అమ్మాయిని మంచానికి కట్టేసి మరీ..
posted on Jul 9, 2021 @ 3:06PM
ఈ ప్రపంచం అభివృద్ధిలో ఆచరణలో ముందుకు వెళ్తుంటే.. కొన్నీ దేశాలు అభివృద్ధిలో వెనక్కి.. అమ్మయిలపై దాడులు చేయడంలో ముందుకు వెళ్తుంది. అన్ని దేశాలు 2021 ఉంటే దేశాల్లో ఇంకా నైంటీస్లో ఉన్న ఆచారాలు.. ఆలోచనలతోనే నడుస్తుంది.. కొన్ని దేశ ప్రజల ఆలోచనలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే రాజకీయనాకుల పరిపాలన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందని చెప్పాలి...మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఇంకా మన దేశంలో కూడా నాటితో పాలిస్తే మహిళలపై దాడులు చెలరేగిపోతున్నాయి.. తాజాగా బెంగళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో మే లో బంగ్లాదేశ్ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 22ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. అరెస్ట్ అయిన 12 మందిలో 11 మంది బంగ్లాదేశ్ వారే కాగా, వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చిన బాధిత యువతి ఓ బార్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తోంది.. అంతకుముందు కూడా ఆమె దుబాయ్‌లో బార్‌లో పనిచేసేది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన యువతి తొలుత హైదరాబాద్‌లో ఓ మసాజ్ పార్లర్‌లో పనిచేసింది. ఈ క్రమంలో తనకు పరిచయం ఉన్న నలుగురు యువకులు, ఇద్దరు యువతులను బంగ్లాదేశ్ నుంచి అస్సాం మార్గంలో భారత్‌లోకి అక్రమంగా రప్పించి అక్కడితో ఉరోకోక బెంగళూరులో స్థిరపడేలా చేసింది. నగరంలోని సుబ్రహ్మణ్యస్వామినగరలో ఇంటిని అద్దెకు తీసుకుని అదే చిరునామాతో ఆధార్ కార్డులను కూడా సమకూర్చిపెట్టింది. వాళ్ళకి మన దేశంలో ఆధార్ కార్డు ఇచ్చారంటే మన వాళ్ళు వందలు అమ్ముడుపోయుంటారు లేకపోతే ఆ అమ్మాయికి ఆధార్ కార్డు ఎలా వస్తుంది.. ఇక ఈ విషయాన్నీ పక్కన పెడితే..
సహాయం చేసినవాడు మోసం చెయ్యడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో..ఆమె సాయంతో నగరానికి వచ్చి కుదురుకున్న వారు తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపారు. అంతేకాక, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వృభిచారంలోకి దింపేవారు. వారి చెరలో చిక్కుకున్న బాధితురాలు తను వ్యభిచారం మానేసి సొంతంగా స్పా పెట్టుకుంటానని తెగేసి చెప్పింది. ఇప్పటి స్నేహితులే రేపటి పగవారు అని చెప్పినట్లు.. ఈ క్రమంలో వారి మధ్య నగదు లావాదేవీల విషయంలో గొడవ మొదలైంది. స్పా పెట్టవద్దంటూ యువతిని మంచానికి కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు. ఆమె ప్రైవేటు భాగాలపై మద్యం సీసాలతో దాడిచేశారు. అదే నెల 19న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇది వైరల్ అవుతుండగానే మరో వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోలను చూసిన కొందరు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే నలుగురు యువకులు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన హకీల్, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్, మహ్మద్ బాబా కేశ్, రియాద్ బాబు, నస్రత్, కాజల్‌లను నిందితులుగా గుర్తించారు. నస్రత్, కాజల్ ఇద్దరూ రియాద్ బాబు భార్యలు కావడం గమనార్హం. రియాద్, సాగర్ పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పుల్లో గాయపడ్డారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, అత్యాచారం, నిర్భయ తదితర చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని 5 వారాల వ్యవధిలోనే చేధించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును కోర్టుకు సమర్పించామని తెలిపిన కమిషనర్.. కేసు దర్యాప్తు చేసిన బృందాన్ని ప్రశంసించారు. అలాగే లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.