హుజురాబాద్ లో ఈటలదే విజయం.. ఎగ్జిట్ పోల్స్ లో కమల వికాసం
posted on Oct 30, 2021 @ 9:56PM
తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ముందు నుంచి ఊహించినట్లే భారీగా పోలింగ్ జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో 84 శాతం పోలింగ్ జరగగా... ఈసారి అంతకన్నా ఎక్కువగానే పోలింగ్ జరిగింది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. పోలింగ్ సరళని బట్టి తమ గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీదే విజయమని తేలింది. ప్రముఖ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలన్నీ ఈటల వైపే ఓట్లు మొగ్గు చూపాయి. మెజార్టీ సర్వేలు ఈటల గెలుస్తాడని చెప్పగా.. ఒక సర్వే మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చింది. కొన్ని సర్వేల్లో హోరాహోరీ కనిపించింది. భారీ ఓటింగ్ ఆయనకే కలిసొచ్చినట్లు కనిపిస్తున్నది.
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
మూర్తి ఆత్మసాక్షి గ్రూపు హైదరాబాద్
బీజేపీ 50.05 శాతం
టీఆర్ఎస్ 43.01 శాతం
కాంగ్రెస్ 5.7 శాతం
ఇతరులు 0.7శాతం
మిషన్ చైతన్య..
బీజేపీ 58.42శాతం
టీఆర్ఎస్ 32.29 శాతం
కాంగ్రెస్ 16.32 శాతం
ఇతరులు 2.97శాతం
కౌటిల్య సొల్యూషన్స్
బీజేపీ 47శాతం
టీఆర్ఎస్ 40 శాతం
కాంగ్రెస్ 8 శాతం
ఇతరులు 5శాతం
పొలిటికల్ ల్యాబొరేటరీ
బీజేపీ 51శాతం
టీఆర్ఎస్ 42 శాతం
కాంగ్రెస్ 2నుంచి 3 శాతం
విదుర రీసెర్చ్ ఏజెన్సీ
నాగన్న ఎగ్జిట్ పోల్స్
బీజేపీ 42.90 నుంచి 45.50 శాతం
టీఆర్ఎస్ 45.30 నుంచి 48.9 శాతం
కాంగ్రెస్ 2.25 నుంచి 4 శాతం
ఇతరులు 5.51 నుంచి 6.50 శాతం