ఆరోగ్యశ్రీ పథకానికి 3 మే ఆఖరు.
posted on Apr 4, 2013 7:28AM
వివిధ రకాల చికిత్సలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం చెల్లిస్తున్న రుసుముకు 30 శాంతం అధికంగా చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని మే 3 నుండి నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సంయుక్తంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రి ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ భాస్కర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదప్రజల వైద్య చికిత్సలకు కార్పోరేట్ ఆసుపాత్రులు సహకరించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి అనుగుణంగా తక్కువ చార్జీలతో మెరుగైన చికిత్సలు చేయడానికి 2007లో అంగీకరించామని, ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 82 శాతం మందికి కార్డులు జారీచేసిందని, అందువల్ల ఎక్కువమందికి తక్కువ రుసుముతో చికిత్సలు అందించడం ప్రైవేటు ఆసుపత్రులకు భారంగా మారిందని, చికిత్సల వ్యయాల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాల్లో వచ్చిన సిఫారసులను అమలు చేయాలని, ఆరోగ్యశ్రీ చికిత్సల మొత్తాలను పంచాలని మూడేళ్ళుగా డిమాండ్ చేసున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న దానిపై అదనంగా 30 శాతం వెంటనే చెల్లించాలని అలాగే ప్రతి సంవత్సరం 10 శాతం పెంచుకుంటూ పోవాలని, వ్యాధి నిర్థారణ పరీక్షలు ప్రభుత్వ, ఇతర ఆసుపత్రులలో చేయించి శాస్త్రచికిత్సకు కార్పోరేట్, ప్రైవేట్ పంపిస్తే ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న రుసుముతో చికిత్సలు చేయడం వీలవుతుందని పేర్కొన్నారు. ఆరేళ్ళుగా విద్యుత్, పరికరాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆరోగ్యశ్రీ మొత్తాలను ప్రభుత్వం వెంటనే పెంచాలని ప్రైవేటు ఆసుపత్రుల సంఘం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కనుక స్పందించకపోతే మే 3వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుపరచబోమని వీరు హెచ్చరిస్తున్నారు.