కూతుళ్లను ఇంట్లో నుండి గెంటేసిన..45 ఏళ్ళ తల్లి ప్రేమ.. 

మన ఇంట్లో వండిన  కోడి కూరకంటే.. పక్కింట్లో వండిన పాసిపోయిన పప్పు బాగుంది అన్నట్లు.. నేటి వ్యవస్థ తీరుకూడా అలాగే ఉంది.. ఎంతో మంది విదేశీయులు మన దేశ సంస్కృతిని గౌరవిస్తుంటే.. మనం మాత్రం తల్లి పాలు వదిలి డబ్బాపాల కోసం పరిగెత్తే పిల్లవాడిలా విదేశ సంస్కృతిని అలవర్చుకుంటున్నాం.. ప్రేమ పేరుతో ఎన్నో దారుణమైన పనులు చేస్తున్నారు చాలా మంది.. అది ప్రేమో.. కామమో అర్థం కాదు గాని మొత్తానికి ప్రేమ అనే పవిత్రమైన పదాన్ని ఎవడికి నచ్చినట్లు వాడు వాడుకుంటున్నాడు.. కవులు చూపినట్లు ప్రేమ గుడ్డిది..ప్రేమకు వయసుతో  పని లేదు.. ప్రేమకు కులం, మతం  అడ్డు రావు బాగానే ఉంది కానీ.. పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక కూడా వేరే 21 వయసు అబ్బాయితో పుట్టేదాని ప్రేమ అని అంటారా..? లేదా కామం అంటారా? అనే అలోచాన మీకే వదిలేస్తున్న ఒకే అసలు విషం లోకి వెళదామా మరి..  - ఆమె పేరు ఝాన్సీ ఆమెకు పెళ్లి అయింది. ఐదుగురు ఉన్నారు. ఆమె వయసు  45 సంవత్సరాలు. 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అంతేకాదు అతడిపై మోజుతో తన ఐదుగురు కుమార్తెలను ఇంటిలో నుంచి గెంటేసింది.. ఆ వయసులో కూడా 21 ఏళ్ళ యువకుడితో  నాలుగో వివాహానికి సిద్ధమైంది..  మొహల్లా గ్రామానికి ఝాన్సీ కి , మిథున్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇష్టంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ రెండు అయ్యాక ఇద్దరు చాలాకాలం పెద్దలోతు చూశారు.. అంటే సహజీవనం కూడా చేశారు. అయితే, తల్లి చేసే ఈ వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి మందలిస్తూ, వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలుండగా ఇటువంటి పనులేంటని తల్లిని కుమార్తెలు నిలదీశారు. ప్రేమ పేరుతో  యువకుడి మత్తులో ఉన్న ఆమె..  పిల్లలు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో.. రెండో కుమార్తెను ఏడాది క్రితమే ఇంట్లో నుంచి తరిమేసింది. ఇక, ప్రస్తుతం ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది. ఈ వివాహానికి అడ్డు చెబుతున్న నలుగురు కుమార్తెలను కూడా బయటకు పంపేసింది. తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ప్రియుడు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో చోటుచేసుకుంది.   

విజ‌య‌మ్మ‌కు డిప్యూటీ సీఎం ఆఫ‌ర్‌..! అసలేం జరిగింది..

రాజ‌కీయం గిర్రున తిరిగే రంగులరాట్నం. కింద‌నే ఉన్నామ‌ని అనుకునేలోపు పైకెళ్లిపోతారు. హ‌మ్మ‌య్యా.. పైకి చేరామ‌ని ఎంజాయ్ చేస్తుండ‌గానే స‌ర్రున కింద‌కి వ‌చ్చేస్తారు. అయితే.. ఆ అప్ అండ్ డౌన్స్‌కు ఎంత టైమ్ ప‌డుతుంద‌నేది టాపిక్‌ను, లీడ‌ర్‌ను బ‌ట్టి మారిపోతుంది. వైఎస్ ఫ్యామిలీ విష‌యంలోనూ అలానే జ‌రుగుతోంది. ఏపీ సీఎంగా వైఎస్సార్ ఓ వెలుగువెలుగుతుండ‌గానే.. అకాల మ‌ర‌ణం ఆ ఫ్యామిలీపై పిడుగుపాటులా ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కూ సీఎంగా, కాంగ్రెస్‌లో సుప్రీం లీడ‌ర్‌గా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబం ఒక్క‌సారిగా రోడ్డు మీద ప‌డినంత ప‌నైంది. జ‌గ‌న్‌రెడ్డి అత్యాశ‌, టెంప‌ర్‌మెంటే అందుకు కార‌ణ‌మ‌నేది ఆనాటి కాంగ్రెస్ నాయ‌కుల మాట‌.  వైఎస్సార్ డెడ్‌బాడీ ద‌గ్గ‌రే త‌న‌ను సీఎం చేయాలంటూ సంత‌కాల సేక‌ర‌ణ జ‌రిపించిన ఘ‌నుడు జ‌గ‌న్‌రెడ్డి అని అంటారు. అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు పెద్ద‌గా రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా.. క‌నీసం మంత్రిగా కూడా చేయ‌క‌పోయినా.. ఏకంగా ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవాల‌నే దురాశే ఆయ‌న దుఃఖానికి చేటు అయింద‌ని చెబుతుంటారు. కేవ‌లం వైఎస్సార్ కొడుకు అనే ఒకే ఒక్క కార‌ణంతో 9 కోట్ల ఆంధ్రుల భ‌విష్య‌త్తును ఆయ‌న చేతిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అస్స‌లు ఒప్పుకోలేదు. పైగా  తండ్రి అధికారంతో త‌న‌యుడు తెగ‌బ‌డిన ఆర్థిక నేరాల గురించి హైక‌మాండ్ ద‌గ్గ‌ర ఫుల్ డిటైల్స్ ఉండ‌నే ఉన్నాయి. అందుకే, జ‌గ‌న్‌కు సీఎం కిరీటం క‌ట్ట‌బెట్టేందుకు అప్ప‌టి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స‌సేమిరా అంది. వైఎస్సార్ మీద అభిమానం ఉన్నా.. ఆయ‌న కొడుకు గురించి అందిన నివేదిక‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డి చేతిలో ప‌చ్చ‌ని రాష్ట్రాన్ని పెట్టే పాపం చేయ‌లేక‌పోయింద‌ని అంటారు. మ‌రి, ఆనాడు అస‌లేం జ‌రిగింది? కాంగ్రెస్ అధిష్టానం ముందు జ‌గ‌న్‌రెడ్డి పెట్టిన డిమాండ్స్ ఏంటి? వైఎస్ కుటుంబానికి సోనియాగాంధీ ఇచ్చిన ఆఫ‌ర్స్ ఏంటి? కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కుటుంబం దూరం అవ‌డానికి కార‌ణం? త‌దిత‌ర విష‌యాల‌ను తాజాగా 10 జ‌న్‌ప‌థ్‌కు అత్యంత స‌న్నిహితుడైన కాంగ్రెస్ లీడ‌ర్ మ‌ధు యాష్కిగౌడ్ బ‌య‌ట‌పెట్టారు. ఓ మీడియా డిబేట్‌లో ఆనాటి రాజ‌కీయాన్ని స‌వివ‌రంగా వివ‌రించారు.  వైఎస్సార్ చ‌నిపోగానే త‌న‌నే ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టార‌ట జ‌గ‌న్‌. అదేంటి.. స‌డెన్‌గా జ‌గ‌న్‌ను సీఎం ఎలా చేస్తాం? అనేది కాంగ్రెస్ వ‌ర్ష‌న్‌. వైఎస్సార్ చ‌నిపోయాక‌.. కొద్దిరోజుల‌కు జ‌గ‌న్ త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని క‌లిశారు. అప్పుడే రాజ‌కీయ వార‌స‌త్వంపై చ‌ర్చ జ‌రిగింది.  సోనియాకు త‌న డిమాండ్స్ వినిపించారు జ‌గ‌న్‌. వైఎస్సార్ త‌న‌యుడిగా త‌న‌నే ముఖ్య‌మంత్రిని చేసి తీరాల‌ని డిమాండ్ చేశార‌ట‌. ఆ ప్ర‌తిపాద‌న‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తిర‌ష్క‌రించార‌ట‌. అయితే, సీఎం పోస్టు కుద‌ర‌దు కానీ.. వైఎస్ కుంటుంబానికి మంచి ప‌ద‌వులు ఇస్తామంటూ ఓ ఆఫ‌ర్‌ను జ‌గ‌న్ ముందుంచార‌ట సోనియాగాంధీ. వైఎస్సార్ స్థానంలో విజ‌య‌మ్మ‌ను పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకొని.. డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తామ‌ని ప్ర‌తిపాదించార‌ట‌. అప్ప‌టికే ఎంపీగా ఉన్న జ‌గ‌న్‌కు కేంద్ర స‌హాయ‌మంత్రి గానీ, ఇండిపెండెంట్ ఛార్జితో కేంద్ర‌మంత్రిని గానీ చేస్తామ‌ని సోనియా హామీ ఇచ్చార‌ట‌. అయితే.. ఈ రెండు ఆఫ‌ర్ల‌కు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అంగీక‌రించ‌లేద‌ట‌. సీఎంను చేయాల‌నే డిమాండ్‌ను సోనియా ఒప్పుకోలేద‌ట‌. చివ‌రాఖ‌రికి జ‌గ‌న్‌కు పీసీసీ ప్రెసిడెంట్‌నైనా చేయాల‌ని విజ‌య‌మ్మ కోరార‌ట‌. కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి అంతఈజీగా ఎవ‌రికి ప‌డితే వారికి ఇవ్వ‌లేమ‌ని.. కాంగ్రెస్ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారికి మాత్ర‌మే ఆ పొజిష‌న్ ఇస్తామ‌ని.. జ‌గ‌న్ కాంగ్రెస్ కోసం చేసిందేమీ లేద‌ని.. కేవ‌లం వైఎస్సార్ కొడుకు అనే కార‌ణంతో పార్టీని ఆయ‌న చేతిలో పెట్టలేమంటూ సోనియాగాంధీ తేల్చిచెప్పేశార‌ట‌. దీంతో... తీవ్ర నిరుత్సాహంతో జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌లు ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చేశార‌ని మ‌ధుయాష్కీగౌడ్ వివ‌రించారు.  అయితే, జ‌గ‌న్ ఢిల్లీ నుంచి వ‌చ్చిన మ‌ర్నాటి నుంచే త‌న మీడియాలో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు ప్ర‌సారం చేయ‌డం మొద‌లుపెట్టార‌ట‌. అదేంట‌ని.. అప్ప‌టి కాంగ్రెస్ పెద్ద‌లు అహ్మ‌ద్ ప‌టేల్ లాంటి వాళ్లు జ‌గ‌న్‌కు ఫోన్ చేసి అడిగితే.. అది బిజినెస్ వ్య‌వ‌హారం.. సాక్షి మీడియాలో న్యూస్‌తో త‌న‌కెలాంటి సంబంధం లేద‌న్న‌ట్టు జ‌గ‌న్ నుంచి రిప్లై వ‌చ్చింద‌ట‌. అప్పుడే ఇక కాంగ్రెస్ హైక‌మాండ్‌కు అర్థ‌మై పోయింది.. జ‌గ‌న్ పార్టీలో ఉండ‌డ‌ని.. త‌న దారి తాను చూసుకుంటాడ‌ని డిసైడ్ అయిపోయారు. అందుకే చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది.. జ‌గ‌న్ అవినీతి, అక్ర‌మాల బండారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సీబీఐ, ఈడీ ద‌ర్యాప్తులు.. కేసులు, కోర్టులు, జైలు శిక్ష‌లు... ఇదంతా ఒక‌దానివెంట ఒక‌టి జ‌రిగిపోయింది.  ఆనాడు విజ‌య‌మ్మ డిప్యూటీ సీఎం ప‌ద‌వి తీసుకొని.. జ‌గ‌న్ కేంద్ర మంత్రి పోస్ట్‌తో సంతృప్తి ప‌డుంటే..  గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి ఉంటే జ‌గ‌న్ ఏనాటికైనా కాంగ్రెస్ సీఎం అయిండేవారని కాంగ్రెస్ జాతీయ నేతలే పలు సందర్భాల్లో చెప్పారు. కానీ, అత్యాశ‌, దురాశ‌తో తండ్రి చ‌నిపోయిన వెంట‌నే ఎలాంటి అర్హ‌త లేక‌పోయినా.. తానే సీఎం కావాలంటూ మంకుప‌ట్టు ప‌ట్టారని అంటారు. అందువల్లే ఏళ్ల త‌ర‌బ‌డి జైల్లో మ‌గ్గిపోయారు. ఆ కేసుల్లో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా చెలామ‌ని అవుతున్నారు. ర‌ఘురామ పిటిష‌న్‌తో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు వేగంగా విచార‌ణ జ‌రుగుతోంది. మ‌ళ్లీ ఏనాటికైనా జ‌గ‌న్ జైలుకెళ్ల‌క త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే అంటారు.. దురాశ దుఃఖానికి చేటు అని. ప్ర‌స్తుతం రాజ‌కీయ రంగుల‌రాట్నంలో జ‌గ‌న్ టాప్‌లో ఉన్నారు.. కాల‌చ‌క్రం గిర్రున తిరిగి.. రంగుల‌రాట్నం పై నుంచి స‌ర్రున కింద‌కు ప‌డే స‌మ‌యం ఎంతోదూరంలో లేద‌ని అంటున్నారు.

అమ్మ భాషను అదిమేస్తే చరిత్ర క్షమించదు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. అమ్మ భాషను అదిమేసే చర్యలు-అసందర్భ నిర్ణయాలపై లేఖ రాశారు. తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు ఎంపీ రఘురామ. ఈ విషయంపై యార్లగడ్డ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మహనీయులను మనం గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు కానీ.. వారు చేసిన కృషిని తుడిచిపెట్టేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు, నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని రఘురామ పేర్కొన్నారు.  తెలుగు భాషకు సంబంధించి సీఎం జగన్ కు రఘురామ కృష్ణం రాజు రాసిన లేఖ పూర్తి సారాంశం ఇదీ.. జులై 12, 2021 శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విషయం: అమ్మ భాషను అదిమేసే చర్యలు- అసందర్భ నిర్ణయాలూ సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 5 అది 2008వ సంవత్సరం… అక్టోబర్ 31వ తేదీ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ సంతోషించిన రోజు అది. ఎందుకో తెలుసా…. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన రోజు అది. ఒడిసా, కర్నాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, అండమాన్ అండ్ నికోబార్ దీవులు సైతం తెలుగు భాషకు గుర్తింపునిచ్చాయి. అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు గుర్తింపు తెచ్చుకున్నది. ఎందరో మహానుభావులు తెలుగును ఈ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు. మహనీయుల్ని మనం గుర్తుంచుకోకపోయినా ఫర్వాలేదు కానీ వారు చేసిన కృషిని తుడిచిపెట్టేయడం మాత్రం క్షంతవ్యం కాదు. తెలుగు భాషను మహత్తరమైన విద్యా బోధన సాధనంగానూ, ఉన్నత పరిపాలనా వాహకంగానూ తీర్చిదిద్దడానికి సూచలను ఇవ్వాలని 1966 డిసెంబర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. దీనికి ఐసిఎస్ అధికారి జెపిఎల్ గ్విన్ అధ్యక్షులుగా పని చేశారు. ఆయన చేసిన సూచనతోనే తెలుగు భాషా సంస్థ ఏర్పాటు నిర్ణయం తీసుకుని 1968 జూన్ 12న తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. 1966 కొఠారీ కమిషన్ నివేదిక ప్రకారం కాలేజీ స్థాయిలో కూడా మాతృభాషను బోధనా మాధ్యమంగా చేశారు. ప్రాదేశిక భాషల్లో పాఠ్యగ్రంథాలను, ప్రముఖుల పుస్తకాలను తర్జుమా చేయడానికి 1967 జూన్ నెలలో భారత ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళిక రూపొందించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కో ప్రాంతీయ భాషను ఎందరో మహనీయులు ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్లు సుసంపన్నం చేశారు.ఏ సమస్యనైనా ఒకే కోణం నుంచి మాత్రమే చూసే మీకు రెండో కోణం గురించి చెప్పేందుకే నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మీరు తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చడంపై తెలుగు భాష ఔన్నత్యాన్ని మీరు అర్ధం అయ్యేలా చెప్పేందుకు నా ప్రయత్నం ఇది. తెలుగు అకాడమీని పలుచన చేయడం ద్వారా మీరు తెలుగు ప్రజలకు ఏం సందేశం ఇవ్వనున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. ప్రాధమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని శతవిధాలా ప్రయత్నం చేసినప్పుడే మీరు తెలుగు భాషను తుడిచిపెట్టే సాహసం చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆందోళనకు కొనసాగింపుగా ఇప్పుడు తెలుగు అకాడమీ లో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం తీసేసుకున్నారు. దేవ భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించడాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ తెలుగును చంపేసే ఉద్దేశ్యంతో నిర్ణయాలు తీసుకోవడం మరింత తీవ్రమైన ఆందోళన కలుగుతున్నది. సంస్కృత భాష ను పరిరక్షించేందుకు జాతీయ స్థాయిలో సంస్కృత అకాడమీ ఉంది. మనం మన ప్రాచీన భాష, మన ప్రాంతీయ భాష అయిన తెలుగును కాపాడుకోవడానికి పని చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు సంస్కృతంతో మొదలు పెట్టి, దేశంలోని మీకు నచ్చిన ఇతర ప్రాంతీయ భాషలను కూడా ఇందులో కలుపుతారేమోనని తెలుగు భాషా ప్రేమికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మీ వ్యవహార శైలిని చూసి ఎంతో మంది భయంతో నోరు విప్పడం లేదు. అంతెందుకు తెలుగు భాషకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గినా, ప్రాధాన్యత తగ్గడం కాదు…. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తెలుగు అక్షరాలు లేకపోయినా నానా యాగీ చేసే యార్లగడ్డలు తెలుగు భాషలో జీవోలు ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా మానేసినా నోరు మెదపడం లేదు. బ్రిటీష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా ప్రాంతీయ భాషలను తొక్కేసి వ్యవహార భాషగా ఇంగ్లీష్ ను తీసుకువచ్చారు. ఆ నాటి నుంచి కోర్టుల్లో కూడా ఇంగ్లీష్ భాషనే ఇంతకాలం వాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని, న్యాయస్థానాలలో ప్రాంతీయ భాషలు తీసుకురావాలని ప్రయత్నాలు మమ్మరం చేశారు. తెలుగు భాషను భుజాలపై మోసిన వారు, తెలుగు భాషే జీవితంగా గడిపిన వాళ్లు కూడా ఇప్పుడు మీ నిర్ణయం చూసిన తర్వాత మౌనంగా ఘోషిస్తున్నారు. ఎంత మంది వ్యతిరేకిస్తే అంత గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు భావించడం మీకు పారిపాటిగా మారిందని నాకు తెలుసు. కానీ పాపం తెలుగు ప్రేమికులకు తెలియదు. అందుకే వారి ఆవేదనను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. అసలు ఇలాంటి విచిత్రమై ఆలోచన మీకు ఎలా వచ్చిందా అని తెలుగు భాషా ప్రేమికులు అందరూ తలలు పట్టుకున్నారు. తెలుగు భాషను భూస్థాపితం చేసే కార్యక్రమంలో భాగంగానా అన్నట్లు సంస్కృతానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పడం ‘‘తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి పట్టుచీర తెచ్చాడన్నట్లు’’ అనే సామెతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.మీకు బాగా అర్ధం అయ్యే భాషలో తెలుగు గురించి మరింత వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఆనాడు ఎందరో మహానుభావులు చేసిన కృషి ఫలితంగా ఏర్పడిన తెలుగు అకాడమీకి ఈనాడు దాదాపుగా 245 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అవన్నీ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ లోని షెడ్యూల్ 10లో ఉన్నాయి. తెలుగు అకాడమీ ఆస్తులన్నీ ఇప్పుడు తెలంగాణ భూభాగంలోనే ఉండిపోయాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మన రాష్ట్రానికి అందులో 58 శాతం వాటా రావాల్సి ఉంటుంది. దాని కోసం ప్రయత్నం చేయండి అనే ఈ వివరం చెబితే మీలో తెలుగు భాష పట్ల మళ్లీ ఆసక్తి కలుగుతుందేమోనని కొందరు భాషాభిమానులు నాతో చెబితే నేను మీకు ఈ లేఖ ద్వారా సూచిస్తున్నాను. ఒక్క సారి మీరు ఒడిసా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర లలోని తెలుగు ప్రాంత ప్రజలు నివసించే చోటుకు వెళ్లి రండి. జీవన అవసరాలకు తగ్గట్టు ఆయా ప్రాంతీయ భాషలు నేర్చుకున్నా కూడా వారంతా ఇంటి వద్ద తెలుగే మాట్లాడుకుంటారు. తాము తెలుగు వారం అని గర్వంగా చెప్పుకుంటారు. తమ పిల్లలకు, వారి పిల్లలకు తెలుగు నేర్పేందుకు, తెలుగు సంస్కృతిని అలవాటు చేసేందుకు పడరాని పాట్లు పడుతూ కూడా తెలుగును బతికించుకుంటున్నారు. అమెరికాలో ఉన్న మీ బంధువులను అడిగి చూడండి. వారు కూడా తెలుగు గొప్పతనం గురించి మనకే పాఠాలు చెబుతారు. అలాంటి తెలుగు భాషను ప్రభుత్వ చర్యలతో చిదిమేయడం, భాషను అణచివేయడం, తెలుగు భాషను తుడిచేయడంపై ఎందరో భాషాభిమానులు తీవ్రమైన మనో వేదనతో కాలం గడుపుతున్నారు. సంస్కృతం దేవ భాష, మనం మాట్లాడుకునేది కాదు. సంస్కృతం గాటన తెలుగును కట్టేయడం అంటే తెలుగును కూడా అటకెక్కించడం లాంటిదే. మీరు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే అసలు మీరు ఏమి ప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకుంటారో ఎంత తరచి చూసినా ఆర్ధిక నిపుణులకు, భాషా శాస్త్రవేత్తలకు, వివిధ రంగాలలోని ప్రఖ్యాతులకు కూడా అర్ధం కావడం లేదు. మేధావుల సంగతి పక్కన పెట్టినా ప్రజలకు కూడా అర్ధం కాని రీతిలో నిర్ణయాలు తీసుకుంటే మన పార్టీపై ప్రజలు కూడా అంతే స్థాయిలో మనకు అర్ధం కాని రీతిలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మహానుభావుడు పి వి నరసింహారావు విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు అకాడమీ ప్రారంభం అయింది. మీరు ఎన్నికల ముందు ఎంతో ప్రీతిపాత్రంగా పిలుచుకున్న మహానేత, మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు భాష కు ప్రాచీన హోదా తెచ్చేందుకు తన వంతు కృషి చేశారు.మీరు తెలుగు భాష గురించి తెలుసుకున్న తెలుసుకోకపోయినా ఫర్వాలేదు కానీ తెలుగు భాష కోసం తపించిన గత ముఖ్యమంత్రులు, గత విద్యా శాఖ మంత్రులు తీసుకున్న నిర్ణయాలను అయినా ఒక్క సారి తరచి చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న తెలుగు భాషా సౌధాన్ని ఎలా నిర్మించారో అర్ధం అవుతుంది. అప్పుడైనా ఈ సౌధాన్ని కూల్చేయాలన్న ఆలోచన మీ మస్తిష్కం నుంచి దూరం కావచ్చు. ఇటలీలోని వెనిస్ నగరానికి చెందిన వర్తకుడు నికొలో డా కంటి 15వ శతాబ్దంలో దక్షిణ భారత దేశానికి వచ్చాడు. తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష లాగా అంజతాలు (అచ్చు అంతం) కలిగి ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు. కన్నడీగుడైన కృష్ణదేవరాయలు తెలుగు భాషను ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని వ్యవహరించాడు. చరిత్ర అంతా చెత్త అని కొట్టిపారేసిన వాళ్లు చరిత్రలో కలిసిపోయారు. చరిత్రను తెలుసుకుని, అర్ధం చేసుకుని, విశ్లేషించిన వారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారు. తెలుగు భాషను తెలుగు నేలపై లేకుండా చేయాలనే మీ ప్రయత్నాన్ని వివిధ పోస్టుల్లో మీరు నామినేట్ చేసిన వారు హర్షించవచ్చు కానీ యదార్ధం వేరే విధంగా ఉంటుంది. తెలుగు భాషను చిదిమేయడానికి మీకు తెలుగు ప్రజల అనుమతి తప్పని సరి.చట్టంలో ఎక్కడా ఇంత స్పష్టంగా చెప్పలేదు కానీ ఒక భాషను లేదా ఒక సంస్కృతిని లేకుండా చేయడం అంటే గోహత్య కన్నా మహాపాతకం. పాలుతాగే పిల్లవాడికి తల్లిని దూరం చేసినంత ఘోరం. తెలుగు భాషను పరిరక్షించండి… ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు… దానిమానాన దాన్ని బతకనీయండి అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద అంశాలు ఉటంకించలేము. తెలుగు రాష్ట్రాలలోని వారే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లు కూడా మీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం మీకు మీరుగా తెలుసుకోవాలంటే కూడా ఒక మార్గం ఉంది. తెలుగు భాషను అన్ని స్థాయిలలో తీసేస్తున్నామని, తెలుగు భాషను పలుచన చేసేస్తున్నామని చెబుతూ మీరు ప్రజాభిప్రాయాన్ని (రిఫరెండం) తీసుకోండి.తెలుగు భాష నిపుణుల అభిప్రాయం తెలుసుకోండి ఈ రెండు వేదికలపైనా మీరు తీసుకున్న నిర్ణయాలను మెజారిటీ వ్యక్తులు ఆమోదిస్తే నిరభ్యంతరంగా మీరు అనుకున్నది చేసేయండి. అంతే కానీ ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా భాషలపై ప్రయోగాలు చేసే ఏకపక్ష కార్యక్రమాలను ఇకనైనా మానుకోండి. భవదీయుడు కె.రఘురామకృష్ణంరాజు

వీహెచ్ కు  వెంకయ్యనాయుడు పరామర్శ..

అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. వీహెచ్ కు ఫోన్ చేసిన మాట్లాడిన వెంకయ్య.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని  వీహెచ్ కు సూచించారు వెంకయ్య నాయుడు. ఆరోగ్యం త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాక్షించారు.  కొన్ని రోజులుగా అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్నారు హనుమంతరావు. తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య పరామర్శతో తనకు చాలా ఉత్సాహం వచ్చిందని చెప్పారు. వీహెచ్ త్వరగా కోలువాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. 

కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి సస్పెండ్? రేవంత్ రెడ్డి తొలి దెబ్బ.. 

కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువని చెబుతారు. అందుకే నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు మాళ్లు మాట్లాడుతారనే టాక్ ఉంది. నేతలకున్న ఆ ఫ్రీడమే కాంగ్రెస్ ప్లస్, మైనస్ అని అంటుంటారు. నేతలు లూజ్  టాక్స్ లో కాంగ్రెస్ చాలా సార్లు నష్టపోయింది కూడా. అయినా నాయకుల తీరు మాత్రం మారదు. తెలంగాణ కాంగ్రెస్ లో అయితే ఇదీ మరీ ఎక్కువ. కాని  ఇప్పుడు సీన్ మారుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో సీరియస్ గా వెళ్లబోతున్నారని తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడినా చర్యలు తప్పవని బాధ్యతలు స్వీకరించిన రోజే హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అన్నట్లుగానే యాక్షన్ లోది దిగారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖారైరందంటూ హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. ఈ ఘటనపై పీసీసీ చీఫ్ సీరియస్ గా స్పందించారు. కౌశిక్ రెడ్డి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గని బంధువైనా..  వెంటనే కౌషిక్ రెడ్డికి పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్నది క్రమశిక్షణ సంఘం. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే  క్రమశిక్షణ సంఘం కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చిందని చెబుతున్నారు.  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి  కౌశిక్  రెడ్డి టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఓ ఫంక్షన్ లో ఆయన కేటిఆర్ ను కలిసిన వీడియోలు వైరల్ గా మారాయి. పాడి కౌశిక్ రెడ్డి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందాయి. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించిందని తెలుస్తోంది. అయినా కౌశిక్ రెడ్డి తీరు మారకపోవడంతో సస్పెండ్ చేసే యోచనలో పీసీసీ ఉందని తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియా లీకై వైరల్ గా మారింది. ఆ ఆడియోలో హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ నాదేనని కౌశిక్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే యువకుడికి ఫోన్ చేసి మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి..  హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్  అయిందని చెప్పారు.  గ్రామంలోనూ యూత్ మొత్తాన్ని తనకు కలిపాయని చెప్పారు.  యూత్ కి ఎన్ని డబ్బులు కావాలో నేను చేసుకుంటా.. యూత్ సభ్యులకు 2000, 3000 ఇద్దామని విజేందర్ కు చెప్పారు కౌశిక్ రెడ్డి. అన్ని నేను చూసుకుంటా అందరిని నా దగ్గరకు తీసుకుని రా.. ఎంతైనా ఖర్చు చేద్దామంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వివాదస్పదం అవుతున్నాయి.  

టిక్ టాక్ భార్య.. టికెట్ తీసుకున్న భర్త.. 

టిక్ టాక్ ఒక ప్రళయం సృష్టించిందనే చెప్పాలి.. వాడుకున్నోడికి వాడుకున్నంత.. టిక్ టాక్ కొందరికి పిచోడి చేతిలో రాయి అయితే.. మరికొందరికి రాముడి చేతిలో బాణం లా పనిచేసింది.. టిక్ టాక్ ద్వారా కొంత మంది డబ్బులు సంపాదించారు.. ఇంకొంత మంది ఫేం సంపాదించారు. అంతే కాదు.. ఎంతో కొంత మంది చేసిన టిక్ టాక్ చెడు కూడా చేసింది..కుటుంబలా మధ్య గొడవలు.. భార్య భర్తల మధ్య వివాదాలు.. లవర్స్ కి మధ్య బ్రేక్ అప్.. కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి.. అయితే  టిక్ టాక్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై భారత్ లో ఎంత క్రేజుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు సైతం టిక్ టాక్ వీడియోలతో అలరిస్తుంటారు. అయితే, హైదరాబాదులో టిక్ టాక్ ఓ దంపతుల మధ్య చిచ్చు రేపింది. భార్య టిక్ టాక్ వీడియోలు చేస్తుండడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. ఆమె పేరు ప్రియాంక , అతని పేరు ప్రవీణ్ ఇద్దరు భార్యాభర్తలు. వీరు బాలానగర్ సమీపంలో నివసిస్తుంటారు. ఇప్పుడు ఉన్న ఆడవాళ్లు చిన్న పిల్లల్ని కూడా పట్టించుకుంటరా లేదో తెలియదుగాని టిక్ టాక్ లో వీడియోలు అంటే వయసుతో పని లేకుండా టైం దొరికితే టిక్ టాక్ మీద పడి వీడియోలు చేస్తుంటారు. ప్రియాంకకు కూడా టిక్ టాక్ ఓ  వ్యాపకంలా మారిపోయింది. అయితే ఆమె భర్త ప్రవీణ్ అందుకు అభ్యంతరం చెప్పేవాడు. భర్త మాటను లక్ష్యపెట్టని ప్రియాంక టిక్ టాక్ లో పోస్టులు పెట్టడాన్ని కొనసాగించింది. తాను టిక్ టాక్ స్టార్ అవ్వాలని కలలుగన్న ఆమె ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంపై దృష్టి సారించింది. దాంతో భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రమయ్యాయి. తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. భార్య తన మాట వినడంలేదని భావించిన ప్రవీణ్ బలవన్మరణం చెందాడు. దీనిపై ప్రవీణ్ తల్లిదండ్రులు బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రియాంక కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు.

38 మంది మృతి.. ఎందుకో తెలుసా..?

మనిషి జీవితం నీటిపై బుడగలాంటిది.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఇంటి నుండి బయటికి వెళ్లిన మనిషి మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోయింది.. మరణం మనం వెంటనే ఉంటుంది..ఒక్కమాటలో  చెప్పాలంటే నేటి రోజులు మరణం మన వెంట ఉండే నీడలాంటిది ..అని చెప్పాలి.. ఇదంతా ఎందుకు చెపుతున్నారు అంటే.. ప్రకృతి చేత సంభవాయించిన పరిణామం వాళ్ళ 38 మంది చనిపోయారు.. వాళ్ళు ఎలా చనిపోయారు దానికి గల కారణాలను తెలుసుకుందాం..  గత రెండు మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. కొన్నీ మహా నగరాల వీధుల్లో వర్షపు నీళ్లు ఉపొంగుతుంది.. ప్రజల రాకపోకలకు కూడా అక్కడక్కడా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ క్రమంలోనే రాజస్థాన్, యూపీలో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో యూపీలో 18, రాజస్థాన్‌లో 20 మంది మొత్తం 38 మంది ప్రజలు పిడుగు పాటుకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు, పిడుగులు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల‌ని, తీర‌ప్రాంతంలోని రాష్ట్రాలు మ‌రింత అప్రమ‌త్తంగా ఉండాల‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌లు జారీచేసింది.

సోము వర్సెస్ వీర్రాజు.. పిచ్చ కామెడీ

ఆయనకు ఏమైంది? తెలిసి చేస్తున్నాడా... తెలియక చేస్తున్నాడా? తెలిసి కూడా నటిస్తున్నాడా? లేక పదవి పోతుందనే భయంలో పడి..ఏది బడితే అది చేస్తున్నాడా.. ఇన్నిడౌట్స్ వచ్చేస్తున్నాయి.. అయ్యవారి యాక్షన్ ప్లాన్స్ చూస్తుంటే. అసలు ఆయన వ్యవహారం చూస్తుంటే అపరిచితుడు సినిమా గుర్తొస్తోంది. అందులో రెమో కేరెక్టర్ తో అపరిచితుడు ఫైట్ చేసే షాకింగ్ సీన్ గుర్తొచ్చేస్తుంది. తనను తానే కొట్టుకుంటూ..తానెవరినో కొడుతున్నానని బిల్డప్ ఇచ్చుకుంటూ..తన్నులు తింటూ చూసేవాళ్లను పిచ్చోళ్లని చేసే ఆ సీన్.. బాస్ పోలవరంలో రిపీట్ చేస్తున్నాడు. పోలవరంలో సోము వీర్రాజుగారి పర్యటన. నిర్వాసితుల పరిహారంపై పర్యటన.. దానిపై పోరాడతానని ప్రకటన.. ఇవి చూస్తే నిజంగానే పిచ్చెక్కిపోతోంది.  అసలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని ఇవ్వాల్సింది కేంద్రం. ఇప్పటివరకు ఇవ్వలేదు. పైగా ఇస్తుందో లేదో క్లారిటీ లేదు. జాతీయ ప్రాజెక్టు..బడ్జెట్ అంతా మాదే అని..ఆర్ అండ్ ఆర్ ఆ లెక్కలోకి రాదని డ్రామా వేస్తున్నారు. జగన్ సార్ ఎటూ గట్టిగా అడగలేడు కాబట్టి సర్దుకుపోతున్నాడు. మరి బిజెపి వారేమైనా మాట్లాడారా అంటే లేదు. పైగా చంద్రబాబునాయుడు ఇష్టమొచ్చినట్లు డిజైన్లు మార్చేస్తే మేం ఆ డబ్బులు ఇవ్వాలా అంటూ దబాయించారు సోము వీర్రాజు గారు. ఇప్పుడుఆ నిర్వాసితులకు ప్యాకేజ్ వెంటనే అమలు చేయాలని పోలవరం పర్యటన పెట్టుకున్నారు. మరి కేంద్రం డబ్బులిచ్చేసిందా.. ఇచ్చిన రాష్ట్రం ఇవ్వటం లేదని పోరాడుతున్నారా? లేక మావోళ్లు ఇవ్వరని చెప్పేశారు కదా...రాష్ట్రానిదే బాధ్యత .. ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తారా? విభజన తర్వాత లోటు బడ్జెట్ కూడా ఇప్పటివరకు ఇవ్వని కేంద్రం.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పట్టించుకోని కేంద్రం.. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఇప్పుడు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు .. అది కూడా జాతీయ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలని.. నిర్వాసితులకు న్యాయం చేయాలని.. డిమాండ్ చేస్తారా? అంటే న్యాయం చేయాలని అన్యాయం చేసినవారే నినదిస్తారా? క్యా బాత్ హై. అసలు ఇప్పటివరకు నిర్వాసితులకు పరిహారం అందకపోవడానికి చాలా కారణాలున్నాయి. మామూలుగానే ప్రాజెక్టులు కట్టేసుకుంటారు..కాంట్రాక్టర్లు బిల్లులు తీసేసుకుంటారు.. నిర్వాసితులకు పరిహారం మాత్రం దక్కదు. ఎందుకంటే దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు పాలకులైనా..ఇంకెవరైనా. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తామంటుంటే..ఇంకా మాకు పరిహారమే అందలేదు..ఇదేంటి అని నిర్వాసితులు రోడ్డెక్కితే అందరూ ఆశ్చర్యపోయారు.ఇప్పటికీ వీరికి అందలేదా? అంతెందుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామందికి ఇంకా పరిహారం అందలేదంటే నమ్ముతారా?నమ్మాలి.. అది నిజం. అడిగేది కరెక్టే...ఇవ్వాల్సింది కరెక్టే. నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాల్సిందే. కాని కోడికి మేత వేయాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాపోడు ధర్నా చేసినట్లే ఉంటుంది ఈ బిజెపి ఆందోళన కార్యక్రమం. అంత ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి బడ్జెట్ వెంటనే రిలీజ్ చేయిపిస్తే..న్యాయం చేసినోళ్లవుతారు మరి.  తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏదో నరం కట్ అయినట్లే ఉంది వీర్రాజు గారి వ్యవహారం. పోలవరం నిర్వాసితులకు న్యాయమంటూ ఒక డ్రామా వేస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఒక పక్క విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టేసే పనిలో కేంద్రం బిజీగా ఉంటే..అబ్బే అమ్మే సమస్యే లేదని ఈయనగారు ప్రకటిస్తున్నారు. ఆయనను ఆయనే మోసం చేసుకుంటున్నాడా?ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడా? ఏమో సోము వీర్రాజుగారే తెలుసుకోవాలి.

టీఆర్ఎస్ టికెట్ నాదే..  కౌశిక్ రెడ్డి ఆడియో లీక్..

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం పార్టీలన్ని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే హుజురాబాద్ కు సంబంధించి సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియా లీకైంది. ఇప్పుడది వైరల్ గా మారింది. ఆ ఆడియోలో హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ నాదేనని కౌశిక్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది.  మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే యువకుడికి ఫోన్ చేసి మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి..  హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్  అయిందని చెప్పారు.  గ్రామంలోనూ యూత్ మొత్తాన్ని తనకు కలిపాయని చెప్పారు.  యూత్ కి ఎన్ని డబ్బులు కావాలో నేను చేసుకుంటా.. యూత్ సభ్యులకు 2000, 3000 ఇద్దామని విజేందర్ కు చెప్పారు కౌశిక్ రెడ్డి. అన్ని నేను చూసుకుంటా అందరిని నా దగ్గరకు తీసుకుని రా.. ఎంతైనా ఖర్చు చేద్దామంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. వివాదస్పదం అవుతున్నాయి. ఇప్పటికి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయినా తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెప్పడం ఆసక్తిగా మారింది. కౌశిక్ రెడ్డి పార్టీలో చేరితే టికెట్ ఇస్తామని గులాబీ పెద్దలు హామీ ఇచ్చారని భావిస్తున్నారు. మరోవైపు తన అనుచరులతో సోమవారం సమావేశమవుతున్నారు కౌశిక్ రెడ్డి. ఈ సమావేశంలో టీఆర్ఎస్ లో చేరికపై కౌశిక్ రెడ్డి ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ తో హుజురాబాద్ రాజకీయాలు రంజుగా మారాయి. 

చరిత్ర స్పష్టించిన బండ్ల శిరీష.. విజయవంతమైన వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష  యాత్ర 

ఆకాశ వీధిలో అద్బుతం ఆవిష్కతమైంది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష  యాత్ర విజయవంతైంది. రిచర్డ్ బ్రాన్సన్‌ బృందం రోదసిలోకి వెళ్లి విజయవంతంగా తిరిగొచ్చింది. ఆరుగురు సభ్యుల బృందం  దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చింది. బ్రాన్సన్ టీమ్ మెంబర్ గా నింగిలోకి వెళ్లి తెలుగుమ్మాయి బండ్ల శిరీష చరిత్ర స్పష్టించింది.  రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి వెళ్లిన నాలుగో భారత వ్యోమగామిగా, తొలి తెలుగు మహిళగా తన పేరును చరిత్రలో లిఖించుకుంది.  ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష.. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా ఆమె రోదసీలోకి వెళ్లింది.  అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారి నుంచి  వీఎస్ఎస్ యూనిటీ-22 రోదసిలోకి దూసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు నింగిలోకి వెళ్లి.. 60 నిమిషాల తర్వాత తిరిగొచ్చారు.  వాతావరణ మార్పుల కారణంగా నిర్దేశిత సమయానికి గంటన్నర ఆలస్యంగా అంతరిక్ష ప్రయాణం మొదలైంది.  న్యూ మెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి  నింగిలోకి దూసుకెళ్లిన  అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగింది. మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో  సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది.    భూమి నుంచి 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న వ్యోమనౌక భూమికి, రోదసీకి సరిహద్దుగా భావించే కర్మాన్ రేఖను దాటి వెళ్లింది. ఇక్కడికి చేరిన వారిని వ్యోమగాములుగానే పరిగణిస్తారు. వ్యోమనౌక అక్కిడికి చేరాక అందులోని వారందరూ కొద్దిసేపు భార రహిత స్థితిని అనుభవించారు. అనంతరం వ్యోమనౌక తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. 34 ఏండ్ల బండ్ల శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష నిర్వహించారు. ఇప్పటికే 3 సార్లు స్పేస్‌ ఫైట్లను వర్జిన్‌ గెలాక్ట్‌ అంతరిక్షంలోకి పంపింది. తాజా ప్రయోగంలో మనుషులను రోదసీలోకి తీసుకెళ్లింది  చరిత్ర స్పష్టించింది.  ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. హ్యూస్టన్‌లో పెరిగారు. తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ఏరోనాటికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచీ వ్యోమగామి కావాలనుకున్న శిరీష, ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకుంది. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో తెలిపింది. 

ఏడాదిలో ఏడు రాష్ట్రాల పోరు.. బీజేపీ, కాంగ్రెస్ యాక్షన్ షురూ..

వచ్చే సంవత్సరం (2022) మొత్తంలో ఏడు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. సంవత్సరం మొదట్లో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలలో, చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర్లాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికలకు దిక్సూచిగా నిలుస్తాయని, రాజకీయ పండితులు విష్లేశిస్తున్నారు. అందుకే 2022 ఎన్నికలు అన్ని పార్టీలకు, మరీ ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగే ఏడు రాష్ట్రలకు గానూ, ఆరు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. ఈ ఆరు రాష్ట్రాలలో  సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వుంది. అందుకు అదనంగా కొవిడ్ సెకండ్ వేవ్’ను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు సృష్టించిన వ్యతిరేకత తోడైంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహాన్ని తట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడం, కమలనాధుల ముందున్న చాలా పెద్ద  సవాల్’గా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మనుగడ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్’ను నిలుపుకోవడంతో పాటుగా అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాలలో బీజేపీకి, జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్ది కాంగ్రెస్ అనే స్థాయిలో ఫలితాలు సాధించడం అవసరం.ఇటీవల పశ్చిమ బెంగాల్ సహా ఐదు శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనంగా’ ఓడిపోయింది. బెంగాల్ లో జీరోకు చేరింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలో హస్తం పార్టీ, వరసగా రెండవసారి ఓడిపోయి 30 ఏళ్ళు పబడిన చరిత్రను తిరగరాసింది. వరసగా రెండవసారి ఓడి పోయింది. అలాగే అస్సాంలో వరసగా రెండవ సారి ఓడి పోయింది.పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. సో.. 2021 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే, 2022లో రిపీట్ అయితే, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు కూడా 2024 ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించక పోవచ్చును.  ఎన్నికల ప్రిపరేషన్’కు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణతో ప్రారంభించిన ఎన్నికల ప్రేపరేషన్స్, ఇప్పుడు సంస్థాగత మార్పులు, పార్టీ పక్షాళన దిశగా సాగుతోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి, పార్లమెంటరీ బోర్డు మొదలు, కార్యనిర్వాహక మండలి ఏర్పాటు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఓ ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, ఓ అరడజను మంది కేంద్ర మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీలో మార్పులు చేర్పులు ఇప్పటికే మొదలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, తావర్’చంద్ గేహ్లోట్’లను తమిళనాడు,కర్ణాటక గవర్నర్లుగ నియమించారు. ఇంకా అనేక మార్పులు చేర్పులతో, పార్టీని మేకప్ చేసే పని చురుగ్గా సాగుతోంది.  మరో వంక కాంగ్రెస్ పార్టీ కూడా 2022 ఎన్నికల పోరాటానికి సిద్దమవుతోంది. ఇప్పటికే తెలంగాణ, కేరళ సహా  కొన్ని రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను నియమించిన, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరో ఇద్దరిని ఎఐసీసీ ఉపాధ్యక్షులుగా నియమించడంతో పాటుగా మరికొన్ని రాష్ట్రల పీసీసీల పక్షాళన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా, వచ్చే సంవత్సం ఆరంభంలో ఎన్నికలు జరిగే రాష్ట్రలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించారు. పంజాబ్, ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుల మార్పు, ఉత్తర ప్రదేశ్, గోవా రాష్ట్రాలకు ఎన్నికల సంఘం ఏర్పాటు పై కాంగ్రెస్ అధినాయకత్వం చర్చలు జరుపుతోందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ నాయకత్వ మార్పు ఉంటుదని అంటున్నారు.   అదే విధంగా ఏఐసీసీ స్థాయిలో అసమ్మతి (జీ 23) నేతల నుంచి ఒకరినీ యువత నుంచి మరొకరినీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించాలని,అలాగే, లోక్ సభలో పార్టీ నేతగా శశిథరూర్’ను నియమించలాని సోనియా గాంధీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఒక వర్గం ఏఐసీసీ ఉపాద్యక్షుల నియామక ప్రతిపాదనను వ్యతిరేకిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నఎఐసీసీ సలహా మండలిని పునరుద్ధరిస్తే సరిపోతుందని, అంటున్నారు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అన్నిరాష్ట్రాలలో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దవుతోంది. ఆలాగే, యూపీ సహా కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగున్నాయి. అయితే, 2022 ఎన్నికలు 2024 ఎన్నికలు మోడీ వర్సెస్ ఎవరు? అనే ప్రశ్నకు సంధానం ఇవ్వవచ్చును.అలాగే, మోడీ మూడవసారి ప్రధాని అవుతారా లేదా అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వవచ్చని అంటున్నారు.

యోగీ జనాభా విధానానికి పవార్ మద్దతు  

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నూతన జనాభా విధానాన్ని విడుదల చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030 జనాభా విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కొత్త జనాభా విధానం ప్రకారం, 2026నాటికి ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాల రేటు 2.1కి పరిమితం చేయాలని, 2030నాటికి 1.9కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా యూపే సీఎం ఆదిత్యనాథ్ జనాభా నియంత్రణకు, కాన్పుకు, కాన్పుకు మధ్య ఎడం ఉండలాని, బిడ్డకు బిడ్డకు మధ్య దూరం ఉండాలని అన్నారు. సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి, వనరుల పంపిణీలో మరింత సమన్యాయం ఉండేవిధంగా జనాభాను నియంత్రించి, స్థిరపరచవలసిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాజా బిల్లుపై ఈనెల 19 వరకూ  ప్రజల సూచనలను యూపీ సర్కార్ ఆహ్వానించింది. అదంతా ఒకలా ఉన్నా, బిల్లులో అసలు మెలిక వేరేగా ఉందని కాంగ్రెస్ పార్టీ కస్సు మంది.  యూపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన జనాభా విధానం ప్రకారం, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, సబ్సిడీలు పొందేందుకు అనర్హులవుతారని ఆప్రతి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకు వచ్చేముందు, తమ చట్టబద్ధ సంతానంపై మంత్రులు, ప్రభుత్వ నేతల నుంచి ముందు సమాచారం కోరాలని సూచించారు.  కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, యూపీ బిల్లుకు స్వాగతం పలికారు. దేశంలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించాలంటే జనాభా నియంత్రణ అవసరమని ఆయన తెలిపారు. ఉన్నత జీవన ప్రమాణాలు, పర్యావరణ సమతౌల్యం సాధించడంలో జనాభా నియంత్రణ ఎంతో కీలకమని ఆయన ఆభిప్రాయపడ్డారు. అయితే , ఈ బిల్లుపై ఇతర పార్టీల స్పందన ఎలా ఉంటుందో చూడవలసి ఉందని, ముఖ్యంగా ముస్లిం వోట్ బ్యాంక్’ఫై ఆధారపడే లౌకికవాద  పార్టీల స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

గుంతలు పూడుస్తున్న టీడీపీ నేతపై దౌర్జన్యం.. పశ్చిమలో వైసీపీ నేతల ఓవరాక్షన్..

అమ్మా పెట్టదు.. అడుక్కో తినానివ్వదు.. అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం తీరు. రెండేండ్లుగా నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు దెబ్బ తిన్నాయి. చాలా ప్రాంతాల్లో దారుణంగా తయారయ్యాయి. రోడ్ల మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కనీస మరమత్తులు చేసేవారు లేకపోవడంతో.. విధి లేక ఆ రోడ్లపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు జనాలు. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల  దుస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. దీంతో జనాల ఇబ్బందులు చూడలేక.. గుంతలు పూడ్చే  ప్రయత్నం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేయడం దుమారం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చి పోయారు.  రోడ్లపై గుంతలు పూడుస్తున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అడ్డుకున్నారు. ఏలూరు సమీపంలో సోమవరప్పాడు వద్ద రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బాగు చేయాలని అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా స్పందించకపోవడంతో చింతమనేని స్వయంగా రంగంలోకి దిగారు.   పలుగు, పార పట్టారు.  వర్షంలోనే గోతులు పూడ్చేందుకు ప్రయత్నం చేశారు చింతమనేని.  అయితే వైసీపీ నేతలు అక్కడికి చేరుకుని ఆయన్ను అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత తలెత్తింది.  వైసీపీ నేతల తీరుపై చింతమనేని ప్రభాకర్‌ మండిపడ్డారు. ఏలూరు-జంగారెడ్డి గూడెం రోడ్డు సోమవరప్పాడు దగ్గర నుంచి గోపన్నపాలెం వరకు గోతులు ఏర్పడి.. రోడ్డేదో, గొయ్యేదో తెలియని పరిస్థితిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు.. రోడ్డుపై గుంతలను సర్పంచ్‌లు, టీడీపీ నేతల సహకారంతో పూడుస్తున్నామన్నారు. రాజకీయ లబ్దికోసం ఈ పనిచేయడంలేదన్నారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పటానికే తమ ప్రయత్నమని చింతమనేని స్పష్టం చేశారు. 

 కృష్ణపట్నం ఆనందయ్యకు ఎమ్మెల్సీ? గవర్నర్ కార్యాలయం ఆరా తీసిందా? 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి రానుందా? గవర్నర్ కోటాలో ఆయన పెద్దల సభకు వెళ్లబోతున్నారా? ఈ చర్చే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ జోరుగా సాగుతోంది. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కొవిడ్ నివారణలో బాగా పని చేస్తుందని జనాలు భావిస్తున్నారు. దీంతో ఆయన మందు కోసం ఎగబడ్డారు. ఆనందయ్య మందుకు చాలా ఆడ్డంకులు వచ్చినా.. హైకోర్టు  అనుమతి ఇవ్వడంతో మందు పంపిణి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆనందయ్య మందు పంపిణీ అవుతోంది. ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్యను చట్టసభలకు పంపి గౌరవించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా.. ఏపీ సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు లేఖరాయడం సంచలనంగా మారింది. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని వెన్నెల ఫౌండేషన్ వైస్‌చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ గవర్నరి బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. తన ఆయుర్వేద ఔషదంతో కొవిడ్-19 నివారణకు కృషి చేసిన ఆనందయ్యను రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3), ప్రకారం ఆయనను ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. ఈ లేఖపై స్పందించిన గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.  ఈ లేఖపై అటు గవర్నర్ కార్యాలయంగానీ.. ఇటు ఆనందయ్యగానీ స్పందించలేదు. ఆనందయ్య మందు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా కృష్ణపట్నంకు క్యూకట్టారు. కొన్ని రోజుల పాటు ఆనందయ్య కేంద్రంగానే రాజకీయ ఆరోపణలు చేసుకున్నాయి. ఒకరిద్దరు మంతురులు కూడా ఆయన్ను కలిసి మందు తయారీ, పంపిణీ గురించి ఆరాతీశారు. ఆనందయ్యను ప్రభుత్వం నిర్బంధిస్తోందని... రహస్య ప్రాంతంలో ఉంచి అధికార పార్టీ నేతలు మందు తయారు చేయించుకున్నారని కొన్ని పార్టీల నేతలు విమర్శించారు. ఆనందయ్యకు పాపులారిటీ రావడంతో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందయ్య మందును సొంత ఫోటోలు వేసుకొని పంపిణీ చేశారు. ఇది కూడా వివాదాస్పదమైంది.  ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవిస్తున్నారన్న ప్రచారం వెలుగులోకి రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆనందయ్యకు ఎమ్మెల్సీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీలో పదవులకు పోటీ పెరగడంతో ఆనందయ్యకు జగన్ అవకాశం కల్పిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఆనందయ్యకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

కిషన్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి.. బీజేపీకి జై కొట్టనున్నారా?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కోమటిరెడ్డి.. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఒకరు. పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నించారు. చివరి వరకు రేసులో నిలిచారు. ఆరు నెలల పాటు పీసీసీ చీఫ్ పోస్టును పెండింగులో పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ... చివరకు రేవంత్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్ పదవి తనకు రాకపోవడంతో వెంటనే అసమ్మతి స్వరం వినిపించారు కోమటిరెడ్డి. పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీపీసీసీని టీటీడీపీగా మార్చేశారని కామెంట్ చేసి కాక రేపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. అయితే మరుసటి రోజుకే కూలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పదవి రాలేదనే బాధతోనే మాట్లాడానని, తాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని చెప్పారు.   తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరు కాలేదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా పార్టీలోని సీనియర్ నేతలందరిని కలిసిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాత్రం కలవలేదు. తనను కలవడానికి రావొద్దని వెంకట్ రెడ్డి చెప్పడం వల్లే రేవంత్ రెడ్డి అతని నివాసానికి వెళ్లలేదని చెబుతున్నారు. గాందీభవన్ లో జరిగిన రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ నేతలంతా వచ్చినా  కోమటిరెడ్డి హాజరు కాలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కోమటిరెడ్డి రాజకీయ గమనంపై చర్చలు సాగుతుండగానే కీలక ఘటన జరిగింది. సడెన్ గా ఢిల్లీకి వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి ఖిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆయనకు  వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా నియమితులైనందుకు కిషన్ రెడ్డికిఅభినందనలు తెలిపారు. తన వినతికి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత కోమటిరెడ్డి చెప్పారు. అయితే భువనగిరి కోట అభివృద్ధి కోసం కిషన్ రెడ్డిని కలిశానని కోమటిరెడ్డి చెబుతున్నా.. అసలు విషయం మాత్రం రాజకీయపరమైనదేననే చర్చ జరుగుతోంది.  పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా  సోమవారం దేశ వ్యాప్తంగా  ఆందోళనలకు ఏఐసీసీ పిలుపిచ్చింది. తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆందోళనలకు ముందురోజే కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ నియామకం తర్వాత పార్టీలో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి.. బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలోనే కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ పెద్దలను కలిశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అప్పుడే ఆయన బీజేపీలోకి వెళతారని భావించినా.. ఎందుకో ఆగిపోయింది. రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కార్యక్రమానికి వెళ్లలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకట్ రెడ్డి వెళుతున్నారని.. కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే కమలం గూటికి చేరతారనే చర్చ జరుగుతోంది. బీజేపీ పెద్దలతో చర్చల కోసమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హస్తినకు వెళ్లి ఉండవచ్చని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు కూడా చెబుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ .. బీజేపీలో చేరడంలో  కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెబుతారు. కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఈటల ఉన్నా.. కిషన్ రెడ్డి చొరవతోనే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారని తెలుస్తోంది. పార్టీ పెద్దలతో ఈటలతో కిషన్ రెడ్డి మాట్లాడించారని తెలుస్తోంది. ఈటలతో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వచ్చారని రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈటల తరహాలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరేలా కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారని, ఆయన పిలుపుతోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని పక్కాగా అందుతున్న సమాచారం. భువనగిరి కోట అభివృద్ధికి నిధుల కోసమే అయితే కోమటిరెడ్డి.. ఇప్పుడే అర్జంటుగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం తలపెట్టిన నిరసన తర్వాత కూడా వెళ్లవచ్చు. బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హస్తినకు వెళ్లారని వాళ్లంతా అనుమానిస్తున్నారు. మొత్తంగా కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీతో.. త్వరలోనే తెలంగాణలో మరో కీలక రాజీకయ పరిణామం జరగవచ్చనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం? క్లారిటీ ఇచ్చిన కోదండరామ్..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. హస్తం పార్టీలోకి వలసలు మొదలు కాగా.. సీఎం కేసీఆర్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపారు. తెలంగాణ ఉద్యమ నేత కోదండరామ్ సారథ్యంలోని తెలంగాణ జన సమితి పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. టీజేఎస్ విలీనం వార్తలను కోదండరామ్ ఖండించినా.. ఆ ప్రచారం ఆగడం లేదు. దీంతో తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు కోదండరామ్. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని కోదండరామ్ మండిపడ్డారు. ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ కార్యాలయంలో భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించిన కోదండరామ్..హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలోను తక్షణమే పని చేయాలని నిర్ణయించామని తెలిపారు.  తెలంగాణ జనసమితి పై సోషల్ మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది అధికార పార్టీ కుమ్మక్కై చేస్తున్న ప్రచారమన్నారు. అమరవీరుల త్యాగాలు వృధా కావద్దు.. వారి ఆశయ సాధన కోసం అమ్ముడు కొనుడు రాజకీయాలు కాకుండా మార్పు రాజకీయ నిర్మాణాలు చేస్తున్నామని కోదండరామ్ తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలు చేస్తూ రాజకీయాలు చేస్తామన్నారు.  కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదన్నారు కోదండరామ్. లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని  ప్రశ్నించారు. ఆస్తుల రక్షణ కోసమే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. కేసీఆర్ ,ఆయన కుటుంబం ఆస్తుల సంపాదన లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలన్ని పైసలకు అడ్డాగా మారిపోయాయని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న 3 లక్షల వరకు పోస్టులను  వెంటనే  భర్తీ చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.  కృష్ణా జలాలు పై ఆంధ్రప్రదేశ్ తో కుమ్మక్కై మాట్లాడుతున్నారని కోదండరామ్ ఆరోపించారు. రి డిజైన్ పేరుతో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు. Slbc సొరంగ పనులు వేగవంతం చేయాలని కోరారు. జూరాల నుండి పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి.. మహబూబ్ నగర్ ,నారాయణపేట కి నీరు అందించావని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుండి రాజోలిబండ  వరకు త్వరలోనే యాత్ర చేపడుతున్నామని కోదండరామ్ ప్రకటించారు.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. థర్డ్ వేవ్ గండం? 

ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ  అదే హెచ్చరిక చేసింది. కరోనా మహామ్మారి వెళ్లిపోయిందనే  భ్రమలు వద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్చరిస్తూనే ఉన్నాయి.శాస్త్రవేత్తలు, వైద్యులు అవే హెచ్చరికలు చేస్తున్నారు.  ఒక్క అమన దేశంలోనే కాదు,ఇంకా యూకే, రష్యా, బంగ్లాదేశ్ లలో కేసుల ఉధృతి తగ్గలేదని కేంద్ర  ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. అలాగే, మనదేశం సెకండ్ వేవ్ కాసింత సర్డుమణిగిందే కానీ, పూర్తిగా వదలి పోలేదని ఆయన  చేశారు.  చాలా వరకు రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపధ్యంలో జనాలు  గుమిగుడే పర్యాటక ప్రాంతాలు, పబ్బులు, బార్లు, ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. ఈ కారణంగా   రానున్న రోజుల్లో కేసులు పెరిగే ప్రమాదముందని.. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారాయన.కానీ, ప్రజల ప్రవర్తన  మాత్రం కరోనా భయం కనిపించడమే లేదు.ఎక్కడిక్కడ కనీసం మాస్కులైనా లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఒక విధంగా  ప్రజలు కరోనా అంతమైనట్టు బావిస్తున్నట్ల్గుగ వుంది, ఇది తప్పే కాదు, పెద్ద ముప్పుకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.  యూరో ఫుట్ బాల్ మ్యాచ్ ల తర్వాత బ్రిటన్ లో రోజువారీ కేసులు పెరిగాయని.. అమెరికాలోనూ అదే పరిస్థితని చెప్పారు. ఇండోనేషియా లాంటి దేశాల్లోని కేసుల తీవ్రతను ఆయన వివరించారు. ప్రజల్లో అజాగ్రత్త ఆవరించొద్దని సూచించారు లవ్ అగర్వాల్. ఇదలా ఉంటే దేశంలో నమోదవుతున్న కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.50 శాతానికిపైగా కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళలోనే నమోదవుతున్నాయి. గతవారంలో రోజులుగా నమైదన కేసుల్ని పరిశీలించిన ఆరోగ్యశాఖ.. ఆ రెండు రాష్ట్రల్లోనే ఎక్కవగా కరోనా వ్యాపిస్తోందని తెలిపింది.కేరళలో 32 శాతం నమోదవ్వగా.. మహారాష్ట్రలో 21 శాతంగా కేసులు ఉంటున్నాయి. జులై 8 నాటికి 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 66 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 కంటే ఎక్కువగా నమోదైందని వెల్లడించింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 90 జిల్లాల నుంచి 80 శాతం కొత్త కేసులు బయటపడ్డట్లు తెలిపింది ఆరోగ్యశాఖ. ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడి ఎంతో అవసరమని సూచించింది. కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు జికా వైరస్ కూడా కేరళను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో ఇప్పటి వరకు మొత్తం 15 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొదట గర్భిణీ మహిళ ఆ వైరస్ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో మరో 14 మందికి పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉడిపి, దక్షిణ కన్నడ, చామ రాజ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు కేరళ పక్కనే ఉన్న కర్ణాటక కూడా అప్రమత్తం అయ్యింది. అంతేకాకుండా కేంద్రం నుండి ఆరుగురు సభ్యుల వైద్య బృందం కేరళ కి చేరుకుంది. ఈ బృందం రాష్ట్రంలో వైరస్ పరిస్థితులను సమీకరించడం తోపాటు అవసరమైన సూచనలు సలహాలను అందజేస్తోంది. అయితే జికా వైరస్ అంత ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నారు.కానీ గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందుకే మూడవ వేవ్ ను అడ్డుకునేందుకు అందరూ సహకరించాలని, కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

ప్రత్యేక హోదా, రైల్వే  జోన్  కోసం పోరాడండి.. తనపై ఘజనీ దందయాత్రలు వద్దన్న రఘురామ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు నర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు న‌వ సూచ‌న‌ల పేరుతో వ‌రుస‌గా నాలుగో లేఖ రాశారు. త‌న‌పై లోక్‌స‌భ‌లో అన‌ర్హ‌త వేటు వేయించేందుకు గ‌జ‌నీ దండ‌యాత్ర‌ల వంటివి చేస్తున్నారంటూ లేఖలో ఆయ‌న ఎద్దేవా చేశారు. అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఇప్ప‌టికే లోక్‌స‌భ స్పీక‌ర్‌కు వైసీపీ ఎంపీలు ఏడుసార్లు విజ్ఞ‌ప్తులు చేశార‌ని చెప్పారు. యదా రాజా తదా మంత్రి అన్న‌ట్లు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌గ‌న్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నారంటూ చుర‌క‌లంటించారు. ర‌ఘురామ‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే పార్ల‌మెంటును స్తంభింప‌జేస్తామంటూ విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా హెచ్చ‌రిక‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. అంత శ‌క్తే గ‌నుక వైసీపీకి ఉంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్‌, పోల‌వరానికి నిధుల కోసం పోరాడాల‌ని ఎంపీ రఘురాం చించారు.ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న త‌నపై అనర్హత వేటు వేయించాలని పదే పదే ప్రయత్నించే బదులు రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం పోరాడేలా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాల‌న్నారు. వైసీపీ నేత‌లు ఎందుకు పోరాడ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని రఘురామ అన్నారు.  ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఉన్నది ఉన్నట్లుగా ఇది.. జులై 11, 2021 శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విషయం: నాపై అనర్హత వేటు వేసేందుకు మీరు చేస్తున్న ‘‘ఘజనీ దండయాత్రలు’’ (విశ్వప్రయత్నం) సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 4 ముఖ్యమంత్రి గారూ, మీరు నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించడానికి విఫలయత్నాలు చాలా చేస్తున్నారనేది జగద్విదితం. నాకు గుర్తు ఉన్నంత వరకూ మీరు ఇప్పటికి ఏడు సార్లు నాపై అనర్హత వేటు వేయాలంటూ గౌరవ లోక్ సభ స్పీకర్ కు వివిధ సందర్భాలలో వినతి పత్రాలు సమర్పించారు.నిజానిజాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నా, ఈ అంశానికి సంబంధించి తాము చేయాల్సింది చేస్తామని చెప్పినప్పటికీ కూడా రాజ్యసభ సభ్యుడు, మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గౌరవ చట్ట సభల చైర్ లను దూషించడాన్ని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ‘‘యధా రాజా తధా మంత్రి’’ అన్నట్లు, విజయసాయి రెడ్డి కచ్చితంగా మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. మీరు గౌరవ న్యాయస్థానాలపైనా, గౌరవనీయులైన న్యాయమూర్తులపైనా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగానే అత్యున్నతమైన, గౌరవప్రదమైన వ్యవస్థలపైన విజయసాయి రెడ్డి పలు దఫాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తాం అని ఆయన లోక్ సభ స్పీకర్ ను నేరుగా హెచ్చరించే సాహసానికి కూడా ఒడిగట్టారు. గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ ను ఉద్దేశించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు నేను ఆయనపై ఇప్పటికే సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చాను కూడా. మీ బృందం చేస్తున్న ఈ చర్యలను పత్రికలలో చదివిన తర్వాత సాధారణ ప్రజలు సైతం ప్రజాసమస్యల పట్ల మీకు ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్న ఒక ప్రశ్నను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అదేమిటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీ బృందం, ఎందుకు సభలను స్థంభింప చేయడం లేదు? మీరు స్పెషల్ క్యాటగిరి స్టేటస్ పై చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు మన పార్టీకి అనూహ్యమైన మెజారిటీని కట్టబెట్టారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నది ఏమిటంటే ఒక సహచర ఎంపిపై అనర్హత వేటు వేయించేందుకు పార్లమెంటును స్థంభింప చేసే శక్తి ఉంటే అదే శక్తిని మన రాష్ట్రానికి ప్రత్యేక క్యాటగిరి స్టేటస్ తెప్పించేందుకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం పార్లమెంటును స్తంభింప చేయవచ్చు కదా అని వారు అడుగుతున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిపై అనర్హత వేటు వేయమని ఇన్ని లేఖలు రాస్తున్నారే పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురావడానికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎందుకు లేఖలు రాయడం లేదని కూడా ప్రజలు పరిపరి విధాలుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రాయలసీమకు ఎక్కువ నీటిని అందించి రాయలసీమ భూములను సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది కదా అని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఒక ఎంపిని అనర్హుడిగా చేయాలని ఇంతగా ప్రయత్నిస్తున్న సాటి ఎంపిలు పార్లమెంటును కూడా స్తంభింప చేస్తామంటున్నారే మరి గత రెండు సంవత్సరాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారం ముందుకు సాగకుండా ఆగిపోయినప్పుడు పార్లమెంటును ఎందుకు స్తంభింపచేయలేదని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతే తీవ్రమైన ప్రయత్నాలు చేసి విశాఖ రైల్వే జోన్ ను సాధించవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంత శ్రద్ధతో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు కృషి చేసి ఉంటే మీతో కలిసి నడవడానికి, మీకు సంపూర్ణంగా సహకరించడానికి నేను ముందు వరుసలో ఉండేవాడిని. నేను పైన చెప్పిన మూడు విషయాలపై పార్లమెంటును స్తంభింప చేసి ఆ తర్వాత నన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు పార్లమెంటును స్తంభింప చేయండి. అలా కాకుండా ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే ప్రజలు మీపై తిరుగుబాటు చేసేందుకు ఎంతో ఎక్కువ సమయం పట్టదు. ఒక ఎంపిని అనర్హుడిగా ప్రకటించే అధికారాన్ని లోక్ సభ స్పీకర్ నుంచి తీసేసి పార్టీ అధ్యక్షుడికే ఇవ్వాలనే మీ తలంపును అమలులోకి తెచ్చుకోవాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో మూడు వంతుల మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.   అది మీకున్న 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులతో సాధ్యం కాదు.మీకు మరో అదనపు సమాచారాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన త్రిసభ ధర్మాసనం ఏం చెప్పిందంటే, పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల విషయంలో కోర్టులు ఏ మాత్రం జోక్యం చేసుకోలేవు. ఫిరాయింపుల ఫిర్యాదుల పరిష్కారంపై కాలపరిమితిని నిర్ణయించడం కూడా కోర్టుల పరిధిలోకి రాదు. ఇది పూర్తిగా రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, లోక్ సభ స్పీకర్ విచక్షణపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అని ఎంతో స్పష్టంగా సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని మీకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాను. మీరు ఈ విషయాన్ని విజయసాయి రెడ్డికి అర్ధం అయ్యేలా చెప్పాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మీడియా సమావేశాలలో ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు. స్పీకర్, నిర్ణీత కాల వ్యవధి అంటూ అస్పష్టమైన ప్రకటనలు చేసుకుంటూ, నా అనర్హత ఏదోఒక విధంగా జరగాలని ఆయన ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. 2020 సంవత్సరంలో రాజస్థాన్ లో జరిగిన మరో విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను అక్కడి అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దాంతో ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పుపై రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెబుతూ… నిరసన తెలియచేయడానికి, పార్టీ ఫిరాయించడానికి తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ స్టే ఎత్తేయడానికి నిరాకరించింది. దాంతో స్పీకర్ తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు. చివరికి వారిపై అనర్హత వేటు పడలేదు. ఈ మొత్తం కేసులో కీలకమైన అంశం ఏమిటంటే నిరసన తెలియచేయడానికి, పార్టీ ఫిరాయించడానికి తేడాను తెలుసుకోవాలి అని చెప్పడం. మీరు నాకు జారీ చేసిన నోటీసులలోనూ, లోక్ సభ స్పీకర్ కు నాపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ లోనూ మీరు చెప్పిన సాకులు పరిశీలిస్తే నాకు అర్ధమైనదేమిటంటే నేను మాతృభాష లోనే ప్రాధమిక విద్యాబోధన ఉండాలనే రాజ్యాంగంలోని 350 ఏ అధికరణ గురించి పార్లమెంటులో మాట్లాడటమే మీకు తీవ్ర అభ్యంతరకరమైన విషయంగా కనిపించింది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ నమోదు ప్రక్రియలో భాగంగా తమ పార్టీ రాజ్యాంగానికి లోబడి పని చేస్తుందని ప్రమాణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో… మేం రాజ్యాంగంలోని 350 ఏ అధికరణకు వ్యతిరేకంగా పని చేస్తామని ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఎన్నికల ప్రణాళికలో చెబితే, ఎవరైనా ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళితే, పార్టీ గుర్తింపునే రద్దు చేసే ప్రమాదం ఉంటుంది. నేను రాజ్యాంగానికి కట్టుబడి చేసిన ప్రసంగాన్ని తప్పుపడితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లు అవుతుంది. నేను పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని, మనసావాచా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, ప్రమాణం చేసినందున నేను ఆ విధంగానే లోక్ సభలో ప్రసంగించాను తప్ప పార్టీ సిద్ధాంతాలను ఏనాడూ నేను జవదాటలేదు. ఏనాడూ పార్టీ విప్ ను ధిక్కరించని వాడిని, ఏనాడూ పార్టీ ఫిరాయించని వాడిని ఎవరినైనా సరే 10వ షెడ్యూలు కింద దోషిగా నిలబెట్టి పార్లమెంటు సభ్యత్వం నుంచి తప్పించలేరు, అనర్హత వేటు కూడా వేయలేరు. అందువల్ల నేను మీకు సూచించేది ఏమంటే నా శక్తియుక్తులను పార్టీ బాగు కోసం, పార్టీ నాయకుడి మేలు కోసం, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వాడుకోండి తప్ప ఇలా ప్రవర్తించ వద్దు. ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అధికారంలో ఉన్నవారు అక్రమంగా మెజారిటీ సాధించుకోవడానికి, అధికార దాహంతో పార్టీలను చీల్చే రాజకీయ నాయకులను అదుపు చేయడానికి నిర్దేశించిందే తప్ప నాలాంటి వారి కోసం కాదని మీకు స్పష్టం చేస్తూ ఇప్పటికైనా మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుని పునరాలోచించేందుకు ఇది సరైన సమయమని నేను మీకు సూచిస్తున్నాను. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఫిరాయింపుదార్లను ప్రోత్సహించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా చూడటం. అంతే కాని పార్టీలలో వచ్చే నిరసన స్వరాలను అణచి పెట్టేందుకు కాదు. ఇదే విషయాన్ని చట్టం రూపొందించే సమయంలో పార్లమెంటు లో జరిగిన చర్చల సందర్బంగా పలువురు చెప్పారు. అలా పార్టీలలో వచ్చే నిరసన స్వరాన్ని అణచి వేయడం భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కుకు భంగకరమని కూడా ఆ చర్చల సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. పాలనా విధానాలపై, ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపే గొంతులను ఈ విధంగా అణచివేయడం ప్రజాస్వామ్యమా? ఇది సాధారణ విషయం కాదు. మనమందరం ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులం. మనమే నిరంకుశంగా ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుంది? ఇది మీకో నాకో చెప్పడంలేదు. నేను కేవలం నా అనర్హత విషయం మాత్రమే ప్రస్తావించడం లేదు. మనందరం కలిసి ఆలోచించాల్సిన అంశం. నేను సిద్ధాంతపరమైన అంశాలనే లేవనెత్తి, పాలనాధికారులను ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న వారిని ప్రజల తరపున ప్రశ్నించాను తప్ప వేరే విధంగా చేయలేదు. ఈ నేపథ్యంలో నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే నా అనర్హత అంశంపై నిరంతరంగా, విసుగు విరామం లేకుండా పోరాటం చేయడం, ఆ పోరాటంలో భాగంగా గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ పైనా, గౌరవనీయమైన వ్యవస్థలపైన బురద చల్లే విధంగా మాట్లాడటం కాకుండా న్యాయపరమైన అంశాలను మరొక్క సారి సరి చూసుకోండి. చట్టం గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు ఇదే విధంగా గౌరవనీయమైన వ్యవస్థలను పలుచన చేసి అగౌరవ పరిస్తే మళ్లీ మళ్లీ మీకు న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని పేరా 2(ఏ)లో చెప్పినట్లు ప్రభుత్వ నిర్ణయాలపై మంచి చెడు పరిణామాలను చెప్పడమనేది ఆరోగ్యకరమైనదిగానే భావించాలి. రాజకీయ పరిస్థితులు ఏకోన్ముఖంగా ఉండే అవకాశం లేదు. అవి సంక్లిష్టంగానే ఉంటాయి. కనీసం ఈ లేఖను చదివిన తర్వాత అయినా మీరు రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనే అంశం ప్రాముఖ్యతను కూడా మీరు గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. మీ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యయుత విధానాలు అమలు చేయడం కూడా అనివార్యమని మీరు తెలుసుకోవాలి. అదే విధంగా ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పూర్తిగా అవగాహన చేసుకుని జాగ్రత్తలు తీసుకుని ఇక నుంచి బాధ్యతతో మెలగుతారని కూడా ఆశిస్తున్నాను. భవదీయుడు కె.రఘురామకృష్ణంరాజు

రోదసీలోకి తెలుగుమ్మాయి.. చరిత్ర స్పష్టించనున్న శిరీష

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి వెళ్తున్న నాలుగో భారత వ్యోమగామిగా, తొలి తెలుగు మహిళగా శిరీష నిలవనున్నారు.ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వీఎ్‌సఎస్‌ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది.  ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు వెళ్తుండగా అందులో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష నిర్వహిస్తారు. శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ ప్రయోగం ఉంటుందని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ తెలిపింది.  న్యూ మెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి  మొదలయ్యే అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగుతుంది. భూమి నుంచి 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న వ్యోమనౌక భూమికి, రోదసీకి సరిహద్దుగా భావించే కర్మాన్ రేఖను దాటి వెళ్తుంది. ఇక్కడికి చేరిన వారిని వ్యోమగాములుగానే పరిగణిస్తారు. వ్యోమనౌక అక్కిడికి చేరాక అందులోని వారందరూ కొద్దిసేపు భార రహిత స్థితిని అనుభవిస్తారు. అనంతరం వ్యోమనౌక తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రయోగం విజయం అనంతరం.. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనేది వర్జిన్‌ సంస్థ యోచన. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. హ్యూస్టన్‌లో పెరిగారు. ఇక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచీ వ్యోమగామి కావాలనుకున్న శిరీష, ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకోనుండటం విశేషం. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో పేర్కొన్నారు.