ఈటలకు చెక్ పెట్టేందుకు హరీష్! కేసీఆర్ అస్త్రమా.. అనుమానమా? 

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ కాక రేపుతోంది. తన భవిష్యత్ కార్యాచరణ కోసం ఈటల రాజేందర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండగా... ఆయనకు కౌంటర్ గా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. టీఆర్ఎస్ అనుకూల, ఈటల వర్గీయుల పోటాపోటీ సమావేశాలతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రంజుగా మారుతోంది. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. అతనికి మరింత చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఈటలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి మద్దతు లభిస్తుండటంతో.. గులాబీ బాస్ పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నారని చెబుతున్నారు. ఈటల రాజీనామా చేస్తే జరగబోయే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఈటలను రాజకీయం కోలుకోలేని దెబ్బ తీయాలని భావిస్తున్న కేసీఆర్... హుజురాబాద్ లో  ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారట. అందుకే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారని సమాచారం. మొదటి నుంచి హరీష్ తో ఈటలకు మంచి సంబంధాలున్నాయి. దీంతో హరీష్ నే రాజేందర్ పై ప్రయోగిస్తున్నారని అంటున్నారు. మంగళవారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఈటల కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీగా నా మిత్రునికే బాధ్యతలు అప్పగించారని తెలిసింది అని ఈటల అన్నారు. ఈటల చెప్పిన  ఆయన మిత్రుడు హరీష్ రావేననే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం రెండు రోజుల క్రితం హుజురాబాద్ నియోజకవర్గంలో వివిధ మండలాలకు ఇంఛార్జీలను నియమించింది. నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పార్టీకి అనుకూలంగా కేడర్‌ను ఉంచే బాధ్యతలను జిల్లా మంత్రిగా గంగుల కమలాకర్‌కు అప్పగించింది. ఓవరాల్ గా నియోజకవర్గ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారని తెలుస్తోంది.  కేసీఆర్ ఆదేశాలతో హరీష్ రావు రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళపల్లి రాజేశ్వర్ రావు, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, పిఏసిఎస్ చైర్మన్ పోనగంటి సంపత్, పలువురు సర్పంచ్ లు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ను కలిశారు. తాము టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించారు. ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండా కిందే ఉన్నామని, ఇకపై కూడా అలాగే ఉంటామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా హైడ్రామా నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఒక రోజు ఈటలకు మద్దతు తెలుపుతూ మరోరోజు టీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటున్నారు. దీంతో ఎవరూ ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ లోనే మకాం వేశారు రాజేందర్. దీంతో అప్రమత్తమైన కేసీఆర్.. హరీష్ ను పురమాయించారని అంటున్నారు. కేసీఆర్ ఆదేశాలతో హరీష్ రావు... నేరుగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే జమ్మికుంట గులాబీ లీడర్లు సిద్ధిపేటకు వెళ్లి హరీష్ రావుతో సమావేశమయ్యారు.  ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించిన వెంటనే హరీష్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఈటల, హరీష్ ఇద్దరిపై గులాబీ బాస్ కోపంగా ఉన్నారని, తర్వాత వేటు హరీష్ రావుపైననే చర్చ జరిగింది. కాని టీఆర్ఎస్ లో మాత్రం పరిస్థితి మారిపోయింది. హరీష్ రావుకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత పెరిగింది. వైద్యశాఖ ప్రస్తుతం కేసీఆర్ దగ్గరే ఉండగా.. ఆ బాధ్యతలను హరీష్ రావుకు ఆయన అప్పగించారు. కేంద్రంతో జరిగే సమీక్షల్లో సీఎం తరపున హరీష్ రావే పాల్గొంటున్నారు. తాజా పరిణామాలతో హరీష్ రావు మళ్లీ యాక్టివ్ అయినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు హరీష్ రావునే గులాబీ బాస్ రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు. మరోవైపు తన మిత్రుడినే తనకు పోటీగా దింపారంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలతో హరీష్ రావుకు కొంత ఇబ్బంది తప్పదని చెబుతున్నారు. ఈటలకు తాను సన్నిహితం కాదని నిరూపించుకోవల్సిన ఆవశ్యకత హరీష్ రావుకు ఏర్పడిందంటున్నారు. హుజురాబాద్ లో ఏ మాత్రం తేడా వచ్చిన ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ తప్పవు. ఈ రకంగా హరీష్ రావుకు కేసీఆర్ పరీక్ష పెట్టారనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది .

తెలంగాణలో మే 30 వరకు లాక్ డౌన్ 

తెలంగాణలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల  30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్  తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న జరుప తలపెట్టిన క్యాబినెట్ మీటింగును సిఎం కేసీఆర్ రద్దు చేశారు. తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. ఆ నాలుగు గంటల్లో అన్ని వాణిజ్య కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో లాక్ డౌన్ అమలు తీరుపై హైకోర్టు కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులను అభినందించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ ను సరిగ్గా అమలు చేస్తున్నారంటూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను అభినందించింది హైకోర్టు ధర్మాసనం. 

ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ.. కరోనా కల్లోలంతో యూటర్న్ 

కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్(ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన)లో ఎట్టకేలకు చేరింది తెలంగాణ. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఓ ఎంవోయూ(ఒప్పందం) కుదుర్చుకున్నది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎంవో ఈ విషయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్యాధికారులు ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు సీఎంవో వెల్లడించింది. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కోసం అవసరమైన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ శ్రీ ఎస్ఏఎం రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరేందుకు తొలుత విముఖత చూపింది తెలంగాణ ప్రభుత్వం.  ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ బెటరని చెబుతూ వస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కరోనా చికిత్సకు లబ్దిదారుడు రూ.5 లక్షల వరకు ప్రయోజనం పొందే వీలుంది. అయితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం ఉంటుందని, అదే ఆరోగ్యశ్రీ అయితే 84 లక్షల మంది ప్రయోజనం పొందుతారని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కూడా పలు సార్లు చెప్పారు.  కరోనా నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో కొంతకాలంగా ఆయుష్మాన్ భారత్ లో చేరతామని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు. అనుకున్నట్లుగానే ఆయుష్మాన్ భారత్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. 

కరోనా ఖర్చు తలకు లక్షన్నర..

కరోనా సెకండ్ వేవ్, ఆరోగ్య పరంగానే కాదు, ఆర్థిక పరంగాను, కుటుంబాలను పిండేస్తోంది. సెకండ్ వేవ్’లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఒకటైతే, కుటుంబంలో ఒకరి సోకితే, ఇంటిల్లి పాదినీ చుట్టేస్తోంది. అంతే కాదు, ఈ సారి హాస్పిటల్ కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకరు ఒక ఒక ఆసుపత్రిలో ఇంకొకరు ఇంకొక ఆసుపత్రిలో, ఒకరు ఐసీయులో ఇంకొకరు ఆక్సిజన్ బెడ్ మీద ఇలా ... ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకునే వీలు లేని బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు, కుమిలిపోతున్నాయి.   కుటుంబాల మీద పడుతున్న ఆర్థిక భారం కూడా పేద ప్రజలే కాదు, మధ్య తరగతి ప్రజలకు కూడా భరించ లేని భారంగా మారింది. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విడుదల చేసిన  తాజా నివేదిక ప్రకారం కరోనా సెకండ్‌ వేవ్’లో  సాధారణ ప్రజలపై వైద్య భారం చాలా ఎక్కువగా వుంది. సెకండ్ వేవ్’లో కరోనా సోకినా వారిలో 30 శాతం మందికి పైగా, అనివార్యంగా ఆసుపత్రులలో చేరుతున్నారు. ప్రైవేటు అసుపత్రులలలో చేరిన ప్రతి ఒకరికి, రూ. లక్షన్నర రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు బ్యాంక్ అధ్యయనంలో తేలింది. మరోవంక కుటుంబ ఆరోగ్య వ్యయం 11 శాతం పెరిగింది.ఇదే సమయంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ భారాన్ని సాధారణ ప్రజలు భరించాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించ‌నిప‌క్షంలో.. రాబోయే రోజుల్లో ఇంధన వ్యయం మరింత పెరుగుతుందని, దీని ప్రభావం ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుందని నివేదిక పేర్కొన్న‌ది. రాబోయే నెలల్లో ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయని నివేదిక స్ప‌ష్టం చేసింది. ఖరీదైన మందులు, వైద్య ఉత్పత్తుల కారణంగా భారతీయ కుటుంబాలు మొత్తం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తాయని, కరోనా బాధితుల్లో సగటున 30 శాతం మందికి  ఆసుపత్రీ చికిత్స అనివార్యం అవుతుందని నెవేదిక పేర్కొంది.ఈ 30 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల సేవలను తీసుకున్నందుకు అదనంగా రూ.35 వేల కోట్లు ఖర్చు   చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్న‌ది. ఇవే కాకుండా, లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోవడం వల్ల ప్రజల ఆదాయం రూ.16 వేల కోట్లు తగ్గుతుందని ఎస్‌బీఐ త‌న నివేదిక‌లో తెలిపింది. ఈ విధంగా కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా మొత్తం సాధారణ భారతీయ కుటుంబాలపై రూ. 6 వేల కోట్ల భారం పడుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.

తూతూమంత్రంగా అసెంబ్లీ! బహిష్కరించిన టీడీపీ

ఏపీ శాసనసభ సమావేశాలు రాజకీయ రచ్చగా మారాయి. ఒక రోజు మాత్రమే సభ నిర్వహించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ మండిపడుతోంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తూతూమంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న.. ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. 2 లక్షల 11 వేల ఏపీలో బడ్జెట్‌పై విపులంగా చర్చ జరగాలని, తూతూమంత్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్.. రాష్ట్రంలో వైద్య నిపుణులతో ఒక్కసారి అయినా మీటింగ్ పెట్టారా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ పంపిణీలోనూ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందని విమర్శించారు. మందులు, బెడ్స్, ఆహారం లేక ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. కరోనా సమస్యలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే.. అసెంబ్లీ జరగకుండా ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.  కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారు?.. మార్చిలో 900 కేసులు ఉంటే అప్పుడెందుకు నిర్వహించలేదు? అని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యిందని.. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు పెట్టి బిల్లు ఆమోదించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని.. కానీ ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ సమావేశాలను గతంలో చూశాం.. మరి మార్చిలోనే బడ్జెట్ పెట్టాలి. అప్పుడు టీడీపీ కూడా సమావేశాలు పెట్టమని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. అప్పుడు కరోనా పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కరోనా సమయంలో ఎలా సమావేశాలు నిర్వహిస్తోందని యనుమల ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తోన్న ప్రభుత్వం… మిగిలిన 9 నెలల కాలానికి ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. 2.28 లక్షల కోట్ల రూపాయల నుంచి 2.38 లక్షల కోట్ల రూపాయల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయింది ఏపీ ప్రభుత్వం. గ‌తేడాదిసుమారు 1.82 ల‌క్షల కోట్ల వ్య‌యం కాగా.. ఆదాయం కేవ‌లం 77,560 కోట్లు మాత్ర‌మే అంటున్నారు అధికారులు. గతేడాది 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉందంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆదాయ-వ్యయాలు గతేడాది రీతినే ఉండొచ్చంటోంది ఆర్ధిక శాఖ. బడ్జెట్ లోటును ఏ మేరకు చూపాలనే దానిపై అధికారుల తర్జన భర్జన పడుతున్నారు.   

సైకో మొగుడు.. ఇద్దరు పెళ్ళాలు బలి..  

అది వరంగల్ రూరల్ జిల్లా. పర్వతగిరి మండలం. ఏనుగల్లు గ్రామానికి చెందిన కిరణ్ అల్లరిచిల్లరిగా ఉంటూ..బాధ్యత లేకుండా తిరుగుతుండేవాడు. కొడుకును ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా కిరణ్ పట్టించుకోకపోవడంతో తల్లి దండ్రులు అతని గాలికి వదిలేశారు. అతనిని వదిలేసి మహబూబాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇంకా అతని అల్లరికి అడ్డుఅదుపు లేకుండాపోయింది. కిందమీద పది 2013లో పద్మ అనే మహిళను ప్రేమించాడు. ఆమె కూడా కిరణ్‌ను ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లు బాగానే సాగిన.. ఆ ప్రేమ కాపురం రాను రాను వీరి కాపురంలో కొన్నాళ్లకు కలతలు వచ్చాయి. ఆ కలతల పేరే  అనుమానం.  తన భార్య పద్మ వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని కిరణ్ అనుమానపడ్డాడు. ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవపడ్డాడు. తాను ఎవరితో ఎఫైర్ యవ్వారం  పెట్టుకోలేదని ఆమె ఎంత చెప్పినా.. అతను వినిపించుకోలేదు. అతనెవరో చెప్పాలని భార్యను తిట్టికొట్టి వేధించసాగాడు. ఒకరోజు భార్యాభర్తల మధ్య ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇక  అప్పటికే అనుమానంతో ఉన్న కిరణ్ కి కోపం వచ్చింది.  క్షణికావేశంలో పద్మను కిరణ్ హత్య చేశాడు. అనంతరం.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు ఆ క్రూరుడు..  ఆ తర్వాత భయంతో ఊరొదిలి పారిపోయాడు. ఇదిలా ఉండగా..  కట్ చేస్తే.. 2019లో కిరణ్ కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన అంజలి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి వరకూ తీసుకెళ్లిన కిరణ్ ఆమెతో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. అంజలిని పెళ్లి చేసుకున్న కిరణ్ ఆమె ఇంట్లోనే మూడు నెలల పాటు ఉన్నాడు. అయితే.. భార్య ఏఎన్‌ఎం కావడంతో ఆమె పనిచేసే దగ్గర ఎవరితోనో ఎఫైర్ నడుపుతుందని కిరణ్ మళ్ళీ అనుమానపడ్డాడు. తను అత్తగారింట్లో ఉండకూడదని భావించి.. భార్యతో సహా ఏనుగల్లుకు వెళ్లి అక్కడ కాపురం పెట్టాడు. అయితే.. జులాయిగా తిరుగుతున్న కిరణ్ అప్పటి వరకు ఉన్న అలవాట్లు చాలక కొత్తగా అదనపు కట్నం కోసం అంజలిని వేధించసాగాడు. అత్తమామల పేర ఉన్న ఇంటిని అమ్మి డబ్బు తీసుకురావాలని భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు.. కిరణ్‌లో మరో సైకో కోణం కూడా ఉంది. భార్యను టార్చర్ చేస్తున్న సమయంలో ఫోన్‌లో వీడియోలు తీసి ఆ వీడియోలను తరువాత చూసి పైశాచిక ఆనందం పొందేవాడు. మే 12న రాత్రి సమయంలో కిరణ్ అంజలితో అదనపు కట్నం విషయంలో గొడవపడ్డాడు. ఆమె అఫైర్ నడుపుతోందని భావించి నిలదీశాడు. అంజలి తాను ఏ తప్పు చేయలేదని చెప్పినా వినకుండా ఆమెపై కర్రతో దాడి చేశాడు. కిరణ్ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అంజలిని ఇరుగుపొరుగు వారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 14న చనిపోయింది. అంజలి హత్య కేసులో కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొదటి భార్యను కూడా హత్య చేసినట్లు బయటపడింది. ఇద్దరు భార్యలను హత్య చేసిన కేసులో కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

కేసీఆర్ కు ఘన సన్మానం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం 

తెలంగాణలో ప్రస్తుతం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ మరణాలను ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్షాల ఆరోపణలకు కౌంటరిస్తున్నారు గులాబీ నేతలు. కరోనా సమయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. అంతేకాదు ముఖ్యమంత్రికి ఘనంగా ప్రజా సన్మానం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.  సోమవారం కొవిడ్ కట్టడి చర్యలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో సంగారెడ్డి మొదటిగా ఉంది. దీంతో  సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి కలుస్తానని, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానని వివరించారు.  వైద్య కళాశాల కోసం తన పోరాటం ఇప్పటిది కాదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూడేళ్లుగా పోరాడుతున్నానని, తన కుమార్తెతో కలిసి అసెంబ్లీకి పాదయాత్ర కూడా చేశానని వెల్లడించారు. వైద్య కళాశాలకు సీఎం రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ రోజున కేసీఆర్ కు భారీ ఎత్తున సన్మానం చేస్తానని చెప్పారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని క్లారిటీ ఇచ్చారు జగ్గారెడ్డి. 

ఏపీ సర్కార్ హ్యాండ్సప్.. నెల్లూరులో సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్

ఆంధ్రప్రదేశ్ కరోనా కల్లోలంతో అల్లాడుతోంది. దేశంలో ప్రస్తుతం రోజువారి కరోనా మరణాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏపీలో పాజిటివిటి రేటు కూడా ప్రమాదకరంగా ఉందని కేంద్ర వైద్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా కొవిడ్ రోగుల చికిత్స విషయంలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ కోసం అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో.. కొందరు బాధితులు సోనూ సూద్ ను ఆశ్రయిస్తున్నారు.  దేశంలో ప్రస్తుతం మనసున్న మారాజుగా నిలిచారు సోనూ సూద్. ఎవరూ సాయం అడిగినా వెంటనే స్పందిస్తున్నారు. సాయం కావాళ్లన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా తన సేవలను విస్తరించారు. ఏ ప్రాంత నుంచి తనకు అభ్యర్థన వచ్చినా వెంటనే వారికి సాయం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలే అందరికీ సాయం చేయాలి.. కానీ ఆ ప్రభుత్వాలు కూడా సోనూ సూద్ సాయం కోరుకుతున్నాయి అంటే.. అతడు చేస్తున్న సేవ ఎలాంటిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ జనరేటర్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు రియల్ హీరో. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్.. విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.  నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో చనిపోయారు.. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణమైంది. దీంతో తీవ్ర కలత చెందిన సోనూ సూద్ మిత్రుడు సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లాడు. సోనూతో ఫోన్‌లో మాట్లాడించాడు. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, లేదంటే కావలిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నారు. సోనూ ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను సూద్ అందిస్తున్నారని చెప్పారు. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

11 కాదు, 30మందికిపైగా మృతి.. రుయా ఘ‌ట‌న‌పై ఫిర్యాదు.. జ‌గ‌న్ స‌ర్కారుకు షాక్‌..

తిరుప‌తి రుయా ఘ‌ట‌న‌ జాతీయ మానవ హ‌క్కుల సంఘానికి చేరింది.  రుయాలో ఆక్సిజ‌న్ కొర‌త‌తో 11మంది క‌రోనా బాధితులు మృతి చెందార‌ని ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. అయితే, ప్ర‌భుత్వం 11 మందే అని చెబుతున్నా.. రుయా ఘ‌ట‌న‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌తో 30 మందికి పైగా మృతి చెందార‌ని తిరుప‌తి మాజీ ఎంపీ చింతా మోహ‌న్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నిజ‌మైతే తీవ్ర మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న అవుతుంద‌ని ఎన్‌హెచ్ఆర్‌సీ వ్యాఖ్యానించింది. ఘ‌ట‌న‌పై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని ఏపీ ఆరోగ్య శాఖ‌ను ఆదేశించింది.   మ‌రోవైపు.. ఇప్ప‌టికే తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కొవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని పిటిషన్‌లో కోరారు. రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషియ‌ల్ విచారణ జరిపించాలని పిల్‌లో తెలిపారు. రుయా ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని, కొవిడ్ బాధితులకు మందులు, ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు ఆలస్యం లేకుండా  రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించాలంటూ పిటిష‌న‌ర్ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఇటీవ‌ల ఆక్సిజ‌న్ అంద‌క తిరుప‌తి రుయా హాస్ప‌టిల్‌లో 11మంది కొవిడ్‌ పేషెంట్స్‌ ప్రాణాలు వ‌దిలిన విష‌యం తెలిసిందే. మృతుల సంఖ్య‌పైనా ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌మిళ‌నాడు నుంచి రావాల్సిన ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ ఆల‌స్యం కావ‌డంతో.. రుయాలో ప్రాణ‌వాయువు నిలిచిపోయి.. కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌భుత్వ ఉదాసీన‌త వ‌ల్లే ఆ మ‌ర‌ణాలు సంభ‌వించాయంటూ.. అందుకు స‌ర్కారుదే బాధ్య‌త అంటూ విప‌క్షాలు ఆరోపించాయి. ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను స‌మ‌కూర్చుకోలేని చేత‌గాని స‌ర్కారు అంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా, రుయా ఆసుప‌త్రి ఘ‌ట‌న‌పై ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేయ‌డం.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి,  జ్యూడిషియ‌ల్ విచార‌ణ జ‌ర‌పాలంటూ హైకోర్టులో పిల్ దాఖ‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు దోషిగా బోనులో నిల‌బ‌డ‌క త‌ప్పేలా లేదు.

కేటీఆర్ కు డాక్టర్ ట్వీట్..  హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ హైక్ 

తెలంగాణ‌లోని హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు హెల్త్ సెక్ర‌ట‌రీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌గా, వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.  స్టైఫండ్ హైక్ కోసం గతంలో చాలా సార్లు పోరాటం చేశారు హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌ు. వైద్యాధికారులు కూడా వారికి హామీ ఇచ్చారు. కాని అది నెరవెరలేదు. అయితే ఒక్క డాక్టర్ చేసిన ట్వీట్ తో వారి సమస్య పరిష్కారమైంది.  స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు  కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. సార్ క‌రోనా క‌ష్ట‌కాలంలో మీరు ఎంద‌రికో స‌హాయం చేసుకున్నారు. కానీ రెసిడెంట్ డాక్ట‌ర్లు క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ఆస్ప‌త్రుల్లో నిరంత‌రం సేవ‌లందిస్తున్నారు. గ‌త నాలుగు నెల‌ల నుంచి త‌మ‌కు జీతాలు అంద‌డం లేదు. కొవిడ్ డ్యూటీల‌కు హాజ‌రైన వారికి ఇతర రాష్‌ర్టాల్లో ప్రోత్స‌హ‌కాలు ఇస్తున్నారు. అలాంటివి కూడా త‌మ‌కు అంద‌డం లేదు. త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెడుతున్నాం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాము ఎలా వ‌ర్క్ చేయ‌గలం సార్ ట్వీట్ చేశారు. డాక్టర్ స్నేహ సోమారెడ్డి  ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల స‌మ‌స్య‌ల‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాల‌ని హెల్త్ సెక్ర‌ట‌రీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.  జీవో విడుద‌ల అవుతుంద‌ని కేటీఆర్ రీట్వీట్ చేశారు.  కేటీఆర్ చెప్పినట్లుగానే  హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌కు స్టైఫండ్ 15 శాతం పెంచుతూ  ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.  

ప్రేమ విఫలం.. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యయత్నం

అది ఖమ్మం జిల్లా. ముదిగొండ మండలం. గోకినేపల్లి గ్రామానికి చెందిన  ఓ యువతి అదే గ్రామానికి చెందిన దరిపల్లి రాజుతో ప్రేమలో పడింది.. ఆ సమయంలో ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. దాదాపు ఐదు సంవత్సరాలుగా వారి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఈ మధ్యన తనను పెళ్లి చేసుకోవాలని చెప్పింది ఆ యువతి. అప్పటి నుండి ఆ యువతీ ఎంత చెప్పినా వినకుండా ముఖం చాటేసుకొని తిరుగుతున్నాడు రాజు.. ఆమె చాలా సార్లు పలకరించింది అయినా ఫలితం లేదు.. ఇలా కాదు అని ఆ యువతి ఒక నిర్ణయానికి  వచ్చింది. న్యాయం కోసం చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది,.   అతడితో తనకు వివాహం జరిపించాలని గత నెల 25న ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. తనకు తల్లిదండ్రులు లేరని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆమె మనస్తాపం చెందింది. ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడం.. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందింది. దీంతో మంగళవారం ముదిగొండ పోలీసల్ స్టేషన్ కు పరుగు మందు డబ్బా పట్టుకొని వచ్చింది. పోలీస్ స్టేషన్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని చికిత్స నిమిత్తం పోలీసులు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి నుంచి ముదిగొండ పోలీస్ స్టేషన్ కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ముదిగొండ పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే చికిత్స పొందుతున్న ఆమె తనకు న్యాయం చేయాలని కోరింది. కరోనా ఒక వైపు.. భార్య కాన్పుకు మరోవైపు.. డబ్బులు లేక చివరికి  ఉరి..    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుంతలం చేసింది. కరోనాసెకండ్ వేవ్ తో ప్రజలపై విరుచుకుపడింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యుడికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయింది. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆరు నెలలుగా డబ్బులు లేక తన భార్య కాన్పుకు సంబంధించి డెలివరీకి డబ్బులు లేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నికి సంబంధించిన పూర్తి వివరాలు సిద్దిపేట టూ టౌన్​ సీఐ పరుశురాంగౌడ్​ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చందాపూర్​ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా సిద్దిపేటలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. కరోనా, లాక్​డౌన్​ఎఫెక్ట్​తో ఆటో నడవక, దాని ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టేందుకు బైక్​ను అమ్మేశాడు. దీనికితోడు భార్య డెలివరీ టైం దగ్గరపడడంతో వారం క్రితం ఆమెను టౌన్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్​ చేశాడు. ఆదివారం ఆమెను డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తనలో తను మదనపడుతూ మానసికంగా కుంగిపోయాడు. చేతిలో పైసలు లేవనే బాధలో పత్తి మార్కెట్ దగ్గర లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రశాంత్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అంజలి కన్నీరుమున్నీరయ్యింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రశాంత్​ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భయమే చంపేసింది.. 

అతడు ఒక ఉపాధ్యాయుడు. అతని పేరు లోకేష్. అతనికి సంవత్సరం కింద పెళ్లి అయింది. ఆ ఉపాద్యాయుడు మొదటి నుండే భయస్తుడు. అతనికి ఈ మధ్య కాలం లో అతనికి కరోనా వచ్చింది. ఇక అంతే   అతడు సినిమాలోని ఓ సీన్ రిపీట్ అయింది. అతడు సినిమాలో త్రివిక్రమ్ ఇచ్చిన డెఫినేషన్ గుర్తుండే ఉంటుంది. ‘దెయ్యం కంటే భయం మా చెడ్డది’. ఇది అక్షర సత్యం.  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ నృత్యం చేస్తున్న ఈ తరుణంలో కరోనా భయం చాలా మందిని  బలితీసుకుంటోంది. కరోనా సోకితే ఖతమే అన్న భ్రమలో, ప్రజలు  ఆందోళనల చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా కొందరు భయాందోళనలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సింది పోయి.. భయానికి తమ జీవితాలను అప్పగిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. అదేంటో మీరే చూడండి.  అది కర్ణాటకలోని మైసూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. మైసూరు జిల్లాలోని కేఆర్‌నగర్ పరిధిలో ఉన్న కోగిలూరు గ్రామానికి చెందిన లోకేశ్(26) ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. లోకేశ్‌కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహమైంది. లోకేశ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ మొదటి నుంచి కొంత భయస్తుడు. ఈ మధ్య లోకేశ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ తనకు భయంగా ఉందని కుటుంబ సభ్యుల వద్ద వాపోయాడు. ఏం పర్లేదని, చాలామంది కరోనా నుంచి కోలుకున్నారని.. కంగారు పడొద్దని కుటుంబ సభ్యులు లోకేశ్‌కు ధైర్యం చెప్పారు. వైద్యశాఖ అధికారులు కూడా భయపడవద్దని, సక్రమంగా మందులు తీసుకుంటూ.. పౌష్టికాహారం తింటే కరోనాను జయించవచ్చని లోకేశ్‌కు చెప్పారు. ఇలా ఎంతమంది చెప్పినా లోకేష్‌ను కరోనా భయం వదల్లేదు. మాములుగానే కొంత భయస్తుడు కావడంతో కరోనా మహమ్మారి అతనిని మరింత భయపెట్టింది. మూడు రోజులుగా కరోనా సోకిందన్న భయంతో తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ కోగిలూరు నుంచి అత్తారింట్లో ఉన్న భార్య దగ్గరకు వెళతానని ఇంటి దగ్గర చెప్పాడు. వైరస్ సోకిందని.. ఇప్పుడు వెళ్లవద్దని ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. బైక్‌పై అత్తారింటికి వెళ్లాడు. ఇంటి ముందు బైక్ ఆపి.. ఇంట్లో ఎవరినీ కలవకుండా తన దగ్గర ఉన్న ఫోన్‌ను ఇంట్లో పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన లోకేశ్ ఎంతకూ తిరిగిరాకపోవడంతో భార్య, అత్తమామలు అతని కోసం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో లోకేశ్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు హాసన్ జిల్లాలోని కేరళపుర దగ్గర ఉన్న కావేరినది దగ్గర లోకేశ్ మృతదేహాన్ని గుర్తించారు. కరోనా సోకిందన్న మనోవేదనతో కావేరి నదిలో దూకి లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చారు. ఇలా ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న లోకేశ్ జీవితం కరోనా భయం వల్ల అర్ధాంతరంగా ముగిసిపోయింది. కరోనా సోకినప్పటికీ భయపడవద్దని, ఆత్మ స్థైర్యంతో మహమ్మారిని జయించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

ఎంత వారుగానీ.. కాంత దాసులే.. బిల్.. జిల్ జిల్ జిగేట్స్‌

ప్ర‌పంచ కుబేరుడు. చూట్టానికి సింపుల్‌గా.. స్మార్ట్‌గా ఉంటారు. అమాయ‌కంగా, న‌వ్వుతూ క‌నిపిస్తారు. హుందాగా, ద‌ర్పంగా వెలిగిపోతారు. మైక్రోసాఫ్ట్ అధినేత‌గా బిల్ గేట్స్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ. మిలిండాతో విడాకుల వ్య‌వ‌హారంతో గేట్స్‌.. పాపులారిటీ ఒక్క‌సారిగా మ‌స‌క‌బారింది. వాళ్లు అందుకే విడిపోతున్నారంటూ.. ప‌లు క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. తాజాగా, వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించిన ఓ స్టోరీతో బిల్ గేట్స్ య‌వ్వారం మ‌రింత ర‌స‌కందాయంలో ప‌డింది. ఆయ‌నా.. ఆ టైపేనంటూ.. ఎంత వారుగానీ కాంత దాసులే అంటూ వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ ఓ పాత ఎఫైర్‌ను కొత్త బ్రేకింగ్ న్యూస్‌గా మార్చివేసింది.  20 ఏళ్ల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్‌ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాం శమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్ క‌థనం  ప్రచురించింది.  2019 ద్వితీయార్ధంలో మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు ఓ లేఖ అందింది. బిల్‌గేట్స్‌ కొన్నేళ్ల పాటు తనతో శారీరక సంబంధం నెరిపారంటూ మైక్రోసాఫ్ట్‌ మహిళా ఇంజనీరు ఒకరు ఆ లేఖలో ఆరోపణలు చేశారు. దాంతో కంపెనీ బోర్డు ఓ న్యాయవాద సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించింది. రాసలీలల ఆరోపణల నేపథ్యంలో బిల్‌గేట్స్‌ బోర్డులో కొనసాగడం తగదని కొందరు డైరెక్టర్లు భావించారు. అయితే దర్యాప్తు పూర్తి చేసి, తుది నిర్ణయం తీసుకునే లోపే గేట్స్‌ బోర్డు నుంచి తప్పుకున్నారనేది ఆ స్టోరీ సారాంశం.   వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నంపై మైక్రోసాఫ్ట్ సైతం స్పందించింది. ఇరవై ఏళ్ల నాటి ఆ వ్యవహారం సామరస్యపూర్వ‌కంగానే పరిష్కారమైందని తెలిపింది. బోర్డు నుంచి వైదొలగడానికి దానితో ఎలాంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి చెప్పారు. దర్యాప్తులో ఏం తేలిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దాతృత్వ కార్యక్రమాల కోసం మరింత సమయం వెచ్చించేందుకు మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు 2020 మార్చిలో బిల్‌గేట్స్‌ ప్రకటించారు.  తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్‌, మిలిండా ఈ మ‌ధ్య‌నే ప్ర‌క‌టించారు. ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్ప‌టి నుంచి బిల్ గేట్స్ జీవితంపై పలుర‌కాల క‌థ‌నాలు.. ప‌లు కోణాలు.. వెలుగు చూస్తున్నాయి. 

షర్మిల పార్టీకి తాళం వెనుక పీకే? షాక్ మాములుగా లేదుగా.. 

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ దూసుకొచ్చింది వైఎస్ షర్మిల. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడమే కాదు... వరుస సమావేశాలతో హడావుడి చేసింది జగనన్న బాణం. జిల్లాల వారీగా నేతలతో చర్చలతో పాటు ఖమ్మంలో సంకల్ప సభ కూడా నిర్వహించింది. వైఎస్సార్ జయంతి అయిన జూలై8న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపింది షర్మిల. అంతేకాదు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగి హంగామా చేసింది. దీక్షను పోలీసులు అడ్డుకోవడం, అయినా ఆమె పాదయాత్ర చేయడం.. పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకోవడం.. అంతా రచ్చరచ్చైంది. ట్విట్టర్ వేదికగానూ కేసీఆర్ పని తీరుపై ఘాటుగానే విమర్శలు చేస్తోంది షర్మిల. కొంత మంది నేతలు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో .. కొత్త పార్టీపై జనాల్లోనూ జోరుగా చర్చ జరిగింది.  షర్మిల పార్టీ దూకుడు పెరుగుతుండగానే సడెన్ గా సీన్ మారిపోయింది. లోటస్ పాండ్ లోని షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడింది. కార్యకర్తలెవరు రావొద్దని షర్మిల పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. పార్టీ కార్యాలయానికి తాళం పడటంతో అంతా షాక్. కొవిడ్ కారణంతో మూసివేస్తున్నామని షర్మిల అనుచరులు చెబుతున్నా.. ఏదో జరిగిందనే చర్చే జరుగుతోంది. ఎందుకంటే కొవిడ్ పరిస్థితుల్లోనూ అన్ని పార్టీల కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూనే వివిధ పార్టీల నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల.. కార్యాలయానికి సడెన్ గా లాక్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయానికి పడిన తాళం తాత్కాలికమా... సంపూర్ణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల పార్టీకి తాళం పడటంపై మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  పీకే వల్లే షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడిందనే ప్రచారం జరుగుతోంది. పీకే... అంటే ప్రశాంత్ కిశోర్. దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా ఆయన ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేను ఆయన పని చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నిఎత్తులు వేసినా.. పీకే ముందు పారలేదు. బెంగాల్ లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. పీకే టీమ్ వర్క్ వల్లే జగన్ పార్టీకి ఘన విజయం దక్కిందని అంటారు. అంతటి పీకే... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వ్యూహకర్తగా ఏ పార్టీకి ఎక్కడా పనిచేయబోనని ప్రకటించారు. ఇదే షర్మిల పార్టీ కార్యాలయం తాళానికి కారణమంటున్నారు.  తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిలకు.. ఎన్నికల వ్యూహకర్తగా పీకే ఉంటున్నారనే ప్రచారం జరిగింది. షర్మిల పార్టీ తెరపైకి రాగానే.. పీకే తెరపైకి వచ్చారు. కొత్త పార్టీ కార్యాచరణపై ప్రశాంత్ కిషోర్ తో షర్మిల చర్చించారని, జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే ప్రచారం జరిగింది. తెలంగాణలో షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ఉండేలా పీకేను జగన్ ఒప్పించారని కొందరు వాదించారు. త్వరలోనే పీకే టీమ్ షర్మిల కోసం పని చేస్తుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పీకే జెండా ఎత్తేయడంతో షర్మిల షాకైందని అంటున్నారు. పీకే సహకారం లేకుండా ముందుకు వెళ్లలేమని భావిస్తున్న షర్మిల... కొత్త పార్టీపై కొంత సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఆమెకు ఇబ్బందిగా మారాయంటున్నారు.  టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న రాజేందర్.. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలు, తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈటల. కొంత ఆలస్యమైనా రాజేందర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు ఈటలకు సపోర్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు కూడా రాజేందర్ తో చర్చలు జరిపారు. కొండా దంపతులను తన పార్టీకి రమ్మని గతంలో షర్మిల ఆహ్వానించినా వారు నిరాకరించారు. ఇప్పుడు వాళ్లు రాజేందర్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీ పెడితే.. తమకు తెలంగాణ పాలిటిక్స్ లో ఏ మాత్రం స్పెస్ ఉండదనే ఆందోళనలో షర్మిల ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ వ్యతిరేకులు కొందరు తమతో కలిసి వస్తారని గతంలో షర్మిల భావించారు. కాని రాజేందర్ ఎంట్రీతో అటువంటి వాళ్లంతా ఆయనతోనే వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడటానికి కారణమని చెప్పుకుంటున్నారు .

షర్మిల పార్టీకి తాళం వెనుక పీకే? షాక్ మాములుగా లేదుగా..

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ దూసుకొచ్చింది వైఎస్ షర్మిల. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడమే కాదు... వరుస సమావేశాలతో హడావుడి చేసింది జగనన్న బాణం. జిల్లాల వారీగా నేతలతో చర్చలతో పాటు ఖమ్మంలో సంకల్ప సభ కూడా నిర్వహించింది. వైఎస్సార్ జయంతి అయిన జూలై8న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపింది షర్మిల. అంతేకాదు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగి హంగామా చేసింది. దీక్షను పోలీసులు అడ్డుకోవడం, అయినా ఆమె పాదయాత్ర చేయడం.. పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకోవడం.. అంతా రచ్చరచ్చైంది. ట్విట్టర్ వేదికగానూ కేసీఆర్ పని తీరుపై ఘాటుగానే విమర్శలు చేస్తోంది షర్మిల. కొంత మంది నేతలు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో .. కొత్త పార్టీపై జనాల్లోనూ జోరుగా చర్చ జరిగింది.  షర్మిల పార్టీ దూకుడు పెరుగుతుండగానే సడెన్ గా సీన్ మారిపోయింది. లోటస్ పాండ్ లోని షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడింది. కార్యకర్తలెవరు రావొద్దని షర్మిల పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. పార్టీ కార్యాలయానికి తాళం పడటంతో అంతా షాక్. కొవిడ్ కారణంతో మూసివేస్తున్నామని షర్మిల అనుచరులు చెబుతున్నా.. ఏదో జరిగిందనే చర్చే జరుగుతోంది. ఎందుకంటే కొవిడ్ పరిస్థితుల్లోనూ అన్ని పార్టీల కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూనే వివిధ పార్టీల నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల.. కార్యాలయానికి సడెన్ గా లాక్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయానికి పడిన తాళం తాత్కాలికమా... సంపూర్ణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల పార్టీకి తాళం పడటంపై మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  పీకే వల్లే షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడిందనే ప్రచారం జరుగుతోంది. పీకే... అంటే ప్రశాంత్ కిశోర్. దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా ఆయన ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేను ఆయన పని చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నిఎత్తులు వేసినా.. పీకే ముందు పారలేదు. బెంగాల్ లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. పీకే టీమ్ వర్క్ వల్లే జగన్ పార్టీకి ఘన విజయం దక్కిందని అంటారు. అంతటి పీకే... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వ్యూహకర్తగా ఏ పార్టీకి ఎక్కడా పనిచేయబోనని ప్రకటించారు. ఇదే షర్మిల పార్టీ కార్యాలయం తాళానికి కారణమంటున్నారు.  తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిలకు.. ఎన్నికల వ్యూహకర్తగా పీకే ఉంటున్నారనే ప్రచారం జరిగింది. షర్మిల పార్టీ తెరపైకి రాగానే.. పీకే తెరపైకి వచ్చారు. కొత్త పార్టీ కార్యాచరణపై ప్రశాంత్ కిషోర్ తో షర్మిల చర్చించారని, జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే ప్రచారం జరిగింది. తెలంగాణలో షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ఉండేలా పీకేను జగన్ ఒప్పించారని కొందరు వాదించారు. త్వరలోనే పీకే టీమ్ షర్మిల కోసం పని చేస్తుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పీకే జెండా ఎత్తేయడంతో షర్మిల షాకైందని అంటున్నారు. పీకే సహకారం లేకుండా ముందుకు వెళ్లలేమని భావిస్తున్న షర్మిల... కొత్త పార్టీపై కొంత సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఆమెకు ఇబ్బందిగా మారాయంటున్నారు.  టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న రాజేందర్.. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలు, తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈటల. కొంత ఆలస్యమైనా రాజేందర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు ఈటలకు సపోర్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు కూడా రాజేందర్ తో చర్చలు జరిపారు. కొండా దంపతులను తన పార్టీకి రమ్మని గతంలో షర్మిల ఆహ్వానించినా వారు నిరాకరించారు. ఇప్పుడు వాళ్లు రాజేందర్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీ పెడితే.. తమకు తెలంగాణ పాలిటిక్స్ లో ఏ మాత్రం స్పెస్ ఉండదనే ఆందోళనలో షర్మిల ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ వ్యతిరేకులు కొందరు తమతో కలిసి వస్తారని గతంలో షర్మిల భావించారు. కాని రాజేందర్ ఎంట్రీతో అటువంటి వాళ్లంతా ఆయనతోనే వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడటానికి కారణమని చెప్పుకుంటున్నారు .

హుజురాబాద్ నుంచి  ఈటల సమర శంఖం ?

రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్’ అయిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, భవిష్యత్ వ్యూహం ఏమిటి? ఈ ప్రశ్నకు ఆయన ఇంతవరకు ఎక్కడా, స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. కానీ, ఈ రోజు సొంత గడ్డ హుజురాబాద్ ‘ వేదికగా, ఈటల స్పష్టత ఇవ్వడమే కాదు, తెరాస లక్ష్యంగా శంఖారావం పూరించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆయన మీడియా మీట్ నిర్వహించారు. తెరాస నాయకులు, మంత్రులు, ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ తనపై ఎంతగా విమర్శలు చేసినా, ఇంతవరకు, ఎక్కడా పరుషంగా ఎవరినీ ఒక్క మాటైనా అనని ఈటల ఈరోజు, మంత్రి గంగుల పై విరుచుపడ్డారు. ‘బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు, హుజురాబాద్ ప్రజలను వేధిస్తే వదిలేది లేదని అన్నారు. గంగుల గుట్టురట్లు అన్నీ బయట పెడతానని హెచ్చరించారు. ‘నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు’ అంటూ గంగులపై వరస అస్త్రాలను సంధించారు.  అంతే కాదు, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే, వ్యూహంతో తెరాస టికెట్ పై గెలిచిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి, అక్కడి నుంచే కొత్త భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టే వ్యూహాన్ని ఈటల ఈ రోజు అవిష్కరించారు. నాగర్జున సాగర్’లో చేసినట్లు ఇక్కడ చేద్దామంటే, ప్రజలు పాతరేస్తారని తెరాస నాయకులకు గట్టి హెచ్చరిక చేయడం ద్వారా, ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీకి ఈటల సిద్దమవుతున్నారు. అలాగే, అయన మొదటి నుంచి వినిపితున్న ఆత్మ గౌరవం నినాదమే, ప్రధాన అస్త్రంగా యుద్దానికి సిద్దమవుతున్న సంకేతాలు  కూడా, ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటల  2006లో కరీంనగర్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా.. ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా అదే జరుగుతుందని, అంటూ, ప్రస్తుత తెరాసను అప్పటి కాంగ్రెస్’తో పోల్చారు.అలాగే, ఆత్మగౌరవ బావుటా ఎగరేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నరని పేర్కొన్నారు.అలాగే, గంగుఅల్ సహా తనపై విమర్శలు చేస్తున్న నాయకులకు కూడా అయన గట్టి వార్నింగ్ ఇచ్చారు, తను సహనం పాటిస్తున్నానని, అదే  కోల్పోతే మాడి మసి అయిపోతారు’ అంటూ ఈటల మాజీ సహచరునిపై మిస్సైల్స్ ఫైర్ చేశారు. ఇంతవరకు వన్ సైడెడ్’గా సాగిన కేసీఆర్ వెర్సెస్ ఈటల వార్, ఇక ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ... చూడవలసి వుంది.

2.4 కిలోల బంగారం స్వాధీనం.. 

బంగారం ఆ పేరు వింటే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని  ఉత్సహం, ఎందుకంటే ఆ బంగారు మేడలో వేసుకుంటే అందం తో పాటు ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఆ విషయం అందరికి తెలిసిందే.. ఆ బంగారాన్ని ఈ మధ్య కాలంలో బాగా సరఫరా చేస్తున్నారు. తాజాగా  దుబాయ్‌ నుంచి ఇద్దరు ప్రయాణికులు రహస్యంగా తీసుకొస్తున్న బంగారాన్ని సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 2.4 కిలోల బరువు గల బంగారం బిస్కెట్లను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్యాంట్ల లోపలి భాగంలో పెట్టుకున్నారు. వారి తీరుపై అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోదా చేయగా బంగారం గుట్టురట్టయింది. సుమారు రూ.1.2 కోట్ల విలువ చేసే బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.     విశాఖ లో గంజాయి ముఠా అరెస్ట్..  గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠా విశాఖ జిల్లాలో బీభత్సం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఎలమంచిలి వైపు నుంచి అనకాపల్లి వైపునకు వేగంగా వచ్చిన ఓ కారు కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్ద మహిళను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అదే వేగంతో ముందుకు వెళ్లిన కారు ‘యు’ టర్న్‌ తీసుకొనే క్రమంలో డివైడరుపైకి దూసుకెళ్లడంతో టైర్లు పేలిపోయాయి. వాహనంలో ఉన్న ఇద్దరు నిందితులు కిందకు దిగి అటుగా వస్తున్న లారీని నిలిపి కత్తులతో బెదిరించి ఎక్కడానికి ప్రయత్నించారు. క్లీనర్‌ వారిని నెట్టేయడంతో లారీ ముందుకు వెళ్లిపోయింది. అనంతరం ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని కత్తితో బెదిరించి, గాయపరిచి అతని వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. జాతీయ రహదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును పరిశీలించగా అందులో సుమారు వంద కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. కారు ఢీకొని అపస్మారక స్థితికి చేరుకున్న గ్రామానికి చెందిన కలిగట్ల లక్ష్మి (35)ని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.    

పెండింగ్’లో పీఅర్సీ  ఉద్యోగులకు పాత జీతాలే 

పీఅర్సీ సవరణతో పెరిగిన జీతాలు అందుకునేందుకు, ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం మరో మారు నీళ్ళు చల్లింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మరీ ముఖ్యమంత్రి, చంద్రశేఖర రావు, గత మార్చిలో జరిగిన శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో పీఅర్సీ ప్రకటన చేశారు.  30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి సవరించిన పీఆర్సీ అమలులోకి వస్తుందని ముఖ్యంత్రి శవంగా సభలో ప్రకటించారు. అయితే, మే నెలలలో పెరిగిన జీతాలపై ఆశలు పెంచుకున్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. గతంలోలోనూ పీఆర్సీ ఇలా ఒక నెల లేటుగా అమలైన సందర్భాలు ఉన్ననేపధ్యంలో, కనీసం జూన్ నెలలో అయినా ఎరియర్స్’తో సహా పెరిగిన జీతాలు వస్తాయని అనుకుంటే, తాజా సమాచారం ప్రకారం, ఇంత  వరకు పీఆర్సీ ఫైల్ మీద ముఖ్యమంత్రి సంతకమే కాలేదు. జీవోలు జారీకాలేదు. అంటే, జూన్ నేలలోనూ పాత జీతాలే, వస్తాయని, ఉద్యోగులు ఉసూరు మంటున్నారు.    అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’కు కోవిడ్ సోకడంతో  ఆయన 20 రోజులకు పైగా, ఫార్మ్ హౌస్ ‘కే పరిమితం అయ్యారు. ఈ కారణంగా పీఅర్సీ   ఫైల్ పెండింగ్’లో పడిందని, ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఉద్దేశ పూర్వకంగానే ముఖ్యమంత్రి ఫైల్’ ను పెండింగ్’లో పెట్టారని ఉద్యోగులు అనుమానిస్తున్నారు.మరోవైపు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పెరిగిన వేతనాలను ప్రస్తుతానికి ఇచ్చే ఇచ్చే పరిస్థితి లేదని,  పాత వేతనాల ప్రకారమే బిల్లులు రెడీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు మౌఖిత ఆదేశాలు అందినట్లు ఉద్యోగ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో, పీఆర్సీ కి మోక్షం ఎప్పుడో ... అసలు వస్తుందో, రాదో అని కూడా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్ర  రాబడికి  కరోనా కాటు.. 

తెలంగాణ ప్రభుత్వం లెక్క తప్పింది. రాష్ట్రం ఆశించిన ఆదాయానికి కరోనా భారీగా గండి కొట్టింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) రాష్ట్ర ప్రభుత్వం భారీ  ఆశలు, అంచనాలతో రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అయితే, ఆతర్వాత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం  బడ్జెట్ అంచనాలను రూ. 1.76 లక్షల కోట్లకు సవరించింది. చివరాఖరుకు, తాజాగా కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వార్షిక ఆదాయం రూ.1.45 లక్షల కోట్ల వద్దే ఆగిపోయింది. అందులోనూ,రూ. 45,638 కోట్లు ఆదాయం పద్దులో చూపిన అప్పులే ఉన్నాయి.అంటే, రాష్ట్ర వాస్తవ ఆదాయం లక్ష కోట్ల ((రూ.99,903కోట్లు)లోపే ఉంది. అయితే, కరోనా మహమ్మారి, సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో, అంచనాలు తప్పు కావడం, తల్ల కిందులు కావడం తప్పు కాదు. ప్రభుత్వం చేతకాని తనమో, వైఫల్యమో కానే, కాదు. ఒక విధంగా కరోనా మహామ్మారి పుణ్యాన,ఇంచుమించుగా  ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నాయి. అందుకు మన దేశం, మన రాష్ట్రం మినహాయింపు కాదు. అయితే, వాస్తవాలను ప్రజల నుంచి  దాచే ప్రయత్నం చేయడం మాత్రం సరి కాదు. సరే, అదలా, ఉంటే  కాగ్’ చూపిన వివరాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో రెండే రెండు పద్దుల కింద మాత్రమే ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. అందులో మొదటిది, రాష్ట్రానికి కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో వచ్చిన ఆదాయం అయితే, రెండవది అప్పులు రూపంలో వచ్చిన ఆదాయం.కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రూ.10,525 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అయితే అంచనాను మించి కేంద్రం నుంచి  రూ.15,471 కోట్ల రాబడి వచ్చింది. అలాగే, అప్పుల ద్వారా రూ.33,191 కోట్లు రాబడి వస్తుందని అంచవేస్తే, అది రూ.45,638 కోట్లకు పెరిగింది.  ఇక ఇతర పద్దుల విషయానికి వస్తే, జీఎస్టీ ద్వారా రూ. 32,671 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, వాస్తవానికి వచ్చిన ఆదాయం రూ.25, 905 కోట్లు మాత్రమే. అలాగే స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ. 5,243 కోట్ల ఆదాయం వచ్చింది.అలాగే సేల్స్‌ ట్యాక్సు నుంచి రూ.20 ,903 కోట్లు, స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీస్‌ నుంచి రూ.14,369 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ద్వారా రూ.8,976 కోట్ల ఆదాయం సమకూరింది. ఇతర పన్నుల ద్వారా రూ. 3,940 కోట్ల రాబడి వచ్చింది.  కాగా, గత ఏడాది కరోనా కారణంగా ఆదాయంతో పాటుగా వ్యయం కూడా రూ.1.34 లక్షల కోట్లకు దిగివచ్చింది. కాగా, గత సంవత్సరంలానే ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ,ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపధ్యంలో అంచనా వేసిన మేర ఆదాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే, కరోనా విరామ సమయంలో పరిస్థితి కొంత ఆశాజనకంగా కనిపించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మరింతగా పెంచి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  రాష్ట్ర బడ్జెట్‌ను ఏకంగా రూ.2.30 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ అంచనాలను చేరుకోవాలంటే ప్రతి నెలలో సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉంటుంది. అయితే, ఆదాయం సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రెండు విడతల్లో రూ.3000 కోట్లు అప్పును పెంచుకుంది. మరో రూ.2,000 కోట్ల అప్పు కోసం బాండ్ల వేలానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యంగా, కరోనా మహమ్మారి ఇంకెంతకాలం ఉంటుందో, ఇంకెన్ని విడతల్లో కాటేస్తుందో అంతు చిక్కని పరిస్థితిలో పభుత్వాలు, అయినా ప్రజలు అయినా పరిమితులు దాటి, పెద్ద ఎత్తులకి పోవడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.