విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు సమన్లు
posted on Apr 3, 2013 7:57AM
పెరిగిన విద్యుత్తు ఛార్జీలని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ అఫ్జల్, జస్టీస్ పి.పుర్కర్, జస్టీస్ ఎన్.వీ.రమణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. విద్యుత్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి దగ్గర ప్రజలు తమ అభిప్రాయాల్ని చెప్పినా మండలి పట్టించుకోలేదని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభ్యుత్వం దగ్గర రాయితీలు పొంది ప్రక్క రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముకుంటున్న జీఎంఆర్, ల్యాంకో సంస్థలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గృహ వినియోగదారులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని, వారిలో అత్యధికంగా పెదవారున్నారని పిటీషనర్ విన్నవించారు. విద్యుత్తు ఛార్జీలు ఏ ప్రాతిపదికన పెంచారో ఆ దస్త్రాల్ని కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.