నేను దేవుడ్ని కాను: సచిన్ టెండుల్కర్

  క్రికెట్ అభిమానులు క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “నా అభిమానులు భావిస్తున్నట్లు నేనేమి క్రికెట్ దేవుడ్ని కాను. నేను కూడా ఒక సామాన్య మానవుడినే. ఎందుకంటే దేవుడు ఎన్నడూ తప్పులు చేయదు కానీ, నేను మాత్రం చాలా తప్పులే చేశాను. అందరూ నేను100వ సెంచరీ పూర్తి చేసినందుకు అభినందిస్తుంటే నేను మాత్రం 100వ సెంచరీ చేయడానికి నాకెందుకు ఇంత ఆలస్యంగా జరిగింది అంటూ ఆ దేవుడ్ని ప్రశ్నిస్తున్నాను. నా అభిమానులకు నేను ఆరాద్యుడిని కావచ్చునేమో కానీ, నాకు మాత్రం వివిన్ రిచర్డ్స్ మరియు సునీల్ గవాస్కర్ లే ఆరాద్యులు. నా ఆటకు స్పూర్తి నిచ్చిన వారు వారిరువురే.” అని తెలిపారు.   ఆయన వరుస వైఫల్యాలను చూసి అనేక మంది గత కొంత కాలంగా క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని ఒత్తిళ్ళు చేయడంతో అయిష్టంగానే అంతర్జాతీయ వన్ డే మ్యాచుల నుండి తప్పుకొన్న సచిన్ టెండుల్కర్, టెస్ట్ మ్యచ్చులో కూడా అంతగా రాణించక పోవడంతో ఆయనకు వ్యతిరేఖంగా ఇంకా నిరసనలు వెలువడుతూనే ఉన్నాయి. బహుశః అనుడుకు జవాబుగా ఆయన ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చును.   ఆయన క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఆయనకీ ఎవరూ చెప్పనవసరం లేదని, ఆ విషయం అందరికంటే ఆయనకే బాగా తెలుసునని, అందువల్ల ఆయన ఎప్పుడు రిటైర్ అవ్వలనేది ఇష్టమని రాజీవ్ శుక్లా అన్నారు.

'బాద్ షా' తిరుమలలో శ్రీను వైట్ల పూజ

        'బాద్ షా' చిత్రం ఘనవిజయం సాధించాలని ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ప్రార్ధనలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకు వెళ్లి దర్శకుడు శ్రీను వైట్ల శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని, తన వెంట తీసుకువచ్చిన 'బాద్‌షా' రీల్‌ బాక్స్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, అలాగే ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.

నేడు తేలనున్న విద్యుత్ ఛార్జీల పెంపు భవితవ్యం

  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటు స్వపక్షంలోనూ అటు విపక్షంలోనూ విద్యుత్ సర్ ఛార్చిల వసూలు విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి నేడు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, మంత్రులు, విద్యుత్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఛార్జీల పంపుదాలను సమీక్షిస్తామని, గత ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచిన తరువాత స్వల్పంగా తగ్గించారు. 150 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు కొంతమేర ఛార్జీలు తగ్గించాలని మంత్రులు కోరుతున్నారు. ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోలేకపోతే రేపు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.

కాపులకు చంద్రబాబు నాయుడు వరాల జల్లు

  తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలు సాగిస్తున్న టి.డి.పి. అధిపతి చంద్రబాబు నాయుడు కాపులపై వరాల జల్లు కురిపించారు. పాదయాత్రలో భాగంగా జరిగిన వివిధ సభల్లో మాట్లాడుతూ ... అగ్రవర్ణాల్లో కాపుల్లోనే పేదలు ఎక్కువగా ఉన్నారని, ఈ సామాజిక వర్గానికి ఏటా వెయ్యి కోట్లు రూపాయలు ఐదుసంవత్సరాలపాటు ఐదు కోట్లు వెచ్చిస్తామని, టిడిపి అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ అంశంపైనా సర్వే చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని, బిసి రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులకోసం ప్రత్యేక రిజర్వేషన్ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని, ముందునుంచీ కాపులు తమ పార్టీకి మద్ధతుగా ఉన్నారని, చిరంజీవిని నమ్మి కొంతకాలం దూరం కావడం వల్లే గతఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని, వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కాపులకు వాగ్దానం చేశారు.

నటి జయప్రద రాజమండ్రీ టికెట్ రాజకీయాలు

  ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నుండి లోక్ సభకు ఎన్నికయిన జయప్రద అక్కడ ములాయం సింగ్, మాయవతిల సహచర్యంలో పార్టీలు, రాజకీయాలు, సిద్ధాంతాల గురించి బాగానే ఒంట పట్టించుకోన్నట్లే కనిపిస్తున్నారు. ఆమె రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటి నుండి ఏదో ఒక పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకు ఏవి ఫలించకపోవడం వలన ఇంకా గోడ మీదనే కూర్చొని చూస్తున్నారు.   కొన్ని రోజులు కాంగ్రెస్ అధినేత్రితో తనకున్న పరిచయాల గురించి, మరి కొన్ని రోజులు తెదేపాతో తనకున్న పాత అనుబంధం గురించి, మరి కొన్ని రోజులు వైకాపాకు పేటెంట్ చేసుకొన్న ‘విశ్వసనీయత’ గురించి, స్వర్గీయ వైయస్సార్ రాష్ట్రానికి చేసిన సేవల గురించి మాట్లాడుతూ అన్ని పార్టీలకి గాలాలు వేసి చూసారు. ఆమె తనకి అన్ని పార్టీల నుండి ఆహ్వానాలు అందాయని కానీ తానే ఇంకా ఏపార్టీలో చేరాలో నిర్ణయించు కాలేదని, ఈ నెలాఖరులోగా తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.   ఆమె ఇంతవరకు పార్టీని నిర్ణయించుకోకపోయినా తానూ పోటీ చేయబోయే నియోజక వర్గాన్ని మాత్రం తనకు తానే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా పార్టీలను వేట్టుకొనే పనిలో ఉన్నారు. అందువల్ల ఆమెకు రాజమండ్రీ .నుండి పోటీ చేసేందుకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోనే చేరాలనుకొంటున్నారు గనుక అప్పుడు ఆ పార్టీ సిద్దాంతాలు నచ్చినట్లు మనకి చెప్పబోతున్నారు. అంటే టికెట్ కోసమే సిద్ధాంతాలు తప్ప, పార్టీలో చేరడానికి అవేవి అడ్డుకావని ఆమె ముందే తన ‘ప్రజాసేవ లక్షణాలను’ చాటుకొన్నారు.   రాష్ట్రంలో అన్ని పార్టీలకు గాలం వేసి దేనిలో అవకాశం వస్తే అందులో చేరేందుకు సిద్దపడిన ఆమె, రేపు ఏదో ఒక పార్టీలో చేరిన తరువాత మిగిలిన పార్టీలపై విమర్శలు గుప్పించడం కూడా త్వరలోనే మనం చూడబోతున్నాము. చాలా ఏళ్ల తరువాత రాష్ట్రానికి వచ్చిన ఆమె కేవలం టికెట్టే ప్రాతిపాదికన రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం చూస్తే ఆమె రాష్ట్ర రాజకీయాలలో ఏమి ఆశించి అడుగుపెడుతున్నారో అర్ధం అవుతుంది.   ఆమె తన రాంపూర్ నియోజక వర్గం ప్రజల బాగోగులు గాలికొదిలేసి ఇక్కడ తన రాజకీయ జీవితం చక్కబెట్టుకొంటున్న విధంగానే, రేపు ఏ పార్టీ నుండి రాజమండ్రీ పోటీ చేసి ఎన్నికయినా అక్కడి ప్రజలకూ ఆమె మొహం చాటేయాకమానరు. రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టక మునుపే, తనకు ‘రాజమండ్రీ టికెట్ యావ’ తప్ప ఒక నిర్దిష్టమయిన ఆలోచన కానీ, పార్టీల పట్ల ఒక నిశ్చిత అభిప్రాయం గానీ ఏమీ లేవని ఆమె తన మాటల ద్వారా స్పష్టంగానే చెపుతున్నారు.   ఒకవేళ ఆమెకు తెలుగుదేశం పార్టీ కనుక రాజమండ్రీ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే, అప్పుడు ఆమె దృష్టిలో కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చెడ్డవయిపోతాయన్నమాట. అప్పుడు ఆమె జగన్ మోహన్ రెడ్డిని అవినీతి పరుడని విమర్శించవచ్చును, కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పార్టీ అని విమర్శించావచ్చును. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్, తెలుగుదేశం పార్టీలో మురళీ మోహన్ రాజమండ్రీ నుండి పోటీ చేయడం దాదాపు ఖాయం కనుక ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆమెకు మిగిలింది.   తాజా సమాచారం ప్రకారం ఆమె ఆ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆమె దృష్టిలో మంచివాడు అవుతారు గనుక రేపు ప్రజలకి కూడా ఆమె అదే చెప్పి నమ్మమని కోరుతారు. అదే సమయంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలలో లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు ఆమె మొదలుపెట్టవచ్చును. ఈ విధంగా ఒక సిద్దాంతం, తనకంటూ ఒక అభిప్రాయం లేని జయప్రద రాజమండ్రీ టిక్కేటే లక్ష్యంగా తన రాజకీయ జీవితం మొదలు పెట్టబోతున్నారు.   ఇటువంటి రాజకీయ లక్షణాలు కేవలం ఆమెకు ఒక్కరికే ఉన్నాయని కాదు గానీ, చాలా ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న ఆమె కనీసం కొన్ని విలువలు కలిగి ఉండి హుందాతనం ప్రదర్శించి ఉంటే ఈవిధమయిన విమర్శలకు తావు ఉండేది కాదు.   ఇక ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి, ఇటీవలే ఆ పార్టీలో చేరిన శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చాలా కలవార పడుతున్నారు. తన కుమారుడికి రాజమండ్రి లోకసభ టిక్కెట్ ఇచ్చే షరతు మీద ౩౦ ఏళ్లుగా నమ్ముకొన్న తెలుగు దేశం పార్టీని వదిలిపెట్టి కొద్ది వారల క్రితమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఇప్పుడు డిల్లీ నుండి అకస్మాత్తుగా ఊడిపడిన జయప్రద జగన్ మోహన్ రెడ్డిని రాజమండ్రీ టికెట్టు తనకు ఇచ్చేలా ఒప్పించుకొని పార్టీలో చేరినట్లయితే తన పని రెంటికీ చెడ్డ రేవడి అవుతుందని ఆయన కలవర పడుతున్నారు. అందువల్ల అన్ని పార్టీలలో రాజమండ్రి అభ్యర్ధులకు ఆమె పిలవని పేరంటంగా కనబడటంలో ఆశ్చర్యం లేదు.

చట్టం వచ్చినా ఆగని లైంగిక వేధింపు, దాడులు

  మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అత్యాచార నిరోధక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అత్యాచార నితోధక బిల్లుకు ఆమోదముద్ర పొందిన రాత్రే నాగపూర్ లో ఒక ప్రేమ్నోన్మాది స్థానిక కళాశాలలో పనిచేస్తున్న యోగేశ్వర్ డాఖేరే ముమార్తే ఆశ్వినిని గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్న జమొద్దీన్ ఖాన్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.  ఈ విషయం తెలుసుకున్న యోగేశ్వర్ జమొద్దీన్ ఖాన్ ను పిలిచి మందలించాడు. దీంతో పగను పెంచుకున్న జమొద్దీన్ ఖాన్ మంగళవారం రాత్రి యోగేశ్వర్ ఇంట్లోకి ప్రవేశించి అతని తలను నాటుతుపాకీతో కాల్చి, యోగేశ్వర్ భార్యను కత్తితో గాయపరిచాడు. అనంతరం అశ్విని వెంటపడి ఆమెను బలవంతంగా మేడపైకి తీసుకువెళ్ళి అక్కడినుండి తోసేయడానికి ప్రయత్నించాడు. అశ్విని ప్రతిఘటించడంతో అది సాధ్యం కాలేదు. అశ్విని అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జమొద్దీన్ ఖాన్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరొక ఘటనలో ఉత్తరప్రదేశ్ లోని షమ్మీ జిల్లాలో నలుగురు అక్కాచెల్లెళ్ళు కమర్ జహాన్. ఆయేషా, ఇషా, సనమ్ లపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి వారిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. వీరు నలుగురూ ఉపాధ్యాయినులుగా పనిచేస్తున్నారు. వెంటనే వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరగడం నిజంగా యావత్ భారతజాతి  సిగ్గుపడాల్సిన విషయం.

ఆరోగ్యశ్రీ పథకానికి 3 మే ఆఖరు.

  వివిధ రకాల చికిత్సలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం చెల్లిస్తున్న రుసుముకు 30 శాంతం అధికంగా చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని మే 3 నుండి నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సంయుక్తంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రి ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ భాస్కర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదప్రజల వైద్య చికిత్సలకు కార్పోరేట్ ఆసుపాత్రులు సహకరించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి అనుగుణంగా తక్కువ చార్జీలతో మెరుగైన చికిత్సలు చేయడానికి 2007లో అంగీకరించామని, ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 82 శాతం మందికి కార్డులు జారీచేసిందని, అందువల్ల ఎక్కువమందికి తక్కువ రుసుముతో చికిత్సలు అందించడం ప్రైవేటు ఆసుపత్రులకు భారంగా మారిందని, చికిత్సల వ్యయాల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాల్లో వచ్చిన సిఫారసులను అమలు చేయాలని, ఆరోగ్యశ్రీ చికిత్సల మొత్తాలను పంచాలని మూడేళ్ళుగా డిమాండ్ చేసున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న దానిపై అదనంగా 30 శాతం వెంటనే చెల్లించాలని అలాగే ప్రతి సంవత్సరం 10 శాతం పెంచుకుంటూ పోవాలని, వ్యాధి నిర్థారణ పరీక్షలు ప్రభుత్వ, ఇతర ఆసుపత్రులలో చేయించి శాస్త్రచికిత్సకు కార్పోరేట్, ప్రైవేట్ పంపిస్తే ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న రుసుముతో చికిత్సలు చేయడం వీలవుతుందని పేర్కొన్నారు. ఆరేళ్ళుగా విద్యుత్, పరికరాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆరోగ్యశ్రీ మొత్తాలను ప్రభుత్వం వెంటనే పెంచాలని ప్రైవేటు ఆసుపత్రుల సంఘం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కనుక స్పందించకపోతే మే 3వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుపరచబోమని వీరు హెచ్చరిస్తున్నారు.

సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోనున్న భారతీయ కార్మికులు

  గత మూడున్నర దశాబ్దాలుగా లక్షలాది భారతీయులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతూ ఆయ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో అధికంగా రోడ్లు, భవన నిర్మాణ, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక నిపుణులు తదితరులున్నారు. సాంకేతిక నిపుణుల పరిస్థితి కొంచెం మెరుగుగా ఉన్నందున అక్కడికి వెళ్ళిన వారిలో ఎంతో కొంత మిగుల్చుకోగలిగినా, మిగిలిన వారి జీవితాలు మాత్రం కలల ప్రపంచంలో బ్రతుకులేనని చెప్పవచ్చును.   ఒక్క సౌదీ అరేబియా దేశంలోనే దాదాపు 20 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. వారిలో కేరళ నుండి వెళ్ళినవారు దాదాపు 6 లక్షల మంది ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి కనీసం 2-3 లక్షల మంది ముఖ్యంగా తెలంగాణా, ఉత్తరాంధ్రా జిల్లాలయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వెళ్లినవారున్నారు. స్వదేశంలో తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం, గల్ఫ్ దేశాలలో ఎంతో కొంత మిగుల్చుకొనే అవకాశాలు ఉండటం చేత పొట్ట చేత పట్టుకొని వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు.   గల్ఫ్ దేశాలలో పనిచేసే స్థానికులతో లేదా యూరోపు దేశస్థుల జీతాలతో పోలిస్తే కేవలం పదో వంతు లేదా అంత కంటే తక్కువ జీతాలకే ఎక్కువ పని గంటలు పనిచేయడం, కష్టపడి పనిచేసే గుణం, సాంకేతిక పరిజ్ఞానం వగైరా లక్షణాలున్న భారతీయ కార్మికుల సేవలను ఆదేశం ఇంత కాలం పొందింది.   అయితే, ఇస్లామిక్ సూత్రాలను తూచా తప్పకుండా పాటించే సౌదీ అరేబియా దేశంలో బహుభార్యత్వం, కుటుంబ నియంత్రణపై నిషేధం ఉండటంతో క్రమంగా దేశ జనాభా కూడా పెరిగిపోయింది. అయినప్పటికీ, ఆ దేశంలో సహజ సిద్ధంగా లబించిన అపారమయిన ముడి చమురు నిల్వల వలన ఆ దేశ ఆర్ధిక పరిస్థితి బలంగా ఉన్నందున అక్కడ రాజరిక వ్యవస్థ దేశ జనాభాపై బాహ్య ప్రపంచ ఆర్ధిక ఒత్తిళ్ళు పడకుండా ఇంతకాలం బాగనే చూసుకోగలిగింది. కానీ, మతాచారాల వలన అదుపు తప్పి పెరుగుతున్న జనాభా సమస్యను మాత్రం అదిగమించలేకపోవడంతో క్రమంగా నిరుద్యోగం తద్వారా పేదరికం, సామాజిక అశాంతి మొదలవుతోంది. పెరుగుతున్న జనాభాను అరికట్టడం అక్కడ సాద్యం కాదు గనుక, ఇక స్థానికులకు ఉద్యోగంలో ప్రాదాన్యం ఈయడమే మిగిలి ఉన్న ఏకైక మార్గం.   ఆ ప్రయత్నంలో సౌదీ ప్రభుత్వం అన్ని సంస్థలలో స్థానికులకు 10 శాతం రిజర్వేషన్ అనే నిటకత్ పాలసీని కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అక్కడ ప్రభుత్వం ఒకసారి శాసనం చేస్తే అది శిలాశాసనమేనని చెప్పవచ్చును. దానికి ఎదురు చెప్పే అవకాశం కానీ, కోర్టుల్లో అప్పీలు చేసుకొనే వీలు కానీ, దిక్కరించే దైర్యం గానీ ఎవరికీ ఉండదు. ఇప్పుడు దాని ప్రభావం మొట్ట మొదటగా భారతీయ కార్మికులపైనే పడుతుంది. తద్వారా వేలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దారి పట్టక తప్పదు.   నియమనిబందనలను అమలు పరచడంలో సౌదీ ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా ఉంటుందో బాగా ఎరిగిన కేరళ ప్రభుత్వం ఇప్పటికే తిరువనంతపురం, కొచ్చిన్, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌదీలో ఉద్యోగాలు కోల్పోనున్న వారికి సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసింది. ఈ విషయంలో మేల్కొనడానికి మన రాష్ట్రానికి మరి కొంచెం సమయం పట్టవచ్చును.

కేసిఆర్ కు తలసాని సవాల్

      విద్యుత్ ఛార్జీల పై టిడిపి నాయకులు దొంగ దీక్ష చేస్తున్నారనే కేసిఆర్ వ్యాఖ్యలపై టిడిపి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేసిఆర్ కు దమ్ముంటే సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి పోటి చేసి గెలవాలని, ఓడిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజలు వివిధ రకాల సమస్యలతో విలవిలలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతలు, ఛార్జీలు పెంపును నిరసిస్తూ ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు.

విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందే: చిరంజీవి

        విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందేనని, చార్జీల పెంపు నిర్ణయం సరైంది కాదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. చార్జీల పెంపు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు సీఎం కిరణ్ మంత్రివర్గంతో చర్చించాలని, ఏక పక్ష నిర్ణయాలవల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. పేద ప్రజలపై చార్జీల భారం పడకుండా చూడాలని ఆయన కోరారు. విద్యుత్ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చిరంజీవి మండిపడ్డారు.   దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందన్న వార్తలో నిజం లేదని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో 2.1 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యాటకుల రక్షణపై కేంద్ర మంత్రి, సీఎంలతో మాట్లాడామని, విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పిస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో హోటళ్ల అనుమతులకు వెబ్‌సైట్‌ను చిరంజీవి ప్రారంభించారు.

టీఆర్ఎస్ తో కేవీపీ దోస్తీ!

    రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పారాడుతున్న తాను గెలువకూడదనే కొందరు తెలంగాణ నేతలు ఆంధ్ర నేతలతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. తన ప్రత్యర్థి ఎవరైనా భయపడేది లేదన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వెనక్కితగ్గేది లేదని ఆయన పేర్కొన్నారు. ఏడాది ముందే అస్త్ర సన్యాసం చేసి ఎన్నికల కలలు కంటే తెలంగాణ రాదని మధుయాష్కి తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని మధుయాష్కి స్పష్టం చేశారు.

విజయవాడ సీటుకోసం పంతం పట్టిన గద్దె రామ్మోహన్

  సాధారణ ఎన్నికలకి ఇంకా ఒక ఏడాది సమయం మిగిలిఉండగానే రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లు కనబడుతోంది. ఏ పార్టీని చూసిన టికెట్ల వ్యవహారం గురించి చర్చలు, అసంతృప్త రాగాలు తీస్తున్న నేతలే కనిపిస్తునారు. ఈ వ్యవహారాలతో రాజకీయ పార్టీలకి ఇప్పటి నుండే అగ్నిపరీక్ష మొదలయినట్లు ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టువంటి, కృష్ణా జిల్లా ప్రత్యేకించి విజయవాడ ఎన్నికల రాజకీయాలు అప్పుడే మంచి రసకందాయంలో పడ్డాయి.   ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయవాడ పార్లమెంటు సీటును కేశినేని నానికి దాదాపు ఖరారు చేయడంతో అక్కడి నుంచే పోటీ చేయాలనుకొన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు గద్దె రామ్మోహన్ తీవ్ర నిరాశ చెందారు. నిన్న చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడిన ఆయన విజయవాడ పార్లమెంట్ సీటు ఇవ్వకపోతే మరిక తానూ సామాన్య కార్యకర్తగా మాత్రమే పనిచేస్తాను తప్ప వేరే చోటనుండి శాసనసభకు పోటీ చేయబోనని ఖరాఖండిగా చెప్పడంతో బాబు ఖంగు తిన్నారు. కావాలనుకొంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాభిప్రాయసేకరణ కూడా జరిపి అందులో 90 శాతం తనకు అనుకూలంగా వస్తే సీటు ఇవ్వచ్చునని ఆలా కాదంటే వేరేవరికిచ్చినా తానేమి అభ్యంతరం చెప్పబోనని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఆ సీటును కేశినేని నానికి కేటాయించడంతో చంద్రబాబు గద్దెకు వెంటనే హామీ ఏమీ ఈయకపోయినా త్వరలోనే దీనికి సరయిన పరిష్కారం చెప్తానని అంతవరకు ప్రశాంతంగా ఉండమని నచ్చజెప్పి తిప్పి పంపేసారు.   2004, 2009 ఎన్నికల్లో కంకిపాడు, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుసార్లు పరాజయం పాలయిన గద్దె రామ్మోహన్, ఈ సారి ఎన్నికలలో ఎలాగయినా విజయం సాదించాలని అనుకొంటున్న సమయంలో హటాత్తుగా కేశినేని నాని వచ్చి తన సీటుకి ఎసరు పెట్టడం గద్దె రామ్మోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా గత ఎన్నికలలో ఓటమి పాలయిన తరువాత నుండి విజయవాడ 'తూర్పు' ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఆయన ఆ నియోజక వర్గం తనకే కేటాయిస్తారనే పూర్తి నమ్మకంతో ఉండటం వలన ఆయన బాబు నిర్ణయంతో మరింత నిరాశకు గురయ్యారు.   గద్దె గతంలో గన్నవరం నియోజక వర్గం నుండి శాసన సభకు పోటీ చేయాలను కొన్నపుడు ఆయనకు పార్టీ టికెట్ కేటాయించలేకపోవడంతో ఆయన పార్టీని కూడా వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన తరువాత ఆయన మళ్ళీ పార్టీలోకి తిరిగిరావడం జరిగింది. 2009 ఎన్నికలలో సినిమా నిర్మాత అశ్వనీదత్‌కు సీటు ఇవ్వాల్సిరావడంతో 2004 ఎన్నికలలో ఆయనకు పార్లమెంటుకు పోటీ చేసేందుకు టికెట్ దొరకలేదు. కానీ, దానికి ప్రతిగా కంకిపాడు అసెంబ్లీ సీటు కేటాయించినప్పటికీ ఆయన దేవినేని చేతిలో ఓడిపోయారు.   నాటి నుండి ఆయనకు రాజకీయంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, రాబోయే ఎన్నికలలో విజయవాడ నుండి పార్లమెంటు సీటుకి పోటీ చేసి గెలిస్తే అంతా సరవుతుందని ఇంతకాలం భావిస్తున్న ఆయనకీ ఊహించని విధంగా కేశినేని రాకతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపద్యంలో ఇప్పుడు ఆయనకు విజయవాడ టికెట్ ఈయకపోతే మళ్ళీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు.   ఇక గన్నవరం సీటు విషయంలో కూడా వల్లభనేని వంశీ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. విజయవాడ అర్బన్ అధ్యక్షుడి పదవి నుండి చాలా అవమానకర రీతిలో తనను తప్పించినందుకు ఆగ్రహంతో ఉన్న వంశీ గన్నవరం నుండి తనకు టికెట్ ఈయకోతే పార్టీని వీడి ఇంట్లో కూర్చొంటానని ముందే హెచ్చరించారు. ఇప్పుడు విజయవాడ లోక్ సభ స్థానానికి గద్దె రామ్మోహన్ మరియు కేశినేని నాని, గన్నవరం శాసన సభ స్థానానికి వల్లభనేని వంశీ మరియు డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావుల టికెట్ కేటాయింపుల విషయంలో చంద్రబాబు అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు. అయితే ఇటువంటి అగ్నిపరీక్షలకి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని ఆయనకు బాగా తెలుసు.

ఏ పార్టీలోకి 'జయప్రద'

        ఎంపీ జయప్రద తిరుమల శ్ర్రేవారిని దర్శించుకున్నారు.ఉదయం విఐపి ప్రారంభ సమయంలో శ్ర్రేవారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు.   మరోవైపు జయప్రద రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 30 వ తేదీన తాను ఏ పార్టీలో చేరతాను అనే విషయం గురించి ప్రకటిస్తానని జయప్రద అన్నారు. గత కొన్ని రోజులుగా జయప్రద గురించి అనేక వార్తలు వచ్చాయి. ఆమె కాంగ్రెస్ లో చేరుతుందని లేదా వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతుందని లేకుండా పాత గూడు తెలుగుదేశంలో చేరుతుందని అన్నారు. కొన్ని రోజుల పాటు ఆమె బీజేపీలో కూడా చేరవచ్చు అనే ఊహాగానాలు వినిపించాయి! వీటన్నంటి నేపథ్యంలో జయప్రద ఏ పార్టీలో చేరుతుంది అనేది తెలుకోవాలంటే 30 వ తేదీ వరకు ఆగాల్సిందే.

రాజకీయాలలోకి మేకలు, పులులు, నక్కలు

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జైల్లో ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి గురించి వర్ణిస్తూ ఆయన జైలులో ఉన్నపటికీ పులి వంటివాడని, పులి బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే అని వర్ణించారు. ఆ తరువాత చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనను నక్కతో పోల్చి పులి పులే నక్క నక్కే అని అన్నారు. తమ తండ్రిగారి పధకాలన్నిటినీ వేరే పేర్లతో తన స్వంత పధకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని విమర్శిస్తూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకొనట్లుంది అని ఆమె అన్నారు.   ఆమె మొదలుపెట్టిన ఈ పులి-నక్కా ఆటలో ఇంకా తెదేపా నాయకులెవరూ ప్రవేశించకపోయినప్పటికీ, తెదేపా కార్యకర్తలు ఆమెకు దీటుగా బదులిస్తూ సమాజంలో మేకవన్నె పులులు కూడా తిరుగుతున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండబోతే అవి తినేస్తాయని అన్నారు.   మరి వీరిద్దరూ పులీ నక్కా అయితే మరి తెరాస అధ్యక్షుడు కేసీఆర్, పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ నారాయణ, సీపీయం రాఘవులు తదితరులు ఏ జాతులను కేటాయించాలి? అనే ధర్మ సందేహం ఒకటి మిగిలిపోయింది. ఇంతకీ ఎవరు పులో ఎవరు నక్కో తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు ఆగవలసిందే. అప్పుడు ప్రజలే ఎవరేమిటనేది నిర్ణయిస్తారు.

కింగ్ ఫిషర్ కు బాంబే కోర్టులో చుక్కెదురు

  కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తీసుకున్న రుణాలకు భద్రతగా తనఖా పెట్టిన యునైటెడ్ స్పిరిట్స్ షేర్లను బ్యాంకులు విక్రయించకుండా ఆదేశాలివ్వాలన్న కింగ్ ఫిషర్ సంస్థ విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. బ్యాంకులు, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ వాదనలు విన్న అనంతరం జస్టీస్ ఎస్.జె.కత్వాలా షేర్లను విక్రయించడానికి అనుమతిచ్చారు. వాదనల్లో భాగంగా ఇప్పటికే షేర్ల విక్రయ ప్రక్రియ మొదలైనట్టు బ్యాంకులు కోర్టుకు విన్నవించాయి. తీసుకున్న అప్పు చెల్లించడంలో విఫలమైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ తనఖా షేర్లను అమ్మడాయినికి నిర్ణయించినట్లు, ఇది ఒప్పందంలో భాగంగానే జరిగినట్లు బ్యాంకులు వెల్లడించాయి. కన్సార్టియంలో భాగం కాని బ్యాంకులు సైతం షేర్ల విక్రయాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించాయి.

మళ్ళీ విద్యార్ధుల మద్దతు కోరుతున్న తెరాస

  తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయికి చేరడంలో విద్యార్ధుల పాత్ర ఎంతయినా ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. వారి పోరాటాలు, బలిదానాల వలననే ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చి కేంద్రంపై విపరీతమయిన ఒత్తిడి పెరిగేందుకు దోహదపడింది.   అయితే ఉద్యమాన్ని నడుపుతున్న నాయకులలో చిత్త శుద్ధి లోపించడం, వారి రాజకీయ చదరంగాలు చూస్తున్న విద్యార్ధులు క్రమంగా ఉద్యమాల పట్ల విరక్తి చూపడం మొదలుపెట్టారు. ఉద్యమాన్ని నడుపుతున్న నేతలందరూ తమ తమ పదవులకు అంటిపెట్టుకొని పూర్తి ప్రయోజనాలు పొందుతుంటే, తాము మాత్రం తమ చదువులు, భవిష్యత్తూ చివరికి జీవితాలను కూడా పణంగా పెట్టి చేస్తున్న పోరాటాలు ఉద్యమ నేతల కారణంగానే తరచూ విఫలమయిపోవడం చూసిన విద్యార్ధులు తెరాస మరియు తెలంగాణ జేఏసీల పిలుపులకు స్పందించడం మానేశారు.   ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాలకు నిలయమయిన ఉస్మానియా, కాకతీయ తదితర విశ్వవిద్యాలయాలలో వివిధ పార్టీలకు అనుబంధంగా ఏర్పడిన విద్యార్ధి జేఏసీలు తలోదారి పట్టడంతో రాన్రాను విద్యార్ధులలో ఉద్యమం పట్ల నమ్మకం సడలసాగింది.   దానికి తోడూ ఉద్యమాన్ని నడిపిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణలు, తెలంగాణా జేఎసీలో పదవుల కోసం జరిగిన కుమ్ములాటలు, తెలంగాణా ఉద్యమాలనే తమ రాజకీయ సోపానాలుగా చేసుకొని పైకెదుగుతున్నచోటామోటా నేతలను చూస్తున్న తెలంగాణా విద్యార్దులు తమ త్యాగాల వృదా అవుతున్న తీరు చూసి ఉద్యమాలపట్ల నిరాసక్తి కనబరుస్తున్నారు.   ఇక, తన ఉద్యమ లక్ష్యాన్నిపక్కన పెట్టి ఎన్నికల బాట పట్టిన తెరాస కూడా ఈ పరిణామంతో చాలా కంగారుపడింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ తరువాత సాధారణ ఎన్నికలలో తన సత్తా చాటుకొని వీలయినన్ని సీట్లు గెలచుకొని తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకొంటున్న తెరాస ఈ తరుణంలో కీలకమయిన విద్యార్దుల మద్దతు కోల్పోవడం అసలుకే మోసం అవుతుందని గ్రహించిన వెంటనే, వారిని బుజ్జగించి తిరిగి తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.   ఆ ప్రయత్నంలోనే నిన్న వరంగల్ జిల్లా హన్మకొండలోరాంనగర్ లో గల టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో టీఆర్‌ఎస్వీ జిల్లా స్థాయి సదస్సు జరిగింది. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ విద్యార్ధి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచం లో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ కోసం ఆ త్మ బలిదానాలు జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం చాల విచారకరం అని అన్నారు. అందువల్ల విద్యార్దులందరూ సైనికుల్లా పనిచేసి ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు వ్యాపింపజేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతీ నియోజకవర్గం నుంచి పది మంది చొప్పున సుశిక్షతులైన విద్యార్థి సైనికులను సిద్ధం చేస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో తెరాసకు సంపూర్ణ మద్దతు ఇవ్వలని కోరారు. తద్వారా తెరాస కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేయగలదని ఆయన అన్నారు.   కేంద్రంపై తెలంగాణకు వ్యతిరేఖంగా ప్రభావం చూపుతున్న సీమాంధ్ర పార్టీలను దెబ్బకొట్టాలంటే రానున్న ఎన్నికలలో తెరాస 100 మంది ఎమ్మెల్యేలను, 17 మంది ఎంపీలను గెలిపించుకోవాలసి ఉంటుంది గనుక, విద్యార్దులు పూర్తీ మద్దతు ఇవ్వలని ఆయన కోరారు. ఇప్పుడు తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థులు వచ్చే ఎన్నికలలో కూడా తెరాసకు అనుకూలంగా కీలక పాత్ర పోషించవలసిందిగా టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు త క్కళ్లపల్లి రవీందర్‌రావు కోరారు.

బిజెపి దీక్ష కూడా భగ్నం చేసిన పోలీసులు

విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరాహార దీక్షలు ప్రతిపక్ష పార్టీల దీక్షలు భగ్నం చేస్తూ వచ్చారు పోలీసులు. తాజాగా నాలుగు రోజులుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్షలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సోమవారం సాయంత్రం పోలీసులు దీక్షను భగ్నం చేసి వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా దీక్షలు చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, యెండల లక్ష్మీనారాయణల శరీరంలో చక్కరస్థాయిలో హెచ్చుతగ్గులు ఉండడంతో వారు తీవ్రంగా నీరసిన్చారని వైద్యులు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా నేతల ఆరోగ్యం గురించి మధ్యమండలం డిసిపి కమలాసన్ రెడ్డి, అదనపు డిసిపి రామచంద్రన్ శాసనసభ స్పీకర్ కు వివరించి, స్పీకర్ అనుమతి తీసుకున్నాకే బిజెపి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలను అడ్డుకుంటున్న కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు సమన్లు

  పెరిగిన విద్యుత్తు ఛార్జీలని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ అఫ్జల్, జస్టీస్ పి.పుర్కర్, జస్టీస్ ఎన్.వీ.రమణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. విద్యుత్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి దగ్గర ప్రజలు తమ అభిప్రాయాల్ని చెప్పినా మండలి పట్టించుకోలేదని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభ్యుత్వం దగ్గర రాయితీలు పొంది ప్రక్క రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముకుంటున్న జీఎంఆర్, ల్యాంకో సంస్థలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గృహ వినియోగదారులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని, వారిలో అత్యధికంగా పెదవారున్నారని పిటీషనర్ విన్నవించారు. విద్యుత్తు ఛార్జీలు ఏ ప్రాతిపదికన పెంచారో ఆ దస్త్రాల్ని కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.