భలే దొంగ.. స్మశానంలో మృతదేహం మాయం..
posted on Jul 10, 2021 @ 9:53AM
దొంగ తనం కొందరు వృత్తిగా చేస్తారు.. మరికొందరు పార్ట్ టైం గా చేస్తారు.. కొందరు అవసరాన్ని బట్టి దొంగతనం చేస్తుంటారు.. దొంగతనం అంటే ఏ ఇంట్లో ఉన్న బంగారాన్నో.. డబ్బులనో దొంగతనం చేస్తారు.. ఏ బస్సు లోనో.. వీధిలోనో.. ఆఫీస్ లోనో.. వాళ్లకు ఏదైనా అవసరం వచ్చే వస్తువులను దొంగతనం చేయడం చూశాం.. మనిషి అవసరమే ఎంతటి తప్పునైనా చేయడానికి మొగ్గుచూపిస్తాయి.. అది అందరికి తెలిసిన విషయమే.. కానీ తాజాగా కొంత మంది చేసిన దొంగతనం చూస్తే మీరు షాక్ అవ్వక మానరు ఇంతకీ ఆ దొంగతనం ఏంటి ? ఎవరు చేశారు..? ఎలా చేశారు? ఆ క్రేజీ గొంగతనం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ వార్త చదవాల్సిందే.. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకి..
దొంగలు ఇళ్లల్లోనే కాదు, స్మశాన వాటికల్లోనూ పడుతున్నారు. ఏంటి స్మశాన వాటికలో దొంగలు పడడం ఏంటి..? అయినా స్మశాన వాటికలో ఏం ఉంటుంది దొంగతనం చేయడానికి అని అనుకుంటున్నారా.. స్మశాన వాటికలో ఏం దొరుకుతుందని దొంగలు పడ్డారనేగా మీ అనుమానం పడుతున్నారా ? అక్కడే ఉంది అసలు విషయం. వారం రోజుల క్రితం ఒక చిన్నారి మరణించాడు.. ఆ చిన్నారి మృతదేహన్నీ స్మశానం లో పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే .. సమాధిలో ఉన్న ఆ చిన్నారి మృతదేహం మాయం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని పాతబస్తీ పహాడీషరీఫ్ స్మశానవాటికలో చోటుచేసుకుంది. అసలు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు.. ఎందుకు తీసుకెళ్లారనే విషయం మాత్రం అంతుచిక్కని మిస్టరీగా మారింది. అయితే పూడ్చి పెట్టిన చిన్నారి మృతదేహం మాయం కావడంపై చిన్నారి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు రంగంలోకి దిగారు.. మృతదేహం మాయం కావడంపై విచారణ చేపడుతున్నారు.
అయితే స్మశాన వాటికలోంచి చిన్నారి మృతదేహం మాయం కావడం గుర్తించిన కుటంబ సభ్యులు.. స్మశాన వాటికలోని చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ కనిపించకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారులను కిడ్నాప్ చేయడం చూశాం.. కానీ.. పూడ్చి పెట్టిన చిన్నారి శవాన్ని ఎత్తుకెళ్లడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తోంది. శవాన్ని ఎత్తుకెళ్లే అవసరం ఏముంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..