బంగారు తెలంగాణాలో.. నిరుద్యోగుల ఆత్మహత్యలు.. కారణం ఎవరు..?
posted on Jul 9, 2021 @ 4:55PM
నాగులు కోట్ల దొంతులు ఒక్కటై.. నలుదిక్కులు ఒక్కటై.. రణం చేసి, రక్తం చిందించి, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి.. ప్రభుత్వం మెడలు వచ్చి సాధించుకున్న తెలంగాణ. రాష్ట్రము వస్తే బతుకులు మారుతాయి. నీళ్లు, నిధులు, ఉద్యోగం, ఉపాధి ఉంటుందని నమ్మిన తెలంగాణాలో.. పాలకులు మరీనా పాలన మారలేదు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను అని చూపిన నేటి పాలకులు వాళ్ళ ఇంటిని మాత్రమే బంగారు చేసుకుని .. తెలంగాణను విషాదంలో ముంచుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం,ఉపాధి లేక..వయసు పెరిగిన పెళ్లిళ్లు అవ్వక.. పెళ్లిళ్లు అయ్యకు కూడా ఇంకా తల్లిదండ్రులకు భారమైనా బతుకు మీద ఆశ కరువై.. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక చాలీచాలని బతుకులను యెల్లదియ్యలేక.. పిట్టల రాలిపోతున్నారు విద్యార్థులు..
తెలంగాణ వస్తే దళితుడ్ని సీఎం చేస్తాను.. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి. ఇంటికో ఉద్యోగం ఇష్టం అని హామీలు ఇచ్చిన కేసీయార్ ఇప్పుడు మాట మర్చి.. ఆ హామీలను మూసినదిలో కలిపి ప్రజలు అవస్థలు పడుతుంటే చోద్యం చూస్తున్నాడు.. నోటిఫికెషన్స్ రాక చాలా రోజులే అవుతోంది. ఎంతో మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు. కష్టపడి చదివి జాబ్ కొడితే ఆర్థిక సమస్యలు తీరుతాయి. కుటుంబ పరిస్థితి కాస్త మెరుగవుతుంది అనుకోని చాలా మంది రాత్రింభవల్లు కష్ట పడి చదువుతుంటారు. తెలంగాణ ప్రజలు చదివి ఎక్కడ ఆర్థికంగా బాగుపడితే ఈ రాష్ట్రంలో తమ ఆటలు సాగవని.. ప్రజలు ఎంత ఆర్థిక ఇబ్బందులో ఉంటే అప్పుడే తమ ఆటలు సాగుతాయని ఆలోచిస్తుంది ప్రభుత్వం.. ఇంకా కొంత మంది నోటిఫికేషన్ వస్తది అన్న ఆశతో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కోచింగ్ ఫీజులు కట్టడం కోసం అమ్మ పుస్తెలు అమ్మి చదువుతున్నారు విద్యార్థులు.. అయినా ఎంతకీ నోటిఫికేషన్లు పడకపోవడంతో మనస్థాపం చెంది ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణలో నోటిఫికేషన్లు రావట్లేదనే మస్థాపంతో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా తాడిపర్తిలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన కొండల్ (33) అనే వ్యక్తి కొన్ని నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే జాబ్ నోటిఫికేషన్ రాకపోయే సరికి మనస్థాపం చెంది శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.