చంద్రబాబు ఉగ్రరూపం.. రఘురామ సంచలనం.. హుజురాబాద్ ఎవరిది?.. టాప్ న్యూస్@7PM
posted on Oct 30, 2021 @ 7:13PM
కుప్పంకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సామగుట్టపల్లిలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హంద్రీనీవా పూర్తి చేయడం లేదన్నారు. ట్రూ అప్ చార్జీల పేరిట ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాసంపద దోచుకోవడమే తప్ప..ప్రజలపై ప్రేమ లేదని తప్పుబట్టారు.
---
సీబీఐలో ఏ ఆఫీసర్ ఎక్కడ ఉండాలో విజయసాయి చూస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సీబీఐ, ఈడీ అధికారులతో విజయసాయి నిరంతరం మంతనాలు చేస్తున్నారని చెప్పారు. సీబీఐ లాయర్‌గా సుభాష్ నియామకం వెనుక విజయసాయి పాత్ర ఉందన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో అనుకూల అధికారుల నియామకం జరిగేలా విజయసాయి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఒంటిమీద చేయి వేయకూడదన్నారు.
------------
రాష్ట్రంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు లైన్ క్లియరైంది. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ సవాంగ్ అనుమతి ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
-----
వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి వాటా లేదని తెలిపారు. వాటా ఉన్నట్లు నిరూపిస్తే గొంతు కోసుకుంటానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాటలకు విలువ లేదని చెప్పారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బుడ్డా వంశమని శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు.
--
కర్నూలు జిల్లాలోని నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో రసాభసా ఏర్పడింది. పట్టణంలోని నీటి సమస్యపై చర్చించే విషయంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రోజూ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేసారు.
------
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కొనుగోలు కేంద్ర బాధ్యులు, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్య కొనుగోలును అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక సవాలుగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
--------
నాదెప్పుడు ప్రజల లైన్.. ప్రజలు బాగుండాలనే నేను కోరుకుంటా"అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మీడియాలనో సమైక్య రాష్ట్రంగా ఉండాలంటే తాను అంటే తనను తప్పుపట్టారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అందరూ అదే మాట్లాడుతున్నారన్నారు. ఇది ఎన్నికల కోసం టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ ఆడుతున్న డ్రామా అని జగ్గారెడ్డి ఆరోపించారు.
----------
జాతీయ పార్టీ అయిన బీజేపీ మతతత్వ పార్టీ అని వైఎస్సాఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల ఆరోపించారు.ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు చేసినవాళ్ళు హమాలీలుగా పని చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. తల ఎత్తుకొని తిరగలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అయినా సీఎం కేసీఆర్‌లో చలనం లేదన్నారు.
-------
కాంగ్రెస్‌తో సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారంనాడు తోసిపుచ్చారు. మెత్రీ సంబంధాల పునరుద్ధరణకు సమయం దాటిపోయిందని ఆయన అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీని స్థాపించనున్నట్టు కెప్టెన్ ఇటీవల ప్రకటించారు.
-----
ప్రజలతో రాజకీయ నేతలు సన్నిహిత సంబంధాలు ఎలా నెరపాలి? నేరుగా వారికి వద్దకే వెళ్లి కలవాలంటే ఏమి చేయాలి?. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందుకు ఒక ఉదాహరణగా నిలిచారు. గోవా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ శనివారంనాడు గోవాలో పర్యటించారు. నేరుగా మత్స్యకారులు నివసించే గ్రామానికే వెళ్లి వారిని పలకరించారు.
----