దర్శనానికి వచ్చిన.. మహిళపై గ్యాంగ్ రేప్..

మనుషుల్లో పక్కవారంటే గౌరవం.. దేవుడు అంటే భక్తి, చట్టాలు అంటే భయం లేకుండా పోతుంది.. ఇక అమ్మాయిల పై దాడుల విషయానికి వస్తే.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే పిల్లి లాంటివాడు పులి అవుతాడు.. వాళ్లపై నోటు పారేసుకోవడం.. చేతులు వేయడం.. చివరికి ఎవరు అడ్డుపడకపోతే అత్యాచారంకి పాల్పడం.  మహిళా రక్షణకోసం ఎన్ని చట్టాలు వచ్చిన వాటిని లెక్కచేయడంలేదు కొంత మంది దుర్మార్గులు.. మహిళలపై నిత్యం దాడి చేస్తూనే ఉన్నారు.. తాజాగా ఒక రాష్ట్రము నుండి మరొక రాష్ట్రానికి  ఆయాల దర్శనానికి వచ్చిన అమ్మాయి పై గ్యాంగ్ రేప్ చేశారు. వివరాలు తెలుసుకుందాం..   తమిళనాడులో ని పళణి ఆలయ దర్శనానికి వచ్చిన కేరళ యువ జంటపై వచ్చారు.. ఈ యువ జంట పై స్థానికుల కళ్ళు పడ్డాయి.. పధకం వేశారు.. ఆ తర్వాత ఆ పధకాన్ని అమలు చేశారు.  వాళ్లపై ఆ దుండగులు దాడి చేశారు. రూమ్ లో ఉన్న భర్తను కొట్టి యువతీ పై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె భర్త వాపోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు గత ఇరవై రోజులుగా న్యాయం కోసం ఒంటరిగా పోరాడుతున్నాడు. ఎవరూ పట్టించుకోలేదు.. సహకరించలేదు. ఇలా ఐతే తనకు న్యాయం జరగదని చివరికి సీఎం స్టాలిన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశాడు. ఆ విషయాన్నీ తెలుసుకున్న సీఎం వెంటనే స్పందిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అతడి కేసును పట్టించుకోని పోలీసులపై విచారణకు ఆదేశించారు.  ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు వేసినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజురోజుకి మగాళ్లు  మృగాళ్ల రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి అత్యంత నీచమైన పనులు వడిగడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఆలయ దర్శనం కోసం వచ్చిన జంటపై ఇలా చేయడం అమానుషమని తమిళనాడు మహిళ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు సీఎం స్టాలిన్ పరిధిలోకి వెళ్లడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తెలంగాణలో ఆట మొదలైంది.. గులాబీలో గుబులేనా? 

అవును.. తెలంగాణలో ఆట మొదలైంది. ఒకవైపు ఉద్యమ నేత.. ప్రభుత్వాధినేత..ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డ తిరుగులేని నేత కేసీఆర్.. మరోవైపు దూకుడే ఆయుధం.. దున్నుడే యుద్ధం.. తియ్యటి మాటలకు పచ్చడి లాంటి మాటలతో కౌంటర్లు వేసే రేవంత్ రెడ్డి. ఇద్దరూ వ్యూహకర్తలే. ఒకరికి అధికారం నిలబెట్టుకోవాలి.. మరొకరికి అధికారం సాధించాలి. ఆటే ఆడకుండా చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ ఫెయిలైపోయాయి. ఇక ఆట ఆడకపోతే కుదరదంతే. ఆట ఆడాల్సిందే. అందుకే కేసీఆర్ ఆట మొదలెట్టారు. ఇటు రేవంత్ రెడ్డి సైతం ఆట ఘాటుగానే మొదలెట్టారు. దీంతో తెలంగాణలో రాజకీయం రచ్చ చేస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలపై ఆందోళనలతో మొదటి ఓవర్ ఆట మొదలెట్టారు రేవంత్ రెడ్డి.  అటు బిజెపిని, ఇటు టీఆర్ఎస్ ని రెండిటిని కార్నర్ చేయగల సబ్జెక్ట్ అది. అందుకేనేమో దానితోనే మొదలెట్టారు. నాయకులు ముఖ్యం కాదు.. కార్యకర్తలు ముఖ్యమనే సిగ్నల్ గట్టిగానే వదిలారు రేవంత్ రెడ్డి. దీంతో బయటకు పోదామనే నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారని..టీఆర్ఎస్ కేసీఆర్ చెప్పినట్లే వాళ్లు ఆడతారని ముందే తెలిసినవాడిలా మాట్లాడారు రేవంత్ రెడ్డి. ద్రోహం చేసినోడిని ఊరికే వదలమంటూనే.. అధికారులకు కూడా స్వీట్ వార్నింగ్ ఇఛ్చేశారు.. డైరీలో పేర్లు రాసుకుంటున్నామని చెప్పి. మరోవైపు కేసీఆర్ హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి బాణాన్ని వదిలారు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. రేవంత్ రెడ్డే టార్గెట్ గా మాట్లాడారు. గతంలో వాళ్లు 25 కోట్లు.. ఈయన కాస్త రేటు పెంచి 50 కోట్లు తీసుకుని రేవంత్ కు పీసీసీ పదవి ఇచ్చారని ఆరోపించాడు. అయినా తెలంగాణ పీసీస చీఫ్ పదవి అంత చీప్ గా ఉందా ఏంటి..25, 50 కోట్లు అంటున్నారని కొందరు ఆశ్చర్యపోతున్నారు. హుజూరాబాద్ లో ఈటలకు అనుకూలంగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని.. వారిద్దరి మధ్య లావాదేవీలున్నాయని.. టీఆర్ఎస్ కు కావాల్సినవన్నీ చెప్పుకొచ్చాడు.ముందరి కాళ్లకు బంధం వేసినట్లు..రేవంత్ ప్రమాణస్వీకారం చేసిన రోజే చెప్పేశాడు.. కొందరు ద్రోహులుంటారని.. ఈరోజు మరీ క్లియర్ గా ఇంటి దొంగలు పోవచ్చు.. నష్టం లేదని కూడా చెప్పేశాడు. ఇదంతా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ కు ముందే జరిగిపోయాయి. దీంతో కౌశిక్ రెడ్డి గంట మాట్లాడినా సుఖం లేనట్లు చేశాడు రేవంత్ రెడ్డి. ఇక ప్రతి రోజూ ఈ ఆట మనం చూడాల్సిందే. అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి వీరిద్దరి మధ్యే యుద్ధం జరుగుతుందని క్లారిటీ వచ్చేసింది. ఏ ఎన్నికొచ్చినా కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని ఏతులు చెప్పే బండి సంజయ్ గ్రాఫ్ పడిపోయింది. ఎన్నికలైపోయాక సైలెంట్.. ఎన్నికలొస్తే పులిలా గర్జించే బండి సంజయ్ తర్వాత పిల్లిలా ఉంటున్నారనే కామెంట్లు వస్తున్నాయి. ఇక కొత్త పార్టీ షర్మిల సంగతి సరే సరి. రేవంత్ రెడ్డి వచ్చాక..వారికి సౌండ్ లేకుండా పోయిందనే చెప్పాలి. వారిని నెత్తినెక్కించుకునే ఓ మీడియా అధినేత అసలు జల వివాదం షర్మిల కోసమే పుట్టిందన్నట్లు హైప్ ఇవ్వాలని చూసినా...పనవలేదు.

గుప్తనిధుల కలకలం..కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్ ప్లాప్..

నేటి కాలంలో మంచి ఆహారం తీసుకోవాలన్న.. మంది వైద్యం పొందాలన్న.. మంది స్కూల్ లో అడ్మిషన్ రావాలన్న.. చివరికి మంచి ఉద్యోగం కావాలన్నా డబ్బులు చాలా ముఖ్యం.. కాసు ఉంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారంటారు అని అన్నట్లు. మారింది సమాజం. మరైతే ఆ డబ్బులు ఎలా సంపాదించాలి అంటే? చాలా మంది దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు.. ఒక వ్యక్తి సొంతగా డబ్బులు అర్న్ చేసుకోవడం తెలియదు ఇంకా మన దేశంలో. అయితే దానికి రూట్ తెలిసి. కొంత మనీ ఇన్వెస్ట్ చేసే దైర్యం.. ఇంకొంచం రిస్క్ చేస్తే డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని చాలామంది చెపుతుంటారు.. అది వాస్తవం.. కానీ చాలా మంది ఆ రూట్ ను ఫాలో అవ్వడంలేదు. చాలా మంది ఏవేవి చేయకుండా డబ్బులు ఈజీ గా సంపాదించాలనుకుంటారు.. అందుకోసం వాళ్ళు రకరకాల వృత్తులను ఎంచుకుంటారు.. ఆ వృత్తుల్లో గుప్తనిధుల వేట ఒకటి..  అయితే వీళ్ళు   కొన్ని ఏళ్ళ తరబడి  మూఢనమ్మకమే  పెట్టుబడిగా, భూమికి కన్నం వేస్తూ.. గుప్తనిధులు వేటాడే పనుల్లో ఉంటారు. ఇలా మన దేశంలో ఇలాంటి  కన్నింగ్‌ ఫెల్లోలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకవైపు ప్రపంచం అంతా భవిష్యత్‌కి కాలానికి బాటలు వేసుకుంటుంటే. వీళ్ళు మాత్రం భూమికి కన్నం పెటుతున్నారు.  అది తెలంగాణ, నిర్మల్ జిల్లాలో  గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా.. మీరే చుడండి..  స్పేస్‌ టూరిజంతో ఆకాశానికి నిచ్చెన వేస్తున్న వేళ మనిషి పాతాళంలోకీ తొంగి చూస్తున్నాడా ? అంటే.. అవుననే చెప్పాలి.. ఒకరకంగా చెప్పాలంటే డబ్బులు ఉన్నోడు అంతరిక్షం.. చంద్రమండలం వెళితే.. డబ్బులు లేని వాడు భూమికి కన్నం వేస్తున్నాడు.పెరుగుతున్న గుప్తనిధుల తవ్వకాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మూఢనమ్మకమే పెట్టుబడిగా భూమికి కన్నం వేస్తున్న కన్నింగ్‌ ఫెల్లోలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకవైపు ప్రపంచం అంతా భవిష్యత్‌కి కాలానికి బాటలు వేసుకుంటుంటే, ఇటు నిర్మల్‌ జిల్లాలో ఓ ప్రబుద్ధుడు మాత్రం గుప్తనిధుల పేరుతో భూతకాలంనాటి ఆనవాళ్ళు వెతుక్కుంటున్నాడు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బగల్లీలోని ఓ ఇంట్లో రోజూ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయినేది స్థానికుల ఆరోపణ. అంతేకాదు ఈ గుప్తనిధుల కోసం నిత్యం తాంత్రికులతో పూజలు చేయిస్తున్నాడంట ఆ ఇంటి యజమాని. కష్టపడే తత్త్వం లేక,  పనిచేసే ఓపిక లేక..  ఇలా అక్రమంగా, అడ్డదారుల్లో కోటీశ్వరులైపోదామనే దొంగల సంఖ్య ఈమధ్య కాలంలో పుట్టగొడుగుల్లా పెరిగిపోతోంది. ఎవరో కూసే పిచ్చి.. పిచ్చి కూతలు నమ్మి పనులన్నీ మానుకొని ఇల్లు, ఒళ్ళు గుళ్ళు గుల్లచేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకొన్ని విషయాలు చూసే ఉంటారు.. నాగస్వరం కాయలు ఉంటే మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు అని, రకరకాల ప్రచారాలు జరిగాయి. తాజాగా అదే తరహాలో  భైంసా పట్టణంలో ఇతని పిచ్చిచేష్ఠలు, వింత ప్రవర్తన భరించలేని చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. స్థానికులిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసారు. అయితే ఇంటి ఓనర్‌ వాదన మరోల ఉంది. గతంలో ఇదే ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, దీంతో ఇప్పుడు శాంతి పూజలు చేయిస్తున్నాని, వాస్తు బాగోలేకపోవడంతో కొన్ని మార్పులు చేయిస్తున్నాని వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం నిజానిజాల్ని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. 

కేడర్ విభజన చేయకుండా భర్తీ ఎలా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఉత్తమాటేనా? 

తెలంగాణలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. గత ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. ఉద్యోగాలు రావడం లేదనే మనస్తాపంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నా కనికరించలేదు. కాని సడెన్ గా ఉద్యోగ కల్పన అంటూ హడావుడి చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. తొలి దశలో 50 వేల ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారనే ప్రకటన వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో  సీఎస్ సోమేష్ కుమార్ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి,మంత్రుల ప్రకటనలు.. ఉన్నతాధికారుల హడావుడి చూస్తే రేపోమాపో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయనే  సీన్ కనిపిస్తోంది.  ప్రభుత్వం ఇంత  షో చేస్తున్నా ఉద్యోగ భర్తీలపై మాత్రం నిరుద్యోగులకు నమ్మకం కుదరడం లేదు. ఉద్యోగ వర్గాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంజది. అందుకు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.  గతేడాది డిసెంబర్ లో .. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని ప్రభుత్లం ప్రకటించింది. ఇప్పటికీ ఏడు నెలలు అవుతున్నా.. ఒక్క నోటిఫికేషన్ రాలేదు. కానీ 50 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని సీఎం చెప్పారంటూ మరో నోట్ రిలీజ్ చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం. నోటిఫికేషన్లు ఇచ్చినా సవాలక్ష అడ్డంకులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీకి చాలా సాంకేతిక సమస్యలున్నాయంటున్నారు. కొత్త జోన్లకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేడర్ ను విభజన చేయలేదు. పోస్టులను కేటగిరీల వారీగా విభజించలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఏది జిల్లా పోస్ట్ అనే విషయంపైనా క్లారిటీ లేకుండా పోయింది. లోకల్ , జోనల్, మల్టీ  జోనల్ పోస్టేదో క్లారిటీ లేదు. 2017లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉద్యోగులను సర్దుబాటు పద్దతిలో వివిధ జిల్లాలకు పంపించింది. నాలుగేండ్లు అవుతున్నా వారికి పర్మినెంట్ పోస్టులు ఇవ్వలేదు. పోస్టుల కేడర్ పై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సర్కార్ తీరుతో ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ శాఖలోని  ప్రతి ఉద్యోగికి కేడర్ చాలా ముఖ్యం. శాఖల వారీగా ఖాళీలను గుర్తించి.. వాటిని కేడర్ వారిగీ విభజన చేసి పూర్తి స్పష్టత వచ్చాకా... పోస్టుల కేడర్, జోన్ లపై ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాందేమి లేకుండానే నోటిఫికేషన్లు ఎలా ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కేడర్ గుర్తించకుండా నోటిఫికేషన్లు ఇచ్చినా.. ఎవరైనా కోర్టుకు వెళితే ఆగిపోతుందని చెబుతున్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి ఇలాంటి సమస్యలు వచ్చాయంటున్నారు. అయినా ప్రభుత్వం అదే తప్పు చేస్తే మరోసారి నిరుద్యోగులతో ఆడుకోవడమేనన్న విమర్శలు వస్తున్నాయి. సర్కారుకు నిజంగానే ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆసక్తి ఉంటే ముందు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పోస్టుల కేడర్ ను గుర్తిస్తూ ముందు జీవో జారీ చేయాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  ఉద్యోగ కల్పనకు ఏ మాత్రం కసరత్తు చేయకుండానే ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో లబ్ది పొందడన కోసమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. పలుమార్లు మాట మార్చింది. 2018 ఎన్నికలప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని ఊరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్​లో 50 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. ఎన్నికలయ్యాక సర్కారు మరిచిన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుండటం, ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత భారీగా కనిపిస్తుండటంతో .. ఇలా ఉద్యోగాలు ఇస్తున్నామంటూ హడావుడి చేస్తున్నారనే ఆరోపణలే మెజార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి.  

ప్ర‌గ‌తిభ‌వ‌న్ వీడి.. సొంతింటికి కేసీఆర్‌.. ఏదో జ‌ర‌గ‌బోతోందా?

ఊర‌క రారు మ‌హానుభావులు. అందులోనూ కేసీఆర్‌లాంటి మాయ‌ల‌మ‌రాఠీలైతే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం లేనిదే అస‌లేప‌నీ చేయ‌రు. ఆక‌స్మాత్తుగా ఆసుప‌త్రుల సంద‌ర్శ‌న ఎందుకు చేశారో.. స‌డెన్‌గా జిల్లాల ప‌ర్య‌ట‌న ఎందుకు చేస్తున్నారో.. మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి ఎందుకు వ‌స్తున్నారో.. ద‌ళితుల‌కు ప్ర‌త్యేక ప‌థ‌కాలు ఎందుకు ప్రారంభిస్తున్నారో.. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్ల దూకుడు ఎందుకు పెంచారో.. ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామంటూ ఎందుకు అంటున్నారో.. ఎవ‌రైనా ఇట్టే ఊహించ‌గ‌ల‌రు. తాజాగా, సీఎం కేసీఆర్ చేసిన మ‌రోప‌ని వీట‌న్నిటికంటే మ‌రింత వెరీ వెరీ స్పెష‌ల్‌.. అస‌లెవ‌రూ ఊహించ‌నిది.. ఏడేళ్లుగా ఆయ‌న‌కు సైతం అస్స‌లు గుర్తుకురానిది.. అందుకే, ఆ విష‌యంపై ఇప్పుడు పొలిటిక‌ల్ ఇంపార్టెన్స్ అమాంతం పెరిగింది.. దాని వెనకాలే అనేక రాజ‌కీయ విశ్లేష‌ణ‌లూ మొద‌లయ్యాయి.. ఇంత‌కీ అదేంటంటే... సీఎం కేసీఆర్ చాలా ఏళ్ల త‌ర్వాత త‌న సొంతింటికి వెళ్ల‌డం.... సీఎం కేసీఆర్.. ఉండేది ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో.. రాజ‌కీయ‌ వ్యూహాలు ప‌న్నేది గ‌జ్వేల్‌లోని ఫామ్‌హౌజ్‌లో. ఏడేళ్లుగా ఈ రెండు లొకేష‌న్లే కేసీఆర్‌కు కేరాఫ్ అడ్ర‌స్. అయితే, ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లోనే ఓ సొంతిళ్లు ఉంద‌నేది చాలామందికి తెలిసిందే అయినా.. కేసీఆర్‌తో స‌హా అంతా ఆ విష‌యం ఎప్పుడో మ‌ర్చిపోయారు. ఉద్య‌మానికి ముందు.. ఉద్య‌మ స‌మ‌యంలో.. ఆయ‌న నివాస‌మంతా నందిన‌గ‌ర్‌లోని సొంతింటిలోనే. ఆ నందిన‌గ‌ర్ ఇంటి నుంచే ఆయ‌న తెలంగాణ ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించి.. స్వ‌రాష్ట్ర స్వ‌ప్నం సాధించుకున్నారు. సీఎం కాగానే.. నందిన‌గ‌ర్ ఇంటిని వ‌దిలేసి.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సెటిల్ అయిపోయారు. ఫామ్‌హౌజ్‌లో సేద తీరుతున్నారు. అలాంటి కేసీఆర్‌.. స‌డెన్‌గా నందిన‌గ‌ర్‌లోని ఆయ‌న సొంతింటికి వ‌చ్చారు. ఆ ఇంటికి మార్పుచేర్పులు చేయిస్తున్నారు. ఆ ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు సీఎం కేసీఆర్‌. ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్‌గా ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఇంత‌కీ, కేసీఆర్ నందిన‌గ‌ర్ ఇంటికి ఎందుకు వెళ్లిన‌ట్టు? ఆ ఇంటికి ఎందుకు మ‌ర‌మ్మ‌త్తులు చేయిస్తున్న‌ట్టు? త్వ‌ర‌లోనే కేసీఆర్ అడ్ర‌స్ మారిపోబోతోందా? ప్ర‌గ‌తిభ‌వ‌న్ వీడి నందిన‌గ‌ర్‌కు సిఫ్ట్ అవుతారా? అయితే, ఎందుకు అవుతారు? ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ఎందుకు వ‌దిలేస్తారు? నందిన‌గ‌ర్‌లోని సొంతింటిపై మ‌ళ్లీ ఎందుకు మ‌మ‌కారం పెరిగింది? ఇలా ప‌లు ప్ర‌శ్న‌లు.. వాటిపై ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు... రెండుమూడు వ‌ర్ష‌న్‌లు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌ను త్వ‌ర‌లో సీఎంను చేయ‌బోతున్నార‌ని.. హుజురాబాద్ ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత అందుకు ముహూర్తం ఫిక్స్ అయింద‌ని అంటున్నారు. కేటీఆర్‌కు పాల‌నా ప‌గ్గాలు అప్ప‌గించి.. తానిక ఫుల్‌టైమ్ పాలిటిక్స్‌పై ఫోక‌స్ చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇటు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామ‌కం.. అటు ఈట‌ల‌, బండి సంజ‌య్‌ల‌తో బీజేపీ దూకుడు.. మ‌ధ్య‌లో ష‌ర్మిల చిట‌ప‌ట‌లు.. తెలంగాణ‌లో వేగంగా ప‌డిపోతున్న కేసీఆర్ గ్రాఫ్‌.. ప్ర‌జ‌ల్లో ప్ర‌బ‌లిపోతున్న అసంతృప్తి.. నిరుద్యోగుల క‌డుపుమంట‌.. ద‌ళితుల మ‌నోవేద‌న‌.. ఇలా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక జ్వాల‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి.. త‌న‌పై ఉన్న ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల‌ను కేటీఆర్‌కు అప్ప‌గించి.. తానిక పార్టీ కార్య‌క్ర‌మాల‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రి చేయాల‌నే ప్ర‌య‌త్నం ఎప్ప‌టినుంచో చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఎల‌క్ష‌న్ల రూపంలో అది వెన‌కెన‌క్కి పోతుండ‌టంతో కేసీఆర్ ఈసారి మ‌రింత ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. కేటీఆర్‌ను సీఎం చేసి.. తానకు క‌లిసొచ్చిన నందిన‌గ‌ర్‌లోని సొంతింటికి షిఫ్ట్ అయి.. మ‌రోసారి ఉద్య‌మ స‌మ‌యంలో మాదిరి రాజ‌కీయ పావులు క‌ద‌పాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ని అంటున్నారు.  మ‌రోవైపు.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌, ఫామ్‌హౌజ్‌ల పేరు చెప్పి.. త‌న‌ను ప్ర‌తిప‌క్షాలు ప‌దే ప‌దే టార్గెట్ చేస్తుండ‌టంతో.. ఆ మ‌ర‌క క‌డిగేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్ అది ప్ర‌గ‌తిభ‌వ‌న్ కాదు బానిస భ‌వ‌న్ అంటూ పేల్చిన డైలాగ్ జ‌నాల్లో బాగా నాటుకుపోయింది. ఆ ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు బ‌ద్ద‌లు కొడ‌తానంటూ స‌వాల్ కూడా చేశారు. ఇక రేవంత్‌రెడ్డి సైతం అది ప్ర‌గ‌తిభ‌వ‌న్ కాదు దొర‌ల గ‌డి అంటూ విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం.. ఫామ్‌హౌజ్‌లో ప‌డుకునే సీఎం అంటూ త‌న‌ను జ‌నాల్లో దోషిగా నిల‌బెడుతుండ‌టంతో.. ఇక త‌న అడ్ర‌స్ మార్చే టైమ్ వ‌చ్చింద‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌ట‌. అందుకే, నందిన‌గ‌ర్‌లోని త‌న సొంతింటికి త్వ‌ర‌లోనే షిఫ్ట్ అవుతార‌ని.. అందుకే ఆ ఇంటికి మ‌ర‌మ్మ‌త్తులు చేయిస్తున్నార‌ని.. ఆ ప‌నుల‌ను ఆయ‌నే స్వ‌యంగా ప‌రిశీలించారంటూ.. ఇలా ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజ‌మో తెలీదు గానీ.. ఏడేళ్లుగా ఎన్న‌డూ లేనివిధంగా కేసీఆర్ త‌న సొంతింటిపై ఫోక‌స్ చేయ‌డం చూస్తుంటే.. రాజ‌కీయంగా, పాల‌నాప‌రంగా త్వ‌ర‌లోనే కీల‌క ప‌రిణామాలు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. 

రేవంత్‌రెడ్డి వ‌ర్సెస్‌ కౌశిక్‌రెడ్డి.. తెర‌వెనుక‌ అస‌లేం జ‌రిగింది?

ఉద‌యం అన్ని ఛానళ్ల‌లో కౌశిక్‌రెడ్డిదే బ్రేకింగ్ న్యూస్‌. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ క‌న్ఫామ్ అయింద‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు డ‌బ్బులు ఇద్దామ‌ని.. అంద‌రినీ జ‌మ చేయ‌మంటూ ఓ గులాబీ లీడ‌ర్‌తో కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ నిమిషాల వ్య‌వ‌ధిలోనే వైర‌ల్ అయింది. ఇక అప్ప‌టి నుంచీ తెలంగాణవ్యాప్తంగా కౌశిక్‌రెడ్డి గురించే రాజ‌కీయ‌ చ‌ర్చ‌. ఇలా న్యూస్ వ‌చ్చిందో లేదో.. అలా రేవంత్‌రెడ్డి ఆదేశాల‌తో కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. 24 గంట‌ల్లోగా స‌మాధానం చెప్పాలంటూ ఆదేశించింది. అటు, కాంగ్రెస్‌లో ఇంటిదొంగ‌లను వ‌దిలేది లేదంటూ ప‌రోక్షంగా కౌశిక్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. ఇలా రెండువైపుల నుంచి ఉచ్చు బిగియ‌డంతో.. ఇక వేటు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి.. చేసేది లేక‌.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్‌రెడ్డి.  ఉద‌యం టీఆర్ఎస్ టికెట్ క‌న్ఫామ్ అంటూ ఫోన్ కాల్‌.. అది లీక్ కావ‌డం.. కాంగ్రెస్ నుంచి వార్నింగ్ రావ‌డంతో.. సాయంత్రంక‌ల్లా పార్టీకి రాజీనామా. ఇదీ కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌లో హైడ్రామా. వెళ్తూ వెళ్తూ అంద‌రూ చేసేదే ఆయ‌నా చేశారు. రేవంత్‌రెడ్డిని బ‌ద్నామ్ చేసేలా.. బాగానే ఆరోప‌ణ‌లు గుప్పించారు. 50కోట్ల‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి కొనుక్కున్నార‌ని.. సీనియ‌ర్లు సంతోషంగా లేర‌ని.. ఈట‌ల కోవ‌ర్ట్ అని.. రేవంత్ ముమైత్‌ఖాన్ లాంటోడ‌ని.. పోటీకి ముందే చేతులెత్తేశార‌ని.. త‌న‌ను కాద‌ని పొన్నం ప్ర‌భాక‌ర్‌కు టికెట్ ఇచ్చేందుకు కుట్ర చేశార‌ని.. ద‌మ్ముంటే హుజురాబాద్‌లో గెల‌వాలంటూ స‌వాల్ చేసి మ‌రీ పార్టీ వీడారు కౌశిక్‌రెడ్డి. రొటీన్‌గా కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి రెండుమూడు రోజుల్లో త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.  కౌశిక్‌రెడ్డి కొంత‌కాలంగా టీఆర్ఎస్‌తో ట‌చ్‌లో ఉన్నార‌నేది కాంగ్రెస్ ఆరోప‌ణ‌. ఇటీవ‌ల కేటీఆర్‌తో ఆయ‌న చేసిన చిట్‌చాట్ పార్టీకి ఆగ్ర‌హం తెప్పించింది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కౌశిక్‌రెడ్డికి టికెట్ రాద‌ని.. హుజురాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌ను బ‌రిలో దింపుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఒక‌వేళ కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి.. ఆయ‌న్ను గెలిపించుకున్నా కూడా.. గెలిచాక టీఆర్ఎస్‌లో చేరే అవ‌కాశం ఉంద‌నేది కాంగ్రెస్ అనుమానం. అందుకే, ఆయ‌న క‌మిట్‌మెంట్‌పై న‌మ్మ‌కం లేక‌.. కౌశిక్‌రెడ్డి స్థానంలో పొన్నంను నిల‌బెట్టాల‌నేది రేవంత్‌రెడ్డి ఆలోచ‌న అంటున్నారు. అయితే,  తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ స్థానం ఏళ్లుగా ఈట‌ల ఇలాఖా అని.. అక్క‌డి గెలుపు ఓట‌మిలు కాంగ్రెస్‌పై కానీ, త‌న‌పై కానీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ద‌ని రేవంత్ మాట్లాడ‌టం కాక‌రేపింది. అదే పాయింట్ మీద తాను పార్టీ వీడుతున్నానంటూ.. ఎన్నిక‌ల‌కు ముందే రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని ఆరోపిస్తూ.. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌డంతో పొలిటిక‌ల్ హీట్ మ‌రింత పెరిగింది.  అయితే, ఇన్ని ఆరోప‌ణ‌లు చేసిన కౌశిక్‌రెడ్డి.. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ క‌న్ఫామ్ అయిందంటూ మాట్లాడిన‌ ఫోన్ కాల్‌పై స్పందించ‌డానికి మాత్రం నిరాక‌రించ‌డం విచిత్రం. అంటే, ముందే కారు పార్టీ టికెట్ క‌న్ఫామ్ చేసుకొని.. అది కాస్త లీక్ కావ‌డంతో.. రేవంత్‌రెడ్డి మీద బ‌ట్ట కాల్చి మీదేస్తున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు భ‌గ్గుమంటున్నాయి. అటు, రేవంత్‌రెడ్డి సైతం ప‌రోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్‌లైన్ విధించారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.  కౌశిక్‌రెడ్డి వెనుక మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి హ‌స్తం ఉంద‌నే అనుమానం ఒక‌వైపు.. రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయ‌డానికే టీఆర్ఎస్ డైరెక్ష‌న్‌లో కౌశిక్‌రెడ్డి ఇలా పొలిటిక‌ల్ డైలాగులు పేల్చారనే ప్ర‌చారం మ‌రోవైపు. ఏదిఏమైనా.. కేవ‌లం హుజురాబాద్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కౌశిక్‌రెడ్డి.. యావ‌త్ తెలంగాణ‌కే పీసీసీ చీఫ్ అయిన బ‌ల‌మైన లీడ‌ర్‌ను విమ‌ర్శిస్తే.. రేవంత్‌రెడ్డికి పోయేదేముంటుంది? ఇక‌, ఇటీవ‌లే రేవంత్‌రెడ్డిని క‌లిసి, పూల‌బొకే ఇచ్చి, ఫోటో దిగిన కౌశిక్‌రెడ్డి.. వారం రోజుల్లోనే అదే రేవంత్‌రెడ్డిని నానామాట‌లు అంటూ కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌డం ఆస‌క్తిక‌రం. అందుకే అంటారు.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మేన‌ని....  

భార్య ముక్కు కొరికిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. 

భార్యాభర్త మధ్య  చిన్న చిన్న గొడవలు సహజం.. అప్పుడప్పుడు కొట్టుకుంటారు ఆ తరువాత మాట్లాడుకుంటారు.. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో అనుమానం అనే దెయ్యం ఎంటర్ అయితే ఇక  అంతే ఆ కుటుంబాన్ని అంతుచూసే దాకా వదిలిపెట్టదు ఆ అనుమాన భూతం.. అందుకే మన పెద్దలు అనుమానం పెద్ద భూతం ని అంటుంటారు.. అనుమానం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. తనకు అనుమానం కలగడానికి గల విషయాలపై ఆరా తీస్తారు.. ఆ తప్పు చేయకూడదని సర్ధిచెప్పుకుంటారు.. అది లేదంటే దెబ్బలాడుకుంటారు.. తాజాగా భార్యపై అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడో భర్త. అదేంటి ముక్కు కొరకడం ఏంటని అనుకుంటున్నారా ? మీరే తెలుసుకోండి అసలు ఏం జరిగిందో..  అదే కర్ణాటకలోని ధారవాడ తాలూకా. బెళగావి జిల్లా.  దొడ్డవాడ గ్రామానికి చెందిన ఉమేష్ గీత భార్యా భర్తలు.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమేష్ రోజు మద్యం తాగడం తో స్టార్ట్ అయేది.. అలా అతను  మద్యానికి బానిసయ్యాడు. దీంతో గుడిలో భక్తులు భజన చేసినట్లు ఆ  భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో ఐదేళ్ల క్రితం గీత భర్తతో గొడవపడి పిల్లల్ని తీసుకుని అమ్మినబావిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ టైములో భార్యపై లేని పోనీ అనుమానం పెంచుకున్నాడు.. తప్పు చేసింది భర్తనే కదా ఇకనైనా మారి ఉంటాడని ఆరునెలల క్రితం గీత  ఆమె పుట్టింటి నుంచి భర్త వద్దకు తిరిగి వచ్చింది. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. మారి  వైల్డ్ గా తయారు అయ్యాడు.  భార్యతో తరచూ గొడవపడుతూనే ఉండేవాడు.. ఆ దెబ్బతో ఆమె చేసేది ఏమిలేక మళ్లీ తిరిగి పుట్టింటికి వెళ్లి పోయింది. అప్పటికే భార్య మీద అనుమానం ఉన్న భర్త కి తన భార్య రెండో సారికూడా వెళ్లిపోవడంతో.. భార్యను తీసుకువచ్చేందుకు శుక్రవారం  అత్తారింటికి వెళ్లాడు ఉమేష్ . వెళ్తే వెళ్ళాడు గాని ఫుల్లుగా తాగివెళ్ళాడు.. అతను రాగానే మందు గమనించిన భార్య.. ఉమేష్ తో వెళ్లటానికి నిరాకరించింది. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవ తారాస్ధాయికి చేరేసరికి మద్యం మత్తులో ఉన్న ఉమేష్ కోపం పట్టలేక కోతిలా ఎగిరి భార్య ముక్కు కొరికాడు. ఇక అంతే ఆ నొప్పి భరించలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. ఎవరైనా వస్తే తనకు భజన చేస్తారని తెలిసి  ఉమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. గీత కేకలు విని వచ్చిన ఇరుగు పొరుగు వారు ఆమెను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఉమేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

కారెక్కనున్న కాంగ్రెస్ సీనియర్ ఎవరు?  

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారక రామా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ మున్సిపాలిటీల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇతర చోటా మోటా నాయకులు తెరాసలో చేరిన సదర్భంగా .. వీళ్ళే కాదు,సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు సైతం తెరాస వైపు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. అయితే, ఆనేతలు ఎవరన్నది అయన చెప్పలేదు. కేటీఆర్ ప్రకటనతో ఆ నేతలు ఎవరన్న దానిపై ఉహాగానాలు మాత్రం పరుగులు తీస్తున్నాయి.  కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే పీసీసీ మాజీ అధ్యక్షుడ ఉత్తమ కుమార్ రెడ్డి బంధవు, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు,ఆయనే,హుజూరాబాద్ నుంచి పోటీ చేసే తెరాస అభ్యర్ధిగా ప్రకటించుకున్న ఆడియో  ఒకటి పొలిటికల్ సర్కిల్స్ లో  చక్కర్లు కొడుతోంది. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి తెరాసలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో కేటీఆర్ చెప్పినట్లు టీఆర్ఎస్ లో చేరబోతున్న సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు ఎవరు అని చూస్తే.. ఉత్తమకుమార్ రెడ్డే కావచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో  వినవస్తోంది.  ముందు తమ బంధువర్గాన్ని ఆ తర్వాత తమ అనుచర గణాలను కారెక్కించి, చివరాఖరులో  ఉత్తమ్ కుమార్ కూడా కారెక్కేస్తారా అన్న అనుమానాలు కూడా పార్టీ  వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఉత్తమ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్’ కి మధ్య గుడ్’నైట్ రిలేషన్స్ ఉన్నాయని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సో. కేటీఆర్ చెప్పిన, తెరాస వైపు చూస్తున్న సుదీర్ఘ అనుభవం ఉన్నసీనియర్ నాయకు దు ఆయనేనా  అన్న చర్చ జరుగుతోంది.   మరోవైపు రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించినప్పుడే, కాంగ్రెస్ అధినాయకత్వం, ఇలాంటి పరిణామాలు ఉంటాయని ఉహించిందని, సీనియర్ నాయకులు కొందరు చికాకులు సృష్టిస్తారని తెలిసినా, పార్టీ భవిష్యత్ దృష్ట్యా పార్టీని పైకి తీసుకు పోయే సత్తా ఉన్న రేవంత్ రెడ్డికి పట్టం కట్టాలని నిర్ణయించిందని అంటున్నారు. 

బిడ్డను ఇనుపచువ్వతో కాల్చిన తల్లి..

ఏ మాట వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోలేనంతకాలం మోసపోతూనే ఉంటాం..మనదేశ ప్రగతికి పని చేసే సైయింటిస్ట్ కంటే.. కాషాయం కట్టి వాడి సొంత ప్రగతికి పనిచేసే బాబాలకే మన దేశం విలువనిస్తారు.  ఇంకా చెప్పాలంటే మన దేశంలో సైన్స్ పాఠాల కంటే, మూఢనమ్మకాల పాఠాలు ఎక్కువ చెపుతుంటారు. పిల్లలకు ఏదైనా ఐతే హాస్పిటల్స్ కి పరుగెత్తారు ఏ స్వామి దగ్గరికో సన్యాసి దగ్గరికో పరుగులు తీస్తారు. తాజాగా  ఓ కన్నతల్లి అజ్ఞానం.. చీకట్లోకి నెట్టింది.. చివరికి కన్నబిడ్డ మరణానికి దారితీసింది. అలా అని ఆమె మూఢనమ్మకం.. చివరికి తనకు  కడుపుకోతను మిగిల్చింది. ఆమె చేసిన ఆ అమాయయకమైన పని.. కళ్లు కూడా తెరవని పసికందును కాటికి పంపింది. బిడ్డకు అనారోగ్యంగా ఉందని, తాంత్రిక విద్య తెలిసిన దానిలా ఓ మహిళా బిడ్డ పొట్టపై ఇనుప చువ్వతో కాల్చింది. వేడి తట్టుకోలేని చిన్నారి తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచింది.  వివరాలలోకి వెళితే.. భిల్వారా జిల్లా, మండల్ బ్లాక్‌లోని లుహరియా గ్రామంలో రమేష్ బగారియా, ఆయన భార్య లాహరి నివసిస్తున్నారు. వారికి 5 నెలల క్రితం పాప పుట్టింది. ఈ క్రమంలోనే చిన్నారి కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైంది. సరిగ్గా పాలు తాగడం లేదు.. ఎప్పుడు ఏడుస్తూ ఉంది. దీంతో తల్లి చిన్నారిని తీసుకుని  హాస్పిటల్ కి పరిగెత్తాల్సిన ఆ తల్లి ఓ తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ, వారి ఊరిలో ఉండే తాంత్రికుడు పక్క వూరు వెళ్లాడని తెలియడంతో.. ఆమె సొంత వైద్యానికి సిద్దమయ్యింది. అదేదో తేలు మంత్రం రానివ్వడు.. పాము నోట్లో పెట్టినట్లు.. తన  బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పొట్టపై కాల్చాలని ఎక్కడో విన్న మాట పట్టుకొని అదే విధంగా చేయడానికి రెడీ అయ్యింది. ఆలస్యం చేయకుండా బిడ్డను నిద్రపుచ్చి.. నిప్పుల మీద ఇనుము చువ్వను ఎర్రగా కాల్చింది.. ఎర్రగా కణకణ కాలిన ఇనుప చువ్వను పసికందు పొట్టపై అంటించింది.  దీంతో పాపకు వ్యాధి నయం అవుతుందని భావించింది. అంత వేడి తట్టుకోలేని చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఏడుపు మొదలుపెట్టింది. దీంతో వెంటనే వారు పసికందును మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ పసికందు తల్లి ఒడిలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌ లో వెలుగు చూసింది.  

తాడిప‌త్రిలో దీక్ష‌కు ష‌ర్మిల రెడీ.. ముందే షాకిచ్చిన మంత్రి..

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దీక్ష‌లు, ధ‌ర్నాల‌తో హోరెత్తిస్తున్నారు వైఎస్ ష‌ర్మిల‌. కొత్త పార్టీతో ఇక త‌న స‌త్తా ఏంటో నిరూపించుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై ఇందిరా పార్కు ద‌గ్గ‌ర దీక్ష చేయ‌డం.. జాకెట్ చిన‌గ‌డం.. అరెస్ట్ కావ‌డం.. ఇలా పొలిటిక‌ల్‌గా ఫుల్ మైలేజ్ తెచ్చుకున్నారు ష‌ర్మిల‌. ఆ టెంపోను అలానే కంటిన్యూ చేసేందుకు.. తాజాగా తాడిప‌త్రిలో నిరుద్యోగ నిరాహార దీక్ష‌కు సిద్ద‌మ‌వుతున్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌. పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటన‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా, వైఎస్‌ షర్మిల ఈ నెల 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు. తాడిపత్రికి చెందిన కొండల్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. బాధిత కుటుంబీకుల సమక్షంలో ప‌గ‌లంతా.. ఆమె నిరాహారదీక్ష చేయ‌నున్నారు. అయితే.. ష‌ర్మిల దీక్ష విష‌యం తెలిసి టీఆర్ఎస్ పార్టీ అల‌ర్ట్ అయింది. ష‌ర్మిల రాక‌కు ముందే.. సోమ‌వారం మంత్రి నిరంజ‌న్‌రెడ్డి కొండల్ కుటుంబాన్ని పరామర్శించ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతోంది.  వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో ఉద్యోగ నోటిఫికేషన్ రావ‌డం లేదంటూ ఇటీవ‌ల కొండ‌ల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవ‌డం జిల్లాలో క‌ల‌క‌లంగా మారింది. ఈ విష‌యం తెలిసి ష‌ర్మిల మంగ‌ళ‌వారం కొండ‌ల్ ఇంట్లో దీక్ష‌కు సిద్ద‌మ‌య్యారు. ష‌ర్మిల దీక్ష‌కు కౌంట‌ర్‌గా అన్నట్టు.. తాజాగా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి కొండ‌ల్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కు అందజేశారు. కొండల్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని.. ప్రభుత్వం దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. త్వరలో భారీ నోటిఫికేషన్లు రానున్నాయని విద్యార్థులు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు.  అటు.. ష‌ర్మిల నిరుద్యోగ‌ నిరాహార దీక్ష‌.. ఇటు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి ఓదార్పు యాత్ర‌తో తాడిప‌ర్తి గ్రామంలో రాజ‌కీయ హ‌డావుడి నెల‌కొంది.   

రఘురామపై అనర్హత వేటు? క్లారిటీ ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా.. 

నర్సాపురం ఎంపీ రాఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడనుందా? వైసీపీ ఎంపీలు చెబుతున్నట్లు స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారా? రఘురామ విషయంలో దీనిపై ఇటీవల కాలంలో జోరుగా చర్చ సాగుతోంది. ఢిల్లీకి వెళ్లి మరీ విజయసాయి రెడ్డి లాబీయింగ్ చేస్తుండటంతో రఘురామ అంశంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనూ కన్పిస్తోంది. అయితే వైసీపీ ఇచ్చిన అనర్హత పటిషన్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. ఆ విషయంపై రన్నింగ్‌ కామెంటరీ చేయలేమని స్పీకర్ అన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక ప్రక్రియ అంటూ ఉంటుందని, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు. సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్‌.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు.  రఘురామ అనర్హత పిటిషన్‌‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కోరారు. గత శుక్రవారం స్పీకర్‌ను కలిసిన ఆయన.. పిటిషన్ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్‌ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామన్నారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే అర్ధం వచ్చేలా కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు తన విమర్శలను ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా సోమవారం ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం కూడా పార్టీ వ్యతిరేక నిర్ణయం కిందకు వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం జగన్ ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అన్న అనుమానం వెలిబుచ్చారు. ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తున్నానని తాను చెప్పడం వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. తాను వెల్లడిస్తున్న అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అని రఘురాజు ప్రశ్నించారు. తన పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేయాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ కు కారణం ఏమిటని నిలదీశారు. తాను చేసిన తప్పు ఏమిటో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా? అంటూ ఎంపీ రఘురామ రాజు మండిపడ్డారు.

అమ్మ భాషపై మరో కుట్ర! జగన్ రెడ్డి కొత్త కథ? 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగు భాషంటే, ఏహ్య భావం, అసహ్యం,  ఛీ ... ఇదీ ఒక భాషేనా అనే చులక భావం,తెలుగు భాషను శాశ్వతంగా సమాధి చేయాలనే సంకల్పం నిజంగా ఉన్నాయో లేవో గానీ, ఆయన చర్యలు, ఆయన ప్రభుత్వంతీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం,అలాగే  ఉంటున్న్నాయి. బహుశా ఆయన చిన్న తనంలో, తెలుగు పదం నోటెంట వస్తే మూతికి వాతలు పెట్టే క్రైస్తవ మిషనరీ స్కూల్స్’లో చదువుకున్నారో ఏమో మనకు తెలియదు,కానీ, గత రెండేళ్లుగా ఆయన తెలుగు భాషను చావచితక కొట్టే  నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ముందున్నారు.   అధికారంలోకి వస్తూనే, పేదరిక నిర్మూలనకు ఇంగ్లిష్ మీడియం చదువులు దివ్య ఔషధం అన్నట్లుగా, ఆ వంకన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ 81, 85 జీవోలను జారీ చేశారు. అదేమంటే తల్లి తండ్రుల కమిటీలు కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి, పేద పిల్లలు పైకి రావడాన్ని ప్రతిపక్షాలు, భాషా పండితులు అడ్డుకుంటున్నారని విరుచుకు పడ్డారు. అయితే హైకోర్టు ఆ జీవోలను రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని హై కోర్ట్ గట్టిగా అక్షింతలు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి గట్టిగా తలంటింది.  స్వాతంత్య్రానికి ముందు, తర్వాత చూసినా.. 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, విద్యా జాతీయ విధానం, ఇతర నివేదికల మేరకు నిస్సందేహంగా 1 నుంచి 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నాయని హైకోర్టు తెలిపింది. అందువల్ల ఈ జీవోలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కావని పేర్కొంటూ ధర్మాసనం  ఏకంగా  92 పేజీల తీర్పు వెలువరించింది.  ఒక  ప్రాంతీయ భాషగా, మాతృ భాషగా తెలుగుకు ఎంతో చరిత్ర వుంది. తెలుగు భాష అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏంటి కృషి చేశాయి. బహు భాషా కోవిదుడు పీవీ నరసిమః రావు, రాష్ట్ర విద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, తెలుగు భాషాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను చర్చించి మార్గదర్శనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా  ‘అధికార తెలుగు భాషా సంఘం, తెలుగు అకాడమి’ ఆవిర్భవించాయి. కమిటీ సిఫారసుల మేరకే ప్రాథమిక, ఉన్నత విద్యలో తెలుగు బోధనా మాధ్యమంగా నిర్ణయించారు.  తెలుగు భాష గొప్పతనం తెలుసుకునే తీరిక, ఓపిక ఆ రెంటినీ మించి అవగాహన లేకపోవడం వలన చేత కావచ్చు, అప్పుడు, గుడ్డిగా తెలుగు బోధనపై వేటు వేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పడు,తెలుగు అకాడమీ పేరును రాష్ట్ర తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చింది. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఏమో కానీ, మాజీ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర సభ ఉప సభాపతి మండలి బుద్ధా ప్రసాద్ సహా అనేక మంది తప్పు పట్టారు.చంద్రబాబు నాడు అన్నట్లుగా జగన్ రెడ్డి తెలుగు అకాడమీ అంటే అదేదో తెలుగు దేశం పార్టీకి సంబందించింది అనుకున్నారో ఏమో,ఒక్క సరిగా తెలుగు అకాడమీ పేరును మార్చేశారు.  నిజంగా సంస్కృత భాషను ప్రోత్సహించాలనుకుంటే, అందుకోసం ప్రత్యేకంగా మరో అకాడమీని ఏర్పటు చేయవచ్చును, కానీ, ముఖ్యమంత్రి ఉద్దేశం అది కాదు,తెలుగు అకాడమీ చుట్టూ ఒక వివాదాన్ని సృష్టించి తెలుగు భాషనూ, అకాడమీని చులకన చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకే ప్రభుత్వం తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని జోడించడంతో పాటుగా, అకాడమీ పాలకమండలికి తెలుగుభాష, సైన్సు, సోషల్‌ సైన్సు, వృత్తి విద్య సబ్జెక్టుల్లో ప్రత్యేక పరిజ్ఞానమున్న నలుగురు సభ్యులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. అందుకే తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిది కాదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు. అలాగే,  ముఖ్యమంత్రి జగన్‌ తెలుగు అకాడమీ చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోవాలని, బుద్ధప్రసాద్‌ హితవు పలికారు.  కేంద్ర ప్రభుత్వ నిధులతో 1968లో తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారని.. పరిశోధనలు, ఆధునీకరణ, భాషా వ్యాప్తికి కృషి చేయడం ఈ సంస్థ లక్ష్యమని గుర్తు చేశారు. అప్పటి విద్యా శాఖ మంత్రి పీవీ నరసింహారావు తెలుగు అకాడమీకి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు,  ‘మన మాతృభాషను గౌరవించుకోవడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాల్సింది పోయి, తెలుగు భాషను అంతం చేయడానికి పుట్టినట్లు వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికే మాతృభాష మాధ్యమానికి మంగళం పాడారు. ఇక తెలుగు సంస్థల వంతు వచ్చినట్లుందని , బుద్ధా ప్రాసాద్ అవేదన్ వ్యక్తం చేశారు.అయితే, ముఖ్యమంత్రి లక్ష్య, గమ్యం వేరు. ఆ దేవుడు చెప్పిందే వేదం.. అయితే,ఆయన లక్ష్యం అంట తేలిగ్గా నెరవేరేది కాదు. అయినా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి   తెలుగు భాషా ద్వేషం ఏమిటో .. ఎందుకో ..

కాంగ్రెస్ నిరసనలో అపశృతి.. ఎడ్లబండి నుంచి కిందపడిన రాజనర్సింహ

దేశంలో చమురు ధరలు పెంచడంపై నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సైకిల్ ర్యాలీలు, ఎడ్ల బండ్లతో ప్రదర్శనలు చేశారు. అయితే మెదక్ లో జరిగిన కాంగ్రెస్ నిరసనలో అప శృతి చోటు చేసుకుంది. మెదక్  ధర్నాచౌక్ లో నిర్వహించిన నిరసన  కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎడ్ల బండ్లతో ర్యాలీ తీశారు. తర్వాత ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురైంది. బండిపై నిల్చున్న నేతలు పక్కకు ఒరిగారు. దీంకో  బండిపై నిల్చుని మాట్లాడుతున్న దామోదర రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు. అటు వికారాబాద్ లో జరిగిన నిరసనలోనూ చిన్న అపశృది చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎడ్ల బండి పై నుంచి కింద పడిపోయారు. అయితే ఆయనకు గాయాలేవి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

టీడీపీకి కొత్త అధ్య‌క్షుడు.. రేసులో ఆ ఐదుగురు..

టీడీపీ అధ్య‌క్షుడంటే అదో ప‌ద‌వి కాదు.. కుటుంబ పెద్ద‌లాంటి బాధ్య‌త‌. తెలుగు త‌మ్ముళ్ల‌దంతా ఒకే ఫ్యామిలీ. క‌ష్ట‌న‌ష్టాల్లో క‌లిసే ఉంటారు. ఎన్ని స‌మ‌స్య‌లు, ఆప‌ద వ‌చ్చినా.. పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. అందుకే, ఆనాడు ఎన్టీఆర్ త‌యారు చేసిన నాయ‌కులు.. ఇప్ప‌టికీ పార్టీనే అంటిబెట్టుకొని ఉన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీనే స‌ర్వ‌స్వంగా భావిస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వంలో అంతాక‌లిసి ప‌ని చేస్తున్నారు. పార్టీ అంతా ఒక్క‌తాటి మీద న‌డుస్తోంది. తాజాగా, కేసీఆర్ విసిరిన గాలానికి టీటీడీపీ అధ్య‌క్షులు ఎల్.ర‌మ‌ణ చిక్కిపోయారు. సుదీర్ఘ‌కాలం పార్టీనే న‌మ్ముకున్న ఆయ‌న‌.. ఓ ప‌ద‌వి కోసం కండువా మార్చేశారు. అయితే, టీడీపీలో ఎల్‌.ర‌మ‌ణ‌లాంటి నేత‌లు ఎంతోమంది ఉన్నారు. ఒక‌రు పోతే.. ప‌ది మంది నాయ‌కులు అధ్య‌క్ష ప‌ద‌వి కోసం సిద్ధంగా ఉన్నారు.  టీటీడీపీ నేతలతో రెండు రోజులుగా వర్చువల్ సమావేశం నిర్వహించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? కేసీఆర్‌పై పోరాటంలో యాక్టివ్‌గా ఉండే నాయ‌కుడు ఎవ‌రు? అంటూ సీనియ‌ర్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించార‌ని తెలుస్తోంది. రేసులో ప్ర‌ధానంగా ఐదుగురి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.  30 ఏళ్లుగా టీడీపీలో కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకుడిగా కొనసాగిన రమణ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఇప్పుడు నెక్ట్స్ ఎవ‌రు అనే ప్ర‌శ్న ఆస‌క్తి రేపుతోంది. బీసీ నాయ‌కుడు రమణ స్థానంలో కొత్త టీటీడీపీ అధ్య‌క్షుడిగా ఎవ‌రిని నియ‌మిస్తార‌నే అంశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఐదుగురి నేతలు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి, మరో సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. టీటీడీపీ ప‌గ్గాలు బీసీ వర్గానికే ఇవ్వాల‌ని అనుకుంటే అరవింద్ కుమార్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గానికి అయితే బక్కని నర్సింహులుకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక‌, తెలంగాణ‌లో బ‌ల‌మైన రెడ్డి స‌మాజిక వ‌ర్గానికి ఈసారి అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న కూడా చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ జాబితాలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నన్నూరి నర్సిరెడ్డికి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని అంటున్నారు. మంచి వాగ్దాటి.. దూకుడు స్వ‌భావం న‌ర్సిరెడ్డికి అనుకూలాంశాలు. అయితే, సీనియ‌ర్ నేత‌, అంద‌రినీ క‌లుపుకొని పోయే నేత‌.. రావుల చంద్రశేఖర్ రెడ్డి వైపు మెజార్టీ నాయ‌కులు మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. పాల‌మూరు జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి విశేష రాజ‌కీయ అనుభ‌వం ఉంది. 1982లో కానాయపల్లి సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి 1985లో టీడీపీ జిల్లా కార్యదర్శిగా, 1987లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1994లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. 2002, 2008లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీటీడీపీ రాష్ట్ర కమిటీకి నూతన అధ్యక్షుడి ఎంపిక బాధ్యత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుదే. టీడీపీకి ఎప్పుడూ నాయ‌కుల లోటు లేదు. తెలుగుదేశం పార్టీ అంటే నాయ‌కుల‌ను త‌యారు చేసే క‌ర్మాగారం. ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్న హేమాహేమీ నేత‌ల్లో చాలామంది ఒక‌ప్ప‌టి టీడీపీ నాయ‌కులే. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి ఆరితేరిన వారే. తెలంగాణ‌లో టీడీపీ పునర్ నిర్మాణం కోసం బ‌ల‌మైన నాయ‌కుడిని టీటీడీపీ అధ్య‌క్షుడిని చేసేలా.. అధినేత చంద్ర‌బాబు పార్టీ నేతలతో రెండు రోజులపాటు వర్చువల్ పద్దతిలో విస్తృతంగా చర్చించారు. పార్టీ వ‌ర్గాల అభిప్రాయం మేర‌కు త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారు చంద్ర‌బాబు.   

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. గ్రామ సచివాలయ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. గ్రామ సచివాలయాలకు సంబంధించిన జగన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీవో2ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.  గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ జగన్ సర్కార్ ఈ జీవో ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఆ జీవోను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది.పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను.. వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు నిలదీసింది ఏపీలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన జీవో 2ని రద్దుచేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్‌ టి.కృష్ణమోహన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున వాదనలను న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వినిపించారు. దీనిపై  విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్ధ అమల్లో ఉండగా.. ప్రభుత్వం సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. సమాంతర వ్యవస్ధ ఎందుకని ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్‌ల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం సుబ్రమణ్యం... ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే గ్రామ సచివాలయాలు, వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. సర్పంచ్‌, కార్యదర్శుల అధికారాలకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి... నవరత్నాలను గ్రామ పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించారు. గతంలో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు తాజాగా ఇచ్చిన జీవో 2 విరుద్ధంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి  వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో పంచాయతీలకు సర్పంచ్‌ అలాగే అధిపతి అని న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. కాబట్టి సర్పంచ్‌ల వ్యవస్ధను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌కు హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. ఈ కేసులో వాదనలు పూర్తికావడంతో హైకోర్టు సోమవారం తీర్వు వెలువరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అల్లం కాదు..3 వేల కిలోల గంజాయి.. తెలిస్తే షాక్ అవుతారు..  

ఈ ప్రపంచం నడిచేది డబ్బు మొదటిది అయితే..  మానవుడు బతకడానికి అవసరం అనే అంశం రెండోవది అని చెప్పాలి.. ఈ రెండు విషయాల కోసం మానవుడు అనేక రకాలుగా అక్రమాలకు పాటుపడుతున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం పక్కవాడిని మోసం చేయడానికి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడదానికి కూడా వెనకాడం లేదు.. షార్ట్ టైములో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి. షార్ట్ టైములో  సెట్టిల్ అవ్వాలని స్మగ్లింగ్ లాంటి దారులను ఎంచుకుంటున్నారు.    ఈ మధ్య కాలంలో స్మగ్లింగ్ రాయుడ్లు రెచ్చిపోతున్నారు. ఒక వైపు బంగారు స్మగ్లింగ్ మరో వైపు బంగారు స్మగ్లింగ్, మరో వైపు గంజాయి స్మగ్లింగ్ రకరకాలుగా పోలీసుల కళ్ళు కప్పి జోరుగా చేస్తున్నారు. కానీ చివరికి వేటగాడు వేసిన వలకు చేప చిక్కినట్లు ఈ స్మగ్లింగ్ బ్యాచ్ కూడా పోలీసులకు పట్టుపడుతున్నారు. తాజాగా విజయనగరం  జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసుల పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒకటి కాదు రెండు కాదు సుమారు రూ.1.50 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లాన్నీ అడ్డంగా పెట్టుకుని గంజాయి తరలిస్తున్నారంటూ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకి సమాచారం రావడంతో విజయనగరం రూరల్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, రూరల్ పోలీసులు సమూహంగా  కలిసి రంగంలోకి దిగారు.. వారి వాహనాన్ని ఛేదించారు. చివరికి ఆ వాహనాన్ని పట్టుకున్నట్లు విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. అంతే కాదు లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరవింద్ కుమార్, భరత్‌సింగ్, సత్యబాన్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు. వాహనాల తనిఖీ నేపధ్యంలో ఒడిస్సా నుండి గంజాయి ఎక్కించుకొని విజయనగరం ఏజెన్సీ మీదుగా విశాఖ వైపు వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు,  ఆ వాహనంలో అల్లం కాకుండా ఒకటి కాదు రెండు కాదు 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. సిమిలిగూడలో గంజాయి లోడు చేసినట్టు నిందితులు అంగీకరించారని..దీన్ని ఢిల్లీకి తరలిస్తున్నట్టు చెప్పారని అన్నారు. కేసు నమోదు చేసి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలుదారుడు, విక్రయదారుడుపై వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.  

పీఆర్ మోహన్ మృతికి చంద్రబాబు సంతాపం 

తెలుగు దేశం పార్టీ  సీనియర్ నేత, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీలో పలు కీలక పదవుల్లో మోహన్ పనిచేశారు. గతంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. పీఆర్ మోహన్ మృతితో టీడీపీలో విషాదం అలుముకుంది.  ఆయన మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు సహా రాష్ట్ర పార్టీ నేతలు, జిల్లా టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.  టీడీపీ సీనియర్ నేత పీఆర్‌ మోహన్‌ మృతి బాధాకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మోహన్ గుండెపోటుతో మృతి చెందారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి మోహన్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. శాప్ చైర్మన్‌గా మోహన్‌ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని తెలిపారు. టీడీపీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని అన్నారు. మోహన్ కుటుంబసభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయామని టీడీపీ నేతలు సంతారం తెలిపారు. పీఆర్ మోహన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థించారు. 

డ‌బుల్ మ‌సాలా పొలిటిక‌ల్‌ బిర్యానీ.. ఎవ‌రి గోల వారిదే..

రాజ‌కీయాల్లో రాత్రికి రాత్రే ఈక్వేష‌న్స్ మారిపోతుంటాయి. ఇవాళ ఓ పార్టీలో ఉన్నోళ్లు.. రేప‌టిక‌ల్లా మ‌రోపార్టీలో క‌నిపిస్తున్నారు. పొద్దున్న ఆ నేత ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు భుజంపై ఏ పార్టీ కండువ ఉంటే.. ఆయ‌న ఆరోజుకు ఆ పార్టీలో ఉన్న‌ట్టు.. అని భావించాల్సిన రోజులివి. ఈట‌ల నుంచి ఎల్‌.ర‌మ‌ణ వ‌ర‌కూ అదే జ‌రుగుతోంది. ఇటీవ‌ల తెలంగాణ పాలిటిక్స్ అత్యంత వేగంగా మారుతున్నాయి. మునుపెన్న‌డూ లేనంత పొలిటిక‌ల్ యాక్టివిటీ క‌నిపిస్తోంది. ష‌ర్మిల‌, ఈట‌ల‌, రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి, కోదండ‌రాం, ఎల్‌.ర‌మ‌ణ‌, కోమ‌టిరెడ్డి, కౌశిక్‌రెడ్డి.. ఇలా అనేక మంది నేత‌లు నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు. వారి పేరుమీద ఏదోఒక హ‌డావిడి న‌డుస్తూనే ఉంది. తెలంగాణ‌లో అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చినంత హంగామా.  ఈట‌ల ఎఫెక్ట్ కాక‌రేపుతోంటే.. అదే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డం మ‌రింత పొలిటిక‌ల్ హీట్ పెంచేసింది. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ ఇటు టీఆర్ఎస్‌లో, అటు కాంగ్రెస్‌లో కాక‌రేపుతోంది. బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్‌లా.. ఈట‌ల ప్ర‌భావంతో ఎల్‌.ర‌మ‌ణ‌, కౌశిక్‌రెడ్డిల రాజ‌కీయ త‌ల‌రాత మ‌రిపోతుంటే.. రేవంత్‌రెడ్డి దెబ్బ‌కు కోమ‌టిరెడ్డి, కోదండ‌రాం, ష‌ర్మిల‌ల రాజ‌కీయ భ‌విత‌వ్యం సందిగ్థంలో ప‌డింద‌ని అంటున్నారు.  ఇక‌, రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ మామూలుగా లేదు. యావ‌త్ తెలంగాణ రాజ‌కీయాల‌ను ఆ ఒక్క‌డే అత‌లాకుత‌లం చేస్తున్నారు. అటు రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌గానే.. కోమ‌టిరెడ్డి రూపంలో ఏకైక నిర‌స‌న స్వ‌రం వినిపించింది. వెంట‌నే ఆ ధిక్కార స్వ‌రాన్ని గొంతుపిసికి చంపేశార‌ని అనుకున్నా.. అది ఈసారి ఢిల్లీలో రీసౌండ్‌గా వినిపించింది. ఏ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసమైతే ఆరు నెల‌ల పాటు ఆహోరాత్రులు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారో.. ఆ పీసీసీ చీఫ్ ప‌ద‌వి త‌న‌కు చిన్న ప‌ద‌వి అంటూ కామెడీగా మాట్లాడారు కోమ‌టిరెడ్డి. బ‌హుషా.. అంద‌ని ద్రాక్ష పుల్ల‌న అంటే ఇదేనేమో..  కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే.. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డిని క‌లిసి క‌ల‌క‌లం రేపారు. ఈశాన్య రాష్ట్రాల్లో కోమ‌టిరెడ్డి ఫ్యామిలీకి చెందిన కంపెనీ.. ప‌లు కాంట్రాక్టులు చేస్తోంది. ప్ర‌స్తుతం కిష‌న్‌రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా కూడా ఉన్నారు. అలా వ్యాపార ప్ర‌యోజ‌నాల కోస‌మే.. కోమ‌టిరెడ్డి స్వ‌ప‌క్షంలో విప‌క్షంలా మారారా? లేక‌, త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి దారిలోనే ఆయ‌న సైతం కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అనే డౌటనుమానం...!  మ‌రోవైపు ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకున్న ఎల్‌.ర‌మ‌ణ‌.. ఇక త‌న‌వ‌ల్ల కాద‌ని కాడి దించేస్తున్నారు. ఈట‌లకు కౌంట‌ర్‌గా బ‌ల‌మైన బీసీ నేత అన్వేష‌ణ‌లో ఉన్న కేసీఆర్ వ‌ల‌కు ఎల్.ర‌మ‌ణ చిక్కేశారు. లేటైతే.. చెక్‌పోస్ట్ ప‌డుద్ది.. ర‌మ‌ణా.. లోడెత్తాలిరా... అంటూ ఈట‌ల‌కు పోటీగా బీసీల భారం ఎల్‌.ర‌మ‌ణ భుజాల‌పై మోపేందుకు సిద్ధ‌మువుతున్నారు గులాబీ బాస్‌. ర‌మ‌ణ సైతం క‌ట్ట‌ప్ప వార‌సుడిలా సింహాస‌నానికి క‌ట్టుబ‌డి ప‌నిచేసేందుకు రెడీ అయిపోతున్నారు.  ఇక‌, కాంగ్రెస్ నేత‌ కౌశిక్‌రెడ్డి ఝ‌ల‌క్ మామూలుగా లేదు. త‌న‌కు హుజురాబాద్‌ టీఆర్ఎస్ టికెట్ క‌న్ఫామ్ అయిందంటూ వైర‌ల్‌గా మారిన ఫోన్ ఆడియో.. ఆయ‌న రాజ‌కీయ త‌ల‌రాత‌ను త‌ల‌కిందులు చేసేయ‌నుంది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కు ద‌గ్గ‌రి బంధువు అయిన కౌశిక్‌.. ఇప్పుడు తాజా పీసీసీ చీఫ్ రేవంత్ ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌చ్చింది. హుజురాబాద్‌లో కౌశిక్‌ను సైడ్ చేసి పొన్నంను పోటీ చేయించాల‌ని భావిస్తున్న రేవంత్‌కు మార్గం మ‌రింత సులువైన‌ట్టే అంటున్నారు. అటు ఇంత జ‌రిగాక కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ వ‌స్తుందో రాదో తెలీదు.. వ‌చ్చినా.. పార్టీ మారిన ఆయ‌న్ను ఓట‌ర్లు ఆద‌రిస్తారో లేదో తెలీదు.. ఏ పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే ఆయ‌న రెబెల్‌గా పోటీ చేసినా చేస్తారు.. అదే జ‌రిగితే.. కౌశిక్‌రెడ్డి చీల్చ‌బోయే ఓట్లు ఎవ‌రికి లాభిస్తాయో? ఎవ‌రిని గెలిపిస్తాయో? బ‌ల‌మైన నేత‌లంగా కీల‌కంగా మార‌డంతో.. పాపం కోదండ‌రాం సార్ ప‌రిస్థితి ఎటూ కాకుండా పోతోంది. అస‌లింత‌కి ఆయ‌న పార్టీ ఉందో లేదో తెలీని దుస్థితి. సండ‌ట్లో స‌డేమియాలో.. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో క‌లిపేస్తున్నారంటూ ప్ర‌చారం మొద‌లైపోయింది. కాదు మొర్రో అని కోదండ‌రాం సార్ మొత్తుకుంటున్నా.. ఎవ‌రూ న‌మ్మేలా లేరు. ఉద్య‌మ‌కాలం నుంచి ఉన్న కోదండ‌రాం ప‌రిస్థితే ఇలా ఉంటే.. నిన్న‌కాక మొన్న.. తెలంగాణ కోడ‌లి నంటూ వ‌చ్చిన ష‌ర్మిల‌.. కొత్త పార్టీ ఆవిర్భావోత్స‌వంతో అద‌ర‌గొట్టింది. కాసులు కుమ్మ‌రించి.. సినిమా ఈవెంట్‌లా ధూంధాంగా పార్టీ ప్రారంభించారు. ఆమె గెలుస్తారు.. రాజ‌న్న‌రాజ్యం వ‌స్తుంద‌నే ఆశ ఎవ‌రికీ లేక‌పోయినా.. ష‌ర్మిల చీల్చ‌బోయే ఓట్లు ఎవ‌రికి మైన‌స్‌.. ఎవ‌రికి ప్ల‌స్ అనేదే కీల‌కం. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గానే ష‌ర్మిల పార్టీ పెట్టార‌నే విశ్లేష‌ణ మాత్రం ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అందుకే, రేవంత్ సైతం ష‌ర్మిల దుమ్ము దులిపేస్తున్నారు. వైఎస్సార్‌టీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌ను కాచుకుంటూనే.. పార్టీని డిస్ట‌ర్బ్ చేస్తున్న కోమ‌టిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలాంటి వారికి చెక్ పెట్టే ప‌నిలో బిజీగా ఉన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.  ఇలా ఇటు రేవంత్‌రెడ్డి.. అటు ఈట‌ల రాజేంద‌ర్ + బండి సంజ‌య్ + కిష‌న్‌రెడ్డి టీమ్‌.. మ‌రోవైపు కేసీఆర్‌, ఎల్‌.ర‌మ‌ణ రాజ‌కీయం.. సండ‌ట్లో స‌డేమియాలా ష‌ర్మిల పార్టీ.. ఆట‌లో అర‌టిపండులా కోదండ‌రాం సారు.. అంతాక‌లిసి తెలంగాణ రాజ‌కీయాల్ని మునుపెన్న‌డూ లేనంత రంజుగా మార్చేశారు. హుజురాబాద్ ఎల‌క్ష‌న్ వ‌ర‌కూ ఈ ఎపిసోడ్ స‌ల‌స‌ల కాగాల్సిందే....   

ఉపఎన్నిక కాదు కుంభస్థలమే కొట్టాలి.. ఇదేనా రేవంత్ వ్యూహం?

రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రేవంత్ కాకుండా ఇంకెవరు పీసీసే చీఫ్ అయినా ఇంత జోష్ ఇంత ఉత్సాహం వచ్చేది కాదు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ శ్రేణులే కాదు, మీడియా, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు  కూడా  గుర్తించారు. అంతే కాదు, రాజకీయ ప్రత్యర్ధులు కూడా  జాగ్రత్త పడుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు ప్రకటించీ ప్రకటించక ముందునుంచే, ముఖ్యమంత్రి కేసీఆర్’లో కదలిక మొదలైంది. ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ దాటి బయటకు రాని, ముఖ్యమంత్రి గేటు దాటి కాలు బయట పెట్టారు.ఏదో వంకన ప్రజల మధ్యకు  వెళుతున్నారు.ఉరూర తిరుగుతున్నారు, ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నారు. పిట్ట కథలు చెపుతున్నారు. పగలబడి నవ్వుతున్నారు. జనాన్ని నవ్విస్తున్నారు. ప్రతిపక్షాల పై ఎప్పటి లానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను మళ్ళీ,మళ్ళీ ఏకరవు పెడుతున్నారు. చివరకు, పెండింగ్’లో పడిపోయిన ఉద్యోగ ప్రకటనల దుమ్ము దులిపారు. బయటకు తీశారు. అలాగే, అధికార పార్టీ నాయకులు కూడా. రేవంత్’కు  ముందు తర్వాత అన్న బేధాన్ని పాటిస్తున్నారు.  ఇక ఇంత కాలం తెరాసకు ప్రత్యాన్మాయం తామే అని ప్రగల్బాలు పలికిన బీజేపీ నాయకులు ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు. పత్రికల న్యూస్ ప్రియారిటీలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. లోపలి పేజీల్లో దాక్కున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ వార్తలు ఫ్రంట్ పేజీకి వచ్చేసాయి. బీజేపీ, బండి సంజయ్ లోపలి పేజీల్లోకి జారి పోయారు. ఒక్క మాటలో చెప్పలంటే, రేవంత్ రాకతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారి పోయింది.అయితే, ఇదంతా నాణ్యానికి ఒక పక్క మాత్రమే, రెండో పక్కన చూస్తే రేవంత్ రెడ్డి ముందు చాలా చాలా సవాళ్లున్నాయి. అన్నిటికంటే ముందు, హుజూరాబాద్ ఉప ఎన్నిక పెను సవాల్ విసురుతోంది. అయితే  రేవత్ రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికను, అంత  సీరియస్’గా తీసుకోవడం లేదు. ఒక టీవీ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  రేవంత్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. హుజూరాబాద్   ఎప్పుడూ కాంగ్రెస్ నియోజక వర్గం కాదు. గడచిన 30 ఏళ్లలో అక్కడి నుంచి కాంగ్రెస్ ఒక్క సారి కూడా గెలవలేదు. టీడీపీ లేదంటే తెరాసనే గెలుస్తూ వచ్చాయి.గడచిన 16 ఏళ్లుగా అయితే, ఈటల రాజేందరే గెలుస్తున్నారని రేవంత్ చెప్పు కొచ్చారు. కాబట్టి, హుజూరాబాద్ గెలుపు ఓటమలు తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును  లేదా కాంగ్రెస్ పార్టీ  భవిష్యత్తును నిర్నయించవని తేల్చేశారు. ఇలా హుజూరాబాద్ విషయంలో పూర్తి క్లారిటీ ఉంది కాబట్టే, రేవంత్  రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను, కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ చైర్మన్,మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు అప్పగించారు.   నిజమే, పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదురైనా తొలి సవాలు విషయంలోనే రేవంత్ రెడ్డి వెనకడుగు వేయడం, ప్రత్యర్ధులకు అస్త్రం అవుతుందేమో కానీ, రాజకీయంగా చూస్తే మాత్రం రేవంత్ నిర్ణయం సరైన నిర్ణయంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, పోటీ పడితే అసెంబ్లీ ఎన్నికల్లో, స్పష్టమైన విధానాలు, ఎన్నికల ప్రణాళికతో కేసీఆర్’తో తలపడాలే కానీ, ఉప ఎన్నికలలో గెలుపు కోసం ఉబలాట పడ్డం వలన దీర్ఘ కాల ప్రయోజనాలు ఉండవు, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. అదే వ్యూహంతో ముందుకు పోతున్నారు. అలాగని రేవంత్ రెడ్డి హుజూరాబాద్ వరకు అస్త్ర సన్యాసం చేశారని కాదు, ఆ విషయం కూడా ఆయనే చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తగా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానని, అయితే గెలుపు ఓటములకు అంత ప్రాధన్యత ఇవ్వనని చెప్పారు.  భారతీయ జనతా పార్టీ అనుభవం కూడా అదే చెపుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలుపు తర్వాత తెరాసకు బీజేపీనే ప్రత్యాన్మాయం అనుకున్నారు. కానీ, ఆ వెంటనే వచ్చిన  ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ గెలుపు బలుపు కాదు వాపు అని తేలిపోయింది. సిట్టింగ్ సీటులో బీజేపీ ఓడిపోయింది, నాగార్జున సాగర్’ ఉప ఎన్నికలో అయితే ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. బుడగ పేలిపోయింది. కాబట్టి  గాలివాటంగా గెలిచినా/ ఓడిపోయినా  ఉపన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవడం, రాజకీయ విజ్ఞత అనిపించుకోదని రేవంత్ రెడ్డి అభిప్రయా పడుతున్నారు.  అనుదుకే కావచ్చు, రేవంత్ రెడ్డి కేసీఆర్ కుంభస్థలం టార్గెట్’గా వ్యూహ రచన చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.  అయితే, అలాగని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ మీద ఆశలు వదిలేసుకుంది అనుకునేందుకు వీలు లేదు,ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ఇంచుమించుగా 70 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కాబట్టి గట్టి అభ్యర్ధిని నిలబెట్టి పార్టీ ఓటు బ్యాంక్’ను కాపాడు కోవడం అవసరం. అయితే, కౌశిక్ రెడ్డి  తెరాసలో చేరుతున్నట్లు వస్తున్నవార్తలు నిజమైతే, కాంగ్రెస్ పార్టీకే కాకుండా రేవత్ రెడ్డి ఇమేజ్’కి కూడా కొంత కోత పడుతుందని, పరిశీలకులు భావిస్తున్నారు. రేవంత్ వచ్చినా ...  ఫిరాయింపులు ఆగలేదు ... అనే మెసేజ్ జనంలోకి వెళ్లి పోతుంది. ఆ మచ్చ అలా  మిగిలిపోతుంది. ఇప్పటికే, గత ఎన్నికల్లో గెలిచిన 19 మందిలో 12 మంది కారెక్కేశారు. ఆవిధంగా కాంగ్రెస్’ను గెలిపించినా చివరకు అందరూ చేరేది, గులాబీ గూటికే అన్న భావన బలంగా నాటుకు పోయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికి పరీక్షగా మారుతుందని, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.