తల్లిని చేసి.. పెళ్ళికి నిరాకరించిందని..
posted on May 31, 2021 9:01AM
అబ్బాయి అయిన అమ్మాయి అయిన ప్రేమ పేరుతో వెంట పడితే ముందు నో చెపుతారు.. ఆ తరువాత పోనీలే చాలా సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకుంటారు. ఆ అవకాశం ఇచ్చి చూద్దాం అనుకోవడమే తప్పు.. ఆ ఒక్క మాట ఏంటదికైనా దారి తీస్తుంది. ఆ ఒక్క మాటతో కొంచం చనువు ఇస్తే అక్కడి నుండి సినిమా, షికార్లు, అక్కడితో ఆగకుండా ఫిజికల్ గా కలవడం. ఒకవేళా అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే.. అప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమికుడి నిజస్వరూపం. ఎలాగైనా ఆ ప్రాబ్లమ్ నుండి తను తప్పించుకోవాలనుకుంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి తన ప్రాబ్లెమ్ ఎలా ఫేస్ చెయ్యాలో తెలియక. అటు ఇంట్లో వాళ్లకు చెప్పలేక ఇటు బయట తిరగలేక ప్రాణాల మీదికి వస్తే.. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.
ప్రేమ పేరును ఎవ్వడు పడితే వాడు. బస్ స్టాండ్ లో సులబ్ కాంప్లెక్స్ లా ఎవడికి ఇష్టమొచ్చినాట్లు వాడు వాడుతున్నాడు. ఓ బాలికను మచ్చిక చేసుకుని పెళ్లి పేరుతో ఆమెను లోబరుచుకుని తల్లిని చేశాడో ప్రబుద్ధుడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో పాటు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడడం చివరికి మోసం చెయ్యడం.. అలవాటైపోయింది ఇప్పటి యువతకి.
వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ పట్టణ శివారు బాబునాయక్ తండాకు చెందిన ఓ యువకుడు అదే తండాలో ఉంటున్న బాలికను పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు.పెళ్లి చేసుకోవాలని మైనర్ అడిగే సరికి ఆమెను దూరం పెట్టడంతో పాటు వేరే వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక మనస్తాపం చెంది బావిలో దూకింది. అది గమనించిన తండా వాసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బాలికను కాపాడి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు బాధిత కుటుంబంతో పాటు బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.