ప్రత్యర్ధులకు కూల్చివేతలు.. మనోళ్లకయితే ఎత్తిపోతలు

లల్లూ అంకుల్ మాలూమ్ హై తేరే కో..జయా ఆంటీ మాలూమ్ హై తేరేకో అంటూ అప్పట్లో ఖుషీ సినిమాలో డైలాగ్ ఇప్పటికీ అందరూ వాడేస్తుంటారు. విశాఖపట్నంలో మాత్రం ఈ డైలాగ్ వేరేగా నడుస్తుందంట. అదేంటంటే ‘‘సాయి అంకుల్ మాలూమ్ హై తేరే కో.. అవంతి ఆంటీ మాలూమ్ హై తేరే కో‘‘ అంటున్నారంట.. ఎవడైనా సరే. అధికారం మన జేబులో ఉంటే.. చట్టం మన చుట్టం కాదు..ఏకంగా పెళ్లాం అయిపోతుంది. అలాగే ఉంది ఇప్పుడు విశాఖపట్నంలో వ్యవహారం.  వాళ్లు కబ్జా చేశారు.. వీళ్లు కబ్జా చేశారు..అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి మున్సిపల్ అధికారుల నుంచి కలెక్టరేట్ అధికారుల వరకు తన దగ్గరకు పిలిపించుకుని..ఎక్కడెక్కడకు వెళ్లాలి..ఏ యే నిర్మాణాలు కూల్చేయాలి.. ఎవరికీ నోటీసులివ్వాలి లాంటి పనులు డైరెక్టుగా చేస్తున్నారు. ఇక మంత్రి అవంతి అయితే తప్పు ఎవరు చేసినా తప్పు..ఇప్పుడాయనకు తెలియకపోవచ్చు.. వాళ్ల తాత తప్పుచేసి ఉండొచ్చు..అయినా తప్పే కదా..భూమి ఇచ్చేయాల్సిందే కదా అంటూ లాజిక్ వినిపించారు. ప్రత్యర్ధులను టార్గెట్ చేసి మరీ భూముల వేట కొనసాగిస్తున్నారు వైసీపీ నేతలు.అదేమంటే సర్కారు భూమిని కబ్జా చేస్తే వదిలేయాలా అని అడుగుతున్నారు. ఇలాంటి పెద్దలు ఇప్పుడు రివర్స్ లో ఓ ఘనకార్యం పూర్తి చేశారు. హెటిరో డ్రగ్స్ .. ఈ పేరు అందరికీ తెలిసిందే. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి సీబీఐ కేసులు ఫాలో అయ్యేవరకు ఇంకా బాగా తెలుసు. అంటే మనోళ్లే అన్నమాట. అసలు ఆ ఛార్జిషీట్లలో పేరు ఉండటమే పెద్ద క్వాలిఫికేషన్.. అలాంటివారికి ప్రత్యేక పోస్టులు ఇస్తారు. అలాంటిది మళ్లీ మళ్లీ మేలు చేకూర్చే కంపెనీకి పెద్ద మేలు చేయకుండా ఉంటారా చెప్పండి.  అసలు విషయానికొస్తే హెటిరో డ్రగ్స్ కంపెనీకి నక్కపల్లి సెజ్ కింద 200 ఎకరాలు గతంలో కేటాయించారు.అయితే పక్కనున్న108 ఎకరాలను కూడా ఆక్రమించేశారు. ఇవన్నీ పక్కన ఉన్న గ్రామాల ప్రజలు వాడుకునేవి. దీనిపై ఎప్పటినుంచో గొడవ నడుస్తోంది. టీడీపీ హయాంలో ఈ 108 ఎకరాలు తమకే కేటాయించాలని అప్లికేషన్ కూడా పెట్టేశారు. కాని ముందే ఆక్రమించేసి..తర్వాత తమకు అధికారికంగా ఇచ్చేయమని అడగటం ఏంటని..అప్పట్లో విచారణ చేపట్టారు.  ప్రభుత్వం మారింది..అధికారంలో సొంత మనుషులు వచ్చేశారు.అందుకే పెద్దగా ఫాలోఅప్ చేయకుండానే ఇప్పుడు 40 కోట్ల విలువైన 80 ఎకరాలను 20 కోట్లకే కట్టబెట్టేశారు.  ఆ కేటాయింపులో కూడా చాలా ఫ్లెక్సిబులిటీస్..ఫెసిలిటీస్ ఇచ్చేశారు. వాగులు,వంకలు వాడుకోవచ్చు..నీళ్లు వాడుకోవచ్చంటూ సెలవిచ్చేశారు.అదీ సంగతి. ప్రత్యర్ధులకైతే కూల్చివేతలు... మనోళ్లయితే ఎత్తిపోతలు అన్నట్లు నడిపిస్తున్నారు విజయసాయిరెడ్డి టీమ్ విశాఖపట్నంలో.

భలే దొంగ.. స్మశానంలో మృతదేహం మాయం.. 

దొంగ తనం కొందరు వృత్తిగా చేస్తారు.. మరికొందరు పార్ట్ టైం గా చేస్తారు.. కొందరు అవసరాన్ని బట్టి దొంగతనం చేస్తుంటారు.. దొంగతనం  అంటే ఏ ఇంట్లో ఉన్న బంగారాన్నో.. డబ్బులనో దొంగతనం చేస్తారు.. ఏ బస్సు లోనో.. వీధిలోనో.. ఆఫీస్ లోనో.. వాళ్లకు ఏదైనా అవసరం వచ్చే వస్తువులను దొంగతనం చేయడం చూశాం.. మనిషి అవసరమే ఎంతటి తప్పునైనా చేయడానికి మొగ్గుచూపిస్తాయి.. అది అందరికి తెలిసిన విషయమే.. కానీ తాజాగా కొంత మంది చేసిన దొంగతనం చూస్తే మీరు షాక్ అవ్వక మానరు ఇంతకీ ఆ దొంగతనం ఏంటి ? ఎవరు చేశారు..? ఎలా చేశారు? ఆ క్రేజీ గొంగతనం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ వార్త చదవాల్సిందే.. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకి..  దొంగలు ఇళ్లల్లోనే కాదు, స్మశాన వాటికల్లోనూ పడుతున్నారు. ఏంటి స్మశాన వాటికలో దొంగలు పడడం ఏంటి..? అయినా స్మశాన వాటికలో ఏం ఉంటుంది దొంగతనం చేయడానికి అని అనుకుంటున్నారా.. స్మశాన వాటికలో ఏం దొరుకుతుందని దొంగలు పడ్డారనేగా మీ అనుమానం పడుతున్నారా ? అక్కడే ఉంది  అసలు విషయం. వారం రోజుల క్రితం ఒక చిన్నారి మరణించాడు.. ఆ చిన్నారి మృతదేహన్నీ స్మశానం లో పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే .. సమాధిలో ఉన్న ఆ చిన్నారి మృతదేహం  మాయం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని పాతబస్తీ పహాడీషరీఫ్‌ స్మశానవాటికలో చోటుచేసుకుంది. అసలు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు.. ఎందుకు తీసుకెళ్లారనే విషయం మాత్రం అంతుచిక్కని మిస్టరీగా మారింది. అయితే పూడ్చి పెట్టిన చిన్నారి మృతదేహం మాయం కావడంపై చిన్నారి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు రంగంలోకి దిగారు.. మృతదేహం మాయం కావడంపై విచారణ చేపడుతున్నారు. అయితే స్మశాన వాటికలోంచి చిన్నారి మృతదేహం మాయం కావడం గుర్తించిన కుటంబ సభ్యులు.. స్మశాన వాటికలోని చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ కనిపించకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చిన్నారులను కిడ్నాప్‌ చేయడం చూశాం.. కానీ.. పూడ్చి పెట్టిన చిన్నారి శవాన్ని ఎత్తుకెళ్లడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తోంది. శవాన్ని ఎత్తుకెళ్లే అవసరం ఏముంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా  తెలియాల్సి ఉంది..   

రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం.. జగనన్న కొత్త స్కీమా..? 

ఆంధ్రప్రదేశ్ లో పాలనా అస్తవ్యస్థంగా ఉందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు సరిగా జరగడం లేదని జనాలు విమర్శిస్తున్నారు. ఇంటింటికి రేషన్ పేరుతో జగన్ రెడ్డి సర్కార్ హడావుడి  చేయగా.. క్షేత్రస్థాయిలో మాత్రం అది తుస్సుమంది. ఇంటింటికి రేషన్ తో తమకు మరిన్ని కష్టాలు పెరిగిపోయాయని బహిరంగంగానే ప్రజలు చెప్పారు. షాఫులోనే అందించాలని కోరారు. రేషన్ బియ్యం పంపిణిలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏపీ ప్రభుత్వం బియ్యం కార్డులున్న వారికి నెఅలనెలా నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇందులో బియ్యంతో పాటు పంచదార, కందిపప్పులాంటివి పంపిణీ చేస్తోంది. రేషన్  బియ్యంలో నాణ్యత లేదనే ఆరోపణలు వస్తుంటాయి. తాజాగా ఏపీలోని ఓ ప్రాంతంలో మాత్రం రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడం కలకలం రేపింది.  విశాఖ ఏజెన్సీ పరిధిలోని కొయ్యారు మండలం M.మాకవరంలో గిరిజన సహకార సంస్థ పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం దర్శనమిచ్చింది.  ఈనెల 6వ తేదీన జీసీసీ డిపోలో స్థానికులు రేషన్ బియ్యం తీసుకెళ్లారు. వాటిని పరిశీలించగా బియ్యపు గింజలు విరగడానికి బదులు మెత్తగా సాగడాన్ని గమనించారు. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించిన  గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై గిరిజన సహకార సంస్థ అధికారులను సంప్రదించగా.. తాము పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చిన బియ్యాన్నే పంపిణీ చేస్తాం తప్ప.. తాము కొనుగోలు చేయమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇది జగనన్న తీసుకొచ్చిన కొత్త పథకం కావచ్చంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు.   

ఎస్పీ  మహిళా నేత చీర లాగారు.. యూపీలో రాజకీయ దుమారం

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళ కొంగు పట్టుకుని లాగిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. మహిళ చీర కొంగు పట్టుకుని లాగిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఘటనపై  అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యులుగా యూపీ ప్రభుత్వం ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. స్పెండ్ అయిన వారిలో ఓ సీఐ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు ఉన్నారు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా లఖింపూర్‌ ఖేరీ ప‌రిధిలో చివరి రోజైన శుక్రవారం సమాజ్ వాద్ తరపున పోటీ చేసేందుకు  నామినేషన్ వేసేందుకు వెళ్లింది ఓ మహిళ. అయితే అమెను అడ్డుకున్న ఇద్దరు వ్యక్తులు కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కుని, చీర పట్టుకుని లాగారు. అక్కడే ఉన్న కొందరు వచ్చి ఆమెను విడిపించారు. మహిళకు ఇద్దరు వ్యక్తులు చేసిన దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. యూపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గూండాలే ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన  యోగీ సర్కార్..  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. 

అప్పుడు అలా ..ఇప్పుడు ఇలా .. ఇదేంది సీఎం సారూ ..

ఏమి జరుగుతోంది, కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్, కరోనాను చాలా తేలిగ్గా కొట్టేసారు. రెండు గోలీలు వేసుకుంటే చాలు పక్కా లేకుండా పరుగులు తీస్తుందని, చలోక్తులు విసిరారు. అయితే, ఇంతలోనే మళ్ళీ కరోనా ముప్పు ఇంకా తొలిగి పోలేదని అంటున్నారు. థర్డ్ వేవ్‌ వస్తుందంటున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపధ్యంలో, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, ఆయా జిల్లాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం సన్నద్దత, పడకలు, మందులు, ఆక్సిజన్‌ లభ్యత తదితర అంశాలను సమీక్షించి సూచనలు చేశారు.   నిజమే కరోనా ముప్పు తొలిగి పోలేదు. ఇప్పట్లో తొలిగిపోయే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారన్న ముఖ్యమంత్రి మాటల్లో నిజముంది. ఇంతవరకు కరోనా ఎట్టా పుట్టింది, ఎక్కడ పుట్టింది అనే విషయంలోనే స్పష్టత రాలేదు. పుట్టుక విషయంలోనే స్పష్ట్టత లేని కరోనాని కట్టడి చేయడం చిక్కుముడిగా పరిణమిస్తోందని, ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి  కారణం తెలిస్తేనే నివారణకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. నిజమే, ఏ వేవ్‌ ఎప్పుడు ఎందుకు వస్తుందో... ఏ మేరకు విస్తరిస్తుందో, ఎలా రూపాంతరం చెందుతుందో, ఇంకెన్ని రకాలుగా వేదిస్తుందో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతగా వ్యవహరిస్తే బాగుటుంది. ఒక్క ముఖ్యమంత్రి అనే కాదు, ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఎప్పటికప్పుడు, అప్పటి అవసరాలకు అనుగుణంగా మాట్లాడడం మంచిది కాదు. ఆయినా,కరోనా ఉదృతి కాస్త తగ్గింది, అనగానే రాష్ట్రంలో రాజకీయ జాతర్లు మొదలయ్యాయి. కరోనా ఉపద్రవాన్ని చాలా వరకు రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. ఏ పార్టీ నాయకులూ దీనికి అతీతం కాదు.  రాష్ట్రంలో ప్రస్తుతం వరుసగా పార్టీల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు హరితహారం, వివిధ అభివృద్థి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరవుతుండటంతో కార్యకర్తలు, అధికారులు పాల్గొనక తప్పడం లేదు. ఏ చిన్న కార్యక్రమమైనా వందల సంఖ్యలో హాజరు ఉంటోంది. ఈ సందర్భంగా మాస్‌్,లు ధరించడం మినహా ఏ ఒక్క నిబంధన పాటించడం లేదు. భౌతిక దూరం అనే నిబంధనను మరిచే పోయారు.     ఇలా భారీ ఎన్నికల సభలు రాజకీయ జాతరలు జరపడం వల్లనే, దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరించిందని, కోర్టులు సైతం చీవాట్లు పెట్టాయి.అయినా, రాజకీయుల ధోరణి  మారడం లేదు. కరోనా వ్యాప్తి నిరోధ నిబంధనలు పాటిస్తూ.. నలుగురికీ చెప్పాల్సిన ప్రజాప్రతినిధలు, నేతలే వాటిని విస్మరిస్తున్నారు. అదే విధంగా ప్రజలలో కూడా వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణి పెరుగు తోంది. అందుకే ముఖ్యంత్రి కరోనా కట్టడి కోసం ప్రజలు ప్రభుత్వంతో కలిసి రావాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు స్వీయనియంత్రణ, కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని పిలుపునిచ్చారు. పిలుపు అయితే ఇచ్చరు. కానీ, ఆచరింఛి చూపి ఆదర్శంగానిలిస్తే కదా,ప్రయోజనం ఉండేది. చిత్తశుద్ధి లేని శివ పూజల వలన ప్రయోజనం ఉంటుందా?  

రఘురామపై అనర్హత వేటు పడదా? విజయసాయి ఉలికిపాటు అందుకేనా? 

వాళ్లనుకున్నది జరగటం లేదా? వేటు తప్పదని ఘాటుగా చెప్పిన మాటలు ఉత్తదేనా? వారు చేసిన ఓవరాక్షన్ స్క్రీన్ ప్లేని మార్చేసిందా? వారు చేసిన తప్పుతో క్లైమాక్స్ లో కథ అడ్డం తిరిగిందా? ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడటం ఖాయమని తొడగొట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పేరు చెప్పి మరీ మూతి విరుస్తున్నారు. అన్యాయం చేస్తున్నారంటూ మొత్తుకుంటున్నారు. పైగా రఘురామ తనను సీఐడీ అధికారులు కొట్టారని పెట్టుకున్న పిటిషన్ ను సభా హక్కుల కమిటీకి పంపించారు స్పీకర్ ఓ  బిర్లా. దీంతో పుండు మీద కారం చల్లినట్లయింది వైసీపీ నేతలకు..ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డికి. అందుకే ఎప్పుడూ వెంకయ్యనాయుడిని తిడదామని చూసే ఈ పెద్దమనిషి.. ఇప్పుడు మాత్రం ఆయన పనిచేశాడు...కాని లోక్ సభ స్పీకర్ మాత్రం నానుస్తున్నారంటూ విమర్శించాడు. రాజ్యసభలో అనర్హత వేటు వేయాలంటే వెంకయ్యగారు వెంటనే వేసేశారు..ఇక్కడ మాత్రం ఎందుకు లేటని ప్రశ్నించాడు. మరి ఇలాంటి రాజ్యతంత్రంలో కేంద్రంలో ఉన్నవారు.. వీరికి తాతలు కదా.. మొన్నటివరకు రఘురామపై వేటు తప్పదేమో అనుకున్న రాజకీయ వర్గాలు తాజాగా ఇప్పుడు విజయసాయిరెడ్డి విమర్శల తర్వాత ఆలోచనలు మార్చుకుంటున్నారు. అయితే వేటు పడదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ అవకాశాన్ని వదలకుండా..టెక్నికల్ గా ఎక్కడ అవకాశం ఉందో అక్కడ లేఖలు పెట్టేశారు. గడప గడపకు తిరిగి ఓ సిట్టింగ్ ఎంపీ అయిన తనను లేని కేసును సృష్టించి.. అక్రమంగా అరెస్టు చేసింది కాక.. దారుణంగా కొట్టారని..తన ఆవేదన వినిపిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పరువు పోతా ఉంది. ఏపీలో ఘోరంగా ఉంది పరిస్ధితి అని చంద్రబాబునాయుడు లాంటివారు చెప్పినా.. రాజకీయంగా చూసినవారంతా.. ఇప్పుడు రఘురామ ఎపిసోడ్ తో నిజంగానే నివ్వెరపోతున్నారు. ఎంపీ రఘురామ విజయసాయిరెడ్డి కామెంట్స్ పైనా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పొరపాటున ఓం బిర్లా గారు విజయసాయిరెడ్డి అమూల్యమైన డైలాగులను మిస్సవుతారేమోనని..సవివరంగా ఆయనకు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడిందీ తెలియచేశారు. విజయసాయిరెడ్డి స్పీకర్ సభా మర్యాదలకు, హక్కులకు భంగం వాటిల్లేలా మాట్లాడారని..పైగా తాము అడిగింది చేయకపోతే సభా కార్యకలాపాలను అడ్డుకుంటామని నేరుగా బెదిరించారని..రఘురామ ఆ లేఖలో వివరంగా చెప్పారు. దీంతో వైసీపీ మరింత ఇరుకున పడే అవకాశం కనపడుతోంది. సభా హక్కుల కమిటీ రఘురామ ఎపిసోడ్ పై విచారించి..ఆ నివేదికను పార్లమెంటులో పెట్టిందో...పెద్దలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు.. అష్టకష్టాలు జగన్ కు తప్పవు. తమను విమర్శిస్తున్న ఎంపీపై అనర్హతవేటుకు అవసరమైన చర్యల వేగం పెంచాల్సింది పోయి.. అధికారం ఉంది కదాని అహంకారంతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి తీవ్రంగా అవమానించారని.. అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందేనని రఘరామ సన్నిహితులు గట్టిగా చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి సంచలనం. కేసీఆర్ కథ మాములుగా లేదుగా..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఫ్రైర్ బ్రాండ్ లీడర్ పవర్ ఫుల్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. రోజుకో బాంబా పేల్చూతూ రాజకీయ కాక రేపుతున్న రేవంత్ రెడ్డి.. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ బండారం మొత్తం బయటపెట్టేశారు. అంతేకాదు భవిష్యత్ లో కేసీఆర్ ఏం చేయబోతున్నారని, ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందో జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు.  తనపై విమర్శలు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులపై  రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏ పార్టీ అని ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్ఎస్‌కి ఎలా అధ్యక్షుడో,  తాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడినని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు, కేటీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ టీడీపీ అయితే, టీఆర్ఎస్‌ కూడా టీడీపీనేనని  అన్నారు. టీఆర్ఎస్‌ను తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆయన ఆరోపించారు. అధికారాన్ని టీఆర్ఎస్‌ నుంచి బరాబర్ గుంజుకుంటామని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌, తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడంటూ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని ఆయన స్పష్టం చేశారు. వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో 72 సీట్లు గెలుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌తో  తమకు పాము, ముంగిస ఫైట్ జరుగుతోందని రేవంత్‌ అన్నారు. టీఆర్ఎస్ గాలి వాటం‌ పార్టీ అని, దానికి నిర్మాణం లేదన్నారు. భవిష్యత్‌లో టీఆర్ఎస్ ఉండదన్నారు.  తన పేరు మీదనే కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవి వచ్చిందన్నారు. తనకు పీసీసీ  రావడం వల్లే కిషన్‌రెడ్డికి కేబినెట్‌ పదవి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీలో చేరాక ఈటలకు ఉద్యమంతో బంధం తెగిపోయిందన్నారు.  బీజేపీలో చేరి లెఫ్టిస్ట్ ఈటల రాజేందర్ క్యాపిటలిస్ట్‌గా మారాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.తమ కుటుంబంలో ఎవరూ టికెట్ అడగరని.. పోటీచేయరని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నుంచి తాను పోటీ చేస్తాననేది ప్రచారం మాత్రమేనని రేవంత్ తెలిపారు. 

ఉమ్మడి పౌర స్మృతికి పచ్చజెండా ?

ఉమ్మడి పౌర స్మృతి, ఎప్పటినుంచో  వినవస్తున్న మాట. ఒక రాజకీయ వివాదం. బీజేపీఎన్నికల వాగ్దానాలలో, ఇది కూడా ఒకటి. అయితే, ఇప్పడు కాగల కార్యం కోర్టులే కానిచేస్తున్నాయా, అంటే అవుననే అనవలసి  వస్తోంది. ఇందుకు సంబదించి 2020 మార్చిలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. మతంతో సంబంధం లేకుండా వారసత్వ చట్టాల రూపకల్పనపై అభిప్రాయం చెప్పాలని కోరింది. దీనికి సంబంధించిన ఐదు పిటిషన్లను విచారణకు చేపట్టింది. దీంతో అప్పుడే దేశంలో ఉమ్మడి పౌర స్మృతికి బాటలు పడుతున్నాయనే అభిప్రాయం ఏర్పడింది.  జూలై 7 న ఢిల్లీ హైకోర్టు ఏకంగా భారత దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం చాలా ఉందని పేర్కొంది. అంతే కాదు ఉమ్మడి పౌర స్మృతి అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో క్రమంగా కులాలు మతాల మధ్య అంతరాలు తొలిగి పోతున్నాయని, సజాతీయం, ఏకజాతిగా మారుతోందని, పేర్కొంది. ఈ మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమని న్యాయస్థానం అభిప్రాయ పడింది. మీన కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు హిందూ వివాహ చట్టం, 1955 వర్తించడానికి సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పులో జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.  వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమవుతున్న వైరుద్ధ్యాలు న్యాయస్థానానికి పదే పదే వస్తున్నాయని జస్టిస్ ప్రతిభ పేర్కొన్నారు. ఇటువంటి వైరుద్ధ్యాల వల్ల వివాహ బంధంలో ప్రవేశించిన వివిధ కమ్యూనిటీలు, కులాలు, మతాలకు చెందినవారు సంఘర్షణకు గురవుతున్నట్లు తెలిపారు. వేర్వేరు కమ్యూనిటీలు, తెగలు, కులాలు లేదా మతాలకు చెందిన భారతీయ యువత తమ పెళ్లిళ్ల విషయంలో వివిధ వ్యక్తిగత చట్టాల్లోని వైరుద్ధ్యాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో పోరాడవలసిన తప్పనిసరి పరిస్థితిని కల్పించకూడదన్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి, విడాకుల విషయంలో యువత పోరాడవలసిన పరిస్థితు ఉండకూడదన్నారు.  భారత రాజ్యాంగంలోని అదికరణ 44 ఆశించినట్లుగా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అవసరాన్ని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు చెప్తోందన్నారు. ఇటువంటి పౌర స్మృతి అందరికీ సార్వజనీనంగా వర్తిస్తుందన్నారు. పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో ఏకరీతి సిద్ధాంతాల వర్తింపునకు దోహదపడుతుందన్నారు. వివిధ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే వైరుద్ధ్యాలు, అసంగతాలను ఉమ్మడి పౌర స్మృతి తగ్గిస్తుందన్నారు.  పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాలకు వర్తించే చట్టాలు ప్రస్తుతం మన దేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరుగా ఉన్నాయి. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్, ఇండియన్ డైవోర్స్ యాక్ట్, పార్శీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వంటివి అమల్లో ఉన్నాయి. అయితే ముస్లిం పర్సనల్ చట్టాన్ని క్రోడీకరించలేదు. ముస్లింల మతపరమైన గ్రంథాలే వీటికి ఆధారం. ఈ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని మతాల వారికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా చేయడానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్  చట్టం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి చట్టం చేయడానికి కూడా వెనకాడదు. నిజానికి, జమ్మూ కశ్మీర్’కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిపించే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయం నిర్మాణంతో పాటుగా ఉమ్మడి పౌర స్మృతి అంశం కూడా బీజేపీ ప్రకటిత  లక్ష్యాలలో ఒకటిగా వుంది.

మంత్రికి చుక్కలు చూపించిన రైతు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి ప్రజా గ్రహానికి వేదకవుతోంది. తమ సమస్యలపై ప్రజా ప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. మంత్రులను ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రైతుల నుంచి అధికార పార్టీ నేతలకు అడుగడుగునా నిరసన వ్యక్తమవుతోంది. రైతు రుణమాఫీపై నిలదీస్తుండటంతో ఏమి చెప్పలేక కొందరు మంత్రులు అక్కడి నుంచి  జారుకుంటుండగా.. కొందరు మంత్రులు మాత్రం ఆగ్రహంతో తన కోపాన్ని రైతులకు చూపిస్తున్నారు. ఇలాగే తనను ప్రశ్నించిన రైతుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలోని మెట్లచిట్టాపూర్ గ్రామంలో రైతు వేదికను ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. సభ జరుగుతుండగా ఓ రైతు నేరుగా వేదికపైకి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫి ఇంతవరకు అమలు కాలేదని ప్రశ్నించారు. అంతలోనే మంత్రి దయాకర్ రావు నీది ఏపార్టీ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఇంతలో పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్  అనడంతో వెంటనే మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు.  స్టేజి దిగిపో అంటూ మంత్రి చెప్పడంతో తేరుకున్న పోలీసులు రైతును వేదిక పై నుండి తీసుకువెళ్లారు. మంత్రి దయాకర్ రావు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు ఏ పార్టీ అయితే ఆయనకేంటి..ప్రభుత్వం ప్రకటించినట్టుగా రైతు రుణమాఫి చేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు. మంత్రి స్థాయిలో ఉండి రైతుకు సమాధానం చెప్పాల్సిన మంత్రి పార్టీల పేరుతో తప్పించుకోవడంపై కూడా పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాకా రైతు రుణమాఫి ప్రకటించింది.  లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు పూర్తిగా మాఫి చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే రెండున్నర ఏండ్లు గడుస్తున్నా కేవలం 25 వేల లోపు అప్పులు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫిని పంపిణి చేశారు. మిగితా రైతులంతా రుణమాఫీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. విపక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. దీంతో కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, సుమారు లక్ష కోట్ల రూపాయలు ఆదాయం తగ్గినట్టు ముఖ్యమంత్రి  ప్రకటించారు. మరోవైపు రుణ మాఫి కాగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఉన్న అప్పులు కట్టకపోవడంతో పాటు కొత్త అప్పులు ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు ముందుకు రావడం లేదు..దీంతో పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్టు చెబుతున్నారు.

50 వేల కొలువుల భర్తీ.. రేవంత్ దెబ్బకు సార్ దిగొస్తున్నారా..! 

జనాగ్రహం పెరిగిందని గ్రహించారో.. విపక్షాల దూకుడుతో కలవరపడుతున్నారో తెలియదు కాని.. సీఎం కేసీఆర్ పూర్తిగా రూట్ మార్చారు. గతంలో ఎంతగా మెత్తుకున్నా ఉద్యోగాల కల్పనను పట్టించుకోని గులాబీ బాస్ ఏకంగా ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో,  ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో  భర్తీ చేయాలన్నారు.  రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం పై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... ‘‘ గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాల్లు జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయన్నారు. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయని.. వాటిని ముందుగా భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.  ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.   ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను  కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురండి  అని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

పార్టీలకతీతంగా ఏకమైన ఉద్యమ కారులు.. కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైనట్టే?

తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు.. కొందరు జైళ్లకు కూడా వెళ్లారు. ఉద్యోగాలు వదిలేసి మరీ కొందరు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అందరి పోరాటం ఫలించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్దించింది. రాష్ట్రం వచ్చి ఏడేండ్లు పూర్తయ్యాయి. అయినా మళ్లీ తెలంగాణ ఉద్యమ కారులంతా  రోడ్డెక్కుతున్నారు. ఎందుకో తెలుసా.. తమ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరనందకు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులంతా మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు రావడానికి పాలకులే కారణమని చెబుతున్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్లే తామంతా మళ్లీ  ఉద్యమానికి సిద్ధమవుతున్నామని అంటున్నారు.    తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత ఏడేండ్లుగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్ని నీరుగారిపోయాయని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. బంగారు తెలంగాణ పేరుతో కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ పై జనాగ్రహం తీవ్రంగా ఉండటంతో ఇదే అదనుగా తమ కార్యాచరణ మొదలు పెట్టి.. దూకుడుగా వెళుతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన, చేస్తున్న కేసీఆర్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడమే తమ లక్ష్యమంటున్నారు. రాజకీయాలకు అతీతంగా, కేసీఆర్ గడీల‌ పాలన అంతమొందిస్తామంటూ  తెలంగాణ ఆకాంక్షల వేదిక పేరుతో ఉద్యమకారుల ఐక్య వేదిక పురుడు పోసుకుంది. ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక పేరుతో ఇప్పటికే మూడు సమావేశాలు జరిపారు. ఉద్యమకారులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి వేలాది మంది ఉద్యమకారులు హాజరయ్యారు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కలిసి ఉద్యమించాలని నిర్ణయించారు. ఈనెల 12న వరంగల్, 15న కరీంనగర్ లో సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. వరంగల్ లో సభా ఏర్పాట్లు చేయడానికి వేణుగోపాల్ రెడ్డి ముందుకు వచ్చారు. తెలంగాణ కరుడుగట్టిన ఉద్యమకారులైన గాదె ఇన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సమావేశానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా వచ్చారు.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి ప్రస్తుతం వేరువేరు పార్టీల్లో ఉన్న నేతలు కూడా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.  శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి విజయరామారావు, కపిలవాయి దిలీప్ కుమార్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ నాయకులు డీకే అరుణ, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, దాసోజు శ్రవణ్ కుమార్, ఎం సుదర్శన్ రావు, రాములు నాయక్  హాజరై ఉద్యమకారులకు తమ సపోర్ట్ తెలిపారు. బండి సాదానంద్, రవీంద్ర నాయక్ వంటి ఉద్యమ నేతలు హాజరయ్యారు. ఉస్మానియా విద్యార్థులు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టరు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన ఉద్యమకారులంతా ఏకం కావడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా  ఒకే వేదిక మీదకు రావాలని ఈ సందర్భంగా పిలుపిచ్చారు. ఉద్యమ ఆకాంక్షల వేదిక సభను చూస్తే.. కేసీఆర్ కు ఇక కౌంట్ డౌన్ మొదలైనట్టేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు.. త్వరలో జరగనున్నహుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజురాబాద్ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. ఇంటింటికి తిరికి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే.. గులాబీ బాస్ చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది. 

సోషల్ మీడియాలో మోసం.. 

సోషల్ మీడియా కొంత మందికి పిచ్చోడి చెలితో రాయిలా మారింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని కొంత మంది తమ టాలెంట్ ను ప్రపంచం గుర్తించేట్టు చేస్తుంటే.. ఇంకొంత మంది తన టాలెంట్ ను పోలీసులు గుర్తించేలా చేస్తున్నారు.. సోషల్ మీడియాను  చెడు ఎక్కువగా వాడుతున్నారు. కొంత మంది మోసగాళ్లు సోషల్ మీడియాని  చక్కగా దుర్వినియోగం చేస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. ఇక రోజంతా వాళ్ళ పని ఒక్కటే పెళ్లి కానీ యువతుల  ద్వారా పెళ్లికాని యువకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న భార్యా భర్తలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. వారికి మూడు నెలల చిన్నారి ఉండటంతో పోలీసులు  భార్యకు సీఅర్పీసీ-41 A కింద నోటీసులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గికి చెందిన పున్నం  నవీన్ కుమార్ అనే యువకుడు గతేడాది శిరీష అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కోస్గిలో కాపురం పెట్టినా వీళ్ళు ఆప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి హోటళ్ళలో బసచేసి తిరుగుతూ  జల్సాలు, ఎంజాయ్ చేసేవాళ్లు.  వీళ్లు జల్సాల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించటానికి ప్లాన్ వేశారు. ఇక అంతే వాళ్ళ ఆలోచన ఆచరణలో పెట్టారు.  అందులో భాగంగా శిరీష ఫేస్ బుక్ లో స్నేహ రెడ్డి పేరుతో ప్రోపైల్ క్రియేట్ చేసింది. ఫేస్ బుక్ లో సింగిల్ స్టేటస్ ఉన్న యువకులను చూసి వారికందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అందులో అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చేసరికి ఒంటరిగా ఉన్న యువకులు.. సొంగ కార్చుకుంటూ  వెంటనే యాక్సెప్ట్ చేసి ఆమెతో చాటింగ్ చేసేవాళ్లు.  ఒకోసారి నవీన్ కూడా శిరీష లాగా వారితో చాట్ చేసేవాడు. ఈ రకంగా భార్యా భర్తలిద్దరూ యువకులను మోసంచేయటం మొదలెట్టారు. ఫేస్ బుక్ చాటింగ్ తర్వాత క్రమేపి ఫోన్ నెంబర్లు తెలుసుకుని వాట్సప్ చాటింగ్ లోకివచ్చేవారు.  అక్కడి నుంచి నిదానంగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పేది శిరీష.  కొన్నాళ్లకు పెళ్లి ప్రస్తావన తెచ్చేది.  పెళ్లి చేసుకోవాలంటే మంచి ఉద్యోగం కావాలిగా అంటూ వారితో చెప్పేది. తన పరిచయస్తుల ద్వారా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని వారికి నమ్మబలికేది. ఆపై నవీన్ రంగంలోకి దిగి వారి వద్దనుంచి డబ్బులు గుంజేవాడు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు అన్నట్లు.. వరద అంటే అదే అమ్మాయిల బాధితులు ఎవరైనా ఫోన్ చేస్తే శిరీష మాట్లాడి  వారి ఆవేశాన్ని తగ్గించేది. మెల్లగా ముగ్గులో పెట్టేది..  ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడికి ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌‌లో ఉద్యోగం వేయిస్తానని చెప్పి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  రూ.8లక్షలు తీసుకుని మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. పైసల్ ఒకడివి ఫలితం మరొకడిది అన్నట్లు.. యువకులు వద్దనుంచి తీసుకున్న డబ్బులతో ఈ జంట గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవారు. నవీన్ అరెస్ట్  విషయం తెలుసుకున్న శిరీష మరోక వ్యక్తిని వెంటపెట్టుకుని పోలీసు స్టేషన్ కు వచ్చింది.  అతనితో రాజీ పడుతున్నామని…. రూ.2 లక్షలు ఇచ్చేస్తున్నామని… తన భర్తను విడిచిపెట్టమని కోరింది. అయితే ఈ బాధితుడు   భార్య,భర్తల బాగోతం తెలుసుకుని తానూ ఫిర్యాదు చేశాడు. దీంతో దంపతుల మీద ఇంకో కేసు నమోదైంది. నవీన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరికి మూడు నెలల చిన్నారి ఉందన్న విషయం తెలుసుకుని శిరీషకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తు  జరుగుతోంది.

వైసీపీ ఎంపీ సంస్థలో 300 కోట్ల బ్లాక్ మనీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి చెందిన రాంకీ సంస్థలో జరిగిన సోదాలపై ఐటీశాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది.  వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్న సంస్థ.. ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టిందని తెలిపింది. రూ.1200 కోట్లు కృతిమ నష్టాన్ని రాంకీ చూపించిందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. రాంకీలో మేజర్ వాటాను సింగపూర్‌కు చెందిన వ్యక్తులకు అమ్మేశారని తెలిపింది.  తప్పుడు లెక్కలు చూపెట్టి రూ.300 కోట్లు పన్ను ఎగ్గొట్టేందుకు యత్నించారని ఐటీ శాఖ తన ప్రెస్ నోట్ లో వెల్లడించింది. రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసిందని తెలిపింది.  ఆ సంస్థకు  సంబంధించి లెక్కలేని రూ.300 కోట్ల నగదు లావాదేవీలను గుర్తించామని ఐటీ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లతో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ వాటిలో ప్రాజెక్టు చేపట్టింది.  ఈనెల  6న వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. రాంకీ సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహించారు.సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. 

బంగారు తెలంగాణాలో.. నిరుద్యోగుల ఆత్మహత్యలు.. కారణం ఎవరు..? 

నాగులు కోట్ల దొంతులు ఒక్కటై.. నలుదిక్కులు ఒక్కటై.. రణం చేసి, రక్తం చిందించి,  విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి.. ప్రభుత్వం మెడలు వచ్చి సాధించుకున్న తెలంగాణ. రాష్ట్రము వస్తే బతుకులు మారుతాయి. నీళ్లు, నిధులు, ఉద్యోగం, ఉపాధి ఉంటుందని నమ్మిన తెలంగాణాలో.. పాలకులు మరీనా పాలన మారలేదు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను అని చూపిన నేటి పాలకులు వాళ్ళ ఇంటిని మాత్రమే బంగారు చేసుకుని .. తెలంగాణను విషాదంలో ముంచుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం,ఉపాధి లేక..వయసు పెరిగిన  పెళ్లిళ్లు అవ్వక.. పెళ్లిళ్లు అయ్యకు కూడా ఇంకా తల్లిదండ్రులకు భారమైనా బతుకు మీద ఆశ కరువై.. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక చాలీచాలని బతుకులను యెల్లదియ్యలేక.. పిట్టల రాలిపోతున్నారు విద్యార్థులు..  తెలంగాణ వస్తే దళితుడ్ని సీఎం చేస్తాను.. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి. ఇంటికో ఉద్యోగం ఇష్టం అని హామీలు ఇచ్చిన కేసీయార్ ఇప్పుడు మాట మర్చి.. ఆ హామీలను మూసినదిలో కలిపి ప్రజలు అవస్థలు పడుతుంటే చోద్యం చూస్తున్నాడు.. నోటిఫికెషన్స్ రాక  చాలా రోజులే అవుతోంది. ఎంతో మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు. కష్టపడి చదివి జాబ్ కొడితే ఆర్థిక సమస్యలు తీరుతాయి. కుటుంబ పరిస్థితి కాస్త మెరుగవుతుంది అనుకోని చాలా మంది రాత్రింభవల్లు కష్ట పడి చదువుతుంటారు. తెలంగాణ ప్రజలు చదివి ఎక్కడ ఆర్థికంగా బాగుపడితే ఈ రాష్ట్రంలో తమ ఆటలు సాగవని.. ప్రజలు ఎంత ఆర్థిక ఇబ్బందులో ఉంటే అప్పుడే తమ ఆటలు సాగుతాయని ఆలోచిస్తుంది ప్రభుత్వం.. ఇంకా  కొంత మంది నోటిఫికేషన్ వస్తది అన్న ఆశతో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కోచింగ్  ఫీజులు కట్టడం కోసం అమ్మ  పుస్తెలు అమ్మి చదువుతున్నారు విద్యార్థులు.. అయినా ఎంతకీ నోటిఫికేషన్లు పడకపోవడంతో మనస్థాపం చెంది ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో నోటిఫికేషన్లు రావట్లేదనే మస్థాపంతో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా తాడిపర్తిలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన కొండల్ (33) అనే వ్యక్తి కొన్ని నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే జాబ్ నోటిఫికేషన్ రాకపోయే సరికి మనస్థాపం చెంది శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

అవును.. ఆ ఇద్దరు ఒకటయ్యారు! అన్న బండారం బయటపెట్టిన చెల్లె..

వైఎస్సార్ టీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇలా పార్టీ పేరు ప్రకటించి, అలా జెండా ఎగరేసారో లేదు, జగనన్నపై తొలి బాణం వేశారు. అయితే ఆమె తెలిసి, ఈ బాణం సంధించారా, లేక అసలు సమస్యను పక్కదారి  పట్టించేందుకే ఈ వ్యాఖ్య చేశారా, అన్నది అలా ఉంచితే, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదానికి సంబదించి షర్మిలా చేసిన మూడు ముక్కల వ్యాఖ్య, జగనన్నను  అష్ట దిగ్బంధనం చేసింది.  వైఎస్సార్ టీపీ ఆవిర్భావ సభలో షర్మిల, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తున్న జల వివాదం  అంశాన్ని ప్రస్తావిస్తూ,  ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా..? జల వివాదాన్ని పరిష్కరించుకోలేరా..? అని ప్రశ్నించారు. అంతే అయితే అది  అలా కొట్టుకుపోయేదేమో కానీ, ఆమె గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసుకున్న విందులు వినోదాల వివరాలతో పాటుగా,ఇద్దరు కలిసి ఉమ్మడి శత్రువు (చంద్రబాబు)ను ఓడించారని  అన్నారు. ఆ విధంగా  ఆమె కేసీఆర్, జగన్ రెడ్డి మధ్య ఉన్న సీక్రెట్ లవ్ అఫ్ఫైర్, ను బయట పెట్టార్టు. అంటే, గత ఎన్నికలలో ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడుని ఓడించేందుకు ఆ ఇద్దరూ ఒక టయ్యారని షర్మిల్ చెప్పకనే చెప్పారు.  నిజానికి, ఇది కొత్త విషయం కాదు, 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపెకి,జగన్ రెడ్డికి  అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని, అనేక సందర్భాలలో వివిధ పార్టీల నాయకులు విమర్శించారు. అలాగే, ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, అవును ఆ ఇద్దరూ ... అనుకునేలా చెట్టాపట్టాలేసుకు తిరిగారు. విందులు, వినోదాలు, కౌగిలింతలు, శాలువలు, బొకేలు, పూలదండలు, ఫ్యామిలీ మీట్స్ ఒకటేమిటి, అనేక రకాలుగా ఒకటిగా కలిసి పోయారు. అయితే ఇప్పుడు అదే ఆరోపణ జగనన్న వదిలిన బాణం షర్మిల నోటి నుంచి రావడంతో టీడీపీ ఆరోపణలకు బలం చేకూరింది. అందుకే, ఇప్పుడు షర్మిల ప్రశ్నకు సమాధానం చెప్పమని ఏపీ టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబును ఓడించేందుకు 2019ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ వ్యూహత్మకంగా జగన్ తో చేతులు కలిపారు. ఒక దశలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీకి వచ్చి మరీ  రిటన్ గిఫ్ట్ ఉంటుందని చంద్రబాబుపై కామెంట్స్ చేశారు. ఆ సమయంలో టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచే చంద్రబాబును ఓడించేందుకు పథక రచన చేశారని షర్మిల వ్యాఖ్యలే దానికి నిదర్శనమని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్’కు కేసీఆర్ డబ్బులు పంపారని టీడీపీ మొదట్నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు షర్మిల చేసిన ఒక్క కామెంట్ తో అది రుజువైందని అంటున్నారు విశ్లేషకులు.  షర్మిల చేసిన ఈ ఒక్క కామెంట్ పై తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కుట్ర చేసి చంద్రబాబును ఓడించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ శ్రేణులు సామెతల చాటున సమాధానం దాట వేస్తున్నారు. టీడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అయితే,  తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం పై ముఖ్యమంత్రి వద్ద షర్మిల అడిగిన ప్రశ్నకు సమాధానం ఉందా అంటూ ప్రశ్నించారు. పార్టీ పుట్టి పుట్టక  ముందే షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం సృష్టిస్తే, ముందుముందు ఇంకెంత రచ్చ చేస్తాయో అన్నమాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  అయితే, అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ... వైఎస్ షర్మిల ఒకే తల్లి బిడ్డలు ...అనే విషయం మరిచి పోరాదని, అలాగే  వైఎస్సార్ సీపీ, వైఎస్సార్ టీపీ.. కూడా ఒకే దేవుని బిడ్డలు అనే నిజాన్ని, మరిచి పోరాదని కూడా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే, షర్మిల పార్టీ వెనక  ముందు ఎవరు న్నారు అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదన్న విషయాన్ని విస్మరించరాదని విశ్లేషకులు అంటున్నారు.చూడాల్సింది చాలా వుంది   

నిమిషానికి 11 చావులు.. కరోనా కన్నా ఆకలి వైరసే డేంజర్

కరోనా మహమ్మారి 20 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. రూపం మార్చుకుంటూ విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోయారు. కోట్లాది మంది బాధితులుగా మిగిలిపోయారు. ఇంకా కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇండియాలో కల్లోలానికి కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు అమెరికా సహా పలు దేశాలను గజగజలాడిస్తోంది. కరోనా మహమ్మారితో నిమిషానికి ఏడుగురు చనిపోతున్నట్లు వివిధ దేశాలు వెల్లడిస్తున్న రిపోర్టుల ఆధారంగా తెలుస్తోంది. కరోనా కంటే మరో డేంజర్ వైరస్ ప్రపంచంలో ఉందని తాజాగా వెల్లడైంది. ఆ వైరస్ తో నిమిషానికి 11 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. ఆ వైరస్ మరేదో కాదు ఆకలి. అవును తినడానికి తిండి లేక ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారు. ఈ ఏడాది కరోనా తెచ్చిన కష్టంతో ప్రపంచంలోని 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య 2 కోట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. కరోనా, లాక్ డౌన్ లతో ముదిరిన ఆర్థిక సంక్షోభానికి తోడు యుద్ధ సంక్షోభంతో దాదాపు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది.  చాలా దేశాలు కరోనా ఉన్నా తమ తమ బలగాల పటిష్ఠత కోసం 5,100 కోట్ల డాలర్లను ఖర్చు చేశాయని, అది ప్రపంచంలోని పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఆరు రెట్లు ఎక్కువని వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి యుద్ధ సంక్షుభిత దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని, అది ఈ దశాబ్దంలోనే అత్యంత ఎక్కువని ఆవేదన చెందింది. అది కూడా నిరుపేదలను ఆకలి రాజ్యంలోకి నెట్టేసిందని ఆక్స్ ఫాం నివేదికలో వెల్లడించింది. 

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలనం..

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఇప్పటికే దూకుడుగా వెళుతున్న బీజేపీ మరింత స్పీడ్ పెంచింది. అధికార టీఆర్ఎస్ నేతలు కూడా వాయిస్ పెంచుతున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన రేవంత్ రెడి... సీఎం కేసీఆర్ తో పాటు గులాబీ లీడర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ కు కౌంటర్లు ఇస్తున్నారు కారు పార్టీ నేతలు. ఆగమాగం బ్యాచ్ అడ్డగోలుగా మాట్లాతుందని కేటీఆర్ కామెంట్ చేశారు. అడ్డంగా పట్టుబడిన దొంగలు కూడా నీతులు చెబుతున్నారంటూ రేవంత్ ను టార్గెట్ చేశారు. తాజాగా మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  రేవంత్ రెడ్డి ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టారని మంత్రి హరీశ్ రావు అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో గెలవాలని చంద్రబాబు ప్రయత్నించారని... అయితే చంద్రబాబుని ఆంధ్రబాబు అంటూ తెలంగాణ ప్రజలు వెళ్లగొట్టారని చెప్పారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే చంద్రబాబుని తెలంగాణ ప్రజలు రానివ్వరని... అందుకే తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి ముందు పంపి, ఇప్పుడు చంద్రబాబు అడుగుపెడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా వచ్చారని హరీశ్ అన్నారు. వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లేనని చెప్పారు హరీష్ రావు.

రేవంత్ రెడ్డా.. కోవర్ట్ రెడ్డా? ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి కేసీఆర్, జగన్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. జల వివాదం పేరుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రోజా ఇంట్లో కేసీఆర్, జగన్ చర్చలు జరిపారని  అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు  వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటరిచ్చారు.  ’మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్ ల మంతనాలు జరిగాయని రేవంత్ రెడ్డి అంటున్నారనీ, జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో రేవంత్ రెడ్డి నిరూపించాలని’ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు.  కేసీఆర్ దైవ దర్శనం కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న మా ఇంటికి వచ్చారే తప్ప ఎలాంటి మంతనాలు జరగలేదని  రోజా స్పష్టం చేశారు. ఆయన రేవంత్ రెడ్డా, కోవర్ట్ రెడ్డో ముందు చెప్పాలని అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థమవుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమేననీ, జలవివాదం పరిష్కరించాల్సింది కేంద్రమే కాబట్టి సీఎం జగన్ ప్రధాని మోడీకి, జలశక్తి మంత్రికి లేఖ రాశారని చెప్పారు. దేశంలోనే వెనుకబడిన ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. జల వివాదంలో అనవసరంగా వాగుతున్నవారి విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేస్తున్నానని అన్నారు. తమ హయాంలో నీటి వివాదాలే లేవని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా, తెలంగాణ పోలీసులు కొట్టుకున్న విషయాన్ని మర్చిపోయారా అని గుర్తు చేశారు. టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

అమ్మాయిని మంచానికి కట్టేసి మరీ..

ఈ ప్రపంచం అభివృద్ధిలో ఆచరణలో ముందుకు వెళ్తుంటే.. కొన్నీ దేశాలు అభివృద్ధిలో వెనక్కి.. అమ్మయిలపై దాడులు చేయడంలో ముందుకు వెళ్తుంది. అన్ని దేశాలు 2021 ఉంటే  దేశాల్లో ఇంకా నైంటీస్లో  ఉన్న ఆచారాలు.. ఆలోచనలతోనే నడుస్తుంది.. కొన్ని దేశ ప్రజల ఆలోచనలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే రాజకీయనాకుల పరిపాలన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందని చెప్పాలి...మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఇంకా మన దేశంలో కూడా  నాటితో పాలిస్తే మహిళలపై దాడులు చెలరేగిపోతున్నాయి.. తాజాగా బెంగళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో మే లో బంగ్లాదేశ్ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 22ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. అరెస్ట్ అయిన 12 మందిలో 11 మంది బంగ్లాదేశ్ వారే కాగా, వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చిన బాధిత యువతి ఓ బార్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తోంది..  అంతకుముందు కూడా ఆమె దుబాయ్‌లో బార్‌లో పనిచేసేది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన యువతి తొలుత హైదరాబాద్‌లో ఓ మసాజ్ పార్లర్‌లో పనిచేసింది. ఈ క్రమంలో తనకు పరిచయం ఉన్న నలుగురు యువకులు, ఇద్దరు యువతులను బంగ్లాదేశ్ నుంచి అస్సాం మార్గంలో భారత్‌లోకి అక్రమంగా రప్పించి అక్కడితో ఉరోకోక బెంగళూరులో స్థిరపడేలా చేసింది. నగరంలోని సుబ్రహ్మణ్యస్వామినగరలో ఇంటిని అద్దెకు తీసుకుని అదే చిరునామాతో ఆధార్ కార్డులను కూడా సమకూర్చిపెట్టింది. వాళ్ళకి మన దేశంలో ఆధార్ కార్డు ఇచ్చారంటే మన వాళ్ళు వందలు అమ్ముడుపోయుంటారు లేకపోతే ఆ అమ్మాయికి ఆధార్ కార్డు ఎలా వస్తుంది.. ఇక ఈ విషయాన్నీ పక్కన పెడితే..   సహాయం చేసినవాడు మోసం చెయ్యడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో..ఆమె సాయంతో నగరానికి వచ్చి కుదురుకున్న వారు తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపారు. అంతేకాక, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వృభిచారంలోకి దింపేవారు. వారి చెరలో చిక్కుకున్న బాధితురాలు తను వ్యభిచారం మానేసి సొంతంగా స్పా పెట్టుకుంటానని తెగేసి చెప్పింది. ఇప్పటి స్నేహితులే రేపటి పగవారు అని చెప్పినట్లు.. ఈ క్రమంలో వారి మధ్య నగదు లావాదేవీల విషయంలో గొడవ మొదలైంది. స్పా పెట్టవద్దంటూ యువతిని మంచానికి కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు. ఆమె ప్రైవేటు భాగాలపై మద్యం సీసాలతో దాడిచేశారు. అదే నెల 19న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇది వైరల్ అవుతుండగానే మరో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలను చూసిన కొందరు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే నలుగురు యువకులు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన హకీల్, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్, మహ్మద్ బాబా కేశ్, రియాద్ బాబు, నస్రత్, కాజల్‌లను నిందితులుగా గుర్తించారు. నస్రత్, కాజల్ ఇద్దరూ రియాద్ బాబు భార్యలు కావడం గమనార్హం. రియాద్, సాగర్ పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పుల్లో గాయపడ్డారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, అత్యాచారం, నిర్భయ తదితర చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని 5 వారాల వ్యవధిలోనే చేధించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును కోర్టుకు సమర్పించామని తెలిపిన కమిషనర్.. కేసు దర్యాప్తు చేసిన బృందాన్ని ప్రశంసించారు. అలాగే లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.