జూలై వరకు సెకండ్ వేవ్.. మరి థర్డ్ వేవ్ ఎప్పుడంటే..?
posted on May 20, 2021 @ 9:59AM
కరోనా ప్రచంచానికి నేర్పిన గుణపాఠం అంత ఇంత కాదు. వచ్చే తప్పుడు ఒంటరిగా వచ్చాము .. పోయే తప్పుడు కూడా ఒంటరిగా పోతాం అనే వేదంతం చెప్పింది కరోనా. బంధాలు బంధుత్వాలు వల్లకాటి వారికే అని తెలిపింది. మరి ఈ కరోనా కు ఎండ్ అనేది లేదా అంటే ఎండ్ ఉంటుందో లేదో తెలియదు గానీ కొంత ఉపశమనం మాత్రం ఉంటుంది అంటున్నారు కొంత మంది శాస్త్రవేత్తలు. మరింకెందుకు ఆలస్యం చూడండి ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్పారో..
దేశం లో కరోనా కారణంగా ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు పోయాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జూలై వరకే ఈ సెకండ్ వేవ్ ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొవిడ్ మహమ్మారి రెండో ఉద్ధృతి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సమాచారం ఆడించింది. జూలై వరకు కొంత ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో కరోనా సెకండ్ వేవ్ కి తెర పడే అవకాశాలున్నట్లు ఆ శాస్త్రవేత్తల వెల్లడించింది. ఇది ఇలా ఉండగా జూలై తరువాత 6-8 నెలల వైరస్ మూడో ఉద్ధృతి (థర్డ్ వేవ్) ఉండొచ్చని.. కూడా ఈ సందర్బంగా వారు తెలిపారు. అయితే రెండో వేవ్ లాగ మరి ఇంత తీవ్ర ప్రభావం థర్డ్ వేవ్ తో ముప్పు ఉండక పోవచ్చు అని అంచనా వేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్, టెక్నాలజీ విభాగం ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్) అండ్ రిమూవ్డ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం పలు అంచనాలకు వచ్చింది. ఈమేరకు బృందంలో ఒకరైన ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వివరాలను వెల్లడించారు. దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని, జూన్ ఆఖరు నాటికి ఇది 20,000కు తగ్గుతుందని బృందం అంచనా వేసింది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, దిల్లీ, గోవాల్లో ఇప్పటికే మహమ్మారి అత్యంత తీవ్రదశ (పీక్)కు చేరినట్లు అగర్వాల్ తెలిపారు. తమిళనాడు, పంజాబ్, పుదుచ్ఛేరి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్‌లు ఈనెల 19 నుంచి 31 మధ్య అత్యంత తీవ్రదశకు చేరుతాయని అంచనా వేశారు.
మూడో ఉద్ధృతి..
‘
సూత్ర’ ప్రకారం దేశంలో అక్టోబరు వరకు కరోనా మూడో ఉద్ధృతి ఉండకపోవచ్చని అగర్వాల్ తెలిపారు. ‘‘మూడో ఉద్ధృతి స్థానికంగానే ఉంటుంది. వ్యాక్సినేషన్ కారణంగా ఎక్కువమంది దీనికి ప్రభావితం కాకపోవచ్చు..’’ అని పేర్కొన్నారు. ఏమిటీ సూత్ర మోడల్? మహమ్మారుల తీవ్రత, విధాన నిర్ణయాల ప్రభావం వంటి వాటిని అంచనా వేసేందుకు గణితశాస్త్ర విధానాల్లో ఒకటి సూత్ర. కొవిడ్‌పై అధ్యయనానికి గతేడాది ఈ మోడల్‌ను అనుసరించడం ప్రారంభించారు. ఈ ‘జాతీయ కొవిడ్-19 సూపర్‌మోడల్ కమిటీ’ దీని ఆధారంగానే భారత్‌లో కొవిడ్ వ్యాప్తిపై అంచనాలను రూపొందించింది. దేశంలో రెండో ఉద్ధృతి తీరును ముందుగా అంచనా వేయలేకపోయినట్లు కమిటీ అంగీకరించింది.