ఏ పార్టీలోకి 'జయప్రద'
posted on Apr 3, 2013 @ 12:33PM
ఎంపీ జయప్రద తిరుమల శ్ర్రేవారిని దర్శించుకున్నారు.ఉదయం విఐపి ప్రారంభ సమయంలో శ్ర్రేవారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు.
మరోవైపు జయప్రద రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 30 వ తేదీన తాను ఏ పార్టీలో చేరతాను అనే విషయం గురించి ప్రకటిస్తానని జయప్రద అన్నారు. గత కొన్ని రోజులుగా జయప్రద గురించి అనేక వార్తలు వచ్చాయి. ఆమె కాంగ్రెస్ లో చేరుతుందని లేదా వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతుందని లేకుండా పాత గూడు తెలుగుదేశంలో చేరుతుందని అన్నారు. కొన్ని రోజుల పాటు ఆమె బీజేపీలో కూడా చేరవచ్చు అనే ఊహాగానాలు వినిపించాయి! వీటన్నంటి నేపథ్యంలో జయప్రద ఏ పార్టీలో చేరుతుంది అనేది తెలుకోవాలంటే 30 వ తేదీ వరకు ఆగాల్సిందే.