దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. థర్డ్ వేవ్ గండం?
posted on Jul 11, 2021 @ 12:31PM
ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ అదే హెచ్చరిక చేసింది. కరోనా మహామ్మారి వెళ్లిపోయిందనే భ్రమలు వద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్చరిస్తూనే ఉన్నాయి.శాస్త్రవేత్తలు, వైద్యులు అవే హెచ్చరికలు చేస్తున్నారు. ఒక్క అమన దేశంలోనే కాదు,ఇంకా యూకే, రష్యా, బంగ్లాదేశ్ లలో కేసుల ఉధృతి తగ్గలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. అలాగే, మనదేశం సెకండ్ వేవ్ కాసింత సర్డుమణిగిందే కానీ, పూర్తిగా వదలి పోలేదని ఆయన చేశారు.
చాలా వరకు రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపధ్యంలో జనాలు గుమిగుడే పర్యాటక ప్రాంతాలు, పబ్బులు, బార్లు, ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. ఈ కారణంగా రానున్న రోజుల్లో కేసులు పెరిగే ప్రమాదముందని.. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారాయన.కానీ, ప్రజల ప్రవర్తన మాత్రం కరోనా భయం కనిపించడమే లేదు.ఎక్కడిక్కడ కనీసం మాస్కులైనా లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఒక విధంగా ప్రజలు కరోనా అంతమైనట్టు బావిస్తున్నట్ల్గుగ వుంది, ఇది తప్పే కాదు, పెద్ద ముప్పుకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. యూరో ఫుట్ బాల్ మ్యాచ్ ల తర్వాత బ్రిటన్ లో రోజువారీ కేసులు పెరిగాయని.. అమెరికాలోనూ అదే పరిస్థితని చెప్పారు. ఇండోనేషియా లాంటి దేశాల్లోని కేసుల తీవ్రతను ఆయన వివరించారు. ప్రజల్లో అజాగ్రత్త ఆవరించొద్దని సూచించారు లవ్ అగర్వాల్.
ఇదలా ఉంటే దేశంలో నమోదవుతున్న కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.50 శాతానికిపైగా కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళలోనే నమోదవుతున్నాయి. గతవారంలో రోజులుగా నమైదన కేసుల్ని పరిశీలించిన ఆరోగ్యశాఖ.. ఆ రెండు రాష్ట్రల్లోనే ఎక్కవగా కరోనా వ్యాపిస్తోందని తెలిపింది.కేరళలో 32 శాతం నమోదవ్వగా.. మహారాష్ట్రలో 21 శాతంగా కేసులు ఉంటున్నాయి. జులై 8 నాటికి 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 66 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 కంటే ఎక్కువగా నమోదైందని వెల్లడించింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 90 జిల్లాల నుంచి 80 శాతం కొత్త కేసులు బయటపడ్డట్లు తెలిపింది ఆరోగ్యశాఖ. ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడి ఎంతో అవసరమని సూచించింది.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు జికా వైరస్ కూడా కేరళను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో ఇప్పటి వరకు మొత్తం 15 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొదట గర్భిణీ మహిళ ఆ వైరస్ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో మరో 14 మందికి పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉడిపి, దక్షిణ కన్నడ, చామ రాజ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు కేరళ పక్కనే ఉన్న కర్ణాటక కూడా అప్రమత్తం అయ్యింది. అంతేకాకుండా కేంద్రం నుండి ఆరుగురు సభ్యుల వైద్య బృందం కేరళ కి చేరుకుంది. ఈ బృందం రాష్ట్రంలో వైరస్ పరిస్థితులను సమీకరించడం తోపాటు అవసరమైన సూచనలు సలహాలను అందజేస్తోంది. అయితే జికా వైరస్ అంత ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నారు.కానీ గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందుకే మూడవ వేవ్ ను అడ్డుకునేందుకు అందరూ సహకరించాలని, కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.