ఏపీ ఎంపీలు పరమ వేస్ట్.. రఘురామ లేఖాస్త్రం.. మరో సమరం.. బిగ్ ఫైట్.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్ ఎంపీలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తమను గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి వ్యాపారులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్మిక సంఘాలకు సభాముఖంగా మద్దతు ప్రకటించారు. సభలో స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై ఎంపీలు ఎందుకు స్పందించరని పవన్ మండిపడ్డారు.  ---- ఎన్‌జీటీ చైర్మన్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. విశాఖ రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. వెంటనే కేసు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు.  ---------- ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నవంబర్‌ 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన జరగనుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్‌ 29న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.  -------- వ్యక్తులకు పదవి అలంకారం కాదు బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. పూర్వ విద్యార్థులు ఎదిగిన తర్వాత తమ స్కూలు గురించి మర్చిపోకుండా స్కూలు అభివృద్ధికి సహకారం అందించారన్నారు. పదవి వచ్చిన తర్వాత సమాజం గురించి మర్చిపోకుండా సేవ చేయడమే పదవికి న్యాయం చేయడమని ఆయన పేర్కొన్నారు. మనిషికి మానసిక వికాసానికి విద్య ఉపయోగపడుతుందన్నారు. --------- 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. --------- పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులైన ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధానిలను ఏలూరులో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వారి నుంచి లక్షా 50 వేలు అసలు నోట్లు, 12 లక్షల విలువైన  నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు --------- ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ  తెలంగాణ లో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల  జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన  అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి  ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లు గా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేక పోవడం తో మనస్తాపానికి లోనయ్యారు.  ----- కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసారు.  పెద్దపులి చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండంలోని  హీరాపూర్ అటవీ ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం పులిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులతో కలిసి అటవీ ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.    ------- కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భుబనేశ్వర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో  ఈ ఘటన జరిగింది. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు.కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు.  -------- తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా చనిపోయాడంటూ కొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా, ఈ వార్తలను తోసిపుచ్చుతూ మొదటిసారిగా పబ్లిక్ ముందుకు హైబతుల్లా వచ్చారంటూ తాలిబన్లు ప్రకటించారు. కాందహార్‌లోని జామియా దారుల్ అలూమ్ హకీమియా అనే ఇస్లామిస్ట్ పాఠశాలను హైబతుల్లా ఆదివారం సందర్శించారని, అక్కడ ప్రజలకు ఆయన కనిపించారని ఓ అంతర్జాతీయ మీడియాకు తాలిబన్ తెలిపింది. 

ఏపీలో ఎమ్మెల్సీ పదవులు దక్కేది వీళ్లకేనా? కేబినెట్ లోనూ ఆయనకు చోటు ఖాయమా? 

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ముగియగానే ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. శాసనమండలిలో ఖాళీల భర్తీకి  కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీలు మూడు కాగా... స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పదకొండు. అయితే ఆదివారం ఎమ్మెల్యే కోటాలోని మూడు మండలి సీట్ల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది.  నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. నవంబర్‌ 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్  17న పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్‌ 29న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్‌ నిర్వహిస్తారు.  శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ రావడంతో పెద్దల సభకు కొత్త ఎంపిక అయ్యేది ఎవరు.. ఎవరికి అవకాశం దక్కనుంది అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి ఎమ్మెల్యే కోటాలో జరగనున్న మూడు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్..ఎమ్మెల్యే కోటాలోని మూడు సీట్లతో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే మెజార్టీ సాధించటంతో ఆ 11 స్థానాలు వైసీపీనే గెలవనుంది. దీంతో  మొత్తంగా 14 స్థానాలకు లిస్ట్ దాదాపుగా ఖరారైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారు చేశారని అంటున్నారు, గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వారికి ఈ సారి ఖాయంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీలతో కొందరికి జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.   ఇందులో మొదటగా గుంటూరు జిల్లా చిలకూలురు పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఈసారి మండలి బెర్త్  ఖాయమని అంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న మర్రికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు జగన్. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం మర్రిని మంత్రిని చేస్తానని ప్రకటించారు. దీంతో  ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కాని రెండున్నర ఏండ్లు అవుతున్నా మర్రికి మాత్రం న్యాయం జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి మర్రికి ఖాయమని ప్రచారం జరగడం.. చివరకు ఆయనకు షాక్ తగలడం వస్తూ ఉంది. ఈసారి మాత్రం మర్రి రాజశేఖర్ కు సీటు ఖాయమైందని అంటున్నారు. గుంటూరు జిల్లాకే చెందిన పార్టీ సీనియర్ నేత  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రేసులో ముందున్నారని అంటున్నారు. వైసీపీ నుంచి గతంలోనూ ఎమ్మెల్సీగా చేశారు ఉమ్మారెడ్డి. మండలిలో వైసీపీఎల్పీ నేతగా  వ్యవహరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు ఎమ్మెల్సీ ఖాయమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న భరత్ కు మండలి సీటు కన్మామ్ అయిందంటున్నారు. కుప్పంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడానికి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తు్న్నారని అంటున్నారు.  పార్టీలో మొదటి నుంచి చురుకుగా పని చేసిన విశాఖపట్నం జిల్లాకు చెందిన వరుదు కళ్యాణి.. సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ ఖరారైందని సమాచారం. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంశీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ పోటీ చేశారు. వంశీ చేరిక తర్వాత నియోజకవర్గంలో రెండు వర్గాల ఆదిపత్య పోరు సాగుతోంది. దీంతో యార్గగడ్డను మండలికి పంపించి వంశీకి లైన్ క్లియర్ చేయాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు శాసనమండలి బెర్త్ ఖాయమైందని తెలుస్తోంది. ఆమంచి గత ఎన్నికల్లో చీరాలలో ఓడిపోయారు. తర్వాత ఆమంచిపై గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చిన జగన్.. ఆమంచిని శాసనమండలికి పంపించి కరణంకు చీరాలలో ఇబ్బంది రాకుండా చూస్తున్నారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన హరిప్రసాద్ రెడ్డి, అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సీనియర్ నేత వై లక్ష్మీదేవి మండలి రేసులో ముందున్నారని చెబుతున్నారు.

సీఎం గారు ఉద్యోగాలివ్వండి.. లేఖ రాసి యువకుడు సూసైడ్ 

ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ  తెలంగాణ లో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల  జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన  అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి  ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లు గా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేక పోవడం తో మనస్తాపానికి లోనయ్యారు. ఇక ఉద్యోగం రాదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ సీఎం  కేసీఆర్ కు  ఆ యువకుడు లేఖ రాశాడు. విషయం తెలుసుకున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించారు. వైద్య సిబ్బంది ని అక్కడికే పిలిచి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లినా గంటల తరబడి జాప్యం చేసే వైద్యులు, పోలీసులు గంటల్లోనే నిరుద్యోగి గ్రామానికి వెళ్లి మొత్తం పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం డ్యామేజి అవుతుందన్న ఉద్దేశ్యంతో  గోప్యంగా  ఉంచుతున్నట్టు తెలుస్తోంది.

రాజమండ్రి చేప ధర రూ. 2 లక్షల 60 వేలు.. కిచిడి చేప స్పెషల్ ఏంటో తెలుసా? 

సాధారణంగా మనం మార్కెట్ లో లభించే చేపల ధరలు వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి.  పులస చేప అయితే రూ. 4వేలు ఉంటుంది. కానీ ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన కిచిడి అనే చేప ఏకంగా రూ. 2 లక్షల 60 వేల ధర పలికింది.  తూర్పు గోదావరి జిల్లా, సకినేటిపల్లి మండలం, అంతర్వేది చేపల మార్కెట్‌లో కనిపించిన ఆ చేప చాలా స్పెషల్ అట. అందుకే దానికి అంత రేట్ పలికిందని అంటున్నారు.  మత్స్యకారుడికి దొరికిన ఆ చేప కిచిడి చేప. దానిలో  ఔషధ గుణాలుండడమే అంత ధర పలకడానికి అసలు కారణంగా తెలిసింది. అంతర్వేది సాగర సంగమం వద్ద స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లగా 21 కిలోల చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దాన్ని మార్కెట్‌లో విక్రయించగా రూ. 2 లక్షల 60వేల ధర పలికింది. ఈ చేప పొట్ట భాగాన్ని ఆపరేషన్లలో కుట్లు వేయడానికి వాడే దారం తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఆపరేషన్లలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. దీన్ని చైనాకు ఎగుమతి చేయనున్నట్లు కొనుగోలు దారులు తెలిపారు. అందుకే అంతర్వేది చేపల మార్కెట్‌లో కిచిడి చేప అధిక ధర పలికి అందరినీ ఆశ్చర్చానికి గురిచేసింది.

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఖర్చు రూ. 500 కోట్లు? 

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. పోలింగ్ సరళిని బట్టి పార్టీలు తమకు వచ్చే ఓట్లపై అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకే పట్టం కట్టాయి. హుజురాబాద్ పై ఏడు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వగా... అందులో ఆరు సంస్థలు ఈటల రాజేందరే గెలుస్తారని ప్రకటించాయి. ఒక్క సర్వేలో మాత్రం కారుకు స్వల్ప లీడ్ వచ్చింది.పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు కమలనాధులు. హుజురాబాద్ ఉప ఎన్నిక దక్షిణ భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికగా నిలిచిపోయిందని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసింది. దాదాపు మూడు నెలల నుంచే అధికార పార్టీ ప్రలోభాలకు దిగిందనే విమర్శలు ఉన్నాయి. ఈటల వెంట టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరూ వెళ్లకుండా వాళ్లకు పెద్ద మొత్తంలో నజరానాలు ఇచ్చిందనే ప్రచారం జరిగింది. ఇక పోలింగ్ మూడు రోజుల ముందే ఓటర్లకు కోట్లాది రూపాయలు పంపిణి చేసిందని తెలుస్తోంది. ఓటరుకు 6 వేల నుంచి 10 వేల రూపాయల వరకు అధికార పార్టీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత ఖర్చుకు సంబంధించి సంచలన  వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ,బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఉప ఎన్నిక కోసం కేసీఆర్ భారీగా డబ్బులు ఖర్చు పెట్టారని.. సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ఇంత భారీగా ఖర్చు చేసినా హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని కాపాడుకోవాలని భావించారన్నారు. వందలాది పోలీసుల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని.. చివరకు డ్రైవర్లు.. పీఏలను కూడా కోవర్టులుగా వాడుకొని నీచ రాజకీయాలు చేశారన్నారు. హుజూరాబాద్ పరిస్థితిని అప్రకటిత ఎమర్జెన్సీగా మార్చిన వేళ.. దీనిపై ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఓటుతో చెప్పారన్నారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమన్న ఆయన.. 'హుజూరాబాద్ ప్రజలు చరిత్రను తిరగరాశారని చెప్పారు. కేసీఆర్ కుట్రల్ని అర్థం చేసుకున్నారంూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు రాజేందర్. 

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. నవంబర్ 29న పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేసింది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే కోటా మండలి స్థానాల ఎన్నిక కోసం నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16న నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 22న ఉపసంహరణ ఉండనుంది. నవంబర్ 29న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపింది.  తెలంగాణలో జూన్ 3న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన  ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఇందులో మహ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత, నేతి విద్యాసాగర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్వేశర్లు, కడియం శ్రీహరి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.ఏపీలో  శాసనమండలి మాజీ చైర్మెన్ మహ్మద్ షరీఫ్, చిన గోవింద్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదవి కాలం ముగిసింది. అయితే కోవిడ్ కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా షెడ్యూల్ ఇచ్చింది. 

ఎస్ఐపై వైసీపీ నేతల దౌర్జన్యం! జగనన్న.. ఇదేమి రాజ్యం? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దాడులు కామన్ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార దర్పంతో వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారు. తమను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రతిపక్ష నేతలేనే కాదు.. తమకు సహకరించని ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కర్నూల్ జిల్లాలో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది.  కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. కత్తితో దాడి చేయడంతో ఎస్‌ఐ చేతికి గాయమైంది.  సీఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం వరకు కోడుమూరు ఎస్‌ఐగా పనిచేసిన వేణుగోపాల్‌ ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఇద్దరు సిబ్బందితో కలిసి వీఆర్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ మఫ్టీలో వెళ్లి గోరంట్లలో అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేశారు. మద్యం దొరక్కపోవడంతో తిరుగుముఖం పట్టారు. ఇంతలో గోరంట్ల సర్పంచ్‌ అనుచరులు ఎస్‌ఐ వాహనాన్ని బైక్‌లతో అటకాయించారు. తాము సివిల్‌ డ్రస్‌లో ఉన్న పోలీసులమని ఐడీ కార్డు చూపినా వినిపించుకోలేదు. తమ గ్రామానికే వస్తారా అంటూ నానా దుర్భాషలాడారు.  ‘ఇప్పుడే మా సర్పంచ్‌కు ఫోన్‌ చేశాం. పోలీసుల దూకుడు ఎక్కువైంది. ఒక్కరిని చంపేస్తే ఇంకెవరూ గ్రామంలోకి రావడానికి ధైర్యం చేయరు’ అని బెదిరించారు. ఇంతలో వారిలో ఒకరు ఎస్‌ఐపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఎస్‌ఐ ఎడమ చేతికి గాయమైందని సీఐ తెలిపారు.అక్కడి నుంచి వచ్చిన ఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు సర్పంచ్‌ బాలకృష్ణతోపాటు అతడి అనుచరులు ఐదుగురిపై ఐపీసీ సెక్షన్లు 341, 353, 307, 506 రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ప్రధాన నిందితుడు సర్పంచ్‌ సద్దల బాలకృష్ణను కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు.  ఈనెల 26వ తేదీ రాత్రి గోరంట్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సర్పంచ్‌ సద్దల బాలకృష్ణ అనుచరులు కావడంతో.. ఎమ్మెల్యే సుధాకర్‌పై సర్పంచ్‌ ఒత్తిడి తెచ్చి వారిని విడిపించుకున్నారని అంటున్నారు. మద్యం అక్రమార్కులను వదిలిపెట్టడంతో ఎస్‌ఐ వేణుగోపాల్‌ను వీఆర్‌కు పంపారనే చర్చ జరుగుతోంది.  

హుజురాబాద్ లో ఈవీఎంలు మార్చేశారా? బస్సు నుంచి కారులోకి వీవీ ప్యాడులు..

తెలంగాణలో రాజకీయ కాక రాజేసిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినా హీట్ మాత్రం చల్లారడం లేదు. పోలింగ్ ముగిసాకా ఈవీఎమ్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తుండగా... జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. నడిరోడ్డు పై ఓ వ్యక్తి వీవీ ప్యాడ్ లు కారులోకి మార్చిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సరైన సెక్యూర్టీ లేకుండా ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్ తరలిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈవీఎంలు భద్రపరస్తున్న కరీంనగర్ లోని ఎస్ ఆర్ఆర్ కళాశాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు వాహనాన్ని అడ్డుకున్నాయి. ఈ వీఎంను ఆర్టీసీ బస్సుల కాకుండా ప్రైవేటు బస్సులో తరలించడంపై పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డుపై వీవీ ప్యాడ్ తరలించిన వ్యక్తిని నిలదీశారు. అయితే పోలీసులే సదురు వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిందితున్ని తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీస్ పహారా లేకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా ఎలా వీవీ ప్యాడ్ లు తరలిస్తారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలను అకారణంగా ఆపారంటూ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన, విధులు నిర్వర్తించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వంద రూపాయల కోసం పాప ప్రాణం తీసిన వార్డు బాయ్! నీలోఫర్ హాస్పిటల్ లో దారుణం..

సమాజంలో మానవత్వం నశించిపోతోంది. మంచి మనసున్నవాడు కనపడకుండా పోతున్నాడు. మనుషులకు డబ్బే ప్రధానంగా మారిపోతోంది. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నాడు. సొంత మనుషులను కూడా పట్టించుకోవడం లేదు. ప్రాణాలు తీయడానికి కూడా తెగబడుతున్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుండగా.. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. వంద రూపాయల కోసం ఓ మూర్ఖుడు పసిపాప మరణానికి కారణమయ్యాడు.  హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో ఈ దారుణం జరిగింది. వంద రూపాయల కోసం పసిపాస ప్రాణం తీశాడు వార్డు బాయ్.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పాపను నీలోఫర్ లో అడ్మిట్ చేశారు. అయితే ఆక్సిజన్ పెట్టడానికి వార్డు బాయ్ వంద రూపాయలు లంచం అడిగారు. కాని పాప తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. దీంతో పాపకు అమర్చాల్సిన ఆక్సిజన్ సిలిండర్ ను డబ్బులు ఇచ్చిన మరో పాపకు అమర్చాడు. దీంతో ఆక్సిజన్ అందక పాప ప్రాణాలు కోల్పోయింది.  వార్డు బాయ్ వల్లే తమ పాప చనిపోయిందని పేరేంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఆక్సిజన్ సిలిండర్‌ను సకాలంలో అమర్చకపోవడంతో పాప చనిపోవడం  నీలో ఫర్ హాస్పిటల్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి తీవ్రంగా స్పందించారు. సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను మందలించారు. దీంతో పాప చావుకు కారణమైన వార్డు బాయ్‌ను సస్పెండ్ చేశారు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్. 

హుజురాబాద్ లో ఈటలదే విజయం.. ఎగ్జిట్ పోల్స్ లో కమల వికాసం

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ముందు నుంచి ఊహించినట్లే భారీగా పోలింగ్ జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో 84 శాతం పోలింగ్ జరగగా... ఈసారి అంతకన్నా ఎక్కువగానే పోలింగ్ జరిగింది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. పోలింగ్ సరళని బట్టి తమ గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీదే విజయమని తేలింది. ప్రముఖ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలన్నీ ఈటల వైపే ఓట్లు మొగ్గు చూపాయి. మెజార్టీ సర్వేలు ఈటల గెలుస్తాడని చెప్పగా.. ఒక సర్వే మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చింది. కొన్ని సర్వేల్లో హోరాహోరీ కనిపించింది. భారీ ఓటింగ్ ఆయనకే కలిసొచ్చినట్లు కనిపిస్తున్నది.  హుజురాబాద్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. మూర్తి ఆత్మసాక్షి గ్రూపు హైదరాబాద్ బీజేపీ 50.05 శాతం టీఆర్ఎస్ 43.01 శాతం కాంగ్రెస్ 5.7 శాతం ఇతరులు 0.7శాతం మిషన్ చైతన్య.. బీజేపీ 58.42శాతం టీఆర్ఎస్ 32.29 శాతం కాంగ్రెస్ 16.32 శాతం ఇతరులు 2.97శాతం కౌటిల్య సొల్యూషన్స్ బీజేపీ 47శాతం టీఆర్ఎస్ 40 శాతం కాంగ్రెస్ 8 శాతం ఇతరులు 5శాతం పొలిటికల్ ల్యాబొరేటరీ బీజేపీ 51శాతం టీఆర్ఎస్ 42 శాతం కాంగ్రెస్ 2నుంచి 3 శాతం విదుర రీసెర్చ్ ఏజెన్సీ నాగన్న ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 42.90 నుంచి 45.50 శాతం టీఆర్ఎస్ 45.30 నుంచి 48.9 శాతం కాంగ్రెస్ 2.25 నుంచి 4 శాతం ఇతరులు 5.51 నుంచి 6.50 శాతం

మ‌ళ్లీ స‌మైక్యాంధ్ర‌.. రాజుకుంటున్న‌ రాజ‌కీయ‌ ర‌చ్చ..

నిప్పు లేనిదే పొగ రాదు. ముందు చిన్న‌గా నిప్పు పెడ‌తారు. ఆ త‌ర్వాత పొగ బ‌య‌ట‌కు వ‌స్తుంది. దాన్ని ఊది ఊది అగ్గి రాజేస్తారు. ఆ రాజ‌కీయ‌ మంట‌లో చ‌లి కాచుకుంటారు. ఇక కుంప‌టి కార్చిచ్చులా వ్యాపిస్తుందో.. లేక‌, చ‌ప్పున చ‌ల్లారుతుందో తెలీదు కానీ.. ఆలోగా జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోతుంది. అదే రాజ‌కీయం. ఏపీ-తెలంగాణ‌లో ఇప్పుడ‌దే జ‌రుగుతోంద‌ని అంటున్నారు.  కేసీఆర్ ఓ మాట‌న్నారు. దానికి ఏపీ మంత్రి పేర్ని నాని మ‌రింత ఎగ‌దోశారు. ఆ అవ‌కాశాన్ని రేవంత్‌రెడ్డి స‌రిగ్గా అందిపుచ్చుకున్నారు. ఇక‌, కాంగ్రెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆ అగ్గి మీద గుగ్గిలం వేశారు. ఇక అంతే. స‌మైక్యాంధ్రపై రాజకీయ ర‌చ్చ మొద‌లైపోయింది. రెండు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ న‌డుస్తోంది.  "కేసీఆర్‌, జగన్‌రెడ్డి మొదటి నుంచీ కవలల్లా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆమె పాదయాత్రలో విజయమ్మ పాల్గొనడం, టీఆర్ఎస్‌ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, ఏపీలో పార్టీ పెట్టమని కోరుతున్నారంటూ కేసీఆర్‌ అనడం, ఏపీ మంత్రి పేర్ని నాని.. రెండు రాష్ట్రాలు కలిసిపోతే పోలా అనడం, ఆయన వ్యాఖ్యలను కేసీఆర్‌, టీఆర్ఎస్‌ మంత్రులు ఖండించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్‌ జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని ఆయన సొంత పార్టీ నేతలే అంటున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ అనుకుంటున్నట్లుంది. రాజ్య విస్తరణ, అక్కడి అపారమైన ఖనిజ సంపదపై కేసీఆర్‌ కన్నేసి ఉండొచ్చు’’ అని రేవంత్‌రెడ్డి చేసిన‌ ఆరోపణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. నిజ‌మేనా..? అనిపించేలా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు, జ‌రుగుతున్న విష‌యాల‌కు కాస్త పొంత‌న కుదురుతుండ‌టంతో.. తెర‌వెనుక స‌మైక్యాంధ్ర పావులు క‌దులుతున్నాయా? అనే అనుమానం బ‌ల‌ప‌డుతోంది. ఆ చ‌ర్చ‌ను మ‌రింత బ‌ల‌ప‌రిచేలా తాజాగా కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఉద్యమ సమయంలోనూ సమైక్య వాదాన్నే వినిపించా. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో నేను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ కేసీఆర్‌, పేర్ని నాని వ్యాఖ్య‌ల‌ను ఉంటంకించారు జ‌గ్గారెడ్డి.  జ‌గ‌న్ జైలుకెళ్తే.. రెండు రాష్ట్రాల‌ను క‌లిపేస్తే.. గ‌తంలో ఏపీ ఆధిప‌త్యంలో తెలంగాణ ఉన్న‌ట్టు.. ఇప్పుడు తెలంగాణ నేత‌లు ఏపీని గుప్పిట్లోకి తీసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందా? అనే చ‌ర్చ రేవంత్‌రెడ్డి మాట‌ల త‌ర్వాత మొద‌లైంది. అయితే, స‌మైక్యాంధ్ర ర‌చ్చ ఇప్పుడే మొద‌లైనా.. ముందుముందు ఇది ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందోన‌నే టెన్ష‌న్ అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. మ‌ళ్లీ తెలుగురాష్ట్రాల్లో ఉద్య‌మాలు, తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌ప్ప‌వా? ఈ రాజ‌కీయ ర‌చ్చ‌..రొచ్చుగా మారుతుందా? ఏమో...

చంద్రబాబు ఉగ్రరూపం.. రఘురామ సంచలనం.. హుజురాబాద్ ఎవరిది?.. టాప్ న్యూస్@7PM

కుప్పంకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సామగుట్టపల్లిలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హంద్రీనీవా పూర్తి చేయడం లేదన్నారు. ట్రూ అప్ చార్జీల పేరిట ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాసంపద దోచుకోవడమే తప్ప..ప్రజలపై ప్రేమ లేదని తప్పుబట్టారు.  --- సీబీఐలో ఏ ఆఫీసర్ ఎక్కడ ఉండాలో విజయసాయి చూస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సీబీఐ, ఈడీ అధికారులతో విజయసాయి నిరంతరం మంతనాలు చేస్తున్నారని చెప్పారు. సీబీఐ లాయర్‌గా సుభాష్ నియామకం వెనుక విజయసాయి పాత్ర ఉందన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో అనుకూల అధికారుల నియామకం జరిగేలా విజయసాయి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఒంటిమీద చేయి వేయకూడదన్నారు.  ------------ రాష్ట్రంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు లైన్ క్లియరైంది. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ సవాంగ్ అనుమతి ఇచ్చారు.  హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్‌ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ----- వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి వాటా లేదని తెలిపారు. వాటా ఉన్నట్లు నిరూపిస్తే గొంతు కోసుకుంటానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాటలకు విలువ లేదని చెప్పారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బుడ్డా వంశమని శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు. -- కర్నూలు జిల్లాలోని నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో రసాభసా ఏర్పడింది. పట్టణంలోని నీటి సమస్యపై చర్చించే విషయంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రోజూ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేసారు.  ------ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు,  కొనుగోలు కేంద్ర బాధ్యులు, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్య కొనుగోలును అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక సవాలుగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. --------  నాదెప్పుడు ప్రజల లైన్.. ప్రజలు బాగుండాలనే నేను కోరుకుంటా"అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మీడియాలనో సమైక్య రాష్ట్రంగా ఉండాలంటే తాను అంటే తనను తప్పుపట్టారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అందరూ అదే మాట్లాడుతున్నారన్నారు. ఇది ఎన్నికల కోసం టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ ఆడుతున్న డ్రామా అని జగ్గారెడ్డి ఆరోపించారు. ---------- జాతీయ పార్టీ అయిన బీజేపీ మతతత్వ పార్టీ అని వైఎస్సాఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల ఆరోపించారు.ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు చేసినవాళ్ళు హమాలీలుగా పని చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు.  తల ఎత్తుకొని తిరగలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అయినా సీఎం కేసీఆర్‌లో చలనం లేదన్నారు. ------- కాంగ్రెస్‌తో సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారంనాడు తోసిపుచ్చారు. మెత్రీ సంబంధాల పునరుద్ధరణకు సమయం దాటిపోయిందని ఆయన అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీని స్థాపించనున్నట్టు కెప్టెన్ ఇటీవల ప్రకటించారు. ----- ప్రజలతో రాజకీయ నేతలు సన్నిహిత సంబంధాలు ఎలా నెరపాలి? నేరుగా వారికి వద్దకే వెళ్లి కలవాలంటే ఏమి చేయాలి?. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందుకు ఒక ఉదాహరణగా నిలిచారు. గోవా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ శనివారంనాడు గోవాలో పర్యటించారు. నేరుగా మత్స్యకారులు నివసించే గ్రామానికే వెళ్లి వారిని పలకరించారు. ---- 

ఎంపీలకు మోడీ సర్కార్ మరో షాక్..ఈసారి ఏం కట్ చేశారంటే? 

ఆర్థికశాఖలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న బీజీపీ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఎయిర్ ఇండియాలో ఎంపీలకు ఫ్రీ విమాన టికెట్లను రద్దు చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ బిడ్డింగ్ లో దక్కించుకున్న  తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అప్పగించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఈ కసరత్తులో భాగంగా అన్ని బకాయిలను ముందుగానే క్లియర్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా విమాన టికెట్లను డబ్బు చెల్లించి కొనాలని కూడా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థగా ఎయిర్ ఇండియా ఉండటంతో ఎంపీలకు ఉచితంగా టికెట్ ప్రొటోకాల్ అమలయ్యేది. ఇప్పుడు ప్రైవేటు సంస్థగా  ఎయిర్ ఇండియా మారడంతో ఎంపీలు విమాన టికెట్లను ఉచితంగా పొందలేరని డబ్బులు పెట్టి కొనాలని రాజ్యసభ సచివాలయం శుక్రవారం వెల్లడించింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత టికెట్  సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజా నిర్ణయం ప్రకారం ఎంపీలు తమ డబ్బులతో టికెట్లు కొనుగోలు చేసి తర్వాత పార్లమెంటు సచివాలయానికి రీఎంబర్స్ మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి.  ఎంపీలకు మరికొన్ని కోతలు పెట్టింది మోడీ సర్కార్. కేంద్రియ విద్యాలయాల్లో ఎంపీల కోటాను కట్ చేసింది. ఇప్పటివరకు ఎంపీలకు 10 శాతం రిజర్వేన్ ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి విచక్షణతో ఎంపీలు మరిన్ని సీట్లను తీసుకునేవారు. ఇపుడు ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రం రద్దు చేసేసింది. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపేసింది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేస్తోంది. అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ రిలీజ్ ను కేంద్రం ఫ్రీజ్ చేసేసింది. పార్లమెంటు క్యాంటిన్ లో దొరికే ఆహారం ధరలు బాగా పెంచేసింది.

ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్.. హుజురాబాద్ లో గెలిచేది ఎవరంటే..!

తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడటం, పోటాపోటీగా డబ్బులు ఖర్చు చేయడంతో హుజురాబాద్ బైపోల్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. జూన్ లో మొదలైన హుజురాబాద్ రాజకీయ హీట్.. శనివారం జరిగిన పోలింగ్ తో చల్లారింది. అయితే పోలింగ్ ముగియడంతో ఇప్పుడు విజయం ఎవరిది అన్నది ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన హుజురాబాద్ పోరులో ఎవరూ గెలుస్తారన్నదానిపై వేల కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం పార్టీలను భయపెడుతోంది. పోలింగ్ సరళీని బట్టి పార్టీల తమ విజయవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.  హుజురాబాద్ ఉప ఎన్నికలో 35 మంది బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యే సాగింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతుకుంట, కమలాపూర్ మండలాలు ఉన్నాయి. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల ఓట్లు ఉండగా.. వీళ్ల కోసం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ దాదాపు 80 శాతం కావడంతో మొత్తంగా లక్షా 80 వేల వరకు ఓట్లు పోలయ్యాయి. దీంతో మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల లెక్కన తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో అంచనా వేసుకుంటున్నారు అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారన్న దానిపై పోలింగ్ రోజున తెలుగువన్ బృందం సర్వే నిర్వహించింది. ఓటర్ల నాడిని పట్టింది. ముందు నుంచి సాగినట్లే  పోలింగ్  రోజు కూడా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరాటం హోరాహోరీగానే నడిచినట్లు కనిపించింది. హుజురాబాద్ మండలంలో బీజేపీకి కొంత ఆధిక్యత వస్తుందని సర్వేలో తేలింది. హుజురాబాద్ పట్టణంలో బీజేపీకి పూర్తిగా సానుకూలత కనిపించింది. ఉద్యోగులు, విద్యావేత్తలు, యువత ఈటలకు సపోర్టుగా నిలిచారు.  హుజురాబాద్ రూరల్ మండలంలో మాత్రం రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఓవరాల్ గా హుజురాబాద్ మండలంలో బీజేపీకి లీడ్ రానుందని సర్వేలో స్పష్టమైంది. హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన జమ్మికుంట మండలంలో పోలింగ్ భారీగా నమోదైంది. జమ్మికుంట మొదటి నుంచి టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. గతంలో ఈటలకు ఇక్కడే భారీ మెజార్టీ వచ్చేంది. దీంతో ఇక్కడ ఈసారి కూడా  టీఆర్ఎస్ కు లీడ్ వస్తుందని అంతా భావించారు. కాని పోలింగ్ లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్మికుంట పట్టణంలో బీజేపీకి లీడ్ కనిపించింది. జమ్మికుంట రూరల్ లో కారుకు స్వల్ప ఆధిక్యత రావచ్చు. మొత్తంగా జమ్మికుంట మండలంలో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండే అవకాశం ఉంది. వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటలకు మంచి లీడ్ వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలం అయినప్పటికి వీణవంక మండలంలో ఈటల రాజేందర్ కు క్లియర్ మద్దతు కనిపించింది. గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్ నగర్ లోనూ ఈటలకు మద్దతు కనిపించింది. అంతేకాదు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ గెల్లు సొంతూరులోనే ఓటర్లు ఆందోళనకు దిగడం అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేసింది. ఇల్లంతకుండ మండలంలో మాత్రం టీఆర్ఎస్ కు కొంత లీడ్ వస్తుందని సర్వేలో స్పష్టమైంది.  ఇక ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపూర్ లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. కమలాపూర్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కమలానికి ఓటర్లు జైకొట్టిన పోలింగ్ రోజున తేలింది. కమలాపూర్ మండలం తమకు టఫ్ గా ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఇక్కడే ఎక్కువ ఫోకస్ చేశారు. ఓటర్లకు డబ్బులు కూడా బాగా పంపిణి చేశాయి. అయితే పోలింగ్ రోజున మాత్రం ఓటర్లు మనీ కంటే సెంటిమెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమైంది. కమలాపూర్ మండలంలో ఈటలకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలుగువన్ సర్వేలో తేలింది. పోలింగ్ సరళిని భట్టి హుజురాబాద్ ఉప సమరంలో బీజేపీ అభ్య్రర్థి ఈటల రాజేందర్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు టీఆర్ఎస్ పై 10 నుంచి 15 శాతం వరకు ఓట్ల మెజార్టీ రావచ్చొని తెలుగువన్ సర్వేలో స్పష్టమైంది.అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేసినా.. ఈటలపై ఉన్న సానుభూతి ముందు నిలవలేదని స్పష్టమైంది. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పంచిన డబ్బులు ఓటర్లకు అందలేదు. దీంతో వాళ్లంతా ఓపెన్ గానే ఈటలకు మద్దతు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ ను తిట్టుకుంటూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం కనిపించింది. పోలింగ్ సరళిని అంచనా వేసిన కమలం నేతలు సంతోషంలో ఉండగా... మధ్యాహ్నానికే కారు పార్టీ లీడర్లు ఢీలా పడిపోయారు.

థ‌ర్డ్‌వేవ్‌ అల‌ర్ట్‌.. వ్యాక్సిన్ వేసుకున్నా వైర‌స్‌.. డెల్టాకంటే డేంజ‌ర‌స్‌ వేరియంట్ AY 4.2

క‌రోనా లేదు పాడూ లేదు. ఫుల్ టూ బిందాస్‌. ఎందుకైనా మంచిద‌ని మాస్క్ ఒక్క‌టి మెడ‌కు వేలాడ‌దీస్తున్నారు. ఎవ‌రైనా తుమ్మిన‌ప్పుడు మాత్ర‌మే ముక్కు మీద‌కు మాస్క్ లాగుతున్నారు. లేదంటే లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. గుస‌గుస‌లు పెట్టుకుంటున్నారు. షేరింగ్‌లు.. చుమ్మాలు.. అంతా కామ‌న్‌. అచ్చం మామూలు రోజుల్లా.. క‌రోనా అనేదే లేద‌న్న‌ట్టుగా జీవించేస్తున్నారు జ‌నాలు. కానీ, ఓవైపు చ‌లికాలం స్టార్ట్ అవుతోంది.. మ‌రోవైపు పాజిటివ్‌ కేసుల్లో క‌ద‌లిక వ‌స్తోంది. ఇంకోవైపు కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. గ‌తంలో సెకండ్ వేవ్‌కు ముందున్న ప‌రిస్థితే ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. రానున్న‌ థ‌ర్డ్ వేవ్‌కు సింబాలిక్‌గా.. విదేశాల్లో క‌రోనా మార‌ణ‌హోమం మొద‌లైపోయింది. అమెరికా, యూర‌ప్‌, ర‌ష్యా, సింగ‌పూర్.. ప్ర‌పంచ దేశాల‌న్నీ పాజిటివ్ కేసుల‌తో బెదిరిపోతున్నాయి. డెల్టా కంటే డేంజ‌ర‌స్ వేరియంట్ ఏవై 4.2 విజృంభిస్తోంది. తాజాగా, మ‌న దేశంలోనూ అందులోనూ తెలంగాణ‌లోనూ ఏవై 4.2 కేసులు క‌నిపించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  తెలంగాణ‌లో 48 ఏళ్ల వ్య‌క్తి, 22 ఏళ్ల యువ‌తికి డెల్టా ఏవై 4.2 ర‌కానికి చెందిన క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలుస్తోంది. అయితే, వైద్య అధికారులు ఈ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచుతున్నార‌ని అంటున్నారు. ఏవై 4.2 వేరియంట్ వైర‌స్సే ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను చుట్టేస్తోంది. మూడోవేవ్‌కు ముంద‌స్తు సిద్ధం చేస్తోంది. ఏవై 4.2 అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెబుతున్నారు. డెల్టా వేరియంట్‌లోని 60 ర‌కాల్లో ఇది ఒక‌ట‌ని, ఇది డెల్టా సాధార‌ణ వేరియంట్ కంటే 15 శాతం వేగంగా విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌నేది నిపుణుల ఆందోళ‌న‌. తెలంగాణ‌తో పాటు ఏపీ, క‌ర్ణాట‌క‌లోనూ ఈ కొత్త వేరియంట్‌ వెలుగు చూసింద‌ని తెలుస్తోంది.  రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న వారికీ ఈ వైర‌స్ వ‌దిలిపెట్ట‌డం లేదంటున్నారు. వ్యాక్సిన్‌కు విరుగుడు మంత్రంతో వ‌చ్చిందీ ఏవై 4.2 వేరియంట్‌. సింగ‌పూర్‌లో అదే జ‌రుగుతోంది. ఆ దేశంలో 84శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోగా.. అందులో 14శాతం మంది బూస్టర్ డోస్‌లు కూడా పూర్తి చేసుకున్నారు. అయినా సింగ‌పూర్‌లో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా ఒక్క‌రోజులోనే నాలుగువేలకు పైగా కొత్త‌ కేసులు నమోదవ‌గా.. 16 మంది కొవిడ్‌తో చ‌నిపోయారు. ఇక‌, ర‌ష్యాలో కొత్త వేరియంట్ బీభ‌త్సం మామూలుగా లేదు. రోజూ ల‌క్ష‌లాది కేసులు వ‌స్తుండ‌టం.. అందులో చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న‌వారే కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏవై 4.2 వేరియంట్ వ్యాక్సిన్‌ను త‌ట్టుకొని మ‌రీ విస్త‌రిస్తుండ‌టం.. పొంచిఉన్న మూడో వేవ్ ముప్పుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. అందుకే, భార‌తీయులారా.. బీ కేర్‌ఫుల్‌.. క‌రోనా ఎక్క‌డికీ పోలేదు.. మ‌న మ‌ధ్య‌నే పొంచి ఉండి.. మ‌రింత ప‌దునుగా రాటుదేలుతోంది. సో, మాస్కులు, సోష‌ల్ డిస్టెన్స్ మ‌రిచిపోవ‌ద్దు. జాగ్ర‌త్తే క‌రోనా నుంచి ర‌క్ష‌. లేదంటే.. అస‌లే శీతాకాలం.. ఎప్పుడైనా క‌రోనా కుమ్మేయ వ‌చ్చు.. థ‌ర్డ్ వేవ్ చుట్టేయ వ‌చ్చు..

భార‌త్‌కు పాక్ మ‌రో షాక్‌.. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబ‌ర్‌..

బాబ‌ర్ అజామ్‌. పాకిస్తాన్ కెప్టెన్‌. ఈ పేరు అంద‌రికంటే ఇండియన్స్‌కే ఎక్కువ గుర్తుంటుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన ఘ‌నుడు. వాడు మామూలుగా ఆడ‌టం లేదు. ర‌న్స్‌తో పాటు రికార్డ్సూ కొల్ల‌గొడుతున్నారు. వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా, భార‌త్‌కు మ‌రో షాక్ ఇచ్చాడు ఈ పాక్ కెప్టెన్‌. టీమిండియా సూప‌ర్ స్టార్ కోహ్లీ రికార్డుతో పాటు భార‌తీయుల గుండెల‌నూ బ్రేక్ చేశాడు బాబ‌ర్‌. తాజాగా, ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచి.. గ్రూప్-2 లో వరుసగా మూడు విక్ట‌రీల‌తో దూసుకుపోతోంది. ఆ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 51 పరుగులు పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆట‌గాడిగా నిలిచాడు. కోహ్లీని దాటేశాడు. 26 ఇన్నింగ్స్‌ల‌తో బాబ‌ర్ 1000 ర‌న్స్ కంప్లీట్ చేశాడు. దీంతో 30 ఇన్నింగ్స్‌లో వెయ్యి ప‌రుగుల‌తో కోహ్లీ పేరున ఉన్న రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టాడు బాబ‌ర్‌.  ఇక‌, కోహ్లీ త‌ర్వాత స్థానంలో.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ (31 ఇన్నింగ్సుల్లో), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (32 ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36 ఇన్నింగ్సుల్లో) నిలిచారు.  అటు.. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా టీ20ల్లో రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ర‌షీద్‌ఖాన్ త‌ర్వాతి పొజిష‌న్లో.. శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగపై 76 (ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82 ఇన్నింగ్సుల్లో), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ (83 ఇన్నింగ్సుల్లో) ఉన్నారు. ఇక‌, రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. వ‌న్డేల్లో 44 ఇన్నింగ్సుల్లోనే ర‌షీద్‌ ఈ రికార్డు నెలకొల్పాడు.   ఇలా, బ్యాటింగ్‌లో పాకిస్తాన్ నుంచి బాబ‌ర్‌.. బౌలింగ్‌లో అఫ్ఘ‌నిస్తాన్ త‌ర‌ఫున ర‌షీద్‌ఖాన్‌.. ఇలా అండ‌ర్ డాగ్ టీమ్‌లుగా ప‌రిగ‌ణించే జ‌ట్ల నుంచి ఇలా ప్ర‌పంచ అత్యుత్త‌మ ఆట‌గాళ్లు ఉండ‌టం విశేషం.   

బిగ్ బ్రేకింగ్ : ఈటల రాజేందర్ వాహనాలు సీజ్.. పీఆర్వో అరెస్ట్

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడుతున్నారు. డబ్బులు పంచుతున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించుకుంటున్నారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పోలీసులు షాకిచ్చారు.హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసి, పీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అంతకుముందు  ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పదుల సంఖ్యలో కార్యకర్తలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నారని ఆరోపించింది.   

జ‌గ‌న్ ఆట‌క‌ట్టిస్తా.. ప్ర‌భుత్వంపై తిరుగుబాటుకు చంద్ర‌బాబు పిలుపు..

వైసీపీ నాయ‌కుల ఆట‌క‌ట్టిస్తానంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమను హస్తగతం చేసుకొని వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని మండిప‌డ్డారు చంద్ర‌బాబు.  సొంత నియోజకవర్గమైన‌ కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన జోరుగా కొన‌సాగుతోంది. తొలుత లక్ష్మీపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించి.. అక్కడి నుంచి వరదరాజస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మ‌ధ్య‌లో స్థానికుల‌తో క‌లిసి మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ప్ర‌భుత్వ పాల‌నా తీరుపై టీడీపీ అధినేత‌కు ఫిర్యాదులు చేశారు స్థానిక ప్ర‌జ‌లు.  అనంత‌రం భారీ ర్యాలీ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. వైసీపీ పాలనలో రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయింద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరెంటు ఛార్జీలు.. ఆర్టీసీ ఛార్జీలు.. ప‌థ‌కాల్లో కోత విధిస్తోంద‌ని చంద్రబాబు మండిపడ్డారు.  

జ‌గ‌న్‌కు సీబీఐకు ఒకే లాయ‌ర్‌.. డైరెక్టర్‌కు రఘురామ ఫిర్యాదు..

అరాచకాలకు కేరాఫ్ వైసీపీ సర్కార్ అనే విమర్శ ఉంది. జగన్‌రెడ్డి ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌తీ నిర్ణ‌య‌మూ వివాదాస్ప‌దం అవుతోంది. అస‌లు జ‌గ‌న్‌కు రాష్ట్రాన్ని పాలించే హ‌క్కే లేదంటూ.. బెయిల్‌పై బ‌య‌ట ఉంటున్న ముఖ్య‌మంత్రిని మ‌ళ్లీ జైలుకే త‌ర‌లించాలంటూ ఎంపీ ర‌ఘురామ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్న‌ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా సాయ‌ప‌డుతున్న‌ సీబీఐ తీరును త‌ప్పుబ‌డుతున్నారు ర‌ఘురామ‌. జ‌గ‌న్‌-సీబీఐ స‌హ‌కారంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గానే.. మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. జ‌గ‌న్‌రెడ్డి-వైసీపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కేసులు వాదించే న్యాయ‌వాది పి.సుభాష్‌ను.. సీబీఐ సైతం త‌మ లాయ‌ర్‌గా నియ‌మించుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సీబీఐ తీరును ఎంపీ ర‌ఘురామ తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ఆ నిర్ణ‌యంపై నేరుగా సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాశారు.  జగన్మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడాన్ని త‌ప్పుబ‌డుతూ సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాశారు ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు. న్యాయవాది పి.సుభాష్... జగన్ అక్రమాస్తుల కేసులను వాదించారని తెలిపారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య, డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి సహా, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించడంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోందన్నారు. ఇలాంటి విచారణ నేపథ్యంలో సీబీఐ తరపున పి.సుభాష్‌ను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోందన్నారు ర‌ఘురామ‌.  న్యాయమూర్తులపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షణ చేయమని హైకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరపున పని చేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని లేఖ‌లో డిమాండ్ చేశారు ర‌ఘురామ‌.