భారత్‌కు పాక్ మరో షాక్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్..
posted on Oct 30, 2021 @ 4:10PM
బాబర్ అజామ్. పాకిస్తాన్ కెప్టెన్. ఈ పేరు అందరికంటే ఇండియన్స్‌కే ఎక్కువ గుర్తుంటుంది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన ఘనుడు. వాడు మామూలుగా ఆడటం లేదు. రన్స్‌తో పాటు రికార్డ్సూ కొల్లగొడుతున్నారు. వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా, భారత్‌కు మరో షాక్ ఇచ్చాడు ఈ పాక్ కెప్టెన్. టీమిండియా సూపర్ స్టార్ కోహ్లీ రికార్డుతో పాటు భారతీయుల గుండెలనూ బ్రేక్ చేశాడు బాబర్.
తాజాగా, ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచి.. గ్రూప్-2 లో వరుసగా మూడు విక్టరీలతో దూసుకుపోతోంది. ఆ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 51 పరుగులు పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీని దాటేశాడు. 26 ఇన్నింగ్స్‌లతో బాబర్ 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. దీంతో 30 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులతో కోహ్లీ పేరున ఉన్న రికార్డ్ బద్దలు కొట్టాడు బాబర్.
ఇక, కోహ్లీ తర్వాత స్థానంలో.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ (31 ఇన్నింగ్సుల్లో), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (32 ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36 ఇన్నింగ్సుల్లో) నిలిచారు.
అటు.. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా టీ20ల్లో రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రషీద్‌ఖాన్ తర్వాతి పొజిషన్లో.. శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగపై 76 (ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82 ఇన్నింగ్సుల్లో), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ (83 ఇన్నింగ్సుల్లో) ఉన్నారు. ఇక, రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 44 ఇన్నింగ్సుల్లోనే రషీద్ ఈ రికార్డు నెలకొల్పాడు.
ఇలా, బ్యాటింగ్‌లో పాకిస్తాన్ నుంచి బాబర్.. బౌలింగ్‌లో అఫ్ఘనిస్తాన్ తరఫున రషీద్‌ఖాన్.. ఇలా అండర్ డాగ్ టీమ్‌లుగా పరిగణించే జట్ల నుంచి ఇలా ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు ఉండటం విశేషం.