అన్నాచెల్లెళ్ల ప్రేమ.. నో చెప్పిన పెద్దలు.. చివరికి ఉరి..
posted on May 31, 2021 @ 10:30AM
కరోనా కాలమో, కలికాలంలో తెలియదు గాని.. బయటి వాళ్ళతో నడిపే ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళతో సాగిస్తున్నారు. అసలే కరోనా కాలం.. అందులోను లాక్ డౌన్ ఇతరులను కలవడం వీలు కాదు. ఒక వేళ కలిసిన సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని అనుకుంటున్నట్లున్నారు. ప్రస్తుతం యువతీ యువకులు. అందుకే ఇంట్లో వాళ్ళతో ప్రేమాయణం నడుపుతున్నట్లున్నారు.. ఆ రుచి చూశాక ఒకరి ఒకరి ఉండలేమని.. వావివరసలు మరిచి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఒక జంట ఇలాగే చేసింది..
వారిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు. ఆ వరసను మరిచి వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా.. అది కృష్ణ జిల్లా. మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురానికి చెందిన పేరుబోయిన సాయికుమార్(20) గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పేరుబోయిన వెంకటస్వామి కుమార్తె(15)కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తెలుసుకున్న కుటుంబసభ్యులు.. వరుసకు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఏంటని మందలించారు.
కట్ చేస్తే.. ఈ నేపథ్యంలోనే ఈ ప్రేమజంట ఇంట్లో ఉంటె వాళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించారని గ్రహించి శనివారం రాత్రి ఇంటి నుంచి పారిపోయింది. ఎప్పటి లాగే ఉదయాన్నే లేచి చూస్తే అమ్మాయి, అబ్బాయి కనిపించడం లేదు. దీంతో కంగారు పడిన రెండు కుటుంబాల వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పంట పొలాల వద్ద చెట్టుకు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏమిటి ఈ దరిద్రం మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం.. వయసు వస్తే చాలు ప్రేమ రుచి చూడాల్సిందేనా.. ఈ తప్పు పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులదా ..? లేదా తల్లి దండ్రుల మాట లెక్క చేయని పిల్లలదా..? అయినా అక్క తమ్ముడు లవ్ చేసుకోవడం ఏంటి.. అని స్థానికులు మాట్లాడుకుంతున్నారు. దయచేసి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించండి. వారి నడవడికను గ్రహించండి. వారి తప్పులను సరిదిద్దండి. తల్లి దండ్రులు చదివిన వాళ్ళు అయినా చదవని వాళ్ళు అయినా సరే వారికి తెలిసిన విషయాలు వాళ్ళతో పంచుకోండి.. ఈ బిజీ ప్రపంచంలో పిల్లలను అందరు ఉన్న అనాథలా వదిలేయకండి.