టిక్ టాక్ భార్య.. టికెట్ తీసుకున్న భర్త..
posted on Jul 12, 2021 @ 10:13AM
టిక్ టాక్ ఒక ప్రళయం సృష్టించిందనే చెప్పాలి.. వాడుకున్నోడికి వాడుకున్నంత.. టిక్ టాక్ కొందరికి పిచోడి చేతిలో రాయి అయితే.. మరికొందరికి రాముడి చేతిలో బాణం లా పనిచేసింది.. టిక్ టాక్ ద్వారా కొంత మంది డబ్బులు సంపాదించారు.. ఇంకొంత మంది ఫేం సంపాదించారు. అంతే కాదు.. ఎంతో కొంత మంది చేసిన టిక్ టాక్ చెడు కూడా చేసింది..కుటుంబలా మధ్య గొడవలు.. భార్య భర్తల మధ్య వివాదాలు.. లవర్స్ కి మధ్య బ్రేక్ అప్.. కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి.. అయితే టిక్ టాక్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై భారత్ లో ఎంత క్రేజుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు సైతం టిక్ టాక్ వీడియోలతో అలరిస్తుంటారు. అయితే, హైదరాబాదులో టిక్ టాక్ ఓ దంపతుల మధ్య చిచ్చు రేపింది. భార్య టిక్ టాక్ వీడియోలు చేస్తుండడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది.
ఆమె పేరు ప్రియాంక , అతని పేరు ప్రవీణ్ ఇద్దరు భార్యాభర్తలు. వీరు బాలానగర్ సమీపంలో నివసిస్తుంటారు. ఇప్పుడు ఉన్న ఆడవాళ్లు చిన్న పిల్లల్ని కూడా పట్టించుకుంటరా లేదో తెలియదుగాని టిక్ టాక్ లో వీడియోలు అంటే వయసుతో పని లేకుండా టైం దొరికితే టిక్ టాక్ మీద పడి వీడియోలు చేస్తుంటారు. ప్రియాంకకు కూడా టిక్ టాక్ ఓ వ్యాపకంలా మారిపోయింది. అయితే ఆమె భర్త ప్రవీణ్ అందుకు అభ్యంతరం చెప్పేవాడు. భర్త మాటను లక్ష్యపెట్టని ప్రియాంక టిక్ టాక్ లో పోస్టులు పెట్టడాన్ని కొనసాగించింది. తాను టిక్ టాక్ స్టార్ అవ్వాలని కలలుగన్న ఆమె ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంపై దృష్టి సారించింది.
దాంతో భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రమయ్యాయి. తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. భార్య తన మాట వినడంలేదని భావించిన ప్రవీణ్ బలవన్మరణం చెందాడు. దీనిపై ప్రవీణ్ తల్లిదండ్రులు బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రియాంక కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు.