రేవంత్ రెడ్డి సంచలనం. కేసీఆర్ కథ మాములుగా లేదుగా..
posted on Jul 9, 2021 @ 8:20PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఫ్రైర్ బ్రాండ్ లీడర్ పవర్ ఫుల్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. రోజుకో బాంబా పేల్చూతూ రాజకీయ కాక రేపుతున్న రేవంత్ రెడ్డి.. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ బండారం మొత్తం బయటపెట్టేశారు. అంతేకాదు భవిష్యత్ లో కేసీఆర్ ఏం చేయబోతున్నారని, ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందో జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
తనపై విమర్శలు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏ పార్టీ అని ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్ఎస్‌కి ఎలా అధ్యక్షుడో, తాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడినని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు, కేటీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ టీడీపీ అయితే, టీఆర్ఎస్ కూడా టీడీపీనేనని అన్నారు. టీఆర్ఎస్‌ను తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆయన ఆరోపించారు. అధికారాన్ని టీఆర్ఎస్ నుంచి బరాబర్ గుంజుకుంటామని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.
2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్, తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడంటూ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 72 సీట్లు గెలుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌తో తమకు పాము, ముంగిస ఫైట్ జరుగుతోందని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ గాలి వాటం పార్టీ అని, దానికి నిర్మాణం లేదన్నారు. భవిష్యత్‌లో టీఆర్ఎస్ ఉండదన్నారు.
తన పేరు మీదనే కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవి వచ్చిందన్నారు. తనకు పీసీసీ రావడం వల్లే కిషన్‌రెడ్డికి కేబినెట్ పదవి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీలో చేరాక ఈటలకు ఉద్యమంతో బంధం తెగిపోయిందన్నారు. బీజేపీలో చేరి లెఫ్టిస్ట్ ఈటల రాజేందర్ క్యాపిటలిస్ట్‌గా మారాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.తమ కుటుంబంలో ఎవరూ టికెట్ అడగరని.. పోటీచేయరని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నుంచి తాను పోటీ చేస్తాననేది ప్రచారం మాత్రమేనని రేవంత్ తెలిపారు.