చట్టం వచ్చినా ఆగని లైంగిక వేధింపు, దాడులు
posted on Apr 4, 2013 7:55AM
మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అత్యాచార నిరోధక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అత్యాచార నితోధక బిల్లుకు ఆమోదముద్ర పొందిన రాత్రే నాగపూర్ లో ఒక ప్రేమ్నోన్మాది స్థానిక కళాశాలలో పనిచేస్తున్న యోగేశ్వర్ డాఖేరే ముమార్తే ఆశ్వినిని గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్న జమొద్దీన్ ఖాన్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యోగేశ్వర్ జమొద్దీన్ ఖాన్ ను పిలిచి మందలించాడు. దీంతో పగను పెంచుకున్న జమొద్దీన్ ఖాన్ మంగళవారం రాత్రి యోగేశ్వర్ ఇంట్లోకి ప్రవేశించి అతని తలను నాటుతుపాకీతో కాల్చి, యోగేశ్వర్ భార్యను కత్తితో గాయపరిచాడు. అనంతరం అశ్విని వెంటపడి ఆమెను బలవంతంగా మేడపైకి తీసుకువెళ్ళి అక్కడినుండి తోసేయడానికి ప్రయత్నించాడు. అశ్విని ప్రతిఘటించడంతో అది సాధ్యం కాలేదు. అశ్విని అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జమొద్దీన్ ఖాన్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరొక ఘటనలో ఉత్తరప్రదేశ్ లోని షమ్మీ జిల్లాలో నలుగురు అక్కాచెల్లెళ్ళు కమర్ జహాన్. ఆయేషా, ఇషా, సనమ్ లపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి వారిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. వీరు నలుగురూ ఉపాధ్యాయినులుగా పనిచేస్తున్నారు. వెంటనే వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరగడం నిజంగా యావత్ భారతజాతి సిగ్గుపడాల్సిన విషయం.