బిజెపి దీక్ష కూడా భగ్నం చేసిన పోలీసులు
posted on Apr 3, 2013 8:51AM
విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరాహార దీక్షలు ప్రతిపక్ష పార్టీల దీక్షలు భగ్నం చేస్తూ వచ్చారు పోలీసులు. తాజాగా నాలుగు రోజులుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్షలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సోమవారం సాయంత్రం పోలీసులు దీక్షను భగ్నం చేసి వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా దీక్షలు చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, యెండల లక్ష్మీనారాయణల శరీరంలో చక్కరస్థాయిలో హెచ్చుతగ్గులు ఉండడంతో వారు తీవ్రంగా నీరసిన్చారని వైద్యులు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా నేతల ఆరోగ్యం గురించి మధ్యమండలం డిసిపి కమలాసన్ రెడ్డి, అదనపు డిసిపి రామచంద్రన్ శాసనసభ స్పీకర్ కు వివరించి, స్పీకర్ అనుమతి తీసుకున్నాకే బిజెపి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలను అడ్డుకుంటున్న కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.