కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి సస్పెండ్? రేవంత్ రెడ్డి తొలి దెబ్బ..
posted on Jul 12, 2021 @ 11:02AM
కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువని చెబుతారు. అందుకే నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు మాళ్లు మాట్లాడుతారనే టాక్ ఉంది. నేతలకున్న ఆ ఫ్రీడమే కాంగ్రెస్ ప్లస్, మైనస్ అని అంటుంటారు. నేతలు లూజ్ టాక్స్ లో కాంగ్రెస్ చాలా సార్లు నష్టపోయింది కూడా. అయినా నాయకుల తీరు మాత్రం మారదు. తెలంగాణ కాంగ్రెస్ లో అయితే ఇదీ మరీ ఎక్కువ. కాని ఇప్పుడు సీన్ మారుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో సీరియస్ గా వెళ్లబోతున్నారని తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడినా చర్యలు తప్పవని బాధ్యతలు స్వీకరించిన రోజే హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అన్నట్లుగానే యాక్షన్ లోది దిగారు.
తనకు టీఆర్ఎస్ టికెట్ ఖారైరందంటూ హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. ఈ ఘటనపై పీసీసీ చీఫ్ సీరియస్ గా స్పందించారు. కౌశిక్ రెడ్డి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గని బంధువైనా.. వెంటనే కౌషిక్ రెడ్డికి పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్నది క్రమశిక్షణ సంఘం. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే క్రమశిక్షణ సంఘం కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చిందని చెబుతున్నారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ఫంక్షన్ లో ఆయన కేటిఆర్ ను కలిసిన వీడియోలు వైరల్ గా మారాయి. పాడి కౌశిక్ రెడ్డి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందాయి. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించిందని తెలుస్తోంది. అయినా కౌశిక్ రెడ్డి తీరు మారకపోవడంతో సస్పెండ్ చేసే యోచనలో పీసీసీ ఉందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియా లీకై వైరల్ గా మారింది. ఆ ఆడియోలో హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ నాదేనని కౌశిక్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే యువకుడికి ఫోన్ చేసి మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్ అయిందని చెప్పారు. గ్రామంలోనూ యూత్ మొత్తాన్ని తనకు కలిపాయని చెప్పారు. యూత్ కి ఎన్ని డబ్బులు కావాలో నేను చేసుకుంటా.. యూత్ సభ్యులకు 2000, 3000 ఇద్దామని విజేందర్ కు చెప్పారు కౌశిక్ రెడ్డి. అన్ని నేను చూసుకుంటా అందరిని నా దగ్గరకు తీసుకుని రా.. ఎంతైనా ఖర్చు చేద్దామంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వివాదస్పదం అవుతున్నాయి.