మీడియాతో యోగి డివైడ్ పాలిటిక్స్‌!.. విభ‌జించి ప్ర‌క‌ట‌న‌లిచ్చి..! 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. యూపీలో నరేంద్ర మోడీ పర్యటన రెండ్రోజుల పాటు కొనసాగనుంది. వారణాసి విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో బయలుదేరిన మోడీపై వారణాసి ప్రజలు గులాబీ పూలు జల్లుతూ, ''మోదీ మోదీ, హర్ హర్ మహదేవ్' నినాదాలు హోరెత్తించారు.  ఇక మోడీ పర్యటనకు యోగీ ఆధిత్యనాథ్ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాని పర్యటన సీఎం యోగీకి అత్యంత కీలకంగా మారింది. అందుకే గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో ప్రధాని మోడీ పర్యటనకు ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ప్రధాని పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వారణాసి మొత్తం మోడీ ఫోటోలతో నింపేసింది. ప్రధాని పర్యటనపై మీడియాలో జోరుగా ప్రచారం చేసింది. ఉత్తరాధికి సంబంధించిన అన్ని పత్రికలకు ఫుల్ పేజీ యాడ్ ఇచ్చింది యోగీ సర్కార్.  ఉత్తరాదిలో ప్రచురితమయ్యే పెద్ద, చిన్నా చితకా అన్ని పేపర్లలో యూపీ సర్కార్ యాడ్ వచ్చింది. కానీ దక్షిణాది మీడియా విష‌యంలో ప‌క్ష‌పాత వైఖ‌రి అవ‌లంభించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ద‌క్షిణాదిలోని ఏ రీజ‌న‌ల్ లాంగ్వేజ్ పేప‌ర్‌కు గానీ, టీవీ ఛానెల్‌కు గానీ యూపీ స‌ర్కార్ త‌ర‌ఫున యాడ్ ఇవ్వ‌లేదు. తెలుగు పేప‌ర్ల‌లో ఆ ఊసే లేదు. కానీ... సౌత్ ఇండియా సెంట‌ర్‌గా ప్ర‌చురిత‌మ‌య్యే ఇంగ్లీష్ పేప‌ర్ల‌తో మాత్రం యూపీ స‌ర్కారు డ‌బుల్ గేమ్ అడిందంటున్నారు.  మోదీకి స్వాగ‌తం ప‌లుకుతు హైదరాబాద్ కేంద్రంగా వచ్చే ఓ ఇంగ్లీష్ పేపర్లో యోగి స‌ర్కారు ఇచ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌చురిత‌మైంది. అదే, మ‌రో ప్ర‌ముఖ ఇంగ్లీష్ పేప‌ర్‌ లో మాత్రం యోగి యాడ్ లేదు. ఆ ప‌త్రిక‌కు ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు. ఇదే ఇప్పుడు విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఇస్తే.. అన్ని పేపర్లకు యాడ్ ఇవ్వాలి కానీ.. ఒక పేప‌ర్‌కు ఇచ్చి ఇంకో పేప‌ర్‌కు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం. ఇది పూర్తిగా ప‌క్ష‌పాత‌పూరితం.. అంటూ మీడియా వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. యూపీ స‌ర్కారు తీరును నిల‌దీస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు.. తమ పథకాలకు సంబంధించిన యాడ్స్ ను ఉత్తరాజి పేపర్లకు కూడా ఇస్తాయి. జాతీయ‌ స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. అలానే, యోగీ సర్కార్ సైతం భారీ ఖ‌ర్చుతో పేప‌ర్ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. కానీ, ఆ ప్ర‌క‌ట‌న‌లు ఉత్త‌రాదికే ప‌రిమితం చేసింది. ద‌క్షిణాది ఇంగ్లీష్ పేప‌ర్ల‌లో కొన్నిటికి ఇచ్చి.. మ‌రికొన్నిటికి యాడ్ ఇవ్వ‌క‌పోవ‌డం ముమ్మాటికీ త‌ప్పే అంటున్నారు. దీనిపై ప్రెస్‌క్ల‌బ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు మీడియా ప్ర‌ముఖులు.

జ‌గ‌న్‌పై మ‌రో కోడిక‌త్తి దాడి? అబ్బాయ్.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో!

ఆశ్చ‌ర్యం. సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై దాడికి కుట్ర జ‌రుగుతోంద‌ట‌. ముఖ్య‌మంత్రి ప్రాణాల‌కు హాని పొంచిఉంద‌ట‌. ఈ మాట అంటున్న‌ది మ‌రెవ‌రో కాదు.. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి. స‌ర్లే.. ఆయ‌నేదో ఎమోష‌న‌ల్‌గా అలా అన్నార‌నుకున్నా.. ఆ వెంట‌నే ఏకంగా డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి సైతం జ‌గ‌న్‌రెడ్డి ప్రాణాల‌కు హాని త‌ల‌పెట్టొచ్చ‌ని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌రుస‌బెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో అంతా ఒక్క‌సారిగా ఉలిక్క‌ప‌డుతున్నారు. ఇంత‌కీ అస‌లేం జ‌రుగుతోంది? నిజంగానే ముఖ్య‌మంత్రి ప్రాణాల‌కు ముప్పు దాగుందా?  వైసీపీ నాయ‌కుల ఆందోళ‌న‌కు రీజ‌నుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.  ముఖ్య‌మంత్రికి హానీ త‌ల‌పెట్ట‌డం అంటే మాట‌లా? జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌తో.. ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే భారీ కాన్వాయ్‌లు.. బుల్లెట్ ఫ్రూఫ్ వాహ‌నాలు.. కాలు కింద‌పెట్ట‌గానే ముందూవెన‌కా ర‌క్ష‌ణ గోడ‌లా నిలిచే ట్రైన్డ్‌, ఆర్మ్డ్‌ బాడీగార్డ్స్.. ఇంత‌టి టైట్ సెక్యూరిటీ ఉన్న సీఎం జ‌గ‌న్‌పై అటాక్ చేయ‌డమంటే మామూలు విష‌య‌మా? మ‌రి, వైసీపీ నేత‌లు ఎందుకంత ఆందోళ‌న చెందుతున్న‌ట్టు? జ‌గన్‌పై దాడి జ‌రుగుతుందేమోన‌ని ఎందుకు అనుమానిస్తున్న‌ట్టు? అయినా, ఏపీలో దాడుల సంస్కృతి ఎవ‌రిదో అంద‌రికీ తెలిసిందే. టీడీపీ సాధు జంతువులాంటి పార్టీ. చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేసినా.. మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినా.. స‌భ‌లో చంద్ర‌బాబు భార్య‌పై అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేసినా.. అధినేత దీక్ష‌లు, క‌న్నీరు కార్చారే కానీ.. ఎదురుదాడి చేయ‌లేదు. అలాంటి క‌ల్చ‌ర్ టీడీపీకి లేనే లేదు. ఇక‌, జ‌న‌సేన త‌మ‌కు జ‌గ‌న్‌తో శ‌త్రుత్వం లేద‌ని.. ఆయ‌న విధానాల‌పై మాత్ర‌మే త‌మ పోరాట‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దే ప‌దే స్ప‌ష్టం చేస్తున్నారు. ఇక బీజేపీ ఎలాగూ మిత్ర‌ప‌క్షంలాంటి పార్టీనే. క‌మ్యూనిస్టుల‌కు పెద్ద‌గా ఉనికే లేక‌పాయే. ఇక ముఖ్య‌మంత్రిపై జ‌గ‌న్‌రెడ్డిపై దాడులు చేసేది ఎవ‌రు?  జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌పై విశాఖ విమానాశ్ర‌యం లాబీలో కోడిక‌త్తి దాడి జ‌రిగింది. ఆ దాడి చేసింది కూడా వైసీపీ వ‌ర్గీయుడేనని, సానుభూతి కోస‌మే కోడిక‌త్తి దాడి డ్రామా న‌డిచింద‌నే విమర్శలు ఉన్నాయి. ఇక‌, జ‌గ‌న్‌రెడ్డి సీఎం అయ్యాక‌.. సొంత బాబాయ్ వివేకానంద‌రెడ్డిపై ఆయ‌న ఇంట్లోనే గొడ్డ‌లితో దాడి జ‌రిగింది. దారుణంగా న‌రికి చంప‌బ‌డ్డారు. ముఖ్య‌మంత్రి బాబాయ్‌నే అంత దారునంగా హత్య చేసినా.. ఇప్ప‌టికీ ఆ కేసు మిస్ట‌రీ వీడ‌నేలేదు. సీబీఐ ద‌ర్యాప్తు ఆసాంతం వైసీపీ నాయ‌కుల చుట్టూనే తిరుగుతోంది. జ‌గ‌న్ స‌న్నిహితుల వైపే అనుమానాల‌న్నీ ముసురుతున్నాయి. ఇలా అబ్బాయ్‌పై కోడిక‌త్తి అటాక్‌ అయినా.. బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు అయినా.. అదంతా వైసీపీ యాక్ష‌నే అంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు లేటెస్ట్‌గా.. సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై దాడికి కుట్ర జ‌రుగుతోందంటూ డిప్యూటీ సీఎం స్థాయి వ్య‌క్తే ఆరోపించ‌డం మామూలు విష‌య‌మా? అదే నిజ‌మైతే.. ప్ర‌తిప‌క్షాలు అలా దాడి చేసే ర‌కం కాదంటున్నారు. మ‌రి, జ‌గ‌న్‌పై దాడి చేసే అవ‌స‌రం ఎవ‌రికి ఉంటుంది? ఉద్యోగులకా? ఓటీఎస్ బాధితులకా?  తాగ‌లేక మింగ‌లేక నిత్యం బాధ‌ప‌డుతున్న‌ మ‌ద్యం బాధితులా? ఉద్యోగాలు లేక ఆవేశంతో ర‌గిలిపోతున్న నిరుద్యోగ యువ‌తా?  పెరిగిన ప‌న్నులు క‌ట్ట‌లేని పేద‌లా? ఇసుక కొర‌త‌తో ఉపాధి దొర‌క‌ని దిన‌స‌రి కూలీలా? అఘాయిత్యాల‌ను అడ్డుకోలేక‌పోతున్నందుకు మ‌హిళ‌లా? ఇంత‌కీ వైసీపీ నేత‌లు అనుమానిస్తున్న‌ట్టు.. జ‌గ‌న్‌రెడ్డిపై దాడి చేసేది ఎవ‌రు? అనేది ఆస‌క్తిక‌రం.  వైసీపీ నేత‌ల కామెంట్ల‌పై తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిన్న తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి, నేడు ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి గారూ జ‌గ‌న్ రెడ్డి ప్రాణాల‌కు హానిత‌ల‌పెట్టొచ్చ‌ని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం.. మ‌రో కోడిక‌త్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డ‌లివేటు రిహార్స‌ల్లాగా అనిపిస్తోంది. ఓవైపు అప్పుల‌కుప్ప‌, మ‌రోవైపు తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త‌తో.. మ‌ళ్లీ కోడిక‌త్తికి సాన‌బెడుతూ, గొడ్డ‌లికి దారుబెడుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అబ్బాయ్ గారు.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో! తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దుర్మార్గుడికి దూరంగా ఉంటున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చెబుతోంది. బురద రాజకీయంమాని 'హూ కిల్డ్ బాబాయ్' అనే ప్రశ్నకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  అయ్య‌న్న పాత్రుడు అంటున్న‌ట్టు.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అప్పుల కుప్ప‌లు, ప్ర‌జా వ్య‌తిరేక‌త నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు.. జ‌గ‌న్‌రెడ్డిపై మ‌రో కోడిక‌త్తి దాడి జ‌రుగుతుందా? లేక‌, వివేకా మాదిరే.. జ‌గ‌న్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను మ‌రోసారి టార్గెట్ చేస్తారా? ఇంత‌కీ వైసీపీ నాయ‌కులు ప్ర‌కాశ్‌రెడ్డి, నారాయ‌ణ‌స్వామిల వ్యాఖ్య‌ల ప‌ర‌మార్థం ఏంటి? వారి అనుమానం ఎవ‌రిపైన‌..? అంటూ చ‌ర్చించుకుంటున్నారు ఏపీ ప్ర‌జ‌లు.

అలా కుదరదంతే! జగన్ సర్కార్ కు మరో షాక్.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్ధించింది.  గతంలో ప్రైవేట్ యాజమాన్యాల తరపున తల్లుల ఖాతాలో నిధుల జమపై కృష్ణదేవరాయ వర్సిటీ అసోసియేషన్ సవాల్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీనిపై ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్‌లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. యాజమాన్యాల తరపున ముతుకుమిల్లి శ్రీవిజయ్, సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటీ? ఎప్పుడు పెడతారు? కేసు తీవ్రత పెరుగుతుందా? 

ఏబిన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల సందర్భంలో విధులకు ఆటంకం కలిగించారంటూ రాధాకృష్ణపై కేసులు పెట్టారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ హాట్ హాట్ గా మారింది. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దాని వల్ల లాభం ఏంటి? కేసు తీవ్రత పెరుగుతుందా? బాధితులకు ప్రయోజనమా.. నష్టమా? అన్న చర్చ సాగుతోంది.  ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే.. ఆ సమయమానికి తమకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళుతుంటారు.. అయితే  కొన్ని సార్లు వారికి చేదు అనుభవం ఎదురవుతుంటుంది. ఇది మా పరిధిలోకి రాదు అని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు. మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లండి అని ఉచిత సలహా ఇస్తుంటారు. దీంతో బాధితులు తమ నివాసం ఏ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, ఫిర్యాదు చేసే లోపు ఘోరాలు జరిగిపోతుంటాయి. ప్రాణాలు పోతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని గతంలో ఉత్తరప్రదేశ్, కర్నాటక హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఇది అన్ని రాష్ట్రాల పోలీసు మాన్యువల్‌లోనూ ఉంది. అయినా ఎక్కడా అమలు కాలేదు. అయితే హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటన తర్వాత పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే  ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జీరో ఎఫ్ఐఆర్ ని తెరపైకి తెచ్చారు.  జీరో ఎఫ్ఐఆర్ అంటే.. * పోలీస్ స్టేషన్‌ పరిధితో నిమిత్తం లేకుండా తమకు సమీపంలో ఉండే ఏ పోలీస్ స్టేషన్‌కైనా బాదితులు సాయం కోసం వెళ్లొచ్చు.  * అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకుని సంబంధిత స్టేషన్‌కు సమాచారం అందజేయాలి.  * తక్షణమే బాధితులకు తగిన సాయం అందజేయాలి.  * పోలీస్ స్టేషన్లలో ప్రతి ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ వరుస నంబర్లతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తుంటారు.  * జీరో ఎఫ్‌ఐఆర్‌లో నంబర్‌ ఇవ్వకుండానే కేసు నమోదు చేస్తారు. దిశ ఘటన తర్వాత ఆయా కేసుల ప్రాధాన్యం, తీవ్రతను బట్టి పరిధులతో సంబంధం లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని పరిధుల పేరుతో తిరస్కరించకుండా.. కేసు పెట్టదగిన తీవ్రమైన నేరాలకు సంబంధించి తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ప్రతి పౌరుడు జీరో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకోవాలి. అవగాహన ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు.. మా పరిధిలోకి రాదు అని పోలీసులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ సమయంలో జీరో ఎఫ్ఐఆర్ గురించి చెబితే.. ఇక పోలీసులు తప్పించుకోలేరు. కచ్చితంగా ఫిర్యాదు తీసుకోవాల్సిందే, విచారణ చేపట్టాల్సిందే.  జీరో ఎఫ్ఐఆర్ వల్ల అంత ఉపయోగం ఉంటుందా? పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం 2013లో ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్టును ప్రవేశపెట్టారు. సాధారణంగా పోలీసుల కేసులు అన్నిటికీ ఎఫ్ఐఆర్ నంబరు ఉంటుంది. కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేప్పుడు ఆ నంబర్ ఇవ్వకుండా సున్నా నంబర్ ఇస్తారు. తరువాత దాన్ని సంబంధిత స్టేషన్‌కి బదిలీ చేశాక, ఆ రెండవ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నంబరు ఇస్తారు. ముందుగా జీరో నంబర్‌తో నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అంతేకాదు నంబర్ జీరో ఇచ్చారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ విలువ ఏ మాత్రం తగ్గదు. ఆ నివేదిక విలువ, చట్టపరమైన ప్రక్రియ అంతా మామూలే. అంటే నంబర్ తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జీరో ఎఫ్ఐఆర్ మామూలు ఎఫ్‌ఐఆర్‌తో సమానమే. ఈ విధానం వల్ల ప్రజలకు సరైన పోలీస్ స్టేషన్ తెలుసుకునే బాధ మాత్రమే తప్పుతుంది. అలాగే స్టేషన్‌కి వచ్చిన ఎవర్నీ పోలీసులు వెనక్కు, వేరే స్టేషన్‌కి పంపడానికి వీలుండదు. ఏ కేసులో అయితే కోర్టు అనుమతి లేకపోయినా పోలీసు వారు నేరుగా అరెస్టు చేయవచ్చో దాన్ని కాగ్నిజబుల్ కేసులు అంటారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిధితో, ఫిర్యాదుదారు ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది.బాధితులు, కుటుంబ సభ్యులు, సాక్షులు, నేరస్తులు, పోలీసులు, జడ్జీల ఆదేశాలు, లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దాని ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే.ఒక్క మాటలో చెప్పాలంటే నేరం జరిగిన ప్రాంత పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కేసు పెట్టగలగడమే జీరో ఎఫ్ఐఆర్. దానికి మగ, ఆడ సంబంధం లేదు. అందరికీ వర్తిస్తుంది. కర్ణాటక హైకోర్టు 2019 సెప్టెంబరు 19న ఒక రిట్ పిటిషన్ విషయంలో జీరో ఎఫ్ఐఆర్ కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. తన ఉత్తర్వుల్లో భాగంగా, జీరో ఎఫ్ఐఆర్ గురించి 2014 ఫిబ్రవరి 6న కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ అధికారి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నేరం గురించి తెలిసిన వెంటనే కేసు కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ చెప్పింది. దానికంటే ముందే 2013 నవంబరులో సుప్రీంకోర్టు లలిత కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసుల శిక్షణలో కూడా జీరో ఎఫ్ఐఆర్ గురించి చేర్చాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల డీజీపీలనూ ఆదేశించింది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలకూ కేంద్ర హోంశాఖ 2015 అక్టోబర్ 12న ఒక లేఖ రాసింది. ఒకవేళ ఎవరైనా పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ రాయడానికి తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్ 166 ఏ కింద ఏడాది శిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం ఫిర్యాదు చేసే వాళ్లు నోటితో చెప్పిన వివరాలు కూడా పోలీసుల రాసుకుని, కింద సంతకం తీసుకోవాలి. అలాగే ఒక కాపీ ఉచితంగా అందివ్వాలి. రిజిస్టర్లో సంతకం పెట్టాలి. ఇలా జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదయిన సంచలన కేసులు కూడా ఉన్నాయి. ఆశారాం బాపు కేసులో.. ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగితే, కేసు దిల్లీలోని కమలా మార్కెట్ స్టేషన్లో నమోదు అయింది. తరువాత దాన్ని రాజస్థాన్‌కి బదిలీ చేశారు.  

మ‌రో కోడిక‌త్తి?.. అమ‌రావ‌తిపై త‌గ్గేదేలే.. ఆర్కేకు బాబు స‌పోర్ట్‌.. టాప్‌న్యూస్ @1pm

1. ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్‌ వేశారు. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సభను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని రైతుల తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ పిటిషన్‌లో తెలిపారు. తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతి ఇవ్వకుండా.. పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారన్నారు.  2. రాధాకృష్ణతో సహా మరో ముగ్గురు ఏబీఎన్ సిబ్బందిపై అక్రమంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వైసీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గాలికొదిలి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. 3. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత‌లు తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి.. సీఎం జ‌గ‌న్ రెడ్డి ప్రాణాల‌కు హానిత‌ల‌పెట్టొచ్చ‌ని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం.. మ‌రో కోడిక‌త్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డ‌లివేటు రిహార్స‌ల్లాగా అనిపిస్తోందన్నారు. ఓవైపు అప్పుల‌కుప్ప‌, మ‌రోవైపు తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త‌తో.. అబ్బాయ్ గారు.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో! అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.  4. ‘‘నా ఇల్లు నా సొంతం’’ ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని,  టిడ్కో ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా  పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ ద‌గ్గ‌ర‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  5. విజయవాడలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. దీక్షలో సీమ జిల్లాల రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆకలి సమస్య, తాగు నీటి సమస్యపై ప్ర‌భుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో ఏముందో కూడా తెలియకుండా నాయకులు మాట్లాడుతున్నారని, కృష్ణా యాజమాన్య బోర్డు విశాఖలో పెట్టడం దుర్మార్గమన్నారు. పాలనా వికేంద్రీకరణ అంటున్న జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టును కర్నూలులో పెట్టాలని రాయ‌ల‌సీమ నేత‌లు డిమాండ్ చేశారు.  6. వెలిగొండ నిర్వాసితులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు కొండెక్కాయని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. నిర్వాసితులకు హామీ ఇచ్చిన 899 కోట్లు ఇవ్వాలేని జగన్ ప్రభుత్వం వల్ల పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతం ఏడారి గా మారుతుందన్నారు. వెలిగొండ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు గొంతు నులమడం అంటే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల గొంతులో చుక్క నీరు లేకుండా చేయడమే అని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో 15 లక్షల మందికి తాగునీరు - లక్షలాది ఏకరాలకు సాగు నీరు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. 7. విశాఖ‌లో మంత్రి అవంతి శ్రీనివాసరావు నివాసం ముందు కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. కేజీహెచ్‌లో పనిచేస్తున్న 65 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని చెప్పాపెట్టకుండా విధుల నుంచి తొలగించడంతో ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.  8. గుంటూరు జిల్లాలో వస్త్ర వ్యాపారుల నిరసన కొనసాగుతోంది. వస్త్రాలపై కేంద్రం నూతన పన్నులపై వ్యాపారులు ఆందోళనకు దిగారు. వాసవి హోల్ సేల్ మార్కెట్‌లో వ్యాపారులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వస్త్రాలపై కేంద్రం అదనపు జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.  9. శిల్పా చౌదరిని కస్టడీలో మూడు రోజుల పాటు ప్ర‌శ్నించిన‌ పోలీసులు.. ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీలో శిల్ప పలు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. కావాలనే కొంతమంది ప్రముఖుల్ని శిల్ప ఇందులోకి లాగినట్టు సమాచారం. శిల్ప అకౌంట్లు, ఆస్తులపై పోలీసులు ఆరా తీశారు.  10. ఆదిలాబాద్ జిల్లా బేల మంండలం సైద్‌పూర్ సమీపంలో పులి చర్మం పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి అమ్మకం కోసం పులి చర్మాన్ని పట్టుకొస్తునట్టు నిర్ధారించారు. నెలన్నర క్రితం ఇంద్రవెల్లి మండలం వడ్‌గాంలోనూ పులి చర్మాన్ని  అధికారులు పట్టుకున్నారు.   

అమెరికా నెత్తిన సుడిగుండం.. టోర్న‌డోల‌తో అగ్ర‌రాజ్యం ఆగ‌మాగం..

ర‌ష్యా అంటే భ‌యం లేదు. చైనా అంటే బెదురులేదు. కొరియా కోర‌లు పీకేసింది. ఇరాన్‌ను ఇర‌గ‌దీసేసింది. ఆర్థికం, అణ్వాయుధం, మేధోసంప‌త్తి, సైన్స్ అంట్‌ టెక్నాల‌జీ.. ఇలా అన్ని రంగాల్లో అమెరికాదే ఆధిప‌త్యం. ప్ర‌పంచానికి తానే పెద్ద‌న్న‌లా ఫోజులు కొట్టే యునైటెడ్ స్టేట్స్‌.. ప్ర‌కృతి పేరెత్తితే మాత్రం గ‌జ‌గ‌జా వ‌ణికిపోతోంది. ప్ర‌కృతి ప్ర‌కోపం ముందు మాత్రం పిల్లిలా తోక‌ముడుస్తుంది. చ‌లి, వేడి గాలులు.. సైక్లోన్లు.. టోర్న‌డోలు.. ఎప్పుడూ ఏదో ఒక‌లా  వాతావ‌ర‌ణం అమెరికాతో ఓ ఆటాడుకుంటుంది. ఆ దేశం చేస్తున్న ప‌ర్యావ‌ర‌ణ హ‌న‌నంపై ఏదో రూపంలో రివేంజ్ తీసుకుంటోంది. తాజాగా, టోర్న‌డోతో విరుచుకుప‌డుతోంది. సుడిగుండం అమెరికా పాలిట పెనుగండంగా మారింది. వందేళ్ల‌లో ఏన్న‌డూ లేనంత బీభ‌త్సం సృష్టిస్తోంది.  టోర్నడోల దెబ్బకు అమెరికాలోని పలు రాష్ట్రాలు, కౌంటీలు దారుణంగా దెబ్బ‌తింటున్నాయి. సుడిగుండం చుట్టేసి.. భవనాలు, పరిశ్రమలు, స్తంభాలు, వృక్షాలను అమాంతం నేల‌మ‌ట్టం చేస్తున్నాయి. టోర్నడో ధాటికి ఇప్పటికే అమెరికావ్యాప్తంగా 100 మందికి పైగా మృతి చెందారు. ఆరు రాష్ట్రాల‌ను.. 30 వ‌ర‌కూ టోర్నడోలు అల్ల‌క‌ల్లోలం చేసేశాయి. కెంటకీ స్టేట్‌ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఆ రాష్ట్రంలోనే 70 మంది వ‌ర‌కూ మ‌ర‌ణించి ఉంటార‌ని అంటున్నారు. కెంట‌కీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కెంటకీతో పాటు ఆర్క్‌న్సస్‌, ఇల్లినాయిస్‌, మస్సోరీ, మిసిసిప్పీ, టెనెస్సీ రాష్ట్రాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఇల్లినాయిస్‌లోని అమెజాన్ వేర్‌హౌజ్‌ పైకప్పు కుప్పకూలి చాలామంది అమెజాన్ ఉద్యోగులు మృత్యువాత‌ప‌డ్డారు.  ఒకదాని తర్వాత ఒకటిగా టోర్నడోలు గంటకు 200 మైళ్ల వేగంతో విరుచుకుపడడంతో.. ఆరు రాష్ట్రాలు అల్ల‌క‌ల్లోలంగా మారాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్డు మార్గాలు ధ్వంస‌మ‌య్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరో రెండు రోజుల్లో వాటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికతో అమెరిక‌న్లు భ‌యంతో బెదిరిపోతున్నారు.. ఇల్లు వ‌దిలి చెదిరిపోతున్నారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అధ్య‌క్షులు బైడెన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  యూఎస్‌లో డిసెంబరులో భీకర తుపాన్లు రావ‌డం చాలా అరుదు. కానీ, ప్ర‌స్తుత‌ టోర్నడో తీవ్రత, విస్తృతి వాతావరణ శాస్త్రవేత్తల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. టోర్నడో ఇంతలా విరుచుకుపడటానికి వేడి వాతావరణం ఓ ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

‘వినాశకాలే విపరీత బుద్ది’.. పత్రికా స్వేచ్చపై దాడి..

ఇంచు మించుగా 45 సంవత్సరాల క్రితం 1975 జూన్ 26 వ తేదీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించారు. సుమారు 21 నెలలు ఇందిరా గాంధీ సాగించిన హిట్లర్ పాలనలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కాలరాశారు.సెన్సార్’షిప్ విధించి పత్రికల నోరు నొక్కారు. అందుకు మూల్యం కూడా చెల్లించారు. ఆ  సమయంలో, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అనే అర్యోక్తితో భవిష్యత్ దర్శనం చేశారు. అత్యవసర పరిస్థితి పై జేపీ నోటి నుంచి వచ్చిన ఈ తొలి స్పందనే చివరకు నిజమైంది. అత్యవసర పరిస్థితి తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది.. చివరకు ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు, సంజయ్ గాంధీ కూడా సొంత నియోజక వర్గాల్లో ఓడి పోయారు. ఇది చరిత్ర.  ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ఘాతుకానికి తలపడుతోంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు చేస్తుండగా తమ విధులకు ఆటంకం కలిగించారనే ఆభియోగం పై ఆంధ్ర జ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసింది. నిజంగా రాధా కృష్ణ కానీ, మరొకరు గానీ, అధికార విధులకు ఆటంకం కలిగిస్తే, అధికారులు చట్టబద్దంగా చర్యలు తీసుకోవచ్చును.కానీ,ఆ సమయంలో రాధాకృష్ణను విచారణకు సహకరించాలని కోరిన సీఐడీ అధికారులే ఇప్పుడు 36 గంటల తర్వాత విచారణకు ఆటంకం కలిగించారని జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ప్రభుత్వ కుట్రగా, పత్రికా స్వేచ్చను హరించే కుట్రగానే భావించవలసి ఉంటుందని సీఐడీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  అదలా ఉంటే, మరో వంక ముఖ్య్మ్నాత్రి జగన్మోహన్ రెడ్డి నియత్రుత్వ పోకడలకు అడ్డపద్దె మరో ఉదంటం చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా పరిషత్  సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించేది లేదని మంత్రి పెద్దిరెడ్డి మీడియాను బయటకు పంపింకచారు. దీని బట్టి  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు ఎటు పడుతున్నాయో చెప్పకనే చెపుతున్నాయి. ఇదేదో చిత్తూర్ జిల్లా పరిషత్ తీసుకున్న నిర్ణయం కాదు. ప్రభుత్వమే ఈ మిన్రయం తీసుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డే పేర్కొన్నారు.  వివరాలోకి వెళితే, ఆదివారం చిత్తూరులో జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ  సందర్భంగా సమావేశం ప్రారంభానికి ముందే జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి, ‘సగౌరవం’గా   ‘ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సోదరులు సమావేశం నుంచి దయచేసి బయటకు వెళ్లాలి’ అని విజ్ఞప్తి చేశారు. కవరేజీకి అనుమతించాలని పాత్రికేయులు కోరారు. ఈ దశలో మంత్రి పెద్దిరెడ్డి జోక్యంచేసుకుని మాట్లాడుతూ ‘సమావేశాల వివరాలను సమాచారశాఖ ఇస్తుంది. సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్నే అమలు చేస్తున్నాం. వివరాలను సంక్షిప్తంగా విలేకరుల సమావేశంలో తెలియజేస్తాం.. ఇక మీరు వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. దీంతో పాత్రికేయులందరూ బయటకు వెళ్లిపోయారు. సమావేశం వివరాలను మంత్రి విలేకరుల సమవేశంలో వివరించలేదు. సమాచార శాఖ నోట్ పంపలేదు. అదలా ఉంటే, ఇప్పుడు జిల్లాపరిషత్ సమావేశానికి పాత్రికేయులను అనుమతించని ప్రభువం రేపు అసెంబ్లీ సమావేశాలకు కూడా, మీడియాకు అనుమతి లేందంటే .. ఏమిటనే చర్చ జరుగుతోంది.  నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పత్రికలు, మీడియా మెడ మీద కట్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే, 2019 అక్టోబర్ 30 తేదీన 2430 జీవో తెచ్చింది. ఈ జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపైపా చర్యలు తప్పవు. ఈ వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా విభాగాల (ప్రభుత్వశాఖల) కార్యదర్శులకు అప్పగించారు. కొత్త జీవో ప్రకారం.. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు న్యాయపరంగా కేసులు దాఖలు చేస్తారు.ఈజీవో పాట్రిక్ స్వేచ్చకు గొడ్డలి పెట్టని అప్పట్లోనే జర్నలిస్టు సంఘాలతో పాటూ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.  ప్రశ్నించే హక్కు, విమర్శించే నైతికత, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ప్రజాస్వామ్యం కల్పించిన ఓ హక్కు. జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 2430 విడుదల చేయడం ద్వారానే ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తామని చెప్పకనే చెప్పింది. ఇపుడు అదే చేస్తోంది. అయితే, ఇలాంటి  నియంతృత్వ పోకడలకు ఇందిరా గాంధీ అంతటి మహానాయకురాలే మూల్యం చెల్లించక తప్పలేదు. జగననగా ఎంత ..

విరుష్క బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా? వామ్మో అంత‌నా...!!

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క‌. టీమిండియా సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లీ. ఈ విరుష్క జంట‌.. దేశంలోనే మోస్ట్ పాపుల‌ర్క‌. గ‌ల్లీ గ‌ల్లీల్లోనూ కోహ్లీకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. ఇక అనుష్క‌ను చూట్టానికి అభిమానులు ప‌డి చ‌స్తారు. అందుకే ఈ సెల‌బ్రెటీ క‌పుల్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే.. ర‌చ్చ రంభోలే. విరుష్క‌ను చూట్టానికి జ‌నం ఎగ‌బ‌డుతుంటారు. సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ కోసం పోటీ ప‌డుతుంటారు. అలాంటి గుంపులో కంఫర్ట్‌గా క‌ద‌ల‌డ‌మంటే.. పెద్ద టాస్కే. కానీ, విరుట్‌-అనుష్క‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద‌గా ఇబ్బంది ప‌డింది లేదు. అందుకు కార‌ణం.. వారి బాడీగార్డ్ ప్ర‌కాశ్‌సింగ్ అలియాస్ సోను.  అవును, ప్ర‌కాశ్‌సింగ్ ఏళ్లుగా అనుష్క‌ను క‌ట్ట‌ప్ప‌లా కాపాడుతూ వ‌స్తున్నాడు. కోహ్లీతో పెళ్లి కాక‌ముందు నుంచే ఆమెకు అంగ‌ర‌క్ష‌కుడిగా ఉంటున్నారు. మ్యారేజ్ త‌ర్వాత.. అనుష్క‌తో పాటూ విరాట్‌కూ బాడీగార్డ్‌గా మారాడు. కోహ్లీకి ఇత‌ర బాడీగార్డ్స్ ఉన్నా.. ఆ ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు సోనునే మెయిన్ బాడీగార్డ్‌గా ఉంటాడు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వారిద్ద‌కీ నీడ‌లా కాపలా కాస్తుంటాడు. క్ష‌ణ‌క్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. వారిపై ఈగ కూడా వాల‌కుండా చూసుకుంటాడు.  ప్రకాశ్‌సింగ్‌ను విరుష్క జోడీ కేవ‌లం బాడీగార్డ్‌గానే చూడ‌రు.. త‌మ ఫ్యామిలీ మెంబ‌ర్‌గా క‌లుపుకు పోతారు. సోనుపై జోకులు వేస్తారు.. అత‌ని కుటుంబంతో క‌లిసిపోతారు. ఇంత‌కీ.. ఏళ్లుగా విరుష్క‌కు న‌మ్మ‌కంగా.. స‌ఖ్యత‌గా ఉంటున్న‌.. బాడీగార్డ్ ప్ర‌కాశ్‌సింగ్ శాల‌రీ ఎంతో తెలుసా? ఏడాదికి కోటీ 20 ల‌క్ష‌లు. అంటే, నెల‌కి 10 ల‌క్ష‌ల జీతం. బాడీగార్డ్‌కు అంత జీత‌మా అని అవాక్క‌వ్వాల్సిందే. బాడీగార్డే కానీ.. అంద‌రిలాంటి బాడీగార్డ్ కాదు మ‌రి. న‌మ్మ‌కం, ప‌నిత‌న‌మే ఆయ‌న‌కు అంత జీతం తెచ్చిపెడుతోంది. 

21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ గా  మళ్లీ మన సుందరి..

విశ్వసుందరి 2021 కిరీటం మరోసారి భారత యువతికే దక్కింది. పంజాబ్కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు ఈ సారి మిస్ యూనివర్స్గా విజయబావుటా ఎగరేసింది. భారతదేశానికి ఇది మూడో మిస్ యూనివర్స్ కిరీటం. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో అందగత్తె మిస్ సౌతాఫ్రికా దివా, మిస్ పరాగ్వేతో హర్నాజ్ సంధు తలపడింది. ఆ ఇద్దరు అందగత్తెలపై ఆధిక్యం సాధించిన మన మిస్ హర్నాజ్ సంధు విశ్వ సుందరిగా నిలిచింది. ఈ పోటీలో మిస్ పరాగ్వే నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. మిస్ సౌతాఫ్రికా లాలెలా మస్వానే రెండో రన్నరప్ సాధించింది. ఫిలిప్పీన్ సుందని బీట్రైస్ గోమెజ్ ఈసారి విశ్వసుందరి పోటీల్లో టాప్ 5 ప్లేస్లో ఉంది. 1994లో సుస్మితాసేన్, 2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్గా కిరీటాన్ని అందుకున్నారు. 21 ఏళ్లకు ఇప్పుడు మిస్ యూనివర్స్ కిరీటాన్ని మన దేశానికి హర్నాజ్ కౌర్ సంధు సంపాదించిపెట్టడం విశేషం. హర్నాజ్ కౌర్ సంధుకు ఈసారి జరిగిన 70వ విశ్వసుందరి కిరీటాన్ని అందించేందుకు అడిగిన ప్రశ్న.. వాతావరణ మార్పు ఓ బూటకం అంటుంటారు. మీ సమాధానం ఏమిటి అని అడిగితే.. ‘ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని తెలిసి.. తన గుండె పగిలిపోతోందని బదులిచ్చింది. ఇదంతా బాధ్యతా రాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయం హర్నాజ్ వ్యక్తం చేసింది. మనం చేసే ప్రతి చర్యా ప్రకృతిని రక్షించగలద’ని హర్నాజ్ సమాధానం చెప్పింది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందిన కమిటీ హర్నాజ్ను ఈ ఏడాది విశ్వసుందరిగా ప్రకటించడంతో ఆనందంతో కన్నీరు కార్చింది. మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలిచే వరకు ఈ 21 ఏళ్ల బ్యూటీ హర్నాజ్ కౌర్ సంధు ప్రయాణం అంత సులువగా ఏమీ సాగలేదు. ఇంతకు ముందు హర్నాజ్ ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కొంది. స్కూల్లో తోటి విద్యార్థులు తనపై చేసే కామెంట్స్ భరించింది. తనను తాను నిరూపించుకునేందుకు చేసిన ప్రయాణంలో హర్నాజ్కు దక్కిన విజయమే మిస్ యూనివర్స్ కిరీటం. చిన్నప్పుడు బక్కపలచగా, గాలి వీస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉండేది హర్నాజ్ సంధు. హేళనలు భరించలేక ఒక్కోసారి సిగ్గుతో తలదించుకుని ఒంటరిగా గడిపేందుకు అలవాటు పడింది. అయితే.. హర్నాజ్కు ఆమె కుటుంబం మొత్తం అండగా నిలబడింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో 17 ఏళ్ల వయస్సులోనే మోడలింగ్ రంగంలో హర్నాజ్ అడుగుపెట్టింది. ఒక పక్కన పంజాబీ సినిమాల్లో నటిస్తూనే అందాల పోటీల్లోనూ పాల్గొనేది. 2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్ 12లో నిలిచిన హర్నాజ్ కౌర్ సంధు ఇప్పుడు ఏకంగా మన జాతి యావత్తు గర్వపడేలా మూడో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది. చండీగఢ్లోని పంజాబీ ఫ్యామిలీలో 2000వ సంవత్సరంలో హర్నాజ్ కౌర్ సంధు పుట్టింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్య ముగించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. చిన్నప్పటి నుంచీ ఫిట్నెట్పై దృష్టిపెట్టిన హర్నాజ్ గుర్రపు స్వారీ, ఈత కొట్టేది.. డ్యాన్స్ చేసేది.. నటించేది.. ప్రయాణాలంటే ఈ విశ్వసుందరికి ఎంతో ఇష్టం. హర్నాజ్ సంధు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మంది పాలోవర్స్ను సంపాదించుకుంది. ఈ సారి తప్పకుండా విశ్వ సుందరి కిరీటం సాధించి సుస్మితా సేన్, లారా దత్తాల సరసన స్థానం సంపాదిస్తానని పోటీలకు ముందే చెప్పగలిగిన ధీశాలి హర్నాజ్ కౌర్ సంధు. మిస్ యూనివర్స్గా నిలిచిన హర్నాజ్ కౌర్ సంధును పలువురు అభినందనలతో ముంచెత్తున్నారు

36 గంటల తర్వాత ఆర్కేపై ఎఫ్ఐఆర్! ఏపీ సీఐడీ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం..

ఏబిన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రచ్చవుతోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ కేసు విషయంలో  వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.  లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల సందర్భంలో విధులకు ఆటంకం కలిగించారంటూ రాధాకృష్ణతో సహా నలుగురిపై ఐపీసీ 353, 341, 186, 120(బి), రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు.  తన చిరకాల మిత్రుడు లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు ఆర్కే అక్కడికి వెళ్లారు. అయితే రాధాకష్ణను కొద్దిసేపు ఇక్కడే ఉండాలని సీఐడీ అధికారులే కోరారని తెలుస్తోంది. అంతేకాదు మీరు ఇక్కడే ఉంటే లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు సహకరిస్తారని కూడా సీఐడీ కోరిందని సమాచారం. ఈ క్రమంలో అధికారులకు అన్ని విధాలా సహకరించాలని కూడా రిటైర్డ్‌ ఐఏఎస్‌ కుటుంబీకులకు ఆర్కే సూచించారు. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమోకానీ ఒక్కసారిగా సీఐడీ అధికారులు ప్లేట్ మార్చేశారు. విచారణకు ఆటంకం కలిగించారంటూ 36 గంటల తర్వాత ఏబీఎన్ ఎండీపై కేసు నమోదు చేశారు.    విచారణ సమయంలో ఆర్కేని అక్కడే ఉండాలని కోరడమేంటి..? 36 గంటల తర్వాత మళ్లీ ఇలా కేసు నమోదు చేయడమేంటి..? ఇదేం విచిత్రమో అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, నిపుణులు, విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజంగా ఆర్కే విచారణను అడ్డుకుని ఉంటే అప్పుడే హైదరాబాద్‌లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? ఇది కచ్చితంగా ఆర్కేపై కక్షసాధింపు చర్యేనని రాజకీయ ప్రముఖులు  సీఐడీ తీరును తప్పుబడుతున్నారు. విచారణకు అడ్డుకుని ఉంటే అదే సమయంలో. లేదా అదే రోజు సాయంత్రం వరకో.. అదీ కాకుంటో ఆ మరుసటి రోజో ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది ప్రశ్నగా మారింది. ఏపీ ప్రభుత్వ లోపాలను ప్రసారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దురుద్దేశంతోనే సీఐడీ పోలీసులు జీరోఎఫ్ఐఆర్ నమోదు చేశారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. గంటా లక్ష్మీనారాయణ ఇంటికి ఆర్కే స్నేహ పూర్వకంగానే వెళ్లడం జరిగిందని,  సీఐడీ అధికారుల విధులకు ఎక్కడా ఆటంకం కలిగించినట్లు లేదన్నారు. రాధాకృష్ణపై కేసు పెట్టడం సీఐడీకి మాయని మచ్చని టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అవినీతి, అక్రమాలు బయటపెట్టం వల్లే ప్రభుత్వం కక్ష్య కట్టిందని ఆరోపించారు. రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ కేసు చివరకు జీరో గానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.  

మీడియాకు నో ఎంట్రీ.. ఏం చేస్తారో చేసుకోండి! మంత్రి పెద్దిరెడ్డి ఓవరాక్షన్..

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓవరాక్షన్ పెరిగిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా పాలనా యంత్రాంగాన్ని శాసిస్తున్న పెద్దిరెడ్డి.. తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. అధికారులందరికి తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, ఎవరైనా వినకపోతే బదిలీ చేయించడం కామన్ గా మారిపోయిందని అంటున్నారు. అధికార యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డి.. మీడియాను శాసించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.  చిత్తూరు జిల్లా  జడ్పీ సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించలేదు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. జడ్రీ సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కాబట్టి మీడియా బయటకు వెళ్లిపోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు  వివరిస్తామని తెలిపారు.  కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను జడ్పీ సమావేశం హాల్ నుంచి బయటికి పంపించారు సీఈవో ప్రభాకర్ రెడ్డి. ఎజెండాలోని అంశాలను చర్చించాల్సి ఉందని, కాబట్టి దయచేసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు బయటకు వెళ్లిపోవాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి కూడా కోరారు. తమను కవరేజీకి అనుమతించాలని విలేకరులు అభ్యర్థించినప్పటికీ నిరాకరించారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి కలగజేసుకుని.. సమావేశ వివరాలను సమాచార శాఖ వెల్లడిస్తుందని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో మీడియా ప్రతినిధులు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. అయితే మధ్యాహ్నం దాటినా విలేకరులకు ఆ వివరాలు అందవ్వలేదు. సమావేశం  తర్వాత మీడియాకు వివరాలు చెబుతామన్న మంత్రి పెద్దిరెడ్డి ... ఏ వివరాలు చెప్పకుండానే వెళ్లిపోయారు. మంత్రి తీరుపై మీడియా ప్రతినిధులు భగ్గుమంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. అధికారుల లాగానే మీడియాను తన చేతుల్లో ఉంచుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. 

నేను హిందువును.. హిందుత్వ వాదిని కాదు! రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

“హిందూ వేరు, హిందుత్వవాది వేరు. నేను హిందువును. హిందుత్వ వాదిని కాదు” కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, చేసిన ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసింది.కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదానికి తిలోదకాలు ఇచ్చి, సాఫ్ట్ హిదుత్వ పంథాలోకి అడుగులు వేస్తుందా, అనే సందేహం, కలుగుతోందా అన్న సందేహం ఇటు కాంగ్రెస్ ప్రతి వర్గాల్లో, అటు లౌకికవాద రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  రాజస్థాన్లోని జైపుర్లో  కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ,బహిరంగ సభ నిర్వహించింది. పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా సహా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ ఇతర సీనియర్ నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు, ప్రసంగించారు. అయితే  ఢిల్లీ నుంచి జైపుర్ వచ్చినా సోనియా గాంధీ మాత్రం  ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుతిరిగారు. కార్యకర్తలు, మద్దతుదారుల వద్ద ఉన్న నల్ల రంగు రుమాలు, స్కార్ఫ్, మఫ్లర్ వంటి వాటిని లోపలకు  అనుమతించలేదు. వాటిని తీసివేస్తేనే లోపలికి వెళ్లనిచ్చారు.నల్ల రంగు దుస్తులను సభకు అనుమతించకపోవటం చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసనలు చేస్తారనే భయంతోనే అలా చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సోనియా గాంధీ, ప్రియాంకా వాద్రా సమక్షంలో రాహుల్ గాంధీ చేసిన, హిందూ, హిదుత్వవాది వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, కాంగ్రెస్సేతర  లౌకికవాద పార్టీలలో కూడా చర్చకు తెర తీశాయి. ఒక విధంగా వివాదంగా మారాయి. అంతేకాదు, ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. ప్రస్తుతం దేశం రాజకీయాలు హిందువులు. హిందుత్వవాదుల మధ్య పోటీగా సాగుతున్నాయని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ తనను తాను గాంధీతో పోల్చుకున్నారు. బీజేపీని, మోడీని గాడ్సేతో పోల్చారు. భారతీయ జనతా పార్టీ లక్ష్యంగానే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.  హిందుత్వవాదులకు అధికారమే ముఖ్యమని, 2014 నుంచి వారు అధికారంలో ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందులో సందేహం లేదు. తప్పు కూడా లేదు. అలాగే, హిందుత్వవాదులను అధికారం నుంచి దింపేసి, హిందువులను తీసుకురావాలని పిలుపు నిచ్చారు. హిందుత్వవాదులు అధికారం కోసమే తమ జీవితాంతం ఆరాటపడతారు. వారికి అధికారం కన్నా ఏదీ ఎక్కువ కాదు. దాని కోసం ఏదైనా చేస్తారు అన్నారు. ఈ దేశం హిందువులది, హిందుత్వవాదులది కాదు, అంటూ రాహుల్ గాంధీ బీజేపీ లక్ష్యంగా అస్త్రాలను సంధించారు. అయన దృష్టిలో హిందుత్వ వాదులు    అంటే బీజేపీనే కాబట్టి కబాటి అది కూడా తప్పు పట్టలేము. అయితే, రాహుల గాంధీ మాటల్లో వచ్చిన మార్పు దేనికి సంకేతం? లౌకికవాదానికి కాంగ్రెస్ పార్టీ తిలోదకాలు ఇచ్చిందా?  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అడుగులో అడుగేసి  నడుస్తున్నారా? సాఫ్ట్ హిదుత్వ పంథాలోకి అడుగులు వేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.   

లిక్కర్ ఒకే.. సినిమాకే పారదర్శకతా! తన సినిమాను ఫ్రిగా చూపిస్తానన్న పవన్..  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలను రద్దు చేయడంపై స్పందించిన పవన్ కల్యాణ్.. జగన్ సర్కార్ కు చురకలు అంటించారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే, ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని చెప్పారు. అంతేతప్ప బెదిరింపులకు భయపడేవాడ్ని కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు తమ  సినిమాలు ఆపేస్తే నా ఆర్థికమూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు.. వాళ్లు అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తా అని జనసేన చీఫ్ అన్నారు. సినిమా టికెట్ల అంశంలో పారదర్శకత లేదని చెబుతున్నారు... మీకుందా పారదర్శకత? అని ప్రశ్నించారు.  మీకంత పారదర్శకత ఉంటే ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? అంటూ పరోక్షంగా సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తే చాలు వైసీపీ నేతలు బూతులు తిట్టేస్తారని చెప్పారు. "సినిమా థియేటర్ల నుంచి పన్నులు రావడంలేదు, టికెట్ల వ్యవహారంలో పారదర్శకత లేదు... అంతవరకు ఓకే... కానీ మీరు అమ్మే మందుకు పారదర్శకత ఉందా? మద్యం మీద ఏడాదికి రూ.40 వేల కోట్లు వస్తోందట... మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బును లారీల్లో గట్టి బందోబస్తు మధ్య తీసుకెళుతున్నారంట... నిజమేనా?" అంటూ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్లు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. నిమ్మరసం స్వీకరించిన అనంతరం దీక్ష ముగించారు. ఈ క్రమంలో సభకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అమరావతికి బీజేపీ పెద్దలు ఒప్పుకున్నారు! పవన్ కల్యాణ్ సంచలనం..

ఆంధ్రప్రదేశ్ కు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 7 వందలకు రోజులకు పైగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం టు దేవ స్థానం పేరుతో మహా పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం యాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది. ఈనెల 17న ముగింపు సభ నిర్వహించబోతున్నారు. అమరావతి  రైతుల పాదయాత్రకు అడగడుగనా ఘన స్వాగతం లభించింది. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఏపీ రాజధాని, అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, స్టీల్ ప్లాంట్ కార్మికులకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు మద్దతు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు జనసేన గుర్తొస్తుందని, రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలంటూ ఛలోక్తి విసిరారు. వైసీపీకి చెందిన వ్యక్తులు జనసేనకు శత్రువులు కాదని, వారి విధానాలు బాగాలేనప్పుడు మాత్రమే తాము ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తాము ఎప్పుడూ వైసీపీ విధానాలనే ఎత్తిచూపుతాం తప్ప, వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయబోమని వివరించారు. కానీ వైసీపీ నేతలు అలా కాదని, స్టీల్ ప్లాంట్ అంశం ఏమైందని అడిగితే తమను పచ్చిబూతులు తిడతారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంట్లోవాళ్లను కూడా తిడతారని తెలిపారు.   ఓ ప్రాంతంలో పరిశ్రమ వచ్చిందంటే ఆ ప్రాంత అభివృద్ధికి అది సంకేతం అని పవన్ చెప్పారు.  విశాఖ ఉక్కు కేవలం ఓ చిన్న పరిశ్రమ కాదు, ఇది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవమని అన్నారు. ఎందరో త్యాగాల వలన వచ్చిందన్నారు. ఇవాళ ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయడమే అన్నారు పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో నేను మోదీతోనూ, బీజేపీతోనూ గొడవపెట్టుకోవాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే తాను ఎప్పుడు వెళ్లినా బీజేపీ అగ్రనేతలు ఎంతో గౌరవం ఇస్తారని చెప్పారు.  బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సమయంలో మేం వారితో ప్రస్తావించిన మొదటి అంశం ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలన్నదే అని చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం సమ్మతించబట్టే  తాము ముందుకు వెళ్లామన్నారు. దీనిపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు  లేదన్నారు జనసేన చీఫ్. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అమరావతే రాజధాని అని తిరుపతిలో చెప్పారని తెలిపారు.  ఎవరికైనా మాట మీద నిలబడడం చాలా ముఖ్యమన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ వాళ్లు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు.. విపక్షంలో ఉన్నప్పుడు వారు ఏమన్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీ ఢిల్లీకి వెళితే కేంద్రం పెద్దలు ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు.. మరి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్న వైసీపీ ఏంచేస్తోంది? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు... మనం అడగకుండా ఉండడంలోనే తప్పుందని పవన్ ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ మినీ రత్న కంపెనీని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది..అప్పుడు మేం టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. అనంతరం దాని ప్రైవేటీకరణ ఆగింది అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ప్రభుత్వం పోరాడకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుంది? మనం ఎన్నికలప్పుడు విడివిడిగా పోటీ పడదాం... కానీ స్టీల్ ప్లాంట్ అంశంలో కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.   

బాబు లేఖాస్త్రం.. వైసీపీకి దమ్ముందా.. ఒమిక్రాన్ కలకలం..టాప్ న్యూస్@7PM

కర్నూలు జిల్లా కోసిగిలో తిక్కారెడ్డిపై దాడి జరగడంపై టీడీపీ సీరియస్ గా స్పందించింది. ఘటనలో చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్టు లేఖలో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  -------- స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డ్‌ పట్టుకునే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను విరమించిన పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు తమకు శత్రువులు కాదని.. వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామన్నారు. పోరాడి తెచ్చుకున్న ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదని అది పోరాటాలకు, త్యాగాలకు గుర్తు అని చెప్పారు. -------- ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. పోలీసులు, సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సాయితేజ అంత్యక్రియాలకు బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. తీవ్ర విచార వదనాలతో సాయితేజకు వీడ్కోలు పలికారు. --------- ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒక విశాఖలో ఒమిక్రాన్ కేసు నిర్దారణ కాగా.. తిరుపతికి చెందిన మరో యువకుడికి ఒమిక్రాన్ సోకిందని తెలుస్తోంది. బ్రిటన్ నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలున్నాయని చెబుతున్నారు. 34 ఏళ్ల ఆ వ్యక్తి శాంపిల్స్ జీనోమ్ టెస్ట్ కు పంపించారు. అవి వచ్చాకే ఒమిక్రాన్ సోకింది లేనిది నిర్దారణ కానుంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఈ నెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చాడు --- గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు.  ---- ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏ6గా సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌, ఏ8గా వికాస్ కన్విల్కర్, ఏ10గా ముకుల్‌ అగర్వాల్‌ను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపర్చారు. ముగ్గురు నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి 12 రోజులపాటు రిమాండ్‌ విధిస్తూ... తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది. --------- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' (ఈబిఎస్ బి) పై ఛాయాచిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.ఈబిఎస్ బి కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాల వివిధ ఆసక్తికరమైన అంశాలను,కళా రూపాలు, వంటకాలు, పండుగల చిత్రాలు ఏర్పాటు చేశారు ---- టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. కండువాలతో పోలింగ్ బూత్‌లోకి వచ్చారని, పోలీసులు కూడా వారికి వత్తాసు పలకడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. తాను పోటీలో ఉండటమే పెద్ద విజయంగా భావిస్తున్నానన్నారు. తనకు తన ఓటు కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే అదే తన విజయంగా భావిస్తానన్నారు. --------  కిట్టి పార్టీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి మోసం చేసి అరెస్ట్ అయిన శిల్పాచౌదరీ కస్టడీని నార్సింగి పోలీసులు వేగవంతం చేశారు. శిల్పాచౌదరికి బ్లాక్ మనీని వైట్‌గా మార్చడానికి ఇచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. 90 కోట్ల రూపాయలు శిల్పాకి విదేశాలో పెట్టుబడుల కోసం ఇచ్చిన వారందరికీ ఇప్పటికే నోటీసులు అందినట్టు సమాచారం. ఎవరెవరు ఇచ్చారు?... ఒక్కొక్కరు ఎంత డబ్బు ఇచ్చారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  --------- మత ప్రాతిపదికపై ఇండియా విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 1971  భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని పేర్కొన్నారు. 1971లో భారత్ విజయం,ఇండో-బంగ్లాదేశ్ మధ్య మైత్రీ సంబంధాలు 50వ పడిలో పడిన సందర్భంగా ఇండియా గేట్ వద్ద ఆదివార జరిగిన 'సర్ణిమ్ విజయ్ పర్వ్'‌లో రాజ్‌నాథ్ పాల్గొని ప్రసంగించారు. 

ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు? తిరుపతిలో కలకలం... ఇంకా నిర్దారణ కాలేదన్న DMHO

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒక విశాఖలో ఒమిక్రాన్ కేసు నిర్దారణ కాగా.. తిరుపతికి చెందిన మరో యువకుడికి ఒమిక్రాన్ సోకిందని తెలుస్తోంది. బ్రిటన్ నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలున్నాయని చెబుతున్నారు. 34 ఏళ్ల ఆ వ్యక్తి శాంపిల్స్ జీనోమ్ టెస్ట్ కు పంపించారు. అవి వచ్చాకే ఒమిక్రాన్ సోకింది లేనిది నిర్దారణ కానుంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఈ నెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చాడు.  తిరుపతి లో ఒమిక్రాన్ కేసు నమోదు అయినట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని చిత్తూరు జిల్లా డీఎంహెచ్ వో శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో నమోదైంది కరోన పాజిటివ్ మాత్రమేనని.. ఆ వ్యక్తి నమూనాలను  జీనోమ్ కి పంపడం జరిగిందని చెప్పారు. ఒమిక్రాన్ గా ఇంకా నిర్ధారణ కాలేదని.. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు డిఎంహెచ్ఓ సూచించారు. విజయనగరంలో ఓ కేసు నమోదైందని ఆదివారం ఉదయం అధికారులు అధికారికంగా నిర్ధారించారు.ఈ నెల 5న ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయిందని  విజయనగరం జిల్లా డీఎంహెచ్ వో డాక్టర్ రమణకుమారి తెలిపారు. అతను విశాఖలోని తన అత్తారింటికి వెళ్లాడని తెలిపారు. అతడికి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలిందని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 6న హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపామని చెప్పారు. ఒమిక్రాన్ గా తేలిందని చెప్పారు. అతనికి శనివారం మరోసారి టెస్ట్ చేయగా నెగెటివ్ గా రిపోర్ట్ వచ్చిందన్నారు.  ఇక ఒమిక్రాన్ సోకిన బాధితుడిని కలిసిన  40 మందిని గుర్తించి టెస్టులు చేయగా.. వాళ్లందరికి  నెగెటివ్ వచ్చిందన్నారు విజయనగరం డీఎంహెవో. అతడు ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ఉన్న వంద మందికి టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.  

సలామ్ చేయలేదని చితకబాదిన ఎంఐఎం ఎమ్మెల్యే.. వైరల్ గా మారిన ఓల్డ్ సిటీ వీడియో

హైదరాబాద్ ఓల్ట్ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ఓ యువకుడిని అర్థరాత్రి దుర్బాషలాడుతూ చితకబాదాడు. ఎమ్మెల్యే కోపానికి కారణం ఏంటో తెలుసా..  అతనికి సలాం చేయకపోవడమే. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాకే నమస్తే పెట్టవా? అంటూ ఎమ్మెల్యే బరి తెగించాడు. ఓ యువకుడి చెంప పగులగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో జరిగింది. ​చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్​ఖాన్ ఆ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన హుస్సేనీహాలం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎమ్మెల్యే దాడికి సంబంధించిన సీసీ టీవీ కెమెరా విజువల్స్​ సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి.  బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ చార్మినార్​ బస్టాండ్​వద్ద గులామ్​గౌస్​జిలానీ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున 12.43 నిమిషాల సమయంలో తన ఇంటి అరుగు ముందు మరో వ్యక్తితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన చార్మినార్​ఎమ్మెల్యే ముంతాజ్ అమ్మద్​ఖాన్​తన గన్‌మెన్లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. గులామ్​గౌస్​ జిలాని వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్​ఖాన్​.. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా… నాకు సలామ్​ పెట్టవా అంటూ దుర్భాషలాడాడు. నేను చూడలేదు అని.. అయినా ఎందుకు సలామ్​ పెట్టాలి అని యువకుడు ఎదురు ప్రశ్న వేయడంతో ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే యువకునిపై దాడి చేశాడు.  ఎమ్మెల్యే గన్‌మెన్లు ఆ యువకుడిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటికి మరో సారి ఎమ్మెల్యే అతనిపైకి వెళ్లి దాడి చేశారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఇల్లు.. బాధితుని ఇల్లు సమీపంలోనే ఉండడం.. క్షణాల్లో అప్పటికే ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో చార్మినార్​బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదంతా అక్కడే ఉన్న సి.సి కెమెరాలో నిక్షిప్తమయ్యింది. ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడిలో యువకుడు జిలానీ తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే కావడంతో బేంబేలెత్తిపోతున్నారు హైదరాబాద్ పోలీసులు.  బాధితుడు గులామ్​గౌస్ జిలానీ తన దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై, తనను రివాల్వర్​తో షూట్​ చేస్తానని ఎమ్మెల్యే బంధువు బెదిరించాడని హుస్సేనిహాలం పోలీస్​స్టేషన్‌లో గులామ్ గౌస్ ఫిర్యాదు చేశాడు. అనంతరం హైదరాబాద్​పార్లమెంటు సభ్యులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు బాధితుడు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసుకున్న హుస్సేనీఆలం పోలీసులు.. బాధితున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.గతంలో జిలానీ సోదరుడికి ఎమ్మెల్యే తనయుడికి మధ్య ఓ ఆస్తి విషయంతో తగాదాలు ఉన్నాయని తెలుస్తోంది.

అమరావతి  మహా పాదయాత్ర ముగింపు సభకు పవన్‌కల్యాణ్..

అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సభకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ముగింపు సభకు హాజరవుతానని పవన్‌కల్యాణ్‌ చెప్పారని అమరావతి ప్రాంత మహిళా రైతులు తెలిపారు. తొలి నుంచీ అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్నారంటూ మంగళగిరిలో పవన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మహిళా రైతులు. పాదయాత్ర ముగింపు సభకు ఆయన్ను ఆహ్వానించారు. వాళ్ల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్.. ముగింపు సభకు వస్తానని చెప్పారని రాజధాని ప్రాంత మహిళా రైతులు చెప్పారు. అన్నిపక్షాల మద్దతుతో అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా కాపాడుకుంటామని మహిళలు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో నిర్వహించనున్న పాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అనుమతి నిరాకరించారని ఆరోపించారు. సభకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   మరోవైపు అమరావతి రైతుల పాదయాత్ర ఆదివారం 42వ రోజుకు చేరుకుంది. అంజిమేడులో ప్రారంభమైన యాత్ర.. గుత్తివారిపల్లె వరకు కొనసాగింది. మహిళా రైతులు అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రలో పాల్గొంటున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళతో పాటు పాదయాత్రలో జారిపడి చేయి విరిగిన మరో మహిళ కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఆదివారం అంజిమేడు నుంచి ఇసుకతాగేలి, దిగువ మల్లవరం, ఎగువ మల్లవరం గుత్తివారిపల్లి వరకు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.  

అప్పు తెచ్చు కుంటాం అనుమతివ్వండి.. కేంద్రానికి ఏపీ విజ్ఞప్తి 

నిజమే, రాష్ట్ర విభజన వలన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. రాజ్య సభలో వైసీపే ఎంపీ, విజయసాయిరెడ్డి అన్నట్లుగా అశాస్త్రీయంగా జరిగిన విభజన వలన ఏపీకి చాలా పెద్ద అన్యాయమే జరిగింది. అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. అయితే, ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కుంటున్న, ఆర్థిక దుస్థితి అదొక్కటే కారణం  కాదు. ఇంకా చాలా  కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన, చేస్తున్నఅన్యాయం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంకృతం చిట్టా కూడా  చాలానే వుంది.  ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర విభజన వలన జరిగిన అన్యాయం కంటే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం, అనుసరిస్తున్న ఆర్థిక విధనాలు,ఆర్థిక క్రమ శిక్షణా రాహిత్యం,ఓటు బ్యాంకు రాజకీయ ఎత్తుగడలు, అవినీతి, అసమర్ధత పాలనే ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు  విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, రాష్ట్ర విభజనలోనే కాదు,రాష్ట్ర విభజన అనంతరం కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉంది. ప్రత్యేక హోదాను ముగిసిన  అధ్యాయం అంటూ అవతల పెట్టింది.హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజి ఏమైందో ఎవరికీ తెలియదు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం ఆర్థిక సహాయం చేసేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి  ఎప్పీ ప్రభుత్వం  ముఖాన తలుపులు వేసింది, రైల్వే జోన్ పట్టాలు తప్పింది, ఎటు పోతుందో, ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అయినా  ముఖ్యమంత్రి ముఖంలో నవ్వు చెదరలేదు. ఇదేమిటని అడిగేందుకు నోటు పెగలడం లేదు ఒకటని కాదు, విభజన చట్టంలో హామీల అమలుకు సంబంధించి పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా, కేంద్రాన్ని ప్రశ్నించే, కేంద్రంపై పోరారం చేసే సాహసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయడం లేదు. కారణం ఏమిటో కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మెడ చుట్టూ వేళ్ళాడుతున్న అక్రమాస్తుల ‘మెడల్స్’  గొంతుకు అడ్డం పడుతున్నాయి. నోరు పెగలకుండా చేస్తున్నాయి.అందుకే, ఇంకేమీ వద్దు అదనపు అప్పుచేసుకునే వెసులు బాఆటు కలిపిస్తే చాలని, జగనన్న పభుత్వం కేంద్ర ప్రభుత్వాన్నివేడుకుంటోంది.  ఏపీ ప్రభుత్వం వరుసగా చేస్తున్న అప్పులపై ఇప్పటికే ఆర్బీఐతో పాటు వివిధ ఆర్ధికసంస్ధలు సైతం పెదవివిరుస్తున్న నేపథ్యంలో వైసీపీ సిగ్గు విడిచి, పార్లమెంట్ సాక్షిగా అప్పు అనుమతి కోసం కేద్రాన్ని వేడుకుంటోంది. కొద్ది రోజుల క్రితం, లోక్ సభలో వైసీపీ  సభ్యులొకరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ‘ఆదుకోండి ప్లీజ్’ అంటూ  కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా (శుక్రవారం) రాజ్య సభలో వైసీపీ సభ్యుడు, విజయసాయి రెడ్డి  స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) లో అదనంగా 0.5 శాతం రుణాల సేకరణకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని అదనంగా రుణ సేకరణకు రాష్ట్రాన్ని అనుమతించాలని విజయ సాయిరెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా అమలు చేయడానికి దోహదం చేసినట్లవుతుందని అన్నారు. ఇప్పటికే ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధికశాఖ నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అదనపు రుణానికి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అదలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అప్పుల మీద సాగే ప్రభుత్వం ఎంతకాలం సాగుతుంది? చివరకు ఏమి జరుగుతుంది? అంటే వైసీపీ ఆభిమానులు కూడా,,. ఇంతవరకు ఎక్కాడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే ప్రమాదం లేక పోలేదని, అదేజరిగితే ఇప్పటికే,  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విముఖత వ్యక్త పరుస్తున్న పెట్టుబడి దారులు ఇక ఎపీముఖమే చూడరని అంటున్నారు ..