాటుకు పోలీసులు స‌న్నాహాలు చేస్తున్నారు. దీనికి స్థానికులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఓవైపు మావోలు, మ‌రోవైపు పోలీసులు మోహ‌రిస్తే.. త‌మ బ‌తుకులు మ‌రింత అధ్వాహ్నంగా మారుతాయ‌ని వారు భ‌యాందోళ‌న చెందారు. పోలీస్ క్యాంపు ఏర్పాటుకు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున గిరిజ‌నులు నిర‌స‌న‌కు దిగారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో.. పోలీసులు ఆదివాసీల‌పై కాల్పులు జ‌రిపారు.    ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు మృతి చెంద‌డంతో పాటు 15 మందికి పైగా గాయాల‌య్యాయి. సిలిగ‌ర్ వ‌ద్ద పోలీస్ క్యాంపు ఏర్పాటుకు స్థానికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క్యాంపు ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ గిరిజ‌నులు ఆందోళ‌న‌కు దిగిన స‌మ‌యంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.   కాగా, త‌మ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మావోల త‌మ‌పై దాడి చేసిన త‌ర్వాతే తాము ఎదురు కాల్పులు జ‌రిపిన‌ట్లు వివ‌రించారు. బ‌స్త‌ర్ పోలీస్ అధికారులు ఘ‌ట‌నాస్థ‌లిలోనే ఉన్నారు. పోలీసులు త‌మ‌పై అన్యాయంగా కాల్పులు జ‌రిపార‌ని.. 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని స్థానికులు చెబుతున్నారు.  బీజాపూర్ జిల్లా సిలిగ‌ర్ ద‌గ్గ‌ర తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితి నెల‌కొంది. 

తుపాను ఎఫెక్ట్.. మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు..

ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు చ‌ల్ల‌బ‌డ్డాయి. వాన‌ల‌తో త‌డిసి ముద్ద‌య్యాయి. ఈ వాన‌లు మ‌రో రెండు రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. ఎక్క‌డో ప‌శ్చిమాన‌ గుజ‌రాత్ తీరంలో తుఫాను తీరం దాటితే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌పైనా ప్ర‌భావం క‌నిపిస్తోంది.  తౌక్టే ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాతావరణం చల్లబడింది. వర్షాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయి. రెండ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు గుజరాత్‌ వద్ద తౌక్టే తుపాను  తీరాన్ని తాక్కింది. అరేబియా సముద్రంలో తౌక్టే అల్లకల్లోలం సృష్టించింది. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌‌లలో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబై తీరంలో  సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుపాను... పోర్‌బందర్‌-మహువాల దగ్గర తీరం దాటింది. వెరవల్‌-సోమనాథ్‌ తీరంలో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో లేడి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..? 

అతడు  కాంగ్రెస్ ఓ  ఎమ్మెల్యే. మాజీ మంత్రి కూడా. అతని పేరు ఉమాంగ్ సింఘార్.  అతని బంగళాలో 38 ఏళ్ల మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. అక్కడ ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అందులో కీలక విషయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే జీవితంలో చోటు కోసం ఎంతో ప్రయత్నించానని.. కానీ అది సాధ్యం కాదని అర్ధమైందని ఆమె పేర్కొంది. అందుకే జీవితం మీద విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఎమ్మెల్యే బంగళాలో మహిళ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎమ్మెల్యే సింఘార్ బంగళాలో ఆ మహిళతో పాటు పని మనిషి, అతడి భార్య ఉంటున్నారు. ఆదివారం ఉదయం పని మనిషి భార్య ఆమె మహిళ గది తలుపుతట్టారు. కానీ ఎంత సేపటికీ అవతలి నుంచి స్పందన రాలేదు. కంగారుపడిన పని మనిషి వెంటనే ఎమ్మెల్యే సింఘార్‌కు సమాచారం ఇచ్చారు. కానీ అప్పుడు ఆయన భోపాల్‌లో లేరు. ఏం జరిగిందో చూడాలని.. తన బంధువు ఒకరిని బంగళాకు పంపించారు. ఆయన బంగళాకు వెళ్లి ఆరా తీశారు. ఆ మహిళ ఉంటున్న గది డోర్‌ను బద్దలు కొట్టారు. లోపల ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. అని భోపాల్ అడిషనల్ ఎస్పీ బదోరియా పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్పందన..  ఉమాంగ్ సింఘార్ గంధ్వాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళ ఆత్మహత్యపై ఆయన స్పందించారు. ఆమె తనకు మంచి స్నేహితురాలిని. ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఆమె మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం ఈ మధ్యే తనకు తెలిసిందని ఆయన తెలిపారు. తాను మూడు రోజులుగా భోపాల్‌లో లేదని.. ఆమె మృతి వార్త విని షాక్‌కు గురయ్యానని ఆయన అన్నారు. కాగా, మృతురాలి స్వస్థలం హర్యానాలోని అంబాల. ఏడాది క్రిత నుంచి ఆమె భోపాల్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వచ్చి పోతుండేది. గత నెల రోజులుగా ఎమ్మెల్యే బంగళాలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె హత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే సింఘార్ రెండు రోజులుగా భోపాల్‌లో లేరు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఈఘటన చోటుచేసుకుంది.   

వన్ ఇయర్..  ఆమెకు షేక్ చేతిలో నరకం 

ఒకటి కాదు రెండు కాదు. ఏడాది పాటు ఆమె నరకం అనుభవించింది. స్వదేశంలో పూట గడవక. కాస్త పక్కదేశానికి వెళ్లి డబ్బులు సంపాదించుకుందాం.. అనే ఆడవాళ గోసలు అంత ఇంత కాదు. గల్ఫ్ లో ఆడవాళ్ళ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు. తాజాగా స్వదేశం తిరిగి వచ్చి ఓ మహిళ తన కష్టాలను మీడియా ముందు వెళ్లి బుచ్చుకుంది. దుబాయి అనగానే అందరికీ గుర్తొచ్చేది. అద్దాల మేడలు, కాసుల గల గలలు మాత్రమే కానీ, ఆ అద్దాల మేడలా వెనుక ఆడవాళ్ళ కష్టాలు అంత ఇంత కాదు. ఆ చీకటి ప్రపంచం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎంతో మంది మహిళలు అక్కడ పనుల కోసం వెళ్లి, లైంగిక వేధింపులకు గురై చివరకు స్వదేశానికి బ్రతుకు జీవుడా అని చేరుకున్నారు. అలాంటి ఓ దీనగాథ చూద్దాం. అది తూర్పుగోదావరి జిల్లా.  సఖినేటిపల్లి మండలం. పేరు సుజాత ( పేరు మార్చాం) అక్కడ ఇక్కడ వంట పని చేసేది. భర్త అకాల మరణంతో కుటుంబభారం ఆమె మీద పడింది. కూతురు పెళ్లి కోసమని దాదాపు 3 లక్షల దాకా ఖర్చు కావడంతో  చాలా చోట్ల అప్పులు చేసింది. తాను చేసే వంట పనితో ఇక తాను చేసిన అప్పులు తీర్చడం అసాధ్యమని భావించిన సుజాత, ఎలాగైనా ఆ అప్పుల నుండి ఈ కష్టాల నుంచి బయటపడాలనుకుంది. అందుకోసం స్థానిక ఏజెంట్ ద్వారా దుబాయి వెళ్లి సంపాదించాలనుకుంది. అప్పుడే తన అప్పులు తీరుతాయని భావించింది. ఏజెంట్ ద్వారా హైదరాబాద్ చేరుకున్న సుజాత తన ఇల్లు, పొలం, బంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో దుబాయి ప్రయాణం అయ్యింది. దుబాయ్ లో స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ లో హౌస్ కీపర్ గా జీవితం స్టార్ట్ చేసింది. మొదటి రెండు నెలల పాటు అదే రెస్టారెంట్ లో పనిచేసింది. అయితే ఆ రెస్టారెంట్ క్లోజ్ చేయడంతో. కాస్త బెంగపడింది.  ఆ తర్వాత ఔట్ సోర్సింగ్ కంపెనీ వారు ఓ ఇంట్లో వంట మనిషి కింద ఉద్యోగం కుదిర్చారు. సుజాత యూఏఈలోని ఓ షేక్ ఇంటలో పని కుదరింది. మొదట్లో ఆ ఇంట్లో అంతా బాగానే చూసుకున్నారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ దుబాయి షేక్ కుమారుడు లండన్ నుంచి ఇంటికి వచ్చాడు. అతడి వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. నిత్యం పబ్స్, గర్ల్ ఫ్రెండ్స్ , మాదక ద్రవ్యాలతో మునిగి తేలే ఆ షేక్ తనయుడి కన్ను సుజాత పై పడింది.  కట్ చేస్తే..  ఓ  రోజు తన బెడ్రూంలో నుంచి సుజాతకి టీ తీసుకురమ్మని చెప్పాడు. సుజాత వెంటనే టీ కప్పుతో భయం భయంగా అతడి గదిలోకి వెళ్ళింది. అప్పటికి  ఆ షేక్ కుమారుడు డ్రగ్స్ తీసుకొని మైకంలో ఉన్నాడు. సుజాత ను ఒంటి మీద దుస్తులు తీసేయమన్నాడు. అందుకు సుజాత నిరాకరించింది. అతని మాట వినకపోయి సరికి షేక్ కొడుకు కోపం వచ్చింది. దాంతో బెల్టు తీసకొని ఆమెను చితకబాదాడు. ఆ విషయాన్నీ సుజాత , షేక్ కు చెప్పింది, అయినా ఫలితం లేకుండా పోయింది. పైగా తన కొడుకు చెప్పినట్లు నడుచుకోమని ఆదేశించాడు షేక్.  ఇక సుజాత ఆ నరక బాధలు భరించలేకపోయింది. షేక్ కుమారుడు తనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు ఆమెను గదిలోకి పిలిచి అత్యాచారం చేసేవాడు. ఆమెను మంచానికి కట్టేసి గంటల తరబడి సెక్స్ చేసేవాడు. అంతే కాదు తన స్నేహితులను పిలిచి సైతం సుజాత పై అత్యాచారానికి దిగేవాడు. ఈ నరకబాధలను సుజాత  సంవత్సరం పాటు భరించింది. ఒకే రోజు దాదాపు 12 మంది వరకూ సుజాత లైంగిక అవసరాలకు వాడుకునే వారు. పేదరికంతో సుజాత వారిని కాదనలేక పోయింది. ఆమె అనారోగ్యం పాలవడంతో షేక్ కుటుంబం తమకు ఇంకో పనిమనిషి కావాలని, సుజాత ని తరిమిగొట్టి, పంపేసింది.  దీంతో ఆమె స్థానిక హోటల్ లో మరో ఆరు నెలల పాటు పనిచేసింది. చివరకు వీసా గడువు పూర్తి కావడంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చింది. తన వయస్సు కన్నా చాలా చిన్నవాడైన షేక్ కుమారుడు అలా పశువులా మీద పడి అనుభవిస్తున్నా...పేదరికంతో పాటు నిస్సహాయత తోడైన నరకం చూశానని వాపోయింది.  

కింగ్ ఈజ్ బ్యాక్‌.. 4 రోజుల హైడ్రామా.. మీసం తిప్పిన ర‌ఘురామ‌..

శుక్ర‌వారం.. సాయంత్రం.. హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ కృష్ణ‌రాజు నివాసం.. ఉన్న‌ట్టుండి ప‌దుల సంఖ్య‌లో ఏపీ సీఐడీ పోలీసులు ఎంపీని చుట్టుముట్టారు.. సీఆర్పీఎఫ్ ర‌క్ష‌ణ‌లో ఉన్న ర‌ఘురామ‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు.. ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు.. ఒక్కసారిగా షాక్‌.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్‌.. మీడియా మొత్తం హోరెత్తింది.. జ‌న‌మంతా ఉలిక్కిప‌డ్డారు.. ర‌ఘురామ కృష్ణ‌రాజు అరెస్ట్ వార్త.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ ద‌ద్ద‌రిల్లిపోయింది..  క‌ట్ చేస్తే.. సోమ‌వారం సాయంత్రం.. కారు ఎక్కుతూ.. చేతులు ఊపుతూ.. విజ‌య‌గ‌ర్వంతో క‌నిపించారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కారులో కూర్చొని మీసం మెలేస్తూ.. తాను మొన‌గాడిన‌నే మెసేజ్ ఇచ్చారు..   ఈ నాలుగు రోజులు తెలుగునాట‌ మునుపెన్న‌డూ చూడ‌ని హైడ్రామా న‌డిచింది.. హైకోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు, సుప్రీంకోర్టు.. ఇలా న్యాయ‌వ్య‌వ‌స్థ త‌లుపుల‌న్నీ త‌ట్టారు ర‌ఘురామ‌.. న్యాయం కోసం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాడారు.. బ‌ల‌మైన రాజ్యాన్ని ఎదుర్కోవ‌డానికి త‌న శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు.. అందులో ప్ర‌స్తుతానికి పాక్షిక విజ‌యం సాధించారు.. త్వ‌ర‌లోనే పూర్తి గెలుపు త‌న‌దేన‌నే ధీమా ఆయ‌నలో క‌నిపిస్తోంది..  ఇప్ప‌టికైతే బెయిల్ రాలేదు కానీ.. తాను కోరుకున్న‌ట్టే ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందే అవ‌కాశాన్ని సాధించారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు.. గుంటూరు జైలు నుంచి.. వై కేట‌గిరి సీఆర్‌పీఎఫ్ ర‌క్ష‌ణ‌లో.. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌లో చేరారు.. త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం పొంచి ఉన్న రాష్ట్రం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.. ఏ రాజ్య‌మైతే త‌న‌పై కేసులు క‌ట్టి.. జైలు పాలు చేసిందో.. ఆ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే సుర‌క్షితంగా ఏపీ స‌రిహ‌ద్దులు దాటారు.. ద‌టీజ్ ర‌ఘురామ కృష్ణ‌రాజు అనిపించుకున్నారు... ఈ నాలుగు రోజులు.. ర‌ఘురామ‌కు నాలుగు యుగాలుగా గ‌డిచాయి.. దేశ‌ద్రోహం కేసు పెట్టి.. పుట్టిన రోజు నాడే ఆయ‌న్ను అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ. శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ‌ నివాసంలో అదుపులోకి తీసుకొని.. నేరుగా గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి తీసుకొచ్చారు. రాత్రంతా అక్క‌డే ఉంచి గుచ్చిగుచ్చి ప్ర‌శ్నించారు.  తెల్లారేస‌రికి సీన్ మ‌రింత సితార్ అయింది. శ‌నివారం ర‌ఘురామ అరెస్ట్ ఎపిసోడ్ మ‌రింత కాక రేపింది. త‌న అరెస్ట్ అక్ర‌మ‌మంటూ.. బెయిల్ కోసం శ‌నివారం ఉద‌యం మొద‌ట ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌. కింది కోర్టుకు వెళ్ల‌మంటూ హైకోర్టు సూచించ‌డంతో.. మేట‌ర్ మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది. అక్క‌డ‌.. అస‌లు దారుణం వెలుగులోకి వ‌చ్చింది. శుక్ర‌వారం రాత్రి.. సీఐడీ ఆఫీసులో త‌న‌ను తీవ్రంగా కొట్టారంటూ ర‌ఘురామ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఐదుగురు వ్య‌క్తులు ముఖానికి క‌ర్చీఫ్‌లు ధ‌రించి.. త‌న కాళ్ల‌పై విప‌రీతంగా కొట్టారంటూ.. గాయాల‌ను జ‌డ్జికి చూపించారు. ఆ ఫోటోలూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసి అంతా షాక్‌... ర‌ఘురామ పాదాలకు తీవ్ర గాయాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. కాళ్లు వాచి ఉన్నాయి. గాయాలు చూసి.. మెజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు. వెంట‌నే మెడిక‌ల్ బోర్డు ఏర్పాటు చేసి.. ర‌ఘురామ గాయాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. తొలుత జీజీహెచ్ ఆసుప‌త్రిలో, ఆ త‌ర్వాత ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో ప‌రీక్ష‌లు చేయించాల‌ని ఉత్త‌ర్వులు ఇచ్చారు. శ‌నివారం రాత్రంతా జీజీహెచ్‌లోనే ర‌ఘురామ‌ను ప‌రీక్షించారు వైద్యులు..  కోర్టు ఒక‌లా ఆదేశిస్తే.. పోలీసులు మ‌రోలా వ్య‌వ‌హ‌రించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం జీజీహెచ్ నుంచి ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌కుండానే.. నేరుగా గుంటూరు జైలుకు త‌ర‌లించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. త‌న భ‌ర్త‌ను జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ర‌ఘురామ స‌తీమ‌ణి ర‌మాదేవి ఆరోపించ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది.  ఆదివారం హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు ర‌ఘురామ త‌ర‌ఫు లాయ‌ర్లు.. కోర్టు సైతం త‌మ ఆదేశాల‌ను ఎందుకు దిక్క‌రించారంటూ సీరియ‌స్‌గా స్పందించింది.. మ‌రోవైపు, ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్ట్ సైతం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న కాళ్లు రంగు మారాయి.. వాచి ఉన్నాయి.. కానీ, అవి కొట్ట‌డం వ‌ల్ల అయిన గాయాలు కావంటూ వైద్యులు నివేదిక ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇక, సోమ‌వారం.. ర‌ఘురామ ఎపిసోడ్ సుప్రీం కోర్టుకు చేరింది. ఉద‌యం నుంచి ఒక‌టే ఉత్కంఠ‌. బెయిల్ పిటిష‌న్ వ‌చ్చే శుక్ర‌వారానికి వాయిదా ప‌డినా.. ర‌ఘురామ‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు చేసే అంశంలో మాత్రం సుప్రీం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ర‌మేశ్ హాస్పిట‌ల్ అంటూ ర‌ఘురామ లాయ‌ర్లు వాదించారు. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ చాలంటూ ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు చెప్పారు. చివ‌రాఖ‌రులో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌ను ఫిక్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్త‌ర్యులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు న్యాయ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. మెడిక‌ల్ బోర్డు రిపోర్టును షీల్డ్ క‌వ‌ర్‌లో ఇవ్వాలంటూ ఆదేశించి ఏపీ స‌ర్కారుకు షాక్ ఇచ్చింది...  సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కూ ఆయ‌న అక్క‌డే ఉంటారు. ఏ పోలీసులైతే ర‌ఘురామ‌ను అరెస్ట్ చేసి.. కారులో కుక్కి.. హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు తీసుకెళ్లారో... అదే ఏపీ పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి.. ర‌ఘురామ‌ను కారులో గౌర‌వంగా.. గుంటూరు నుంచి మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు తీసుకు రావ‌డం టోట‌ల్ ఎపిసోడ్‌లోకే హైలైట్ సీన్‌... ఇలా.. హైద‌రాబాద్‌లో మొద‌లైన ర‌ఘురామ అరెస్ట్ ఉదంతం.. ప్ర‌స్తుతానికి మ‌ళ్లీ హైద‌రాబాద్‌కే చేరింది.. ఈ గ్యాప్‌లో నాలుగు రోజుల పాటు.. ఫుల్ హైడ్రామాతో.. క్రైమ్ క‌థా చిత్ర‌మ్ న‌డిచింది.. ప్ర‌స్తుతం ఇంట‌ర్వెల్ సీన్ న‌డుస్తోంది.. ఇప్ప‌టికైతే ర‌ఘురామ కృష్ణ‌రాజే హీరోగా క‌నిపిస్తున్నారు.. విల‌న్ ఎవ‌రో త్వ‌ర‌లోనే తేలనుంది.. క్లైమాక్స్‌లోనూ అదిరిపోయే ట్విస్టులు ఉంటాయా? ర‌ఘురామా బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌స్తారా?  లేక‌, జైలుకే ప‌రిమితం అవుతారా?  లెట్స్ సీ...

హైద‌రాబాద్‌కు ర‌ఘురామ త‌ర‌లింపు.. ప‌ర్య‌వేక్షిస్తున్న ఏపీ సీఎస్‌..

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు. రోడ్డు మార్గంలో ఆయ‌న‌ను కారులో తీసుకు వ‌స్తున్నారు. మొత్తం వ్య‌వ‌హారాన్ని ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. మెయిల్‌, ఫోన్ ద్వారా కోర్టు ఉత్త‌ర్వుల‌ను సీఎస్‌తో పాటు మ‌రో న‌లుగురు అధికారుల‌కు తెలియ‌జేసిన‌ట్టు స‌మాచారం. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌ఘురామ‌.. కారు ఎక్కుతూ మీడియాకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. ఎంపీ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపనుంది. ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు త‌ర‌లింపున‌కు ముందు ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు రఘురామ భార్య రమాదేవి ఫోన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఎస్.. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది.

410మంది గ‌ల్లంతు!.. కొట్టుకుపోయిన నౌకలు.. తుఫాను బీభ‌త్సం..

తౌక్తే. ఇంకా తీర‌మైనా దాట‌లేదు అప్పుడే స‌ముద్రంలో క‌ల్లోలం సృష్టిస్తోంది. భారీ గాలులు, వ‌ర్షాల‌తో దేశ ప‌శ్చిమ తీరంలో తుఫాను బీభ‌త్సం రేపుతోంది. అతిభీకర తుఫానుగా మారిన త‌క్తే తీవ్ర‌త‌తో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అప్రమత్తమైన బృహన్ ముంబై కార్పొరేషన్.. బాంద్రా-వోర్లి సీ లింక్ మీదుగా ప్రయాణించే వారిని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. మ‌రోవైపు.. తుపాను తాకిడికి.. బాంబే హై తీరంలో నిలిపి ఉన్న రెండు బార్జ్‌ల (నౌక‌లు) యాంకర్‌లు తొలగిపోయాయి. దీంతో అవి అలల ధాటికి కొట్టుకుపోతున్నాయి. వీటిల్లో 410 మంది సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన నేవీ సిబ్బంది వారిని రక్షించడం కోసం తక్షణ స‌హాయకచర్యలు చేపట్టారు.  ‘‘బాంబే హై ప్రాంతంలో 273 మంది సిబ్బందితో ఉన్న పీ305 బార్జ్‌ హీరా ఆయిల్‌ ఫీల్డ్స్‌ను వదిలి నీటిపై కొట్టుకుపోతోందని సమాచారం వచ్చింది. దీంతో రెస్క్యూ సేవల కోసం ఐఎన్‌ఎస్‌ కోచి బయల్దేరింది’’ అని నేవీ అధికార ప్రతినిధి ట్విటర్‌లో వెల్లడించారు. ఈ బార్జ్‌ ఓఎన్జీసీ సంస్థకు చెందినది. అయితే తమ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, బార్జ్‌ కూడా స్థిరంగా ఉందని కంపెనీ ప్ర‌క‌టించ‌డం క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తోంది.  ఇక, GAL కన్స్‌ట్రక్టర్‌కు చెందిన మరో బార్జ్ సైతం ముంబయి తీరం నుంచి 8 నాటికైల్‌ మైళ్లు కొట్టుకుపోయినట్లు నేవీకి మరో అత్యవసర సందేశం అందింది. అందులో 137 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సహాయక చర్యల నిమిత్తం ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా నౌక వెళ్లింది. తుపానుకు ముందు బార్జ్‌లన్నింటికీ యాంకర్‌ వేసే ఉందని.. అయితే తౌక్తే ధాటికి యాంకర్లు ఊడిపోయి అవి కొట్టుకుపోయాయని నేవీ తెలిపింది. ఈ బార్జ్‌ల్లోని సిబ్బందిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నౌకాదళ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రపై తీవ్ర ప్ర‌భావం..  తౌక్తే తుపాను కారణంగా గత రాత్రి నుంచి ముంబైలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్టులో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లోకల్‌ రైళ్లను కూడా అధికారులు నిలిపివేశారు. తుపాను కారణంగా కొంకణ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆనంద్‌వాడీ హార్బర్‌లో రెండు బోట్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఒక నావికుడు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇక రాయ్‌గఢ్‌ ప్రాంతంలో భవనం గోడ కూలి ఓ వ్యక్తి చనిపోయారు.  వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. తుపాను మరింత బలపడి.. అతి తీవ్ర తుపానుగా మారినట్టు వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం ముంబైకి 150 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన తుపాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20 కి.మీ.ల వేగంతో ప్ర‌యాణిస్తోంది. తుఫాను సహాయక సన్నద్ధతపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేతో ప్రధాని మోదీ మాట్లాడారు. పునరావాస చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుజ‌రాత్‌, గోవా ముఖ్యమంత్రుల‌తోనూ ప్ర‌ధాని ఫోన్లో మాట్లాడి తుఫాను ప‌రిస్థితులపై ఆరా తీశారు. కేరళలో అధిక తీవ్రత..    కేరళలోనూ తౌక్తే తీవ్రత అధికంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారి కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 9 జిల్లాల్లో తుఫాను ప్రభావం కనిపించింది. భారీ వర్షాలకు అనేక డ్యాంలలో నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మూడు జిల్లాల్లో ఆరంజ్‌ హెచ్చరిక జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.   కర్ణాటకలో భారీ వర్షాలు.. కర్ణాటకలోని ఏడు జిల్లాల పరిధిలో తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఉత్తర కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దాదాపు 200 వరకు ఇళ్లు ధ్వంసం కాగా.. 491 విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.  గోవా గోస.. శనివారం రాత్రి నుంచే గోవాలో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌  సరఫరాకు తీవ్ర అంతరాయం.. విద్యుత్‌ పునరుద్ధరణకు అధికారులు నిరంతరాయంగా పనిచేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.    సోమ‌వారం సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8.30గంటల మధ్య గుజరాత్‌ తీరాన్ని తాకనున్న తుపాను.. రాత్రి  8నుంచి 12గంటల మధ్య పోరుబందర్‌, మహువా వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గుజరాత్‌లోని 17 జిల్లాల్లో లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 54 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.  

ప్ర‌త్య‌ర్థుల‌పై దేశ‌ద్రోహం కేసా? అధికారులు శిక్షార్హులే.. చంద్ర‌బాబు వార్నింగ్‌

ఎంపీ రఘురామకృష్ణరాజుపై తప్పుడు కేసులు పెడితే తాము మాట్లాడకూడదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం చేసినా నిలదీసేందుకు తమ పార్టీ ముందుంటుందన్నారు.  రాష్ట్రం అంటే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదన్నారు. రఘురామ అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదన్నారు. అధికారులు హద్దులు మీరి ప్రవర్తించడం సరికాదని, చట్టానికి లోబడే పనిచేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు కూడా శిక్షార్హులే అవుతారని చంద్రబాబు అన్నారు.   ప్రజాస్వామ్యవాదుల పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యర్థులపై దేశద్రోహం పెడతారని తనకు తెలియదని, మీడియాపైనా రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. వాస్తవాలు రాయకుండా మీడియా నియంత్రణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చట్ట ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు. తామెప్పుడూ కుల ప్రస్తావనతో ఎదురుదాడి చేయలేదని చంద్రబాబు అన్నారు. కోర్టు సెలవులు చూసి మరీ జేసీబీలతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని, హద్దు దాటే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు.