‘వినాశకాలే విపరీత బుద్ది’.. పత్రికా స్వేచ్చపై దాడి..
posted on Dec 13, 2021 @ 11:11AM
ఇంచు మించుగా 45 సంవత్సరాల క్రితం 1975 జూన్ 26 వ తేదీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించారు. సుమారు 21 నెలలు ఇందిరా గాంధీ సాగించిన హిట్లర్ పాలనలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కాలరాశారు.సెన్సార్’షిప్ విధించి పత్రికల నోరు నొక్కారు. అందుకు మూల్యం కూడా చెల్లించారు. ఆ సమయంలో, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అనే అర్యోక్తితో భవిష్యత్ దర్శనం చేశారు. అత్యవసర పరిస్థితి పై జేపీ నోటి నుంచి వచ్చిన ఈ తొలి స్పందనే చివరకు నిజమైంది. అత్యవసర పరిస్థితి తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది.. చివరకు ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు, సంజయ్ గాంధీ కూడా సొంత నియోజక వర్గాల్లో ఓడి పోయారు. ఇది చరిత్ర.
ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ఘాతుకానికి తలపడుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు చేస్తుండగా తమ విధులకు ఆటంకం కలిగించారనే ఆభియోగం పై ఆంధ్ర జ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నిజంగా రాధా కృష్ణ కానీ, మరొకరు గానీ, అధికార విధులకు ఆటంకం కలిగిస్తే, అధికారులు చట్టబద్దంగా చర్యలు తీసుకోవచ్చును.కానీ,ఆ సమయంలో రాధాకృష్ణను విచారణకు సహకరించాలని కోరిన సీఐడీ అధికారులే ఇప్పుడు 36 గంటల తర్వాత విచారణకు ఆటంకం కలిగించారని జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ కుట్రగా, పత్రికా స్వేచ్చను హరించే కుట్రగానే భావించవలసి ఉంటుందని సీఐడీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
అదలా ఉంటే, మరో వంక ముఖ్య్మ్నాత్రి జగన్మోహన్ రెడ్డి నియత్రుత్వ పోకడలకు అడ్డపద్దె మరో ఉదంటం చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించేది లేదని మంత్రి పెద్దిరెడ్డి మీడియాను బయటకు పంపింకచారు. దీని బట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు ఎటు పడుతున్నాయో చెప్పకనే చెపుతున్నాయి. ఇదేదో చిత్తూర్ జిల్లా పరిషత్ తీసుకున్న నిర్ణయం కాదు. ప్రభుత్వమే ఈ మిన్రయం తీసుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డే పేర్కొన్నారు.
వివరాలోకి వెళితే, ఆదివారం చిత్తూరులో జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం ప్రారంభానికి ముందే జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి, ‘సగౌరవం’గా ‘ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సమావేశం నుంచి దయచేసి బయటకు వెళ్లాలి’ అని విజ్ఞప్తి చేశారు. కవరేజీకి అనుమతించాలని పాత్రికేయులు కోరారు. ఈ దశలో మంత్రి పెద్దిరెడ్డి జోక్యంచేసుకుని మాట్లాడుతూ ‘సమావేశాల వివరాలను సమాచారశాఖ ఇస్తుంది. సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్నే అమలు చేస్తున్నాం. వివరాలను సంక్షిప్తంగా విలేకరుల సమావేశంలో తెలియజేస్తాం.. ఇక మీరు వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. దీంతో పాత్రికేయులందరూ బయటకు వెళ్లిపోయారు. సమావేశం వివరాలను మంత్రి విలేకరుల సమవేశంలో వివరించలేదు. సమాచార శాఖ నోట్ పంపలేదు. అదలా ఉంటే, ఇప్పుడు జిల్లాపరిషత్ సమావేశానికి పాత్రికేయులను అనుమతించని ప్రభువం రేపు అసెంబ్లీ సమావేశాలకు కూడా, మీడియాకు అనుమతి లేందంటే .. ఏమిటనే చర్చ జరుగుతోంది.
నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పత్రికలు, మీడియా మెడ మీద కట్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే, 2019 అక్టోబర్ 30 తేదీన 2430 జీవో తెచ్చింది. ఈ జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపైపా చర్యలు తప్పవు. ఈ వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా విభాగాల (ప్రభుత్వశాఖల) కార్యదర్శులకు అప్పగించారు. కొత్త జీవో ప్రకారం.. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు న్యాయపరంగా కేసులు దాఖలు చేస్తారు.ఈజీవో పాట్రిక్ స్వేచ్చకు గొడ్డలి పెట్టని అప్పట్లోనే జర్నలిస్టు సంఘాలతో పాటూ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ప్రశ్నించే హక్కు, విమర్శించే నైతికత, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ప్రజాస్వామ్యం కల్పించిన ఓ హక్కు. జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 2430 విడుదల చేయడం ద్వారానే ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తామని చెప్పకనే చెప్పింది. ఇపుడు అదే చేస్తోంది. అయితే, ఇలాంటి నియంతృత్వ పోకడలకు ఇందిరా గాంధీ అంతటి మహానాయకురాలే మూల్యం చెల్లించక తప్పలేదు. జగననగా ఎంత ..