హరీష్ కు ఉచ్చు బిగుస్తోందా? ఈటల సీన్ రిపీట్ కానుందా? 

ఉద్యమకాలం నుంచి తెరాసలో కీలక పాత్రను పోషించిన నాయకులు చాలామందే ఉన్నారు. గాదె ఇన్నయ్య మొదలు అనేక మంది ఉద్యమాన్ని నిలబెట్టడంలో, ముందుకు తీసుకు పోవడంలో కీలక భూమికను పోషించారు. అయితే, ఆందరూ ఒకెత్తు అయితే, కేసీఆర్’కు కుడి ఎడమ భుజాలుగా నిలిచిన ఈటల రాజేందర్, హరీష్ రావు ఒకెత్తు. ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస రాజకీయ పార్టీ అవతారం మార్చి, ఆ తర్వాత కుటుంబ పార్టీ అవతారం ఎత్తిన తర్వాత, ముఖ్యంగా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలోమార్పు మొదలైంది. ప్రాధాన్యతలు మారుతూ వచ్చాయి. కుడి ఎడమ భుజాలు రెండూ భారంగా మారాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అరగంటలోనే ఈటల రాజేందర్ అక్రమాల కథనం తెరపైకి వచ్చింది . గంటల్లో విచారణకు ఆదేశాలు వెళ్ళాయి. మరో  24 గంటలు తిరక్కుండానే, విచారణ పూర్తయి నివేదిక సిద్దమైంది. అంతే మరో మాటకు ఆస్కారం లేకుండా ఆయన మీద వేటు పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని మంత్రి వర్గం నుంఛి బర్తరఫ్ చేసి ఒక భుజం భారాన్ని తగ్గించుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అనేది అందరు చూస్తున్నదే.  ఇక కేసీఆర్ రెండవ భుజం సంగతేంటి?.. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈటలను పంపించిన విధాగానే, హరీష్’కు ఉద్వాసన తప్పదని చాలా మంది భావించారు.ఇప్పటికీ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే, తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతవరకు ట్రబుల్ షూటర్’గా పేరున్న హరీష్ రావుకే ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన్ని మంత్రి వర్గంలోకే తీసుకోలేదు. అనంత కోటి లింగాల్లో ఒకడిగా మిగిలి పోయారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో కారు పదహారు బోల్తా కొట్టడంతో  కేసీఆర్’కు తత్త్వం బోధపడిందో, ఇంకేమైనా జరిగిందో కానీ, హరీష్’ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి వర్గంలోకి అయితే తీసుకున్నారు, కానీ, ప్లానింగ్ లేని ఫైనాన్సు ఇచ్చి సిద్దిపేటకు పరిమితం చేశారు. ఆర్థిక మంత్రి లేకుందానే, ఆ శాఖకు సంబందించిన విషయాలపై సమీక్షలు, నిర్ణయాలు జరిగిపోయాయనే వార్తలు వచ్చాయి.  హరీష్’ను పక్కన పెట్టినప్పుడు ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగిందని అంటారు. ఆయన తనకు జరిగిన అవమానాలను మౌనంగా భరించారని అంటారు. ఎవరో కాదు సహా బాదితుడు ఈటల, హరీష్ అవమానంతో ఏడ్చారని న్నారు. సరే ఆ మాటలను హరీష్ ఖండించారు అనుకోండి అది వేరే విషయం. అదెలా ఉన్నా అవమానాలు  కూడా ఆయనకు ఒక విధంగా మేలే చేశాయి. ఆయన మౌన వేదన  ఆయన ఇమేజిని పెంచింది. ఆయన మౌనంగా ఉన్నా, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, కొద్దిమంది మత్రులతో సహా ఆయన అభిమానులలో, కేసీఆర్ పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఆగ్రహం నాయకులలో బహిరంగంగ వ్యక్తం కాకపోయినా, ప్రజలు, కార్యకర్తల్లో భగ్గుమన్న సందర్భాలు లేక పోలేదు.  ఈటల ఎపిసోడ్ తర్వాత హరీష్ రావులో వచ్చిన మార్పు, ఆయన ఇమేజ్’ని తెబ్బతీసిందని పార్టీలోని ఆయన అనుచరులే అంగీకరిస్తున్నారు. ఈటల విషయంలో హరీష్ రావు యూ టూ బ్రూటస్ తరహాలో వ్యవహరించారని, తమ పదవిని కాపాడుకోవడం కోసం ఈటలను వదిలేశారన్నఅభియోగం వినవస్తోంది. దీనికి తోడు గతంలోనే  కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా తనకు అభ్యంతరం లేదని.. ఆయన కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేయడానికి సిద్ధమని ప్రకటించడంతో ఇంకా చులకన భావన ఏర్పడిందని చెబుతున్నారు. ఈటల ఎపిసోడ్ తర్వాత కేసీఆర్’ కు హరీష్ అవసరం వచ్చింది, కాబట్టి మళ్ళీ ఆయన్ని దగ్గరకు తీశారు.   కేటీఆర్ కంటే,  ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతను కూడా పరోక్షంగా హరీష్ కే అప్పచెప్పారు. ఒకటి రెండు కేబినెట్ సబ్ కమిటీలతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కూడా హరీష్ భుజాల మీద పెట్టారు. అయితే,హరీష్’ను దగ్గరకు తీస్తోంది, ఆయన్ను కొండ మెట్లు ఎక్కిస్తోంది, అదను చూసి దెబ్బతీసేందుకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి, ఇప్పటికీ హరీష్ పని హరీష్ చేస్తుంటే, కేసీఆర్ పని కేసీఆర్ చేస్తున్నారని,హరీష్’ను నిఘా నేత్రం వెంటాడుతోందని, పార్టీ శ్రేణులు గుసగుసలు పోతున్నాయి. ఈ నేపధ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అరగంటలో ... ఈటల ఉద్వాసన ముందు  సీన్లు ..రిపీట్ అవుతాయా? అన్న అనుమానాలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.  కేసీఆర్ కు ఒక్కసారి అనుమానం వస్తే అంత ఈజీగా నమ్మరని పార్టీ శ్రేణుల సమాచారం. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దగ్గరకు తీసుకొని బాధ్యతలు ఇచ్చినా.. ఓ కన్నేసి ఉంచుతారని అంటున్నారు. ఇప్పుడు హరీష్ మీద ఒకటి  కాదు డిఫరెంట్ యాంగిల్స్’లో   నిఘానేత్రాలు పనిచేస్తున్నాయని సమాచారం.అంతే కాకుండా ఇప్పటికే హరీష్ రావు వేలుతోనే ఆయన కంట్లో పోడుచుకునేలా చేసి, ఆయన ఇమేజ్’ని  గణనీయంగా దెబ్బ తీసిన కేసీఆర్, హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఫలితాలు వచ్చే వరకు  కూడా అగకపోవచ్చని, హరీష్’ను పంపి కేటీఆర్ పట్టాభిషేకం జరిపించేసినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అదే సమయంలో హరీష్ ను తక్కువగా అంచనా వేయలేమనే మాట కూడా వినిపిస్తున్నా,కానీ, ఇమేజ్ దెబ్బతిన్న నేపధ్యంలో ట్రబుల్ షూటర్ సైతం చేతులెత్తేయడం మినహా చేయగలిగింది ఏమీ ఉండదని  అంటున్నారు.

మమతకు మరో ఎదురు దెబ్బ 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాలం కలిసి రావడం లేదో లేక ఆమే కాలానికి ఎదురీతున్నారో ఏమో గానీ, కష్టాలు క్యూ కట్టి ఆమెను వెంటాడుతున్నాయి. ఓ వంక అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోజరిగిన హింస. ఆమెమెడకు చుట్టుకుంటోంది. సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం జరుపుతున్న విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయో అనే భయం మమతను,ఆమె ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి మానవ హక్కుల సంఘం విచారణను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. ఎన్నికల అనంతర హింస పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై, వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరింది. అయితే అందుకు కలకత్తా హై కోర్టు, నో అనేసింది. కలకత్తా హై కోర్టు ఆదేశాలపై మమత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అక్కడా ఆమెకు  చుక్కెదురైంది.ఈ నేపధ్యంలో  హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా విచారణ మిటీని ఏర్పాటు చేశారు. అయితే, కమిటీ విచారణను అడ్డుకోవడమే కాకుండా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కమిటి సభ్యులపై కూడా భౌతిక దాడులకు పాల్పడ్డడ్డారు.ఇందుకు సమబందించిన ఫోటోలు, వీడియో ఆధారాలను కమిషన్ సేకరించినట్లు సమాచారం.  బుధవారం కలకత్తా హై కోర్టు మమతకు మరో షాకిచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో నందిగ్రామ్’లో ఓటమి చవిచూసిన ఆమె, తమ ప్రత్యర్ధి, బీజీపీ అభ్యర్ధి సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ, కలకత్తా హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతవరకు అయితే కొంత బాగానే వుంది.కానీ, ఆమె మమత కదా, అంతటితో ఆగలేదు, ఆమె పిటీషన్’పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, జస్టిస్‌ కౌషిక్‌ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ, కేసు విచారణ మరో బెంచికి మార్చలాని కోరారు. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు... న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ తీవ్రంగా హెచ్చరించింది. అంతే కాదు, హై కోర్టు ఆమెకు రూ.5లక్షల జరిమానా విధించింది. ఇదలా ఉంటే అసలు ఆమె పదవి ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఎన్నికలలో ఒడి పోయిన ఆమె ఆరు నెలలోగా శాసన సభ లేదా మండలి సభ్యురాలుగా ఎన్నిక కావలసి ఉంటుంది. కొవిడ్ కారణంగా ఆమె గడువులోగా ఎన్నికయ్యే అవ్క్స్సం కనిపించడం లేదు. సో ... నవంబర్ నాలుగు తర్వాత ఆమె పదవి ఉంటుందో లేదో తెలియని అనిశ్చిత  పరిస్థితికి తోడూ కోర్టు చికాకులు బెంగాల్ పులిని బెంబేలెత్తిస్తున్నాయి.

ముగ్గురి కూతుళ్లకు ఉరేసిన తల్లి.. చివరికి..

బంగారు తెలంగాణలో బతుకు కరువైంది.. తెలంగాణాలో పునాదులు ఒకడివి..పుట్టెడు దుఃఖాలు మరొకడివి. పైసల్ ఉన్నవాడికి అందలం.. ఆకాశం.. అంతరిక్షలకు తీసుకుపోతుంటే.. అదే డబ్బు పేద వాడిని పాతాళానికి తోకేస్తుంది..ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని, ఎప్పుడు జరగని ఆర్థిక ఆత్మహాత్యలు జరిగాయి.. పాలకులకు ఓట్లు కావలసినప్పుడు.. ప్రజలు హామీలు ఇచ్చిన నాయకులూ ప్రజలకు ఉపాధి లేక.. జానెడు కడుపుకు పిడికెడు అన్నం దొరకక.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజలను చూస్తూ నవ్వుకోవడమే తప్ప.. కాపాడడం తెలియడం లేదు.  అది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం రాంనగర్‌ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది. తను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు, తల్లి మరణించారు. కాగా, ఉరి జారడంతో మరో కూతురు ప్రాణాలతో బయటపడింది. తల్లి ఉమారాణి(32) మొదట తన ముగ్గురు పిల్లలకు ఉరి వేయగా హర్షిణి(13), లక్కీ(11) మృతి చెందారు. చిన్న కూతురు శైనీ(8) ప్రాణాలతో బయటపడింది. కరోనా వచ్చి అందరిని ఇబ్బందులో పడేసింది.  ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తల్లి మరణంతో చిన్నారి శైనీ అనాథగా మారింది.

షర్మిల వెంట విజయమ్మ, వివేకా ఫ్యామిలీ.. జగన్ ఒంటరివాడయ్యారా..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు ముదిరిపోయాయా? ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీలో ఒంటరివాడయ్యారా? తల్లి కూడా జగన్ ను దూరం పెట్టిందా? వైఎస్సార్ కుటుంబానికి సంబంధించి కొన్ని రోజులగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఏదో జరుగుతుందనే అనుమానాలు వచ్చేలానే కనిపిస్తున్నాయి. జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం, జగన్ ప్రస్తావన లేకుండానే తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.  అంతేకాదు విజయమ్మ కూడా షర్మిల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉంటుండగా.. విజయమ్మ మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నారు. షర్మిల వెంటే ఉంటున్నారు. దీంతో వైఎస్ కుటుంబంలో విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  కుటుంబంలో విభేదాలపై జరుగుతున్న ప్రచారానికి వైఎస్ జయంతి కార్యక్రమాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. వైఎస్సార్ జయంతి రోజున తెలంగాణలో పార్టీని ప్రకటించనున్న షర్మిల.. ఇడుపులపాయలోని తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జెండాను సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ పాల్గొన్నారు. జగన్ తో కాకుండా విజయమ్మ.. షర్మిలతో కలిసి వైఎస్ కు నివాళి అర్పించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అంతేకాదు కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వంపై పోరాడుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతతో  ఇతర కుటుంబ సభ్యులు కూడా షర్మిలతో పాటే వైఎస్సార్ కు నివాళి అర్పించడం ఆసక్తి కల్గిస్తోంది.   వైఎస్సార్ జయంతి సాక్షిగా జరిగిన, జరుగుతున్న పరిణామాలతో కుటుంబంలో జగన్ ఒంటరివాడయ్యారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తన తల్లితో పాటు కుటుంబ సభ్యులంతా ఉదయమే ఇడుపులపాయకు చేరుకుని నివాళి అర్పించగా.. జగన్ మాత్రం మధ్యాహ్నం 4 గంటలకు ఆ కార్యక్రమం పెట్టుకున్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లడం ఇష్టం లేకే జగన్ సాయంత్రం వెళుతున్నారా లేక... కుటుంబ సభ్యులే జగన్ తో కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించడానికి ఇష్టపడలేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. కొడుకు జగన్ తో కొంత కాలంగా విజయమ్మ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె తాడేపల్లి వెళ్లకుండా షర్మిలతో ఉంటున్నారని చెబుతున్నారు.  మొత్తంగా వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. షర్మిలతో పాటు వైఎస్ వివేకా కూతురు కూడా ఇడుపులపాయ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి హత్య కేసు విచారణలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కొంత కాలంగా వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. పరోక్షంగా జగన్ పై కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీత. షర్మిలతో కలిసి ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాక్.. 

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డికి హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు సిటీ పోలీసులు. కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు స్పష్టించారనే ఫిర్యాదులతో రేవంత్ రెడ్డిపై బేగంబజార్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లులో రెండు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన నగరంలో ర్యాలీ నిర్వహించారు . ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్ చేరుకున్నారు. పెద్దమ్మ గుడి, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా ఆయన ర్యాలీ సాగింది.  వందలాది కార్లు , బైకులతో రేవంత్ రెడ్డి ర్యాలీ సాగింది. అయితే అనుమతి లేకుండానే ర్యాలీ తీశారని,చాలా ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారనే ఫిర్యాదులతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొవిడ్ రూల్స్ బ్రేక్ చేశారనే ఆరోపణలతో డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. 

అక్రమ సంబంధంలో మూడు ముక్కలాట.. చివరికి వ్యక్తి మర్డర్..

మానవ సంబంధాలకు విలువ నివ్వండి అని ఒకపక్క హ్యూమన్ బియింగ్స్ మొత్తుకుంటుంటే మరో పక్క చాలా అక్రమ సంబంధాలు నడుపుతూ మనుషులను చంపుకుంటున్నారు.. తాజాగా ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునే  విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవలు కారణంగా నిండు ప్రాణం బలయ్యిుంది. అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ముందుకు వెళ్లి మొత్తం చదవండి..  ఓపెన్ చేస్తే.. అది నల్గోండ జిల్లా. జాజిరెడ్డి గూడెం మండలం. అడివెంల గ్రామం.. ఈ గ్రామం లో జూలై 2న సైదులు అనేవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం ఉలికి పడింది.. హత్య కు మందు కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి మరణించడంతో ఒక్కసరిగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, షాక్ తిన్నారు.. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు సైరన్ వేసుకుని హత్య జరిగిన స్థలానికి వచ్చారు..  హత్యకు సంబందించిన వివరాలు, అధరాలు సేకరించారు. ఆ తరువాత  నాలుగు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. అప్పుడు ఆ హత్యకు గల కారణాలు, నిజాలు బయటికి వచ్చాయి. అవేంటో చూద్దాం పదండి.   అడివెంల చెందిన వ్యక్తి. అతని పేరు  బొర్ర శైలేందర్. అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎప్పటికైనా మనకంటే ఒక జీవితం ఉండాలి అని అనుకున్నాడేమో.. ఏడాది క్రితం శైలేందర్ తన వివాహేతర సంబంధానికి టాటా చెప్పి.. వేరే మహిళను  పెళ్లి చేసుకున్నాడు. ఇక అంటే శైలేందర్ తో అప్పటి వరకు అక్రమ సంబంధం నడిపిన మహిళతో  గత 4 నెలలుగా మనస్పర్ధలు వచ్చి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. కట్ చేస్తే.. అదే సమయంలో గ్రామానికి చెందిన శతకోటి  సైదులు(27) అనే వ్యక్తితో  శైలేందర్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తది చెప్పాడు..10 ఏళ్ళు వివాహేతర సంబంధం నడిపి అతని దారి అతను చూసుకున్నాడు నా దారి నేను చూసుకుంటాను అనుకుంది ఆవిడ.. ఇక అంటే ఆ విషయం సైదులు ప్రాణానికి పాడేకు సిద్ధం చేసింది.. ఈ విషయం తెలిసిన శైలేంద్ర కోపం కట్టలు తెంచుకుంది. సైదులును పలుమార్లు హెచ్చరించాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్నమహిళతో, నువ్వు మళ్లీ ఎలా వివాహేతర సంబంధం పెట్టుకుంటావని గొడవపడ్డాడు. అయినా సైదులు మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించ సాగాడు. దీంతో సైదులుపై కక్ష పెంచుకున్నశైలేంద్ర తన స్నేహితుడు సతీష్ తో కలిసి సైదులును హత్యచేయటానికి పధకం వేశాడు. అందులో భాగంగా జూన్ 29న వేసుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు. మళ్లీ ఈనెల 2వ తేదీన ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి సైదులు గ్రామంలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం సేవిస్తున్నాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చాడు. అప్పటికే సైదులు పైన త్రాచు పాముల పగపట్టిన శైలేందర్ సైదులు ని వేయడానికి అదే అదును అనుకుని.  తన స్నేహితుడు సతీష్ తో కలిసి సైదులు మెడపై కత్తితో నరికి పరారయ్యాడు. కేసునమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం నిందితులు శైలేంద్ర, సతీష్ లను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరు పరి

కొత్త మంత్రులు.. అంతా హేమాహేమీలు.. మోదీ సెల‌క్ష‌న్ అదుర్స్‌..!

78 మంత్రుల‌తో కేంద్రంలో జంబో కేబినెట్ ఏర్ప‌డింది. కొత్తగా 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులు మోదీ మంత్రిమండ‌లిలో చేరారు. కేబినెట్ కూర్పున‌కు మోదీ గట్టి కసరత్తే చేసినట్టున్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, యువ‌త‌రం, అనుభ‌వం.. ఇలా అన్ని అంశాల‌కూ ప్రాధాన్య‌త ఇచ్చారు. కొత్త కేబినెట్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు న‌లుగురు ఉన్నారు. 13 మంది లాయర్లు, ఆరుగురు డాక్టర్లు, ఐదుగురు ఇంజినీర్లు, ఏడుగురు మాజీ ప్రభుత్వ అధికారులు, ఏడుగురు రీసెర్చి డిగ్రీ, ముగ్గురు బిజినెస్‌ డిగ్రీలు చేసిన వారున్నారు. ఎస్సీలు 12 మంది, ఎస్టీలు 8 మంది, ఓబీసీలు 27 మంది మంత్రులుగా చేరారు. వచ్చే ఏడాది ఎన్నికలు జ‌రిగే రాష్ట్రాల నుంచి ఎక్కువ మందికి కేబినెట్‌లో స్థానం క‌ల్పిస్తూ.. రాజ‌కీయ అంశాల‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు ప్ర‌ధాని మోదీ.  నారాయణ రాణే.. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పనిచేశారు. గ‌తంలో ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖలో అధికారిగా ఉద్యోగం చేశారు. సర్బానంద సోనోవాలా.. అసోం ముఖ్య‌మంత్రిగా ఫుల్ పాపుల‌ర్‌. అసోం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. ఇంత‌కుముందు మోదీ కేబినెట్‌లో క్రీడల శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్‌) మంత్రిగా ఉన్నారు.  జ్యోతిరాదిత్య సింధియా.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఇటీవ‌లే బీజేపీలో చేరారు. సింధియా రాజ‌కుటుంబానికి చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు కావ‌డం.. పార్టీలో చేరినందుకు ప్ర‌తిఫ‌లంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. గ‌తంలో ఆయ‌న తండ్రి చేసిన‌.. విమాన‌యాన శాఖ మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు పీఎం మోదీ. గ‌తంలో కేంద్ర విద్యుత్ శాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.  జాన్ బార్లా.. బెంగాల్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. తేయాకు తోటలో కార్మికుడిగా పనిచేశారు. శోభ కరంద్లాజే.. ఫ‌స్ట్ టైమ్ ఎంపీ. శోభ కరంద్లాజే కర్ణాటకలోని ఉడుపి చిక్‌మగళూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.  శంతనూ ఠాకూర్... బెంగాల్‌లోని బంగోన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. బీఏ ఇంగ్లీష్ చేశారు.  మంజుపారా మహేంద్ర భాయ్.. గుజరాత్‌లోని సురేంద్ర నగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్‌గా ప్రసిద్ధులు. సామాజిక కార్యకర్త.  డాక్టర్ మురుగన్... మద్రాస్ హైకోర్టులో లాయర్. 15 సంవత్సరాలుగా ప్రజా జీవనంలో ఉన్నారు. జాతీయ షెడ్యూల్ కాస్ట్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.  నితీశ్ ప్రామాణిక్... బెంగాల్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం.  ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉన్నారు. మోదీ కేబినెట్‌లో యువకుడిగా గుర్తింపు పొందారు.  డా. వీరేంద్ర కుమార్.. పార్లమెంట్‌లోనే అత్యంత సీనియర్. 7 సార్లు ఎంపీ. మధ్యప్రదేశ్‌లోని టిక్‌మార్గ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మోదీ కేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బాల కార్మిక వ్యవస్థపై పీహెచ్‌డీ చేశారు.  ఆర్సీపీ సింగ్.. మాజీ ఐఏఎస్‌. బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి 2 సార్లు ఎంపీ. సీఎం నితీశ్‌కు అత్యంత సన్నిహితుడు.  అశ్వనీ వైష్ణవ్.. ఒడిశా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్‌. మాజీ ఐఏఎస్‌. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్‌లో విశేష అనుభవం.  పశుపతి కుమార్ పారస్.. బిహార్‌లోని హజీపూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పనిచేశారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.  భూపేందర్ సింగ్ యాదవ్.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి అత్యంత సన్నిహితుడు. క్షేత్ర స్థాయిలో గ‌ట్టి పట్టున్న నేత‌. అనేక పార్లమెంటరీ కమిటీల్లో్ సభ్యునిగా ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉండేవారు. పంకజ్ చౌదరి.. యూపీలోని మహారాజ్‌ గంజ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 6 సార్లు ఎంపీగా గెలిచారు. యూపీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. మిలటరీ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయడం ఈయన ప్రత్యేకత. మీనాక్షి లేఖి.. బీజేపీ నేత, ఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి లేఖి న్యాయవాదిగా సుపరిచితురాలు. ఆమె వాగ్ధాటి అందరినీ ఆకట్టుకుంటుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఆమె వ్యవహరించారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన వివిధ సంస్థల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు.  అనుప్రియ సింగ్ పటేల్.. అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆమె దివంగత డాక్టర్ సోనీలాల్ పటేల్ కుమార్తె. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఛత్రపతి సాహూజీ మహరాజ్ విశ్వవిద్యాలయాల్లో చదివారు.  కపిల్ మోరేశ్వర్ పాటిల్... మహారాష్ట్రలోని భీవండి నుంచి ఎంపీ. 2 సార్లు ఎంపీ. సర్పంచ్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభం.  సుభాశ్ సర్కార్... బెంగాల్‌లోని బంకూరా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. ప్ర‌ముఖ‌ గైనకాలజిస్ట్‌. రామకృష్ణ మిషన్‌లో కార్యకర్తగా పనిచేశారు.  కిషన్ రావ్ కర్నాడ్... మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ మేయర్‌గా పనిచేశారు. ప్ర‌ముఖ‌ వైద్యులు.  రాజ్‌కుమార్ రంజన్ సింగ్... మణిపూర్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం. జాగ్రఫీ ప్రొఫెసర్‌గా సుప్రసిద్ధులు. జాగ్రఫీలో పీహెచ్‌డీ చేశారు. విశ్వేశ్వర్ తుడు... ఒడిశాలోని మయూర్‌బంజ్ నుంచి ప్రాతినిధ్యం. సీనియర్ ఇంజినీర్‌గా పనిచేశారు. జలవనరుల విషయంలో నిపుణులు. దర్శన విక్రమ్ జర్దోశ్.. గుజరాత్‌లోని సూరత్ ఎంపీ దర్శన విక్రమ్ జర్దోశ్. ఆమె 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా కూడా ఆమె వ్యవహరించారు.  అన్నపూర్ణ దేవి... జార్ఖండ్‌లోని కొడెర్మా బీజేపీ ఎంపీ అన్నపూర్ణ దేవి 2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ, పునరుద్ధరణీయ ఇంధనాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 1998-2000 మధ్య కాలంలో బిహార్ శాసన సభ సభ్యురాలిగా సేవలందించారు.  ప్రతిమ భౌమిక్... త్రిపుర (తూర్పు) నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతిమ భౌమిక్. రాజకీయాల్లో ప్రవేశించడానికి పూర్వం ఆమె అగ్రికల్చరిస్ట్. ప్రస్తుతం ఆమె రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు. భారతి ప్రవీణ్ పవార్.. మహారాష్ట్రలోని డిండోరి (ఎస్‌టీ) నియోజకవర్గం బీజేపీ ఎంపీ భారతి ప్రవీణ్ పవార్. ఆమె నాసిక్‌లో ఎంబీబీఎస్ చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.  రాజీవ్ చంద్రశేఖర్... కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా బాధ్యతల్లో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంలో పట్టా తీసుకున్నారు. భానుప్రతాప్ సింగ్ వర్మ... యూపీలోని జాలూన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.  ఏ. నారాయణ స్వామి... కర్నాటకలోని చిత్రదుర్గ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కర్నాటకలో మంత్రిగా పనిచేశారు.  కౌశల్ కిశోర్... యూపీలోని మోహన్‌లాల్ గంజ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం. 2 సార్లు ఎంపీ.  అజయ్ భట్‌.. ఉత్తరాఖండ్ నైనీటాల్ ఉదమ్‌సింగ్ నగర్ నుంచి ఎంపీ. 3 సార్లు ఎమ్మెల్యే. ప్ర‌ముఖ న్యాయవాది.  బి.ఎల్. వర్మ... యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. అజయ్ కుమార్... యూపీలోని ఖేరీ నుంచి ఎంపీగా బాధ్యతల్లో ఉన్నారు. 2 సార్లు ఎంపీ. ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.  చౌహాన్ దేవుసింగ్.. గుజరాత్‌లోని ఖేడా నుంచి ఎంపీగా గెలుపొందారు. 2 సార్లు ఎంపీ. 2 సార్లు ఎమ్మెల్యే. ఆలిండియా రేడియోలో ఇంజినీర్‌గా పనిచేశారు. భగవంత్ ఖుబా... కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 సార్లు ఎంపీ. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.  

మంత్రుల శాఖ‌లివే.. మోదీ భ‌లే సెట్ చేశారే..! కిష‌న్‌రెడ్డికి చిరంజీవి శాఖ‌..

కొత్తగా 43 మంది మంత్రుల చేరిక‌తో కేంద్ర కేబినెట్ పరిమాణం 78కి చేరింది. రాష్ట్రపతి భ‌వ‌న్‌లో బుధ‌వారం 15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్పుచేర్పుల‌తో కొలువుదీరిన కొత్త కేబినెట్‌లో మంత్రులకు కేటాయించిన శాఖ‌లు ఇలా ఉన్నాయి.. నరేంద్ర మోదీ - ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖ.  అమిత్‌ షా - హోంశాఖతో పాటు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన సహకార శాఖ. జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ. ఆయ‌న తండ్రి దివంగ‌త మాధ‌వ‌రావ్ సింధియా కూడా గ‌తంలో ఇదే శాఖ‌ను నిర్వ‌ర్తించారు. మన్‌సుఖ్‌ మాండవీయ - ఆరోగ్యశాఖ. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో కీల‌క శాఖ వ‌రించింది. స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ ధర్మేంద్ర ప్రదాన్‌ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ హర్‌దీప్‌ సింగ్‌ పూరీ - పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ పీయూష్‌ గోయల్‌ - వాణిజ్య శాఖకు అదనంగా జౌళి శాఖ అనురాగ్‌ఠాకూర్‌ - సమాచార, ప్రసారాలు; క్రీడలు రాజ్‌నాథ్‌ సింగ్‌ - రక్షణ శాఖ నితిన్‌ గడ్కరీ - రవాణా శాఖ నిర్మలా సీతారామన్‌ -ఆర్థిక శాఖ నరేంద్రసింగ్‌ తోమర్‌ - వ్యవసాయశాఖ డాక్టర్‌ జైశంకర్‌ -విదేశీ వ్యవహారాలు కిషన్‌రెడ్డి - పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి. గ‌తంలో చిరంజీవి సైతం ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిగా చేశారు. టూరిజంతో పాటు కీల‌క‌మైన ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కూడా కిష‌న్‌రెడ్డికి ద‌క్క‌డం విశేషం. అశ్వినీ వైష్ణవ్‌ - రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు భూపేంద్ర యాదవ్‌ -కార్మిక శాఖ పశుపతి కుమార్‌ పారస్‌  - ఫుడ్‌ ప్రాసెసింగ్‌  గిరిరాజ్‌ సింగ్‌- గ్రామీణాభివృద్ధి  పురుషోత్తం రూపాల - డెయిరీ, మత్స్య శాఖ అర్జున్‌ ముండా - గిరిజన సంక్షేమం పీయూష్‌ గోయల్‌ - వాణిజ్యం, పరిశ్రమలు, అదనంగా జౌళిశాఖ, ఆహార, ప్రజా పంపిణీ ప్రహ్లాద్‌ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ నారాయణ్‌ రాణే - చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సర్వానంద్‌ సోనోవాల్‌ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్‌ శాఖ ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ - సామాజిక న్యాయం, సాధికారత గిరిరాజ్ సింగ్‌ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ - ఉక్కు శాఖ గజేంద్రసింగ్ షెకావత్‌ - జల్‌శక్తి మహేంద్రనాథ్‌ పాండే - భారీ పరిశ్రమల శాఖ పురుషోత్తమ్‌ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ రాజ్‌కుమార్‌ సింగ్‌ - విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన శాఖ భూపేంద్ర యాదవ్‌ - పర్యావరణ, అటవీశాఖ, కార్మిక శాఖ కిరణ్‌ రిజిజు - న్యాయశాఖ

మ‌హిళా మంత్రులు వీరే.. వారెవా, క్యా సెల‌క్ష‌న్ హై!

78మంది మంత్రుల‌తో కేంద్ర కేబినెట్ అట్ట‌హాసంగా కొలువుదీరింది. ఈసారి మంత్రిమండ‌లిలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశారు ప్ర‌ధాని మోదీ. ఇప్ప‌టికే నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజ‌న్ జ్యోతి, రేణుకా సింగ్‌లు కేబినెట్‌లో కొన‌సాగుతుండ‌గా.. కొత్త‌గా మ‌రో ఏడుగురు మ‌హిళా ఎంపీల‌ను మంత్రిమండ‌లిలోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీల‌తో పాటు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షం అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్‌కు కూడా కేబినెట్‌లో చోటు ద‌క్కింది.  అనుప్రియ సింగ్ పటేల్.. అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆమె దివంగత డాక్టర్ సోనీలాల్ పటేల్ కుమార్తె. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఛత్రపతి సాహూజీ మహరాజ్ విశ్వవిద్యాలయాల్లో చదివారు.  మీనాక్షి లేఖి.. బీజేపీ త‌ర‌ఫున ఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు. వృత్తిప‌రంగా న్యాయవాది. మంచి వాగ్దాటి ఉండ‌టంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. సామాజిక కార్యకర్త కూడా. జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన వివిధ సంస్థల్లో చురుకైన పాత్ర పోషించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా మీనాక్షి లేఖికి కేబినెట్‌లో చోటిచ్చార‌ని అంటున్నారు.  ప్రతిమ భౌమిక్.. త్రిపుర (తూర్పు) నియోజకవర్గం బీజేపీ ఎంపీ. రాజకీయాల్లోకి రాక‌ముందు ఆమె అగ్రికల్చరిస్ట్. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు. భారతి ప్రవీణ్ పవార్.. మహారాష్ట్రలోని డిండోరి (ఎస్‌టీ) నియోజకవర్గం బీజేపీ ఎంపీ. వృత్తిరిత్యా డాక్ట‌ర్‌. నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.  శోభ కరంద్లాజే.. కర్ణాటకలోని ఉడుపి చిక్‌మగళూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.  దర్శన విక్రమ్ జర్దోశ్.. గుజరాత్‌లోని సూరత్ ఎంపీ. 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు కూడా.  అన్నపూర్ణ దేవి.. జార్ఖండ్‌లోని కొడెర్మా ఎంపీ.  2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ, పునరుద్ధరణీయ ఇంధనాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో కూడా సభ్యురాలు.    

స్టీల్‌ప్లాంట్ అమ్మ‌కంపై కేంద్రం దూకుడు.. జ‌గ‌న్‌రెడ్డి ఇప్పుడేం చేస్తారో?

నెల‌ల త‌ర‌బ‌డి ఉద్య‌మం. నెల‌ల త‌ర‌బ‌డి పోరాటం. నెల‌ల త‌ర‌బ‌డి ఆందోళ‌న‌. నెలల త‌ర‌బ‌డి ధ‌ర్నా. నెల‌ల త‌ర‌బ‌డి దీక్ష‌. ఆంధ్ర‌రాష్ట్రమంతా ఒక్క‌తాటిపైకి వ‌చ్చి.. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు.. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మొద్దంటూ ఎంత‌గా పోరాడినా.. కేంద్రాన్ని ఎంత‌గా వేడుకున్నా.. మోదీ స‌ర్కారు మాత్రం మెత్త‌బ‌డ‌లేదు. సీఎం జ‌గ‌న్‌రెడ్డి కేంద్రానికి రాసిన ఉత్తుత్తి లేఖ‌లు, ఉత్తుత్తి చ‌ర్య‌లు కూడా ఫ‌లించ‌లేదు. క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో యావ‌త్ దేశానికి మెడిక‌ల్ ఆక్సిజ‌న్ అందించి.. దేశం ఊపిరి నిలిపిన‌.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అంగ‌ట్లో అడ్డ‌గోలుగా అమ్మేందుకు కేంద్రం మ‌రో ముంద‌డుగు వేసింది.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. కన్సల్టెంట్‌ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి పెట్టింది కేంద్రం.  లీగ‌ల్ అడ్వైజ‌ర్ ఎంపిక‌కు కేంద్రం ఈ టెండ‌ర్ల‌ను ఆహ్వానించ‌డంతో మ‌రోసారి క‌ల‌క‌లం మొద‌లైంది.  ఈనెల 28 వ‌ర‌కు బిడ్డింగ్ గడువు విధిస్తూ.. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్‌లో తెలిపింది కేంద్రం.  ప్ర‌జా ఆకాంక్ష‌ల‌ను.. ఇక్క‌డి మ‌నోభావాల‌ను ఏమాత్రం లెక్క చేయ‌కుండా.. ప‌ట్టించుకోకుండా.. పంతానికి పోతోంది కేంద్ర ప్ర‌భుత్వం. స్టీల్‌ప్లాంట్ అమ్మ‌కం సీఎం జ‌గ‌న్‌రెడ్డి వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ భూముల మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్‌.. స్టీల్‌ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ మీద పెట్ట‌డం లేద‌ని ఆంధ్రులంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్య‌మం మ‌రింత తీవ్ర‌త‌రం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.   

ప్రధానికి జగన్ మరో లెటర్.. పొలిటికల్ డ్రామా ఆపాలన్న పవన్ 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వ  అభ్యంతరాలను పట్టించుకోకుండా శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి తెలంగాణ విద్యుత్ సంస్థలు. దీంతో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీళ్లన్ని వృధాగా పోతున్నా ప్రభుత్వాల తీరు మారకపోవడంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనాల కోసం కాకుండా రాజకీయ మైలేజీ కోసమే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గేమ్ ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలన్ని ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ జలవివాదం నమ్మశక్యంగా లేదని అన్నారు. తాము చాలా సఖ్యంగా ఉన్నామని ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ ప్రకటించారని... అలాంటప్పుడు వివాదాలు ఎందుకు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే అ వివాదం రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందని అన్నారు. ఇప్పటికైనా డ్రామాను ఆపి.. చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.  ఇక కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో బిర్యానీ మీటింగ్‌లు పెట్టిన జగన్‌.. నీటి వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్టు ఉండాలి.. నేను ఏడ్చినట్టు ఉండాలనే నాటకాలు ఎన్నాళ్లు ఆడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని, కేంద్రమంత్రులకు రాసిన లేఖలో విభజన చట్టంలోని అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు? అని ఆయన ప్రశ్నించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ప్రధానిని ఎందుకు కోరలేదని అన్నారు. కృష్ణా నీటి వివాదాలపై సాక్షి గుమాస్తా సజ్జల మాట్లాడమేంటి? అని ప్రశ్నించారు. అంతరాష్ట్ర జల వివాదాలంటే ఐపీఎల్ బెట్టింగులో తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడటం కాదని తెలుసుకోండని ఉమ విమర్శించారు. మరోవైపు ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు సీఐఎస్ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్టును తీసుకురావాలని జగన్ విన్నవించారు. విభజన చట్టాన్ని, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను, కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని చెప్పారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగకుండా తెలంగాణ ఎప్పటికప్పుడు నీటిని వాడేస్తోందని అన్నారు. దీనివల్ల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సాగునీరు రాకుండా పోతోందని చెప్పారు.కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండానే నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని జగన్ ఆరోపించారు. 

కిష‌న్‌రెడ్డి అనే నేను.. క‌రుడుగ‌ట్టిన కాషాయ‌వాది.. కార్య‌క‌ర్త నుంచి కేబినెట్‌కు...

జి.కిష‌న్‌రెడ్డి అనే నేను.. అంటూ కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు ఈ తెలుగువాడు. కిష‌న్‌రెడ్డి ప్ర‌స్థానం రాజ‌కీయంగా అనేక‌మందికి ఆద‌ర్శ‌ప్రాయం. సామాన్య కార్య‌క‌ర్త‌.. కేంద్ర మంత్రి స్థాయికి ఎద‌గ‌డం కొంద‌రికే సాధ్యం. ఓపిక‌, ప‌ట్టుద‌ల‌, కృషితో అంతెత్తుకు ఎదిగారాయ‌న‌. సౌమ్యుడు, వివాద రహితుడు, అంత‌కుమించి పార్టీకి విధేయుడు. ఈ అర్హ‌త‌ల‌తోనే మోదీని మెప్పించారు. కేంద్ర‌మంత్రిగా ప్ర‌మోష‌న్ సాధించారు. సింప్లిసిటీకి కేరాఫ్ కిష‌న్‌రెడ్డి. ప్ర‌తీఒక్క‌రితోనూ క‌లిసిపోతారు. ప్ర‌తీఒక్క‌రినీ గౌర‌విస్తారు. తాను కేంద్ర మంత్రిన‌నే బిల్డ‌ప్ ఆయ‌న‌లో అస‌లేమాత్రం క‌నిపించ‌దు. ఇప్ప‌టికీ సామాన్యుడిగానే ఉంటారు. అంబ‌ర్‌పేట అడ్డాగా.. రాజ‌కీయంగా ఎదిగారు కిష‌న్‌రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. నాలుగోసారి ఓడిపోవ‌డం ఆయ‌న‌కు ఈ విధంగా క‌లిసొచ్చిన‌ట్టుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓడి.. ఆ షాక్ నుంచి తేరుకోక‌ముందే.. ఫలితాలు వచ్చిన మరుసటిరోజే.. స్థానిక గ‌ల్లీల్లో పర్యటించి.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం.. కిష‌న్‌రెడ్డి రాజ‌కీయ‌ ప‌రిణితికి నిద‌ర్శ‌నం. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే ఆ ల‌క్ష‌ణ‌మే.. ఆయ‌న‌ అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో ఓడినా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి.. అదే అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో 45 వేల మెజార్టీ సాధించి త‌న ప‌ట్టు నిరూపించుకున్నారు కిష‌న్‌రెడ్డి. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో, క‌రోనా క‌ల్లోలంలో స్థానికంగా నేనున్నానంటూ ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. గంగాపురం కిషన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో 1960లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రెండుసార్లు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రెండేళ్లు పనిచేశారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు.  లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌‌, వాజ్‌పేయీ ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్‌ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి జనతా పార్టీలో చేరారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1999లో కార్వాన్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్‌రెడ్డి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో హిమాయత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్‌పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. 2018లో అంబ‌ర్‌పేట‌లో ఓడి.. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి.. మోదీ కేబినెట్‌లో హోంశాఖ స‌హాయ మంత్రిగా.. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్న‌త స్థానానికి చేరారు కిష‌న్‌రెడ్డి. రాజ‌కీయాల్లో మోదీ, కిష‌న్‌రెడ్డిలు స‌హ కార్య‌క‌ర్త‌లు.. యువ‌మోర్చాలో ఉన్న‌ప్పుడు మోదీ, కిష‌న్‌రెడ్డిలు క‌లిసి ప‌ని చేశారు. ఇప్పుడు కేంద్రంలోనూ ప్ర‌ధాని మోదీతో కేంద్ర మంత్రి హోదాలో ప‌ని చేస్తున్నారు కిష‌న్‌రెడ్డి. 

ప్రియుడి ప్లాన్.. ప్రియురాలు ప్లాప్.. 

ప్రేమ గుడ్డిది.. ప్రేమకు వయసుతో పనిలేదు..మనసు మాత్రమే ఉంటుంది... ప్రేమ స్వచ్ఛమైనది.. ప్రేమ ఎల్లలు లేనిది.. ప్రేమ కులం మతం లేనిది. ప్రేమ ఒక ప్రపంచం.. ప్రేమ ఒక వ్యసనం.. ఇవన్నీ నిజాలే ఎందుకంటే ప్రేమలో ఉన్నవాళ్ళకి ప్రేమించడమే తెలుసు.. అంతేగాని అది ఇది అని ఎంచి చూడదు. ప్రేమ చాలాగొప్పదే కానీ అదే ప్రేమతో చాలా మోసాలు జరుగుతున్నాయి నేటి సమాజంలో.. తాజాగా ఒక అబ్బాయిని నమ్మిన అమ్మాయికి మోసం జరిగింది.. అదేంటో మీరే తెలుసుకోండి.. ఒక యువతీ తను  ప్రేమించిన వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటి వెళ్ళింది.. యువతికి ప్రేమ దక్కలేదు.. ప్రియుడు తక్కలేదు.. అంతే కాదు అందమైన  చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు తనను నిర్బంధించి బెదిరింపులకు గురిచేస్తారని ఊహించని ఆ యువతి రెండు రోజుల పాటు తీవ్ర మనోవ్యధకు గురైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన ఎ.రమేష్‌, బెంగళూరుకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.  వీరిద్దరూ బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ యువతికి మాయమాటలు చెప్పి రెండేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ తన పధకం ప్రకారమే దగ్గరి బంధువుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి రమేష్‌ను దూరం పెట్టింది.. మాటలు లేవు డ్యూయెట్ పాటలు లేవు.. ఐతే  తల్లిదండ్రులు తనకు  బలవంతంగా పెళ్లి చేశారంటూ మాయమాటలు చెప్పి ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడు రమేష్ . ఈ క్రమంలోనే రమేష్‌కు పలు దఫాలుగా రూ.50 లక్షల నగదు, బంగారం ఇచ్చినట్లు ఆ యువతి చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ అప్పటి నుంచి తనతో ఫోన్లోనే మాట్లాడేవాడని.. కొద్ది రోజులుగా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేయడంతో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ఈనెల 3న నవుడూరులోని రమేష్‌ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. రమేష్‌ కుటుంబ సభ్యులు ఆమెను దుర్భాషలాడి బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో నవుడూరు బస్టాండ్‌ వద్ద కూర్చొని విలపిస్తుండగా స్థానికులు గమనించారు. ఈ విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని భావించిన రమేష్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు మాయమాటలు చెప్పి పెనుమంట్ర మండలం పొలమూరు శివారులో ఒక ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో ఎస్సై ఎ.పైడిబాబు రంగంలోకి దిగారు. మంగళవారం పొలమూరులోని ఆ ఇంటికి వెళ్లి బాధిత యువతిని విడిపించి వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్‌, అతడికి సహకరించిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  అది విషయం ప్రేమైన దోమైన కొంచం ఆచితూచి అడిగి వేయాలంటారు.. సో మన లైఫ్ లో కూడా ఎప్పుడో ఒక్క సారి ఇలాంటి వాళ్ళు తగులుతుండొచ్చు ముందు గానే ప్రిపేర్ అవ్వండి వాళ్ళ చేతిలో మోసపోవడానికి కాదు.. ప్రేమ పేరుతో మోసాలు చేసేవాళ్లను ఎత్తుగడలను తిప్పికొట్టడానికి.    

ఎంతమంది గుడ్లు పీకారు జగన్ రెడ్డి? 

ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు ఏపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మహిళల మీద దాడి చేసిన వాడి గుడ్లు పీకేలా ముఖ్యమంత్రి వుండాలి అన్న జగన్ రెడ్డి.. రెండేళ్లలో ఎంతమంది గుడ్లు పీకారు.? అని ఆమె ప్రశ్నించారు. సీతానగరంలో దళిత యువతిపై అత్యాచారం కేసులో రెండు వారాలైనా పురోగతి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీశారు,  సీతానగరం ఘటనలో నిందితులు వైపీపీకి చెందినవారు కావడంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనిత ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ ఉదంతంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నిందితులు వైసీపీ వారు కాబట్టి మిన్నుకుండిపోయారా అన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలను ఉద్దరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని… నేతిబీరకాయలో నేతి వుండదు.. జగన్ తెచ్చిన చట్టాల్లో నిబద్ధత వుండదు అని ఎద్దేవా చేశారు.నిందితుల వెనక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వసంతకృష్ణప్రసాద్ వున్నారని ఆరోపించారు. ఆర్కే ఇంట్లో సోదాలు చేస్తే నిందితులకు సంబంధించిన సమాచారం పూర్తిగా దొరుకుతుందని సలహా ఇచ్చారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో 520పైగా మహిళల మీద అత్యాచారాలు, దాడులు జరిగాయని అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మహిళకు కూడా న్యాయం చేయలేదన్నారు. పులివెందుల్లో అత్యాచారానికి, హత్యకు గురైన నాగమ్మ కేసును మరుగున పడేసినట్లే సీతానగరం కేసును కూడా మరుగున పడేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇన్ని అరాచకాలు, దాడులు జరుగుతున్నా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ లో చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం ద్వారా నిందితులకు శిక్ష విధించినట్లు సిగ్గు లేకుండా హోమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సీతానగరం యువతి కేసులో నిందితులను శిక్షించకపోతే మహిళా లోకమంతా కలసి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆడబిడ్డలకు అన్నగా వుంటానని..కిరాతకుల పాలిట ఆపద్భాందవునిగా జగన్ నిలుస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. 

రవిశంకర్, జవదేకర్, హర్షవర్ధన్ పై వేటు.. మోడీ యాక్షన్ ప్లాన్ ఏంటో ? 

వచ్చే సంవత్సరం ఆరంభంలో జరిగే ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రధాని మోడీ తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు, అనూహ్యంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో కొద్దిపాటి మార్పులు, కొత్త వారికి మరిన్ని అవకశాలుగా ఉంటుందనుకున్న మంత్రివర్గ విస్తరణకు ముందుగా ప్రదాని ఇంచు మించుగా డజను మందికి ఉద్వాసన పలికారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ సహా  మొత్తం 12 మంత్రి మంత్రులు ప్రధాని అదేసం మేరకు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్త మంత్రుల ప్రమాణానికి కొన్ని నిమిషాల ముందు సీనియర్ మంత్రులు రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ కూడా రాజీనామా చేశారు, నిజంగా ఇది ఎవరు ఉహించని అనూహ్య పరిణామంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందే పదవులకు రాజీనామా చేసిన వారిలో హర్షవర్ధన్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్,  రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్,  బబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి రాజీనామా ఉన్నారు. అయితే, ఇంతమందిని మంత్రి వర్గం నుంచి తొలిగించడానికి కారణం ఏమిటనే విషయంలో ఎవరి అభిప్రాయం వారు వ్యక్త పరుస్తున్నారు. అయితే, ప్రధాన కారణం మాత్రం, వైఫల్యం. ముఖ్యంగా కొవిడ్ సంక్షోభ సమయంలో మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇంచుమించుగా గత నెలరోజులకు పైగా ప్రధాని వివిద శాఖల మంత్రులు, అధికారాలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రుల్ పనితీరును తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని అంతర్గత వర్గాల సమాచారం.  అయితే,ప్రధాని నిర్ణయం ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఉందని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. అయితే, అన్ని వర్గాలకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.సెకండ్ వేవ్’ ఆర్థిక రంగం మొదలు రాజకీయ రంగం వరకు అన్ని రంగాలలో  సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన శక్తిని కూడగట్టుకునేందుకు, దిద్దుబాటు చర్యల్లు తీసుకునేందుకు వీలుగా మంత్రి వర్గంలో ప్రధాని భారీ మార్పులు తీసుకున్నారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న గట్టి సంకేతాలు ఇచ్చేందుకే ఇంత భారీ కసరత్తు చేపట్టారని అంటున్నారు. ఒక విధంగా మధ్యంతర దిద్దుబాటు చర్యగానూ భావిస్తున్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా 14 మంది కేంద్ర మంత్రులకు ఉద్వాసన పలకడం పట్ల కాంగ్రెస్ పార్టీ  ఘాటుగా స్పందించింది. మంత్రుల  పనితీరును పరిగణనలోకి తీసుకొని గనక తప్పిస్తే, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పెట్రోలియం మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఎదో అనుకుంటే ఎదో జరుగుతోంది అనేది మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.

కిష‌న్‌రెడ్డికి ప్ర‌మోష‌న్‌.. రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్‌..! ఆయ‌న‌కు ప‌ద‌వితో ఈయ‌న‌కు బ్రేకులు..?

కేంద్ర స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డికి కేంద్ర మంత్రిగా ప్ర‌మోష‌న్‌. కేంద్ర కేబినెట్‌లో ఏకైక‌ తెలుగువాడిగా అంద‌లం. రెండేళ్లుగా హోంశాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు.. బాగానే రాణిస్తున్నారు. ప్ర‌స్తుత కేంద్ర కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ దాదాపు ఎల‌క్ష‌న్ బేస్డ్‌గానే జ‌రిగింద‌నే టాక్‌. మ‌రి, తెలంగాణ‌లో ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి ఎన్నిక‌లూ లేవు. కిష‌న్‌రెడ్డి ప్ర‌స్తుతం కీల‌క ప‌ద‌విలోనే ఉన్నారు. అయినా.. ఆయ‌న్ను ఏరికోరి మ‌రీ ప్ర‌మోష‌న్ ఎందుకు ఇచ్చిన‌ట్టు? ఓవైపు ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌, ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌లాంటి వారినే కేబినెట్ నుంచి త‌ప్పించ‌గా.. కిష‌న్‌రెడ్డికి మాత్రం ఎందుకు మ‌రింత ప్రాధాన్యం క‌ల్పించారు? అంటే ఢిల్లీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణలు వినిపిస్తున్నాయి.  ఏ రాష్ట్రాల్లోనైతే ఎన్నిక‌లు ఉన్నాయో.. ఏయే చోట్లైతే బీజేపీ బ‌ల‌హీనంగా ఉంద‌ని భావించారో.. ఆయా ప్రాంత నేత‌ల‌కు ఈసారి కేబినెట్‌లో చోటు ద‌క్కింది. తెలంగాణ‌లో ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌తో పార్టీ మ‌రింత బ‌లోపేత‌మైంది. బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో బీజేపీ దూకుడుగానే ముందుకు సాగుతోంది. మ‌రి, కిష‌న్‌రెడ్డికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? మ‌రో రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల కోస‌మ‌ని కూడా అన‌లేం. మ‌రెందుకు అంటే.. పీసీసీ కొత్త చీఫ్ రేవంత్‌రెడ్డి వ‌ల్లే కిష‌న్‌రెడ్డికి ప్ర‌మోష‌న్ వ‌చ్చింద‌ని అంటున్నారు.  క‌ర్ణాట‌క త‌ర్వాత‌ ద‌క్షిణాదిన అధికారంలోకి రాగ‌ల అవ‌కాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌నే అని బీజేపీ బ‌లంగా న‌మ్ముతోంది. కాస్త గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే.. ఈజీగా గెలిచేయొచ్చ‌నేది వారి అంచ‌నా. బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌లతో బీజేపీ ద‌ళం ప‌టిష్టంగానే ఉంది. ఇక కేసీఆర్‌కు సాటి మేమేనంటూ.. అందుకు దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌లే సాక్ష‌మంటూ క‌మ‌ల‌నాథులు బిందాస్‌గా ఉన్నారు. కానీ, వారి స్వీట్ డ్రీమ్స్‌ను బ్రేక్ చేస్తూ.. చిచ్చ‌ర‌పిడుగు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా పిడికిలి బిగించ‌డంతో కాషాయం పార్టీ కంగుతింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ మ‌న్నుతిన్న పాములా పడుండ‌టంతో.. కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ రాజ‌కీయంగా నెగ్గుకొచ్చిన బీజేపీకి రేవంత్ ఎంట్రీ అంత ఈజీగా మింగుడు ప‌డ‌టం లేదంటున్నారు. ఫేస్ టు ఫేస్ ఫైట్ కాస్తా.. ట్ర‌యాంగిల్ వార్‌గా మార‌డం.. పీసీసీ ప‌గ్గాలు రేవంత్‌రెడ్డి చేతికి రావ‌డంతో.. పొలిటిక‌ల్ ఎడ్జ్ కాంగ్రెస్ వైపు షిప్ట్ అవుతుండ‌టంతో క‌మ‌ల‌నాథుల్లో క‌ల‌వ‌రింత పెరిగిపోయింది. అందుకే, రేవంత్‌రెడ్డి బీజేపీని ఎంత‌గా క‌వ్విస్తున్నా.. ఎక్క‌డా టెంప్ట్ అవ‌కుండా.. రేవంత్‌పై ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసి ఆయ‌న రేంజ్‌ను మ‌రింత పెంచేయ‌కుండా.. వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తూ.. ప్ర‌స్తుతానికైతే ఎలాగోలా మేనేజ్ చేసుకొస్తున్నారు. కానీ, ఈ స్ట్రాటజీ ఎన్నో రోజులు వ‌ర్క‌వుట్ కాద‌ని బీజేపీకీ తెలుసు. హుజురాబాద్ గండం గ‌ట్టెక్కే వ‌ర‌కూ రేవంత్ విష‌యంలో సైలెంట్‌గా ఉండాల‌నేది బీజేపీ ప్లాన్‌.  ఇక పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్ర‌క‌టించ‌గానే.. ఆయ‌న కేసీఆర్‌తో పాటు కిష‌న్‌రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. కిష‌న్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఏజెంట్ అని.. ఈట‌ల‌ను బీజేపీలో చేర్చింది కేసీఆరేన‌ని.. కేసీఆర్ అరేంజ్ చేసిన ఫ్లైట్‌లోనే కిష‌న్‌రెడ్డి ఢిల్లీ నుంచి వ‌చ్చి ఈట‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారంటూ.. కాక రేపారు రేవంత్‌రెడ్డి. ఇలా, బీజేపీ-టీఆర్ఎస్ ఒక్క‌టేన‌నే అనుమానం క‌లిగించి.. కేసీఆర్‌కు కాంగ్రెస్సే అస‌లైన ప్ర‌త్య‌ర్థి అనే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌లిగేలా.. రేవంత్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ మైండ్‌గేమ్‌తో బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత ప‌నైంది.  రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేద‌ని.. ఆయ‌న్ను అలానే వ‌దిలేస్తే.. తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌నే బీజేపీ డ్రీమ్ ఏనాటికి నెర‌వేర‌ద‌నే కంగారు కాషాయ పార్టీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే, రేవంత్‌రెడ్డి దూకుడుకు బ్రేకులు వేయాల‌నే గేమ్ ప్లాన్‌లో భాగంగానే.. కిష‌న్‌రెడ్డిని మ‌రింత బ‌ల‌వంతుడిని చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే కేంద్ర‌ హోంశాఖ స‌హాయ మంత్రిగా మంచి ప‌ద‌విలోనే ఉన్న కిష‌న్‌రెడ్డికి మ‌రింత ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌డం తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేసే ఉద్దేశ్యం కంటే.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని క‌ట్ట‌డి చేసే వ్యూహ‌మే ఎక్కువ‌గా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ ముక్త్ భార‌తే.. బీజేపీ ప్ర‌ధాన ల‌క్ష్యం. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ బ‌లం పుంజుకోవ‌డం బీజేపీకి అస‌లేమాత్రం ఇష్టం ఉండ‌దు. అందుకే, రేవంత్‌రెడ్డికి పోటీగా బీజేపీని మ‌రింత అగ్రెసివ్‌గా మార్చ‌డానికే అన్న‌ట్టు..కిష‌న్‌రెడ్డికి మ‌రింత ప్రాధాన్యం క‌ల్పించి.. కేంద్ర మంత్రిని చేశార‌నేది ఢిల్లీ వ‌ర్గాల మాట‌. ఎంతైనా.. తెలంగాణ రాజ‌కీయాల్లో రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ మామూలుగా లేదుగా... రేవంత్‌కి పీసీసీ పగ్గాల‌తో అన్ని పార్టీల ఈక్వేష‌న్స్ అమాంతం మారిపోతున్నాయి.. రేవంత్‌రెడ్డి రాక‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు గ‌ట్టి షాక్... బీజేపీకి దిమ్మ తిరిగే ఝ‌ల‌క్... రేవంత్‌రెడ్డా.. మ‌జాకా.....  

కేబినెట్ విస్తరణలో సున్నా.. ఆంధ్రప్రదేశ్ గతి ఇంతేనా..?

14 మందిని తప్పించారు..36 మందికి కొత్తగా అవకాశమిచ్చారు. యువకులు, యువతులు..మంత్రి పదవి వస్తుందని ఊహించని వాళ్ల పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి.  ఇంత జరిగినా...ఏపీ, తెలంగాణలకు మాత్రం పెద్దగా ఒరిగిందేమీ లేదు. తెలంగాణకు కనీసం కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రకు అయితే ఆ గతి కూడా లేదు.  అసలు లెక్కలోకి తీసుకున్నట్టే లేదు. కేంద్ర మంత్రివర్గ మార్పులు కూడా పూర్తిగా రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే జరిగాయి తప్ప.. అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు లేదు. ఎక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో.. ఎక్కడ తమ బలం పెంచుకోక తప్పదు.. పెంచుకోవాల్సిన అవసరం ఉంది...పెంచుకునే స్కోప్ ఉంది అన్న దగ్గరే మంత్రి పదవులు దక్కాయి. యూపీకి ఇందులో అగ్రస్థానం దక్కింది. యూపీలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వమే ఉన్నప్పటికి ..9 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ రాష్ట్రానికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. విభజన ఏమంటూ అయిందో గాని.. అప్పటి నుంచి ఏపీకి అన్నీ కష్టాలే.  రాజధాని లేదు. విభజన చట్టంలో చెప్పినట్లు ఆర్ధిక సహకారం ఇవ్వలేదు.  పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేకహోదా దక్కలేదు. కేవలం కేంద్ర విద్య, వైద్య సంస్థలను మాత్రం కొన్నిటిని మొదలెట్టి.. అవే లిస్టును బిజెపి నేతలంతా ఎప్పటికీ చదువుతూనే ఉంటారు. కనీసం ఆర్ధిక లోటు తీర్చలేదు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు అంటూనే..అప్పటివరకు రాష్ట్రప్రభుత్వం పెట్టిన ఖర్చును ఇప్పటివరకు ఇవ్వలేదు.అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీరు ఇచ్చి వెళ్లిన ప్రధాని మోదీ.. ఢిల్లీని మించిన రాజధానిని ఇస్తామన్న మోదీ.. అందుకు ఇచ్చిన బడ్జెట్ కేవలం 2500 కోట్లు మాత్రమే. అడిగినా దిక్కు లేదు. అడిగి అడిగి అలిసిపోయిన చంద్రబాబు ఎదురు తిరిగితే.. ఆయన ప్రత్యర్ధి జగన్ కు అన్నిరకాల అండదండలు అందించి గెలిపించారు. ఇప్పుడు కూడా ఏం పట్టించుకోవడం లేదు.కాకపోతే జగన్ చేసుకునేవాటికి అడ్డు తగలడం లేదు. చంద్రబాబు అడగలేదని లౌడ్ స్పీకర్ లో అరిచిన జగన్.. అసలు అడగలేమని చేతులెత్తేశాడు. కనీసం ఇప్పుడైనా ఒక మంత్రి పదవి ఇచ్చి.. ఏమైనా అభివృద్ధికి ముందుకు వెళతారేమోనని ఎదురు చూసినా .. ఆ ఆలోచన కూడా చేసినట్లు కనపడటం లేదు. జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.. ఆయన పేరు వచ్చినా..ఆయనకూ ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ పేరు వచ్చింది.. అదీ లేదు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడప్పుడే గెలుస్తారనే నమ్మకం వారికి లేదు. ఎటూ వైసీపీ అండగా ఉంటామని లోపల, బయట చెప్పేసింది. కాకపోతే ప్రభుత్వంలో చేరలేదంతే. కాబట్టి జగన్ ను నమ్ముకునే ఏపీలో ముందుకెళ్లే పనిలో బిజెపి ఉన్నట్లు కనపడుతుంది. తమ సొంత బలం పెరగదు అనుకుంటే బిజెపి పైసా కూడా విదల్చరనేది అందరికీ క్లారిటీ వచ్చేసింది. బీహార్ లాంటి రాష్ట్రానికి ఒకప్పుడు ప్యాకేజి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి.. అధికారానికి రాకపోవడంతో అసలు ఆ ఊసే మర్చిపోయిన చరిత్ర మోదీది.  మొత్తం మీద అన్ని విధాల వివక్షకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్...ఇంత పెద్ద మార్పులు చేసి మరీ రెడీ అయిన జంబో కేబినెట్ లో కూడా మొండి చేయి చూపించడమే పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించడం లేదు. ఎంపీ ఎవరూ లేరుగా అని అడగొచ్చు... ఇవ్వాలనుకుంటే ఇచ్చి..తర్వాత ఎంపీని చేయొచ్చు.. ఆ విషయం అందరికీ తెలుసు.

కాంగ్రెస్‌కు ప్ర‌శాంత్‌కిశోర్ సేవ‌లు!.. క్లారిటీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి...

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. మోస్ట్ డైన‌మిక్ అండ్ ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే స‌త్తా ఉన్న నాయ‌కుడు. కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు గుంజ‌గ‌ల స్టామినా ఉన్నోడు.  ప్ర‌శాంత్‌కిశోర్‌. దేశంలోకే మోస్ట్‌వాంటెడ్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌. ఆయ‌న ప‌ని చేస్తే.. పార్టీకి ప‌వ‌ర్ ప‌క్కా. ఆనాడు మోదీని గెలిపించారు.. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌ను, మ‌మ‌త బెన‌ర్జీని, స్టాలిన్‌ను అంద‌ల‌మెక్కించారు. ఇప్పుడు రాహుల్‌గాంధీని ప్ర‌ధాని చేయాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఇటు రేవంత్‌రెడ్డి.. అటు ప్ర‌శాంత్‌కిశోర్‌.. ఆ ఇద్ద‌రు క‌లిస్తే..? ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు తిరుగుంటుందా? రేవంత్ దూకుడు.. పీకే వ్యూహాలు.. త‌ట్టుకొని.. ఎదుర్కొని.. కేసీఆర్ గెల‌వ‌గ‌ల‌రా?  అందుకే, రేవంత్‌రెడ్డికి ఇటీవ‌ల అనేక మంది శ్రేయోభిలాషులు ఈ ఉచిత స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. ప్ర‌శాంత్‌కిశోర్‌ను రాజ‌కీయ స‌ల‌హాదారునిగా నియ‌మించుకోమ‌ని చెబుతున్నార‌ట‌. ఒక‌రూ, ఇద్ద‌రూ అయితే ఓకే.. చాలా మంది ఇదే మాట ప‌దే ప‌దే చెబుతుండ‌టంతో.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా త‌న తొలి ప్ర‌సంగంలో దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ఇంత‌కీ రేవంత్‌రెడ్డి ఏమ‌న్నారంటే...   కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే.. ప్రశాంత్‌ కిషోర్‌ని పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని.. పాదరసంలాంటి  కార్యకర్తలే తమకు పీకేలు అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే పీకేలు.. ఏకే-47 తూటాలు.. ఇలాంటి క‌రుడుగ‌ట్టిన కార్య‌ద‌క్షులైన కాంగ్రెస్ శ్రేణులు త‌న‌కు అండగా ఉండ‌గా.. పీకే ఎందుకు దండ‌గ‌.. అన్న‌ట్టు మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. సో.. ప్ర‌శాంత్‌కిశోర్ అవ‌స‌రం త‌న‌కు లేద‌ని.. తన స‌త్తా.. కార్య‌క‌ర్త‌ల కృషి చాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈజీగా గెలిచేస్తామ‌నే ధీమా రేవంత్‌రెడ్డిలో మాట‌ల్లో క‌నిపించింది. మ‌రి, రేవంతా.. మ‌జాకా...