కూతుళ్లను ఇంట్లో నుండి గెంటేసిన..45 ఏళ్ళ తల్లి ప్రేమ..
posted on Jul 12, 2021 @ 12:15PM
మన ఇంట్లో వండిన కోడి కూరకంటే.. పక్కింట్లో వండిన పాసిపోయిన పప్పు బాగుంది అన్నట్లు.. నేటి వ్యవస్థ తీరుకూడా అలాగే ఉంది.. ఎంతో మంది విదేశీయులు మన దేశ సంస్కృతిని గౌరవిస్తుంటే.. మనం మాత్రం తల్లి పాలు వదిలి డబ్బాపాల కోసం పరిగెత్తే పిల్లవాడిలా విదేశ సంస్కృతిని అలవర్చుకుంటున్నాం.. ప్రేమ పేరుతో ఎన్నో దారుణమైన పనులు చేస్తున్నారు చాలా మంది.. అది ప్రేమో.. కామమో అర్థం కాదు గాని మొత్తానికి ప్రేమ అనే పవిత్రమైన పదాన్ని ఎవడికి నచ్చినట్లు వాడు వాడుకుంటున్నాడు.. కవులు చూపినట్లు ప్రేమ గుడ్డిది..ప్రేమకు వయసుతో పని లేదు.. ప్రేమకు కులం, మతం అడ్డు రావు బాగానే ఉంది కానీ.. పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక కూడా వేరే 21 వయసు అబ్బాయితో పుట్టేదాని ప్రేమ అని అంటారా..? లేదా కామం అంటారా? అనే అలోచాన మీకే వదిలేస్తున్న ఒకే అసలు విషం లోకి వెళదామా మరి..
-
ఆమె పేరు ఝాన్సీ ఆమెకు పెళ్లి అయింది. ఐదుగురు ఉన్నారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అంతేకాదు అతడిపై మోజుతో తన ఐదుగురు కుమార్తెలను ఇంటిలో నుంచి గెంటేసింది.. ఆ వయసులో కూడా 21 ఏళ్ళ యువకుడితో నాలుగో వివాహానికి సిద్ధమైంది.. మొహల్లా గ్రామానికి ఝాన్సీ కి , మిథున్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇష్టంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ రెండు అయ్యాక ఇద్దరు చాలాకాలం పెద్దలోతు చూశారు.. అంటే సహజీవనం కూడా చేశారు.
అయితే, తల్లి చేసే ఈ వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి మందలిస్తూ, వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలుండగా ఇటువంటి పనులేంటని తల్లిని కుమార్తెలు నిలదీశారు. ప్రేమ పేరుతో యువకుడి మత్తులో ఉన్న ఆమె.. పిల్లలు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో.. రెండో కుమార్తెను ఏడాది క్రితమే ఇంట్లో నుంచి తరిమేసింది. ఇక, ప్రస్తుతం ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది. ఈ వివాహానికి అడ్డు చెబుతున్న నలుగురు కుమార్తెలను కూడా బయటకు పంపేసింది. తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ప్రియుడు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో చోటుచేసుకుంది.