విరుష్క బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా? వామ్మో అంతనా...!!
posted on Dec 13, 2021 @ 10:37AM
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ. ఈ విరుష్క జంట.. దేశంలోనే మోస్ట్ పాపులర్క. గల్లీ గల్లీల్లోనూ కోహ్లీకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. ఇక అనుష్కను చూట్టానికి అభిమానులు పడి చస్తారు. అందుకే ఈ సెలబ్రెటీ కపుల్ ఇంటి నుంచి బయటకు వస్తే.. రచ్చ రంభోలే. విరుష్కను చూట్టానికి జనం ఎగబడుతుంటారు. సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ కోసం పోటీ పడుతుంటారు. అలాంటి గుంపులో కంఫర్ట్‌గా కదలడమంటే.. పెద్ద టాస్కే. కానీ, విరుట్-అనుష్కలు ఇప్పటి వరకూ పెద్దగా ఇబ్బంది పడింది లేదు. అందుకు కారణం.. వారి బాడీగార్డ్ ప్రకాశ్‌సింగ్ అలియాస్ సోను.
అవును, ప్రకాశ్‌సింగ్ ఏళ్లుగా అనుష్కను కట్టప్పలా కాపాడుతూ వస్తున్నాడు. కోహ్లీతో పెళ్లి కాకముందు నుంచే ఆమెకు అంగరక్షకుడిగా ఉంటున్నారు. మ్యారేజ్ తర్వాత.. అనుష్కతో పాటూ విరాట్‌కూ బాడీగార్డ్‌గా మారాడు. కోహ్లీకి ఇతర బాడీగార్డ్స్ ఉన్నా.. ఆ ఇద్దరూ బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సోనునే మెయిన్ బాడీగార్డ్‌గా ఉంటాడు. బహిరంగ ప్రదేశాల్లో వారిద్దకీ నీడలా కాపలా కాస్తుంటాడు. క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ.. వారిపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటాడు.
ప్రకాశ్‌సింగ్‌ను విరుష్క జోడీ కేవలం బాడీగార్డ్‌గానే చూడరు.. తమ ఫ్యామిలీ మెంబర్‌గా కలుపుకు పోతారు. సోనుపై జోకులు వేస్తారు.. అతని కుటుంబంతో కలిసిపోతారు. ఇంతకీ.. ఏళ్లుగా విరుష్కకు నమ్మకంగా.. సఖ్యతగా ఉంటున్న.. బాడీగార్డ్ ప్రకాశ్‌సింగ్ శాలరీ ఎంతో తెలుసా? ఏడాదికి కోటీ 20 లక్షలు. అంటే, నెలకి 10 లక్షల జీతం. బాడీగార్డ్‌కు అంత జీతమా అని అవాక్కవ్వాల్సిందే. బాడీగార్డే కానీ.. అందరిలాంటి బాడీగార్డ్ కాదు మరి. నమ్మకం, పనితనమే ఆయనకు అంత జీతం తెచ్చిపెడుతోంది.