నేను దేవుడ్ని కాను: సచిన్ టెండుల్కర్
posted on Apr 4, 2013 @ 11:01AM
క్రికెట్ అభిమానులు క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “నా అభిమానులు భావిస్తున్నట్లు నేనేమి క్రికెట్ దేవుడ్ని కాను. నేను కూడా ఒక సామాన్య మానవుడినే. ఎందుకంటే దేవుడు ఎన్నడూ తప్పులు చేయదు కానీ, నేను మాత్రం చాలా తప్పులే చేశాను. అందరూ నేను100వ సెంచరీ పూర్తి చేసినందుకు అభినందిస్తుంటే నేను మాత్రం 100వ సెంచరీ చేయడానికి నాకెందుకు ఇంత ఆలస్యంగా జరిగింది అంటూ ఆ దేవుడ్ని ప్రశ్నిస్తున్నాను. నా అభిమానులకు నేను ఆరాద్యుడిని కావచ్చునేమో కానీ, నాకు మాత్రం వివిన్ రిచర్డ్స్ మరియు సునీల్ గవాస్కర్ లే ఆరాద్యులు. నా ఆటకు స్పూర్తి నిచ్చిన వారు వారిరువురే.” అని తెలిపారు.
ఆయన వరుస వైఫల్యాలను చూసి అనేక మంది గత కొంత కాలంగా క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని ఒత్తిళ్ళు చేయడంతో అయిష్టంగానే అంతర్జాతీయ వన్ డే మ్యాచుల నుండి తప్పుకొన్న సచిన్ టెండుల్కర్, టెస్ట్ మ్యచ్చులో కూడా అంతగా రాణించక పోవడంతో ఆయనకు వ్యతిరేఖంగా ఇంకా నిరసనలు వెలువడుతూనే ఉన్నాయి. బహుశః అనుడుకు జవాబుగా ఆయన ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చును.
ఆయన క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఆయనకీ ఎవరూ చెప్పనవసరం లేదని, ఆ విషయం అందరికంటే ఆయనకే బాగా తెలుసునని, అందువల్ల ఆయన ఎప్పుడు రిటైర్ అవ్వలనేది ఇష్టమని రాజీవ్ శుక్లా అన్నారు.